Master E.K. Spiritual and Service Mission @masterekmission2023 Channel on Telegram

Master E.K. Spiritual and Service Mission

@masterekmission2023


మాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ-https://masterek.org/

Master E.K. Spiritual and Service Mission (Telugu)

మాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవా మిషన్ చానల్ తెలుగు భాష లో ఉంది. ఈ చానల్ నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు సేవా కార్యాలను అందించడంలో ఆనందిస్తున్న లక్షులు సమూహం. చానల్లో మాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ గురువులు, ఉపన్యాసాలు, మరియు సేవా కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. మాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ గురువులు స్పష్టవాదులు, చేతనీకారణులు మరియు ప్రేమేక్కొన్న మార్గాల్లో వివరిస్తారు. తెలుగు భాషలో ఈ చానల్ను ప్రసారం చేయడంలో ఆనందించుకుంది. మాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ వాటి సేవాల మూలక మానవులకు శాంతి, సమరసం, ఆనందం అందిస్తుంది. చానల్లోని వివిధ వ్యాఖ్యానాలు, అందరును గమనించే ప్రశ్నలకు వివరాలు మరియు సూచనలు లభించొచ్చు. జాగ్రత్తగా ఉన్న వ్యక్తిగా మాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవా మిషన్ చానల్లో భాగం తీసుకుంటుంది, అవసరమైన జ్ఞానాన్ని, అందులో కలిగిన అనుభవాలను నిజంగా ప్రసారం చేయడం ద్వారా తమ ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచాలని అనిస్తుంది. తెలుగు భాషలో ఆధ్యాత్మిక సేవా మరియు సేవా కార్యక్రమాల కొరకు ఆసక్తి గల వారికొక సన్మాన్యస్వరూపం ఈ చానల్ అనుసరించుకుంది.

Master E.K. Spiritual and Service Mission

12 Feb, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 If you begin to live happily and with ease it is called spiritualism.🌼

Master E.K. Spiritual and Service Mission

12 Feb, 05:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 సాధకుడు ఏ పరిస్థితికి దిగులుపడి మతి పోగొట్టు కొనరాదు.🌼

Master E.K. Spiritual and Service Mission

12 Feb, 00:58


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

12 Feb, 00:49


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

11 Feb, 23:59


🌷 *February 12,Today's Meditation*🌷
A to Z read scripture written. It is written in the cave temples of your body. Z to A you read in the picture writing of the future. The wheel is reversed.

🌷 *ఫిబ్రవరి 12, నేటి ధ్యానము*🌷
🌻 'A' నుండి 'Z' దాక మేషంబు మొదలుగా శూన్యంబు చేరువరకు
శిరంబు నుండి మూల పర్యంతంబు
రచితమైన వేద గ్రంథంబు చదువుడి,
నీ దేహమే దేవాలయమ్ము
దేహాంతర గుహలందున
దర్శితమైనదీ వేదము
'Z నుండి A' దాక శూన్యాదిగ మేషపర్యంతంబు
మూలంబు మొదలుగ శిరంబు వరకు
ముచ్చటగ మూడవకాలంబు చిత్రితంబయ్యె
మరలి చక్రంబు వ్యుత్ర్కమంబయ్యె....... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

11 Feb, 15:00


Created and shared using Adobe Scan.

Master E.K. Spiritual and Service Mission

11 Feb, 14:59


Created and shared using Adobe Scan.

Master E.K. Spiritual and Service Mission

11 Feb, 14:17


🎍 *Messages of Master E.K.*🎍

🥀 *PHYSICAL EXERCISE* 🥀

🌹 3.Select your own items of physical exercise according to your constitution with the help of an expert. Maintain consistency and regularity. Let your physical exercise be a part of your spiritual routine.

4.If you find perspiration, lightness of body and vigorous functioning of the heart and lungs, it indicates that your physical exercise is done on correct lines.

5.If you feel exertion or exhaustion, emaciation, thirst or bleeding from different orifices, cough, fever or fatigued respiration or vomitting sensation, then understand that your physical exercise is running on dangerous lines........... *Master E.K.* 🌹

(From the book *Ayurveda*)

(To be Continued)

Master E.K. Spiritual and Service Mission

11 Feb, 14:16


🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼

🥀 *భౌతిక వ్యాయామము*🥀

🌻 3.నిష్ణాతులైనవారి సహాయముతో నీ శరీరతత్త్వానికి సరిపడే వ్యాయామములను నిర్ణయించుకొని నిత్యము అభ్యాసము చేయవలెను. నిత్యము క్రమము తప్పకుండా వాటిని అనుష్ఠించవలెను. నీ భౌతిక వ్యాయామము కూడా నీ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగము కావలెను.

4.చెమట పట్టుట, శరీరము తేలికగా ఉండుట, గుండె, ఊపిరితిత్తులు దృఢముగా పని చేయుట మొదలగు లక్షణములు కనపడినచో నీవు చేయుచున్న వ్యాయామము సరియైన పద్ధతిలో సాగుచున్నదని అర్థము.

5.అలసట, నిస్త్రాణ, చిక్కిపోవుట, దాహము, దేహమునందలి నవద్వారములలో ఎచట నుండి అయినను రక్తస్రావము కలుగుట, దగ్గు, జ్వరము, శ్వాస కష్టముగా తీసికొనుట, వికారము మొదలగు లక్షణములు కనుపించినచో నీ వ్యాయమము ప్రమాదకరమైన రీతిలో సాగుచున్నదని తెలిసికొనుము. ....... *మాస్టర్ ఇ.కె.* 🌻

( *ఆయుర్వేదము* అను గ్రంథము నుండి)

(To be Continued)

Master E.K. Spiritual and Service Mission

11 Feb, 13:31


🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌷 *స్వప్నము* 🌷

🌹ఇంకనూ ఆర్తితో తనను చేరిన బ్రహ్మ కోరికను తీర్చి, అతని మోహము నివారించుటకు కావలసిన అమృతమయమయిన వాక్యములతో ఇట్లు పలికెను… నీవు చేయవలసిన పని విడిచి దుఃఖపడనేల? నా లీలకు ప్రధానగుణము ఈ సృష్టి, దాని‌ని అభ్యాసము చేయు సంకల్పము హృదయమున నిలిపి సమాధిస్థితి పొందుము. భక్తి భావములతో నన్ను ప్రసన్నుని చేసికొనుము. నీ కోరిక సిద్ధించును.

(నీ భక్తులు అనగా వివిధ భక్తి భావములని ఒక అర్థము. నీవు సృష్టింపబోవు మొదటి సృష్టిని భక్తులుగా సంకల్పింపుమని మరియొక భావము. ఆ భక్తులలోగల నన్ను స్వీకరింపుమని మరియొక భావము.)......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-316,317.

Master E.K. Spiritual and Service Mission

11 Feb, 13:28


https://youtube.com/shorts/lwQtHkYcnNo?si=f4cJNFTlyP3o90sK

Master E.K. Spiritual and Service Mission

11 Feb, 10:31


శ్రీశైలం గంటా మఠంలో మాస్టర్ గారు

Master E.K. Spiritual and Service Mission

11 Feb, 06:30


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 You should be able to recognise truth and the usefulness of everyone in this world.🌼

Master E.K. Spiritual and Service Mission

11 Feb, 06:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 పుణ్యము కొరకు సత్కర్మల నాచరించు వానికి పాపమంటి తీరును.🌼

Master E.K. Spiritual and Service Mission

10 Feb, 15:54


శ్రీశైలంలో‌ పూర్ణానంద స్వామి ఆశ్రమంలో మాస్టర్ గారు

Master E.K. Spiritual and Service Mission

10 Feb, 15:35


🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼

🥀 *భౌతిక వ్యాయామము*🥀

🌻1. భౌతిక శరీరముతో చేసే కదలిక వలన ప్రాణప్రసారము సమానముగా అంతటా జరుగునట్లు చేయబడును. భౌతిక శరీరము యొక్క కదలికలను ఒక పద్ధతి ప్రకారము అభ్యసించినచో శరీరమునకు నిశ్చలత, బలవృద్ధి కలుగును. అప్పుడది వ్యాయామము అనబడును. శారీరక పరిశ్రమకు, అలసటకు భేదమును తెలిసికొనుట నేర్చుకొనవలెను.

2.శరీరము తేలికగా ఉండుట, పని చేయుటకు సామర్థ్యము, అసౌకర్యములను సహింపగలుగుట, హానికరములైన పదార్థములను బయటకు విసర్జించుట, ధాతువుల స్థిరత్వము అనునవి సరియై‌న వ్యాయామముల వలన జీర్ణకోశము, శ్వాసకోశము మరియు హృదయకోశము దృఢత్వమును పొందును........ *మాస్టర్ ఇ.కె.* 🌻

( *ఆయుర్వేదము* అను గ్రంథము నుండి)

(To be Continued)

Master E.K. Spiritual and Service Mission

10 Feb, 15:34


🎍 *Messages of Master E.K.*🎍

🥀 *PHYSICAL EXERCISE* 🥀

🌹 1. Physical movements make the circulation of the etheric currents directed and evenly distributed. When these physical movements are made in a systematic way they contribute to increase the stability and strength of the body. Then it is called physical exercise. Learn to distinguish between exertion and exercise.

2.Lightness of body, ability to work. resistance to discomfort, elimintion of the toxic substances and stabilizing the tissues are the real indicators of proper physical exercise. The digestive, respiratory and cardiac features are made stronger after prolonged years of exercise............ *Master E.K.* 🌹

(From the book *Ayurveda*)

(To be Continued)

Master E.K. Spiritual and Service Mission

10 Feb, 15:34


https://youtube.com/shorts/qSj06cILC9Q?si=CdM8k_c2XPk_EUj1

Master E.K. Spiritual and Service Mission

10 Feb, 13:57


🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌷 *స్వప్నము* 🌷

🌹ఇట్టి భక్తిభావమున బ్రహ్మ బ్రహ్మానందము పొందెనని, మైత్రేయుడు విదురునకు సవివరముగా వివరించెను. వివరించి మరియు ఇట్లనెను:

చతుర్ముఖుడు తపస్సున మునిగి ఉండి ఇట్లు స్తుతింపగా, విష్ణువు ప్రసన్నుడై మహాప్రళయమందలి జలరాశి యందు సమస్త విశ్వమును ఎట్లు చూడవలెనో, చూచి ఎట్లు స్థాపింపవలెనో, ఆ విధమున చూచి చూపించెను.

(ప్రళయ జలములందు చూచువాడు గూడ కరిగిపోయి ఉండును. అందుండి జలములకు లోకములుగా చూచుట సృష్టివిద్య. దానిని నారాయణుడు చూపించెను. తాను చూచి లోకములను ఎట్లు చూడవలయునో నిరూపించెను. తన యందు బ్రహ్మను తన కన్న వెలుపలగా ఉండునట్లు చూచుటయు, అతడు తనను చూచునట్లును గ్రహించుటయు, నారాయణుడు కల్పించి, బ్రహ్మను గూడ అట్లే చూడుమనెనని భావము.)......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-314,315.

Master E.K. Spiritual and Service Mission

10 Feb, 10:30


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Don’t deny pleasures, but don’t be a begger of pleasures.🌼

Master E.K. Spiritual and Service Mission

10 Feb, 10:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 కార్యవాదికి ప్రపంచమంతా పనిచేసే స్ధలమే.🌼

Master E.K. Spiritual and Service Mission

10 Feb, 01:58


*When a man has sufficiently distinguished himself by service, ...then he finds his Master -or rather his Master finds him. During all the time of his struggle those gracious eyes have been upon him watching him progress; in many lives in the past he has come under the same influence which now is to become the dominant influence of his life.*

🪶 *Annie Besant*

Master E.K. Spiritual and Service Mission

10 Feb, 01:58


*మనస్సే బంధమునకుగాని, మోక్షమునకుగాని కారణము. దేనిని కావలె ననుకొనినను బంధము కలుగును. నారాయణుని యందు న్యాసము చేసినచో మోక్షము కలుగును.*

🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

10 Feb, 01:58


*Q: May we know the usefulness of vertigo as a protective reaction:*

*A: Any symptom is produced by Nature to indicate to us that there is something wrong in the constitution.Vertigo, in particular, is produced by Nature to arrest the activity of the mind to a certain degree when the mind is being over used or when the nerves are highly strung. The vertigo automatically arrests the momentary activity of the mind and it has a good effect of producing a compulsory rest. At the same time it has the value of informing and indicating to us that there is something alarming in the constitution. So, it has a two-fold value.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

09 Feb, 23:39


🌷 *February 10,Today's Meditation*🌷
Eagle and serpent. Matter and serpent. Master and servant. Master and savant. physical serpent. Astral servant. Divine savant. Celestial saint.

🌷 *ఫిబ్రవరి 10, నేటి ధ్యానము*🌷
🌻 సర్పమొకటియు, గృధ్రమొకటియు గలవు
కాల బంధనంబు, కామబంధనంబు కూర్చు
కాళీయుడై మడుగున దాగి కాటువేయు నొకటి,
సో హమ్మను శ్వాసబీజాలు పక్షములుగ.
విశ్వప్రాణుడు విష్ణువునకు వాహనమై వెలయు నింకొకటి,
చైతన్య పతనమ్ము స్థూలద్రవ్యము దాక చుట్టలుగ
చరియించు నురగమ్ము నెరగుము.
స్థూలంబు కల్గించు కారుచీకట్ల పోకార్చి
కార్చిచ్చు నాత్మ తేజమ్ము వెల్గించు,
సౌరదీప్తి యె గరువు గరుడుడు,
సర్వకారణంబగు అమృతము దెచ్చునతడు,
పరమాత్ముని పరిజ్ఞానము తానై
పరమగురువుగ ప్రకాశించు పావనునకు వందనము.
స్థూలస్దాయిలోన సర్పంబుగ చరించు
సూక్ష్మస్దాయిలోన సేవకు గడంగు
దివ్యజ్ఞాన మహిత దివ్యమూర్తిగ దీపించు
పరమకారణమ్మగు వికుంఠమున యోగియై విహరించు..... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

09 Feb, 14:59


🎍 *Messages of Master E.K.*🎍

🥀 *THE GOAL OF AYURVEDA* 🥀

🌹 The goal of homoeopathy is a radical cure of the patient while the goal of Ayurveda is a healthy span without the need to cure a disease. When once the disease is cured the mind and body are perfect according to homoeopathy. But there is no prescribed process that keeps the health preserved and not being touched by the disease again.

The origin of disease is the first flaw in mental disposition even according to homoeopathy. Hence the habit-forming nature should be positively used as a preventive method of all diseases. When the process is made scientific, it is what we call Ayurveda............ *Master E.K.* 🌹

(From the book *Ayurveda*)

(To be Continued)

Master E.K. Spiritual and Service Mission

06 Feb, 13:47


🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌷 *స్వప్నము* 🌷

🌹ఓ పుండరీకాక్షా! ఎట్టి విజ్ఞానముతో నీవు ఈ సమస్తలోకములను కల్పించుచున్నావో, ఏ బలము చేత నీవు నమస్కరించిన జీవులకు ప్రియుడవగుచున్నావో, అట్టి సుజ్ఞానమును నాకు దయ చేయుము. వరమిచ్చిన వాడవగుదువు.

ఈ సృష్టిని నిర్మాణము చేయు కుతూహలము గల నా మనస్సునకు కావలసిన నిపుణత ఇమ్ము. కూడని మార్గమునబోయి పాపము తెచ్చుకొనకుండునట్టి ఉపాయము కలిగింపుము. కర్మ యందు ప్రవర్తించుచున్న నన్ను చక్కగా నెరవేర్చువానినిగా చేసి దయజూడుము.......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-311.

Master E.K. Spiritual and Service Mission

06 Feb, 13:20


https://youtube.com/shorts/285vAbbmPNs?si=2h-uGrP8WcJd0dim

Master E.K. Spiritual and Service Mission

06 Feb, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Whenever we are wrong in our thinking and doing, there is also the instantaneous corroboration from Nature and we have the verification in the form of pain and suffering🌼

Master E.K. Spiritual and Service Mission

06 Feb, 05:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 తనదేహమును, మనస్సును, సంభాషణమును తన వశమున ఉంచుకొనవలెను.🌼

Master E.K. Spiritual and Service Mission

06 Feb, 03:44


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

06 Feb, 02:02


*Q: It is a question on Spiritual Healing. Since the causes are on other planes than the physical plane, does it suppose that the spiritual healer has to be clairvoyant to see the initial cause or does he just let the higher planes work through him and does not need to see for himself.*

*A: In fact, when the medical science develops into its full fledged perfection and the Science of Spiritualism is developed into its total understanding the demarcation line between the two will be understood only as imaginary. We are dealing with the two subjects separately, calling one Spiritualism and the other Medical Science simply because the Science of Spiritualism is new to this century and the Science of Medicine is not yet fully developed into its scientific dimensions. Actually the two are only two branches of the same science and are supplementary to each other. Some people also believe that when there is spiritual healing, no medicine should be given. That is also not correct. Because what we call spiritual healing is one branch of healing and what we call Medical Healing is another branch of healing. The one is compulsory in some degree of disease whereas the other is required in some other degree of disease. For example, there is a decayed tooth which is painful. If you apply spiritual healing the fellow will be better for a day or two but again it recurs as surely as anything because the cause has descended to the physical plane and in such a condition physical removal of the tooth by a dentist is as necessary as spiritual healing. If it is late in the night, immediately give him spiritual healing, or if it is a country like Occident where if the patient telephones to the doctor, the doctor gives an appointment after three months. In such a case, you heal the patient immediately with spiritual healing and then follow the other procedure in the normal way. So the two are not different from each other. They should be properly understood as two branches of the same science.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

06 Feb, 02:02


*Watch how your influence affects others: be careful how your words affect their lives. Your tongue must be gentle, your words must be loving; no slander, gossip, or harshness of speech, or suspicion of unkind motive, must pollute the lips that are striving to be the vehicle of spiritual life.*

🪶 *Annie Besant*

Master E.K. Spiritual and Service Mission

06 Feb, 02:02


*కలలో కలిగిన ధనప్రాప్తి, దారిద్య్ర్యము, అప్పులు, సుఖదుఃఖములను నిజముగా కలిగించును. అవి ఎంత బలీయములైనను మెలకువతో మాయ మగును. అట్లే జీవితమందలి కష్టసుఖములు, కర్మలు, ఫలములు నారాయణుని యందు మేల్కొనుటతో మాయ మగును.*

🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

06 Feb, 00:04


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 23:22


🌷 *February 6,Today's Meditation*🌷
Rotation is time. Revolution is period. Time is in rotation. Matter is in periodicity. Time hatches matter.

🌷 *ఫిబ్రవరి 6,నేటి ధ్యానము*🌷
🌻 నిరంతర పరిభ్రమణంబు కాలమైనెలకొను
ఒక్కపరి పరిభ్రమణంబు అఖండ కాల విఖండమై పర్యాయత్వ మొందు
కాలంబు పరిభ్రమ మాణమై కలనకెక్కు
మరి ద్రవ్యమేమొ కాల పర్యాయత్వ మందు ధారణంబొందు
కాలము ద్రవ్యమును పొదుగుచుండు....... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 17:41


🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼

🥀 *స్వస్థ వృత్తము*🥀

🌻 (జె) దాహమును అణచిపెట్టినచో నోరు, గొంతు ఎండిపోవుట, చెముడు, అలసట, నీరసము, మరియు గుండెలో నొప్పి ఏర్పడును.

(కె) కన్నీటిని అణచిపెట్టుట వలన కంటిజబ్బులు, తలదిమ్ము లేక గుండె జబ్బు ఏర్పడును.

(యల్) నిద్ర వచ్చినపుడు అణచిపెట్టినచో మత్తు, ఆవలింతలు‌ మరియు కంటి జబ్బులు ఏర్పడును.

(యం) శ్రమ వలన కలిగిన వేగశ్వాసను అణచిపెట్టుట వలన స్పృహకోల్పోవుట, గుండెజబ్బు లేక వ్రణమున్నట్లుగా కలిగిన భావన వలన బాధ కలుగును........ *మాస్టర్ ఇ.కె.* 🌻

( *ఆయుర్వేదము* అను గ్రంథము నుండి)

(To be Continued)

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 17:41


🎍 *Messages of Master E.K.*🎍

🥀 *A Routine To Keep Up*🥀

🌹(j) Suppression of thirst causes dryness of throat and mouth, deafness, exhaustion, weakness and pain in the heart.

(K) Suppressing tears leads to eye disease, giddiness or heat disease

(l) Suppressing the urge to sleep causes drowsiness, yawnings and eye diseases.

(m) Suppression of quick breath after exertion leads to fainting fits, heart disease or phantom tumour............. *Master E.K.* 🌹

(From the book *Ayurveda*)

(To be Continued)

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 14:17


🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌷 *స్వప్నము* 🌷

🌹చతుర్ముఖ బ్రహ్మ విష్ణువును ఇంకనూ ఈ విధముగా స్తుతించెను… వేదములచే స్తుతింపబడుచు, లక్ష్మీపతివై లోకములను కల్పించి, ఆ లోకముల యందు అంతర్యామియై మెలగునట్టి నీ వైభవము‌ ‌చిత్రమయినది. అందలి నీ సౌఖ్యానుభవమే జీవుల సౌఖ్యానుభవములుగా వర్తించుచున్నది.

(భగవంతుడు నిరంతర సుఖ స్వరూపుడు. అతడు అంతర్యామిగా ఉండుట వలననే జీవులు కూడా సుఖమునకై యత్నించుటయు, భగవత్సౌఖ్యము పొందగలుగుటయు జరుగుచున్నది.)......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-310.

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 13:27


https://youtube.com/shorts/LIpsI6FB5Vs?si=oSzDCEDTz3eMdqob

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 10:32


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 దేవుడి స్మరణ మనలను పవిత్రులను చేస్తుంది. కాని మన మైల దేవుడికి సోకదు.🌼

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 10:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Believe in non-violence.🌼

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 02:36


Photo from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 02:36


Photo from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 02:30


Vasudeva
Advance train reservations for 6th April from Delhi are released today.

Master E.K. Spiritual and Service Mission

05 Feb, 01:20


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

29 Jan, 18:09


🌷 *January 30,Today's Meditation*🌷
Man is in globe. Lotus is in man. The heart of space is man. The heart of man is space. The heart of space is the centre. The heart of man reflects the circumference.

🌷 *జనవరి 30, నేటి ధ్యానము*🌷
🌻 మనిషి నెలకొని యుండు గోళంబునందున
మానవుడధి వసించు ఆకాశమందున
కమలమ్ము నెలకొను మనుజుని యందున
విశాల విశ్వ మధివసించు మనిషిలోన
ఆకాశ హృదయమ్ము మనిషి యతడె
జగద్గోళమ్మునకు కేంద్రమతడె.
దృశ్యమాన విశ్వమునకు ద్రష్టయతడె.
మానవ హృదయ మాకాశమ్మె
దహరమై దీపించు దివ్యముగను
ఆకాశ హృదయంబు కేంద్రంబుకాగ,
ఆ మనిషి హృదయంబు పరిధిని పరావర్తించు,
మనిషి నాభియై మహిని నిలువ
మహాకాశంబు పరిధియై మసలుచుండు
కరుణగల సాధకుడు కేంద్రమ్ము కాగ
కేంద్రమంతటను కలదంద్రు
ప్రేమ విస్తరించిన వాని పరిధికి
పరిమితత్వమ్ము ఎచ్చటను లేదు.
జగదాధారుడౌ జనార్దనునితో
జతకట్టి ఎదనాడు జీవుడెంతో....... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

29 Jan, 15:53


🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼

🥀 *స్వస్థ వృత్తము*🥀


🌻 ఆరోగ్యవంతమైన దీర్ఘాయుత్వమును పొందదలచిన వారు ఈ క్రింద వివరింపబడిన దైనందిన జీవన విధానమును అనుసరించుటలో‌ గల విలువను తెలిసికొనవలెను:

1.సూర్యోదయమునకు ఒక గంట ముందుగనే నిద్ర నుండి మేల్కొనుటను అలవరచుకొనవలెను. ఆ రోజు చేయవలసిన పనులను గురించిన ప్రణాళికను కొద్ది నిముషములలో ఏర్పరచుకొనవలెను‌. ఆ రోజు చేయబోవు జమాఖర్చులను అంచనా వేసికొనవలెను. తరువాత కొద్ది నిముషముల పాటు నీ భౌతిక, మానసిక ఆరోగ్య పరిస్థితిని అర్థము చేసికొనే ప్రయత్నము చేయవలెను‌. ఒక వేళ ఏదైనా అవాంతరమును కనుగొన్నచో దాని కారణము తెలిసికొని దానిని నివారించే ప్రయత్నము చేయవలెను. అప్పుడు పవిత్ర గ్రంథములలోని శ్లోకమునొక దానిని చదివి దాని అర్థమును మననము చేయవలెను........ *మాస్టర్ ఇ.కె.* 🌻

( *ఆయుర్వేదము* అను గ్రంథము నుండి)

(To be Continued)

Master E.K. Spiritual and Service Mission

29 Jan, 15:53


🎍 *Messages of Master E.K.*🎍

🥀 *A Routine To Keep Up* 🥀


🌹 Those who wish to have a long and healthy lease of life should know the value of practising the following routine:

1.Habituate to get up from bed one hour before sunrise. For a few minutes, plan the days routine. Estimate your assets and liabilities of the day. Then for a few minutes try to understand the position of your physical and mental health. If you find any affliction try to locate the cause and plan to eliminate it. Then recite a line or two from the scriptures and ponder on the meaning........... *Master E.K.* 🌹

(From the book *Ayurveda*)

(To be Continued)

Master E.K. Spiritual and Service Mission

29 Jan, 13:32


🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌷 *స్వప్నము* 🌷

🌹బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, త్రిమూర్తులు. అందు సృష్టికి బ్రహ్మయు, స్థితికి విష్ణువు, లయమునకు హరుడును అధిపతులు. ఈ మూడింటి స్థితియు శాశ్వతము కనుక మరల విష్ణువే స్థితికి అధిపతియై, సృష్టి, లయములకన్న ప్రాధాన్యము వహించుచున్నాడు. స్థితి లేనిది లయము లేదు. లయము లేనిది మరల సృష్టిలేదు. సృష్టి, స్థితి, లయములు మూడును కలుగుచుండుటయే శాశ్వాతమైన స్థితి. దానికి విష్ణువు అధిపతి.

దీనిని బట్టి సృష్టి స్థితి లయములలోని స్థితి ఒకటియు, ఈ మూడింటి స్థితి ఒకటియు, వేరుగా ఉన్నవని తెలియుచున్నది. అందు మూడింటిలో ఒకటియైన స్థితికి అధిపతి త్రిమూర్తులలోని విష్ణువు. ఈ మూడింటి అస్థిత్వమైన స్థితికి అధిపతి త్రిమూర్తులకు అతీతుడయిన విష్ణువు. ఇతనినే మహా విష్ణువు అనియు, పరబ్రహ్మము అనియు, పరమాత్మ అనియు, సదాశివుడు అనియు వ్యవహరింతురు. భాగవతము నందలి విష్ణువు అనగా మహా విష్ణువేగాని, త్రిమూర్తులలోని విష్ణువు కాదు. విష్ణువు అను శబ్దమునకు సర్వవ్యాపి అనియే విష్ణుశబ్దమునకు అర్థము. భాగవతమున, విష్ణు పురాణమున, విష్ణు సహస్రనామముల యందు ప్రతిపాదింపబడిన విష్ణువు ఇతడే! వేదముల యందు, విష్ణు సూక్తములలోని, అగ్ని స్తుతులలోను ప్రతిపాదింపబడి‌న దైవము కూడా ఇతడే.

దీనిని గ్రహించి‌నవారికి విష్ణువు ప్రతిపాదకములయిన గ్రంథముల యందు విష్ణువునకును, శివ ప్రతిపాదకములయిన గ్రంథముల యందు సదాశివునకును, వేదాంతమందు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమునకును భేదము లేదని తెలియును. దీనిని గ్రహింపలేని నాడు త్రిమూర్తులలో విష్ణువు గొప్పవాడని వైష్ణవులును, శివుడు గొప్పవాడని శైవులును, వారిని మించినవాడు ప్రరబ్రహ్మము అని వేదాంతులును వాదించుకొనుచు తమ పక్షము దైవమును నిలువబెట్టుటకు యత్నించుచుందురు............ *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-305.

Master E.K. Spiritual and Service Mission

29 Jan, 13:25


https://youtube.com/shorts/Eww8hve9vc8?si=0nrRUsVEN9-sXuDm

Master E.K. Spiritual and Service Mission

29 Jan, 11:30


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 The Lord can be approached in the form and the nature, and in the nature of his guru.🌼

Master E.K. Spiritual and Service Mission

29 Jan, 11:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 కర్తవ్యం ఆచరించుగాని, చేద్దాం అని సరదాపడ్డ పని నీవు చేయకు.🌼

Master E.K. Spiritual and Service Mission

29 Jan, 00:23


*The life which counts all the prizes of earth as valueless compared with the service of the Ideal which has attracted and occupied the heart. There is the mark of the man who is approaching the Path.*

🪶 *Annie Besant*

Master E.K. Spiritual and Service Mission

29 Jan, 00:23


*సంసారబద్ధులకు సుతునిపైన, మిత్రునిపైన, మేలుకోరు వాని పైన, గురువుపైన కూడ సరియైన నమ్మకము కుదరదు. కొడుకు తనమాట వినడేమోయని సందేహము, మిత్రులు మోసగింతురని భయము తీరవు. గురువునకు సమర్పణ బుద్ధిని తన మనస్సున కలిగించుకొన్నచో వాడు ఏమి యడుగునో యని సందేహము ! ఎవరిని నమ్ముదమన్నను లోకమున మోసమే కనుపించును.*

*సర్వము విష్ణుమయమని నమ్మినవారికి అందరి యందును భగవంతుని మూర్తులే కనుపించును. అన్ని సంబంధములతో అత డొక్కడే తిరుగుచుండును. ఒక్కొక్క సంబంధముతో సాధకుని యందు ఒక్కొక్క సద్గుణమును వికసింప జేయును. కొడుకువలన స్నేహభావము, మిత్రునివలన నొకరిని పూర్తిగా నమ్ముట, మేలుకోరువానివలన హృదయము విప్పి చెప్పగలుగుట సాధకునకు అభ్యాస మగును. అట్లే గురువువాక్కు వలన సర్వాంతర్యామి స్వరూపము బోధపడి, బంధచ్ఛేదనము కలుగును. దేవతార్చనము వలన అనన్యభక్తి అభ్యసింపబడును.*

*వయస్సురూపమున కాలచక్రము తిరుగుచుండుట సంసారికిని,భాగవతునకును సమానమే.అది సంసారికి దుఃఖ సందేహాదులతో గడచును.భాగవతునకు అన్ని రూపములలో దైవానుభవమున గడచును. సందేహము, దుఃఖము, వయోధర్మములు వాని గమనిక నుండి జారిపోవును గనుక కాలచక్ర భయము లుండవు. కాలమునందలి దైవవైభవమే గాని, అస్యవస్తు భీతి యుండదు.*

🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

29 Jan, 00:23


*Is it possible to prolong the span of life through Yoga practice?*

*As you grow into a spiritualist, you will lose the glamour of prolonging the life of this rotten body for years. Suppose I go on taking photographs every five years and hang one after the other with numbering. At a glance look at the photographs: myself tender, myself beautiful, myself married, myself getting children, myself making jolly trips, people being enamoured at my beauty, people find glamour at my beauty, face growing rough and face going back into evolution to acquire the face-cut of a monkey and finally taking the resemblance of a skull. If we look at all the photos at a glance, is it possible for us to live in the skull and skeleton after 60 years? Excuse me, you people who are above 60, we say 100 years.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

28 Jan, 18:56


🌷 *January 29,Today's Meditation*🌷
Serpent unwinds into spiral. Globe of space unfolds into lotus. Serpent of time unwinds into spiral. Serpent is in lotus. Lotus is in globe. Globe is in mind.

🌷 *జనవరి 29,నేటి ధ్యానము*🌷
🌻 సర్పంబు శంఖ వలయమై చుట్టవిప్పును సరళ సరణి తోడ
నింగియను గోళమ్ము విచ్చుకొను నీరజముగను
కాలసర్పము కలితశంఖ వలయముగ కుండలములు విప్పు
సర్పమధివసించు సరోజమందున
కాలమధివసించు విశ్వవలయంబున
కమలమధివసించు గోళంబునందున
విశ్వమధివసించు వినుతవిహంబునందున
నాళమధివసించు మానసంబందున
జగద్గోళమ్ము నెలకొను జలజనాభుని డెందంబునందున
జ్ఞాని మానస గర్భాన జరుగుచుండును జగతియెల్ల.......... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

28 Jan, 16:00


🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼

🥀 *ఆహార‌ నియమములు*🥀

🌻 9. ప్రకాశవంతమైన శరీరవర్ణము, ఆనందానుభూతి, సహజమైన బలము వృద్దాప్యము వరకు కూడా చెదరిపోకుండా కలిగిఉన్న వ్యక్తిని సంప్రదించినట్తైతే తప్పనిసరిగా తన ఆహార విషయమున అతడే విధంగా శాస్త్రీయతను, క్రమపద్ధతిని, ఒద్దికను ఏ విధంగా పాటిస్తాడో చెప్పగలడు‌.

నీవు భోజనము చేయునది నీ శరీర పోషణకు మాత్రమే అయి ఉండి, ఆవశ్యకతను మించని రీతిలో రుచిని అనుభవించుదువు గాక....... *మాస్టర్ ఇ.కె.* 🌻

( *ఆయుర్వేదము* అను గ్రంథము నుండి)

Master E.K. Spiritual and Service Mission

28 Jan, 15:57


🎍 *Messages of Master E.K.*🎍

🥀 *DIETETICS*

🌹 9. A person having brilliance in complexion, happiness in disposition and a natural grip of strength that lasts long up to a very advanced age will tell you unfailingly that he is regular, economic and scientific about his diet.

Let your eating be meaningful of maintaining the constitution, at the same time enjoying the taste within the limits of need........ *Master E.K.* 🌹

(From the book *Ayurveda*)

Master E.K. Spiritual and Service Mission

28 Jan, 13:26


🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌷 *స్వప్నము* 🌷

🌹బ్రహ్మ విష్ణుమూర్తిని ఇంకనూ ఇట్లని స్తుతించెను….నేను, శివుడు, మనువులు, మరీచి మొదలగు దేవతలు నీ యందు పుట్టి, వృద్ధి చెంది, లీనమగుచుందుము. అందు నేను, శివుడు నీతో ముందు కొమ్మలుగా ఉద్భవించుచున్నాము. మనువులు, మరీచి మొదలగు వారు ఉపశాఖలుగా పుట్టుచున్నారు.

ఇన్ని కొమ్మలకు మూలమయిన సమస్త సృష్టి మహావృక్షమయిన నీకు నమస్కరించెదను............ *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-305

Master E.K. Spiritual and Service Mission

28 Jan, 13:02


https://youtube.com/shorts/ogDtKmcY4g0?si=-0ZDoNKTrz2YARgI

Master E.K. Spiritual and Service Mission

28 Jan, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 “Why are the rogues extremely happy and why are I less so? “ This question does not concern you and should not arise in your mind. Enough if you guard against it,If you want to be happy.🌼

Master E.K. Spiritual and Service Mission

28 Jan, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 సత్యం పలకడమేకాదు, సత్యత్వము కావాలి.🌼

Master E.K. Spiritual and Service Mission

28 Jan, 02:56


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

28 Jan, 00:22


*జీవుడు తా నాధారముగా పెరుగుచున్న దేహమును తన కాధారమని నమ్మును. ఒక్కొక్క ప్పుడు దేహమే తానని నమ్మును. దేహమునకు నొప్పి కలిగినప్పుడు, నీరసము, రోగము కలిగినప్పుడు తనకు గలిగినవని అర్థము చేసికొని బాధపడును. తాను సంపాదించిన ఆస్తి తనకు రక్షణమని నమ్మును.తనపై నాధారపడిన వారిని తన పోషకులుగా భ్రమపడును. తననుండి ఆచరింపబడుచున్న వృత్తి కర్మలను తా నాచరించుచున్నా సనుకొనును. ఆ వృత్తివలన తనకు సంక్రమించుచున్న జీవనోపాధి మరియొకని వలన జరుగుచున్నట్లు భ్రమపడి, వాడు తన రక్షకుడుగా భావించును. తన దుష్ప్రవర్తనమునకు వాడు కోపింపగా వానిని చూచి భయపడును.తన ప్రవర్తనమునకు జాగరూకత వహింపవలసినది బదులు వాని ప్రవర్తనకు భయపడుట జరుగును.ఇదియే స్వతంత్రమును కోల్పోవుట లేక పారతంత్ర్యము.దీనితో బ్రతుకు పరాధీనమగును. అట్టివాడు సంసారబద్ధుడు అనబడును.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

27 Jan, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ప్రతీది తెలుసుకున్నాక ఆచరిస్తామనుకునే వాడిని ఆభగవంతుడు కూడా బాగు చెయ్యలేడు.🌼

Master E.K. Spiritual and Service Mission

27 Jan, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 The best way to purchase happiness is to begin to be happy without any conditioning and there is no second alternative at all in this world.🌼

Master E.K. Spiritual and Service Mission

27 Jan, 05:04


*ధ్యానమునకు ముందు దేవునిపై తాను కల్పించుకొన్న భావము లుండును. ధ్యాన సమయమున అవి దేవుని యందుండును, అభ్యాసము వంటబట్టిన వెనుక తన భావములు భగవంతుని నుండి తనకు ప్రసాదింపబడి మనస్సునకు తట్టుచుండును.*

*సాధనకు ముందు సంసారికి లోకములోని సౌందర్యాది సంపదలనుగూర్చిన తన యభిప్రాయము లుండును. సాధన పూర్ణ మైన వెనుక భగవంతుడు తన కిచ్చిన యభిప్రాయములతో లోక మును చూచును.ఈ స్థితి అఖండానుభవము కలిగించును.*

🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

27 Jan, 05:04


*The Master is the man who has become divine, an elder Brother; a Brother sharing the same humanity, but elder by the greatness of His evolution. Along the Path... He has travelled and reached its further point, passing through Initiation after Initiation, and thereby widening His consciousness, until it knows not only this world, but all the worlds in which the Spirit lives.* 🪶 *Annie Besant*

Master E.K. Spiritual and Service Mission

27 Jan, 05:04


n has a constructive mind. And intelligence has only a constructive mind and it has no creative mind. Unless we properly enter into the Aquarian age we can have only the constructive mind, whether it is economics or politics or science or technology. We can invent things according to the constructive mind. But we can never create a new world for humanity. The moment the creative mind is touched, the human beings will be able to create a future and make the present difficulties disappear.*

*For example, we can deny war within a few days. That is what is meant by creation. That is you should be able to create something which was not there. A plan should descend into your mind. And the test of the real plan is that it immediately descends into the minds of the other people within a wonderfully short period. You know Djwhal Khul started to transmit his plan in 1870 through Blavatsky at first. By 1970 the work through Blavatsky and Alice Bailey has already reached atleast 25% of the human beings of this earth. That is the tremendous speed with which the creative ray descends. And the creative mind receives the plan. And the plan enters into the human beings at a tremendous speed.*

*It is the positivism that works as the creative ray. And negative aspects disappear when the creative ray begins to work in the majority of the humanity. So the very concept of the positive zero gives us the content of space, that is what is filling the space. The scientist and the philosopher meet in the science of spiritualism. And they accept the consciousness that is existing in space. For example, they call it space mind. When once the scientist can accept space mind he makes his mind work according to the space mind, not according to his own intelligence. When he begins to think according to the space mind, it is only the mind outside and the mind inside that meet. Then the creative intelligence begins to work. The real values of humanity will be touched, that is something about the creative mind.*

*The creative ray that touches to stimulate the creative mind travels through the potency of the positive zero. Instantaneously the scientist begins to feel the existence of the positive zero. For example, when the Aquarian age began, there was the radioactive element in the ores of the earth, that is in the mines of the earth. And Uranus made his appearance to the people on the earth. And from that time onwards a ray of Uranus began to work in the minerals and the human kingdom also. So the first human being who felt the existence of radioactive elements, was Madam Curie. And there was the first discovery of radium. Like that the creative ray begins to make its existence. But it was only the beginning and the ray has to make its presence felt more intensely upon the mind of the average human being. Since Madam Curie was among the advanced human souls, she could feel it so early. That is how it works.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

27 Jan, 01:55


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 23:48


🌷 *January 27,Today's Meditation*🌷
Ten times ten. The wheel rotates. Three wheels from one wheel. A total of four wheels. Three above and four below. Seven wheels rotate in three directions. 7 and 3 is ten.

🌷 *జనవరి 27, నేటి ధ్యానము*🌷
🌻 అష్టవిధప్రకృతు లమరియుండును అపరాప్రకృతిగ
పరాశక్తియై పరిపాలించును జీవజగమున పరాప్రకృతియును
పరపురుషుని ప్రకృతి లీ తొమ్మిదియును
పురుషుండు ప్రకృతియు కూడి పదిగ పరిఢవిల్లు
సృష్టికర్త బ్రహ్మకు సుతులు నవబ్రహ్మలును
సాంఖ్యశక్తులుగ వర్తింత్రు ఒక్కటౌ చోటునందు
తొమ్మది నొకటియు గూడి పదియై తేజరిల్లు.
"ఒక్కటి" యన పురుషుడు ఒక్కడౌ "నేను" గాదె
"సున్న" యన సుకుమార సుందరి అమ్మ ప్రకృతియు
ఒక్కటి పదియు అగుట "నేను" అను పురషుండు జీవుడగుటయే
ఒకటికి సున్న కూడిన, పది యొకట్లై పదిగ భాసిల్లు.
ప్రజ్ఞా ప్రమాణమొక్కటియై ఒక్క పూషుడుగ ప్రకాశించు
ఆకాశ ప్రమాణము శూన్యమై యందు సూర్యుడధివసించు
ఒక్కటి తొమ్మది కలసి పదిగ పరిఢవిల్లు.
తండ్రి యొకటియై, తల్లి తొమ్మిదై పదిగ తనయుండు పుట్టునంత
అవ్యక్తమైనట్టి ఆకాశ గోళమ్ము సున్నయగును
వ్యక్తమగుచున్నట్టి వియన్మండలం బొక్కటగును.
ఒక్కటి సున్నయు పదిని ప్రభవించుచుండు
పది, పదిరెట్లుగ, పది పదిరెట్లుగ ప్రాకుచుండు
సృష్టి పరిణామమంతయు ఈ సాంఖ్య సూత్రములోన
సంతతము చక్రమై సుడులు తిరుగు.
ఒక్కటౌ అలోక చక్రమున
ఒదిగియుండు ముల్లోకములను మూడు చక్రములు
ఓంకారమూర్తులౌ మూడు వ్యాహృతులివి
భూర్భువస్సువర్లోకములివి
ద్రవ్యంబు, ప్రాణము, ప్రజ్ఞయై పరగుచుండు
ప్రేమాలయము హృదయము
అజపమూలమనాహతము
అధశ్చక్రములు మూడును
ఆవిర్భవించును అనాహతము నుండి
అధశ్చక్రత్రిపుటియు, అనాహతమ్మును కలసి
అలరారుచుండు చతుశ్చక్రసంపుటిగ
అనాహతము నారోహించిన
ఆ పైనగలవు ఊర్ధ్వ కేంద్ర త్రిపుటి
విశుద్ధి నాజ్ఞయు మరి సహస్రారంబు
మూడు నాలుగు కూడి ఏడుగ వెలుగొందు
ఇవియె సప్తవ్యాహృతులివియె ఏడుకొండలు
ఏడుకొండలపైన ఎల్లయునేలెడు స్వామి వెలసియుండు
సహస్ర శీర్షుడౌ స్వామికి సహస్రదళపద్మంబు పీఠమై సొగసులీను.
ఏడుకొండల స్వామి ఏలుబడిలోన ఏడులోకములుండు.
మూడు కన్నుల దేవర ముచ్చటగనేలు ముల్లోకములను.
సప్తలోకములును సందడిగ,
మూడు దశలలోను సుడులు తిరుగు
చక్రంబులేడును, మూడు కక్ష్యలలోన చరించుచుండు
స్వరంబులేడును, మూడు స్థాయిలలోన స్వనించుచుండు
సప్తధాతలే సప్తధాతువులై
సప్తమారుతంబులై, సప్తవర్ణ కాంతులై
సంశోభించు స్థాయిలు మూడింటిలోను
ఏడు మూడును గూడి యెన్నగ పదియునగును.
ఏడుగడ ఎల్లజగతికి ఈ పదియను పూర్ణ సంఖ్య
పూర్ణమునకు ప్రతియౌ ప్రతి అమ్మయు
పన్నుగ పది ద్వారములతోడి పవిత్రమూర్తి......... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 18:00


*SUKRATAL SAPTAHAM UPDATE*
వాసుదేవ, మాస్టర్ గారి దయ వల్ల వెయిటింగ్ లిస్ట్ లో అందరకీ కూడా అకామడేషన్ దొరికింది.

ఇది కాక అన్ని సెంటర్స్ నుండి వస్తున్న రిక్వెస్ట్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇంకా సుమారు 70-80 మెంబర్స్ కి accomodation సిద్ధం చేయటం జరిగింది. ఆసక్తి కలవారు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోగలరు.

సంప్రదించవలసిన ఫోన్ no
Priya Dusi
7760911131
గమనిక: ముందుగా చెప్పినట్టుగా అందరి కోసం అకామడేషన్ బుక్ చేయటం జరిగింది అంటే ఆశ్రమాలకు అమౌంట్స్ ఇచ్చి బుక్ చేయటం జరిగింది కాబట్టి ఇక క్యాన్సలేషన్స్ అనేవి కుదరటం లేదు .రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ గా కలెక్ట్ చేసిన అమౌంట్ ఆల్రెడీ కట్టేయటం జరిగింది కాబట్టి ఆ అమౌంట్ తిరిగి ఇవ్వటం కుదరటం లేదు!

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 15:34


🎍 *Messages of Master E.K.*🎍

🥀 *DIETETICS*

🌹6. Let there be only one, two or three or four programmes of eating, trained properly. Let there be no eating or drinking in between. It is always detrimental to eat once again, a little while after a feed. It is highly injurious to health especially if one eats rice, boiled corn flakes, or preparations made flour of cereals, a few hours after a meal. Even when hungry such rich foods should be consumed with a high sense of proportion.

7.If you control eating while still feeling that you can eat more, it is the best method to follow. By doing so, you can enjoy eating until your advanced years........ *Master E.K.* 🌹

(From the book *Ayurveda*)

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 15:33


🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼

🥀 *ఆహార‌ నియమములు*🥀

🌻 6. ఆహారమును స్వీకరించడానికి రెండుగాని, మూడు గాని లేక నాలుగు సమయాలుగాని రోజులో కేటాయించుకోవాలి. ఆ సమయములలో క్రమశిక్షణతో ఆహార స్వీకరణ జరగాలి. మధ్య కాలంలో తినుట, త్రాగుట ఉండరాదు. ఒకసారి భోజనము చేసిన కొద్దిసేపటికే మరల కొంత తినుట హానికరము. భోజనము చేసిన కొద్ది గంటలలోనే వరి అన్నము గాని ఊడికించిన జొ‌న్నపేలాలు కాని, పప్పు పిండితో చేసిన పదార్థములు గాని స్వీకరించుట ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఆకలి ఉన్నప్పుడు కూడ ఇటువంటి బరువైన ఆహారమును స్వీకరించునప్పుడు వాటి పరిమాణమును తగిన రీతిలో ఉండునట్లు చూసుకోవాలి.

7.ఇంకా కొంచెము తినగలను అనిపించినపుడే తినడాన్ని నియంత్రిస్తే అది చాల హితకరమైన విధానము. అలా చేసినట్లయితే బాగా వృద్ధాప్యం వచ్చే వరకు ఆహారాన్ని చక్కగా స్వీకరించి ఆనందించవచ్చు....... *మాస్టర్ ఇ.కె.* 🌻

( *ఆయుర్వేదము* అను గ్రంథము నుండి)

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 14:30


🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌷 *స్వప్నము* 🌷

🌹ఓ పుణ్యాత్మ! నిన్ను స్మరింపవలెను అన్నచో నీ గుణములు, నీవు ఆచరించు సత్కర్మలు తెలియవలెను. అట్లు తెలియుటకై నీవు అవతారములు ఎత్తుచుందువు. రాముడు, కృష్ణుడు మున్నగు అవతారములలో దిగివచ్చి నీవు వర్తించిన విధము భక్తుల మనస్సులకు రమణీయమగును. వారి మనస్సులు నీ యందు నిలుపుటకు అందుబాటులో ఉండును.

అట్టి నీ అవతారములు ఆధారముగా మానవులు ధ్యానము చేసి, తన్మయులై శరీరము విడుచునపుడు నీ సంస్కారమే పొంది జన్మజన్మల యందు పాపములను తొలగించుకొని నీ కేవల స్థితిని పొందగలుగుచున్నారు. అట్టి దివ్యావతారముల యందు నీవు అవతరించియు జన్మలలో చిక్కక నిలిచి‌న నీకు మొక్కెదను.

నీ ప్రవర్తనములు పాపములను అంటనీయవు. శుభములను చిరముగా నిల్పును. లక్ష్మిని నిత్యముగా విహరింప జేయును. భక్తులకు కల్పవృక్షము వలె నిలుచును. చెడ్డ పుట్టుకలలోని సంసార భయములను దూరము చేయును............ *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-304.

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 13:19


https://youtube.com/shorts/1klPpWgaKAU?si=IkXAdNxS7a-HMGsr

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 06:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 దూషణమును విడనాడుము.నింద వలన నీ ప్రజ్ఞ కలుషితమగును.🌼

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 06:30


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 The wonder of truth is, it appears to everyone according to his own understanding of truth.🌼

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 02:23


*Q: What are Musical Scales and Positive Zero?*

*A: When the first and the seventh overtone of the musical scales meet, they become one. That is the sound equivalent of the positive zero. You see there are seven musical scales, I think it is the same in the occidental music also. Is it? The seven tones. The first tone is a complimentary to the seventh tone. And again there is its seventh tone on the 3rd gamut. So the supplementary nature of the first and the seventh tone forms the content of the positive zero. In fact it was popular in the music of all nations in the ancient days. It is lost in the nations now and only in the Indian nation it is existing continuously, because luckily they could just maintain the continuity of the tradition in music. I think that there is one occult reason for this. Among the seven magnetic points of the earth globe, the area where India exists is one. They are now not inhabitable. The one is north pole and the other is south pole.Djwhal Khul has given in his books, the location of the seven magnetic points of the earth. And Jerusalem area is another point. Now it is in hot bed. And according to the occult history of humanity, the piece of land that includes the area from central Asia to India, is the oldest piece of land surviving at present.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 02:23


*First of all, the goal of the Path is conscious union with God; not mere prayer and aspiration, nor even the rapture of the mystic, but a conscious union, in which man finds his con- sciousness expanding stage after stage,until he unites with the Supreme Consciousness and knows himself as one with the Universal Life.*

🪶 *Annie Besant*

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 02:23


*దైవసాధన చేయువానికి అణిమ, లఘిమ మొదలగు సిద్ధులు లభించును. వానియం దభిలాష లేనివా డీశ్వరు డగును. కనుక సిద్ధు లైశ్వర్యములుగా మారును. అనగా వాని సహజ లక్షణములుగా చోటు చేసికొనును.వానియందు కూడ దృష్టి లేక అంతర్యామినే హృదయ పద్మమున ధ్యానించువాడు మోక్షమును పొందును. అతనికి మృత్యువు లేదని తెలియును. మృత్యు వను పదమును విన్నప్పుడెల్ల పరిహాసముగా నుండును.*

*ఇం దొక విశేషార్థ మిమిడి యున్నది. అణిమ మొదలగునవి యోగి సాధించుకొనునవి కాక ఈశ్వరుని యందున్న సృష్టి లక్ష ణములు కూడ. 1. అణిమ యనగా భగవంతుడే అణువులుగా దిగివచ్చుట. 2. మహిమ యనగా లావు, పొడవు మున్న గు లక్షణముల తోడి దేహములుగను, దేహభాగములుగను దిగి వచ్చును. 3. లఘిమ అనగా బరువులేని పంచప్రాణముల లక్ష ణము. 4. గరిమ యనగా దేహమునకు గల బరువు. 5. ప్రాప్తి యనగా ఒకరినొకరు మిత్రత్వబంధుత్వాదులచే పొందుట, ధనార్జనాదులు చేయుట. 6. ప్రాకామ్య మనగా కోరుట, నెర వేర్చుకొనుట, 7. ఈశ్వరత్వ మనగా అధికారము నెరపుట. సేవకులు, దారపుత్రాదులు తన మాటప్రకారము నడచుకొనుట. 8. వశిత్వ మనగా నితరులను, పరిస్థితులను వశపరచుకొనుట. ఇవి యోగి సాధించునవి కాక ఈశ్వరసృష్టి కొరకై యేర్పడిన సహజ గుణములు.ఇవి బ్రహ్మకు సంక్రమింపగా సృష్టి దిగి వచ్చినది. వీనియందు దృష్టి నుంచక అందలి అంతర్యామియందు భావము నిలిపినవానికి హృదయమున భగవంతుని చరణము నిశ్చల మగును. అట్టివానికి దేహాదులు యుండుట, లేకుండుట లేవుగనుక శాశ్వ తత్త్వముచే మృత్యువును తిరస్కరించుచున్నాడు.*

🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 01:37


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

26 Jan, 00:04


🌷 *January 26,Today's Meditation*🌷
Seven wheels in three Lokas. Twenty–one wheels. The twenty second is I AM. I AM is more than nought, less than one. Twenty–one plus I AM divided by seven is the value of Pi.

🌷 *జనవరి 26, నేటి ధ్యానము*🌷
🌻 చక్రంబులేడు చరించుచుండు మూడు లోకములందు
సృష్టి యజ్ఞమునను, సంవత్సర యజ్ఞమునను
సమర్పింత్రు సురలు సర్వవిభుడగు పురుషుని పశువుగను
సప్తావరణ సంవృతమీ జీవుని దేహాలయంబు
ఛందస్సు లేడును సప్తధాతువులై
పరిధులేడునై పరిపాలించుచుండు
భూతములు, బుద్ధియు నహంకృతియు
పరిధులై పరగుచున్నవి ప్రకృతియందు
పృథ్వియు, అంతరిక్షంబు దివమ్ము
భౌతికము, మనోమయము, దివ్యమ్ము
మూడు లోకములై ముప్పిరిగొను ప్రణవంబునందు
పరిధులేడును ముల్లోకములందు, మూడు రెట్లుగ పరిణమించి
సమిధలిరువది యొక్కటై, సమర్పింతంబులగు హుతముగాగ
భూతము లైదును, తన్మాత్ర లైదును,
దశేంద్రియంబులు మనసు తోడ
సప్త త్రయంబై సాగుచుండు సృష్టియందు
సమావేశించు సకలజగతి.
సర్వకారణుడౌ "నేను" అను పురుషుండు
ఇతడె ఇరువది రెండవ వాడు ఎరుగగను
"అహమస్మి" యనువాడు అంతర్యామి
అధికమౌనాతడు, ఏమియు లేదు సున్నకన్నను
సున్మయౌ శూన్యాంకాశ సుందర గోళమ్ము
ఒకటియౌ, ఒకడుగ తనను తాగుర్తించునెరుక.
ఏకవింశతి తత్వముల ఏకాత్మయౌ "నేను" గూడి
ఏడుచే భాగింప ఏమియగును?
ఏమిటింక ? "పై" యను పరమ మూల్యాంకమ్ము......... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

25 Jan, 14:43


🎍 *Messages of Master E.K.*🎍

🥀 *DIETETICS*

🌹 5. After a dinner or a supper one should not find his belly or hypochondria bloated. Eating-should not impede sleep, walk, talk, laugh and cough.

At the same time hunger and thirst should be answered properly........ *Master E.K.* 🌹

(From the book *Ayurveda*)

Master E.K. Spiritual and Service Mission

19 Jan, 15:55


🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼

🥀 *ఆహార‌ నియమములు*🥀

🌻 2. ఆహారము యొక్క గుణాన్ని బట్టి మనము తినే ఆహారము యొక్క పరిమాణాన్ని బుద్ధిని ఉపయోగించి మార్చుకోవాలి.

పదార్థములు కనుక బలమైనవి, బరువైనవి అయినచో దాని ప్రమాణమును తగ్గించాలి. మొక్కజొన్న, పేలాలవంటి తేలికైన పదార్థములతో కూడినదైనచో (కఫదోషముచే అస్వస్థత కలిగినపుడు వీటిని స్వీకరించడమే శ్రేయస్కరము) ఆహారమును పూర్తి ప్రమాణములో స్వీకరించవచ్చు. వివిధ రకములైన బియ్యము, సోయా, పప్పులు, దుంపలు, మాంసము మొదలైన వాటిని ప్రమాణమును తగ్గించి స్వీకరించాలి....... *మాస్టర్ ఇ.కె.* 🌻

( *ఆయుర్వేదము* అను గ్రంథము నుండి)

Master E.K. Spiritual and Service Mission

19 Jan, 15:54


🎍 *Messages of Master E.K.*🎍

🥀 *DIETETICS*

🌹 The quantity of intake should be sensibly altered with its quality.

When the items are more nutritious and heavy the quantity should be reduced. When it is light with items like corn flakes (which should be preferred when the constitution is indisposed with kapha disturbance) then the quantity may be increased to normal. Various types of rice, soya and other cereals, roots and meat should be taken in reduced quantities....... *Master E.K.* 🌹

(From the book *Ayurveda*)

Master E.K. Spiritual and Service Mission

19 Jan, 15:21


🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌷 *స్వప్నము* 🌷

🌹కోరికలు అనగా ధనము కావలెను, సంతానము కావలెను, వ్యవహారములలో జయము కలుగవలెను, అను మొదలుగా గల కోరికలే కాదు, నాకు యోగసిద్ధి కలుగవలెను, మంత్రసిద్ధి కలుగవలెను, మోక్షము కలుగవలెను అనునవి కూడా కోరికలే.

ఈ సిద్ధికై ఏమి చేయవలెనో దానిని స్వధర్మముగ ఆచరించువాడు కోరికలే లేని వాడు అగును. కోరినవాడు తిన్నగా ఆచరింపడు............ *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-299

Master E.K. Spiritual and Service Mission

19 Jan, 13:14


https://youtube.com/shorts/VqePlkBjc7Q?si=KbLhVzVA6MEZGxru

Master E.K. Spiritual and Service Mission

19 Jan, 06:12


Photo from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

19 Jan, 00:54


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

19 Jan, 00:13


*We may be climbing slowly or rapidly; there is time enough for all, for the veriest laggard, there is power enough for each, for in the heart of each is God. There is nothing that can change our ultimate destiny, nothing which can finally frustrate the will of the God within.*

🪶 *Annie Besant*

Master E.K. Spiritual and Service Mission

19 Jan, 00:13


*Question: Did the Temple of Solomon exist?*

*Answer: That is a thing which cannot be decided at the present age. There is no physical evidence anywhere till now. But at the same time, we can't deny the existence of the temple in some date or other. The only thing I can say is, the evidence that is in the Old Testament, existing nowhere else and that there is no reason why it did not exist. A temple might have existed and might have been built. We find no salient reason to deny the truth of it. Beyond this we cannot say anything because we have no evidence. No, temple ritual is there with an older tradition and that has no relationship with the concept of the Solomon's temple.*

*At the same time, the concept of the widow's sons comes from the Indian ritualistic tradition to other schools of rituals. The story is first found in the world records in the Mahabharata. It is the story of the five righteous brothers after the birth of which the father died an untimely death. These five were deceived by their half-brothers. They were deprived of their kingdom and sent to the forests. They took refuge under Lord Krishna and he pitied them as the sons of the widow. He contributed to their success and regaining their kingdom once again. This was enacted as the oldest of the mysteries in India in a particular ritualistic school that existed for a very long time in India.*

*But it has no direct relation with the concept of the Solomon's temple. There is no actual evidence to believe that fact because the position of the present earth is different from the position of the earth in those times. There is a continuous shifting of the poles on this earth. The stars that are facing a particular construction in those days do not face the same construction now. So, we cannot definitely say anything about it. The pathways according to my understanding are not at all explained symbolically by any esoteric student till now. The shape of the pyramid is the only thing that is related to the symbologist and esoterist. The pathways constructed were in my opinion, not according to the symbolism of the solar year or anything. But they were according to the convenience of the tomb purposes. Therefore, no symbologist could attribute any symbolism to those details till now.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

19 Jan, 00:13


*నరజన్మ మెత్తుట మిక్కిలి దుర్లభమైన అవకాశము. ఇది కావ లెనని కోరిన వారికి లభింపదు. అట్టి జన్మమెత్తి కూడ తా నెవడో తెలిసికొను మార్గము పట్టక పెడమార్గము పట్టినవాడు నిజముగా దెబ్బతిన్న వాడు. వానికి సుఖము లేదు. సుఖము కోసమై అనేక సంకల్పములు చేయుట, సంకల్పించిన పనులు చేయుచు ఫలితములకై తీరుబడి లేక తిరుగుచుండుట. ఈ ఫలితముల నిచ్చు సత్కర్మలను గ్రహించి ఆచరించుటకు ప్రయాసపడుచుండుట అను ప్రవృత్తి మార్గము పట్టిన వారు కొందరు. ఇంద్రియములను మనస్సును దమించుకొనుట, సంకల్పములను క్షాళన మొనరించుకొనుట, వైరాగ్య మభ్యసించుట, లోకవిషయములకు దూరముగా నుండి శాంతిగా జీవితము వెళ్ళబుచ్చుకొనుట అను నివృత్తి మార్గము పట్టినవారు కొందరు. ఈ యిద్దరును సుఖము కోసమే ఈ రెండు మార్గములను పట్టుచున్నారు గనుక ఇద్దరును సుఖపడుట లేదు. కారణమేమి? దుఃఖ మక్కరలేదు. సుఖపడవ లెను అనుకొనుటలోనే రోగ కారణమైన బీజ మిమిడి యున్నది. సుఖము దుఃఖము అన్నవి దృక్పథమున చేసిన అలవాటులే గాని అక్కడ యున్నవి గావు.తన అలవాట్లను సృష్టిపైనను దేవునిపైనను ఆరోపించి నొక్కినచో సత్యమెట్లగును గనుక సుఖము కోరినవానికి దుఃఖము తప్పదు.సుఖ దుఃఖములను నిర్వచనము చేసికొని వాని సనుసరించి సంకల్పములను ఏర్పరచుకొని వాని ననుసరించి కర్మలయందు ప్రవర్తించుటయో, నివృత్తిమార్గ మవలంబించుటయో చేయుచున్నారు. ఇక సుఖ మెక్కడిది?*

*సుఖము కొరకు స్త్రీ పురుష సంబంధము నవలంబించు వారికి సుఖము కలుగవచ్చును. ఎడబాటు కలిగినపుడు దుఃఖము కలుగవచ్చును. వానిపై నాధారపడిన వానికి సుఖపడుట దుఃఖ పడుట అను పాట్లు తప్పవు. మోక్షము కోరి స్త్రీ పురుష సంబంధాదులకు దూరముగా నుండుటకు యత్నించిన వారికి గూడ తప్పవు. ఈ మూడు విధములైన ప్రయత్నములును కర్మాచరణ విధానములే గదా! అందున్న వారికి కర్మఫలములు లేకుండుట యెట్లు. ఇక యేది దారి? భగవంతుని స్మరించుటయే. వాని యందున్న వాని కివి లేవు. ఎప్పటి కేది కావ లెనో అది వర్తించుచుండును గాని తాను వేనియందును వర్తింపడు. భగవంతుని యందే యుండును.ఒక పెద్ద సంస్థ కోసమై నిరంతరము పనిచేయుచున్న వారికి అన్న పానీయములు, దుస్తులు, విశ్రాంతి, నివాస గృహములు, కార్లు, జీపులు, విమానములు, వినోదములు తన దగ్గరకే వచ్చును. అందు దేనిని కోరినను తాను దాని దగ్గరకు పోవలసి వచ్చును. వస్తు వాహ నాదులు చెడిపోవుట, బాగు చేయించుకొనుట అందుకుగాను ఖర్చు మొదలగు కర్మబంధములు సంధిబంధములను బిగించును. జీవి బద్ధు డగును.సంస్థకై పనిచేయుట మాత్రమే తెలిసినవాని దగ్గర సాధన సామగ్రి యంతయు యుండును గాని కర్మబంధము లుండవు. కారు చెడిపోయినచో వెంటనే మరియొక కారును కం పెంనీవారే సిద్ధముగా నుంచుదురు. స్వంత కారు చెడిపోయినచో దానిక్రింద పండుకొని తానే బాగు చేసికొనుట మొదలుగా సంసారము చేయవలెను.భగవంతుని యందున్న వారికి కర్మలు బంధములు లేవు. వారి దృష్టిలో మోక్షమను కోరిక కూడ లేదు గనుక వారికి మోక్ష మున్నది.*

🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

19 Jan, 00:04


🌷 *January 19,Today's Meditation*🌷
Serpent ascends as eagle. Eagle descends as serpent. Nari ascends as Nara. Nara descends as Nari. Nara and Nari ascend and descend. It is Narayana.

🌷 *జనవరి 19, నేటి ధ్యానము*🌷
🌻 అన్నమయము నుండి ఆనందమయమునకు
సర్పమారోహించు గృధ్రముగను
ఐహికవాసనా రంధ్రముల
అడ్డముగ ప్రాకు సర్పము
వివేక వైరాగ్యముల తోడ
వైనతేయుడుగ వెలయుసుమ్ము
ఆధారంబునుండి ఆనందశిఖరమగు సహస్రారమునకు
కుండలిని కులకుండమెక్కు కృష్ణచైతన్యముగను
సృష్టి ప్రళయములు సుపక్షములగ సుపర్ణుడుగను
వైనతేయుండు వైకుంఠవాహనుండు
కామాది కాద్రవేయులకు దివ్యసుధనందించి
ప్రేమాది పవిత్ర గుణములుగ పరివర్తనముజేయు
నాభి దిగువన సర్పాకృతిగ సంచరించు శుక్రంబు
భ్రుకుటి కెగువన బ్రహ్మతేజోరూప గృధ్రమగును
మరలి దక్షిణంబు జొచ్చి శుక్రానసుడియౌ సర్పమై
దాంపత్య మలరించి సత్సంతతిని బడయు
నారియె నరునిగ నాకలోక మారోహించు
నారమ్ము లెగయు నూర్ద్వముగ నావిరిగను
నరుడె నారిగ ధరణికి దిగివచ్చు, నందంబునిచ్చు
నీరమై దిగివచ్చు ఆవిరులు నడిమిలోకమునకు
నరుని అవరోహణమ్ము నారి యధిరోహణమ్మునభమునందు
నవ్యముగ నడుచు నిరతమ్ము నారాయణుడుగను....... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

18 Jan, 15:18


🎍 *Messages of Master E.K.*🎍

🥀   *Dietetics*🥀

🌹One should discover the quantity of food he can eat to assimilate. This depends upon his power to digest. It is the proper quantity that gets digested in proper time and is included in the metabolism in the shortest period without disturbing the equilibrium of the three basic tissues. (When disturbed, these three basic tissues turn against the constitution as disease-producing agencies).

"The Lords of Vibration (Rudras) roam about the earth as the Devas of the vehicles. They use our food and drink as their weapons to hit us in case of misbehaviour" says Yajur- veda....... *Master E.K.* 🌹

(From the book *Ayurveda*)

Master E.K. Spiritual and Service Mission

18 Jan, 15:17


🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼

🥀 *ఆహార‌ నియమములు*🥀

🌻 1.ఎవరైనా తన ఒంటికి ఎంత ఆహారము సరిపోతుందో చూసి దానిని బట్టి ఆహారము స్వీకరించాలి. ఇది అతని జీర్ణశక్తిపైన ఆధారపడి ఉంటుంది. తగిన పరిమాణములో తీసికొనినప్పుడే ఆహారము సరియైన సమయంలో జీర్ణమై మూడు మూలధాతువులకు ఇబ్బంది కలిగించకుండా అతి తక్కువ సమయంలో జీవప్రక్రియలోనికి స్వీకరింపబడుతుంది. (త్రిధాతువులు కనుక చెదిరితే శరీరతత్త్వమునకు వ్యతిరేకముగా పనిచేయు త్రిదోషములుగా మారతాయి.)

“సంచలన ప్రక్రియకు అధిపతులైన రుద్రులు శరీరములను నడిపించు దేవతలుగా భూమి (ద్రవ్యము) చుట్టును తిరుగుతూ ఉంటారు. మనము కనుక తగిన రీతిలో ప్రవర్తిస్తే మనము స్వీకరించిన అన్న పానీయాదులనే ఆయుధములుగా చేసి మనలను కొడతారు అని యజుర్వేదము చెపుతున్నది...... *మాస్టర్ ఇ.కె.* 🌻

( *ఆయుర్వేదము* అను గ్రంథము నుండి)

Master E.K. Spiritual and Service Mission

18 Jan, 13:43


🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌷 *స్వప్నము* 🌷

🌹కోరిక అనగా ఇది ఇట్లు జరుగవలెనని నిర్ణయించుకొనుట. భగవంతుడు సృష్టిలోని సమస్తమును నిర్ణయించి నడుపుచున్నాడు అను నమ్మకమున్నచో భక్తుడు తనకు అట్లు జరుగవలెనని నిర్ణయించుకొని దాని కొరకై దైవమును ప్రార్థించుట పొసగదు. కోరికలను కోరుట అనగా తనకేమి కావలెనో తాను నిర్ణయించుకొనుట. అట్టివాడు భక్తుడు అను పదమునకు ఎట్లు అర్హుడు అగును? దైవ నిర్ణయమునకు వ్యతిరేకముగా కోరుట దైవ నిర్ణయము ఎదుర్కొనుట అగును.

కనుక దైవము యొక్క ప్రసన్నత తనను పొందదు. కోరకున్నచో దైవ నిర్ణయము తన మనస్సున ప్రసరించి, తన నిర్ణయము దైవ నిర్ణయము అగును. దైవమునకు ప్రసన్నుడు అగుట, కాకుండుట ఉండదు.

ప్రసన్నతయే దైవ స్వరూపము. కోరినవాడు దానికి చెందకుండుట, కోరనివాడు దానికి చెందుట జరుగును. దానినే భగవంతుడు ప్రసన్నుడు అగుట, కాకుండుట అందుము............ *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-299

Master E.K. Spiritual and Service Mission

18 Jan, 13:12


https://youtube.com/shorts/3IcqyC8junc?si=HJTuHiHmy-NY6jZd

Master E.K. Spiritual and Service Mission

18 Jan, 07:24


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

18 Jan, 05:32


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Let your decisions be stable until they are integrated and synthesized into only one decision for life.🌼

Master E.K. Spiritual and Service Mission

18 Jan, 05:32


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ఏం జరిగింది అనేది నీకు సంబంధించిన విషయము కాదు.ఏం చేయాలి అనేదే నీకు సంబంధించిన విషయము.🌼

Master E.K. Spiritual and Service Mission

18 Jan, 02:33


🌷 *January 18,Today's Meditation*🌷
Man ascends from woman. Woman descends from man. The ascent and descent of man is Ardha Nari.

🌷 *జనవరి 18,నేటి ధ్యానము*🌷
🌻నవనీత కుసుమమ్ము నారీ హృదయమ్ము
నగధీర గంభీరమ్ము నరుని హృదయమ్ము
నరుని గర్భాన ధరియించు "నను" కన్నతల్లి నారి
సృష్టి ఫలకారణమౌ బీజమ్ము , పురుషుడుగ నరుడు,
క్షేత్రమ్ము ప్రకృతియగు పొలతియగును.
పురుషు సంకల్పంబు,
పొలతి సౌకుమార్యమునకు సంపూరకంబు,
కాంతుని కార్యకౌశలమునకు
కాంతలలిత లావణ్యంబు పరిపూరకంబు
మనుజు మాధుర్యమ్మె మానినియగు
మహిళ యానందంబె మనుజుడగను.
పురుషు ప్రాణమ్ము పడతికాదె
సతికాత్మయు పతియకాదె
దాంపత్య ధర్మంబు ధరియించు ధీరులె
ధ్యానపథమున దివ్యదర్శన ధన్యులౌదురు.
ప్రకృతిని దాటి పురుషుడు పరిణమించు
పురుషునుండి ప్రకృతి ప్రతిఫలించు
నరుని యీ పరివర్తనమ్మె అర్థనారి,
లోకంబులెల్ల అర్థనారి ఆలోకనమ్మెకావె.
అర్థనారీశ్వరంబె అఖిలజగమ్ము........ *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

18 Jan, 00:47


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

17 Jan, 14:15


🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌷 *స్వప్నము* 🌷

🌹పరిశీలించి గమనింపగా కోరికలు లేకుండ స్వధర్మాచరణము ఒనరించుచు భక్తియోగము అలవడిన వారికే భగవంతుడు ప్రసన్నడగునని తెలియుచున్నది.

వారి యందు ప్రసన్నడయినట్లుగా కోరికలతో ముడిపెట్టుకున్న వారికి దేవతలకైనను ప్రసన్నడు కాడనియు తెలియుచున్నది............ *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-299.

Master E.K. Spiritual and Service Mission

08 Dec, 08:15


Photo from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

08 Dec, 03:30


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

07 Dec, 23:48


🌷 *December 8,Today's Meditation*🌷
The eye of the bull twinkles in darkness. The lion grips light from darkness. The maiden gathers lotuses. The maiden makes a garland. The jewel of the serpent graced the garland. Hunter garlanded.

🌷 *డిశంబరు 8,నేటి ధ్యానము*🌷
🌻 ఆనందరూపుడౌ నంది కన్నులనటనమాడు
ఋషభ స్వరానుగుణ నటన సుందరుడు
అధోవాసనలతోడి అంధతమిసంబె వృశ్చికమ్ము.
అంధ తమసమ్ములోన అలరుగామెరయు వృషభ నేత్రమ్ము.
నాభి దిగువన లోకాలు నారీమోహనాలోకనాలు
విషయ విపినవాటమ్ములు, విపత్తిమిరవాసమ్ములు,
విజృంభించి గర్జించు సింహమ్ము విహరించినచాలు
విఫలమ్ములై వైదొలగు, విద్యుత్ సటలు విస్తరించు.
సింహవాహన, అమ్మ, శైలపుత్ర్తి
పద్మనయన, తల్లి, పద్మమ్ము లారింటి
పదిలమ్ముగ గూర్చి మాలజేయు మాత
మహేశ్వరుని మెడ నలంకరించు.
కామఫణియదె, ప్రేమ దివ్యత్వఫణితిదాల్చి
కామేశ్వరు కంఠమాలిక కదలియాడు
కమలమాలిక యౌ కుండలిని
కుదురుగా కాంతిహారమై కంఠమునుదాటు.
మానవ మనఃకాంతార సీమాంతర్వర్తులౌ
మదమోహ మత్సరమృగాదులమడియించు
మదనాంతకుండు మహితుడాది కిరాతుండు
మాలాకలితుడై మనల కృపజూడు మహేశ్వరుండు...... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

07 Dec, 13:56


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹అనగా బ్రహ్మదేవుడు ప్రయాణము చేయుట సత్యముకాదు. మనస్సుతో ప్రయాణము చేసెను.‌ పోవుచుంటిని అనుకొనెను కా‌ని పోవుట అనునది ఏమియును లేదు. తిరిగి చూచుసరికి పద్మముననే ఉండెను‌.

ఇట్లే తల్లి గర్భమున జీవుడు ప్రయాణము చేయుటకు యత్నించు‌ను. దానితో దిగువకు నాళము ఏర్పడును. అది వెన్నెముకగ రూపుగట్టును. మరల తానెందుంటినని మేల్కొనుసరికి హృదయముననే కూర్చండి ఉండును‌. వెన్నెముక విప్పారుటలో హృదయస్థానము తలనుండి వేరై దిగువకు వచ్చును. దానితో మిగిలిన ప్రజ్ఞల స్థానము కూడా లోకములుగ వెన్నెముకపైన ఏర్పడును‌.

ఇది కూడ మూడవ మాసమున జరుగును కనుక తృతీయ స్కంధమున వర్ణింపబడినది. ముఖ్యముగా రెండవ మాసమున కొద్దిగా ఆరంభించి మూడవ మాసమున బాగుగా దిగివచ్చును. కనుకనే యీ బ్రహ్మ కథ రెండవ స్కంధమున కొంచెముగను, మూడవ స్కంధమున విశదముగను వర్ణింపబడి‌‌నది........... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-280,281.

Master E.K. Spiritual and Service Mission

07 Dec, 13:13


*Remember the strange law in nature, that whatever benefits due to an individual,it will come to him without fail,but neither more nor less.The rest of the human activity, is only a psychological struggle and emotional confusion. Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

07 Dec, 13:13


*భక్తుడైనవాడు తనకే మిచ్చెనని లోకులపై నెప్పుడును కోపింపడు. ఎవ్వరి నేదియు కోరడు.పదిమంది చేరినచోట ఇందేమున్నదో అని చూడడు. చర్చలు జరుగుచోట మాటాడడు. (చర్చలలోనికి దిగినచో వ్యక్తులు భగవంతుని స్మరణనుండి పట్టుదలలకు దిగుదురు.ఎచ్చటనైన కొందరు చేసికొనుచున్న ప్రసంగములలో తప్పులుండి తనకు వాని వివరములు తెలిసినను వారు తమ చర్చలతో తృప్తి చెందుచున్నప్పుడు తలదూర్చరాదు.అనగా ఆర్తి, భక్తి తాత్పర్యములు, ఆస్తిక్యము లేనిచోట తనకు సత్యమని తెలిసినదానిని వివరించినను లెక్కచేయరు.తన వలన నుపదేశము జరుగవలసియున్నచో వారికి తనయందు ఆదరము పుట్టును).దైవము వలన లభించినదానికి తృప్తిజెందును. పలు తావులలో తన నేర్పులు చూపక తెలియనివాని వలె చూచుచుండును. ఇవి మోక్షము సాధించువారికి తప్పనిసరియైన లక్షణములు. Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

07 Dec, 13:13


https://youtube.com/shorts/uGkpW5ReTM4?si=TfImHyg9MS6Jtopu

Master E.K. Spiritual and Service Mission

07 Dec, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Nature has a judicious way of filtering things, and also it has neither compromise not sympathy towards wrong things.🌼

Master E.K. Spiritual and Service Mission

07 Dec, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 నరులందరూ నారాయణ స్వరూపములే.🌼

Master E.K. Spiritual and Service Mission

07 Dec, 02:20


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

06 Dec, 22:31


🌷 *December 7,Today's Meditation*🌷
The maiden on the back of the lion. Six maidens shower spiritual rains. The hunter levels the ground. The lion walks all around.

🌷 *డిశంబరు 7,నేటి ధ్యానము*🌷
🌻 మహిషాసుర మర్దిని మాతకు జయము
దుర్గార్తి హారిణి దుర్గకు జయము
సింహవాహన సింహాసనేశ్వరికి జయము
హృదయ వాసిని హృదయసింహాసనకు జయము
కదంబవాసిని కన్యాకుమారికి జయము
ముద్దులకొమరుని మురిపెముతో కన్నతల్లికి జయము.
మాతయొకతే మారు రూపములారు ధరియింప
ఆరుకృత్తికలె అమ్మలార్గురై
అపురూపమౌకాంతిని
స్తన్యముగ కురిపించిరి కృపతోడుగను
కార్తికేయుడయ్యె, కామరహితుడయ్యె.
ఆరు మొగముల స్వామి, ఆరు చక్రాలకు వికాసమందీయ
అరవింద మధుస్రావమానందవర్షంబుగురియు.
నేలచదును గావించు నెరవేటకాడు.
ఆధారచక్రమ్ము అమృత సిక్తంబుగాగ.
హృదయగుహ నుండి సింహమంతట వెడలి
అయిదుచక్రాల అందముగ విహరించు
అనంతప్రేమ అఖిలమ్ము నాహరించు..... *మాస్టర్ ఇ.కె.*🌻

Master E.K. Spiritual and Service Mission

06 Dec, 17:01


*Question: Is the soul with the father from the beginning?* *Ans: No question of beginning, the whole staff is there before the time of fertilisation with the father. No, no, the soul does not belong to anyone whereas the Indweller is the continuous consciousness from the time of the mineral kingdom to the time of the superhuman or the Deva kingdom. That is whom we call the Monad, that is the Indweller. And the Indweller descends into the father and exists with him for seven days and on the seventh day the fertilisation takes place. This is, what the scriptures and the esoteric schools teach us. Ofcourse, modern esoteric schools are not enough to know these things.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

06 Dec, 17:01


*ధర్మ మాచరించినను నారాయణుని స్వరూపముగా తెలిసి యాచరింపవలెను. ధనము నార్జించి వినియోగించుట కూడ అట్లే చేయవలెను. దేహాది పోషణమునకై ఇంద్రియ సుఖములను గూడ అంతర్యామిగనే గుర్తించి అనుభవింపవలెను. ఈ పురుషార్థములకు వానిలో నున్న అంతర్యామి గాక మరియొక ఆధారమెట్లు కలుగును? ఈ సత్యమును తెలిసికొను సాధన చేయుటకు కూడ నింద్రియములే కావలెను. జీవితమును జనార్దనునిగా దర్శించు సాధనకు ఇంద్రియములే ఆధారము. ఇంద్రియములను మూసి ధ్యానము చేసి లోపల జనార్దనుని దర్శింప యత్నించువాడు మరల బాహ్య ప్రపంచమున కన్నులు తెరచినంతనే లోకమంతయు దైవేతరమైన మాయగా గుణములతో విజృంభించి బంధించును. కనుక రజస్తమో గుణములు మరల, మరల జీవియందు విజృంభించుచుండును. ఈ యాపదనుండి తప్పించుటకు నింద్రియముల మార్గముననే బాహ్య ప్రపంచమును నారాయణుడుగా నుపాసింపవలెను.భాగవతునకు నింద్రియములును, మనస్సు జీవుల నుద్ధరించుటకేగాని బంధించుటకు గాదు.*

🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

06 Dec, 14:16


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹ఇట్లు తాను కొని తెచ్చుకొన్న ప్రశ్నలతో ఆశ్చర్యపడుచు బ్రహ్మదేవుడు తాను కూర్చుండి ఉండిన పద్మమున ఒక నాళము ఉన్నట్లు గుర్తించెను. దానిలోతు తెలిసికొన గోరి అతడు ఆ నాళము దిగి ప్రయాణము చేయుట ఆరంభించెను.

ఎవ్వరును లోతు ఎరుగని మహా సముద్ర జలములలో నాళమునందు మునిగి చతుర్ముఖుడు వేయి దివ్య సంవత్సరములు ప్రయాణము చేసెను. అతడు పొవుచునే ఉండెను గాని దాని అంతు తెలియలేదు. భగవంతుని మాయయే దాని లోతు. చివరికి అతడు తన ప్రయాణమును గూర్చి మరచి భయముతో వెను తిరిగి పోవ నిశ్చయించెను. మరల తిరిగి చూడగా తాను ఆ పద్మమునే కూర్చుండెను........ *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-280,281.

Master E.K. Spiritual and Service Mission

06 Dec, 13:37


https://youtube.com/shorts/cxh4THIKPaQ?si=NSVqdANcaZpeL3xE

Master E.K. Spiritual and Service Mission

06 Dec, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 It is simple to be happy, It is difficult to be simple.🌼

Master E.K. Spiritual and Service Mission

06 Dec, 05:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ఇది కావలెనని కోరుట మనస్సు నుండి తప్పింపవలెను.🌼

Master E.K. Spiritual and Service Mission

06 Dec, 02:41


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

06 Dec, 00:54


🌷 *December 6,Today's Meditation*🌷
Yonder is the lion behind bars. Ponder over the lion, it roars. The hunter tames the lion.

🌷 *డిశంబరు 6, నేటి ధ్యానము*🌷
🌻 కటకటాలవెనుక కొదమసింగమ్ము
దాగియున్నది దూరదూరమ్మున
నరుని గుండియ గుహలోననె
నారాయణుడు నెలకొని గుప్తమ్ముగ.
కరుణార్ర్ధముగాని గుండెయె
కంబమై జడముగ నిలిచె.
కాలమోహితమై కదలికలేదయ్యె
తనలోని 'తన' నె సింహమ్ముగ
తలచి తలవంచి మ్రొక్కంగ
తనడెందముకంబమై దిగ్గురనగ
నరునిలోనికి నారాయణుడవతరించె.
నరసింహుడుగ నాకలోకమ్మునుండి
నఖతేజోదీధితులునలుదిశలనిండె.
ప్రణవ హంసయె సింహమై గర్జించె.
మోహమత్సరమ్ములు మరలిపారిపోయె.
మడిసె మానవు మదాంధ దైత్యసింధురంబు
మాయానృసింహునఖక్షతి బంధురంబు
సాధుసుందర సింహంబుసటల
సహస్ర విద్యుతులుదయించి విస్తరించె.
సింహమును వేటాడు సాధకుండు
శరణాగతి శరమును సంధించు సరణి ప్రహ్లాదమందె..... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

05 Dec, 14:04


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹తనకు అప్రయత్నముగ ప్రత్యక్షమయిన జ్ఞానముతోనే బ్రహ్మ యీ ప్రశ్నలను మలచుకొని అజ్ఞానమునబడెను: “ఈ జలమున ఈ కమలము పుట్టినది” అని తెలియును. ఈ తెలిసిన జ్ఞానమునే ఉపయోగించి బ్రహ్మ “ఈ జలమున ఈ పద్మము ఎట్లు పుట్టినది?” అని ప్రశ్నగా మార్చుకొనెను. అట్లే “నేను ఈ పద్మము యొక్క పీఠమున ఉంటిని” అని తెలిసిన విషయమును “నేను పద్మము యొక్క పీఠమున నేను ఎట్లుంటిని?” అను ప్రశ్నగా మార్చుకొనెను. “నేనుంటిని” అని తెలియజేయుచుండగా “నా పేరేమి?” అను ప్రశ్నగా మార్చుకొనెను. “నేనిట్లు పుట్టి ఉండుట సత్యము” అని తెలిసియు “నేనిట్లు పుట్టి ఉండుటకు కారణమేమి?” అను ప్రశ్నగా మార్చుకొనెను.

భగవంతుడే కార్యము, కారణము, తనలో కరిగిపోయినవాడు కనుక వాడిచ్చిన దర్శనము సత్యము గాని దానిని గూర్చిన ప్రశ్న సత్యము కాదు. కార్య కారణములను వేరుగా చేసి చూచుకొనుట వలన బ్రహ్మకు తెలియని స్థితి ఏర్పడినది. ఇదియే అజ్ఞానము. భగవంతుని స్మరణతో ఇది తొలగిపోవును. బ్రహ్మ సృష్టిలోన ఉన్న మనకు అందరకును కూడ జీవితము ఇట్లే అజ్ఞానబంధము ఏర్పడి భగవద్భక్తితో తొలగిపోవును. ఇది బ్రహ్మ దగ్గర నుండి మన దాక అలవాటుగా వచ్చుచున్నది. భగవద్భక్తి కుదురులోపున జీవులు గూడ బ్రహ్మవలెనే విచారము పొందుచుందురు. బ్రహ్మ విద్యను అభ్యసించి భగవద్భక్తి కుదిరినచో ఈ ప్రచారము తొలగును. దీనినే సంసార బంధము కలుగుట, దాని నుండి ముక్తి కలుగుట అందురు.

ప్రతి జీవియు తల్లి గర్భమున పడినపుడు పద్మములోని బ్రహ్మ వలెనే అజ్ఞానము అను పొర క్రమ్ముకొనును. పూర్వ జన్మము అందలి కర్మవాసనలు బలీయముగ ఉన్నచో బ్రహ్మకు తీరినట్లు సందేశము వెంటనే తీరక జన్మజన్మల యందు దుఃఖము కలిగించును. ఈ వాసనలు జీవికి సంక్రమించుట తల్లి గర్భమున మూడవ మాసమున జరుగును కనుక ఈ వృత్తాంతము తృతీయస్కంధమున వర్ణింపబడినది.......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-278,279.

Master E.K. Spiritual and Service Mission

05 Dec, 06:26


శ్రీశైలంలో‌ మన ఆ‌శ్రమంలో ‌నిర్వహంపబడతున్న వేద పాఠశాల విద్యార్దులు

Master E.K. Spiritual and Service Mission

05 Dec, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 To dissolve blockages it is proposed to live together with others.🌼

Master E.K. Spiritual and Service Mission

05 Dec, 05:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ప్రకృతికి మనల్ని శిక్షిద్దామనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు.మనం చేసినదానినిబట్టి శిక్షగా పరిణమిస్తుంది.🌼

Master E.K. Spiritual and Service Mission

05 Dec, 02:29


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

05 Dec, 00:27


🌷 *December 5,Today's Meditation*🌷
Three times seven miles from the goal. The goal is the pole. Pole on the head. Bear on the brow. Dog behind the back. The hunter walks.

🌷 *డిశంబరు 5, నేటి ధ్యానము*🌷
🌻 ప్రజ్ఞ భౌతికమ్మును దాటి
పరమ లక్ష్యము చేరుపథము
పదము లేడును మూడు స్థాయిలలోన,
పరమపదమును చేర్చు,
మూడు ఏడులలోన ముచ్చటగను.
ధ్యేయమది యెయ్యది ధ్రువముకాదె,
దివికి, భువికి నడుమనిలుచు
పురుషుని శిరమె ధ్రువము,
ఆకాశదేహుడౌ నతడె
అరుగుదెంచును నరుడుగ ఆటగను.
నరుని శిరమున నెలకొను ధ్రువము.
నారాయణుని పదకమలరజమె.
దీప్తినందును ధ్రువముగాగ.
ధ్రువము నెలకొన్న నరుని శిరమున
దివ్యమౌ దీధితులతోడ
సప్తలోకముల పైని సహస్రదళ పద్మమునందు
సప్తర్షుల సమిష్టి తేజమె
సందీపించును ఋక్షమై
భ్రుకుటి నడుమను దుర్నిరీక్షమై
వెన్ను వెనుకను వెలుగును శునకము
వేటకై వెడలు నరుడు విహరించు
విపిన వీథిలోన ధ్రువ శిఖరమ్మునందు
ప్రణవమ్మువిల్లుగా సంధించు శరము
పరమ గురుని ప్రసాదమ్మె యగునుగాదె
పరమశివుడె లక్ష్యంబుగ పరితపింప
పాశుపత వర లబ్ధి ప్రసాదమై పడయుగాదె...... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

04 Dec, 14:10


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹అపుడు బ్రహ్మ ఇట్లని వితర్కించుకొనెను: ఈ జలమున ఈ పద్మము ఎట్లు మొలచుకొని వచ్చినది? ఈ పద్మమునందలి పీఠమున నేను ఒంటరిగా ఎట్లుంటి‌ని?

మొదలు నా పేరెమి? నేనిట్లు జన్మించుటకు కారణమేమి? బుద్ధిని ఉపయోగించి ఎంతగా తర్కించుకొన్నను నేనేమియు తెలియజాలకున్నాను. అని తలచి బ్రహ్మ ఆశ్చర్యపడెను........... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-278,279..

Master E.K. Spiritual and Service Mission

04 Dec, 14:06


🌹 *మాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ* 🌹
మన సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, వివరములు
మాస్టర్ గారి సూక్తులు, సందేశములు ఈ app/గ్రూప్ లో వస్తాయి ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వచ్చు.

Download the latest app from playstore
The new *Master App* provides updates on programs organized by *Master EK Spiritual & Service mission centers* and Messages of Master E.K.

https://play.google.com/store/apps/details?id=com.master.masterapp&hl=en

*WhatsApp Channel*
https://whatsapp.com/channel/0029VaAlK0MKWEKqxkJLYk32

*Telegram Channel*

https://t.me/masterekmission2023

🙏వాసుదేవ🙏

Master E.K. Spiritual and Service Mission

04 Dec, 13:04


https://youtube.com/shorts/GGEarg72NpM?si=yOPiKjtvW01Jq8B5

Master E.K. Spiritual and Service Mission

04 Dec, 13:01


*Question: What about early birth, as a dependant also on the cycle of Moon ?*

*Ans: They belong to the abnormalities, early births and delayed births. For example, in some cases there are births that occur after 12 months also and some times births take place in seventh month or eighth month. They are abnormalities and the time of fertilisation will clearly show that it will be an abnormal birth. That branch of science is developed by Varaha Mihira as a separate section of astrology. So, the calculation is different in those cases. This is about the general rule and not the exception.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

04 Dec, 13:01


*మోక్షము కోరిన వారికి కోరిక లుండరాదని వేదాంతులు కోపింతురు. కోరిక లుండుట, లేకుండుట, అంతర్యామి సంకల్పమే గాని వేదాంతుల ఆజ్ఞలు చెల్లవు. ఆ వేదాంతుల కట్టి యభిప్రాయము లుండవచ్చును. అవి కూడ అంతర్యామి కలిగించినవే గనుక నుండవచ్చును. మిగిలినవారు కూడ ఈ అభిప్రాయములనే కలిగి యుండవలె ననుట దైవ సంకల్పము కాదని జీవుల హృదయములను పరిశీలించినచో తెలియుచున్నది. జీవులకు కోరికలు పుట్టుచున్నవి గనుక అవియు దైవ లీలా విలాసములే యని తెలిసి బాధపడకుండవలెను. హృదయములందు జీవుల ప్రజ్ఞగా నుండుటకు దేవునకు అవమానము లేనప్పుడు జీవులకు జ్ఞానాజ్ఞాన మార్గములను గూర్చి పట్టుదల ఏల?*

*ఎవనికి వాడు తన హృదయమునందున్న వాడు అంతర్యామి యని ధ్యానించినచో కోరికలు కలుగుట, కలుగకుండుట అంతర్యామి చేతనే నిర్ణయింపబడును. ఈ భావము నిరంతరము జ్ఞప్తి యందున్నచో చాలును. దీనికన్న మోక్షమని వేరుగా పెనగులాడినను ఎచ్చటను లభింపదు. తనకు కావలసినవన్నియు యజమానియే సమకూర్చి పెట్టుచున్నపుడు సేవకుడు తన మేలును గూర్చి వేరుగా కొన్ని విలువైన వస్తువులు దాచుకొనుట యెట్టిదో మోక్షమును గూర్చి జీవుడు వేరుగా నభిప్రాయ పడుట గూడ నట్టిదే.*

🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

04 Dec, 06:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 " Don't have any opinions about any one; you may remember persons but you are not expected to remember whether they are good or bad."🌼

Master E.K. Spiritual and Service Mission

04 Dec, 06:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ప్యూరిఫికేషన్, రెక్టిఫికేషన్ జరగాలంటే సేవయే మార్గం.🌼

Master E.K. Spiritual and Service Mission

03 Dec, 23:45


🌷 *December 4,Today's Meditation*🌷
The dog is bound to the pole. The bear goes round the pole. The pole is the pole star. The dog is Sirius star. The bear is of seven stars.

🌷 *డిశంబరు 4, నేటి ధ్యానము*🌷
🌻 ధ్రువమునకు బంధితమౌ శునకమ్ము
ధ్రువమును పరిభ్రమించును ఋక్షంబును
ధ్రువతారకయె ధ్రువముగ నెలకొను
సరమశ్వానమె "సిరియస్" తారకగాదె.
సప్తతారకామండలంబె సరిగ ఋక్షమయగునుగాదె...... *మాస్టర్ ఇ.కె.*🌻

Master E.K. Spiritual and Service Mission

03 Dec, 14:17


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

అతడు ఆ పద్మము యొక్క బొడ్డుపై నిలిచి కన్నులు తెరచెను. లోకములను చూచెను. దిక్కులను, ఆకాశమును తన నాలుగు మొగములతో కలయ చూచెను. (అతడు కన్నులు తెరచుటయే లోకములను చూచుట, దిక్కులను, ఆకాశమును చూచుట. అతడు తన నాలుగు మొగములను కూడ చూచెను. ఇచ్చట చూచుట అనగా ఏర్పడుట అని అర్థము)

అంతులేని ప్రళయ మహాజలము కనుపించెను‌. గాలికి అలలు కదలుచుండును. అందు అలలపై తేలుచు పద్మము ఉండెను. దాని బొడ్డున తాను ఉండెను. ఇట్లు తానున్న లోకముల తత్త్వము కనిపించెను కాని అర్థము కాలేదు. మనసున చాల కాలము విచారము పొందెను.

(ఉన్నది ఉన్నట్లు కనిపించెను గాని దానిని అర్థము చేసికొనుటకు యత్నించెను. కనుక అర్థము కాలేదు. తర్కము ఆరంభమయినది. దానితో లోకతత్వము తెలియని, అంతుపట్టని స్థితి సంభవించినది. ఈ తెలియని స్థితి వలన బ్రహ్మకు చాల విచారము కలిగెను. గోచరించినది స్వీకరింపక దానిని గూర్చి ఆలోచించి అభిప్రాయములు ఏర్పరచుకొనుట వలన స్వస్వరూపము మాటుపడి అజ్ఞానమను పొర క్రమ్మును.).......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-276,277.

Master E.K. Spiritual and Service Mission

03 Dec, 13:21


*Question: How do you explain the evolution of the 12 tone musical scale, and do you regard it as a good evolution?* *Ans: It is a legitimate expansion from the seven scales of music. It is only the potencies of numbers that produce the vibrations of sound. If we know how to make a spiritual approach to the numbers one, two, three as the first three utterances of cosmic creation and then the four making the seven. We find in the network of the Solar System, the three and four producing the seven rays of the spectrum. And the three into four is producing the scale of 12 as the 12 months of the Solar year. So, this is the basis of the12 musical scale. You find a consistent keyboard of the whole thing. Much of these things are explained in the Secret Doctrine of Madame Blavatsky. But the volume is very big.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

03 Dec, 13:21


*ప్రతి మానవుడును గృహస్థాశ్రమము స్వీకరించి సర్వసుఖముల ననుభవింపవచ్చును. అనుభవించుకాలమున గూడ వానియందు 'శ్రీహరి' అంతర్యామిత్వమున్నదని మరువరాదు. ఒక వయస్సు దాటిన వెనుక వైరాగ్యము పొందవలెను. భార్య బిడ్డలు కూడ తన వలెనే తెలివి గలవారని నమ్మకము గలిగి వారికి స్వాతంత్య్రమిచ్చి తాను తప్పుకొనవలెను. ఇట్లు వయస్సునుబట్టి గృహస్థ, వానప్రస్థ స్థితులలో మెలగుట నేర్చుట లక్షల సంవత్సరముల తరబడి మానవుడు సజ్జను డగుట కేర్పడిన విద్య.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

03 Dec, 13:21


https://youtube.com/shorts/QOxkHZkjetQ?si=mkA-IkgR0g3Ijg3R

Master E.K. Spiritual and Service Mission

03 Dec, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 అతిధిని పూజించుట, అగ్నిహోత్రుని పూజించుటయే.🌼

Master E.K. Spiritual and Service Mission

03 Dec, 05:30


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Mistake means committing a mistake in thought or action🌼

Master E.K. Spiritual and Service Mission

01 Dec, 23:36


🌷 *December 2,Today's Meditation*🌷
Seven chakras link up seven stars.  Seven stars  bear the Polar bear. The  bear is  in  the  cave. The dog is  at the  entrance.  The dog  star guards the infernal gate.  The three–headed hound.  The hound’s tail  is  the  serpent.  The heads bark. The tail stings.

🌷 *డిశంబరు 2,నేటి ధ్యానము*🌷
🌻 సప్తచక్రములను సంధించు సప్త తారకలను,
సప్త ఋక్షములును వెలుగొందు,
ధ్రువ ఋక్షపు రూపమునను.
ఋక్షమున కావాసంబు ఆకాశ గుహాంతరాళంబు.
గుహ ప్రవేశమున కావలి శునకమొకటి.
శునకతారకయిది పాతాళద్వార సంరక్షకమ్ము .
మృగయా వినోద నాదమౌ శునకమ్ము ,
మూడు తలల మూర్తియౌ ముచ్చటగను.
కావలి శ్వానపుచ్ఛమె కాలసర్పమాయె
శునక శిరములు మొరగును భైరవ సరణిగను
శునక పుచ్ఛము కరచును కాలసర్పపు కాటుతోను........ *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

01 Dec, 14:47


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹ఆ రజోగుణము వలన దేవుని నాభియందు తామర పువ్వు నాళమొకటి ఉద్భవించెను. అందు తమ్మిమొగ్గ పుట్టెను. కర్మచే బోధింపడిన కాలమున అది తన తేజస్సుతో వృద్ధి చెందెను. సూర్యుని రూపముగా గమనముగ ఈ పద్మము వికసించెను. అదియే సర్వలోకములకును ఆధారమయిన స్థితి. అందుండి సర్వగుణముల వెలుగు రూపమున పుట్టినవి.

అట్టి పద్మమునందు దేవుడు తన కళలతో కూడిన అంశమున నిలిపెను. దాని వలన చతుర్ముఖ బ్రహ్మ పుట్టెను. అతడు వేదమయుడు. శ్రేష్ఠమయిన గుణములు గలవాడు. ఆత్మయే తన జన్మస్థానముగ గలవాడు.......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-275.

Master E.K. Spiritual and Service Mission

01 Dec, 06:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Just observe what happens in your conversation.🌼

Master E.K. Spiritual and Service Mission

01 Dec, 06:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ప్రతికర్తవ్యమును భగవత్సేవగా నిర్వర్తించు వారిపై బరువు బాధ్యతలు పనిచేయవు.🌼

Master E.K. Spiritual and Service Mission

01 Dec, 03:53


competition20241115052815798.pdf

Master E.K. Spiritual and Service Mission

01 Dec, 03:10


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

01 Dec, 01:31


Photo from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

30 Nov, 22:27


🌷 *December 1,Today's Meditation*🌷
The ascent of man is through the eagle. The descent of man is through the serpent. The serpent is the coiled coil of time. The tongues of the serpent are the wings of the eagle.

🌷 *డిశంబరు 1,నేటి ధ్యానము*🌷
🌻 నరుడు నారాయణుడుగ నడయాడు,
నందనమ్మౌ నాకమ్ము నారోహింప,
గోవిందు గమనమౌ గరుడుడెగతియకాదె.
హరిపదములౌ శ్వాసలు పక్షములగు, ప్రాణపక్షియగుట
స్వర్గమార్గము నుండి సరగున దిగివచ్చు నరునకు
సర్పమ్మె సరణిసూపు సుతలాది బిలములకును,
కుండలీకృత కుండలమౌ కాలమ్మె కాల సర్పము.
కాలసర్పపు కరాళజిహ్వలె
ఖగరాజు కదలించు కలిత పక్షములు........ *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

30 Nov, 14:34


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹ఈ‌ విధముగా యోగమాయకు కూడ చేతికి అందనంత దూరము గలవాడై దేవుడు వేయి యుగముల కాలము ఇట్లు సృష్టిని మింగి ఒకటియై ఉండెను. అటుపైన మరల తనలో కాలము, శక్తి రూపొందినవి. సృష్టి చేయవలెనను సంకల్పము కలిగెను. తమ గర్భమున దాచిన లోకముల సమూహములను సృష్టించుటకు సాధనమయిన ఒక సూక్ష్మ గుణమును మనసున సంకల్పించెను. అదియే రజోగుణము. అది కాలమును అనుసరించి పుట్టినది.

(వేయి యుగముల కాలము జరుగుటలో ప్రళయము మరల రజోగుణమును వెలువరించెను. అనగా కాలము ప్రభావమున ప్రళయము తరువాత భగవంతుడు రజోగుణము మనసున కల్పించె‌ను.)......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-273,274.

Master E.K. Spiritual and Service Mission

30 Nov, 13:03


https://youtube.com/shorts/ji9Rujd2ZpA?si=pr2YqXcjeBt-uEdz

Master E.K. Spiritual and Service Mission

30 Nov, 13:02


*భగవంతుడు సజ్జనులకు మోక్షమిచ్చి నీచుల నణగద్రొక్కడు. వాని స్మరణవలన నీచులు సజ్జను లగుదురు.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

30 Nov, 13:02


*Question: About the colour red?*

*Ans: The present stage of the evolution of humanity is not in a stage to make a good use of the red colour. That's why let us avoid this colour from discussion. There comes a time, when the Ashram of the Masters which is already existing in the planet Mars which is described by Master Djwhal Khul, has made a spiritual contact with the beings of the earth. Then only the red colour can be utilized in the positive way. Now it is not at all possible.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

30 Nov, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Shape is not beauty, but our response to a shape is beauty.🌼

Master E.K. Spiritual and Service Mission

30 Nov, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ఈపని చేద్దామను సంకల్పమును వీడి తిన్నగా క్రియాచరణలోనికి నీవు దిగవలెను.🌼

Master E.K. Spiritual and Service Mission

30 Nov, 02:16


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

30 Nov, 00:07


🌷 *November 30,Today's Meditation*🌷
Man ascends from woman. Woman descends from man. The ascent and descent of man is Ardha Nari.

🌷 *నవంబరు 30, నేటి ధ్యానము*🌷
🌻నవనీత కుసుమమ్ము నారీ హృదయమ్ము
నగధీర గంభీరమ్ము నరుని హృదయమ్ము
నరుని గర్భాన ధరియించు "నను" కన్నతల్లి నారి
సృష్టి ఫలకారణమౌ బీజమ్ము, పురుషుడుగ నరుడు,
క్షేత్రమ్ము ప్రకృతియగు పొలతియగును.
పురుషు సంకల్పంబు,
పొలతి సౌకుమార్యమునకు సంపూరకంబు,
కాంతుని కార్యకౌశలమునకు
కాంతలలిత లావణ్యంబు పరిపూరకంబు
మనుజు మాధుర్యమ్మె మానినియగు
మహిళ యానందంబె మనుజుడగను.
పురుషు ప్రాణమ్ము పడతికాదె
సతికాత్మయు పతియకాదె
దాంపత్య ధర్మంబు ధరియించు ధీరులె
ధ్యానపథమున దివ్యదర్శన ధన్యులౌదురు.
ప్రకృతిని దాటి పురుషుడు పరిణమించు
పురుషునుండి ప్రకృతి ప్రతిఫలించు
నరుని యీ పరివర్తనమ్మె అర్థనారి,
లోకంబులెల్ల అర్థనారి ఆలోకనమ్మెకావె.
అర్థనారీశ్వరంబె అఖిలజగమ్ము........ *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

29 Nov, 13:56


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹అన్నియు కరిగిపోయిన వెనుక నిలిచిన ఒకే స్థితి జలమయముగ వర్ణింపబడినది. సముద్రజలములలో ఉప్పు కరిగి ఉన్నట్లు దేవుని యందు సృష్టి ఏకమై ఉండెను. ఎండుకట్టె రగిలించినచో మంటరూపమున అగ్ని వెలువడును. అంతకు ముందు అగ్ని కట్టెలో లీనమై ఉండును. మంటను వెలువరింపగల శక్తిగా ఉండును. అది కట్టెలోని అణువుల యందు ఇమిడి ఉండును.

నిద్రలో మన దేహాదులు మనకు ఉండవు. అట్లే సృష్టి అంతయు దేవుని యందు లీనమై ఉండును‌. చీకటిలో సముద్రము నురుగలు వెలుగుచు కనిపించుచుండును. అట్లే ప్రళయమున దేవునిలో లీనమయిన సృష్టి లక్షణములు అచ్చటచ్చ‌ట వెలుగులుగ మిణుకుముచుండును. సముద్రము నీటికి నురగ యెట్టిదో దేవుని యందు సృష్టి అట్టిదే. అన్నియు తనయందు కరగిపోయిన వెనుక తానొక్కడే ఉండును కనుక అద్వితీయుడుగ భగవంతుడు చెప్పబడెను. రాబోవు సృష్టికి గల అభిలాష కూడ వాని యందు అదృశ్యమై ఉన్నది. కనుక అభిలాష కలవాడైనను దేవుడు కోరికలు లేనివాడు........... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-272.

Master E.K. Spiritual and Service Mission

29 Nov, 12:14


*విష్ణుమూర్తి ఆయుధములరేఖ లనగా శంఖరేఖ, చక్రరేఖ, ఖడ్గరేఖ, చాపరేఖ. దైవకార్యమును తీర్చుటకు భూమికి దిగివచ్చు వారందరును విష్ణుని అంశతో పుట్టినవారు. అప్రయత్నముగా వారి యధికారము చెల్లుట, వారు ధర్మమునకు రక్షకులుగా నంగీకరింపబడుట జరుగుచుండును. అట్టివారి హస్తములలో, పాదములలో ఈ రేఖలు తప్పక యుండునని అవతారమూర్తుల చరిత్రములు తెల్పుచున్నవి. విష్ణువు ధరించిన ఆయుధముల వర్ణన గూడ మహాపురుషుల దేహమందలి దివ్యముద్రలు వారి ప్రవర్తనమందలి దివ్యలక్షణములుగనే వర్ణింపబడినవి గాని కేవలము లోహమయములో, దారుమయములో అగు భౌతికాయుధములుగా వర్ణింపబడుట జరుగలేదు. విష్ణుని పంచాయుధ స్తోత్రమునందు గల సంప్రదాయమునగూడ నాయుధములు తేజోమయ చైతన్యమూర్తులుగను, కల్యాణగుణ స్వరూపులగు అధిదేవతలుగ మాత్రమే వర్ణింపబడెను. సంకల్ప మాత్రముచే మహిమాన్విత పురుషుల మనస్సులనుండి ఇవి సద్గుణములుగా వెలువడి ప్రజాసామాన్యముపై ప్రభుత్వము నెరపుటయే ఈ వర్ణనలలో గమనింపదగినది. “అవియే నారాయణునకు భూషణములుగా, అవియే యాయుధములుగా, అవియే దేహమున దివ్యచిహ్నలుగా ఈ మహాశక్తులు నారాయణునిచే ధరింపబడుచున్నవి” అని సాధకుడు వానిని తనయందు ధ్యానముచేయుట నారాయణ కవచమున నిర్దేశింపబడినది.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

29 Nov, 12:14


*Question: About white and very dark red ?*

*Ans: Whether dark or light, red should not be chosen.And about white, It is a very deceiving colour because what we feel as white to the eyes, is pure colourless blue to the mind. What we call blue to the mind, is white to the eye. What is blue to the eye, is white to the mind. Therefore, it is a most deceiving aspect until we reach a certain stage in spiritual practice. You can understand it by the fact, how the sky appears blue to the eye. See there is nothing there to appear to the eye, but still it appears blue. It is the reaction of the eye towards space. That makes us see blue. So, according to the ancient scriptures, all the seven colours are synthesized into the white ray at a certain stage of biological perception, and after a certain stage the milk white colour and all the six other colours can be synthesized into the blue colour. So, what we call blue and what we call white are substitutes and interchangeables to the mind and the eye.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

29 Nov, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Your conversation or your smile or your good humour or your funny speech will be the channel to heal everyone around you.🌼

Master E.K. Spiritual and Service Mission

29 Nov, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 నిజముగా భయము లేనివాడనగా దైవము మీద, ధర్మము మీద నమ్మకము కలవాడు.🌼

Master E.K. Spiritual and Service Mission

29 Nov, 03:08


🌹🌞 *Master E K Spiritual & Service Mission*🌞🌹
Our mission address list 2025 will be edited & corrected.Any changes in centre's address or phone number should be informed to *Dr.M.K.S.S Prasad* by SMS to phone no *9676462370* before 5 PM 30-11-2024

Master E.K. Spiritual and Service Mission

29 Nov, 01:56


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

28 Nov, 23:22


🌷 *November 29, Today's Meditation*🌷
Serpent ascends as eagle.  Eagle descends as serpent. Nari ascends  as Nara. Nara  descends as Nari.  Nara  and  Nari  ascend  and  descend.  It  is Narayana.

🌷 *నవంబరు 29,  నేటి ధ్యానము*🌷
🌻 అన్నమయము నుండి ఆనందమయమునకు
సర్పమారోహించు గృధ్రముగను
ఐహికవాసనా రంధ్రముల
అడ్డముగ ప్రాకు సర్పము
వివేక వైరాగ్యముల తోడ
వైనతేయుడుగ వెలయుసుమ్ము
ఆధారంబునుండి ఆనందశిఖరమగు సహస్రారమునకు
కుండలిని కులకుండమెక్కు కృష్ణచైతన్యముగను
సృష్టి ప్రళయములు సుపక్షములగ సుపర్ణుడుగను
వైనతేయుండు వైకుంఠవాహనుండు
కామాది కాద్రవేయులకు దివ్యసుధనందించి
ప్రేమాది పవిత్ర గుణములుగ పరివర్తనముజేయు
నాభి దిగువన సర్పాకృతిగ సంచరించు శుక్రంబు
భ్రుకుటి కెగువన బ్రహ్మతేజోరూప గృధ్రమగును
మరలి దక్షిణంబు జొచ్చి శుక్రానసుడియౌ సర్పమై
దాంపత్య మలరించి సత్సంతతిని బడయు
నారియె నరునిగ నాకలోక మారోహించు
నారమ్ము  లెగయు నూర్థ్వముగ నావిరిగను
నరుడె నారిగ ధరణికి దిగివచ్చు , నందంబునిచ్చు
నీరమై దిగివచ్చు ఆవిరులు నడిమిలోకమునకు
నరుని అవరోహణమ్ము నారి యధిరోహణమ్మునభమునందు
నవ్యముగ నడుచు నిరతమ్ము నారాయణుడుగను.... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

28 Nov, 14:46


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹ఓ విదురా! పూర్వము ప్రళయ కాలమున ఈ సృష్టి అంతయు భగవంతునిలో కరిగిపోయి, ఒకే జలమయమై ఉన్నది. దానిలో ఇమిడి ఉన్న భగవంతుడు చేతనముతో కూడిన వాడై నిద్ర వంటి స్థితిని అభినయించుచుండెను. కట్టెలో కనిపించక దాగి ఉన్న అగ్ని వలె అతడు అందు లీనమై ఉండెను. కన్నులు మూసికొని ధ్యాన స్వరూపమున ఉండెను.

అమృతమయమయిన ఆ సముద్రము నందలి నురగలవంటి శరీరకాంతులు మిణుక్కుమనుచుండెను. వేయి శిరస్సుల యందున్న రత్నముల కాంతులతో స్నేహము చేయుచున్నట్లుగా ఆది శేషుని పడగలు వెలుగుచుండెను. అతడు ఆ శేషుని తల్పమున పవళించి ఉండి తన తత్త్వము వెలిగించుచు మరియొకటి అనున‌ది లేని స్థితిలో ఆనందస్వరూపుడై నిలిచి ఉండెను. అభిలాష కలిగి ఉండియు కోరికలు లేని రూపమున ఉండెను........... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-272

Master E.K. Spiritual and Service Mission

28 Nov, 13:34


https://youtu.be/lblkNWBm8rk?si=3NG28U9lX3-RLvq-

Master E.K. Spiritual and Service Mission

28 Nov, 13:34


ఖమ్మం గురుపూజలు, మూడవ రోజు(25-11-24) ప్రవచనము👆

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 15:15


🌹🌞 *Master E K Spiritual & Service Mission*🌞🌹
Our mission address list 2025 will be edited & corrected.Any changes in centre's address or phone number should be informed to *Dr.M.K.S.S Prasad* by SMS to phone no *9676462370* before 5 PM 30-11-2024

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 14:04


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹దేవుడు తనను తాను లోపల చూచుకొనుచు కన్నులు మూసికొనెను. అతని కన్నులనగా వెలుపలకు ప్రకాశించు కిరణములు! వానిని తనలో ఇముడ్చుకొనెను. ఇట్లు కొంచెము కాలము జరిగినది.

ఇంతలో వాని బుద్ధికి సనందనుడు మున్నగు నలుగురు కుమారులు స్మరణకు వచ్చిరి. వీరు సృష్టి యందు చతుర్మఖ బ్రహ్మకుమారులు. కాని యిప్పుడు సృష్టితోపాటు బ్రహ్మ కూడ కరిగిపోయెను. కనుక వారు నలుగురును తన బుద్ధి యందే స్మరణకు వచ్చిరి. వారే చతుర్ముఖుని నాలుగు తలలు. “వీరు నా మనస్సు‌న పుట్టినవారే. నా అస్తిత్వమే. వీరు మొదట సృష్టిలో నా యందు స్ఫురింతురు” అని గీతలో కృష్ణుడు చెప్పెను........... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-265.

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 13:11


*Strangely, there is a law in spiritualism that whenever we feel over-confident or a little bit over-enthusiastic of something, immediately the situation warns us not to be so, as long as Nature wants us to become better. If we do not like to face such warnings, Nature gradually begins to keep quiet for the time being, because the fellow is not ready to receive the warnings. That is what happens when we develop faith in Nature, God and spiritualism. As long as we prefer to live without any faith, we are seemingly safe, since we are not asked to face such situations. But of course, such a safety lands us into crisis always, whereas the series of warnings lead us away from crisis day by day. This is one among the strange laws of occultism. It unfailingly affects us and there is no exception to it.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 13:11


*ఒకే పాత్రయందు పోసిన జలమొకటిగనే యుండును. రెండు జలములుండుట సాధ్యము కాదు. కాని ఆ జలమే మంచుగడ్డలుగా గట్టినపుడు ఒకే పాత్రయందు రెండుగాని ఎక్కువగాని మంచుగడ్డ లుండుట సాధ్యము. అవి ఒకదాని నుండి యొకటి వేరుగా నుండును. ఒకదాని స్పర్శ యింకొకదానికి కలుగును. ఒకదానితో నింకొకదానిని కొట్టినచో బ్రద్దలగుట, శబ్దము వచ్చుట మున్నగు క్రొత్త చేష్టలు పుట్టుచున్నవి. నీరు మంచుగడ్డలుగా స్థితిభేదము చెందుటయే దీనికి కారణము. అట్టి స్థితిభేదముతోనే అంతర్యామియందు పంచభూతాదులు కట్టుకొని వేరు వేరు దేహము లేర్పడును. అంతర్యామి తానను తెలివి మాటుపడి దేహము తానను భ్రాంతి కలుగును. ఆచరింపబడిన పనుల వలన సుఖ దుఃఖములను ఫలితము లేర్పడును. ఇదియే కర్మబంధము.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 13:11


https://youtu.be/d-TaXCeVYI0?si=LgnbUi1m-vZCn90h

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 12:59


2025 Gnt Gurupoojalu Program Sheet(English).pdf

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 12:25


2025 Gnt Gurupoojalu Program Sheet.pdf

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 06:48


శ్రీశైలం ‌మన ఆశ్రమంలో నిర్వహించుచున్న వేదపాఠశాల విద్యార్థులు

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 06:32


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Yoga is neutralising the reaction to the environment.🌼

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 06:32


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 మహాకార్యములు మనలను నడిపించునుగాని మనమనుకొన్నట్లు జరుగవు.🌼

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 00:57


2025 Gnt Gurupoojalu(Eng).pdf

Master E.K. Spiritual and Service Mission

20 Nov, 00:57


2025 Gnt Gurupoojalu(Revised).pdf

Master E.K. Spiritual and Service Mission

19 Nov, 23:14


🌷 *November 20, Today's Meditation*🌷
Man is bound in Chakra. Chakra breathes out lotus. Lotus delivers serpent. Serpent is Kundalini. Lotus is Padma. Chakra is the wheel. The wheel rotates.

🌷 *నవంబరు 20, నేటి ధ్యానము*🌷
🌻 చక్ర బంధితుండు మానవుండు,
ప్రజ్ఞ విప్పారి చక్రముల చొచ్చుకొని దాటుదాక
చిక్కుకొని యుండు చక్రములలోన
చక్రంబు నిశ్వసించు నీరజమును
పరిమితత్వముదాటి ప్రజ్ఞ ప్రేమతోడ
పరమానందకోశాన పరగుచుండ
చక్రములు విప్పారు పద్మములుగ
చిక్కులు విడి పోవచక్కగను
పద్మంబు ప్రసవించు సర్పంబునె
కుండల వలయిత సర్పమననేమి? సరిగ కుండలినియె.
పద్మములు విప్పార పరమ పావనముగను
కుండలిని ఎగబ్రాకు కులకుండలమున
ప్రజ్ఞ పరమ శిఖరముజేరి
పరమానందమున మునుగు
మరలడెందంబు దాకనుదిగియువచ్చి
ప్రేమానుభూతిని పంచిపెట్టును ప్రజలకెల్ల
చక్రంబు జీవనరథ చక్రమై
చర్వణం బొనరించు చక్కగాను
క్రింది చక్రములెల్ల అందుకొను ధారగా సుధాసారంబు...... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

19 Nov, 16:18


18 .12.2024 మధ్యాహ్నం మూడున్నర గంటలకు Master E.K. ఆధ్యాత్మిక సేవా సంస్థ చైర్మన్ శ్రీ అనంత కృష్ణ గారి ఆధ్వర్యంలో గురుపూజల ఎస్టిమేట్ బాడీమీటింగ్ ఏడవ లైను పట్టాభి సీతారామ నగర్ నగరాలు గుంటూరు ఓ.రామచంద్ర రావు గారి స్వగృహ ప్రాంగణమునందు నిర్వహింపబడనున్నది ఎల్లరు పాల్గొన వలసినది

Master E.K. Spiritual and Service Mission

19 Nov, 14:25


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹ఇందు సృష్టి అంతయు లీలార్థముగా ప్రళయము అనుపేర భగవంతుని ధ్యాన స్వరూపము లోనికిపోయి, మరల సృష్టిగా తిరిగి వచ్చుచుండుట వర్ణింపబడినది. ఈ సృష్టి అంతయు భగవంతునితో నిండి ఉన్న వేదము. అందు సృష్టి రూపమున వసించుచున్న దేవుడే వాసుదేవుడు. అతడు నామము, రూపము, గురుతు ‌మొదలగు ఆధారములతో గూడి ఉండును. అట్టివాడు తన లోనికి తాను ఉపసంహరించుకొనిన, నామములను, రూపములును, గురుతులు కరిగిపోయి, తానుండెను. అతడే సంకర్షణ మూర్తి అనబడెను.

సంకర్షణము అనగా సమస్తము ముద్దచేయుట. అట్టి స్థితిలో అతని అస్తిత్వమునకు రూపములు మొదలగునవి ఉండవు. కనక అతడు నిరాధారమయిన జ్ఞానము యొక్క స్వరూపము. తనకు తానే ఆధారము. తన యందలి జ్ఞానమునకు గూడ వేరుగా అస్తిత్వము లేదు కనుక తానే ఆధారము.

ఈ స్థితి సృష్టిలో ఉన్న జీవులకు ఊహింపరానిది కనుకను, ఊహ అనునది ఊహించు వాని కన్న వేరుగా ఉండవలయును కనుకను, ప్రళయమున వేరుగా ఉన్నది కరిగిపోవును కనుకనే, అది పాతాళలోకమని చెప్పబడినిద. ఆ స్థితిలో ఉన్న దేవుడు తాను చూచుటకు తన యందున్న సృష్టి కరగిపోయినది కనుక, తాను చూచుటకు ఏమియును లేదు కనుక తనను తానే చూచుకొనుచుండెను. ఇది ఎట్లు సాధ్యము? తన బుద్ధిలో చూచుకొనుచుండెను. అనగా తన బుద్ధి రూపమున తానుండెను‌. యోగులు గూడ యోగ స్థితిలో ఇట్లే ఉందురు.......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-265.

Master E.K. Spiritual and Service Mission

19 Nov, 13:02


*విష్ణుని యజ్ఞరూపునిగా నారాధించుట యనగా యజ్ఞార్ధకర్మలతో ప్రజలను తృప్తిపొందించుట. దక్షిణలు అనగా నెవరెవరిచేత యజ్ఞార్థకర్మలు చేయింపబడినవో, వారికి పంచిపెట్టబడునట్టి యజ్ఞోద్భవసంపదలు. భూమిని పండింపజేసి, ఆ పండించినవారికి ఆ ఫలమును పంచిపెట్టుట దక్షిణ. పంచిపెట్టుదునని ముందుగా ఒప్పందము చేసికొని పని చేయించినచో దానిని ఉద్యోగ మనియు, పంచినదానిని జీత మనియు నందురు.*

*విష్ణువు జీవులలోని వ్యాపనశీలుడైన అంతర్యామి. అతడు యజ్ఞార్థకర్మల రూపముననే అర్చింపబడును. ఎవని ప్రయోజనముకో గాక, విశ్వశ్రేయమునకు చేయు పనుల యందును, చేయువారి యందును విష్ణువు మేల్కొని యుండును. అనగా వారు విష్ణువునందు మేల్కొని యుందురు. మిగిలినవారు కామక్రోధాది రాక్షసవర్గమునందు మేల్కొనియుందురు. వారికి సంకేతమే శపింపబడిన జయవిజయులు. “యజ్ఞో వై విష్ణుః" అని వేదము చెప్పుచున్నది.*

*రుద్రుడు లయమునకు అధిదేవత గనుకను, దేహ క్షయమైన వెనుక అహంకారము పనిచేయదు గనుక, అహంకారమున కధిపతి యగు దక్షుడు ఈ దేహధారణమైన ప్రజాపతుల యజ్ఞమున రుద్రునకు యాగభాగము లేదని శపించెను. అయినను, జీవుని ఉత్తరగతులలో రుద్రునకు యాగభాగము సిద్ధించుటవలన దేహధారులైన జీవుల జీవితమను యజ్ఞమున శివుడు యాగభాగముగల దక్షిణామూర్తిగను, విష్ణువు యజ్ఞమూర్తిగను ఈ సృష్టిలో ప్రసిద్ధులైరి.*

🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 14:05


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹శుకయోగి పరీక్షిత్తుతో ఇట్లు పలికెను: ఈ భూమిపై జన్మించి మానవులందరు స్తుతించి, పూజింపదగి‌న యోగ్యత కలిగి వర్థల్లినది పూరు వంశము. ఆ వంశమును పవిత్రము చేయుటకే నీవు ఇన్ని సద్గుణములతో పుట్టి,కీర్తిని పుష్పములుగా పూయించుచున్న సత్త్రవర్తనలనబడు పూల తీగలకు ప్రతిదినము నీవు విష్ణు కథలతో పోషణ చేయుచుందువు గదయ్యా!

(పూరుడు యయాతికి, శర్మిష్ఠకును పుట్టిన‌ కుమారుడు. అతడు జ్యేష్టపుత్రుడు కాకపోయినను తండ్రి కోరికపై కొంతకాలము తన యౌవనమును తండ్రి కొసగి తండ్రి ముసలితనమును తాను భరించెను.

పితృవాక్య పరిపాలనము అను సద్గుణముచే అతడు రాజ్యార్హుడై తండ్రి అనుమతితో పట్టాభిషిక్తుడు అయ్యెను. అతడు చంద్రవంశము వాడు. అతని సంతతియే పూరువంశము. కనుక పరీక్షిత్తు పూరువంశము వాడు. పూరునివలెనే సద్గుణములు కలిగి ప్రశస్తికెక్కిన వాడు.).......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-262.

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 13:53


Photo from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 13:53


Audio from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 13:53


శంభోయనుచు కరుణంభోనిధే యని (2)
దంభాము లేక నిన్ను ధ్యానింతురా తండ్రి (2)

శంభో ! మహాదేవ శంభో ! సదాశివ శంభో ! గంగాధర శంభో ! (2)

ఫాలా లోచన నీ పాదాంబుజంబులు (2)
చాలా నెర నమ్మినాను హాలా హలా ధర (2)

శంభో !మహాదేవ శంభో ! సదాశివ శంభో ! గంగాధర శంభో !(2)

యక్ష నాయక సంరక్ష ఫాలాక్ష (2)
దక్షాధ్వరా హర దాసాళి మందిర (2)

శంభో ! మహాదేవ శంభో ! సదాశివ శంభో ! గంగాధర శంభో ! (2)

గౌరి మనోహర గంగాధర హర (2)
కారుణ్య సాగర కరుణించి బ్రోవర (2)

శంభో !మహాదేవ శంభో ! సదాశివ శంభో ! గంగాధర శంభో ! (2)

ఇందూ జటాధర కందర్ప హర గో (2)
విందాత్మజా నీకు వందానమయ్య శివ (2)

ఈశా శ్రీ శ్రీకాకుళేశా కోటేశా (2)
కేశావ సన్నుత గిరిజా సమేత శివ (2)

శంభో !మహాదేవ శంభో ! సదాశివ శంభో ! గంగాధర శంభో ! (2)

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 13:21


.

*"What is the place of birds in evolution?"*

*Question: Ans: According to the ancient science, the whole set of the ladder of evolution, all the beings, let it be birds, beasts, fish, the whole thing exists as a total page having many pictures in nature, and all these stages exist from the beginning. It is only the individual souls that pass through the ladder of evolution, but it is not true that one species exists earlier and the other species exists later. For example, we have the airport at Geneva. it existed for yesterday's passengers, and it exists for today's passengers, and tomorrow's passengers also.*

*So, the various stages of evolution exist always as stations in pilgrimage or travel. But the individuals enter the path and pass through all these stations, one after another in a chronological way, and in that sense if we take it, all the fauna and flora of this earth with all the species is simultaneous and some souls take one branch, whereas some souls take another branch. There are seven branches and if we take the first branch, we come to a certain stage and we have to take the second branch next, and the third branch next, like that, if we start on a particular branch, the stage of birds becomes the third stage of evolution; and if we take the branch of reptiles, the bird stage will be the fourth stage of our evolution because both are egg- born and in some souls the evolution of birds precedes the evolution of reptiles, in some souls it is vice- versa.*

*I wish you go through certain pages of "The Secret Doctrine" of Madame Blavatsky, all these questions are answered thoroughly to the satisfaction, because it's a very big subject.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 13:21


పుణ్యములు, సత్కర్మాచరణము నార్జించినవానికి సంపదలై పెరుగును. వాని ఫలమనుభవించిన వానికి తరిగిపోవును. ఇట్లు పెరుగుట, తరుగుటయను వానిని భాగవతజనులు లెక్కచేయరు. పుణ్యఫలములు డబ్బువంటివి. కూడబెట్టినచో పెరుగును. కాని వినియోగించినచో తరుగును. వినియోగము చేసినవాడు నిర్ధనుడగును. చేయనివాడు లోభియై అనుభవించుటకు వీలుండదు. చక్కని వాణిజ్యము చేయువాడు అపార ధనరాశుల నార్జించును. ఆర్జించుటకు పెట్టుబడిగా పదిమందికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుచుండవలెను. ఖర్చుపెట్టుటకు భయపడువానికి వాణిజ్యము పెరుగదు. దుర్వ్యయము చేయువాడు దివాలా తీసి భిక్షాటనము చేయును. సద్వ్యయము నెంత ధారాళముగా చేసిన వాణిజ్యమంతగా పెరిగి ఆర్జనము అపారముగా పెరుగును. భాగవతజనులు పుణ్యముల విషయమున నీ మార్గమవలంబించుదురు.అనగా పుణ్యఫలములను గౌరవింపక సద్వినియోగము చేయుటకై పుణ్యకర్మ లాచరించెదరు.*

🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 12:26


competition.pdf

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 11:01


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Develop disbelief in the ego.🌼

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 11:01


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ఎవరినైనా గౌరవిస్తున్నారు అంటే "ఎందుకు?" అనే ప్రశ్న తీసేసి గౌరవించడం నేర్చుకోండి.🌼

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 07:20


https://youtu.be/XtbQRnXEaZM?si=_jTxaOVFpLCZ3M9G

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 05:52


🌹🌞 *Master E K Spiritual & Service Mission*🌞🌹
Our mission address list 2025 will be edited & corrected.Any changes in centre's address or phone number should be informed to *Dr.M.K.S.S Prasad* by SMS to phone no *9676462370* before 5 PM 30-11-2024

Master E.K. Spiritual and Service Mission

15 Nov, 00:01


🌷 *November 15,Today's Meditation*🌷
Lock and key adjustments. Space expands. Horizontals meet verticals. Mind crosses matter. Time unfolds time. Life creates life. Father creates son.

🌷 *నవంబరు 15, నేటి ధ్యానము*🌷
🌻 సమన్వయము సాధించు తాళమ్ము, దాని చెవియు
ఆకసంబున దాగినది తాళమ్ము
అంతరంగమునందడుగై యున్నది దాని చెవియు,
ఆకసమ్ము తోడ అనుసంధాన మొంద
అంతరాత్మకు తోచు అఖిల విజ్ఞానంబు.
అవ్యక్త బీజమై నిద్రించు చోటు
అదితి అనుగ్రహంబున
ఆకసంబుగ ప్రకాశించు.
బీజముగ నిల్చిన యాచోటు
బృంహణము చెందు బ్రహ్మాండముగ.
దహరమున దాగిన ఆత్మయె
ఆకసంబంతగ అభివ్యాపించు,
పరమగురుడు పనిచేయు అడ్డంబుగాను,
ఆప్రభావంబనుభవించు సాధకుడు నిలువుగాను,
గురుడంతరాత్మగ, శిష్యులందరిలోన
గురుతుగా నిలిచి నిలువైన కుండలిని మేలుకొలుపు.
అడ్డమగు అంతర్యామిత్వమన నిలువగు ''నీ' వ్యక్తిత్వమ్ము కరిగిపోవు. పరమ ప్రేమ రూప సేవానిష్ఠయె "హరిజాంటల్ " (అడ్డుగీత)
విజ్ఞాన రూపమౌ వ్యక్తిత్వ మెదుగుటె "వర్టికల్" (నిలువురేఖ)
"వర్టికల్, హారిజాంటల్ లోన విలీనమందుటె యోగసిద్ది".
అన్నమయ ద్రవ్యమునకు, అంతరాంతర దివ్యబుద్దికిని
అంతరంబుగ నెలకొను మానసంబు,
గురుని సాన్నిధ్యంబు ఆనందమై సోక
గుణాత్మకంబగు ద్రవ్యమును దాటు మనసు,
ముడిచిన కాలమ్ము విస్తరంబుగ విచ్చుకొను.
మనల బంధించు కాలమ్ము,
మూడు విధములుగ మొదట
మొదలు , చివరలు లేని మహిత కాలమ్మై
మరపించు ముక్కంటి యౌగురుని కరుణ.
జీవంబు సృజియించు జీవమునె
జగతిన నెలకొన్న జీవమ్ము చేత
జనియించు జీవమ్ము జీవుని యందు,
విశ్వజీవన యాన పథికుడౌ విశ్వగురుని
విపులకృప చేత వ్యక్తిగత జీవమ్ము విస్తరించు.
జనకుండు సృజియించు జీవుడౌ కొమరుని
జ్ఞాన తేజో గర్భ సంజాతుడుగను
జ్ఞానియౌ గురుడుగను శిష్యుని తన యాత్మ సుతుడుగను...... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

14 Nov, 14:19


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹 ఓ మైత్రేయ మహార్షీ, గోవిందుని స్వరూపము ఉపదేశింపుము. జీవునకు పరబ్రహ్మమునకు ఏకత్వము ఎట్లు సిద్ధించునొ తెలుపుము. దాని కొరకు చేయవలసిన భావన ఎట్టిది? ఉపనిషత్తుల యందు గల పరమార్థము ఎట్టిది? తగిన శిష్యులు లభించుట వలన కలుగు ప్రయోజనములు ఎట్టివి? విజ్ఞానము ఆర్జించుటకు సజ్జనులు తెలిసికొనువలసిన సాధనలు ఎట్టివి? వైరాగ్యము భక్తి యోగము యొక్క స్వరూపము ఎట్టిది?

ఇన్నిటిని వివరములతో తెలియజెప్పి నన్ను రక్షింపుము. వేదములు చదివి బోధించిన ఫలము గూడ నా వలె ఆర్తి చెంది ఉన్నవానిని జ్ఞానము ఇచ్చి రక్షించుటతో సాటికాదు.

ఈ విధముగా విదురుడు మైత్రేయుని వినయముతో ప్రార్థింపగా ఆ వృత్తాంతమునంతటిని తెలిసిన శుకయోగి పరీక్షిత్తునకు వివరించెను.......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-258,259,260,261

Master E.K. Spiritual and Service Mission

14 Nov, 13:36


https://youtu.be/D0xN85keCVc?si=2S2Qie9r2vt7-vV8

Master E.K. Spiritual and Service Mission

13 Nov, 15:17


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹జీవులకు ఆపదలు సంభవించినపుడు ఆచరింపవలసిన ధర్మములు తెలుపుము. నారాయణుడు సంతోషించునట్లు ప్రవర్తింపవలసిన మార్గము ఉపదేశింపుము. ఏమి ఆచరించినచో నిరంతరముగా మేలు కలుగునో తెలుపుము. గురువులను ప్రియశిష్యులు కొలుచునపుడు గురువులు కోరిన ప్రయోజనములను భక్తితో శిష్యులెట్లు సమర్పించవలెనో తెలుపుము.

ప్రళయముల భేదములను వివరింపుము. భగవంతుని భక్తితో కొలిచిన వారి చరిత్రములను తెలుపుము. జీవుని తత్త్వమెవ్వరిలో ప్రకాశించి, సుఖవంతమగునో తెలుపుము........... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-256,257,258

Master E.K. Spiritual and Service Mission

13 Nov, 14:01


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 It is easy to be born as an intelligent man, balanced life is a rarity.🌼

Master E.K. Spiritual and Service Mission

13 Nov, 14:01


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ఆకస్మిక ప్రవృత్తితో గాని, క్రోధముతో గాని, అతి సంతోషముతో గాని దేనిని నిర్ణయించుట గాని, ప్రవర్తించుట గాని చేయరాదు.🌼

Master E.K. Spiritual and Service Mission

13 Nov, 13:21


*సంపన్నులు, ప్రభువులు విస్తారముగా దానములు వర్షింపవచ్చును. అట్టివారుగూడ చక్కని సంభాషణల దానము విషయమున వెనుకబడుచున్నారు. ప్రజలకు దానములు చేయువారు కూడ అంత తేలికగా ప్రియహిత వచనములను దానము చేయలేరు. దాతలకు దాన గర్వమున్నచో దయగల మాటలను దానము చేయలేక లోభులై పరుషముగా సంభాషించుట కూడ గలదు. ఎదుటివానికి సహాయముచేయుట కెంత దయు కావలెను. ఎదుటివాని మనస్సును సంతోషపెట్టుటకు కూడ అంతదయ కావలెను. కనుక లోకమున ప్రియవచనముల తోడి దానము దుర్లభము.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

13 Nov, 13:21


*Question: "Could you explain us the meaning and the nature of suffering in the animal kingdom?"*

*Ans: Suffering is almost the same as we have in the human kingdom. The only difference is the suffering in the animal kingdom belongs to the planetary karma of the earth. The same thing with the pain of the plant, and pain of the mineral also. But the pain of the human being is not only due to the planetary karma of the earth, but also a part of it is the result of the individual karma, because individual karma and its result start with the human kingdom and not before.So, the pain and the feeling of pain in the human kingdom is sharper and more intellectual and more anticipated than in the animals.*

*When there is an incident, there is pain to the animal but to the human being there is the impression of pain before and after an incident. Because the mind is more intellectualised, it can travel into the future and into the past, so the pain in the case of a human being is more sharp and more intense and of more duration. In the animal kingdom it exists as long as the incident exists. That's the difference.*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

13 Nov, 02:32


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

13 Nov, 00:04


🌷 *November 13,Today's Meditation*🌷
Solar pole, polar soul. The higher pole is the soul. Soul is the centre. Pole is the pivot.

🌷 *నవంబరు 13, నేటి ధ్యానము*🌷
🌻 సౌర తేజమున సొగసైన ధ్రువము
మనధ్రువమున ఆత్మయై దీపించుచుండు
సౌరబింబము చాటున సురిగిన సత్యము
సర్వజీవులను ధ్రువమైన ఆత్మగా ధరియించి యుండు
సకల లోకములకెల్ల సర్వోత్తమ ధ్రువము
ఆత్మయై అధి వసించు,
ఆత్మయె కేంద్రమై, ధ్రువంబె ఇరుసై
భాసించుచున్నవి భవ్యముగను......... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

12 Nov, 13:36


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹పితృమేధములు అనగా పితరులను గూర్చి చేయు యజ్ఞములు. స్త్రీకి గర్భమున పిండోత్పత్తి పరిశుద్ధిగా ఉండుటకై తగిన అహార పరిశుధ్దయు, వ్రతాదులును, దీనియందు చెప్పబడు‌ను. ఈ పరిశుద్ధివలన దేహము విడిచిన ఉత్తమ జీవులు మరల వారి వంశముననే బిడ్డలుగా జన్మించుటకు అవకాశము ఏర్పడును కుటుంబమున దాంపత్య పరిశుద్ధి లేనిచో చనిపోయిన పెద్దలు వారి ఇంట పుట్టక ఇతర పవిత్ర కుటుంబములను వెదకికొనవలసి ఉండును.

తారలు అనగా గగనమున మినుకు మినుకు అనుచు కనిపించు చుక్కలు. వీరందరును సూర్యమండలములు. ఒక్కొక్క తారచుట్టును తిరుగునట్టి గోళములను గ్రహములందురు. కాలచక్రమనగా సంవత్సరములు, ఆయనములు, మాసములు, ఋతువులు, పక్షములు మొదలగు విభాగములు గల కాలము........... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-252

Master E.K. Spiritual and Service Mission

12 Nov, 13:04


*Question: "Are there beings that misbehave towards the human beings as we misbehave towards the lower kingdoms?"*

*Ans: Really that is one of the vital questions to be answered and we have a positive answer to this in all the scriptures. It is said that the human stage of evolution is a crisis. The pre-human stages are safe because we are not permitted to misbehave. An animal can never misbehave with its food, or drink, or sex, or sleep. So, too, a bird, a fish and a plant. So, they are safe.*

*And when it comes to the human being, certain amount of love is given, handed over to the hands of the human being and certain amount of independence is given and then we are expected to judge and choose. And in the beginning, we have the chance of misbehaving with our food, drink and every thing, because the choice is given to us for the first time.*

*So, there is a crisis in evolution the moment we enter into the human kingdom, but the pain of what we misbehave gradually leads us towards the required path. And our misbehaviour will be checked by nature through births and rebirths, but there is an optimum in evolution which never permits us to go beyond the human level, until we achieve the super-human level by ourselves. See, the key for the higher kingdoms is given to us to tackle, so unless we handle the key in the right direction, step after step, we remain only as human beings for any number of thousands and thousands of rebirths. The very fact that we are made the masters of our individual destiny, proves that there is no opportunity or no possibility of the higher beings to misbehave with any other kingdom. Am I clear?*

🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

12 Nov, 13:04


https://youtu.be/1WfCEqATSeQ?si=nIHMIbRxWfuIxehu

Master E.K. Spiritual and Service Mission

12 Nov, 13:04


*మునులనగా జీవుల మనస్సులలో వ్యక్తమగు జ్ఞానమూర్తులు.వారివలన సద్గుణములు జీవులకు సంతోషము కలిగించును. వ్యక్తులను పొగడుట అజ్ఞానమైనను పొగడువారికి బాగుపడు మార్గముగా మును లేర్పరచిరి. కనుక సజ్జనస్తుతి మానవ సృష్టిలో తప్పనిసరియైనది. అదిగాక మనస్సుల కానందము కలుగును. కనుక అజ్ఞానులలో నొకరినొకరు పొగడుకొనుట సంతోషము కలిగించుచు సత్కర్మ సాధనమగుచున్నది గనుక కార్యములు నెరవేరుటకు పొగడుకొనుట సృష్టిలో తప్పనిసరియైనది.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

12 Nov, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Belief is always more valuable than disbelief.🌼

Master E.K. Spiritual and Service Mission

12 Nov, 05:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 శరణాగతి చెందిన వ్యక్తియందు సాముద్రిక వ్యతిరేక లక్షణములెన్ని ఉన్ననూ పనిచేయవు, పనిచేయవు, పనిచేయవు.🌼

Master E.K. Spiritual and Service Mission

12 Nov, 03:56


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

12 Nov, 01:50


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

11 Nov, 23:22


🌷 *November 12,Today's Meditation*🌷
Matter turns atom, atom turns matter. Matter time adjustment. Matter turned man. Man becomes Master. Matter becomes mind. Mind becomes Master.

🌷 *నవంబరు 12, నేటి ధ్యానము*🌷
🌻 ద్రవ్యంబు పరిణమించు పరమాణువుగను
పరమాణువు పరివర్తించు ద్రవ్యంబుగను
ద్రవ్యకాలములు సమరసత ధరియించు
ద్రవ్యంబు ధరియించు మానవాకృతిని
మానవుడు మహాత్ముడౌ పరమగురువుగ పరిణమించు
ద్రవ్యంబు మానసంబుగ మరలివచ్చు
మనస్సు మహాత్ముడుగ మనుటసాగు....... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

11 Nov, 14:46


🌹 *మాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ* 🌹
మన సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, వివరములు
మాస్టర్ గారి సూక్తులు, సందేశములు ఈ app/గ్రూప్ లో వస్తాయి ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వచ్చు.

Download the latest app from playstore
The new *Master App* provides updates on programs organized by *Master EK Spiritual & Service mission centers* and Messages of Master E.K.

https://play.google.com/store/apps/details?id=com.master.masterapp&hl=en

*WhatsApp Channel*
https://whatsapp.com/channel/0029VaAlK0MKWEKqxkJLYk32

*Telegram Channel*

https://t.me/masterekmission2023

🙏వాసుదేవ🙏

Master E.K. Spiritual and Service Mission

11 Nov, 14:01


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹పాషండులు అనగా వేదధర్మమును అంగీకరింపనివారు. దైవమునందును, నీతి నియమములందును, సత్ప్రవర్తనమునందును, దాని క్రమశిక్షణము నందును, నమ్మకము లేనివారు, మరియు వేదధర్మమును నిందించువారు.

ప్రతిలోమ కులములు అనగా ఆచరింపకూడని వివాహ విధానము ఏర్పడు వంశములు. ఇవి అనులోమమునకు వ్యతిరేకములు. బ్రాహ్మణుడు క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలలో ఒకరిని వివాహమాడవచ్చును. క్షత్రియుడు వైశ్య, శ్రూద్ర స్త్రీలలో ఒకరిని వివాహము ఆడవచ్చును. వైశ్యుడు శ్రూద్ర స్త్రీని వివాహమాడవచ్చును. ఇట్టి వివాహము ఆపత్సమయములలో మాత్రము చేసికొనవచ్చును.

ఇక ప్రతిలోమ వివాహము అనగా బ్రాహ్మణ స్ర్తీ, క్షత్రియ, వైశ్య, శూద్ర పురుషులను వివాహమాడుట, క్షత్రియు స్త్రీ వైశ్య, శూద్రులలో వివాహమాడుట, వైశ్య స్త్రీ శూద్రపురుషుని వివాహమాడుట. ఇట్టిది ఆపత్సమయమున గూడ ఆచరింపరాదనియు, ఆచరించినచో పాషండ ధర్మమగుననియు చెప్పుదురు. ఇందు బ్రాహ్మణ క్షత్రియాది భేదములు, పుట్టుక చేతగాక స్వభావము చేత, కర్మ చేత అని తెలియవలెను........... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-252

Master E.K. Spiritual and Service Mission

06 Nov, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Remember that life is for yourself but not for your routine.🌼

Master E.K. Spiritual and Service Mission

06 Nov, 05:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 సద్భావం అనగా అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్ధన చేయటం.

Master E.K. Spiritual and Service Mission

05 Nov, 22:59


🌷 *November 6, Today's Meditation*🌷
In Aries the serpent is Kumara. In Scorpio the serpent is Saturn. In Cancer the serpent is Python. Python is typhoon.

🌷 *నవంబరు 6, నేటి ధ్యానము*🌷
🌻సర్పంబు చరియించు మేష కర్కట వృశ్చికంబుల యందు
సుషుమ్నాంతర శిఖరమౌ మేషంబునందు
సంచరించు సర్పమదెవ్వరోకాదు
స్వామి శివకుమారుడౌ కుమారుడే.
బ్రహ్మ తేజోనిధి సుబ్రహ్మణ్యుడతడు.
శుక్రంబు మఱలించి దేవయానాన.
ఓజస్సు నొనరించు నగస్త్యునకు ఆచార్యుడితడు.
వృశ్చికంబు వర్తించు సర్పమదెవ్వరు ?
వర్తులంబుగ దురితకర్మల ఫలమిచ్చు శనైశ్చరుండు
వాసనల బలిమిని వదలకుండగ బంధించు మందుడతడు.
కర్కటంబందున కదలు సర్పమజగరంబు
కాద్రవేయులలోన కఠిన తరంబయ్యది.
కటిక చీకట్ల కాటున కమల మిత్రుని కాంతుల కప్పివేయు.
కృష్ణగతికి మఱలించు స్వారాజ్య పతనంబు గావించు,
కాల సాగరగర్భాన ఉప్పొంగు కెరటాల ఉత్థానమైనట్టి పెనుతుఫాను
కాంతి రేఖల వెల్గు ఉత్తరపు వర్చస్సు దక్షిణాగ్నిలో ప్రేల్చు దక్షత అయ్యది
కుంభ సూనుని బ్రహ్మతేజంబు గొని వచ్చు పితృయానాన భాగీరథిగను........ *మాస్టర్ ఇ.కె.*🌻

Master E.K. Spiritual and Service Mission

05 Nov, 15:28


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹ఇంకను దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు, గరుడులు, సర్పములు, రాక్షసులు, నరులు, జంతువులు మున్నగువాని జన్మలను గూర్చి తెలియజెప్పుము. గర్భమున పుట్టు జీవులు, స్వేదజములు, అండజములు అనువాని విభేదమును ఉపదేశింపుము.

(ఇందు సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు అనువారందరు దేవతలకు సంబంధించిన జన్మములు కలవారు. దేవతలుగాక మిగిలిన వారందరిని దేవయోనులందురు. అందు గంధర్వులు సంగీతమునకు అధిదేవతలు. గరుడులు పక్షుల జన్మములకు అధిదేవతలు. సర్పములు భూమి యందు కన్నములలో చరించు ప్రజ్ఞలు. వాని వలన పాములు పుట్టును. రాక్షసులు మున్నగువారు స్థూలములైన ఆవేశముల స్వరూపమున వ్యక్తమగుదురు.).......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-250.

Master E.K. Spiritual and Service Mission

05 Nov, 13:15


*Question: One Master teaches one thing and another Master teaches another thing. Why is it so?*

*Answer: I practise my Master's path, eight-fold path of Raja Yoga, Patanjali and Bhagavad-Gita path. But each of the Masters covers a portion of the field which is not covered by the others. For example, Master C.V.V. has given the methods to go into the consciousness of the various planets. Any student can experience and gather the information by himself. Any student who follows Master C.V.V.'s path can travel through all the planes of the planets and gather information and take down notes by himself. And anyone doing the same independently gets the same information in the same way with the same experience. That part of the work is covered by Master C.V.V, whereas the teaching of the wisdom to the 20th century man is covered by Master Djwhal Khul.*

*So, the same work is done by each Master in a different field of action. Yes, definitely there is supplementary aspect also. The one which is not covered by one Master is clearly covered by the other Master. As far as I know there cannot be incompatibilities between two Masters. I am teaching Djwhal Khul's teachings and C.V.V.'s teachings for the past twenty years. I have trained many batches in India and till today, I did not find any incompatibility anywhere. And I think it is not possible also.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

05 Nov, 13:15


*సర్వాంతర్యామియైన నారాయణునియందు దేవతలు ప్రకృతి గుణములుగా దిగివచ్చి దేహము లల్లుదురు. ఆ దేహములందు తాత్కాలికముగా వ్యక్తమైన యహంకారము దేహములను వేర్వేరు వ్యక్తులుగా భ్రమింపజేయును. ఆ యహంకారములు వ్యక్తులవలె వ్యవహరించుచు దేహములను బట్టి దేహములను పొగడుకొనుట బాల్యచాపల్యము వంటిది. దేవతలను దేహములందు పొగడుకొన్నచో కొంత నయము. అందలి అంతర్యామిని పొగడుకొన్నచో నుత్తమము. దానితో అహంకార బంధము తొలగును.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

05 Nov, 12:24


Document from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

05 Nov, 06:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Understanding is more important than living.🌼

Master E.K. Spiritual and Service Mission

05 Nov, 06:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 సర్వ జీవులకు ప్రకృతియే సర్వము నేర్పును.🌼

Master E.K. Spiritual and Service Mission

05 Nov, 06:07


Document from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

05 Nov, 01:18


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

05 Nov, 00:04


🌷 *November 5, Today's Meditation*🌷

A to Z read scripture written. It is written in the cave temples of your body. Z to A you read in the picture writing of the future. The wheel is reversed.

🌷 *నవంబరు 5, నేటి ధ్యానము* 🌷
🌻 'A' నుండి 'Z' దాక మేషంబు మొదలుగా శూన్యంబు చేరువరకు
శిరంబు నుండి మూల పర్యంతంబు
రచితమైన వేద గ్రంథంబు చదువుడి,
నీ దేహమే దేవాలయమ్ము
దేహాంతర గుహలందున
దర్శితమైనదీ వేదము
'Z నుండి A' దాక శూన్యాదిగ మేషపర్యంతంబు
మూలంబు మొదలుగ శిరంబు వరకు
ముచ్చటగ మూడవకాలంబు చిత్రితంబయ్యె
మరలి చక్రంబు వ్యుత్ర్కమంబయ్యె....... *మాస్టర్ ఇ.కె.*🌻

Master E.K. Spiritual and Service Mission

04 Nov, 15:32


2025 Gnt Gurupoojalu(Revised).pdf

Master E.K. Spiritual and Service Mission

04 Nov, 13:59


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹 విదురుడు మైత్రేయుడిని ఇంకను ఈ‌ విధముగా ప్రశ్నించెను...... సృష్టిలో మొదటపుట్టిన వారిలో ఒక్కొక్కనికి పలువురు పుత్రులు పుట్టిరి. అటుపైన ఇంకను ఎక్కువమంది మనుమలు పుట్టిరి. ఇట్లువంశములు వంశములుగా సృష్టి విస్తరించినది. ఈ వంశములు ఎట్లు ఏర్పడినవో తెల్పుము! వీరితో నిండిన ఈ ప్రపంచము ఎట్లు నిర్వహింపబడినదో చెప్పుము.

లక్ష్మీదేవి భర్తయైన విష్టువు ప్రజాపతులనెట్లు సృష్టించెను? తొమ్మిది విధములైన సృష్టి ఉన్నదని చెప్పునట్టి యీ ప్రజాపతుల సృష్టి వివరములెట్టివి? వాని భేదములను తెల్పుము, మనువులను గూర్చియు వారి వంశమునందలి ప్రభువులను గూర్చియు, వారి ప్రవర్తనములను గూర్చియు, సృష్టింపబడిన వైభవములు ఎట్టివి?.......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-247,248,249.

Master E.K. Spiritual and Service Mission

04 Nov, 13:15


*Question: Why many temples face towards East? Please explain about the science behind the directions.*

*Answer: Not only the churches and mosques but all the temples of all major religions are oriented towards the East. The word Orient means towards the East. It is a great tradition that gives us that word Orient. That's why we automatically use that word because of our relationship with the rotation of the earth and apparent rise and set of the Sun.*

*When an insulated wire is coiled around an armature and when electric current is passed through that insulated wire, the armature behaves as a magnet. And suppose we do not make it a coil, we use the wire as a lump and use the armature and then the armature does not behave like a magnet. What makes the difference? It is the arrangement of the wire. Similarly, the apparent path of the Sun around this earth makes its coil around this earth a big line of force to all the beings living on this earth. In accordance with that line of force, it is better for us to face the East. People who could understand this, they arranged that every temple should face the East.*

*If you go into the scriptural traditions of the ancient nations, for example ancient India, ancient Egypt and ancient Hebrew tradition, you will find the directions for sleep also. It is said that one can sleep very healthily and comfortably with the head towards the south and most unhealthily and uncomfortably with the head towards the North. And towards the East or West, it means nothing. That is neither advantage nor disadvantage. Basing on this, there are allegories which convey great truths in the scriptures.*

*For example, in the Indian scriptures, it is said that God cut the head of one of His children and the Mother force of Nature, the wife of God grieved after it, felt sorry of it and wanted that the son should be made alive once again. Then, the Lord ordered that 'whoever is sleeping with his head towards the North may be marked and his head cut and brought and we will attach that head to the neck of this boy'. Then the angels of God went on all directions on this earth and could not find anyone sleeping with head towards the North. At last, they could find an elephant sleeping like that. They cut the head of the elephant and brought it and God had attached that head to the neck of this boy and it is whom we call Ganesha, the elephant God with the body of a human being and the head of an elephant. Of course, this story is only an allegory of some truths concealed in it just as all the allegories of all the scriptures. It includes the fact that it is not desirable for us to sleep with our head towards the North.*

*It is positively said that it is very good to sleep with the head towards the South. It is described that our vertebral column is compared with a magnet. And the axis of our earth is already a magnet and if you place one magnet upon another with like poles, they repel. If you place them one upon another with unlike poles, they will not only attract one another but also work as one magnet. Similarly, our vertebral column is in tune with the axis of our earth when we lie on the earth horizontally with our head towards the South. And this much is described in all the scriptures.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

04 Nov, 13:15


*భాగవతము తృతీయ స్కంధమున వరాహావతార కథలో ప్రళయకాలమున భూమి శూన్యమున కలసిపోవుటయు, సృష్టి యారంభమున శూన్యమునుండి ఉద్ధరింపబడుటయు వర్ణింపబడినవి. ఇచ్చట భూమి యనగా సమస్త గ్రహగోళములయందలి పృథివీ తత్త్వమేగాని (Physical plane of existence) మన భూగోళము కాదు. ఈ గోళముల నుద్ధరించుటకు రెండు కిరణములు పుట్టును. వాని నడుమనున్న చీకటియే వరాహమూర్తి ముట్టెయనియు, ఆ కిరణములే వాని కోరలనియు వర్ణింపబడినది. ఈ చీకటినుండియే సమస్తము రూపొందుచున్నది కనుక ఈ చీకటి అంతర్యామియొక్క మూర్తియేగాని శూన్యము కాదని నిరూపింపబడినది. మన కన్నుల కది చీకటి కావచ్చును. అది కన్నుల పరిమితత్వమే కాని చీకటి శూన్యతగాదు. గ్రుడ్లగూబ చూడగలిగిన దానిని గూడ, గబ్బిలము చూడగలిగిన దానిని గూడ చూడలేదు గదా మానవుని కన్ను! కుక్క వినగలిగిన శబ్దముగూడ వినలేదుగదా మానవుని చెవి! ఇట్టి పరిమితత్వము కలిగిన యంత్రములు చీకటి కొలుచుటకు సాధనములు కావు. ఈ రహస్యము ఋగ్వేదమున నాసదీసూక్తములలోను, రాత్రీసూక్తములలోను కలదు. కాని ఆ మంత్రములు ఈ భాగవత కథలేనిచో దుర్భేద్యములు. కలియుగమున నెక్కువమంది శూద్రధర్మము గలవారే (అనగా పొట్టకోసము మాత్రము ధర్మము నాచరించువారు.) కనుక వ్యాసుని యనుగ్రహము లేనిదే ఎక్కువమందికి వేదములు లేవు. కొందరికి ఉన్నను లేవు.*

*చీకటినుండియే లోకములు, సూర్యగ్రహ గోళాదులు యథాపూర్వముగా పుట్టుచున్నవి గనుక చీకటియొక్క దేహమయిన వరాహమూర్తి దేహమున సమస్తాకారములును మూల వైఖరులుగా (Moulds or Arche Types) నున్నట్లు వర్ణింపబడినది. ఈ సృష్టి చేయుటవలన అతడు ప్రతిఫల మాశించుటలేదు కనుక నిది యజ్ఞమనియు, వరాహమూర్తి దేహభాగములు యజ్ఞసంభారము లనియు పేర్కొనబడినవి. ఛందస్సులను పేర కాలదేశ విభాగములన్నియు గూడ చెప్పబడినవి.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

04 Nov, 13:15


https://youtu.be/ra3FH1yTfW0?si=sKEf9PEncTdkm9ci

Master E.K. Spiritual and Service Mission

27 Oct, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 True love excuses the faults of others.🌼

Master E.K. Spiritual and Service Mission

27 Oct, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 అన్నమును భుజించుట భగవదారాధనమని గుర్తుంచుకోండి.🌼

Master E.K. Spiritual and Service Mission

27 Oct, 01:23


🌷 *October 27,Today's Meditation*🌷
The imprints of subterranean caves of your consciousness are illuminated by the heartful colours of Kundalini at the feet of the Master. Elevate yourself in the presence of the Master with the colours of the seven–fold wings of the serpent. Nothing is impossible to you. Sinning is impossible to you. Sin is your shadow, lead it into the beam of the light of the Guru. Namaskarams. Verily, verily we are in you.

🌷 *అక్టోబరు 27,నేటి ధ్యానము*🌷
🌻 నీ ప్రజ్ఙాంతర మూలాలను మొనసిదాగు గుహలెల్ల
ముద్రలగొని ముచ్చటగ దీప్తి నొందునుజ్జ్వలముగ
దీప్తినిచ్చు దివ్వెలెయ్యవి?
రంగురంగులు మెండైనవి.
గుండె నిండైనవి, కుండలినివి.
గురుదేవుని పదసన్నిధి వెల్గొందును వెన్నెలలై.
సర్పమొకటి సారించును సప్తవర్ణ సుపక్షములను.
ఈ పక్షములు నీపక్షమున తోడురాగ,
పరమగురుని పదసన్నిధిలో పదపదమని,
పరువులిడుము పథము దివ్యమున పైపైకి,
నీకస్యాధ్యమనునది లేనెలేదుగా,
ఒక్కటియె నీకసాధ్యము.
అదియొక్కటి పాపకర్మము.
పాపమన వేరేలేదు, నీ నీడయెనయ్యది
నడిపింపుము నీ నీడను నారాయణుని
నరరూపము పరమగురుని
పరమజ్యోతి పావన కిరణములోనికి.
నిజమిది నిజమిది నీలోన మేముందుము
నీవని, మేమని అరలెందుకు
నీవుగ, మేముగ దిగివచ్చిన
నీలోనను, మాలోనను నిలిచియున్న
నిర్మలుడగు మన స్వామికి నీరాజనమిదిగొ
నమస్సులివిగొ,  సుమనస్సులతోడ....... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

26 Oct, 20:59


*సాధుత్వమనగా మంచితనము.దాని నభ్యసించుట, తపస్సు చేయుట, సత్యము పలుకుట యనునవి యుత్తమ సాధనములు. వాని నభ్యసించినవారు తరింతురు గాని, వాని సభ్యసించుటకు అవి నచ్చవలెను. ఈ నచ్చుటనే ఉత్తమలోక ప్రకృతియందురు. భగవద్గీతలో నిది దైవసంపత్తి యనబడును. ఇట్టి స్వభావముతో పుట్టుట యనగా మొదటగా దేవుని యనుగ్రహము పొందుట.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

26 Oct, 20:59


*Normally before Yoga practice when we read a book, we will be able to understand the book only partially. The result is we have some difference of opinions with the author of the book. After Yoga practice, instead of the mind getting changed, the mind gets elevated.The mind becomes sweeter and sweeter because there are no thoughts,but there is only thought.Previously you have thoughts; now you have only thought and not thoughts.Now, after this change has taken place, you will not have any difference of opinion with the author of any book on this earth. Let it be even a bad book of a bad author because you will read the author, not the book. You will understand why the author has written that book. Then there is nothing bad in the book. This is the state which was experienced when Emerson said, "That there are no bad books in this world. There are only badly written books. There are no bad people in this world. There are only badly behaving people".*

*That is what the great seer Emerson has said. You will understand from what level he spoke. Normally when we read a book, we begin to judge the book of its merits and demerits, so that we may have an opinion upon the book and the author. Even we read the book of great people like Vivekananda or Aurobindo or Shankaracharya or even the Holy Bible, we begin to have our own dirty opinions about them because there is a gap existing between the book and ourselves when we read them.*

*When there is no possibility at all to have an opinion over those books, when the books are given as lights for us to get enlightened, we may be utterly foolish enough to express our opinions about those books. I may say, 'the author of the Old Testament has written like this, but I think there is some defective thinking here. Here the author is mistaken'. Like that we will have our dirty ideas about every author.* *That is the result when we read books before we practise yoga. The result is not the benefit of reading the books, but only the labour and the trouble of reading the book we get. Whatever book we read, we will be having only the trouble of reading it and the additional trouble of having our own dirty opinions about every book. Now, after this change has taken place, if you begin to read a book, the author speaks to you. If it is a bad book, the author will explain you why he has written that book.*

*When you begin to meditate upon any sentence in a scripture, you will become that. Do it for some time. Take another sentence, do it for some time. Take another sentence. It is for this purpose our scriptures are given, our Gospels are given. It is not for logical understanding that these books are given. It is not to discuss and give our dirty opinions about the scripture. But, when we once begin to practise yoga, we will understand that every sentence in every scripture gives you light and not logic. It gives you only presence and not ideas and thoughts.*

*When you propose a sentence in your mind, the sentence should disappear from your mind and the person who has written should stand in your mind. But it is not the face of the person that should stand. It is not the name of the person that should stand. It is not the photograph of that person, but it is that person who stands before you. Where is the person without a body and a photograph and a face and a sentence? An author will be present to you without his picture, without his name and without the name of the book you are reading. The moment you read the sentence, the sentence goes away from your mind. The name of the book never exists in your mind. The impression of author will never exist in your mind but the author exists in you. Author means, the person while he was giving this sentence.The moment one sentence we read from the author,we will read it only as the author and not the sentence. For example, take the sentence of Christ, "I am the way". If you put your new mind on that, you will understand the real meaning of that sentence because it is not the words that you are re

Master E.K. Spiritual and Service Mission

26 Oct, 20:59


ading; it is not the grammar of the sentence that you are reading; it is not the relationship between the meaning and the word that you are reading; but you are reading the author directly. Whichever book you begin to read, you will read the author directly but not the meaning of the sentence. This practice is called Dharana.That is the sixth aspect of yoga practice . 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

26 Oct, 20:59


https://youtu.be/Jk0JcKaZMQ0?si=yhj78jTh7LPe_Zp7

Master E.K. Spiritual and Service Mission

26 Oct, 14:13


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹జీవుని యందు తాను, దేహాదులు కూడా ఉండును. దేహాదులయందు గుణములు మున్నగునవి ఉండును. వానిని తన యందు లీనము చేసి, వర్తింపచేయగల దేవుని వరమే భక్తి. ఇంద్రియములు వేరువేరుగా పనిచేయుచుండటవలన ఇతర విషయములు గోచరించి, బంధము కలుగుచున్నది. ఈ ఇంద్రియములను దేవుని యందు ప్రవర్తింపజేసినచో వానియందు దేవుడు ఉండును.

అట్లే మనస్సును దేవుని కథల యందును, లీలలయందును ప్రవర్తింపజేసినచో దేవుడే మనసునందు అంతర్యామియై నిలుచును. కనుక ఎట్టి ఆపదలును కలుగవు. మోక్ష సాధనకు భగవద్భక్తి అంటిన చాలును. ఇంద్రియములు, మనస్సు విఘ్నకరములు కావు. వానియందు భగవంతుని స్మరించిన చాలును.......... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-242.

Master E.K. Spiritual and Service Mission

26 Oct, 11:39


*భక్తిలో కుటిలత యుండరాదు. అనగా సమర్పణబుద్ధి పూర్తిగా కలుగవలెను. అట్టి బుద్ధితో లోకహితముకొరకై చేసిన పనులు సిద్ధించును. అట్లుకాక తమ ప్రయత్నములపై నమ్మకముతో కోరిన ఫలములకై పనులు చేయుచున్నచో ఊకను దంచుచున్నట్లు నిష్ఫలములైపోవును. ధనాదులు వ్యయమగును. శ్రమ మిగులును.మోక్షము నిచ్చునట్టి ఫలమును విష్ణుభక్తిలేనివారు పొందలేరు.*

*భక్తి యనగా తనకేమి కావలయునో, తనపను లేమగునో, తన ప్రయత్నము ఫలించునో లేదో, తన భవిష్యత్తు ఎట్లుండునో అను ప్రశ్నలు మిగులకుండ భగవంతునకు సమర్పణ చేయుట. విష్ణుభక్తి యనగా ఆ భగవంతుని జీవరాసులలో జూచి, వారికి హితముగా చేయుపనులే దేవుని పూజగా నమ్ముట, ఆచరించుట.ఈ బుద్ధితో కర్మలాచరించుచున్నచో మోక్షము కలుగును- అనగా ఫలములు బంధింపవు. అట్లుకాక, తనకేమి కావలెనో, తన కేది మేలో అది దేవునికన్న తనకే ఎక్కువ తెలియునని కంగారుపడి ఆ ప్రణాళికను నిర్ణయించుకొని దాని ప్రకారము కార్యసాధనకై త్రిప్పలు పడుచుండుట, దానిని సిద్ధించునట్లు చేయుమని దేవుని ప్రాధేయపడుచు ప్రార్థించుట, మున్నగునవి చేయుట వలన బంధములు పెరిగిపోయి, జీవితము నరకమగును. అట్టివారే అంతర్యామి నెరుగనివారు. లేక విష్ణునకు పెడమొగమైనవారు.*

*ధాన్యమునందు గింజకోసమై పొట్టు రక్షణగా సృష్టింపబడినది గాని, పొట్టులో గింజయుండి తీరవలెనని సిద్ధాంతములేదు. మంచి ధాన్యము స్వీకరింపగలవారు గింజకొరకు పొట్టుదంపి తొలిగింతురు. అట్లే సుఖముకొరకు మిగిలిన పనులు సాధించుకొనుట సరియైన మార్గముగాని, పనులుచేయుచున్నచో సుఖము కలుగుననుకొనుట భ్రాంతి. ఏ పనియైన చేయవలసివచ్చుట అనగా దాని ఫలితము కొరకు కాదు. అది చేయు ప్రయత్నమున మన మనస్సు పరిశుభ్రమగుటకు, శరీరారోగ్యము బాగుండుటకు, సుఖమునకు ప్రతిబంధకబుద్ధి తొలగుటకు. ఉదాహరణకు పరోపకారము చేయుట, చేసిన వాని మనస్సు బాగుపడుటకు కాని, పరుని యుపకారమునకు కాదు. ఉపకారము ఒకరివల్ల నొకరికి జరుగదు. దైవముద్దేశించినచో జరుగును. దానికి నిమిత్తమైన వారికి కార్యాచరణము వలన వారి మనస్సు, ఇంద్రియములు పవిత్రమగును. పనులు చేయుట వలన ప్రయోజన మింతవరకు మాత్రమే. ఈ నిజమైన ప్రయోజనము బియ్యపుగింజవంటిది. మిగిలిన కర్మాచరణ శ్రమయంతయు బియ్యముపై పొట్టువంటిది. బియ్యముకొర కేర్పడినది పొట్టుగాని, పొట్టులో నున్నది బియ్యము కాదు. గింజలేని తాలుపొట్టుగూడ నున్నట్లే పైచెప్పిన ప్రయోజనములేని పనులనుగూడ శ్రమపడి చేయుచుందుము. లోకహితము కోరక, తన హితము సాధ్యమనుకొని చేయు పనులిట్టివే. తన పరిస్థితి ఏమగునో యను భయము వలన దృష్టిలో భ్రాంతి పుట్టి, ఇట్టి పనులను చేయు చుందురు. దైవముపై నిజముగా నమ్మిక పుట్టిన వానికి తన పరిస్థితి ఏమగునను ప్రశ్న యుండదు. కనుక భ్రాంతి పడుటయు, ఫలితముగోరి నిష్ఫలములైన పనులు చేయుటయు నుండదు. ఇది తెలియనివాడు ఊకదంచు కొనువాని వంటివాడు. అనగా తన పనులు చేసికొనుటలో గల శ్రమ, భీతి, ఇతరులపై చికాకు మొదలగునవి మాత్రమే దక్కును. గింజలేదు గనుక తాను కోరిన ఫలితము మాత్రము దక్కదు.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

26 Oct, 11:39


*Question: What is Projection of the double?*

*Answer: What we call pratyahara means, absorbing the senses and the mind in ourselves which we have described as the fifth step of practice that creates the projection of the double. While projecting, we will project astral matter. There is no astral body to our self. We will project the planetary astral matter of this earth because there is nothing bad in the astral plane of this earth. The astral plane is different from the astral body. And even some standard authors have committed mistakes in confusing the astral body with the astral matter of this earth. The mistakes are corrected, rectified and clearly explained in the books of Alice A. Bailey.*

*The eight-fold yoga path student will work with the astral plane of this earth and he does not have any astral body at all. That is what happens when he projects his double. This is possible in the fifth step Pratyahara. Patanjali himself answered to this question. He says, Theevra samyogath arambhaha. That means, the more devoted your attempt is, the shorter will be the period.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

26 Oct, 05:32


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Observe nature in its terms, you will understand the meaning of love.🌼

Master E.K. Spiritual and Service Mission

26 Oct, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 సంకల్పం అంతర్యామిదగ్గర నుండి మన దగ్గరకు వచ్చేదేకానీ తన దగ్గర నుండి బయలుదేరేదిగాదు.🌼

Master E.K. Spiritual and Service Mission

26 Oct, 02:31


🌷 *October 26,Today's Meditation*🌷
Wash Karma in space. On the deep blue slate paint ever–elevating colours, ever at the feet of the Master in the Vaisakh valley.

🌷 *అక్టోబరు 26, నేటి ధ్యానము*🌷
🌻 కడిగి వేయు కర్మను, ఖగమునీవై
గాఢమైన నీలాకాశపు ఫలకాన
చిత్రింపుము వర్ణములను
ఎట్టివవి? నిన్ను మెలమెల్లగ సదా,
సమున్నత దివ్యపథగామిగ జేయునవి,
అగాధమైన లోయ యొకటి వైశాఖము.
అందుండును అందుబాటులో
అందింపగ ఆనందము, పరమగురువు పావనుడు.
అరవిందములౌ అతని దివ్యపదములనెప్పుడు విడువక,
ఆ చెంతను చిత్రింపుము వర్ణములను, దివ్యపథాను వర్తులములను.... *మాస్టర్ ఇ.కె.*🌻

Master E.K. Spiritual and Service Mission

25 Oct, 13:38


🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌷 *స్వప్నము* 🌷

🌹 జీవునకు అవిద్య సోకుటవలన కర్మబంధము మొదలగునవి కలుగుచున్నవి గాని, సర్వజీవుల యందు అంతర్యామి అయిన ఈశ్వరునకు కలుగవు.

(జీవుని స్థితిలో కలుగును గాని అంతర్యామి స్థితిలో కలుగవు. జీవుని స్థితి దేవునికి క్రీడ. క్రీడలో కర్మబంధములు కలుగుట దేవుని లీలయే గాని దేవునిపై నిబంధము కాదు.)........ *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-241.

Master E.K. Spiritual and Service Mission

25 Oct, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 There are no many Lords; but there is only one Lord in whom there are millions and millions of minds, senses and bodies.🌼

Master E.K. Spiritual and Service Mission

25 Oct, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 వ్యక్తులు, సన్నివేశాలు దైవస్వరూపాలు. అవి మనం పిలిచినపుడు రావు, వచ్చినపుడు మనం స్వీకరించాలి.🌼

Master E.K. Spiritual and Service Mission

25 Oct, 03:20


https://youtu.be/wKtZEl_jnyk?feature=shared

Master E.K. Spiritual and Service Mission

25 Oct, 03:20


https://ekramkumar.blogspot.com/search?updated-max=2024-04-01T09:41:00-07:00&max-results=7&start=119&by-date=false

Master E.K. Spiritual and Service Mission

25 Oct, 02:09


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

23 Oct, 05:30


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 You are always successful when you practice in groups.🌼

Master E.K. Spiritual and Service Mission

23 Oct, 05:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 దీక్ష యనగా మరొక ధ్యాసలేకుండుట.🌼

Master E.K. Spiritual and Service Mission

23 Oct, 00:59


🌷  *October 23, Today's Meditation*🌷
Vena, the Gandharva, is wiping off the
pictures of the subconscious mind on the walls of
my nature with the hieroglyphs of sounds from his
seven stringed lyre.

🌷  *అక్టోబరు 23, నేటి ధ్యానము*🌷
🌻 మ్రోయించును వీణను మోహనముగ
వేనుడనే గంధర్వుడు సప్తతంత్రీ నిస్వనముల
స్వరస్వనముల సూచించెడి చిత్రములు
చిత్ర చిత్ర మహిమాన్వితములు.
చిత్రములున్నవి నా స్వభావ కుడ్యముల పైన
అధో లోక సంచారిణియౌ నా చిత్తము చిత్రించినవి
చిత్రము విచలించి తొలగిపోవు
గంధర్వుడౌ వేనుని చిత్రణముల విచిత్ర మహిమతో.....

Master E.K. Spiritual and Service Mission

22 Oct, 18:39


https://youtube.com/shorts/VsmSWSL9bI0?si=dzxoDAaas_Y2zu7P

Master E.K. Spiritual and Service Mission

22 Oct, 18:39


*భగవంతుని పాదములయందు సమర్పణబుద్ధితో తన కర్తవ్యములు నిర్వర్తింపనివాడు మోహము చెందును. తాను చేయుపనులు తనకు కావలసిన ఫలితములకోసమని నమ్మినవాడు ఆ పనులు తాననుకొన్నట్లు జరుగక పోవుటవలన మనస్సును మోహ మావహించును. అపుడతడు ఇతరులపై విరుచుకొనిపడి, కామక్రోధాది నీచప్రవర్తనతో పశువువలె బంధింపబడును. ఏ ఫలితములకోసమో ఎదురు చూచుచుండగా కాలము గడచి, ముసలివాడగును. మృత్యువు వచ్చుచున్నపుడు మతి చెదరిపోవును. అట్టికాలము సర్వసమర్థమైన భగవంతుని స్వరూపము. అట్టి భగవంతునకు సంతోషముతో నమస్కరించుట యనగా కాలవశమున జరుగు మార్పులలో భగవంతుని చూచుట యని అర్థము. అట్లు చూచుట నేర్చిన వానికి ముసలితనము, మృత్యువు కలుగవు. అనగా అవి దేహమునకు కలుగుచున్న సహజములైన మార్పులుగా, భగవంతుని స్వరూపములుగా గమనించుట వలన మతి చెదరకుండును. చెదరనిచో ముసలితనమున మతి చలింపదు. శరీరము తొలిగిపోవు కాలమున గూడ మతి చెదరనిచో ,శరీరము తొలగిన వెనుక గూడ చెదరదు. అట్టివానిపై జనన మరణములు పనిచేయవు.*

*అట్లుకాక తాను సంపాదించిన ధనము మున్నగునవి తనకన్న గొప్పవని నమ్మి, అవి తన్ను రక్షించునని నమ్మి, ప్రణాళికలు బిగించుకొన్నచో చివరి క్షణములలో అవి రక్షింపవని తెలిసినపుడు మతిపోవును. శరీరము తొలగుటకు ముందు తెలివి తప్పును. దీనినే మృత్యువందురు.*

*పశువనగా పాశముచే గుంజకు బంధింపబడినది. పశుప్రాయుడనగా తన ప్రణాళికలచేతను, కామక్రోధాదులచేతను, వ్యాధులచేతను బంధింపబడిన మనస్సు కలవాడు. అట్టివాని దృష్టిలో ముసలితనము భయంకరమైనది. కామవ్యాధి కలవాడు ముసలివాడగుచున్నపుడు స్త్రీలకది కనిపించకుండ దాచుకొనుటకై మీసములకు, జుట్టుకు రంగువేయుచు కేశదాస్యముచేయు దాసుడిట్టివాడే. దైవమును నమ్మినవానికి అన్నిటియందును వలెనే ముసలితనమునందు గూడ వేడుక తప్ప మరియొకటి యుండదు.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

22 Oct, 18:39


*Question: Can we get psychological powers when we attain Samadhi?*

*Answer: It is neither a flash nor a state but it is our own real state of existence. Therefore, when once started it exists as long as we exist because it is ourselves fully awakened. It is an awakening from within and not any psychological power or force. Psychological powers or forces are only layers of our consciousness, whereas the Samadhi state is our own existence in its fullest awakening.*

*Therefore it exists as long as we exist. Even though our mind and senses are sleeping and we know it that our mind and senses are sleeping. So, you will experience conscious sleep after attaining Samadhi.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

22 Oct, 13:56


SCORPIO
Silence - Secrecy - Completion
Mystery - Insight - Intuition
Past - Present - Future.

Master E.K. Spiritual and Service Mission

22 Oct, 13:21


🌸 *శ్రీమద్భాగవతము*🌸


🌷 *స్వప్నము*🌷

🌹జీవుడు నిద్రపోయినపుడు స్వప్నములు కలుగును. అందుతాను సమస్త సుఖములు అనుభవించును‌‌. లేదా ఆత్మహత్య, ఇతరులు తన శిరస్సును ఖండించి, హత్య చేయుట మున్నగు సన్నివేశములు గూడ అనుభవింపచ్చును. మెలకువ వచ్చుసరికి తన నిజస్వరూపము తనకు జ్ఞప్తికి వచ్చును. అపుడు గూడ స్వప్నము నందు జీవుని సుఖ దుఃఖములు నిజముగా బంధించుచున్నవి గదా!

ఎవరైనా చంపుచున్నట్లు కల వచ్చినప్పుడు నిజముగా భయపడును గదా! భగవంతునికి ఇట్టి అనుభవము కూడ అంటునా? అని నీ మనస్సున సందేహము కలుగవచ్చును. వివరించెదను వినుము....... *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-237, 238.

Master E.K. Spiritual and Service Mission

22 Oct, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Trying to beautify your sourroundings is called the attitude of health.🌼

Master E.K. Spiritual and Service Mission

22 Oct, 05:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 తనయందుగాని, ఇతరులయందుగాని సద్గుణములను దర్శించినపుడు వానిని విస్తరింప చేసికొనుట భగవంతుని గుణకీర్తన మనబడును.🌼

Master E.K. Spiritual and Service Mission

22 Oct, 00:03


🌷 *October 22,Today's Meditation*🌷
The path of I AM is in eternal darkness. Darkness is the variegated serpent of the nether worlds. The music of the nether worlds blinds the lyre with music of the seven stringed lyre of Apollo. I bore the darkness into the spectrum of variegated light.

🌷 *అక్టోబరు 22, నేటి ధ్యానము* 🌷
🌻 శాశ్వతాంధకారాన చెలగు "నా" పథము.
ఈ గాఢాంధకారమనగా నెయ్యది?
అధోలోకాల విహరించు వివిధవర్ణ చిహ్నిత సర్పమే.
సంగీత రసాథి దేవుడుగద "అపోలో " గంధర్వుడు.
సప్త తంత్రీ సమన్విత వీణావాదన నిపుణుడు.
"సరిగమ" లతో  సామరస్య మొలికించెడి ఆతని సామగానము,
సకలరోగ బాధా సమ్మోహనమ్ము.
సప్తస్వర సంగీత సాగరమున,
పులకించును సాగర గర్భాన దాగు రసాతలమెల్ల.
రసాతల సరస గాన మహిమతో,
విపంచియే విలోకనము కోల్పోవు.
తమము చీల్చి నేను సప్తవర్ణ సంరాజమౌ
స్వయంజ్యోతి స్వారాజ్యము చేరుకొందు..... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

21 Oct, 21:19


*Question: Can we see the planetary deities?*

*Answer: We can see the physical bodies of those planets, but we cannot see the planet; Just as our physical eye can see only your physical body and it cannot see you. When I am talking to you, it is my mind that is seeing your mind and not the physical eye. Similarly, with our physical eye, we are seeing only the physical planets, but the real functional planets are not physical planets, just as we are not our physical body.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

21 Oct, 21:19


https://youtube.com/shorts/oBI7nzuDKQE?si=vnHjFTbS-iwbeZDd

Master E.K. Spiritual and Service Mission

21 Oct, 21:19


*భగవంతుని సగుణుడుగా, నిర్గుణుడుగా విడదీసి వర్గీకరణము చేయు నహంకారము మానవునకున్నది. అందు సగుణుడు పిల్ల దేవుడనియు, నిర్గుణుడసలు దేవుడనియు నిర్ణయించు నధికారమును గూడ మానవుడు తన భుజస్కంధములపై వహించుచున్నాడు. ఈ శాస్త్ర సిద్ధాంతములకు కట్టుబడియుండవలసిన గతి దేవునకు పట్టినది. ఇది ఒక సంప్రదాయము. ఈ వర్గీకరణము లన్నియు మానవుని మనసున భాసించుట దేవుని లీలయని మరియొక సంప్రదాయము. ఈ సంప్రదాయము ప్రకారము దేవుడు సగుణుడుగా నుండవలెనా, నిర్గుణుడుగా నుండవలెనా యను విషయమున నిర్ణయము దేవునిదేగాని మానవునిదిగాదు. సృష్టిలో దేవుడెప్పుడును సగుణుడే. సృష్టి కవ్వల దేవుని ప్రసక్తి మానవుని యూహయేగాని మరియొకటిగాదు.తొలుత బ్రహ్మ నారాయణుని గుణసహితునిగా స్తుతించెనట! సృష్టించుటకు నియమింపబడినవాడు బ్రహ్మ. అతడు దేవుని సృష్టిలోని యంతర్యామిగా, సగుణునిగా వర్ణింపక మరియెట్లు వర్ణించును? ఈ వర్ణనమువలన దేవుడు సంతోషించెనట! సంతోషించుట సృష్టిలోని జీవుల లక్షణము. ఆ రూపమున మాత్రమే దేవుడు సంతోషించునని విశ్వసింపవలెను.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

21 Oct, 14:16


🌸 శ్రీమద్భాగవతము 🌸


🌷నిర్గుణుడగు భగవంతుడు సృష్టిలో సగుణుడై ఉండుట ఎట్లు ?🌷

కనుకనే మోక్షసాధన అను పేరున జీవుడు గూడ సృష్టికి అతీతుడై భగవంతుని స్థితిలో ఉండును. బంతియాట ఆడుచు దానియందు నిమగ్నుడైన బాలునకు కూడ ఏ క్షణమం‌దైనను, ఆటను నిలిపివేటయుకు గాని మరల ఆడటకు గాని, నియమములను క్రీడకను గుణముగా మార్చుకొనుటకు గాని స్వాతంత్ర్యమున్నది.
అట్లే జీవుని రూపముననున్న వాడు స్వస్వరూపమును పొందుటకుగాని, భగవంతుడైన తన సాన్నిధ్యమును జీవుడై తాను అనుభవించుటకుగాని, సాధ్యపడుచున్నది.

ఈ విధముగా అద్త్వెతానుభవము, విశిష్టా విశిష్టాద్వైతానుభవము, ద్వైతానుభవము అను వానిలో దేని నైనను జీవుడు కల్పించుకొనవచ్చను. సాధన చేయవచ్చును. తరిం‌చి అనుభూతి పొందవచ్చును. అందునొక దానిలో బంధింప బడినపుడు మాయ పనిచేసి కేవలము జీవుడుగా, సంసారిగా దుఃఖము‌, పట్టుదలలు, మున్నగు వానితో బాధడును. అద్వైతి అద్వైతిగను, ద్వైతి ద్వైతిగను చనిపోవును.................. *మాస్టర్ ఇ.కె.*

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-236

Master E.K. Spiritual and Service Mission

21 Oct, 07:07


Document from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

21 Oct, 07:07


Photo from Srimannayana

Master E.K. Spiritual and Service Mission

21 Oct, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 You have no right to insult anyone if you want to follow the God-path.🌼

Master E.K. Spiritual and Service Mission

21 Oct, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ప్రశాంతమైన మనసుతో గురువును స్మరిస్తే, అతడు మనల్ని కలుసుకుంటాడు.🌼

Master E.K. Spiritual and Service Mission

21 Oct, 01:39


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

21 Oct, 00:04


🌷 *October 21,Today's Meditation*🌷
The tongues of the serpent are raised from the stings of the scorpion. The tongues of the serpent are the wings of the eagle. Moon bears serpents. Sun enters eagle.

🌷 *అక్టోబరు 21,నేటి ధ్యానము* 🌷
🌻 వృశ్చికపు కొండి నుండి
ఉద్ధరింపబడును సర్పజిహ్వలు.
సర్పజిహ్వలే సుపర్ణుని పక్షాలు.
సర్పముల భరియించును శశియు.
సూర్యుడేమో సుపర్ణు ప్రవేశించు..... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

20 Oct, 18:40


*Question: What is Shakthipatham?*

*Answer: Shakthipatham is a word used by a school of yoga practitioners. The Masters of some path will create the flow of the yogic power in the disciple through their will in many methods, either by touching the head by their hand or looking into the eyes or giving a sound for us to utter. That will be the beginning of a new flow of force in us which gradually leads us into perfection and gradually leads us for the awakening of the consciousnesses in us. That is the real meaning of the Shakthipatham.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

20 Oct, 18:40


*క్రతువులు, ఉగ్ర తపస్సులు చేయువాడు తన్ను మిగిలిన వారికన్న వేరుగా భావింపవచ్చును. దానములుచేయువాడు తన దగ్గర దానము పట్టిన వారిని తనకన్న క్రింద నిలుచుండబెట్టవచ్చును. మరియు వారు తన వలన మేలుపొందిరని జ్ఞప్తియుంచుకొనవచ్చును. తాననుకొనినట్లు వారు ప్రవర్తింపనిచో క్రోధము, దుఃఖము పొందుట న్యాయమనిపించవచ్చును. అన్ని వ్రతములు మిగులకుండ చేసినవాడు తన పాపమంతయు నశించినదని నమ్మవచ్చును. ఇట్లీ సత్కర్మల వలన కలిగిన దుర్భావములు కర్తకు తెలియకుండ రాక్షసులై ఆక్రమింతురు. వారితో పోరాడుచు, ఆ జీవులు సంసారము చేయవలసియుండును. అట్టి పోరాటములలో భగవంతుడు వారికి తోడ్పడడు. మనస్సునకు గోచరించుట గూడ చేయడు. కోప తాపాదులు కలిగినపుడు భగవంతుడు జ్ఞప్తికి వచ్చుట ఎట్లు? ఆ సమయములలో అతడు చల్లగా తప్పించుకొనును. ఇట్లు చేయుట ఎందులకు? రాక్షస సంహారమునకు భగవంతు డేర్పరచిన మార్గమొకటి వేరుగా నున్నది గదా! దాని నవలంబించినచో నతడు గోచరించి తోడ్పడును.*

*ఆ మార్గమిట్లున్నది! తన ప్రవర్తనము, తన భావములు, ఇతరుల ప్రవర్తనము, వారిని గూర్చిన తన యభిప్రాయములు, భగవంతుని యందు సమర్పణ చేయవలెను. తాను ధర్మమను కొనుచున్నది గూడ తన యభిప్రాయమే గనుక దానిని గూడ సమర్పణము చేయవలెను. “సర్వధర్మములను సన్యసించి, నన్ను శరణుపొందుము. నేను సర్వపాపముల నుండి నిన్ను విమోచనము చేసెదను. ఇక శోకమక్కరలేదు” అని భగవద్గీతలో చరమ శ్లోకముగా నుపదేశించిన కర్తవ్యమిదియే. ఈ సమర్పణ చేసిన వారికి గోచరించినట్లు భగవంతుడితరులకు గోచరింపడు. కారణమేమి? వారట్లు సమర్పించి నపుడే వారిలోని రాక్షసులు భగవంతుని యందు శత్రుత్వము వహింతురు. అప్పుడు కాని భగవంతుడు రాక్షస సంహారుడు కాలేడు. రాముడరణ్యమున చరించుచున్నను, ఋషులను బాధించుచున్న రాక్షసులను సంహరించుటకు కావలసిన శత్రుత్వమేర్పడలేదు. ఋషులందరు రామునకు శరణాగతి చేయుటవలన రాక్షసులు రామునికి శత్రువులైరి. అప్పుడు కాని ఋషుల కభయము పల్కుటకు రామునకు సందర్భము కలుగలేదు. అట్లే ప్రతి జీవి విషయమునను.*

*ధర్మమును గూర్చి ఎవని యభిప్రాయము వానికుండును. అది యున్నంతవరకు అతడు దానితో తంటాలు పడవలసినదే గాని, దైవము కరుణించునని తెలియదు. ఈ సత్యమునే క్రోడీకరించుచు అదే దైవము ఏసుక్రీస్తు ద్వారమున పల్కినపుడు *Judge not lest ye be judged" అనెను. నీకున్న యభిప్రాయమునుబట్టి నీపై నభిప్రాయము లేర్పడునని దీని సారాంశము.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

20 Oct, 18:40


https://youtube.com/shorts/HZ01eBfTgP0?si=dk4aVZ-pMX8Bx_ZS

Master E.K. Spiritual and Service Mission

20 Oct, 13:37


🌸 శ్రీమద్భాగవతము 🌸


🌷నిర్గుణుడగు భగవంతుడు సృష్టిలో సగుణుడై ఉండుట ఎట్లు?🌷

వినుము ! తర్కము, వాదము మనస్సునకు కలిగినప్పుడెల్ల మాయ అడ్డుపడును. భగవంతుడు అన్నిటికన్నా మొదలున్నవాడు, నిత్యముగా ఉండువాడు గనుక,వానియందు ఈ తర్కములు పనిచేయవు. వానికి నిర్గుణత్వము, సగుణత్వము అనునవి, లీలలే గాని బంధనములు గావు.దేవుడు నిర్గుణుడు అనగా వానియందు ప్రాణులు పుట్టుటకు వీలు లేదన్నది తర్కమే గాని సత్యము కాదు.నిర్గుణనియందు గుణములు పుట్టుచు, మాయమగుచున్నవి అనునది సత్యము. ఇది ఎట్లు సాధ్యము అను ప్రశ్న తర్కము. సాధ్యా సాధ్యములు ప్రశ్నించు వాని మనస్సునకే గాని భగవంతునికి లేవు. బంతి ఆట ఆడుకొను బాలకులు బంతి ఆటను గూర్చిన కొన్ని నిబంధనలు ఏర్పరచుకొందురు వాని ప్రకారము ఓడుట, గెలుచుట ఉండును. ఆట నడుమ నిబంధనలకు విధేయత చూపవలసి ఉండును. ఆటకు ముందుగాని, ఆట అయిపోయిన తరువాత గాని ఈ నిబంధనలు వర్తింపవు. అట్లే సృష్టికి ముందుగాని, తరువాత గాని, భగవంతుడు సృష్టి నియమములకు అతీతుడు గనుక నిర్గుణుడు. సృష్టి యందు గుణముల నియమములు వర్తించును. అందు జీవుల రూపమున దేవుడు సృష్టి నియమములకు విధేయుడు. ఇది అంతయు క్రీడయే గాని బలవంతము కాదు............ మాస్టర్ ఇ.కె.

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-236.

Master E.K. Spiritual and Service Mission

20 Oct, 06:49


శ్రీకృష్ణాశ్రమము, పెదముత్తీవిలో జరిగిన భాగవత సప్తాహ ప్రసంగముల వీడియోలు Master EK Spiritual and Service Mission యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయబడినవి. ,"శ్రీమద్ భాగవత రహస్య ప్రకాశము- ప్రథమ స్కంధము" అనే ప్లేలిస్టులో Part 64 నుండి Part 74 వరకు (11 భాగములు) ,"శ్రీమద్ భాగవత రహస్య ప్రకాశము- ద్వితీయ స్కంధము" అనే ప్లేలిస్టులో Part 001 నుండి Part 011 వరకు(11 భాగములు) భాగవత ప్రసంగములు అప్లోడ్ చేయబడినవి. Vasudeva 🙏

Master E.K. Spiritual and Service Mission

20 Oct, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Loophole in awareness is death.🌼

Master E.K. Spiritual and Service Mission

20 Oct, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 చిరకాలము జీవులయందు దయనభ్యసించినపుడు మాత్రమే వారి యాకారములు భగవంతునివిగా తెలియును.🌼

Master E.K. Spiritual and Service Mission

20 Oct, 02:07


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

20 Oct, 00:04


🌷 *October 20, Today's Meditation*🌷
Loosening the spirals of Karma, the serpent shines winged and escapes through the bore of the Sun’s body from above the eyebrows. Henceforth the serpent is the winged messenger of the Gods. He is Mercury


🌷 *అక్టోబరు 20, నేటి ధ్యానము*🌷
🌻 సంశోభిల్లును సర్పమొకటి,
విచిత్రము దాని తీరు, వినతాసుతువోలి
రెక్కలతోడి రంజిల్లును.
కర్మ బంధనాల చుట్టల కలికిగా వదలించును.
సౌరదేవుతనువు సంవర్తించును
సౌధాంతర నాళముగా కనుబొమల పై కెగువన
సర్పమీ నాళమున సుడులు తిరిగి సరిగా జారిపోవు.
సుమనస్సుల దూతయిది.
రెక్కలతోడి దూతయిది.
సర్పమెవ్వరను కొందరు?
ఇంకెవ్వరు? సోమసుతుడు మన బుధుడె...... *మాస్టర్ ఇ.కె.* 🌻

Master E.K. Spiritual and Service Mission

19 Oct, 18:34


https://youtube.com/shorts/-7_IfGYMCe4?si=k7qKKSvZ2Qrxwj__

Master E.K. Spiritual and Service Mission

19 Oct, 18:34


*విష్ణుని మాయచేత ఈ సృష్టియంతయు నొక తీరుగా నేర్పడి, పుట్టుట, వర్తించుట, లయమగుట, అను స్థితులు కలిగియుండి, భూత భవిష్య ద్వర్తమానములు సంభవించుచు, మిక్కిలి కుతూహలము కలిగించుచుండును.*

*వేగముగా కారులో బోవుచు, కిటికీనుండి ప్రక్కకు చూచినచో వస్తువులు దృశ్యమునందు ప్రవేశించుట, కనుపించుట, దాటిపోవుటయను స్థితులు కలుగును. ఈ స్థితులు ఆ వస్తువులకు లేవు. అవి కనుపించకముందును, దాటిపోయిన వెనుకను గూడనున్నవి. వాని యస్తిత్వము కారు వేగముతో మారునది కాదు. ఐనను, దృశ్యమానత మారుచుండును. కారు వేగమువంటిది విష్ణుని మాయ. దానివలన కాలము పుట్టును. అది వస్తువులు పరుగెత్తుచున్నట్లు కలుగు భ్రాంతి. దానియందు భూత భవిష్య ద్వర్తమానములనబడు మూడును పుట్టుచుండును. అందు వర్తమాన మొక్కటి సత్యము.*

*ఈ మూడింటికిని సృష్టి స్థితి లయములకును, అవినాభావ సంబంధమున్నది. లయమనునది భూతకాలముగా భాసించును. కనుకనే పోయినవారు; పోయిన వస్తువులు, మన మనస్సునకు భూత కాలమున నుండును. సృష్టి భవిష్యత్కాలముగా భాసించును. కనుకనే పుట్టబోవువారు మనస్సునకు భవిష్యత్కాలమున నుందురు. స్థితి వర్తమానకాలముగా భాసించును, కనుకనే మన ఎదుట కలవారు వర్తమాన కాలమున నున్నారు. వీని నెంత గమనించినను, మనస్సున కలవాటు కాక ఎప్పటి కప్పుడు మిక్కిలి కుతూహలమును కలిగించుచుండును.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

19 Oct, 18:34


*Question: What causes phobias?*

*Answer: The causes appear to be pre-natal. In many cases, I detected pre-natal causes to such incidents. My research about this point began when I noticed a friend very much afraid of snakes. He was not only afraid of snakes, but also afraid of a mention of snakes. When he happened to see the picture of a snake anywhere in any house, immediately he receives a nervous shock and goes away. For about one or two days, he is disturbed. Then, my researches resulted in an observation that when his mother was carrying him, she was sleeping in the village.From the top of the cottage, a snake fell upon her and went away. She was left quite unhurt, but she received a horrible mental shock. Due to such reasons, you find the instinctive fear of certain insects and snakes and scorpions. There is a common fear which is to some extent common to all of us about these insects. There is a deeper cause for this. You will understand it if you go deep into the world scriptures. Until the advent of man was there on this earth, there were no venomous insects on this earth. When man began to hate man, the thought forms of man escaped from his mind into the space around this earth. The images of jealousy and hatred escaped in thought form which produced the various venomous insects. This is how the scriptures speak about these venomous creatures.*

*The fear of the human being is quite different from the fear of any of the animals. To the animals, it is an instinct to protect itself. In the case of human being, fear is intellectualized and magnified. If a scorpion were to be on the way, it never gives a sting to you unless you cause some pressure to it. Even then, it is only a necessity that it makes a sting and there is no vicious motive.*

*But, when you observe a human being, if he suspects the existence of a scorpion, he makes a thorough search with the help of lights. He hunts it and kills it. We can easily understand where the poisonous nature exists originally. We cannot deny this fact. Man kills for no reason, but for his fear or for his fancy, whereas animal kills either for food or for protection.* *Special fear can be from the previous birth, but the general fear is due to the instinctive evil in the human nature. A specific fear may have its causes in its previous karma. Intelligence is given to man by nature to make his place impossible for scorpions to come and if at all they come by accident, the human being has intelligence enough to throw it away without killing. It is only for that purpose intelligence is given for the human being.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

19 Oct, 14:02


🌸 శ్రీమద్భాగవతము 🌸


🌷నిర్గుణుడగు భగవంతుడు సృష్టిలో సగుణుడై ఉండుట ఎట్లు ?🌷

తెలిసిన వారిలో పెద్దవాడవైన నీవు నా సంశయములను తొలగింపదగినవాడవు అని విదురుడు మైత్రేయుని ప్రశ్నించెను.

విష్ణుని కథలు గ్రోలుట యందు ఆసక్తి కలిగి ఇట్లు ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడిట్లనెను............✍️ మాస్టర్ ఇ.కె.

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-234, 235

Master E.K. Spiritual and Service Mission

19 Oct, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Don’t expect others to understand what you do and don’t wait till others do good things, let it start with you.🌼

Master E.K. Spiritual and Service Mission

19 Oct, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ఇతరుల చెడ్డ వృత్తాంతముల యందు ఆసక్తి కలిగి చెప్పుకొనువారు విష్ణుస్థానమును పొందలేరు.🌼

Master E.K. Spiritual and Service Mission

19 Oct, 01:56


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

18 Oct, 23:45


🌷 *October 19, Today's Meditation*🌷
Up the ladder creeps the serpent. Self–opposing coils harmonised. Ascending the vertical bore of the eternal centre.

🌷 *అక్టోబరు 19, నేటి ధ్యానము*🌷
🌻 మూలాధారాన మూలమై యున్నది
మాతృశక్తియదె తేజోమయ సర్పాకృతి
షట్చక్ర నిధానము, నిచ్చెనయదె కులకుండము
సర్పముప్రాకును నిచ్చెనపై పైపైకి కుండలములు
పరస్పరాభి ముఖములౌ నయ్యవి పరస్పరత్వము తోడ
శిరమునుండి జాలువారు శివుని కరుణయే సమయమై
పృథివి నుండి పైకి ప్రాకు ప్రయత్నమది
సాధకునిది కౌలయోగమై
సనాతనమౌ కేంద్రము, సదాశివుని ఆలయము
సాధకుడారోహించును సుషుమ్నాంతర శూన్యపథము..... మాస్టర్ ఇ.కె. 🌻

Master E.K. Spiritual and Service Mission

18 Oct, 18:34


*Question: Does the patient need spirituality to get healed?*

*Answer: The patient need not have much spirituality. Because if at all he has sufficient degree of spirituality, he cannot be called a patient. So, there is no use of our dictating terms for the suffering mankind. It is the healer who has to qualify himself and it is his merit and excellency that makes a patient not only a healthy man but also a healer in his own terms.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

18 Oct, 18:34


https://youtube.com/shorts/xn7lo1cd0Oo?si=Nspf-pvHGw8c--hF

Master E.K. Spiritual and Service Mission

18 Oct, 18:34


*ఎవ్వని చూచినను వాడుగా దేవుడున్నాడని ధ్యానింపవలెను. ప్రియమైన వస్తువులను చూచినపుడు ప్రియమైన వస్తువులుగా దేవుడున్నాడని స్మరింపుము. అప్పుడు వస్తువు, వ్యక్తియొక్క నామరూపములు వానితో మనకుగల సంబంధము కరగి అంతర్యామి నిలుచును. ప్రియమైన వస్తువులనగా దేవునకు ప్రియమైన వస్తువులని కాదు. ఎవడు దేనియందు ప్రియపడునో వాని కా వస్తువులని అర్థము. ఇట్లు భావించుటనే వాసుదేవోపాసనమందురు. వసించు దేవుడు వాసుదేవుడు. "Living God" "వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం" అని విష్ణు సహస్రనామ స్తోత్రము వాసుదేవ శబ్దమునకు సర్వభూత నివాసునిగ నిర్వచన మిచ్చుచున్నది.* 🪶 *మాస్టర్ ఇ.కె*

Master E.K. Spiritual and Service Mission

18 Oct, 12:56


🌸 శ్రీమద్భాగవతము 🌸


🌷నిర్గుణుడగు భగవంతుడు సృష్టిలో సగుణుడై ఉండుట ఎట్లు ?🌷

ఆ మాయతోనే సమస్తము సృష్టించుచు మాయము చేయుచుండును. దేశము, కాలము అను భేదములను పుట్టించుచుండును. ఇతరులను సృష్టించును. వారిని జ్ఞానులుగా చేయును. తాను ఒక్కడే అయి ఉండియు సమస్త జీవుల రూపమున శరీరములు ధరించి, వసించును. అట్లనచో జీవులకు కష్టములు, దౌర్భాగ్యము అను లక్షణములు దేని వలన కలిగెను? ఈ సంశయము వలన నా మనస్సు అజ్ఞానము చెందినది. దానిని సరి చేయుము............ మాస్టర్ ఇ.కె.

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-233

Master E.K. Spiritual and Service Mission

18 Oct, 05:31


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 Nature never imparts us secrets until we are matured.🌼

Master E.K. Spiritual and Service Mission

18 Oct, 05:31


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 దానము గాని, ఆతిథ్యము గాని, సహాయము గాని, సేవ కాని మన వద్ద స్వీకరించేవాడిది కాదు భాగ్యము; ఇచ్చేవాడిది భాగ్యము.🌼

Master E.K. Spiritual and Service Mission

18 Oct, 02:41


Photo from Venuastro

Master E.K. Spiritual and Service Mission

17 Oct, 20:56


*Question: What is the place of acupuncture in the treatment of diseases?*

*Answer: It is one of the advanced sciences, at the same time most ancient and it also forms a part of real healing. But, the modern practitioners are still in infancy and a systematic training and systematic course is required before it can be successfully used. There are experts in acupuncture, but many imitators are also trying to do harm to many people, just as there are false astrologers and commercial doctors. But it is a very valuable dimension in the direction of healing and it should be practised, systematized and made a course to be taught to students in a systematic way.* *Question: What is the solution?*

*Answer: The solution is to gather into groups and make new trainees in homeopathy in the light of spiritual sciences. Instead of making long and tiring discussions with people who already know something, it is better to make a new beginning with new recruits when after a time the old recruits are also ready to receive. That gives much economy of labour and effort. In India, I have started in the same line. I have prepared the first group of servers from those who are around me and trained them as the first batch of homeopathic physicians, at the same time, enlightening them into the world scriptures.*

*Even today the classes run in such a direction that in each session of two months in the vacations, I conduct classes of scriptures in the morning and classes of homeopathy in the evening. At the end of the two months, I issue a diploma to them, so that he comes and take part in one of the existing clinics for one year when they can begin to prescribe. Now, at the end of fifteen years, I have prepared many hundreds of qualified physicians in homeopathy who are very well versed in the scriptures also. Who know yoga and spiritualism and the so called scientific doctors of our place, they began to come to consult us now. First, they consulted in secrecy and now they consult us openly. They bring their patients to our clinics and they feel it a joy to get them cured and gradually there is coming a time when all the doctors are taking part in our group.*

*Suppose I began with opposing the existing doctors, what would have been the future? It is only wastage of time and energy. So, same thing may be attained in Belgium also. We can start in the same direction doing our lot of good work in our own way, forming groups; get ourselves trained in the homeopathy and spiritual healing; beginning to heal our own families. That is how we started and that is how I believe everyone should start. We have in our clinics a systematic way of case taking. The form consists of not only the name and address of the patient, but also the date, time and place of birth. In really chronic diseases, which take a very long time to cure or which are already over drugged for a very long time, we definitely make a horoscope and by studying the natal horoscope and the progressed chart, we make an estimate of the possibility of curability and the mode of treatment to be used.*

*At every step, the horoscope is useful in such complicated cases so that we may use every part of our healing knowledge and the persons who live with the patient are also carefully decided. To decide the diet and the daily habits of the patient, we use astrology when we find a case very much complicated.* 🪶 *Master E.K.*

Master E.K. Spiritual and Service Mission

17 Oct, 20:56


https://youtube.com/shorts/xAMtSuQP8oM?si=23N9iV9tWEvsMtKz

Master E.K. Spiritual and Service Mission

17 Oct, 20:56


*వనములు నాటుట, చెఱువులు త్రవ్వించుట, ఉపనయనములు వివాహములు చేయుట, దేవాలయములు నిర్మించుట; భూదానములు మొదలగు దానములు చేయుట, జపములు; తపములు, వ్రతములు, యజ్ఞములు చేయుట, యోగము నభ్యసించుట మొదలగునవి దేవుని స్తోత్రముతో సాటిరావు.* *సత్కర్మలుమాని స్తోత్రము పఠింపుమని అర్థము కాదు. సత్కర్మాచరణమున "నేను" అను వెలుగు అంతర్యామిత్వము వహించుట నభ్యసించుట కొరకై దేవుని స్తోత్రము నుచ్చరించుట తప్పనిసరియైన మార్గమని యర్ధము. అది లేనిచో సత్కర్మాచరణమున పరోపకారము చేయువాడు, పొందువాడు వేరుగా భాసించి జీవులుగనే మిగిలిపోదురు. దానితో నహంకారము పుట్టక తప్పదు. మనవలన నుపకారము పొందినవాడు మనయందు సద్భావము, విధేయత, విశ్వాసము చూపవలెనను ఆసుర బుద్ధిపుట్టును. దానికి తావులేకుండ చేయుటకై నిత్యము దైవ స్తుతి ఆవశ్యకమని అర్థము.* 🪶 *మాస్టర్ ఇ.కె.*

Master E.K. Spiritual and Service Mission

17 Oct, 20:44


🌷 *October 18,Today's Meditation*🌷
Cure earth by food, cure water by drink,
Cure fire by heat, cure air by breath,
Cure sound by thought, cure mind by truth,
Cure is complete.

🌷 *అక్టోబరు 18, నేటి ధ్యానము*🌷
🌻 బాహ్యజగమున ప్రవర్తించునది,
పాంచభౌతిక దేహమిది.
పృథివికి ఔషధ మన్నమె,
సాత్త్విక రసమయ నిదానమే.
జలముల మలినము మటుమాయము చేయునదె,
గళమున త్రావెడు సుధామధు పానీయమే.
ప్రాణాగ్నిని ప్రజ్వరిల్లగ జేయునదె,
బాలభానుని నులివెచ్చని రశ్మియే.
మనలో గాలికి గాలము వేయునదె సోమము.
గాంధర్వము గానము శ్వాసనియమమె.
దహరాన దాగిన స్వనము నలరించునదె,
పరమపావనము భావనా బలమె.
పంచవృత్తుల ప్రతిబింబాలు,
పరావర్తించుగద చిత్తమందునను.
పరిణమించు నివె రోగవిపాకములుగ.
సత్యమైన 'నా' అస్తిత్వ స్ఫూర్తియే,
సత్యదూరములగు చిత్తవృత్తుల నిరోధము.
సత్యముగనంతట పరిపూర్ణమగును,
సత్యవర్ధనంబు, రోగనిదానమును..... *మాస్టర్ ఇ.కె.* 🌻

1,868

subscribers

2,453

photos

1,527

videos