విచిత్రం ఏమిటంటే మనల్ని వివిధ రోగాల బారి నుండి కాపాడే మన శరీరంలోనే రోగనిరోధక శక్తే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి శరీరంలోని తన స్వంత కణజాలాలపై దాడిచేస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో అంతర్గత అవయవాలపైనా దాడి చేస్తుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి ఉన్నవారిలో కీళ్ల లైనింగ్‌లు దెబ్బతింటాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో బాధాకరమైన నొప్పి, వాపు వస్తుంది. చాలా కాలం పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను అనుభవిస్తే చివరకు అది ఎముకల కోతకు, అలాగే కీళ్ల వైకల్యానికి కారణమవుతుంది.
అంతేకాదు ఈ వ్యాధికి ఇంతవరకు చికిత్స లేదు, ఒకసారి ఎవరికైనా కలిగితే వారసత్వంగా తమ కుటుంబంలో తర్వాతి తరం వారినీ ఈ సమస్య వేధించే అవకాశం ఉంది.
అయితే లక్షణాలు తెలిసినపుడు మొదటి 3-4 నెలలలో ఫిజియోథెరపీ, కొన్ని యాంటీ-రుమాటిక్ డ్రగ్స్ వాడుతూ దూకుడుగా నివారణ ప్రయత్నాలు చేస్తే అది ఈ వ్యాధి వృద్ధి చెందకుండా మందగించడంలో సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది.
ప్రారంభ దశలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు
మోచేతులు, మోకాళ్లు, మణికట్టు, వేళ్లు ఇతర కీళ్లలో వాపు లేదా నొప్పి ఉంటుంది, ప్రభావిత భాగాలు సున్నితంగా మారతాయి.
కొంతమందికి మోకాలు లేదా మోచేయి లేదా చీలమండలలో ఏదో ఒకచోట మాత్రమే నొప్పులు ఉండవచ్చు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నపుడు తెల్లవారుజామున కీళ్లు గట్టిగా కట్టెలాగా మారతాయి. 30 నిమిషాల లేదా అంతకంటే ఎక్కువ సేపు కదిలించలేనట్లుగా అనిపిస్తుంది.
వృద్ధులు, 60 ఏళ్లు పైబడిన వారిలో స్వల్ప జ్వరం, కండరాల నొప్పులు, అలసట, బరువు తగ్గటం వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ వ్యాధిలో పాలిండ్రోమిక్ RA అనేది మరొక అసాధారణ రూపం. ఇది ఉన్నప్పుడు కీళ్ల నొప్పులు ఒక రోజు కొద్దిసేపు ఉంటాయి. ఆ తర్వాత అంతా మామూలుగానే అనిపించినా కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుంది.
రోగ నిర్ధారణ- నివారణ
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా సరైన వైద్య సహాయం తీసుకోవాలి. ఒక వ్యక్తికి 6 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కీళ్ల నొప్పులు ఉంటే, అవి రెండువైపులా కలుగుతుంటే, పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వైద్యుల సూచన మేరకు నడుచుకోవడమే ఉత్తమం.
మీ సమస్య చెబితే తగిన విధంగా మందులు చేసి ఇవ్వగలను
Call 9949363498