04.11.2024
తాడేపల్లి
వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు టెలికాన్ఫరెన్స్
టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, లీగల్ సెల్ ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా టీమ్ హెడ్స్
ఈ సందర్భంగా మాట్లాడిన వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు...
రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, ఒక డ్రైవ్‌లాగా ఇదంతా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 50–60 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై కేసులు పెట్టారు, ప్రధానంగా టెర్రరైజ్ చేసే యాక్టివిటీ చేస్తున్నారు, దీనిని మనం ధీటుగా ఎదుర్కోవాలి
@JaiTDP కూటమి ప్రభుత్వం చేసే అబద్ధపు ప్రచారాన్ని నిజాయితీగా ప్రశ్నించే సోషల్ మీడియా వారికి అడ్డంగా మారింది, వారి వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే రాజకీయ కుట్రతో అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా కేసులు పెడుతున్నారు
మనం సోషల్ మీడియా వాయిస్‌ను కాపాడుకోవాలి, @ncbn మోసాలు ఎండగడుతూ... ప్రజలను చైతన్యం చేస్తూ, మనపై చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొడుతున్న వారికి మనం అండగా నిలబడాలి
ప్రజలకు సరైన సమాచారం అందాలంటే సోషల్ మీడియా ఉంది, వారి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది
మన పార్టీ అధ్యక్షులు @ysjagan గారు ప్రధానంగా చెబుతున్న అంశం... ప్రజల కోసం వాస్తవాలు వెల్లడించే సోషల్ మీడియా కార్యకర్తలను మనం కాపాడుకుంటే వారే మన గొంతుకగా నిలుస్తారన్నారు. ఈ శక్తిని మనం కాపాడుకోవాలి, మన కోసం నిలబడిన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పారు
మనం నిజం పక్షాన ఉన్నాం కాబట్టి మనకు మద్దతిచ్చే వారికి మన సహాయం అవసరమైనప్పుడు వెంటనే స్పందించాలని జగన్ గారు ప్రత్యేకంగా చెప్పారు, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, కుట్ర రాజకీయాలు ఎత్తిచూపుతూ నిలబడే వారికి మేం ఉన్నాం మీకు అనే ధైర్యం, భరోసా మనం ఇవ్వాలి, ఇది టాప్ ప్రయారిటీగా తీసుకోవాలి
అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు మీ మీ నియోజకవర్గాల్లో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వాలి, భరోసా కల్పించాలి
ఎవరైనా ఫోన్ చేయగానే మీరు లేక మీ ప్రతినిధి వెళ్ళి గట్టిగా వారి తరుపున మాట్లాడాలి, లీగల్ గా కూడా స్పందించాలి
ఎవరూ అధైర్యపడద్దు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజం తెలియాలి, ప్రభుత్వ డొల్లతనం బయటపడాలి, మనపై జరుగుతున్న దుష్ప్రచారం తిప్పికొట్టాలి, మన స్వేచ్చను హరించే ప్రయత్నాన్ని ఎదుర్కొందాం, దేనికైనా సరే మేమున్నాం మా పార్టీ ఉందని చెప్పాలి
అనేక చోట్ల తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు, దీనిపై లీగల్ సెల్ క్రియాశీలకంగా ఉంది, జిల్లా స్థాయిలో ఉండే లీగల్ సెల్‌కు సమాచారం రాగానే వెంటనే స్టేషన్‌కు వెళ్ళి మాట్లాడి వారికి అండగా ఉన్నాం అని భరోసా ఇవ్వాలి
కేసులు నమోదు కాగానే వెంటనే స్పందించాలి, సమన్వయకర్తలు మరింత చొరవ తీసుకోవాలి, సుప్రీం తీర్పుకు భిన్నంగా చేస్తున్న ప్రతీది తిప్పికొడదాం
సీనియర్ అడ్వకేట్‌లు 24 గంటలు అందుబాటులో ఉండేలా సెంట్రల్ ఆఫీస్ టీం పనిచేస్తుంది, సెంట్రల్ ఆఫీస్ లో సీనియర్ లీడర్స్‌తో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది, ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సినా వెంటనే వారితో సంప్రదిస్తే తగిన చర్యలు తీసుకుంటారు
బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు
సోషల్ మీడియా ప్రతినిధులపై రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను ఎండగడదాం, ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది, సోషల్ మీడియా కార్యకర్తలపై ఏం జరిగినా వెంటనే స్పందించి వారికి అండగా నిలుద్దాం. ఎవరికి ఎలాంటి న్యాయ సహాయం అవసరమైనా సెంట్రల్ ఆఫీస్ నుంచి వెంటనే స్పందన ఉంటుంది, వైయస్ఆర్ సీపీ లీగల్ టీమ్, సోషల్ మీడియా టీమ్, సీనియర్ లీడర్స్, నియోజకవర్గ సమన్వయకర్తలందరి కోఆర్డినేషన్‌తో ముందుకెళదాం, అండగా నిలుద్దాం.
#YSRCPSocialMedia
#SadistChandraBabu
#FreedomofExpression
#JusticeForSMActivists