YS Jagan Mohan Reddy @jaganspeaks Channel on Telegram

YS Jagan Mohan Reddy

@jaganspeaks


President, YSR Congress Party

YS Jagan Mohan Reddy Telegram Channel (English)

Are you a supporter of YS Jagan Mohan Reddy and the YSR Congress Party? Look no further than the official Telegram channel, @jaganspeaks, where you can stay up-to-date with the latest news, announcements, and speeches from the President himself. YS Jagan Mohan Reddy, a prominent political figure in India, is known for his strong leadership and commitment to serving the people of Andhra Pradesh. This Telegram channel serves as a platform for supporters to engage with YS Jagan Mohan Reddy directly, as he shares his thoughts on various issues, addresses public concerns, and outlines his vision for the state. Whether you're interested in his policies, speeches, or upcoming events, @jaganspeaks has got you covered. Joining this channel not only provides you with exclusive insights into the workings of the YSR Congress Party but also allows you to connect with like-minded individuals who share your passion for positive change. Stay informed, inspired, and engaged by following @jaganspeaks today. Who is it? YS Jagan Mohan Reddy, the President of the YSR Congress Party, a dynamic leader dedicated to improving the lives of the people of Andhra Pradesh. What is it? The official Telegram channel where supporters can access news, speeches, and updates directly from YS Jagan Mohan Reddy himself.

YS Jagan Mohan Reddy

26 Jan, 11:40


విఖ్యాత వైద్యులు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డిగారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ ప్రకటించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు ఆయన. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి కోలుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయనది. కొత్త కొత్త వ్యాధులకు చికిత్స నందించడంలో నాగేశ్వర్‌రెడ్డి సేవలు విశేషమైనవి. అత్యాధుని వైద్య పద్ధతులు, చికిత్సా విధానాలను తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం.

YS Jagan Mohan Reddy

26 Jan, 08:50


ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు.

డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం)
నంద‌మూరి బాల‌కృష్ణ (క‌ళ‌లు)
మంద కృష్ణ మాదిగ (ప్ర‌జా వ్య‌వ‌హారాలు)
మాడుగుల నాగ‌ఫ‌ణి శ‌ర్మ (క‌ళ‌లు)
కేఎల్ కృష్ణ (విద్య‌, సాహిత్యం)
మిరియాల అప్పారావు (మ‌ర‌ణానంత‌రం) (క‌ళ‌లు)
వాదిరాజు రాఘ‌వేంద్రాచారి పంచ‌ముఖి (విద్య, సాహిత్యం)

YS Jagan Mohan Reddy

26 Jan, 03:11


On this 76th Republic Day, let us celebrate the strength of our Unity in Diversity. Together, we pledge to uphold and reinforce the constitution that defines our great nation. Jai Hind!

#RepublicDay

YS Jagan Mohan Reddy

23 Jan, 07:23


భార‌త‌దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ చేసిన పోరాటం నేటి యువ‌త‌కు ఆద‌ర్శ‌నీయం. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భార‌తీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయ‌న‌. నేడు ఆ మ‌హ‌నీయుడి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు.

YS Jagan Mohan Reddy

21 Jan, 07:41


జ‌మ్మూకాశ్మీర్‌లోని సొపోర్ జిల్లాలో ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లా, ఎగువరాగిమాను పెంట గ్రామానికి చెందిన కార్తిక్ వీర మ‌ర‌ణం పొంద‌డం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, కార్తిక్‌ కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నా.

YS Jagan Mohan Reddy

16 Jan, 17:42


Congratulations dear! Not only have you graduated from a prestigious institute such as King’s College London, but you have made us proud passing with distinction! God bless you dear!

YS Jagan Mohan Reddy

16 Jan, 07:53


The scientists at #Isro have achieved a remarkable milestone with the successful docking of satellites in space. This significant accomplishment is a pivotal step forward for India’s ambitious space missions in the years ahead.
Kudos to ISRO!

YS Jagan Mohan Reddy

13 Jan, 04:16


తెలుగువారి సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి. ఈ పండుగ అంద‌రి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు.

#HappySankranthi #Sankranthi

YS Jagan Mohan Reddy

12 Jan, 16:53


ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, 6 గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. చంద్రబాబు గారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మొదలు, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్‌, ఈవో, అడిషనల్‌ ఈవో సహా, స్థానిక కలెక్టర్‌, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో, విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం విడిచి పెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనే కదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్‌ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్‌ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్‌ను డిస్మిస్‌ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా?

ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబు గారు దాన్నికూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు డిప్యూటీ సీఎం గారు క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎంగారేమో, లేదు… క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట జరిగి, 6 గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు. చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్‌, ఈవో, అడిషనల్‌ ఈవో సహా స్థానిక కలెక్టర్‌, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్లందరినీ వెంటనే డిస్మిస్‌ చేసి, వీరిపై కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు.

YS Jagan Mohan Reddy

12 Jan, 05:22


"లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అన్న స్వామి వివేకానంద గారి ప్రేరణాత్మక పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తూ యువ‌తీ యువ‌కులంద‌రికీ జాతీయ యువ‌జ‌న దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

YS Jagan Mohan Reddy

11 Jan, 14:24


వైయస్ఆర్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ వైయస్‌ అభిషేక్‌ రెడ్డి పార్ధీవదేహానికి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించడం జరిగింది

YS Jagan Mohan Reddy

04 Jan, 04:17


1. చంద్రబాబు గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?

2.అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?

3.చంద్రబాబుగారూ… ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్‌ఫోన్‌లో ఉన్నాయి. వైయస్సార్‌సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచంలేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…?

4.ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కాని, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు మేము పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీకూడా అయిపోయింది. ఒక్కపైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్‌ మీటింగ్‌లు పెట్టుకున్నా… ఎప్పుడు ఇస్తామో చెప్పడంలేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు, ఆర్బీకేలను నిర్వీర్యంచేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు.

5.ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే, ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాంలే. ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదు.

6.చంద్రబాబు గారూ… రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుంది.

YS Jagan Mohan Reddy

03 Jan, 04:14


విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి, బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలేగారు. నేడు ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ సావిత్రిబాయిగారి జయంతి సందర్భంగా నివాళులు.

YS Jagan Mohan Reddy

01 Jan, 03:46


#HappyNewYear

YS Jagan Mohan Reddy

29 Dec, 07:15


The pride of India, Koneru Humpy, has won the 2024 FIDE Women's World Rapid Championship for the second time! She is an inspiration to many, particularly those balancing professional and personal life. Wishing her many more victories!

YS Jagan Mohan Reddy

27 Dec, 14:29


కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గళమెత్తిన ప్రజానీకానికి తోడుగా, ప్రజల తరఫున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (@ysrcpofficial) చేపట్టిన నిరసనలను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు. పార్టీ పిలుపునకు స్పందించి ప్రజలకు బాసటగా నిలుస్తూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ప్రజల పక్షంగా, ప్రజాసమస్యలపట్ల పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్‌.

YS Jagan Mohan Reddy

27 Dec, 12:59


పులివెందులలోని విజయ గార్డెన్స్‌లో జరిగిన సంగీత, అహ్మద్‌ల వివాహానికి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

YS Jagan Mohan Reddy

27 Dec, 05:52


మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, అభిమానాలే నన్ను మరింత ఉత్సాహంగా ప్రజాజీవితంలో పనిచేసేలా చేస్తున్నాయి.

YS Jagan Mohan Reddy

26 Dec, 16:59


పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించడం జరిగింది.

YS Jagan Mohan Reddy

06 Dec, 11:07


దేశానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారు చేసిన సేవలను స్మరించుకుంటూ.. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది.

YS Jagan Mohan Reddy

06 Dec, 05:09


సామాజిక విప్ల‌వ దార్శ‌నికుడు, భార‌త రాజ్యాంగ రూప‌కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. ఆయన స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మ‌హాశిల్పాన్ని ఏర్పాటు చేశాం. ఆయన జీవితం అంద‌రికీ ఆదర్శనీయం.

YS Jagan Mohan Reddy

05 Dec, 14:08


పథకాలు ఎలా ఉన్నాయని.. హలో అంటూ ప్రజల్ని అడుగుతారా? అసలు పథకాలు ఉంటే కదా వాళ్లు సమాధానం చెప్పడానికి చంద్రబాబూ?

YS Jagan Mohan Reddy

05 Dec, 11:31


శ్రీకాకుళం జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించి.. దిశానిర్దేశం చేయడం జరిగింది.

YS Jagan Mohan Reddy

05 Dec, 11:25


డిసెంబరు 11 నుంచి మూడు సమస్యలపై గళం విప్పబోతున్న వైయస్‌ఆర్‌సీపీ

YS Jagan Mohan Reddy

04 Dec, 13:27


రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కరెంట్ ఛార్జీల పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై డిసెంబరు 11 నుంచి వైయస్‌ఆర్‌సీపీ పోరుబాట

YS Jagan Mohan Reddy

04 Dec, 12:07


తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది.

YS Jagan Mohan Reddy

04 Dec, 08:11


పెద్దలు, మా కుటుంబానికి దగ్గరి మనిషి, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.

YS Jagan Mohan Reddy

04 Dec, 08:00


On Indian Navy Day, we salute the unwavering dedication and selfless service of the valiant men and women of the Indian Navy. Their courage in safeguarding our maritime frontiers fills us with immense pride.
Today, we honor their sacrifices and the steadfast support of their families. Let’s celebrate their valor and India’s rich maritime legacy!

YS Jagan Mohan Reddy

03 Dec, 06:51


వైకల్యం అనేది శరీరానికే కానీ.. సంకల్పానికి కాదు. ఆత్మ‌స్థైర్యంతో తాము ఎవ‌రికీ తీసిపోమ‌ని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులంద‌రికీ ప్ర‌పంచ దివ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

YS Jagan Mohan Reddy

30 Nov, 12:23


అతి నిజాయితీ, అతి మంచితనం నా సమస్య అని నాని చెప్తుంటారు. కానీ.. ఈ రెండే రేపొద్దున మనల్ని అధికారంలోకి తీసుకొస్తాయి

YS Jagan Mohan Reddy

29 Nov, 14:32


సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా.. ప్రతి బుధ, గురువారం పూర్తిగా కార్యకర్తలతోనే ఉంటాను.

YS Jagan Mohan Reddy

29 Nov, 07:27


నేను సంపద సృష్టిస్తే.. చంద్రబాబు సంపద ఆవిరి చేశాడు. మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమేంటి?

YS Jagan Mohan Reddy

29 Nov, 07:21


సెకీ ఒప్పందంసగటు విద్యుత్‌ కొనుగోలు ధర యూనిట్‌కు రూ.5.10 ఉంటే.. మేం రూ.2.49కే కొనుగోలు చేశాం. దీనివల్ల 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లు ఆదా అవుతుంది. ఇది సంపద సృష్టి కాదా?

YS Jagan Mohan Reddy

28 Nov, 16:08


సోషల్ మీడియాలో కామెంట్స్ పెడితేనే పీడీ యాక్ట్ పెడతామంటూ ఈ బెదిరింపులేంటి? రాష్ట్రం ఎక్కడికి పోతోంది?

YS Jagan Mohan Reddy

28 Nov, 16:04


సెకీ నుంచి తక్కువ ధరకే నేను విద్యుత్ తీసుకొస్తే.. నన్ను పొగడాల్సిందిపోయి నిందలా?

YS Jagan Mohan Reddy

28 Nov, 15:49


ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను కాలేజీలు వెనక్కి పంపిచేస్తున్నాయి. దాంతో కూలి పనులకి పోతున్నారు.

YS Jagan Mohan Reddy

28 Nov, 10:38


https://www.youtube.com/live/zLFYjqtkctI?si=EFOYz30tBc_IePXQ

YS Jagan Mohan Reddy

28 Nov, 07:48


మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి.. నివాళులర్పించడం జరిగింది.

YS Jagan Mohan Reddy

28 Nov, 07:44


స్త్రీలకు విద్య ఎందుకు? అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేగారు. విద్య‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన ఆ మ‌హ‌నీయుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళులు.

YS Jagan Mohan Reddy

26 Nov, 03:31


Our Sovereign, Socialist , Secular, Democratic Republic guarantees us Justice, Equality, Liberty, and Fraternity. As we celebrate the 75th Constitution Day, let us reflect on its significance and reaffirm our unwavering commitment to its guiding principles.

The cornerstone of Democracy is electing the public representatives. Widespread concern across the nation about the functioning of EVMs prompts us to question the veracity of EVMs and to ask ourselves why we should not go to the polls with ballot papers as is the practice in a majority of countries across the world. Democracy should not only be prevalent but also be seen to be thriving.
The other significant concern in recent times has been an aggressive attempt to quell freedom of speech, the most important fundamental right guaranteed to the citizens of our country.

On this auspicious day, we pay tribute to Dr. B.R. Ambedkar and the visionary leaders who shaped our Constitution, guiding us towards a unified and equitable India.

#ConstitutionDay
#75YearsOfConstitution
#SamvidhanDivas

YS Jagan Mohan Reddy

24 Nov, 07:16


1. చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించింది.

2.చంద్రబాబుగారు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్‌, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ నుంచి ఐబీదాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్‌, నాడు-నేడు ఇలా అన్నింటినీ రద్దుచేసి 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్‌, డాక్టర్‌ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు.

3.వైయస్సార్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికం వరకూ రూ. 12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైయస్సార్‌సీపీ హయాంలో మొత్తం ఈ రెండు పథకాలకే రూ.18వేల కోట్లు వరకూ ఖర్చు చేశాం.

4.ఎన్నికల కోడ్‌ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్ లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్‌లో అయినా ఇచ్చారా అంటే అదీలేదు. అప్పటినుంచి ఒక్కపైసాకూడా చెల్లించడంలేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితికూడా అంతే. తర్వాత ఏప్రిల్‌-జూన్‌, తర్వాత జులై-సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించి ఫీజులు చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడ్డంలేదు. ఇప్పుడు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్‌, బోర్డింగ్‌ ‌ఖర్చుల కింద వసతిదీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్‌ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరుచూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి, కాళ్లేమో గడపకూడా దాటడం లేదు.

5.ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీలేనివారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి.

6.ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్‌ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టే స్కాంలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధలేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా వసతి దీవెన డబ్బులు విడుదలచేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబుగారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

YS Jagan Mohan Reddy

22 Nov, 06:55


కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది.. గత 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదని 104, 108 సిబ్బంది ధర్నా చేస్తున్నారు.

YS Jagan Mohan Reddy

21 Nov, 08:48


పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకి దిశానిర్దేశం చేయడం జరిగింది.

YS Jagan Mohan Reddy

20 Nov, 15:49


తన తల్లిదండ్రులని కనీసం రాష్ట్ర ప్రజలకి చూపించని చంద్రబాబుకి.. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది?

YS Jagan Mohan Reddy

20 Nov, 13:55


నా చెల్లి షర్మిలమ్మ మీద నీ బావమరిది బాలకృష్ణ బిల్డింగ్ నుంచి తప్పుడు ప్రచారం నువ్వు చేయించలేదా చంద్రబాబు?

YS Jagan Mohan Reddy

20 Nov, 12:26


మా ప్రభుత్వ హయాంలో చేసిన మంచిని కూడా నిస్సిగ్గుగా మీరు చేసినట్లు చెప్పుకోవడం నీకే చెల్లింది చంద్రబాబు

YS Jagan Mohan Reddy

20 Nov, 11:31


సూపర్-6 హామీలను ఎగ్గొట్టడానికి ఇన్ని కుట్రలు చేయాలా చంద్రబాబూ?

YS Jagan Mohan Reddy

20 Nov, 09:42


https://www.youtube.com/live/xQA_QRZ0eEs?si=_5T8B_qv7nm1qvs1

YS Jagan Mohan Reddy

19 Nov, 16:48


విజయవాడలోని శ్రీ శృంగేరీ శారదా పీఠంలో జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ గారిని కలిసి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది.

YS Jagan Mohan Reddy

18 Nov, 08:10


కురుబ గౌడ దాస కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణ భ‌గ‌వానుడికి గొప్ప భక్తుడు, ఆధునిక కవి, సంగీతకారుడు, స్వరకర్త శ్రీ భ‌క్త క‌న‌క‌దాస జ‌యంతి సంద‌ర్బంగా నివాళులు. ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా , సమత్వం పెంపొందిస్తూ ఆయ‌న చేసిన కీర్త‌న‌లు, ఆ మ‌హ‌నీయుడి మార్గం స‌దా ఆచ‌ర‌ణీయం.

YS Jagan Mohan Reddy

14 Nov, 12:16


రాష్ట్ర అప్పు రూ. 6.46 లక్షల కోట్లు అని బడ్జెట్‌లో చూపించారు. మరి ఇన్నాళ్లు మీరు ప్రచారం చేసిన రూ.14 లక్షల కోట్ల సంగతేంటి?

YS Jagan Mohan Reddy

14 Nov, 12:10


ఎన్టీఆర్ గారిని మించిన నటనతో.. సూపర్-6 హామీల్ని పక్కా ప్లాన్‌తో చంద్రబాబు అటకెక్కిస్తున్నాడు

YS Jagan Mohan Reddy

31 Oct, 07:38


With my loved ones in Pulivendula.

Wishing Everyone a Very Happy Diwali. 🪔

#HappyDiwali

YS Jagan Mohan Reddy

31 Oct, 02:56


#Diwali

YS Jagan Mohan Reddy

30 Oct, 22:14


1. చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదు? చంద్రబాబుగారూ… ఎప్పుడు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును తాకట్టుపెడతారని, మీ స్వార్థరాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారుకదా?

2. పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే, 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితంచేస్తున్నారు? తద్వారా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని తెలిసికూడా మీరు ఎందుకు అభ్యంతరం చెప్పడంలేదు? ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదలచేయలేని దుస్థితి నెలకొంటుంది. గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరిగా విద్యుత్‌ను ఉత్పత్తిచేయలేం. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేం. అన్నికంటే సుజలస్రవంతి ప్రాజెక్టుపై ఉన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుంది. మీ మద్దతుమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న వాస్తవ పరిస్థితుల మధ్య రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మీరు ఎందుకు చేతులెత్తేస్తున్నారు? ఎందుకు బేలతనం చూపుతున్నారు? దీనివెనుక మీ స్వార్థం ఏంటి చంద్రబాబుగారూ?

3. పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పుడైనా, ఇప్పుడైనా చంద్రబాబుగారు… మీరు చేసిన, చేస్తున్న దుర్మార్గాలకు అంతులేకుండా పోతోంది. మొదటనుంచీ మీరు స్వప్రయోజనాలే చూసుకున్నారు. మీ బంధువులకు, మీ పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడంకోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును మీ చేతిలోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ డ్రామాతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టి పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని లూటీచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం మాదిరి డబ్బులు గుంజుకునే యంత్రంలా మారిందని సాక్షాత్తూ ఆనాడు ప్రధానమంత్రి ప్రజల సాక్షిగా అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను. నాడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బకొట్టిన మీరు మళ్లీ రాష్ట్రానిఇక జీవనాడి, పోలవరం విషయంలో అంతే నష్టం చేస్తున్నారు.

4. చంద్రబాబుగారు గతంలో మీరు మీ స్వార్థంకోసం ప్రాజెక్టు నిర్మాణాన్ని అస్తవ్యస్తంచేశారు. ఒక పద్ధతి, ఒక వ్యూహం, ఒక ప్రణాళిక లేకుండా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేశారు. స్పిల్‌వేను పూర్తిచేయకుండా కాపర్‌డ్యాంలు మొదలుపెట్టారు. వీటిని పూర్తిచేయకుండానే ఖాళీలు వదిలేసి డయాఫ్రంవాల్‌ కట్టారు. ఆ నిర్మాణాల్లోకూడా లోపాలే. కాఫర్‌డ్యాంలో సీపేజీకి కారకులు మీరు. మీ అసమర్థత కారణంగా కాఫర్‌డ్యాంలు పూర్తిచేయకుండా ఖాళీలు విడిచిపెట్టారు. ఆ ఖాళీలుగుండా వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించి డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి మీ నిర్వాకాలే కారణమని సాక్షాత్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవలే తన నివేదికలో కుండబద్దలు కొట్టి చెప్పింది. చివరకు స్పిల్‌వేలో పిల్లర్లుకూడా పూర్తిచేయకుండా గేట్లుపెట్టామంటూ ఫొటోలకు ఫోజులిచ్చిన చరిత్ర మీది. అయినా తప్పులు అంగీకరించడానికి, చేసినవాటిని సరిదిద్దుకోవడానికి మీకు మనసు రాదు. మీ చేతిలో ఉన్న మీడియాతో నిరంతరం అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేసి ఆ తప్పులనుంచి బయటపడడానికి నిరంతరం ప్రయత్నిస్తారు తప్ప, పోలవరం పట్ల మీలో ఇసుమంతైనా నిజాయితీ లేదు.

5. మీరు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది, ప్రతి ఏడాదీ వరుసగా వరదలు వచ్చినా, కోవిడ్‌లాంటి సంక్షోభం వచ్చినా కీలకమైన పనులన్నీ వైయస్సార్‌సీపీ హయాంలో చేశాం. స్పిల్‌వే, స్పిల్‌ఛానల్, అప్రోచ్‌ఛానల్‌, ఎగువ కాఫర్‌డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం ఇలా కీలకమైన పనులన్నీ పూర్తిచేశాం. 2022లో గోదావరి మహోగ్రంగా ఉప్పొంగినా ప్రాజెక్టు ఎక్కడా చెక్కుచెదరలేదు. అంతేకాదు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి రూ. 12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కాని, చంద్రబాబుగారు… మీరు ఎప్పటిలానే దుర్భుద్ధిని చూపించి, ఎన్డీయేతో పొత్తు ఖరారైన తర్వాత, ఎన్నికలకు ముందు రావాల్సిన ఆ డబ్బును రానీయకుండా, అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బును విడుదలచేస్తున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

YS Jagan Mohan Reddy

30 Oct, 22:14


6. చంద్రబాబుగారూ.. ఇక ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కొట్టుకుపోయిన ఆ డయాఫ్రంవాల్‌ను పూర్తిచేసి, ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యాంను కట్టడంతోపాటు, ఈలోగా మిగిలిన నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఇవ్వాలి. ఇవన్నీ పూర్తిచేస్తామంటూ మీరు, మీ కూటమి పార్టీలు ప్రజలవద్దకు వెళ్లి ఓట్లు తెచ్చుకుని, అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి సరే అంటున్నారు, ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? వెంటనే ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి దాన్ని సరిదిద్దండి. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించి, నిర్వాసితులందరికీ న్యాయంచేసి పూర్తిచేయండి. లేకపోతే ప్రజలే మీపై తిరుగుబాటు చేస్తారు.

YS Jagan Mohan Reddy

30 Oct, 09:03


పులివెందులలో ఈరోజు ప్రజాదర్బార్‌‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించి.. వాటిని పరిశీలించాను. అలానే నాయకులు, కార్యకర్తలను కలిసి మాట్లాడటం జరిగింది.

YS Jagan Mohan Reddy

29 Oct, 11:57


వేంపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రుద్ర భాస్కర్‌ రెడ్డి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. ఆ తర్వాత మాజీ జడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను.

YS Jagan Mohan Reddy

29 Oct, 10:24


ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్‌ వద్ద నాన్న గారు, దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారికి నివాళి అర్పించడం జరిగింది

YS Jagan Mohan Reddy

29 Oct, 05:00


రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు?

YS Jagan Mohan Reddy

28 Oct, 04:57


ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా చంద్రబాబు

YS Jagan Mohan Reddy

27 Oct, 12:02


కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంటు ఛార్జీలు పెంచడమేనా చంద్రబాబు

YS Jagan Mohan Reddy

24 Oct, 11:59


గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకి మేము రూ.2 లక్షలు ఇస్తున్నాం. నువ్వు ఎంతిస్తావ్ చంద్రబాబు?

YS Jagan Mohan Reddy

24 Oct, 11:30


గుర్లలో డయేరియా మృతుల కుటంబాలని పరామర్శించి.. రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించడం జరిగింది.