🕉వేదాంత సంగ్రహం🕉 @vedantasangraham Channel on Telegram

🕉వేదాంత సంగ్రహం🕉

@vedantasangraham


ఆధ్యాత్మిక నిలయం

🕉వేదాంత సంగ్రహం🕉 (Telugu)

వేదాంత సంగ్రహం చానల్ ఒక ఆధ్యాత్మిక నిలయం మరియు వేదాంత శాస్త్రాల సమగ్ర సేకరణ. ఈ చానల్ ద్వారా, మానవ జీవితాన్ని యుగాంతరాల ధ్యేయంగా ఉంచే వేదాంత సందేశాలు, సూచనలు మరియు మార్గదర్శనలు అందుకున్నాయి. ఇక్కడ కూడా యోగ, ధ్యానం, ప్రాణాయామ, మంత్రాధ్యయన వంటి ఆధ్యాత్మిక చర్యలకు సమాచారం అందిస్తుంది. వేదాంత శాస్త్రం మరియు ఆధ్యాత్మిక సమస్యల పరిష్కార మేటి అప్పుడు మేము ఉపయోగించవచ్చు. వేదాంత సంగ్రహం చానల్ మీకు మేలుకోవాలని అనుకుంటున్న వారు ఈ చానల్ కి సేరాలి.

🕉వేదాంత సంగ్రహం🕉

10 Jan, 03:02


దత్తాత్రేయ దేవస్థానం, సంగమ తీరం, గాణగాపూర్

🕉వేదాంత సంగ్రహం🕉

10 Jan, 01:34


Trailanga Swami Jayanthi

🕉వేదాంత సంగ్రహం🕉

10 Jan, 00:57


🙏🏻 * శ్రీః * * శ్రీమతే రామానుజాయ నమః *
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*తిరుప్పావై –26వ పాశురము*
*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*

*పాశురము*

*మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్*
*మేలైయార్ శెయ్వనగళ్ వేణ్డువన కేట్టియేల్*
*ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన*
*పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే*
*పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే*
*శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే*
*కోలవిళక్కే, కొడియే, విదామే*
*ఆలినిలై యాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.*

*తాత్పర్యము:-*

ఆశ్రితవ్యామోహము కలవాడా! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు స్వభావమును కలవాడా! అఘటితఘటనాసామర్థ్యముచే చిన్న మర్రియాకుపై యమరి పరుండువాడా! మేము మార్గశీర్షస్నానము చేయగోరి దానికి కావలిసిన పరికరము లర్థించి నీ వద్దకు వచ్చితిమి. ఆ స్నానవ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు వినుచో దానికి కారణములను విన్నవించెదము.

ఈ భూమండల మంతను వణకునట్లు శబ్దముచేయు, పాలవలె తెల్లనైన, నీ పాంచజన్యమనెడి శంఖమును బోలిన శంఖములు కావలెను. విశాలమగు చాల పెద్ద ‘పఱ’ యను వాద్యములు కావలెను. మంగళగానము చేయు భాగవతులు కావలెను. మంగళదీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృపచేయుము. అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి.

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*శ్రీమతే రామానుజాయ నమ*
*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🕉వేదాంత సంగ్రహం🕉

10 Jan, 00:55


🎋 పుత్రదా ఏకాదశీ 🎋

🎊 ముక్కోటి ఏకాదశి 🎊

🚩 తైలాంగ్ స్వామి జయన్తీ 🚩

💫 వైకుణ్ఠ ఏకాదశి 💫

🌤️ రైవత‌ మన్వాది‌ 🌤️

🛐 మోక్షదా ఏకాదశి 🛐

🚩 శ్రీ రఘూత్తమతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

🏳️ దాసగణు మహారాజ్
జయన్తీ‌ 🏳️

🌥️ ధర్మసావర్ణి‌/చాక్షుష
మన్వాది‌

🛕 సుళ్య శ్రీచెన్నకేశవ స్వామి
రథోత్సవం 🛕

⚛️

కోటి త్రయంచ దేవానాం
వైకుంఠే మధుసూదనం
ప్రపుల్ల నేత్రైః పశ్యంతి
ఆనందం పరమంపద
ప్రాప్నువంతి అతః తాం వై
ఆనందాం ఋషయో విదుః
మోక్షానంత ప్రదాయస్మాత్‌
జ్ఞానానంద ప్రదాతనా
వివేకదా విమోకదా సైషా
ఏకాదశీ మతా అస్యాం నరః
తధాభూమౌ ఉత్తర ద్వారమార్గతః
నారాయణం తధా దృష్ట్వా
సాఫల్యం విందతే ధ్రువం
సఫలా నామ సాప్రోక్తా పుష్యమాస
సితే దలే అతః ఇయం సర్వ ఫలా
పండితై రుచ్యతే అనిశం

ముక్కోటి ఏకాదశిని వైకుంఠ
ఏకాదశి, సఫల ఏకాదశి, వివేక
ఏకాదశి, మోక్ష ఏకాదశిగా
వ్యవహరించెదరు.

వైకుంఠ ఏకాదశినాడు
తెల్లవారుఝామునే లేచి,
శిరస్నానం ఆచరించి, పరిశుద్ధమైన,
ఏకాగ్రమైన మనస్సుతో
పుణ్యక్షేత్రములలో లేదా
సమీపంలోని దేవాలయమునకు
వెళ్ళి ఉత్తర ద్వారము ద్వారా
స్వామిని దర్శించుకొని
శక్తికనుగుణంగా స్తోత్రపాఠములను
భగవత్‌ గుణానుసంధానం చేసి
తీర్థప్రసాదములు స్వీకరించి
యధాశక్తి భగవన్నామ సంకీర్తనం
చేయవలయును. అన్ని ఏకాదశుల
వలే ఉపవాస జాగరణము తప్పక
చేయాలి. ఈవిధంగా బ్రాహ్మీ
ముహూర్తంలో నిద్ర లేచి
స్నానమాచరించి ఉత్తరద్వార
దర్శనం, ఉపవాస జాగరణ,
నామసంకీర్తన విధిని సక్రమంగా
ఆచరించినచో పరమాత్మ
అనుగ్రహం కలిగి ఇహపరములలో
ఉత్తమ ఫలమును పొందవచ్చును.
స్వామి అనుగ్రహం పొందితే నిత్య
ఫలం, సత్య ఫలమని పురాణ
వచనం.

🔯

🕉వేదాంత సంగ్రహం🕉

09 Jan, 12:17


10.01.2025 - శుక్రవారం
సఫల / ముక్కోటి / వైకుంఠ ఏకాదశి
ఈ ఏకాదశి పాలన వలన మనం చేసే కార్యాలే కాక అర్చన మొదలైనవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ధనుర్మాసంలో వచ్చేది కనుక ఇది ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి అని ప్రసిద్ధి. ఈ రోజున వైకుంఠంలో ఉత్తరద్వారం నుండి మహర్షులు, దేవతలు మొదలైనవారు నారాయణుని దర్శించుకుంటారు. శ్రీరంగంలో ప్రత్యేకంగా ఉత్తరద్వార దర్శనం ఆచరించే విధానం ఉంది.
ఋషిపీఠం

🕉వేదాంత సంగ్రహం🕉

09 Jan, 11:32


వైకుంఠ ఏకాదశి పండుగ ప్రాశస్త్యం.....ఈ నెల 10వ తేదీన ఈ పర్వ దినాన్ని జరుపుకుంటూ ఉన్న సందర్భంగా.....

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. (నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.

వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

పండుగ ఆచరించు విధానం

ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలు : 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.

పండుగ ప్రాశస్త్యం

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి

వైఖానసుడి కథ

పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ

కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానిమురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే!వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.తాత్త్విక సందేశం

విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు(కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

ముక్కోటి ఏకాదశి వ్రతమాచరిస్తే మరు జన్మంటూ ఉండదట! :-
అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.

🕉వేదాంత సంగ్రహం🕉

09 Jan, 11:32


ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.
అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.
వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.
ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.

🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷

🕉వేదాంత సంగ్రహం🕉

09 Jan, 05:17


తిరుపతి: వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తి
కోటా పూర్తవడంతో కౌంటర్లు మూసివేత
3 రోజులకు లక్షా 20 వేల టోకెన్లు జారీ చేసిన టీటీడీ
రోజుకు 40 వేల చొప్పున టోకెన్లు జారీ చేసిన టీటీడీ
13వ తేదీ నుంచి తిరిగి టోకెన్లు జారీచేయనున్న టీటీడీ

🕉వేదాంత సంగ్రహం🕉

09 Jan, 01:01


🙏🏻 * శ్రీః * * శ్రీమతే రామానుజాయ నమః *

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*తిరుప్పావై –25వ పాశురము*
*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*

*పాశురము*

*ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్*
*ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,*
*తరక్కిలానాగి త్తాన్ తీఙ్గు నినైన్ద*
*కరుత్తై ప్పిళ్ళైపిత్తు కఞ్జన్ వయిట్రిల్*
*నెరుప్పెన్న నిన్ర నెడు మాలే ! యున్నై*
*అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాకిల్*
*తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యామ్పాడి*
*వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దేలో రెమ్బావాయ్.*

*తాత్ప‌ర్య‌ము*

తనను కుమారునిగ కనవలెనని కోరిన దేవకీదేవికి ఒక రాత్రి కుమారుడవై పుట్టి, అదే రాత్రి బాలచేష్టలను కనవలెనని తపమాచరించిన మరొక అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దుబిడ్డవై రహస్యముగ పెరుగుచుండ, ఆ వార్తను వినిన కంసుడు సహించలేక నీకు అపకారము చేయ తల్చగనే అతనియెక్క అభిప్రాయమును వ్యర్థమగునట్లు చేసి, ఆ కంసుని కడుపులో నీవే కారుచిచ్చువలె అయి అతనినే సంహరించి, నిన్ను మాకనుగ్రహించిన, మా పై దీర్ఘవ్యామోహము కలవాడా! నిన్నే మేము యాచించవచ్చినాము. పఱై అను వాయిద్య విశేషమున్ను ఇచ్చినచో శ్రీలక్ష్మీదేవి కూడ అభిమానించు నీ ఐశ్వర్యమును, ఆమె వినగోరు నీ యొక్క వీరచరితములనేకములు మేము పాడి, నిన్ను పొందుటకై యింతవరకు పడిన శ్రమలన్నిటిని మరచి ఆనందింతుము
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*శ్రీమతే రామానుజాయ నమ*
*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🕉వేదాంత సంగ్రహం🕉

09 Jan, 00:52


☀️ సాంబ‌ దశమి ☀️

🌞 సూర్యారాధన‌ 🌞

🪷 మహాకాల- యమ‌ పూజ‌ 🪷

⚜️ శాకంబరీ దశమి ⚜️

🌟 కృత్తికోపవాసము‌ 🌟

🚩 శ్రీ వాదీంద్ర‌తీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

⛩️ ద్వార‌ ధర్మదేవత పూజ ⛩️

🎊 తిరువల్లికేణి శ్రీపార్థసారథి
పెరుమాళ్ నాచ్చియార్ తిరుకోళం 🎊

🛕 విరంచి శ్రీ సూర్యనారాయణ
శతఘడీ‌ పూజ, బుగుడా 🛕

🕉వేదాంత సంగ్రహం🕉

08 Jan, 00:57


🙏🏻 * శ్రీః * * శ్రీమతే రామానుజాయ నమః *

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*తిరుప్పావై –24వ పాశురము*
*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*

*పాశురము*
*అన్రివ్వులక మళన్దా యడిపోత్తి*
*శెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోత్తి*
*పొన్రచ్చగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోత్తి*
*కున్రుకుడైయా వెరిన్దాయ్ ! కళల్ పోత్తి*
*కన్రు కుడైయా వెడుత్తాయ్ ! కుణం పోత్తి*
*వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి*
*ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్*
*ఇన్రుయామ్ వన్దోమ్ మిరఙ్గేలో రెమ్బావాయ్.*

*తాత్పర్యము:-*

ఆనాడు బలి చక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతనూ వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్యపాదారవిందములకు మంగళము.

రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావణుడుండు లంకకేగి సుందరమగు భవనములు, కోటయూ గల దక్షిణదిశనున్న లంకలో రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము.

శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేశించిన రాక్షసును చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలు చాచి నేలకూల్చిన మీ అప్రతిమకీర్తికి మంగళము.

వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపైనావేశించిన యసురుని చంపుటకై ఒడిసెలరాయి విసరినట్లుగా వెలగచెట్టుపైకి దూడను విసరునపుడు ముందు వెనుకలకు పాదములుంచి నిలిచిన నీ దివ్యపాదములకు మంగళము.

ఇంద్రుడు తనకు యాగము లేకుండ చేసెనను కోపముచే రాళ్లవాన కుర్పించగా గోపాలురకు బాధ కలుగుకుండునట్లు గోవర్ధనపర్వతమును గుదుగువలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగలము.

శత్రువులను సమూలముగా పెకలించి విజయము నార్జించి ఇచ్చెడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.

ఈ ప్రకారముగా నీ వీరచరిత్రలనే కీర్తించి పఱయనెడి వ్రతసాధనము నందగ మేమీనాడు వచ్చినారము. అనుగ్రహింపుము

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*శ్రీమతే రామానుజాయ నమ*
*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🕉వేదాంత సంగ్రహం🕉

08 Jan, 00:29


🚩 ధ్వజనవమి 🚩

🪷 మహామాయ‌ పూజ 🪷

💧 ఏకభుక్త‌ వ్రతం 💧

🚩 ఝీగార్‌జీ‌ మహారాజ్
పుణ్యతిథి 🚩

🎊 చిదంబరం శ్రీ నటరాజస్వామి
మర్ఘజ్హి వృషభవాహన‌ రథోత్సవం 🎊

☸️

పౌషే శుక్ల నవమ్యాం తు
మహామాయాం ప్రపూజయేత్
ఏక భుక్త పరో విప్ర
వాజపేయ ఫలాప్తయే |

పుష్య శుక్లనవమినాడు
మహామాయను భక్తితో
పూజించినవారు వాజపేయ
ఫలమును పొందును.

🕉వేదాంత సంగ్రహం🕉

06 Jan, 02:46


🙏🏻 * శ్రీః * * శ్రీమతే రామానుజాయ నమః *

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*తిరుప్పావై –22వ పాశురము*
*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*

*పాశురము*

*అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన*
*బజ్ఞ్గమాయ్ వన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే*
*శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్*
*కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే*
*శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో*
*తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్*
*అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్*
*ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.*

*తాత్పర్యము:*

సుందరము, విశాలమునగు మహా పృద్వీ మండలమునంతను ఏలిన రాజులు తమకంటె గొప్పవారు లేరెనెడి అహంకారమును వీడి, తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగ చేరియున్నట్లు, మేమును అభిమానభంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగ చేరి యున్నాము. చిరుగంట ముఖమువలె విడియున్న తామరపువ్వువలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై నీ చూపులను ప్రసరింపజేయుము.

సూర్యచంద్రు లిరువురు ఒక్కసారి ఆకసమున ఉదయించునట్లుండెడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా! మేము అనుభవించియే తీరవలె ననెడి శాపమువంటి కర్మకూడ మమ్ములను వీడిపోవును.

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*శ్రీమతే రామానుజాయ నమ*
*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🕉వేదాంత సంగ్రహం🕉

06 Jan, 01:25


*Guru Gobind Singh Jayanthi*

🕉వేదాంత సంగ్రహం🕉

06 Jan, 01:16


🌞 ద్వాదశ సప్తమి 🌞

☀️ మార్తాండ సప్తమి ☀️

🎋 సావిత్రి గౌరీ వ్రతం 🎋

💧 ఉపవాస - జాగరణ 💧

🌞 ఉభయ‌ సప్తమి 🌞

🚩 శ్రీ ఉపాసనీ మహారాజ్
పుణ్యతిథి‌ 🚩

🏳️ గురు గోవింద్ సింగ్
జయన్తి 🏳️

🪄గురు సప్తమి మహోత్సవం 🪄

🏳️ ఆచార్య రాజేంద్రసూరి జయన్తి
మరియు పుణ్యతిథి‌ 🏳️

🎊 మోహన్ ఖేడా తీర్థం 🎊
(శ్వేతాంబర జైన)

🎉ఆళ్వార్ తిరునగరి
శ్రీ నమ్మాల్వార్ రథోత్సవం 🎉

🪔 శ్రీ త్యాగరాజు స్మృతి దినం 🪔

🇮🇳 సర్ బయ్యా నరసింహేశ్వర
శర్మ జయంతి 🇮🇳

☸️

పౌషే తు శుక్ల సప్తమ్యాం
కృత్వా జాగరణం నిశి |
అపూజయచ్చివం ప్రాతః
కృశరాన్నేన సా సతీ ॥

పుష్య శుక్ల సప్తమి నాడు
రాత్రియందు జాగరణము చేసి,
ఉదయము కూరగాయలతో కలిపి
వండిన అన్నమును శివునకు
నైవేద్యమిడి పూజించవలెను.

🕉వేదాంత సంగ్రహం🕉

05 Jan, 10:04


*గురుబోధ:*
వ్యతీపాత యోగం, శ్రవణ నక్షత్రం, అష్టమి, పూర్ణిమ లేదా అమావాస్య , సంక్రాంతి వంటి సమయాలలో నీళ్ళు శివలింగం మీద పోసి అభిషేకం చేసినవాడు కైలాసం పొంది తీరుతాడు. - స్కాందపురాణం(మాహేశ్వర ఖండం)

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే 54 రోజుల శ్రీ పద్మపురాణం 3వ భాగం ప్రవచనం 8 భాగాలుగా - భాగ్యనగరం, నాగోల్ అల్కాపురి దగ్గర శ్రీ కృష్ణ మందిరంలో జనవరి 06వ తేదీ సోమవారం నుండి జనవరి 12వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.
c/BrahmasriVaddipartiPadmakarOfficial

🕉వేదాంత సంగ్రహం🕉

05 Jan, 02:08


🙏🏻 * శ్రీః * * శ్రీమతే రామానుజాయ నమః *

*తిరుప్పావై –21 వ పాశురము*
*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*

*పాశురము*

*ఏత్తకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప*
*మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్*
*ఆత్త ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్*
*ఊత్తముడైయాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్*
*తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్*
*మాత్తారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్*
*ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే*
*పోత్తిరియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్*

*తాత్పర్యము:*

పొదుగుకింద నుంచిన కడవలు చరచర నిండి, పొంగి పొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు, బలసిన, ఆవులు గల నందగోవుని కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్ఢ్యము గల పరబ్రహ్మస్వరూపా! ఆశ్రితరక్షణ ప్రతిజ్ఞాదార్ఢ్యము గల మహామహిమసంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపా! నిద్రనుండి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమునకు లొంగి నీ వాకిటికి వచ్చి నీ దాసులై నీ పాదారవిందముల నాశ్రయించినట్లు మేము కూడ నిన్ను వీడి యుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి.
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*శ్రీమతే రామానుజాయ నమ*
*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🕉వేదాంత సంగ్రహం🕉

05 Jan, 00:46


*Paramahansa Yogananda Jayanthi*

🕉వేదాంత సంగ్రహం🕉

05 Jan, 00:43


🌾 తుళువ - కుమారషష్ఠి 🌾

💫 పాతార్కయోగము‌ 💫

💦 ధనుర్వ్యతీపాతము‌ 💦

🌺సుబ్రహ్మణ్యార్చన 🌺

💧 షష్ఠ్యోపవాసము 💧

🛕 కరియూరు‌ శ్రీ సుబ్రహ్మణ్య
రథోత్సవం 🛕

🎋 అన్నపూర్ణ షష్ఠి 🎋

🏳️ శ్రీ లక్ష్మి నృసింహ శఠగోప‌
మహాదేశికర్‌ తిరునక్షత్రం‌ 🏳️

🛕 కరికెర‌ శ్రీ సుబ్రహ్మణ్య
రథోత్సవం 🛕

🚩 శ్రీ అంబురావ్ మహారాజ్
పుణ్యతిథి 🚩

🛕 నాగలమడిక‌ శ్రీ సుబ్రహ్మణ్య
రథోత్సవం 🛕

🎊 శ్రీ ఫాటి‌ సుబ్రహ్మణ్య జాతర‌ 🎊

🪄 మన్నార్గుడి‌ శ్రీ రాజగోపాల
స్వామి ఉత్సవారంభం‌ 🪄

🏳️ పరమహంస యోగానంద
జయంతి 🏳️

🇮🇳 శ్రీ గరికిపాటి మల్లావధాని‌
స్మృతి దినం 🇮🇳

🕉వేదాంత సంగ్రహం🕉

04 Jan, 08:11


*1800 సంవత్సరాల ప్రాంతంలో అరుణాచల క్షేత్రంలో ఒక భక్తుని జీవితంలో జరిగిన అత్యద్భుత లీలలు*

తమిళనాడు లోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తుండేది.భర్త పేరు సుందర రాజన్ , భార్య పేరు శాంభవి.సుందర రాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేసేవారు.తక్కువగా వచ్చే జీతంతోనే జీవితం గడుపు తుండేవారు.భార్యాభర్తలిద్దరూ దైవ భక్తులే.వారి ఇంటి దైవం అరుణాచల శివుడు.వారికి వివాహమై పది సంవత్సరాలైనా పిల్లలు కలుగలేదు.సుందర రాజన్ సదా కొలిచే ఆ సదా శివుడ్నే సంతానం ప్రసాదించమని అర్ధించేవారు.ఒక సంవత్సరం వారిద్దరూ అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుడ్ని సంతానం కోసం ప్రార్దించారు.దర్శనం చేసుకుని బయటకి వస్తున్న వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు.ఒంటి నిండా భస్మం రాసుకుని,చేతిలో డమరుకం పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తున్నాడు.ఆ భస్మధారుడు వీళ్ళను చూస్తూనే ఒక ఉదుటున లేచి " పళం యన్ పళం " అంటే " పండు ,నా పండు " అంటూ కొబ్బరి కాయలు అమ్మే కొట్టు మీదకు దూకి అక్కడ ఉండే కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకుని వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ కొబ్బరి కాయ ఇచ్చి అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఊహించని ఈ సంఘటనతో వాళ్ళూ , ఆ కొబ్బరికాయలు అమ్మే కొట్టు యజమానీ , అక్కడ ఉండే జనం అంతా నిశ్చేష్టులయ్యారు . వాళ్ళు ఈ దంపతులకు ఇలా చెప్పారు, ఆ భాస్మధారుడు ఎవరితోనూ మాట్లాడాడు , ఏమీ తినడు అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తీరుతుంది అని. ఇది జరిగిన సంవత్సరం లోపు వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు.ఆ అబ్బాయికి " శివ శర్మ " అనే పేరు పెట్టారు.

శివ శర్మకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేసిన నెల రోజులకు సుందర రాజన్ కాలం చేసారు.పేదరికంలో జీవించే వారికి సుందర రాజన్ మాత్రమే ఆధారం.తండ్రి కాలం చేశాక శాంభవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది.వంట మనిషిగా చేరిన సంవత్సరానికే ఆవిడకు ఊపిరితిత్తులు పాడయ్యి ఆరోగ్యం క్షీణించ సాగింది.శాంభవి శివ శర్మకు తరచుగా " నువ్వు అరుణాచలేశ్వరుని ప్రసాదం,మనకు ఆయనే దిక్కు "అని చెబుతుండేవారు.కొలది రోజుల్లోనే శాంభవి కూడా కాలం చేసారు.శివ శర్మకు నా అనేవారే లేక ఏమీ చేయలేని స్థితికి చేరాడు.ఆ దిక్కు తోచని స్థితిలో శివ శర్మకు నిద్రిస్తుండగా ఒక స్వప్నం వచ్చింది.ఆ స్వప్నంలో తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు,ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు.అదొక శివాలయం,అప్పుడు శివునికి అభిషేకం జరుగుతోంది.దర్శనం చేసుకుని ఒక ప్రక్క కూర్చున్నాడు శివ శర్మ .అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది.ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివ శర్మకు తినిపించాడు.ఆ వృద్ధుడు చూపిన అసాధారణ ఆప్యాయతకు శివ శర్మకు కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతోంది.అంతటితో శివ శర్మకు మెలకువ వచ్చింది.శివ శర్మకు నిజంగానే కళ్ళు నీరుకారుతున్నట్లు అనిపించింది.అప్పుడే తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు.ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుని పిలుపే అని గ్రహించి,ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలం బయల్దేరాడు.చుట్టూ చీకటి వలన భయం భయంగానే " అరుణాచల శివ అరుణాచల శివ " అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు.

అప్పట్లో ఎడ్ల బండ్లు,జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు.తన దగ్గర డబ్బు లేదు కనుక వాటిలో ప్రయాణించడం అసాధ్యం అని భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు.తను ఊరు చివరకు చేరే సరికి ఇద్దరు వ్యక్తులు తనని అడ్డగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేమో అని వెతికి చూసారు.తన దగ్గర డబ్బు లేదు కానీ చెవులకి బంగారు ప్రోగులు ఉన్నాయి.ఉపనయనం అప్పుడు తనకు చెవులు కుట్టి ప్రోగులు వేసారు.అవి ఈ దొంగలు తన చెవుల నుండి లాగారు.చెవులు రెండూ తెగి రక్తం కారుతోంది,శివ శర్మ బాధతో అరవగానే వాళ్ళు భయపడి పారిపోయారు.అప్పుడే ఒక లాంతరు కట్టిన జట్కా బండి వచ్చి ఆగింది.అందులో నుండి ఒక పొడగాటి వ్యక్తి దిగి శివ శర్మను జరిగిన విషయం అడిగి తెలుసుకుని,తన దగ్గర ఒక డబ్బాలో ఉన్న తెల్లటి పొడి రెండు చేవులకూ పెట్టి,మేము కూడా అరుణాచలం వెళుతున్నాం,మాతో రా అంటూ జట్కాలో కూర్చోబెట్టుకుని, తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చారు.అవి తినగానే శివ శర్మకు నిద్ర పట్టేసింది.ఆదిత్యయోగీ.

మెలకువ వచ్చి కనులు తెరిచి చూడగానే తన ఒక ఆలయం అరుగు మీద పడుకుని ఉన్నాడు.రాత్రి జరిగినదంతా లీలగా గుర్తొస్తోంది.చెవులు రెండూ తాకి చూసాడు,ప్రోగులూ లేవు , నొప్పీ లేదు.చేతి వేళ్ళకు మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్లు అనిపించింది.చూడగా మంచి పరిమళంతో కూడిన విభూతి.తనకు ఏమీ అర్ధంకాని స్థితిలో ఉండగా ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు వచ్చాడు.తను అచ్చం కలలో కనిపించిన వ్యక్తిలానే ఉన్నాడు.ఆశ్చర్యంతో నోట మాట రావడం లేదు.ఆ వృద్ధుడు శివ శర్మ చేయి పట్టుకుని ఆలయంలోనికి తీసుకు వెళ్తున్నాడు.అది శివాలయమే,అందులో నమక చమకలతో రుద్రాభిషేకం జరుగుతోంది.అది చూస్తూ ఒక ప్రక్కగా కూర్చున్నాడు శివ శర్మ.అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చి ప్రసాదం నోటిలో పెట్టాడు.మళ్ళీ శివ శర్మకు

🕉వేదాంత సంగ్రహం🕉

04 Jan, 08:11


శివ శర్మకు శరీర పటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది.ప్రదక్షిణ చేయలేని స్థితికి చేరుకున్నాడు.ఒకనాడు ఉదయం శివ శర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి " నాతో రా , మనం చాలా దూరం ప్రయాణం చేయాలి " అని చెప్పి గిరి ప్రదక్షిణం మొత్తం చేయి పట్టుకుని చేయించి,చివరగా అరుణాచలం కొండపైకి తీసుకుని వెళ్ళాడు.ఆ తరువాత శివ శర్మ కోసం ఎంత గాలించినా ఎక్కడా కనిపించలేదు.

శివ శర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికీ అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారు.చూడటానికి వికారంగా కనిపిస్తూ ఎవరినీ వారి దరి చేరనివ్వకుండా తపస్సు చేసుకునే వారూ ఉన్నారు.మనకు అంతటి అదృష్టమే ఉంటే తప్పక అలాంటి వారి దర్శనం లభిస్తుంది.

ఈ శివ శర్మ గురించిన గాధపూర్వం బహు ప్రాచుర్యం కలిగి, ఎంతో మందికి ప్రేరణగా నిలిచిందట.శేషాద్రి స్వామి వారు , భగవాన్ రమణులు , కావ్యకంఠ గణపతి ముని వంటి అవతార పురుషులు అరుణాచలం చేరి తరించారు..*
.

*మౌన స్వామీ’రమణ మహర్షి’జయంతి*
“ఉన్నది" మౌనమే.
సృష్టికి మునుపు, సృష్టికి తరువాత ఉన్నది మౌనమే.
అనగా మెలకువకు మునుపు, మెలకువకు తరువాత ఉన్నది మౌనమే.
ఆలోచనకు ఆలోచనకు మధ్య ఉన్నది మౌనమే.
మాటకు మాటకు మధ్య ఉన్నది మౌనమే.
అనుభవానికి అనుభవానికి మధ్య ఉన్నది మౌనమే.
మధ్యలో అంటే మధ్యలో మాత్రమే అనికాదు, వాటికి ఆధారంగా అని అర్థం.
ఆ మౌనానికి స్థూలరూపమే ఆకాశం.
ఆకాశం అన్ని గ్రహాలకు ఆధారమైనట్లు
మౌనమే అన్ని భావాలకు, మాటలకు ఆధారం.
ఆ మౌనమే తన స్వరూపం.
అది తన అనుభవంలోకి రావడానికి
నిశ్శబ్దం ఓ మార్గం.
నిశ్శబ్దం-మౌనం ఒకటే అనిపిస్తుంది.
మాట ఆగితే నిశ్శబ్దం.
మనసు ఆగితే మౌనం..*

అందరం అరుణాచల శివ అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాము....*

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ..*
.

🕉వేదాంత సంగ్రహం🕉

04 Jan, 08:11


ఆనందంతో కళ్ళ నుండి నీరు కారుతోంది.ఆ వృద్ధుడు శివ శర్మ కళ్ళ నీళ్ళు తుడిచి అంతా ఈ అరుణాచలుని ఆదేశం ప్రకారమే జరుగుతోంది,ఈయన రక్షణలో నీవు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు.

అంతవరకూ మౌనంగానే జరుగుతున్నదంతా గమనిస్తున్న శివ శర్మకు అది అరుణాచలం అని అర్ధం అయ్యింది.మొదటి సారిగా అరుణాచల శివుడ్ని దర్శించుకున్నాడు.చాలా ఆనందం కలిగింది.కానీ ఆ వృద్ధుడు ఎవరు,తన చేతిలో ఆ చీటీ ఏమిటి అనుకున్నాడు.చుట్టూ చూసాడు,కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆలయానికి ప్రదక్షిణలు చేస్తున్నారు,కొందరు కుర్చుని ప్రసాదం స్వీకరిస్తున్నారు,కొందరు అప్పుడే ఆలయానికి వస్తున్నారు,కొందరు వెళుతున్నారు.ఏమిచేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు శివ శర్మ.తన చేతిలోని చీటీని తీసి చూసాడు.
" నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు " అని వ్రాసుంది.

ఆలయం మొత్తం కలియజూసి బయటకు వచ్చి నిలుచున్నాడు.
ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరకు వెళ్లి గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి అని అడిగాడు.అదిగో అక్కడ కొందరు అరుణాచలా అరుణాచలా అని పాడుతున్నారే వాళ్ళు గిరి ప్రదక్షిణలు మొదలు పెడుతున్నారు వాళ్ళతో వెళ్ళు అన్నాడు.శివ శర్మ వాళ్ళతో కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాడు.పూర్తి ప్రదక్షిణ అయ్యి మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది.ఆలయం మూసివేసారు.అందరూ వెళ్ళిపోయారు.శివ శర్మకు బాగా ఆకలిగా,నీరసంగా ఉంది.ఆలయం అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.ఆ పూల వ్యాపారి " బాబు నువ్వొక్కడివే వచ్చావా,నీది ఏ ఊరు,నీ తల్లిదండ్రులు ఎవరు " అని ప్రశ్నించాడు.జరిగిన విషయమంతా చెప్పాడు శివ శర్మ.ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండమని చెప్పి,తను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తాను అన్నాడు.

అదేమిటంటే గిరి ప్రదక్షిణ చేసేప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి,వాటి దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చిస్తే,తనకు రోజుకు ఒక అణా ఇస్తాననీ,తన దగ్గర ఉండవచ్చు అనీ చెప్పాడు.శివ శర్మకు ఈ పని ఎంతగానో నచ్చింది,ఈ పనితో పాటూ ఆ వృద్ధుడు ఆదేశించినట్లు ప్రతీ రోజూ గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు అనీ.కానీ నిజానికి అది చాలా కష్టమైనా పని,కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రతీ రోజు షుమారు 14 కిలోమీటర్ల దూరం ఎండన నడవడం సాధ్యమేనా.శివ శర్మకు మొదటి రోజునే కాళ్ళ వాచి పాదాలకు బొబ్బలెక్కాయి.అయినా ఈ పని చేయాలనే అనుకున్నాడు.తనకు వచ్చిన అణా కూడా అరుణాచలునికే సమర్పించాలి అని నిశ్చయించుకున్నాడు.ఆదిత్యయోగీ.

రెండు రోజులకు శివ శర్మ కాళ్ళు బాగా వాచిపోయి,పాదం మొత్తం రక్తపు ముద్ద అయ్యింది.రెండవ రోజు రాత్రి శివ శర్మ కాళ్ళ నొప్పికీ,పాదాల రక్త స్రావానికీ ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూలు అమ్మనూ,ప్రదక్షిణ ఎలా చేయనూ అనుకుంటూ పడుకున్నాడు.తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి,పాదాలకు ఏదో లేపనం వ్రాసి,కాళ్ళను నిమిరి వెళ్ళింది.మరుసటి ఉదయం లేచి చుసుకునేసరికి కాళ్ళ నొప్పులు తగ్గి,పాదాలు మృదువుగా అయ్యాయి.ఆశ్చర్యపోయాడు శివ శర్మ,ఇదంతా ఆ అరుణాచలుని అనుగ్రహమే అనుకుని వెళ్ళి శాష్టాంగపడ్డాడు.ఆ నాటి నుండి తను ప్రదక్షిణ చేసినా కాళ్ళ నొప్పులు కానీ , పాదాల పగుళ్ళు కానీ లేవు.ఇది
ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు,శివ శర్మకు దైవానుగ్రహం అమితంగా ఉంది అని అర్ధం అయ్యింది.శివ శర్మను వ్యాపార నిమిత్తం ఆ పూల వ్యాపారి ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు.

కొన్నాళ్ళు పూలు అమ్మిన తరువాత శివ శర్మకు జీవితం పట్ల వైరాగ్యం కలిగింది.అప్పటి నుండి పూలు అమ్మడం మానేసి ఎక్కువ సేపు ధ్యానంలో ఉండిపోతుండేవాడు.వ్యాపారం చేయకపోయినా ఆ పూల వ్యాపారి రోజూ శివ శర్మకు ఒక అణా ఇచ్చేవాడు,భోజనం పెట్టేవాడు. మెలకువగా ఉన్నంతసేపూ శివ శర్మ నిరంతరం అరుణాచల శివ నామం జపిస్తూనే ఉండేవాడు.

ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు,వారి కుమారుడు తప్పిపోయాడని విలపిస్తూ అన్ని ఊళ్లూ తిరుగుతూ అరుణాచలం చేరారు.వారి బాధను చూసి జాలిపడిన శివ శర్మ ఒక్క క్షణం ధ్యానంలో కుర్చుని,వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు,అతన్ని కొందరు నిర్బంధించారు,వాళ్ళు మూడు రోజులలో ఇక్కడకు వచ్చి కొందరు పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు,అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు,మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులవుతారు అన్నాడు.శివ శర్మ మాటల మీద నమ్మకముంచి వారు అరుణాచలంలోనే మూడు రోజులు గడిపారు.శివ శర్మ చెప్పిన విధంగా వాళ్ళ పిల్లవాడు వారికి దొరికాడు.

అప్పటినుండి శివ శర్మ పట్ల అందరికీ భక్తి,నమ్మకము కలిగాయి.ఆదిత్యయోగీ.
తనకు కొందరు వ్యాపారులు పండ్లు,ఫలహారాలు పెట్టేవారు.వారికి విశేషంగా వ్యాపారం జరుగుతుండేది. తను ఏదైనా చెబితే అది జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉన్నది కనుక ప్రజలు తనని ప్రశ్నలు అడగడం,తన చేతితో ప్రసాదం,విభూతి వంటివి తీసుకోవాలి అనుకోవడం,తనను ఆశీర్వదించమని అడగడం చేస్తుండేవారు.అప్పటి నుండి శివ శర్మ రోజంతా ప్రదక్షిణ చేయడం,కొండ పైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తుండేవాడు.

🕉వేదాంత సంగ్రహం🕉

04 Jan, 02:44


🙏🏻 * శ్రీః * * శ్రీమతే రామానుజాయ నమః *

*తిరుప్పావై –20 వ పాశురము*
*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*

*పాశురము*

*ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు*
*కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్*
*శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెత్తార్కు*
*వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్*
*శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్*
*నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెళాయ్*
*ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై*
*ఇప్పోతే యెమ్మై నీరాటేలే రెమ్బావాయ్.*

*తాత్పర్యము:*

ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాకముందే పోయి, యుద్ధభూమిలో వారికి ముందు నిలిచి, వారికి శత్రువులవలన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ! మేల్కొనుము. ఆర్జవము కలవాడా! రక్షణముచేయు స్వభావము గలవాడా! బలము కలవాడా! ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కల్గించువాడా! నిర్మలుడా! మేల్కొనుము.
అంగారు కలశలములను పోలిన స్తనములను, దొండపండువలె ఎఱ్ఱని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవీ! పరిపూర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేల్కొనుము. వీచుటకు ఆలపట్టమును(విసినకఱ్ఱను) కంచుటద్దమును మా కొసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము.
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*శ్రీమతే రామానుజాయ నమ*
*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🕉వేదాంత సంగ్రహం🕉

03 Jan, 23:53


🌿 మధుసూదన పూజ 🌿

🚩 శ్రీ లక్ష్మివల్లభతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

🐍 నాగదష్ట వ్రతము 🐍

🪷 శ్రీ కాలసంహారమూర్తి
పూజ 🪷

🪷 శ్రీ అభిరామి అమృతఘటేశ్వర
దర్శనం - తిరుకడయూర్ 🪷

🎊 శూఠారూత్సవారంభం‌ 🎊

🛕 తాయలూరు‌ శ్రీ సోమేశ్వర
స్వామి రథోత్సవం 🛕

🎊 తిరువళ్ళికేళి‌ శ్రీ పార్థసారథి
పెరుమాళ్ ఉత్సవం 🎊

🕉వేదాంత సంగ్రహం🕉

03 Jan, 01:54


🙏🏻 * శ్రీః * * శ్రీమతే రామానుజాయ నమః *

*తిరుప్పావై –19 వ పాశురము*
*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*

*పాశురము*

*కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్*
*మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి*
*కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్*
*వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్*
*మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై*
*ఎత్తనైపోదుమ్ తుయిలెళ వొట్టాయ్ కాణ్*
*ఎత్తనై యేలుమ్ పిరివాత్త గిల్లాయాల్*
*తత్తువ మన్రుత్తకవేలో రెమ్బావాయ్.*

*తాత్పర్యము:-*

గుత్తిదీపములు చుట్టును వెలుగుచుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచముపైనున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు, వెడల్పు కలిగిన పాన్పుపై నెక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకొనిన కేశపాశము గల నీళాదేవీయొక్క స్తనములపై తన శరీరమును ఆనుకొనిపరుండి విశాలమైన వక్షఃస్టలము గల శ్రీకృష్ణా! నోరు తెరిచి మాటాడుము. కాటుక పెట్టుకొనిన విశాలమైన కన్నులు గల ఓ నీళాదేవీ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు? ఇంతమాత్రపు ఎడబాటు కూడ ఓర్వలేకుండుట నీ స్వరూపమునకు, నీ స్వభావమునకు తగదు.
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*శ్రీమతే రామానుజాయ నమ*
*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🕉వేదాంత సంగ్రహం🕉

03 Jan, 00:45


🎋 వినాయక‌ చతుర్థి 🎋

🚩 శ్రీ శ్రీనాథతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

🏳️నానాజీ మహారాజ్ గాడ్గే
పుణ్యతిథి‌‌ 🏳️

🎉 శ్రీ గోకుల్‌నాథ్‌జీ ఉత్సవం‌ 🎉
(వెరావల్)

🪄శ్రీ గోపేశ్వరలాల్జీ ఉత్సవం 🪄
(నాథద్వారా)

🎊 తిరుప్పెరుంతురై శ్రీ ఆత్మనాథ
స్వామి - మాణిక్కవాసకర్
ఉత్సవారంభం 🎊

🕉వేదాంత సంగ్రహం🕉

04 Dec, 08:41


*గురుబోధ:*
హేమంతఋతువులో మెుదటిమాసం అయిన మార్గశీర్షంలో నందవ్రజమైన బృందావనంలోని కుమారీమణులు, నేతితో తయారుచేసిన దైవప్రసాదం ఆహారంగా స్వీకరిస్తూ, కృష్ణుడు తమ భర్త కావాలని కాత్యాయనీ వ్రతం చేసారు. ఈ వ్రతం చేసిన వారికి అభీష్టాలు నెరవేరతాయని శ్రీకృష్ణుడు గోపికలతో స్వయంగా చెప్పాడు. ఇంతటి మహావ్రతాన్ని మార్గశీర్షం మనకు అందించింది.
గోపికలు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందారు.
శ్లో|| హేమంతే ప్రథమే మాసి, నందవ్రజ కుమారికాః|
చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చన వ్రతమ్||

🕉వేదాంత సంగ్రహం🕉

04 Dec, 03:42


జపం:
శుచి కలిగిన ఇంట్లో సాధన చేస్తే చేసినదానికి చేసినంత ఫలం. గోశాలలో సాధన చేస్తే పదిరెట్లు ఎక్కువ ఫలం. దివ్య క్షేత్రములు, పర్వతములలో చేస్తే కోటి రెట్ల ఫలం. అందుకే మానవుడు సాధనకోసం క్షేత్రాలకు వెళ్ళాలి. సాధకులకు మాత్రమే క్షేత్రం యొక్క శక్తి లభిస్తుంది తప్ప యాత్రికులకు కాదు.

🕉వేదాంత సంగ్రహం🕉

04 Dec, 01:25


🎋 ఉమామహేశ్వర తృతీయ 🎋

💫 దగ్ధయోగము 💫

🚩 శ్రీ రఘువీరతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

🌾 నామ - అవియోగ‌ తృతీయ 🌾

🍪 శ్వేత సర్షప దానము 🍪

🚩 శ్రీ రామచంద్రతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

🌴 అనంత - రంభా తృతీయ 🌴

🏳️ శెలి నాయనార్ గురుపూజ 🏳️

🍇 ఫలత్యాగ‌ వ్రతారంభం‌ 🍇

🏳️ శ్రీ వీరరాఘవశఠగోప
మహాదేశికర్‌ తిరునక్షత్రం‌ 🏳️

🚩శ్రీ విశ్వేశతీర్థ పుణ్యతిథి‌ 🚩

🏳️ బాలకృష్ణ మహారాజ్
పుణ్యతిథి‌ 🏳️

🕉వేదాంత సంగ్రహం🕉

03 Dec, 13:53


*స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క‌టాక్షం*

SWARNARATHAM PROCESSION HELD

తిరుచానూరు శ్రీ ద్మావతి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది.

కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద‌సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు.

TIRUPATI,The procession of Swarnaratham held with religious ecstasy in Tiruchanoor on Tuesday evening.

Sri Padmavati Devi dazzled on the golden chariot decked in jewels and pattu vastrams to bless Her devotees along mada streets encircling the temple.

🕉వేదాంత సంగ్రహం🕉

03 Dec, 12:03


ఋషిపీఠం

భక్తి గొప్పదా? జ్ఞానం గొప్పదా?

ఈ ప్రశ్నకు అఖండానంద సరస్వతీ మహారాజ్ చెప్తూ - ఏదీ నటన కాదు,

• రెండూ అనుభూతిలోనుంచి వచ్చినవే.

• భక్తి కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే • భక్తి గొప్పది అనే వాళ్ళు ఇద్దరికీ భక్తి జ్ఞానములు రెండూ సరిగా లేవు అని అర్థం.

భక్తికంటే జ్ఞానం గొప్పది అంటే గౌణభక్తి కంటే జ్ఞానభక్తి గొప్పది.

జ్ఞానం కంటే భక్తి గొప్పది అన్నప్పుడు పరోక్షజ్ఞానం కంటే భక్తి గొప్పది అని తెలుసుకో అన్నారు.

🕉వేదాంత సంగ్రహం🕉

03 Dec, 09:24


*గురుబోధ:*
"మాసానాం మార్గశీర్షోహం" అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించాడు. మార్గశీర్షమాసం అత్యంత పవిత్రం అనీ, సంవత్సరానికి ఈ మాసం ఆభరణమనీ వాల్మీకి రామాయణం చెపుతున్నది. ఈ మాసంలో తామరపూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి మహానందాన్ని, సర్వసంపదలనూ ప్రసాదిస్తానని శ్రీమహాలక్ష్మి స్వయంగా అగస్త్యునితో చెప్పింది.

🕉వేదాంత సంగ్రహం🕉

03 Dec, 07:38


*సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి*

KALIYAMARDHANA KRISHNA
GRACES ON SARVABHOOPALA

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.

మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.

TIRUPATI, On the sixth day of the ongoing annual Karthika Brahmotsavam at Tiruchanoor on Tuesday, Sri Padmavati Devi in Kaliyamardhana Krishna Alankaram blessed Her devotees along four mada streets on Sarvabhoopala Vahanam.

🕉వేదాంత సంగ్రహం🕉

03 Dec, 07:38


Photo from Harikrishna Sharma

🕉వేదాంత సంగ్రహం🕉

03 Dec, 02:05


🎋 తిన్త్రిణి గౌరీ వ్రతం 🎋

🌳 రంభా తృతీయ వ్రతారంభం‌ 🌳

🍨 చిత్రాన్న‌నివేదన‌ 🍨

🚩 శ్రీరామచంద్ర గోపాలకృష్ణమఠ
శ్రీ పూర్ణానందస్వామి పుణ్యతిథి‌ 🚩

🏳️ ముర్క నాయనార్ గురుపూజ 🏳️

🕯️ సీతారాం గోయల్‌ స్మృతి దినం 🕯️

🇮🇳 ఖాదిరాంబోస్‌ స్మృతి దినం 🇮🇳

🕉వేదాంత సంగ్రహం🕉

02 Dec, 15:56


*శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం*

VASANTHOTSAVAM HELD

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం సాయంత్రం వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు.

అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడ వీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు.

TIRUPATI, Vasanthotsavam was held with religious fervour in Tiruchanoor on Monday evening.

This is festival usually observed as a ritual of relaxation to Sri Padmavati Devi who spends busy schedule with hectic religious activities during the nine day event.

After the festival, the sacred aromatic mixture is smeared on the devotees and the entire event went off with religious ecstasy.

🕉వేదాంత సంగ్రహం🕉

02 Dec, 12:49


*అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతం*

వాహ‌న‌సేవ‌లో త‌రిస్తున్న శ్రీ రంగం శ్రీ‌వైష్ణ‌వులు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారు పలు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సేవల్లో అమ్మవారి వాహనాలను మోస్తున్నది తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయపరులు. శ్రీరంగంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు శ్రీవైష్ణవ సంప్రదాయపరులు గత 32 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్నారు. శ్రీ అమ్మవారి వాహనం మోతాదుకు మించి బరువు ఉన్నా కేవలం భక్తి భావంతో ఎంతటి బరువున్నా అమ్మవారి సేవలో తరిస్తున్నారు. ఒక్కో వాహనానికి మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడువైన 4 తండ్లును, కొయ్యతో తయారు చేసిన రెండు అడ్డ పట్టీలు, గొడుగు పలకలు, ఇద్దరు అర్చకులు, గొడుగులు పెట్టేందుకు మరో ఇద్దరు ఉంటారు, వీటి అన్నింటినీ కలిపితే ఒక్కో వాహనం దాదాపు రెండున్నర టన్నుకు పైగా బరువు ఉంటుంది. ఉదయం, రాత్రి వాహనసేల్లో ఒక్కో వాహన సేవలో దాదాపు మూడు గంటలు పాటు బరువును మోస్తూ వాహన బ్యారర్లు తమ భక్తి భావాన్ని చూపుతున్నారు. అంతేకాక మూడు గంటల పాటు నడుచుకుంటూ భుజం మీద మోస్తూ నాలుగు మాడా వీధుల్లో తిరగడం అంటే సాధారణ విషయం కాదు, వాహన బ్యారర్ల తమ భుజాలు మీద మోయడం మూలంగా భుజంపై ఉబ్బి కాయ కాసినట్లు అనిపిస్తుంది. అయినా ఏ మాత్రం సంకోచించకుండా అమ్మవారి సేవలో తరిస్తున్నారు.

శ్రీ కాంతన్ నేతృత్వంలో 32 ఏళ్లుగా అమ్మవారి వాహనసేవ కైంకర్యంలో పాలు పంచుకుంటున్నారు. వీరు మొత్తం 52 మంది ఉన్నారు. వీరు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటి రంగంలోను, రైల్వే ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరితోపాటు విద్యార్థులు కూడా ఉన్నారు.

శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారి ఆలయంలోనూ వీరు ఇలాంటి సేవలు అందిస్తున్నారు. వీరు వాహనం మోసేటప్పుడు, వారి నడకలో నాలుగు రకాలైన విధానాలు పాటిస్తారు. తద్వారా వాహనంపై ఉన్న అమ్మవారు, వాహన సేవ వీక్షిస్తున్న భక్తులు తన్వయత్వం చెందుతారు.

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే వీరంతా తమ తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చేస్తారు. వీరికి టిటిడి ఉచితంగా బస, భోజనం కల్పించి, వస్త్ర బహుమానం, ప్రయాణ ఖర్చులు చెల్లిస్తోంది.

వాహ‌న‌సేవ‌కులు మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీపద్మావతి అమ్మవారిని తమ భుజస్కంధాలపై మోయడం పూర్వజన్మ సుకృతమన్నారు. అందరికీ ఈ అవకాశం రాదని, అమ్మవారి కృపతో తమ జీవితాలు సుఖసంతోషాలతో ఉన్నాయని తెలిపారు.

🕉వేదాంత సంగ్రహం🕉

02 Dec, 06:07


ప్రపంచమున నలు దిశలందును యాత్రలు చేయుదువుగాక, నీకు ఎక్కడను పరమార్ధము చేత చిక్కదు. ఉన్నదంతయు ఇచ్చటనే (అనగా హృదయములోనే) కలదు.

శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంస

🕉వేదాంత సంగ్రహం🕉

02 Dec, 05:30


*ప్ర : శ్రీనివాస కళ్యాణం పద్మావతీ దేవితో జరిగినట్లు పురాణ కథనం.మరి* *తిరుమలలో జరిపే కళ్యాణం శ్రీదేవి, భూదేవులతో ఉంటుంది.ప్రవరలో శ్రీనివాసుని విష్ణుమూర్తి పౌత్రుడు గా చెబుతారు.ఈ వైరుధ్యాలకు పొంతన ఏమిటి?*

🍁🍁🍁🍁🍁

*జ :* పురాణ కథ ఎలా ఉన్నా, పద్మావతి మహాలక్ష్మి స్వరూపం. విశ్వవ్యాపకమైన విష్ణుని విభూతి (ఐశ్వర్య), శ్రీదేవి. భూమిగా ఉన్న లక్ష్మి భూదేవి. ఈ రెండూ ఒకే తల్లి రూపాలు. వ్యష్టి చైతన్యానికీ, విశ్వచైతన్యానికీ ఈశ్వరుడు (ప్రభువు) శ్రీహరి. ఈ తాత్విక భావనే ఉభయ దేవేరుల వివాహంలో గ్రహించాలి. ఆగమ సంప్రదాయానుసారం ఉభయదేవేరులకే పెళ్ళి జరిపిస్తారు. దేవతల విషయంలో పుత్రపౌత్రాది బంధాలు మానవుల వంటివి కావు. నారాయణుడే అవతార క్రమంలో శ్రీ వేంకటేశునిగా అర్చావతారంగా వెలశాడు.అనాదియైన శ్రీ విష్ణువు ఒకకాలంలో ఇలా వెలయడం చేత ఈ రూపం పౌత్రునిగా కళ్యాణ సంప్రదాయం లో ప్రస్తావించబడింది. దీనికి పురాణకథ ఆధారం కాదు.

•••••••••••••••••••••••••••••••••••••

🕉వేదాంత సంగ్రహం🕉

02 Dec, 01:59


మృగశిర నక్షత్రం కలసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించేనెల మార్గశీర్ష మాసం. “మాసానాం మార్గశీర్షోహం” అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివుని, మార్గాశిరంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య భగవానుని ఇలా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని సుష్టు పరచారు. సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం, సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారు ఝామున నిద్రలేచి స్నానం చేయడం ఆచారమైంది. నందవ్రజంలోని గోపికలు పరమేశ్వరుడైన విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణునిలో అద్వైత స్థితిని పొందగోరి మార్గశిర మాసంలో వ్రతం ఆచరించారు.
ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి, పోలిని జ్ఞాపకం తెచ్చుకుని నదులలో దీపాన్ని విడిచిపెట్టాలి.
ఈ మాసంలో విష్ణువును 'కేశవ' నామంతో అర్చిస్తాం.

🕉వేదాంత సంగ్రహం🕉

02 Dec, 01:57


🌟 జ్యేష్ఠ కార్తె 🌟

🪔 దేవదీపావళి‌ 🪔
( మతాంతరం)

💧 గంగా స్నానం 💧
( కోటి సూర్యగ్రహణస్నాన
తుల్య‌ ఫలం)

🌾 పోలి‌ పాడ్యమి - స్వర్గం 🌾

🎋 ధన్య - భధ్ర చతుష్టయ‌
వ్రతం 🎋

🔱 శ్రీ మార్తాండ భైరవ‌
షడ్రాత్సోవారంభం 🔱

🌳 తింత్రిణి‌ గౌరీ వ్రతం 🌳

🛕 ఖండోబా‌ యాత్ర 🛕

🚩 కంచి జగద్గురు శ్రీ యోగితిలకసురైన్ద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩

🎉 మార్గశిర మాసమహాలక్ష్మీ
వ్రతారంభం 🎉

🚩 శ్రీ విద్యాభినవ‌ విద్యారణ్య
భారతి స్వామి వర్ధంతోత్సవం‌ 🚩

🎊 విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి‌
మాసోత్సవారంభం‌ 🎊

🛕 శ్రీ మహిపతిదాస‌ రథోత్సవం 🛕

🌙 చంద్రదర్శనం 🌙

🕉వేదాంత సంగ్రహం🕉

29 Nov, 06:11


_*🚩కార్తీక పురాణం - 29 వ అధ్యాయము🚩*_

🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️



*అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

అత్రి మహాముని అగస్త్యులవారితో ఈవిధముగా - సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి వుభయులను రక్షించి , భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి , పాదములను కడిగి , ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని , *"ఓ మునిశ్రేష్టా ! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును , ద్వాదశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన , నా అతిధ్యమును స్వీకరించి నన్నును , నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు , మీరు దయార్ద్ర హృదయులు , ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను.

*మహానుభావా ! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన , ఓ పుణ్యపురుషా ! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును , సదా , మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"* డని ప్రార్ధించి , సహాపంక్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి *"రాజా ! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో , ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

*నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని , నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక , మరొకటి యగునా?"* అని దుర్వాస మహాముని పలికి , అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి , అతని భక్తిని కడుంగడు ప్రశంసించి , అంబరీషుని దీవించి , సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.

*ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ ! ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా ! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే , ఆరోజుకంతటి శ్రేష్టతయు , మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ , లేక , వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునకు ప్రీతికొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నారాయుణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.*

ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో , అట్టి వారు ఏకాదశి వ్రతము , ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను , అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.

ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.*

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

🕉వేదాంత సంగ్రహం🕉

29 Nov, 01:25


🌺రేపు…🔱
*మాస శివరాత్రి*

*ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.*
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం(లింగోద్భవం) అని అర్ధం.
శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.
*మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ?*
మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి(మృత్యువునకు) కారకుడు కేతువు. అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.
*చంద్రోమా మనస్సో జాతః*
అనే సిద్దాంతం ప్రకారము ఈచంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సంయమమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో,మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.
అందుకే మనం గమనించవచ్చు..,
అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు.
కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి నెల ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.
*మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ?*
అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. 
ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాదికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5, 11, 18, 21, 56, 108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు.
అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.
అలాగే ఆరోజు ప్రదోష వేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది.
ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి, మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.
*మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు ?*
*ప్రత్యేకించి ఈరోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
*సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.
*వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు, అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది.
*దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖచ్చితముగా మార్పు వస్తుందని భావించవచ్చు.
*మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందవచ్చు ...✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷

🕉వేదాంత సంగ్రహం🕉

29 Nov, 01:23


☘️ మాసశివరాత్రి ☘️

🎊 మన్నార్గుడి శ్రీ రాజగోపాల
స్వామి కార్తిక మాసోత్సవం 🎊

🕉వేదాంత సంగ్రహం🕉

28 Nov, 10:49


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ఇతరుల మనస్సును దేహమును నొప్పించు వారి యందు కలి ఉండును.🌼

🕉వేదాంత సంగ్రహం🕉

28 Nov, 03:06


_*🚩కార్తీక పురాణం - 28 వ అధ్యాయము🚩*_

🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️

*విష్ణు సుదర్శన చక్ర మహిమ*





జనక మహారాజా ! వింటివా దుర్వాసుని అవస్ధలు ! తాను ఎంతటి కోపవంతుడైనను , వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున , ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి *"అంబరీషా , ధర్మపాలకా ! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము , నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి , కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్దించితిని . ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"* మని అనేక విధాల ప్రార్ధించగా , అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి , *"ఓ సుదర్శన చక్రమా ! నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో , తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన , ఈతనిని చంపవలదు , ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని , ముందు నన్నుచంపి , తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి , నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు , దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా ! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు , నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.*

*నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును , శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము"* అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి *"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా ! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు , మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు ఏకమైకూడ - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ! ఈ లోకములో దుష్టశిక్షణ , శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే , ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి , నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి , ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.*

*ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని , శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను , కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.*

*ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి , శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు"* మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి , *" నేను దేవ గో , బ్రాహ్మణాదులయుందును , స్త్రీలయందును , గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా అభిలాష. కాన , శరణుగోరిన ఈ దుర్వాసుని , నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు , కోట్ల కొలది సూర్య మండలములు ఏక మైననూ నీ శక్తీకి , తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై , లోకకంటకులపై , దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి , వారిని శిక్షించి , తన కుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన , నికివే నామనఃపూర్వక నమస్కృతులు"* అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను.

🕉వేదాంత సంగ్రహం🕉

28 Nov, 03:06


అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి *"అంబరీషా ! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని.విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు ఎవరు పఠింతురో , ఎవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో , ఎవరు పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబట్టక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి , ఇహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన , నిన్నూ , దుర్వాసుని రక్షించుచున్నాను , నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు."* అని చెప్పి అతన్నీ ఆశీర్వదించి , అదృశ్యమయ్యెను.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.*



🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

🕉వేదాంత సంగ్రహం🕉

28 Nov, 01:00


🕉️ *ప్రదోషం, త్రయోదశి నందీశ్వర అభిషేకం* 🕉️

*గురుబోధ:*
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. రాత్రి లేక ప్రదోషంతో కూడిన చతుర్దశి, చతుర్దశి తరువాత తిథి (పూర్ణిమ లేక అమావాస్య) శివదర్శనమునకు శ్రేష్ఠకాలములు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివాశివుల ఐక్యరూపం. చెట్లు, తీగలు మొదలైన వాటిని స్థావరలింగాలు అంటారు. వీటికి నీరు పోసి పోషిస్తే శివుని స్థావరలింగపూజగా శివుడు భావిస్తాడు. కాబట్టి శివభక్తులు వీటిని పోషించాలి. పక్షులు, జంతువులు జంగమాలు అనబడతాయి. వీటిని రక్షించి పోషిస్తే శివుని జంగమలింగపూజ అవుతుంది. కాబట్టి వీటిని కూడా పోషించి రక్షించాలి. ఈ మొత్తం పూజను ప్రకృతిపూజగా అనగా అమ్మవారి పూజగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇది నిజమైన శివపూజ. శివాలయం తుడిచినవాడు, కడిగి శుభ్రం చేసినవాడు, శివుడి కోసం పూలతోట పెంచి, అందులోని పూలను శివునకు అర్పించినవాడు శివపదం పొందుతాడు. బ్రతికినంతకాలం సంపదలు పొందుతాడు.

🕉వేదాంత సంగ్రహం🕉

28 Nov, 01:00


☘️ గురుప్రదోషం‌ ☘️

🏳️ సంత్ జ్ఞానేశ్వర్‌జీ‌
మహారాజ్ పుణ్యతిథి 🏳️

🚩 దాసగణు మహారాజ్
పుణ్యతిథి‌ 🚩

🏳️ రంగనాథ్ మహారాజ్
పుణ్యతిథి‌ 🏳️

🎊 శృంగేరి శ్రీ శక్తిగణపతి‌
మహాప్రదోషోత్సవం‌ 🎊

🪔 యమప్రీతి‌దీపదానం‌ 🪔

🎊 బార్కూర్ శ్రీసరస్వతి
నారాయణి దీపోత్సవం 🎊

🎉 స్వామిమలై మురుగన్
స్వర్ణకవచ దర్శనం 🎊

🌹 ప్రదోష - నృసింహ పూజ 🌹

🇮🇳 సేనాపతి పాండురంగ్
మహాదేవ బాపట్ స్మృతి దినం 🇮🇳

🕉వేదాంత సంగ్రహం🕉

27 Nov, 08:30


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ఒక సత్కర్మ అంతకుముందు చేసిన దుష్కర్మ దోషమును తొలగింపలేదు.🌼

🕉వేదాంత సంగ్రహం🕉

27 Nov, 05:25


_*🚩కార్తీక పురాణం - 27 వ అధ్యాయము🚩*_

🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️



*దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట*



మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను - కుంభ సంభవా ! ఆ శ్రీ హరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను.

*"ఓ దూర్వాసమునీ ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున , అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని , ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును , బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును , కాలితో తన్నినవాడును , విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును , విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు. కాన , ఓ దూర్వాస మహర్షి ! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు , విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి , నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును"* అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవింశోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.*

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

🕉వేదాంత సంగ్రహం🕉

27 Nov, 00:02


🎋 వ్యాఞ్జులి మహా ద్వాదశి‌ 🎋

🐂 గోపూజ 🐂

🫕 పంచగవ్య - పంచామృత
సేవనం 🫕

🏳️ సంత్ అంబాజీ‌ మహారాజ్
పుణ్యతిథి‌ 🏳️

🚩 శ్రీ జనార్ధనస్వామి‌ పుణ్యతిథి 🚩

🏳️ పరమానంద‌ నారాయణ
సరస్వతి మహారాజ్ పుణ్యతిథి‌ 🏳️

🕉వేదాంత సంగ్రహం🕉

26 Nov, 11:57


ఇట్లు పది శాపములు ఇచ్చి నన్ను అవమాన పరచిన వానికి ఇంకా శాపమివ్వలయునని తలంచి దుర్వాసుడు నోరు తెరుచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును, భక్తి ప్రియుడును, శరణాగత వత్సలుడునగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోను, బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోనూ దుర్వాసుడు ఇచ్చిన పది శాపములనూ తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలంచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్య కాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరుగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో మునివెంట బడెను. ముని ఆత్మ రక్షణమునకై భూమినంతయు తిరిగెను. దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింప బడెను గానీ చక్ర భయము చేత మునిని రక్షించు వాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులును, వసిస్టాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలు, దుర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకొను మునీశ్వరుని అతి కోపముచేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను.

ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే పంచవింశాధ్యాయ సమాప్తః!!

🕉వేదాంత సంగ్రహం🕉

26 Nov, 11:57


కార్తీక పురాణం - 25

బ్రాహ్మణులిట్లు చెప్పిరి. అంబరీష మహారాజా! నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వ పాతకము వలన సంభవించినది. ఈవిషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము గాము. పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితిమా దూర్వాసుడు శాపమిచ్చును. కనుక ఎట్లైనను కీడు రాక తప్పదు. అందులకు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను. ఓ బ్రాహ్మణులారా! హరిభక్తిని విడుచుటకంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది. నేనిపుడు కొంచెము జలము చేత పారణ చేసెదను. ఈ జల పానము భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు. ఇచ్చట సృత్యర్థబోధక ప్రమాణము "కర్తుంసాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్! కృతాపః ప్రాశనా త్పశ్చాద్భుంజీత్యేత్యపరేజగురితి!!" కాబట్టి జల పారణము చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు. బ్రాహ్మణ తిరస్కారమున్నూ ఉండదు. ఇట్లు చేసిన యెడల దుర్వాసుడు శపించడు. నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిశ్చయించి జలముచేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించు వాడు వలె అంబరీష మహారాజును జూచి చెవులకు వినశక్యము గాని కఠినమైన వాక్యములను ఈవిధముగా పల్కెను. ఒరాజా! అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ కారిణియైన దుర్భుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించిన వాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడు అందరికంటే అధముడు. వాడు ఆశుద్ధములో ఉండు పురుగు వలె మలాశియగును. ఆత్మార్థము వంట చేసికొన్న వాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించిన వాడు పాపముల పరంపరను భుజించుచున్న వాడగును. అగ్ని పక్వమైనది గాని, పక్వము గానిది గాని, ఆకు గాని, పుష్పము గాని, ఫలము గాని, పాలు గాని, అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడనయిన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా! ఎప్పుడైననూ బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా? నీకు హరి దేవుడెట్లగును? అతనియందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును, హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడనైన నన్ను వదిలి భుజించితివి గాని బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారము తోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని గూడ తిరస్కరించినవాడవైతివి. రాజా! ఇప్పడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరీ! నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ మార్గమునను నశింపజేయుచున్నావు. ఓరీ పాపాత్మా! ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్నాశ్రయించ వత్తురు. నీవు దుర్మార్గుడవు. గనుక వారిని బాధించెదవు. నీవు ధర్మ కంటకుడఅగుదవు.
దూర్వాసుడు ఇట్లు పలుకగా విని అంబరీషుడు నమస్కరించి ఇట్లని ప్రార్థించెను. అయ్యా! నేను పాపుడను. పాపకర్ముడను. పాప మానసుడను. నిన్ను శరణు వేడెదను. నన్ను రక్షించుమని కోరెను. నేను ధర్మ మార్గమును దెలియక పాపమను బురదయందు పది దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను. పాపములను జేసితిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు. కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. మీవంటి మహా బుద్ధిమంతులు దయావంతులై మావంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలయును. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి యిట్లనియె. రాజా! నేను దయ గలవాడను గాను. నాకు శాంతి లేదు. ఓర్పు లేనివారికి ఆలయమైతిని. గనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలిసికొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన యెడల శాంతులగుదురు. గానీ నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించు వాడను గాను. ఇట్లని పలికి అంబరీషునుద్దేశించి శాపమిచ్చెను. ౧. మత్స్యము ౨. కూర్మము ౩. వరాహము 4. వామనుడు ౫. వికృత ముఖుడు ౬. బ్రాహ్మణుడై క్రూరుడు ౭. క్షత్రియుడై జ్ఞాన శూన్యుడు ౮. క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు ౯. దురాచారుడు - పాషండ మార్గవేడియు, 10. బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటె ముందు చేస్తినను గర్వముతో నున్న నీకు ఈ పదిజన్మలూ వచ్చును.అనగా పదింటియందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు. కనుక గర్వించిన వానికి గర్వ భంగకరములైన జన్మలను యిచ్చితిననెను.

🕉వేదాంత సంగ్రహం🕉

26 Nov, 01:07


🌾 ఉత్పత్త్యైకాదశి‌ 🌾

🌊‌ వైతరిణి ఏకాదశి 🌊

🎋 ఉత్పన్న‌ ఏకాదశి 🎋

🐄 కామధేను వ్రతారంభం‌ 🐄

🚩 కూడలి శ్రీ శంకరభారతి
స్వామి పుణ్యతిథి‌ 🚩

🏳️ బాబా మహారాజ్ పుణ్యతిథి 🏳️

🚩 సంత్‌ జానగడే‌ మహారాజ్
జయన్తీ 🚩

🏳️అనయ నాయనార్
గురుపూజ 🏳️

🎊 తిరువల్లిక్కేణి శ్రీ ఆండాళ్
తిరుమంజన సేవ 🎊

🪔 లక్షదీపోత్సవ, శ్రీ రేణుకా
యల్లమ్మ దేవాలయం, సవదత్తి 🪔

🏳️బాబా మహారాజా పుణ్యతిథి 🏳️

🛕 ఆళంది - నిర్మల యాత్ర 🛕

🕉వేదాంత సంగ్రహం🕉

25 Nov, 15:04


26.11.2024 - మంగళవారం

ఉత్పన్న ఏకాదశి

ఏకాదశీదేవత ప్రాదుర్భవించిన రోజు కనుక ఇది ఉత్పన్న ఏకాదశిగా అత్యంత మహిమాన్వితమైనది.

ఈ రోజున ఏకాదశి వ్రతపాలన విష్ణుప్రీతికరం.

🕉వేదాంత సంగ్రహం🕉

19 Nov, 03:15


అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది.

అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలాపడి ఉన్నాడు.

ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.

శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము.

కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది.

సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి

“నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది.

అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది.

అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది.

అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు.

ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు.

నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను..

అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను.

అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం.

ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు.

అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు.

మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన.

ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహస్తోత్రంతో ప్రార్థన చేశారు.

ఈవిధంగా నరసింహస్వామి దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ.

అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు, కృష్ణా నది శ్రీశైల పర్వత శిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది. కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు.

ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి.

ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు.

🕉వేదాంత సంగ్రహం🕉

19 Nov, 03:15


ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి.

ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.

శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది.

ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

🕉వేదాంత సంగ్రహం🕉

19 Nov, 03:15


#ఈరోజు శ్రీశైల హటకేశ్వర, మరియు మల్లికార్జునస్వామి ఆలయ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాము...

శ్రీశైలంలో హటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము' అని పిలుస్తారు.

అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి.

పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు.

#ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు.

శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది.

చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార.

ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమపావన మయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రమరీనాదము అంటారు.

అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు.

అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది.

శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.

పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది.

భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు.

తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది.

ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి.

శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.

అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు.

రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి.

అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు.

ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు.

🕉వేదాంత సంగ్రహం🕉

19 Nov, 00:47


🌟 అనూరాధ కార్తె 🌟

🚩 శ్రీ విద్యానిధితీర్థ‌
పుణ్యతిథి‌ 🚩

🏳️ శ్రీ దేవశంకర్‌బాపా‌
పుణ్యతిథి‌ 🏳️

🚩 శ్రీ పురుషోత్తమ్‌ మహారాజ్
జయన్తీ‌ 🚩

🇮🇳 పండిత్ మదన్ మోహన్
మాలవ్య పుణ్యతిథి 🇮🇳

🎊 స్వామిమలై‌ శ్రీ సుబ్రహ్మణ్య
స్వామి కార్తిగై‌ ఉత్సవారంభం 🎊

🕯️ శ్రీ రాంభోట్ల లక్ష్మీనారాయణ
శాస్త్రి స్మృతి దినం 🕯️

🕉వేదాంత సంగ్రహం🕉

18 Nov, 10:00


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 ప్రతీది తెలుసుకున్నాక ఆచరిస్తామనుకునే వాడిని ఆ భగవంతుడు కూడా బాగు చెయ్యలేడు.🌼

🕉వేదాంత సంగ్రహం🕉

18 Nov, 04:21


https://t.me/Vedantasangraham
మీ బంధు మిత్రులని ఈ గ్రూపులో చేర్చుటకు, ఈ లింక్ use చేయండి.

🕉వేదాంత సంగ్రహం🕉

18 Nov, 04:11


కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు.కొందరు పుణ్య వ్రతములు చేయుచు , అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా , మరి కొందరు అహంకార సహితులుగా , పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు"* మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి , ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.

ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు , పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు *"ఈ ముసలి వానితో మనకేమి పని"* అని ఊరకుండిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి *"వీరినెట్లు తరింపజేతునా ?"* అని అలోచించుచు , ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ , చక్ర , గదా , పద్మ , కౌస్తుభ , వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి , లక్ష్మి దేవితోడను , భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.

ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

*శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!*
*విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |*
*లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!*
*వందేవిష్ణుం! భవభయహారం! సర్వలోకైకనాథం ||*

*శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం*
*దాసి భూత సమస్త దేవా వనితాం* *లోకైకదీపంకురాం |*
*శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర* *గంగాధరాం*
*త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||*

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.*

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

🕉వేదాంత సంగ్రహం🕉

18 Nov, 04:11


_*🚩కార్తీక పురాణం - 18 వ అధ్యాయము🚩*_

🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️

*సత్కర్మానుష్టాన ఫల ప్రభావము*



*"ఓ మునిచంద్రా ! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే , నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా , తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా ! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా ! అట్టి ! నేనెక్కడ ! మీ దర్శన భాగ్యమెక్కడ ! నాకు సద్గతి యెక్కడ ? పూణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీకమాసమెక్కడ ! పాపాత్ముడనగు నేనెక్కడ ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ ? ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన , నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో , దాని ఫలమెట్టిదో విశదీకరింపు"* డని ప్రార్ధించెను.

*"ఓ ధనలోభా ! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి ఉపయోగార్ధమైనట్టివి కాన , వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని , సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే , జాతివాడో , ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక , సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను , మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా ఈ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతఃకాల స్నానము చేయవలెను. అటుల స్నానము ఆచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు , స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము , వేదములతో సరితూగు శాస్త్రము , గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు , బ్రాహ్మణులకు సమానమైన జాతీయు , భార్యతో సరితూగు సుఖమునూ , ధర్మముతో సమానమైన మిత్రుడనూ , శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు"*. అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.

*"ఓ మునిశ్రేష్టా ! చతుర్మాస్యవ్రతమని చెప్పితిరే ! ఏ కారణం చేత దానిని నాచరించవలెను ? ఇదివరకెవ్వరయిన ఈ వ్రతమును ఆచరించియున్నారా ? ఆ వ్రతము యొక్క ఫలితమేమి ? విధానమెట్టిది ? సవివరంగా విశదికరింపు"* డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.

*"ఓయీ ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి'* అనియు , *కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు , ఈ వ్రతమునకు , చతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన , దాన , జప , తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన , ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".*

తొలి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత , వేదములచేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును , చతుర్బాహుండును , కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. *"నారదా ! నీవు క్షేమమే గదా ! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా ? మానవులందరికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ? ప్రపంచమున ఏ అరిష్టములు లేక యున్నవి కదా?"* అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి *"ఓ దేవా ! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను.

🕉వేదాంత సంగ్రహం🕉

18 Nov, 02:52


*శివ దర్శనం*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*కార్తీకమాసం సందర్భం గా శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం*. ....

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*శ్రీ మల్లికార్జున స్వామి* - *శ్రీశైలం -కర్నూలు జిల్లా*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదావసంతమ్
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ""

శ్రీశైలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కర్నూలు జిల్లా లోని ప్రముఖ శైవ క్షేత్రము. ఇక్కడ మల్లిఖార్జునుడు భ్రమరాంబ కొలువై ఉన్నారు. ఇది దట్టమైన నల్లమల్ల అడవుల్లో కొలువై ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగం లలో ఒకటి.

పురాణగాధ


పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి...ఆ తల్లే భ్రమరాంబిక గా ఇక్కడ పూజలందుకొంటున్నది..

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది.. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే నామం తో పిలుస్తారు. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది.

త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి.

సాక్షి గణపతి ఆలయం.

ఇది ముఖ్యమైన ఆలయం కి కొద్ది దూరంలో ఉంటుంది. మనము శ్రీశైలము వచ్చినాము అని ఈ గణపతి సాక్షి అన్నమాట అందుకే ఇతనిని సాక్షి గణపతి అంటారు.

పాలధార-పంచధారలు

శిఖరంకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపస్సు చేసిన ప్రదేశము ఉంది. కొండపగులులనుండి పంచధార (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కథార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకథార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.

హటకేశ్వరం

శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఈ పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు.

శిఖరం

శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి అటూ ఇటూ వీలుగా త్రిప్పి దూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపై నున్న శిఖరాన్ని చూడటానికి ప్రయత్నించాలి.అలా చూసే టప్పుడు ఆవ్యక్తి కి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

నల్లమల లోతట్టు ప్రాంతమైన భౌరాపూర్‌ చెరువు వద్ద వెలసిన భ్రమరాంబ అమ్మవారికి రెడ్డిరాజులు, విష్ణుకుండినులు, చాళుక్యుల కాలంలో గుడి నిర్మించినట్టు చరిత్ర చెప్తున్నది.

ఆదివాసీల సోదరి భ్రమరాంబికను శివుడు వివాహం చేసుకున్నందున చెంచు గిరిజనులు శివుడిని బావగా పిలుచుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు.

మహాశివరాత్రి రోజున పూర్వంనుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కల్యాణంచేసే పద్ధతి నేటికీ కొనసాగుతున్నది

పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు దర్శించుకుని పూజలు చేసారని చరిత్ర చెబుతుంది.

శ్రీశైల దేవస్థానాన్ని రక్షించడానికి కొందరు రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు

శ్రీశైల మల్లికార్జునుడి గర్భాలయానికి ముందు మండపాన్ని విజయ నగర చక్రవర్తి రెండవ హరి హర రాయలు 1405 లో నిర్మించాడు .ఈ మండపం లోపల ఒక వైపు రత్న గణ పతి ,రెండవ వైపు హద్ర కాళి ,వీర భద్ర విగ్రహాలున్నాయి ..నంది మండపంను కాకతియ ప్రతాప రుద్ర చక్ర వర్తి కట్టించినట్లు కధనం
గిద్దెడు సెనగలు బసవన్న మూతికి కడితే భక్తుల కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.

శక్తిమంతమైన పంచాక్షరీ నామాన్ని అడుగడుగునా స్మరిస్తూ, భక్తులు చేసే శ్రీశైల యాత్ర, వేద దర్శనంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి.
.

......
ఓం నమః శివాయ 🙏🙏


☘️☘️☘️☘️☘️☘️

🕉వేదాంత సంగ్రహం🕉

17 Nov, 23:57


సంకట హర చతుర్థి
చంద్రోదయం 19:59

🕉వేదాంత సంగ్రహం🕉

17 Nov, 23:56


🪷 సంకష్ట చతుర్థి 🪷

🎋 సౌభాగ్యసుందరి‌ వ్రతం 🎋

🚩 శ్రీ కనకదాసర‌ జయన్తీ 🚩

🪷 భద్రావ్రతమ్‌ 🪷

📿‌తులసిమాలా‌ దానము‌ 📿

🚩 శ్రీ సత్యప్రమోదతీర్థ‌
పాదుకా సమారాధన‌ 🚩

🏳️ శ్రీ నానాజీ మహారాజ్
పుణ్యతిథి 🏳️

🚩 కాఞ్చీ జగద్గురు శ్రీ కృపాశఙ్కరేన్ద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩

🎊 తిరునెల్వేలి శ్రీనెల్లియపర్
కొలుదర్బార్ ఉత్సవం 🎊

🇮🇳 వల్లియప్పన్ ఉలగనాథన్
చిదంబరం పిళ్లై స్మృతి దినం 🇮🇳

🕉వేదాంత సంగ్రహం🕉

17 Nov, 08:38


🌹కార్తీక పురాణము - పదహారవ రోజు పారాయణం 🌹

ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని విని, సంతుష్ట మనస్కులైన శౌనకాది కులపతులు 'హే పురాణకథా కథనవచో సురథునీ! సూతమునీ! లోకోత్తర పుణ్యదాయక ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక, పద్మపురాణాంతరవర్తి! అని కూడా విని ఉన్నాము. మాయందు కృపాశుడవై ఆ విషయాలను కూడా విశదపరచు'' అని ప్రార్థించగా, సురుచిర దరస్మేర వదనుడు అయిన సూతుడు - "మునులారా! వైకుంఠుని లీలావినోదాలూ, మహిమలూ వినేవారికి, వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయేగాని విసుగుని కలిగించవు. భక్తిప్రవత్తులతో మీరుకోరాలే గాని గురుప్రసాదిత శక్తి అనుసారం చెపుతాను - వినండి. స్కాందపురాణంలో జనక మహారాజుకు వశిష్టులవారు ఎలా ఈ కార్తీక మహత్యాన్ని బోధించారో, అదే విధంగా పద్మపురాణంళో సత్యభామకు శ్రీమన్నారాయణుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీకమాస విశేషాలు అన్నీ ప్రవచించబడ్డాయి.

🕉వేదాంత సంగ్రహం🕉

17 Nov, 08:37


_*కార్తీక పురాణం - 17 వ అధ్యాయము*_
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼

*అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*



ఓ మునిశ్రేష్ఠులారా ! ఓ ధనలోభీ ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున , శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక , కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ'యనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా

*"ఓ మునీంద్రా ! నేనింత వరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక , ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన , *'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"* యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే , *'నేను - నాది'* అని చెప్పబడు జీవత్మాయే *'అహం'* అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా *' నః '* అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై ఎల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే *"ఆత్మ"* యనబడను. *"నేను"* అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక , ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ *"నేను", "నాది"* అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర , ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ . అట్లే , అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరెంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి , మేల్కొన్న తర్వాత *'నేను సుఖనిద్రపోతిని , సుఖంగావుంది'* అనుకోనునదియే ఆత్మ.

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును , ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన , దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే *'పరమాత్మ'* అని గ్రహింపుము. *'తత్వమసి'* మొదలైన వాక్యములందలి *'త్వం'* అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం *'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి"* అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే *"ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షిణించుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము , ఉపదేశము , సంపూర్ణత్వము నిరుపించబడియున్నదో అదియే "ఆత్మ".* ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో , అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.

జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు , జీవులు కర్మ ఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు , దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.*

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

🕉వేదాంత సంగ్రహం🕉

17 Nov, 00:39


🎋 చాతుర్మాస్య ద్వితీయ 🎋

🌟 రోహిణి వ్రతము 🌟

🌹 బృహత్తల్ప‌ వ్రతం 🌹
( అశూన్యశయన‌ వ్రతం)

🚩 కంచి జగద్గురు శ్రీ చంద్రశేఖరైన్ద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩

🏳️ సదానంద‌ బ్రహ్మచారి
మహారాజ్ పుణ్యతిథి‌ 🏳️

🚩 దిగంబరావధూత‌ దత్త
జయన్తీ‌ 🚩

🛕 సోనాజీ మహారాజ్
యాత్ర 🛕

🚩 శ్రీ బాలకృష్ణానంద‌ సరస్వతీ
స్వామి పుణ్యతిథి‌ 🚩

🏳️ పరశురామ్‌ మహారాజ్
పుణ్యతిథి 🏳️

🇮🇳 లాలా‌ లజపతిరాయ్‌
స్మృతి దినం 🇮🇳

🏳️ అయ్యల సోమయాజులు
గణపతిశాస్త్రి జన్మదినం 🏳️

🚩 బాళాసాహెబ్ ఠాకరే
స్మృతి దినం 🚩

🕉వేదాంత సంగ్రహం🕉

16 Nov, 12:56


ఎవరు దిన దినము శివునొక జిల్లేడు పూవుతో పూజించునో అట్టి వానికి పది సువర్ణ ముద్రికలు దానము జేసిన ఫలము గలుగును.

🕉వేదాంత సంగ్రహం🕉

16 Nov, 11:14


*🙏🪔కార్తీకపురాణం15 వ అధ్యాయం🪔🙏*
*🙏🪔 🪔🙏🪔 \|/ 🪔🙏🪔 🪔🙏*


*🙏దీపప్రజ్వలనం-ఎలుకకు పూర్వజన్మస్మృతి*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

తిరిగి జనక మహారాజుతో వశిష్టమహాముని ఇలా అంటున్నారు… ”ఓ జనకా! కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తికాదు. కానీ, ఇంకో ఇతిహాసం చెబుతాను. శ్రద్ధగా విను…” అని ఇలా చెప్పసాగెను.
”ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయడం, వినడం, శివకేశవుల వద్ద దీపారాధన చేయడం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయనివారు కాలసూత్రమనే నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశిరోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణును గంధపుష్పాలతో, అక్షితలతో పూజించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే… విశేష ఫలం లభిస్తుంది. ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవదుందుభులు మోగుతుండగా… వైకుంఠంలో విష్ణుసాన్నిధ్యం పొందగలరు. ఇలా నెలరోజులు పూజాదికాలు నిర్వర్తించలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణిమ రోజుల్లో నిష్టతో పూజ చేసి, ఆవునేతితో దీపం వెలిగించాలి. ఆవుపాలు పితికినంత సేపైనా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపంలో నూనె వేసినా… అవసానదశలో ఉన్న దీపం వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా… వారి సమస్తపాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగెను…
సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయమొకటి ఉండేది. కర్మనిష్టుడైన దయార్థ్ర హృదయుడైన ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి, కార్తీకమాసమంతా అక్కడే గడిపి, పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ విష్ణాలయాన్ని శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడిగి, బొట్టు పెట్టి, పక్కగ్రామాలకు వెళ్లి, ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు చేసి, పన్నెండు దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ… నిష్టతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు. ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. నాలుగు మూలలు వెతికి, తినడానికి ఏమి దొరుకుతుందా? అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా… పక్కనే ఉన్న దీపానికి తగిలి, ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం, విష్ణాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు కళ్లు తెరిచిచూడగా… పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. ”ఓయీ…! నీవు ఎవరవు? ఎందుకు ఇలా నిలబడ్డావు?” అని ప్రశ్నించగా… అతను వినమ్రంగా… ”అయ్యా! నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యివాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచితీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ… ఓ మహానుభావా! నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో, దానికి కారణమేమో తెలియదు. మీరు యోగిపుంగవుల్లా ఉన్నారు. దయచేసి, నాకు విశదీకరించండి” అని కోరాడు.
అంతట ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓయీ! నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు. నీవు జైనమతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ… ధనాశాపరుడవై దేవ పూజలు, నిత్యకర్మలను మరచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు, యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ చింతన కలిగిఉండడమే కాకుండా, ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక… ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి, పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మనెత్తి, వెనకటి జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి, నీవు నీగ్రామానికి వెళ్లి, నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి, దాంతో దానధర్మాలు చేసి, భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము” అని నీతులు చెప్పి పంపాడు.
చూశావా జనకమహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంతమాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో?? ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనెవేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ…” అని వివరించాడు.
*కార్తీక పురాణం 15వ అధ్యాయం సమాప్తం*


*🦜 🦜*

🕉వేదాంత సంగ్రహం🕉

15 Nov, 02:10


*🙏🪔కార్తీకపురాణం 14వ అధ్యాయం🪔🙏*
*🙏🪔 🪔🙏🪔 \|/ 🪔🙏🪔 🪔🙏*


*🙏 ఆబోతుకు అచ్చువేసి వదులుట 🙏*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

మళ్లీ వశిష్టమహాముని కార్తీక మాస మహత్యాలను గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను జనకుడికి చెప్పాలనే కుతూహలంతో ఇలా చెబుతున్నారు… ”ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, విష్ణు సాలగ్రామాలను,శివలింగ సాలగ్రామాలను దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షణతో దానం చేయడం మొదలగు పుణ్యకార్యాలు చేయడం వల్ల వెనకటి జన్మల్లో చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలా చేసేవారికి కోటి యాగాల ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పైలోకాల నుంచి ఎవరు ఆబోతుకు అచ్చువేసి వదులుతారో? అని చూస్తుంటారు. ప్రతిసంవత్సరం కార్తీక మాసంలో శక్తికొలదీ దానం చేసి, నిష్టతో వ్రతమాచరించి, శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజరోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తికొలదీ బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ, పర లోకాల్లో సర్వసుఖాలను పొందగలరు” అని వివరించారు.
కార్తీకమాసంలో చేయాల్సిన పనులను చెప్పిన వశిష్టుడు మరికొన్ని నిత్యాచరణ విధులతోపాటు, చేయకూడనివేవో ఇలా చెబుతున్నాడు… ”ఓ రాజా! పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లి తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణుపూజ చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెలరోజులూ రాత్రుళ్లు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడినీటితో స్నానం కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి, వేడినీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీకమాస వ్రతం చేయాలనే కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చేయొచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతీ, యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయాలి. తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాతః కాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతిలోగానీ, చెరువులో గానీ స్నానం చేయవచ్చు. ఆ సమయంలో కింది శ్లోకాన్ని స్మరించుకోవాలి…

శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు||

”కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, విష్ణువుని,శివుడిని కల్పోక్తంగా పూజించాలి” అని వివరించారు. అనంతరం కార్తీకమాస శివకేశవుల పూజాకల్పాన్ని గురించి వివరించారు.

ఈ ప్రకారం కార్తీకమాసమంతా పూజలు నిర్వహించాలి. విష్ణు సన్నిధిలో, శివసన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా శివకేశవులపూజ చేసినవారు ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్లయితే.. నూరు అశ్వమేథాలు, వేయి వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెలరోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమాచరించనివారు వంద జన్మలు నానాయోనులయందు జన్మించి, ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలనెత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేవారు పదిహేను జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అట్టివారు సకలైశ్వర్యాలను పొందుతారు. అంత్యమున మోక్షాన్ని పొందెదరు.

*కార్తీక పురాణంపద్నాలుగో అధ్యాయం సమాప్తం*

🕉వేదాంత సంగ్రహం🕉

15 Nov, 02:05


_*కార్తీక పౌర్ణమి రోజు చదవవలసిన కార్తీక దీప నమస్కారం శ్లోకం*_



*కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః*
*జలే స్థలే యే నివసంతి జీవాః!*
*దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః*
*భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!*

వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ , త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో , కుంకుమో , అక్షతలో వేయాలి. అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి. ఆరోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు.

🕉వేదాంత సంగ్రహం🕉

14 Nov, 23:57


🌕 కార్తిక - వ్యాస‌ పూర్ణిమ 🌕

🎋 భార్గవరాకా‌ వ్రతం 🎋

🪔 దేవదీపావళి‌ 🪔

🌲 ధాత్రి పూజ 🌲

💧 పూర్ఢిమోపవాసము‌ 💧

🧊 చలిమిడి నైవేద్యం ‌ 🧊

🪔 శృంగేరి లక్షదీపోత్సవము 🪔

🌊 సింధు - సముద్ర స్నానము 🌊

🌸 వ్యాసపూజ 🌸

🍏 అమలక - తిలచూర్ణస్నానం 🍏

🚩 యోగిరాజ దత్త జయన్తీ 🚩

💦 కార్తీక స్నాన సమాప్తి 💦

⚜️ కార్తికేయ దర్శనం ⚜️

🌿 ధాత్రి నారాయణ పూజ 🌿

🎍 కేశబంధన‌ గౌరీ వ్రతము 🎍

🎉 తీర్థపుష్కర్ స్నాన మేళా 🎉

🏳️ గురునానక్ జయంతి 🏳️

🎋 కేదారేశ్వర వ్రతము 🎋

💦 భీష్మపంచక వ్రత సమాప్తి 💦
( భీష్మార్ఘ్యప్రదానము‌ )

ఇంద్ర - దక్ష సావర్ణి‌ మన్వాది‌

💧 గఢ్‌గంగాతీర్థ మేళా 💧

🚩 శ్రీ హేమచంద్రాచార్య
జయన్తీ 🚩

💧 విష్ణు పంచకోపవాసము 💧

📗 మార్కండేయపురాణ
దానము 📗

🚩 యతి చాతుర్మాస్య
సమాప్తి 🚩

🪔 నివియుక్తకాలము‌ 🪔

💧 రథ - గజ - అశ్వ - ధేను -
ఘృత‌ - సాలిగ్రామ దానములు‌ 💧

🔥 లక్షవర్తి‌ వ్రతోధ్యాపన‌ 🔥

🐄 కామ్యవృషషోత్సర్గం‌ 🐄

🎊 తులసీ వివాహోత్సవ‌ సమాప్తి 🎊

🌾 జాగరణ- ప్రతిమావ్రతము 🌾

🌴 లింగ -‌ ప్రబోధ వ్రతము 🌴

🌝 త్రిపురారి పూర్ణిమ 🌝

🎊 త్రిపురోత్సవము 🎊

🌕 సత్యపూర్ణిమా వ్రతము 🌕

🛕 బహిరామ్బువాచి‌ యాత్ర 🛕
( ఉమ్రావతీ)

🚩 శ్రీ నిరంజనానంద‌ సరస్వతీ
స్వామి జయన్తి 🚩

🎋 మహారస్‌ పూర్ణిమ 🎋

🚩 అడ్కూజీ‌ మహారాజ్
పుణ్యతిథి‌ 🚩

⛩️ జ్వాలాతోరణం ⛩️

🛕 రాంటేక్‌ శ్రీ రామచంద్ర యాత్ర 🛕

🍙 ముంబాయి శ్రీ మహాలక్ష్మీ
వార్షిక అన్నకూటోత్సవం‌ 🍙

🛕 శ్రీ మన్మధస్వామి‌ యాత్ర
కపిలధార్‌ - భీడ్‌ 🛕

🎊 హంపి శ్రీ విరూపాక్ష విద్యారణ్య
పీఠాధీశ్వర‌ సీమోల్లంగము‌ 🎊

🏳️ నయన్‌సీర్ నెదుమార
నాయనార్ గురుపూజ 🏳️

🇮🇳 బిరాస్‌ ముణ్డా‌ జయంతి 🇮🇳

🚩 శ్రీ నాథూరామ్ గాడ్సే
స్మృతి దినం 🚩

🇮🇳 ఆచార్య వినాయక్ నరహరి
భావే స్మృతి దినం 🇮🇳

🪔
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః
🪔

🕉వేదాంత సంగ్రహం🕉

14 Nov, 11:52


*జ్వాలా తోరణ మాహాత్మ్యం*

🕉వేదాంత సంగ్రహం🕉

14 Nov, 09:53


*శ్రీ గురుభ్యోనమః*

*కార్తిక పురాణం 14వ రోజు*


*ప్రతిరోజూ వామనుని తలుచుకొని లేవాలి*

*శివకేశవులు భూమికి దగ్గరగా ఉండి దీవించే మాసం ఇది. కార్తిక స్నానం, జపములు, దానాలు ప్రతిరోజూ చేయాలి.*

*తోటకూర,బచ్చలకూర,గోంగూర స్వయంపాకం లో దానం ఇవ్వాలి. చిమ్మిలి నైవేద్యంగా శివునికి, సుబ్రహ్మణ్యనునికి పెట్టి ప్రసాదం పంచాలి.*

*ఈరోజు చక్కెర , బెల్లం దానం ఇవ్వాలి.*

*ఈ 14 వ రోజు చేసే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కోటి జన్మల పాపం నశిస్తుంది.*

*ఈరోజు గోదానం చేయడం విశేష ఫలితాలు ఇస్తుంది.*

*ఈరోజు పఠించాల్సిన 14 శివకేశవ నామాలు.*

*ఈరోజు ఆదిత్యస్తవం వినాలి.*

*శ్రీకృష్ణుడుని దైవంగా గుర్తించి మునిపత్నులు యజ్ఞం పూర్తవ్వక మునుపే నైవేద్యం పెట్టిన దివ్యకథ వినాలి.*

🕉వేదాంత సంగ్రహం🕉

14 Nov, 01:15


*🪔 కార్తీకపురాణం 13 వ అధ్యాయం 🪔*
*🙏🪔 🪔🙏🪔 \|/ 🪔🙏🪔 🪔🙏*


*🪔 కన్యాదాన ఫలము-సువీరచరిత్రము 🪔*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔


🙏🌹🙏తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు. ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై అలకి౦పుము.🙏🌹🙏

🙏🌹🙏కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షణ తా౦బూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, అ పాపములన్నియు పోవును.🙏🌹🙏

🙏🌹🙏ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన౦దువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తి శ్రద్దలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్దగా అలకి౦పుము.🙏🌹🙏

🙏🌹🙏సువీర చరిత్రము..🙏🌹🙏

🙏🌹🙏ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు"డను ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్యకలదు. ఒక సారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందోక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను.🙏🌹🙏

🙏🌹🙏కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికి శుక్ల పక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతిగారబముతో పెరుగుచుండెను, ఆమె చూచు వారలకు కనులపండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను.🙏🌹🙏

🙏🌹🙏దినములు గడిచినకొలదీ, బాలికకు నిండు యౌవనదశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై అ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు "ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు"నని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైననూ లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను.🙏🌹🙏

🙏🌹🙏అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖముగా వుండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరుల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.🙏🌹🙏

🙏🌹🙏ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని "ఓయీ! నీవెవ్వడవు? నీ ముఖ వర్చస్సుచూడ రాజవంశమునందు జన్మించిన వానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశ్నించగా..... 🙏🌹🙏

🙏🌹🙏సువీరుడు "మహానుభావా! నేను వంగదేశమును నేలుచుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకముకంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్ఠుడనియినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే యింత వరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా, "ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచి౦పక కన్యనమ్ముకొంటివి.🙏🌹🙏

🙏🌹🙏కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించిన వారు 'అసిపత్రవన' మను నరక మనుభవి౦తురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశి౦తురు. అదియునుగాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహా నరకమనుభవి౦చును.🙏🌹🙏

🕉వేదాంత సంగ్రహం🕉

14 Nov, 01:15


🙏🌹🙏 కన్యావిక్రయము జేసినా వారికీ యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణి౦చియే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన యెడల గంగాస్నాన మొనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును" అని రాజునకు హితోపదేశము చేయగా.......... 🙏🌹🙏

🙏🌹🙏 అందుకా రాజు చిరునవ్వు నవ్వి "ఓ మునివర్యా! దేహసుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమా౦టారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణి౦పగలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యాదానము మాత్రము చేయను" అని నిక్కచిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.🙏🌹🙏

🙏🌹🙏మరి కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.🙏🌹🙏

🙏🌹🙏అంతటా శ్రుతకీర్తి "నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?"నని మనమునందుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి, నమస్కరించి "ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధర్మముర్తివి, బుద్దిశాలివి. ప్రాణకోటినంతను సమ౦గా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు" అని ప్రాధేయపడెను.🙏🌹🙏

🙏🌹🙏అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి "శ్రుతకీర్తి! నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి? నీ వంశియుడగు సువీరుడు తన జ్యేష్టపుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు యిటు మూడు తరములవారు అటు మూడు తరములవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమను భావించుటయేగాక, నిచజన్మలెత్తవలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన, నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాల౦కృతముగా కన్యాదానము చేయించుము.🙏🌹🙏

🙏🌹🙏అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కెగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమొనర్చినను కన్యాదాన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము" అని పలికెను.🙏🌹🙏

🙏🌹🙏శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటిరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసికొనెను.🙏🌹🙏

🙏🌹🙏కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీకమాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు. విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును.🙏🌹🙏

🙏పదమూడో అధ్యాయం సమాప్తం🙏

🕉వేదాంత సంగ్రహం🕉

14 Nov, 01:12


☘️ వైకుణ్ఠ చతుర్ధశి ☘️

💧 ఉపవాసము - జాగరణ‌ 💧

🌼 నిశి - అరుణోదయ‌కాల‌
శివ - విష్ణు పూజ 🌼

🌿 తులసీవ్రతోధ్యాపన‌ము 🌿

🔥 ధాత్రి హవనము‌ 🔥

🗻 పాషాణ చతుర్దశి 🗻

☘️ కాశీ విశ్వనాథ పూజ ☘️

🚩 శ్రీ గోరక్షనాథ్‌ జయన్తీ 🚩

🏳️ శ్రీ శాంతానంద‌ సరస్వతీ
స్వామి పుణ్యతిథి‌ 🏳️

🚩 శ్రీ లక్ష్మినారాయణతీర్థ‌
పుణ్యతిథి‌ 🚩

🏳️ తిరుమూల‌ నయనార్‌
గురుపూజ 🏳️

🎉 బృందావనం శ్రీరాధావల్లభ‌
పాటోత్సవం‌ 🎉

💦 మణికర్ణిక స్నానము 💦

🌲 ధాత్రి నారాయణ పూజ 🌲

🍽️ వనభోజనము‌ 🍽️

🚩 శృంగేరీ జగద్గురు శ్రీ
నృసింహభారతి మహాస్వామి
జయన్తీ🚩

🛕 సంత్ కాఢోజీ‌ మహారాజ్
రథోత్సవం 🛕

🪔 తిరువణ్ణామలై భరణి
దీపోత్సవం 🪔

🇮🇳 శ్రీ లాహూజీ‌ సాళవే
జయంతి 🇮🇳

⚛️

☘️ వైకుంఠ చతుర్దశి ☘️

జాగరణం కుర్యాద్గీత
వాద్యాదిమంగళైః,
నరాణాం జాగరే విష్ణోర్గీతం
నృత్యంచ కుర్వతాం,
గోసహస్రంచ
దదతాం ఫలంచసముదాహృతం

గీతనృత్యాది మంగళ కార్యములచే
రాత్రి జాగరణము జేయువారికి
గోసహస్ర దానఫలము గల్గునని
యున్నందున గీతనృత్యవాద్య
విష్ణుచరితపఠన స్వేచ్ఛాలాప
లీలానుకర్షములచే
హరిజాగరము చేయవలెను.
నిశీకాలమున‌ శివుడికి
ఉమ్మెత్త పూవు, బిల్వదళము‌
సమర్పించాలి.
తదుపరి అరుణోదయ‌
కాలమునందు హరిహరుల‌
పూజచేసి బ్రహ్మణులతో కూడి‌
పారణగావించవలెయును‌.

🔥 ధాత్రి హవనము‌ 🔥

ఋతుస్నానము నాడు స్త్రీ తాకిన
భోజనము, పంచ సంస్కారములు
లేనివాడు వండినది, ఇతరులు
నోటితో ఊదినది, ఇతరులు చేతితో
కలియబెట్టినది, వడగట్టని నీళ్ళు,
పునః పాకమైన అన్నము
( రెండవసారి వేడి చేసిన అన్నము )
విక్రయించిన అన్నము, మజ్జిగ
తప్ప మిగతా సారము తీసిన
పదార్థము ( మీగడ తీసిన పాలు
మొ|| నవి ) భోజన మధ్యమందు
వడ్డించిన నెయ్యి, మొదలైనవి
క్రియాదుష్టములు. ఇటులే, కాల
దుష్టములైనవి. ఇవన్నియూ
అభోజ్యములే. ఇలా తిన్న దోషం
ధాత్రి హవనము ద్వారా తొలుగును‌.

🌳 వనభోజనము 🌳

వనభోజనం‌ ఉసిరి చెట్టు క్రింద
దామోదరుని పూజించి
వనభోజనాన్ని మంగళ,
శుక్రవారములు కాక వేరే దినాలలో
చేయవలెను. మనము తినే అన్ని
వస్తువులకూ అన్నమని పేరు.
ఉత్తరాయణంలో పుట్టిన అన్నము
ఆగ్రయణేష్ఠితో దక్షిణాయనంలో
పుట్టిన అన్నము వనభోజనంతో
శుద్ధియగును. దీనితో ఒక
సంవత్సర కాలం పరాన్న
భోజనాదులతో వచ్చిన దోషము
తొలగును. ఉసిరి చెట్టు క్రింద కార్తిక
శుక్ల త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమా
లేక పంచమి రోజున
శ్రీదామోదరుణ్ణి స్థాపించి, ఉత్తమ
రీతిలో పూజించి పెసర పప్పు తో
తయారైన పప్పు, బెల్లము,
నెయ్యితో చేసిన భక్షాలను
హోమం చేసిన‌ పిదప‌

దేవి ధాత్రి నమస్తుభ్యం
గృహాణ బలిముత్తమమ్ |
మిశ్రితం గుడసూపాభ్యాం
సర్వమంగళదాయినీ।
పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞాన్
యశో దేహి నిరంతరం॥
ప్రజ్ఞాం మేధాం చ సౌభాగ్యం
విష్ణుభక్తిం చ దేహి మే |
నీరోగం కురు మాం నిత్యం
నిష్పాపం కురు సర్వదా॥
సర్వజ్ఞం కురు మాం దేవి
ధనవంతం తథా కురు॥

అని ఉసిరిచెట్టు చుట్టూ బలి
వేసి వైశ్వదేవ బలిహరణ
అనంతరం దేవతా నివేదన చేసి
తదనంతరం బ్రాహ్మణసువాసినీ
భోజనం చేయించి తాను కూడా
ప్రసాదం స్వీకరించాలి.

🕉వేదాంత సంగ్రహం🕉

13 Nov, 14:48


*శ్రీ గురుభ్యోనమః*

*కార్తిక పురాణం 13వ రోజు*

*ప్రతిరోజూ వామనుని తలుచుకొని లేవాలి*

*త్రయోదశీ*

*సూర్యోదయమ్ ఉన్నపుడు తిథిని చూసుకొని ఆ తిథిని పరిగణించాలి. ఈరోజు లేస్తూనే లక్ష్మీ స్మరణం చేయటం మంచిది. సూర్యోదయానికి ముందే చేసే స్నానానికి ఉత్తమ ఫలితం.*

*నదికి వెళ్లలేని వారు గంగ అని 3 సార్లు స్మరణ చేసి స్నానం చేయాలి.*

*మునగకాడ, దొండ, బెండ, కాకరకాయ వంటివి స్వయంపాకం లో ఇవ్వటం మంచిది.*

*కందిపప్పు, మినుములు ఒక కేజీ పావు తక్కువ కాకుండా దానం చేయాలి. విస్తరాకులు లేదా అరటి ఆకులు, మోదుగ ఆకులతో చేసిన విస్తర్లు ఇవ్వడం మంచిది.*

*ఈరోజు గణపతి , విష్ణువు, శివాలయములకు వెళ్ళాలి. శివునికి గంధపు నీటితో అభిషేకం చేయాలి. అమ్మవారికి సంపెంగలు లేక కదంబ పువ్వులతో పూజ చేయాలి.*

*ఈరోజు సాయంత్రం స్ఫటిక లింగం లేదా నర్మదా బాణలింగం దానం ఇవ్వాలి.*

*ఈరోజు పుస్తకములు దానం ఇస్తే తెలివితేటలు పెరుగుతాయి.*

*కన్యాదానం మహిమ తెలియచేసే కథను ఈ త్రయోదశీ తిథిలో వినాలి.*

🕉వేదాంత సంగ్రహం🕉

13 Nov, 14:47


*రేపు కార్తిక శుద్ధ త్రయోదశి*

*గురుబోధ:*
*కార్తిక శుద్ధ త్రయోదశి రోజు గణపతి, విష్ణువు, శివాలయములకు వెళ్ళాలి. శివునికి గంధపు నీటితో అభిషేకం చేయాలి. అమ్మవారికి సంపెంగలు లేక కదంబ పువ్వులతో పూజ చేయాలి.*
*ఈ రోజు సాయంత్రం స్ఫటిక లింగం లేదా నర్మదా బాణలింగం దానం ఇవ్వాలి.*
*ఈ రోజు పుస్తకములు దానం ఇస్తే తెలివితేటలు పెరుగుతాయి.*

🕉వేదాంత సంగ్రహం🕉

13 Nov, 08:37


*జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు :*

*ప్ర : తులసి, బిల్వాలను ఏ రోజు కోయకూడదో కొన్ని గ్రంథాల్లో చెప్పారు.* *ఋషిపీఠంలో కూడా గతంలో వ్రాశారు.కానీ దూర్వాలు, ఉసిరిక పత్రాలు కోయకూడని దినాలున్నాయా?*

*జ:* వాటి విషయం కూడా శాస్త్రంలో చెప్పారు.
*నైవచ్ఛింద్యాత్ రవౌ దూర్వాం |* *తులసీం నిశిసంధ్యయోః |*
*ధాత్రీ పత్రం కార్తికే చ పుణ్యార్థీ మతిమాన్ నరః |*
*ద్వాదశ్యాం చ దివా స్వాపస్తులస్యాపచయ స్తధా ॥* ఆదివారందూర్వాలను తుంచరాదు.రాత్రిగానీ, సంధ్యాకాలంగానీ తులసి కోయరాదు. కార్తికమాసంలో ఉసిరిక పత్రం కోయరాదు. ద్వాదశి నాడు పగలు నిద్రించుట, తులసి కోయుట నిషేధం.

*('ఋషిపీఠం' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరణ)*

🕉వేదాంత సంగ్రహం🕉

13 Nov, 00:05


🍚 చిలుకు - కైశిక ద్వాదశి 🍚

🚩 చాతుర్మాస్య వ్రత సమాప్తి 🚩

🌲 ఉత్థాన - గరుడ ద్వాదశి 🌲

💫 ఉత్పాత‌ యోగము 💫

🎊 విష్ణు ప్రబోధనోత్సవము‌ 🎊

🌿 తులసి - బిందు ద్వాదశి 🌿

⚛️ గోపద్మవ్రత‌ సమాపనమ్‌ ⚛️

🪔 నీరాజన - గోవత్స ద్వాదశి 🪔

🌤️ స్వాయంభువ‌ మన్వాది‌ 🌤️

🎄 బృన్దావన - మథన ద్వాదశి 🎄

🚩 శ్రీ శేషదాస‌ జయన్తీ 🚩

🌳 ధాత్రీ పూజ‌ 🌳

🪔 తులసి పూజ 🪔

🚩 శ్రీ కృష్ణశ్యామ కమల
నయన దత్త జయన్తీ 🚩

🌿 తులసి వ్రతారంభం 🌿

క్షీరాబ్ధి మహోత్సవము

తాపస‌ మన్వాది‌

🎋 క్షీరాబ్ధి - యోగీశ్వర ద్వాదశి 🎋

🎉 తులసి దామోదర వివాహం 🎉

☘️ సౌమ్యప్రదోషం ☘️

అన్నవరం శ్రీ సత్యనారాయణ
స్వామి తెప్పోత్సవం

🎊 జూనాఘడ్‌ శ్రీ కృష్ణ
రుక్మిణి కల్యాణోత్సవం 🎊

🕉️

💧ద్విదళవ్రత సమర్పణము 💧

అనిరుద్ధ నమస్తుభ్యం
ద్విదలాఖ్యవ్రతేన చ |
మత్కృతేనాశ్వినే మాసి
ప్రీత్యర్థం ఫలదో భవ ॥

💧చాతుర్మాస్యవ్రత సమాప్తి 💧

ఇదం వ్రతం మయా దేవ
కృతం ప్రీత్యె తవ ప్రభో ॥
న్యూనం సంపూర్ణతాం యాతు
త్వత్ ప్రసాదాత్ జనార్దన ||

🪔 దీప పాత్రఫలము 🪔

మట్టితో తయారైన దీప ప్రణతిలో
దీపోత్సవమును చేసినచో జ్ఞాని
అగును. ఇనుము పాత్రలో
దీపోత్సవాన్ని ఆచరిస్తే కేవలం
నూరు దీపాలను వెలిగించినంత
ఇష్టఫలము లభించును. కంచు
పాత్రలో దీపాన్ని వెలిగిస్తే తేజస్సు,
సౌభాగ్యాలు లభిస్తాయి. వెండి
ప్రణతిలో దీపాన్ని దేవుని సన్నిధిలో
వెలిగిస్తే లక్షరెట్లు పుణ్యము
లభించును. తామ్రపాత్రలో
వెలిగించుటవలన వెయ్యి రెట్లు
ఫలము. బంగారు ప్రణతిలో
దీపాలను వెలిగించుటవలన
అనంతానంత పుణ్యము.

ఏరండం మాహిషఘృతం
సర్వదా వర్ణయేత్ బుధః |
ఆముదపు నూనె, గేద నెయ్యిని
దీపారాధనకై వాడరాదు.

దీపోత్సవాన్ని కర్పూరము,
గోఘృతము, కొబ్బరినూనె,
నువ్వుల నూనెలతో చేయాలి.
దీపాన్ని భక్తితో వెలిగించినచో
అజ్ఞానము దూరమై జ్ఞానము
పొందవచ్చును. కార్తీకమాసములో
ఒక మాసాంతం వరకూ
స్నానాదులనాచరించుటకు
అసమర్థులైనవారు చివరి
త్రయోదశి, చతుర్దశీ, పున్నమి ఈ
మూడు రోజులు కార్తీక ధర్మాన్ని
ఆచరించినచో అత్యంత ఫలాలను
పొందవచ్చును. కార్తీక పున్నమి
నాడు స్నానము పరిసమాప్తి
అగును.

🔥వనభోజనము - ధాత్రీహోమము 🔥

మనకు తెలసి, తెలియకనే నానా
విధమైన దుష్టాన్నాన్ని తినడం
జరుగుతుంది. ఉత్తరాయణములో
“ఆగ్రహాయణేష్టి" ద్వారానూ,
దక్షిణాయనములో "వనభోజనము”
చేయుటద్వారాను
ప్రాయశ్చిత్తము చేసుకొనవచ్చును.
వనభోజనాన్ని ద్వాదశి తరువాత
త్రయోదశి, చతుర్దశీ, పున్నమీ
రోజులలోనూ కృష్ణ పక్షములో
పంచమి తిథివరకూ
చేయవచ్చును. ఐతే ఉసిరికాయను
సప్తమిన, ఆదివారము
భక్షించకూడదని నిషేధమున్నందున
ఆరోజులలో చేయకూడదు.
అంతేగాక మంగళవారము,
శుక్రవారము ఈ రెండు వారాలలో
ధాత్రీ హోమము చేయరాదు.
శ్రోత్రియ బ్రాహ్మణుల ఇంట్లో
భోజనముచేయుటవలన
బ్రాహ్మణుడై బహుజన్మలను
పొందెదరు.

🍚దుష్టాన్నము 🍚

తామస బుద్ధిగల దైవభక్తి లేనివారి,
దేవతానివేదన జరుగని భోజనము
తామసమనిపించి దానిని
దుష్టాన్నముగా పరిగణించవలెను.

అభోజ్యసూతికా షండ
మార్జారాsకఖుశ్వ కుక్కుటాన్ |
పతితావిద్ధ చండాల
మృతాsహాంశ్చ ధర్మవిత్ ॥

సూతకమున్నవారి భోజనము,
నపుంసకులిచ్చినది, పిల్లి, ఎలుక,
కుక్క మొదలగు ప్రాణులు తినగా
మిగిలినది, పతితులు,
చండాలులు, వీరు ఇచ్చిన అన్నాన్ని
దుష్టాన్నమనెదరు. ఇటువంటి
అన్నాలను తెలియక తిని ఉన్నచో
ఆ పాపము వనభోజనమువలన
నివృత్తి యగును.

బ్రాహ్మణీ బ్రాహ్మణస్యేహయౌ
అవరోధత్వమాగతౌ |
తావుభౌ సూతికేత్యుక్తౌ
తయోరన్నవిగర్హితం॥

పతివ్రత కాని స్త్రీ, బ్రహ్మచర్యను
కోల్పోయిన పురుషుడూ వీరిద్దరూ
సూతకము కలవారికి సమానులుగా
పిలవబడతారు. వీరందించిన
అన్నమును ఆరగించరాదు.

🔥 ధాత్రీహవన ఫలము 🔥

ధాత్రీ వృక్షాలున్న ప్రదేశానికి పోయి
ఆ వృక్షముల నీడలో దేవుని
పూజచేసి నైవేద్యమును అర్పించి
బ్రాహ్మణులకు భోజనము చేయించి
యజమాని కూడ నైవేద్యాన్ని
స్వీకరించుటవలన అనంత
పుణ్యము లభించును.
చాతుర్మాస్యకాలములో
చాతుర్మాస్య వ్రతమును
చేయువారికి ఏదైనా కారణము
వలన ప్రతాచరణకు లోపము
వాటిల్లినచో అందువలన
వచ్చు పాపములను ధాత్రీ
హవనము నాచరించి బ్రాహ్మణ
భోజనమాచరించుటవలన
వ్రతలోపము వలన కలిగిన
పాపము పరిహృతమగును.

🔥ఆగ్రహాయణేష్టి 🔥

వ్రీహి(వరి), జవగోధుమలు,
మొదలైన ధాన్యములతో
హోమమును చేయవలెను. కొత్త
ధాన్యములతో హోమము చేసిన
తరువాతనే ఆ కొత్త ధాన్యాలను
స్వీకరించుటకు అర్హతను
పొందుతాము. అంతవరకూ
ధాన్యాలకు "జాతాశౌచ"
దోషముంటుంది. ఈ హోమము
చేయకున్నచో అందుకు
ప్రాయశ్చిత్తముగా
వైశ్వానరహోమమును
చేయవలెను. ఆగ్రహాయణేష్టి
చేయక తిన్న అన్నము
పతితాన్నమని అనిపించుకొనును.

🕉వేదాంత సంగ్రహం🕉

12 Nov, 15:05


*శ్రీ గురుభ్యోనమః*

*కార్తిక పురాణం 12వ రోజు*

*ప్రతిరోజూ వామనుని తలుచుకొని లేవాలి*

*కార్తిక పురాణం - శుక్ల పక్ష ద్వాదశీ*

*కార్తిక మాసంలో ఈ ఉద్ధాన ద్వాదశీ రోజున నిద్ర లేస్తాడు. ఈరోజు ఉదయం 4 గంటలకు లేదా ముందే లేచి కార్తిక స్నానం చేయడం మంచిది. ఇంట్లోనే స్నానం చేసే వారు ఆవుపాలు కొంచెం వేసి గంగాజలంతో స్నానం చేస్తున్న సంకల్పం చెప్పుకోవాలి.*

*అచ్చు పోసి ఆంబోతుని ఊరికి వదలడం పూర్వం ఈరోజు న వదిలేవారు. ఈరోజు చేసే గోదానం మరింత మంచిది. స్వయంపాకం ఒక్కరు లేదా ముగ్గురు లేదా ఐదుగురికి ఇవ్వడం మంచిది.*

*గురువులకు పాదసేవ చేసినా, గురువు పాదాలు కడిగిన నీటిని నెత్తిన చల్లుకుంటే అది విష్ణుపాదోదకమ్ తో సమానం.*

🕉వేదాంత సంగ్రహం🕉

12 Nov, 12:09


క్షీరాబ్ధి_ద్వాదశి_పూజా_విధానము.pdf

🕉వేదాంత సంగ్రహం🕉

12 Nov, 09:37


కావున, ఓరాజా! కార్తికమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టులవారు నుడివిరి.🌺

🌺పదకొండవ రోజు పారాయణము సమాప్తము.🌺


🦜 🦜

🕉వేదాంత సంగ్రహం🕉

12 Nov, 09:37


*🙏🪔కార్తీకపురాణం 11 వ అధ్యాయం🪔🙏*
*🙏🪔 🪔🙏🪔 \|/ 🪔🙏🪔 🪔🙏*


*🙏 మ౦థరుడు - పురాణ మహిమ 🙏*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

🌺ఓ జనక మహారాజా! యీ కార్తీకమాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూతప్పని సరిగా వైకుంఠాన్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా ఆలకి౦పుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్ప దొడంగిరి.🌺
🌺పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్య మా౦సాది పానీయాలు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపారాదనాదికములను ఆచారములును పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతనే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండ నతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరాతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభావి౦చుచు రక్తము గ్రక్కుచు భాద పడుచు౦డిరి.🌺

🌺మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తినియై భర్తను తలచుకోని దుఃఖిoచుచు కాలము గడుపుచు౦డెను. కొనాళ్ళుకు ఆమె యిoటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి " స్వామి!నేను దీ నురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను, కాన, నాకు మోక్ష మార్గము ప్రసాదించు" మని బ్రతిమాలుకోనేను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి" అమ్మా! ఈ దినము కార్తిక పౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనువద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొన వచ్చేదను. నీవు ప్రమిదను, వత్తి ని తీసికొని రావాలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము" అని చెప్పిన తోడనే అందుకామె సంత సించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుబ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానె స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధ న చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల " ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపము నకు" రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమున కు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మేక్కించి వైకుంట మునకు దీ సికోనిపోయిరి. కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీ సికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో భాద పడుచున్న తన భర్త ను జూచి " 🌺ఓ విష్ణుదూత లారా! నా భర్తా మరి ముగ్గురును యీ నరక బాధపడుచునారు . కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్ద రింపు "డ ని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు " అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యా దులు మాని పాపాత్ముడై నాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరకబాధలు పడుచునారు. " అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు" డని ప్రార్ధించగా , అందులకా దూతలు " అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కలిగినఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగు" నని చెప్పుగా అందులకామె అట్లే ధార పోసేను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి.

🕉వేదాంత సంగ్రహం🕉

12 Nov, 03:23


https://t.me/Vedantasangraham
మీ బంధు మిత్రులని ఈ గ్రూపులో చేర్చుటకు, ఈ లింక్ use చేయండి.

🕉వేదాంత సంగ్రహం🕉

12 Nov, 00:44


🎋 భోధనైకాదశి 🎋

🚩 సంత్ నామ్‌దేవ్ జయంతి 🚩

🌲 దేవ ఉత్థాన ఏకాదశి 🌲

🪔 జాగరణము 🪔

🎍 కైశిక‌ - చిలుకు ఏకాదశి 🎍

💧 పుష్కర్‌రాజ్ స్నాన‌ పర్వారంభం 💧

🛕 గురువాయుర్‌ ఏకాదశి 🛕

🚩 శ్రీ వేదనిధితీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

💧 భీష్మపంచక వ్రతము‌ 💧

🍚 పంచగవ్య స్నానము - సేవన 🍚

🔮 కుంభదానము 🔮

⚛️ తులసి పద్మ వ్రతము ⚛️

🌱 ద్విదళవ్రత‌ సమాప్తి 🌱

🛕 పండరీపూర్‌ యాత్ర 🛕

📿 తులసి - ధాత్రి కాష్ఠ‌ మాలాధారణ‌ 📿

🌴 చాతుర్మాస్యనియమ
సమాప్తి 🌴

🪔 శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్య
జయన్తీ 🪔

🪷 గోపద్మవ్రత‌ సమాప్తి 🪷

🎉 పంచపర్వారంభం‌ 🎉

🎊 విష్ణు ప్రభోదనోత్సవం‌ 🎊

🛕 మేల్కోటే‌ శ్రీ చలువనారాయణ‌
స్వామి రథోత్సవం 🛕

🎊 ఉజ్జయిని శ్రీ కాళిదాస్
స్మృతి సమరోహ్‌ ఉత్సవం 🎊

🕉వేదాంత సంగ్రహం🕉

11 Nov, 15:17


*గురుబోధ:*
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు. అదికూడా కార్తికమాసంలో వచ్చే రెండు ఏకాదశుల్లో తెల్లవారు ఝామున లేచి నదుల్లో కానీ, కాలువల్లో కానీ ఎక్కడైనా స్నానం చేసి విఘ్ణ ఆలయం లేదా శివాలయానికి వెళ్లి యథాశక్తి అర్చన చెయ్యాలి. తులసీదళాలతో హరిని, బిల్వదళాలతో హరుడిని అర్చన చేసి, ఉపవాసం ఉండి రాత్రికి నక్త భోజనం కానీ లేదా సంపూర్ణ ఉపవాసం కానీ ఉండి భగవంతుని కథలు వింటూ భగవత్ ధ్యానం చేసినవాడు జీవితంలో యమకింకరుల దర్శనము చేయడు. నరకానికి వెళ్ళడు. సకల శుభాలు పొందుతాడు. ఏకాదశి నాడు ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలు, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించిన వాడు ఐశ్వర్యము పొందుతాడు. చామంతి పువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించిన వాడు మంచి పదవిని పొందుతాడు. ఏకాదశి రోజు జాగరణ చేసి మరుసటి రోజు హరి దర్శనము చేసుకున్నవాడు జీవితంలో సుఖం, శాంతి, ఆనందం తప్ప మాట వరుసకి కూడా దౌర్భాగ్యం పొందడు.

ఏకాదశీ ఉపవాసము, నక్తము ఒకే రోజు ఉంటే అందులో ఏదైనా ఒక వ్రతం ఆచరిస్తే సరిపోతుంది.
* *ఉదా 1.* || నెల రోజులు లేదా కొన్ని పర్వ దినములు నక్త వ్రతం చేయాలి అని అనుకుంటే ఒకవేళ ఏకాదశి వచ్చినా నక్షత్ర దర్శనం అయ్యాక పారణ (ప్రసాదం) స్వీకరించవచ్చు.
* *ఉదా|| 2* ఒకేరోజు ఏకాదశి మరియు శ్రాద్ధమును ఆచరించవలసి వస్తే శ్రాద్ధమునకు ప్రాధాన్యం ఇచ్చి భోజనం స్వీకరించాలని శాస్త్రం.
* *ఉదా|| 3* ఏకాదశీ వ్రతం చేసిన వారు నక్తము చేయవలసి వస్తే ద్వాదశి ఉదయం భోజనం (ఒకపూట పగలు భుజించి మరుసటి రోజు వరకు ఉపవాసం ఉంటే ఛాయానక్తము అంటారు ) చేసి ఆ రోజు ఏమీ తినకుండా ఉండవచ్చు.
పైవన్నీ ఆరోగ్యం సహకరించిన వారికి మాత్రమే!

🕉వేదాంత సంగ్రహం🕉

11 Nov, 12:54


https://t.me/Vedantasangraham
మీ బంధు మిత్రులని ఈ గ్రూపులో చేర్చుటకు, ఈ లింక్ use చేయండి.

🕉వేదాంత సంగ్రహం🕉

11 Nov, 12:01


12.11.2024 - మంగళవారం

ఉత్థానైకాదశి, భీష్మ పంచక వ్రతం.

ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు మేల్కొనే రోజు కనుక ఇది ఉత్థాన ఏకాదశి. ఈ రోజున విష్ణ్వారాధనలు, ఉపవాసాదులు విశేష ఫలితాలను కలుగజేస్తాయి. భాగవతంలోని అంబరీషోపాఖ్యానాన్ని చదవడం, వినడం శ్రేష్ఠం. రాత్రిపూట విష్ణునామ కీర్తనలతో జాగరణ చేయాలి. కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పూర్ణిమ వరకు ‘భీష్మపంచక ప్రతం’గా శాస్త్రాలలో ఉంది. దాహపీడితుడైన భీష్మునికై అర్జునుడు తన బాణంతో పాతాళగంగను తెప్పించి ఇచ్చిన రోజు. శ్రీకృష్ణుని నిర్ణయానుసారం ఈ అయిదు రోజులు భీష్ముని ఉద్దేశించి తర్పణాదులు ఇవ్వాలి. అంతేకాక ఈ అయిదు రోజులలో మంత్రోపదేశం పొందడం, దీక్షగా జపించడం ఉత్కృష్ట ఫలప్రదాలు.
ఋషిపీఠం

🕉వేదాంత సంగ్రహం🕉

11 Nov, 02:49


*గురుబోధ:*
పూర్వం శివుడు పార్వతితో ఒకసారి ఇలా అన్నాడు - నేను ఒకప్పుడు లోకశ్రేయస్సు కోసం వేల సంవత్సరాల తపస్సు చేసాను. లోకహితం కోసం నా మనస్సులో ఏదో ఒక ఆందోళన కలిగింది. నేనే కావాలని ఆ ఆందోళన కలిగించుకున్నాను. అప్పుడు మూసుకుని వున్న నా కళ్ళు హఠాత్తుగా తెరుచుకున్నాయి. పవిత్రమైన నా కళ్ళనుండి కొన్ని నీటి బిందువులు నేలపై పడ్డాయి. ఆ బిందువుల నుండి రుద్రాక్ష అనబడే వృక్షాలు పుట్టాయి. భక్తులను అనుగ్రహించడానికి ఆ కళ్ళనుండి నీటివిందువులు, బిందువుల నుండి వృక్షాలు, రుద్రాక్షలు నేనే సృష్టించాను. రుద్రాక్షలను భక్తులకు, బ్రహ్మవిష్ణువు మున్నగువారికి ధరించడానికి ఇచ్చాను.

🕉వేదాంత సంగ్రహం🕉

11 Nov, 00:51


🎋 రాజ్యవ్యాప్తి‌ దశమి వ్రతం 🎋

🚩 శ్రీ విజయదాసర‌ పుణ్యతిథి‌ 🚩

🌾 సార్వభౌమ వ్రతము 🌾

🍽️ ఏకభుక్తము 🍽️

🚩 శ్రీ యాజ్ఞవల్క్య జయన్తీ 🚩
( మతాంతరం‌ )

🏳️ బాబా లాల్‌దయాళ్‌
పుణ్యతిథి‌ 🏳️

👺 కంసాసుర‌ వధ‌ 👺

🎉 భీష్మపంచక‌ వ్రతారంభం‌ 🎉
( మతాంతరం)

🪔 వెల్లాల సదాశివశాస్త్రి
జయన్తీ 🪔

🚩 శ్రీ సత్యవీరతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

🏳️ శ్రీ అవధూతానంద‌స్వామి‌
మహారాజ్ పుణ్యతిథి‌ 🏳️

☘️ కార్తీక సోమవారం ☘️

🎊‌ తిరుమాలిరుంచోలై శ్రీ
సుందరరాజ పెరుమాళ్
ఉత్సవారంభం‌ 🎊

🕉వేదాంత సంగ్రహం🕉

10 Nov, 04:43


*🙏🪔కార్తీకపురాణం 9 వ అధ్యాయం🪔🙏*
*🙏🪔 🪔🙏🪔 \|/ 🪔🙏🪔 🪔🙏*


*🙏 విష్ణు దూతల యమదూతల వివాదం 🙏*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

విష్ణుదూతలడిగిరి.ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీయమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈవిషయములన్నిటిని మాకు చెప్పమని విష్ణుదూతలడుగగా యమదూతలు ఓ విష్ణుదూతలారా! సావధానముగా వినుడు.

సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు.

మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు, వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని, నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదిలినవారిని, ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవానిని, డాంబికుని, దయాశాంతులు లేనివానిని
భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను చెప్పువానిని మేము దండింతుము.

నేను దాతనని చెప్పుకొనువానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని అపకారమును చేయువానిని మేము దండింతుము.వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను జూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని కన్యాశుల్కముల చేత జీవించువానిని,
చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములయిన వాటిని చెరుచు వానిని మేము దండింతుము.

మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడచినవానిని, నిత్యకర్మను వదలిన వానిని మేము దండింతుము. పరపాకపరిత్యాగిని, పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము.

పరపా పరిత్యాగియనగా తానువండిన అన్నములో ఇతరులకు ఎంతమాత్రము పెట్టక తానే అంతయు భుజించువాడు, పితృశేషాన్నభోక్తయనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు, ఇతరులు దానము చేయు సమయాన ఇవ్వవద్దని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకివ్వని వానిని, తన్ను శరణుజొచ్చిన వానిని చంపువానిని మేము దండింతుము.

స్నానమును, సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణనిందకుని బ్రాహ్మణహంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈమొదలయిన పాతకములను చేయు మానవులు యమలోకమున మాచేత యాతనలను పొందుదురని చెప్పారు. ఈ అజామీళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చువరకు పాపములను చేసినాడు.ఇతనిచే చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును?

ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీరధ్వనితో నిట్లనిరి. ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు.ధర్మమర్యాదను మేము చెప్పెదము. సావధానముగా వినుడు.

దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మ చింతనమును చేయువాడు యమదండార్హుడుగాడు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును, జపహోమాదులు ఆచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు.సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్ని హోత్రములను జేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడుగాడు. కర్తృభోక్తృత్వాదులను సగుణపరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు.

అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము=ఆబోతును అచ్చుపోసి వదలుట. విద్యను గోరినవారికి విద్యాదానమాచరించువాడు, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందడు.

హరిని బూజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయనములను చేయువాడును, యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడు, క్రీడాస్థానములను గట్టించువాడు, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును చేయించువాడు యమలోకమును పొందడు. నిత్యము సాలగ్రామ అర్చనమాచరించి ఆతీర్థమును పానముజేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు.

తులసీ కాష్ఠమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేషతులా మకర సంక్రాంతులయందుండగా ప్రాతః స్నానమాచరించు వారు యమలోకమును పొందరు.

రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓ రామా! అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు.

కాశియందు మణికర్ణికాఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతినొందినయెడల వాడు సర్వపాపములు చేసినవాడయినను యమలోకమును పొందడు. దొంగ, కల్లుత్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య, చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన యెడల పాపవిముక్తులగుదురు.

🕉వేదాంత సంగ్రహం🕉

10 Nov, 04:43


మహిమను తెలుసుకొనిగాని, తెలియకగాని, మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములయినను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు బొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదులచేత పీడింపబడినప్పుడును, సప్తవ్యసనములచే పీడింపబడునప్పుడును, వశముకానప్పుడును హరి హరీయని అన్నయెడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెరిగియున్న పాపములన్నియు భూమియందుగాని, స్వర్గమందుగాని హరినామసంకీర్తనము చేత నశించును.

మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణమును చేసినయెడల వాని పాపములన్నియు అగ్నిలోనుంచిన దూదివలె నశించును. విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామీళుని యమదూతలవలన విడిపించిరి. తరువాత అజామీళుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వలన నేను తరించితిని అనెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకుబోయిరి.

తరువాత అజామీళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టమాయెను. ఆత్మహితము చేసికొనలేకపోతిని. ఛీ ఛీ నాబ్రతుకు సజ్జననిందితమాయెనుగదా! పతివ్రతయైన భార్యను వదలివేసి కల్లుద్రాగెడి ఈదాసీభార్యను స్వీకరించితినిగదా! వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములయిన మాతాపితరులను నీచుడనై విడిచితిని గదా! అయ్యో ఎఃత కష్టము,ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను.

ఇదియేమి ఆశ్చర్యము. ఇది స్వప్నమా. ఆనల్లకత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించినవాడను ఇది నిజము. అట్లుగానిచో దాసీపతియైన నాకు మరణకాలమందు హరిస్మృతి యెట్లుగలుగును.

నా జిహ్వహరినామమును యెట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ, అంత్యకాలమందీ స్మృతియెక్కడ? సిగ్గువిడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ, మంగళకరమయిన నారాయణ నామమెక్కడ? అజామీళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తినిబొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తన గావించువాడు సమస్తపాపవిముక్తుడై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందియము లేదు.

*కార్తీక పురాణం 9 వ అధ్యాయం సమాప్తం*


*🦜 🦜*

🕉వేదాంత సంగ్రహం🕉

10 Nov, 04:26


*గురుబోధ:*
శివనామం గంగ. విభూతి యమునానది. రుద్రాక్ష సర్వపాపనాశినియైన సరస్వతి. అందుకే ఈ మూడూ ధరించి, త్రివేణీసంగమమై భక్తుడు ఇహపరాలు రెండూ సాధించగలడు. బ్రహ్మ మూడు నదుల సంగమాన్నీ, ఈ మూడు పనుల సంగమాన్నీ పోల్చి, కొలిచి రెండూ కూడా, సమాన ఫలితాలు అని తేల్చి చెప్పాడు. అందుకే త్రిమూర్తులు కూడా, శివనామ, విభూతి, రుద్రాక్ష ధారణలు తప్పక చేస్తుంటారు. శివనామం దావాగ్ని వంటిది. మహాపాపారణ్యాలను దగ్ధం చేస్తుంది. జీవులు ఈ జన్మలో దుఃఖాలు పొందడానికి గల కారణం ఇంతకు పూర్వం చేసిన పాపాలు. పాపాలు తొలగనిదే దుఃఖాలు తొలగవు. దుఃఖాలు తొలగడానికి శివనామస్మరణ సరియైన మార్గం. శివనామం నిరంతరం జపించేవాడు, పండితుడు, వైదికుడు, పుణ్యాత్ముడు, ధన్యుడు. శివనామం తొలగించగలిగేటన్ని పాపాలను భూలోకంలోని మానవులంతా కలిసినా చేయలేరు.

🕉వేదాంత సంగ్రహం🕉

10 Nov, 00:46


🪷 అక్షయ నవమి 🪷

⚜️ దుర్గా నవమి ⚜️

🌳 ధాత్రి నవమి 🌳

🌴 ఆమలక‌ - అశ్వత్థ పూజ 🌴

💧 ఆజ్మేర్‌ పుష్కర్‌ మేళా 💧

🍈 కూష్మాండ నవమి 🍈

🌤️ కృత - సత్య‌ యుగాది‌ 🌤️

🌊 సముద్ర స్నానం 🌊

🍐 గుమ్మడికాయ దానము 🍐

🏔️ మధుర-బృందావనం
జుగళ్‌ జోడి పరిక్రమ‌ 🏔️

🎋 విష్ణుత్రిరాత్ర‌ వ్రతం 🎋

🔱 జగద్దాత్రి‌ - చండిక‌ పూజ 🔱

🚩 శ్రీ రంగ‌‌ అవధూత జయన్తీ 🚩

🏳️ బెల్లంకొండ రామరాయ
కవీంద్ర పుణ్యతిథి‌ 🏳️

🚩 కంచి జగద్గురు శ్రీ పరిపూర్ణబోధైంద్ర‌
సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩

🏳️ శ్రీ సాయి లీలాషాహాజీ‌
మహారాజ్ పుణ్యతిథి‌ 🏳️

🚩 శ్రీ ప్రజ్ఞాధిరాజతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

🏳️ శ్రీ గోవిందబాబా‌ రోధే‌
పుణ్యతిథి‌ 🏳️

🎊 తంజావూరు రాజరాజ చోళ‌
సదయ‌ ఉత్సవం 🎊

🕉వేదాంత సంగ్రహం🕉

09 Nov, 15:13


*శ్రీ గురుభ్యోనమః*

*కార్తిక పురాణం 9వ రోజు*

*నవమి రోజు ఉదయాన్నే వామనుని స్మరించుకోవాలి.*

*ఈరోజు జమ్మి చెట్టు ని పూజించే తిథి. ఈరోజు మారేడు, జమ్మి, రుద్రాక్ష లేదా ఉసిరి ఆకు తలపై ఉంచుకొని స్నానం చేయాలి.*

*ఇలా చేయటం వల్ల గ్రహణం సమయంలో దానం చేసిన పుణ్యం. ఈరోజు మునక్కాయలు దానము ఇవ్వడం మంచిది.*

*ఈరోజు గురు దర్శనం , గురు వందనము హరిహరులకు నమస్కారం చేసిన పుణ్యం.*

*ఉదయం లేదా సాయంత్రం స్వయంపాకం ఇవ్వడం మంచిది. ఈరోజు అర్చకులకు, పురోహితులు ఇచ్చే దానం చాలా గొప్పది.*

*విష్ణుసహస్రం పారాయణం చేయాలి. ఈరోజు శనికి బిల్వములతో పూజ చేయాలి.*

*ఈరోజు భస్మంతో అభిషేకం చేసి ఆ భస్మం నుదుట ధరించాలి.*

*ఈరోజు అమ్మవారికి ఖడ్గమాలతో కుంకుమార్చన చేస్తే వారు సౌభాగ్యవతులు అవుతారు.*

*ఈరోజు ఆవు పెరుగు నైవేద్యంగా సమర్పిస్తే మహా సంపదలు లభిస్తాయి.*

*కొండగోగులు, నందివర్ధనాలు, కొండమల్లెలను ఈరోజు శివునికి అర్పించాలి.*

*సాధ్యమైనంతవరకు ఈరోజు ప్రదక్షిణలు చేయాలి.*

🕉వేదాంత సంగ్రహం🕉

09 Nov, 12:31


10.11.2024 - ఆదివారం
అక్షయ నవమి వ్రతం, విష్ణు త్రిరాత్ర వ్రతం, కృతయుగాది.
ఈ రోజున చేసిన నదీస్నాన, దాన, పూజాదులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి కనుక ఇది అక్షయ నవమిగా ప్రసిద్ధి చెందింది.
ఋషిపీఠం

🕉వేదాంత సంగ్రహం🕉

09 Nov, 07:36


కార్తీక పురాణము , ఎనిమిదవ అధ్యాయము - ఎనిమిదో రోజు పారాయణము
వశిష్ఠుడు చెప్పినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను . దీనివల్ల ధర్మము చాలా సూక్ష్మమైనదని , పుణ్యము సులభముగా సంపాదించుకోవచ్చని తెలుసుకున్నాను . కేవలం నదీస్నానము,దీపదానము, ఫలదానము,అన్నదానము,వస్త్రదానము,వలన అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుందని తెలియజేశారు . ఇటివంటి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభిస్తుండగా , వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని, పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెబుతూంటారు గదా! మరి తమరు ఈ వ్రత విధానాన్ని సూక్ష్మములో మోక్షముగా విశదపరచడం, నాకు అమితాశ్చర్యమును కలుగజేస్తుంది .
దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులైన మహాపాపములు చేసినవారు ఇంత తేలికగా మోక్షమును పొందడం వజ్రపు కొండను గోటితో పెకలించడం వంటిదే కదా ! కాబట్టి దీనిలో దాగిఉన్న మర్మమును విడమర్చి, విపులంగా చెప్పాల్సిందిగా మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను “ అని కోరారు .

అప్పుడా వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, "జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే,నేను వేదవేదాంగములను కూడా పఠించాను . వాటిల్లో కూడా సూక్ష్మమార్గాలున్నాయి . వీటిల్లో సాత్త్విక, రాజస, తామసములు అని ధర్మము మూడురకములు.

సాత్త్విక ధర్మమం అంటే - దేశ, కాల పాత్రలు మూడూ సమకూడిన సమయములో ‘సత్త్వ’మనే గుణము జనించి, ఫలమంతా కూడా పరమేశ్వరార్పితము చేసి , మనోవాక్కాయ కర్మలచే నిర్వర్తించిన ధర్మము. ఇటువంటి ధర్మము ఎంతో ఉన్నతమైనది. సాత్త్వికధర్మము సమస్త పాపములను నాశనం చేసి, వ్యక్తులని పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూర్చగలిగినది .
ఏవిధంగా అయితే, తామ్రపర్ణినది సముద్రములో సంగమించే స్థలాలలో, స్వాతికార్తెల కాలంలో , ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి, ధగధగ మెరిసి, విశేషమైన రత్నమైన ముత్యముగా మారుతుందో , అదేవిధంగా - సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మ మాచరిస్తూ గంగ,యమున,గోదావరి కృష్ణనదులలో పుష్కరాలు మొదలైన పుణ్యకాలములలో స్నానమాచరించి, దేవాలయములలో వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసినా , లేక ఆ నదీతీరములోని దేవాలయంలో జపతపాదులు చేసినా విశేషఫలమును పొందగలరు.

అర్థమైనది కదా ! ఇక రాజసాధర్మాన్ని గురించి వివరిస్తాను - ఫలాపేక్ష కలిగి, శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించేదిగా ఉంటుంది .

ఇక తామస ధర్మము - శాస్త్రోక్త విధులను విడిచి దేశ కాల పాత్రలు సమకూడని సమయములో డాంబికాచరణార్ధం చేసే ధర్మం. ఇటువంటి ధర్మం ఫలము నీయదు.
దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసినా అది గొప్ప ఫలము నివ్వగలదు . ఉదాహరణకి పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమైన చందాన శ్రీ మన్నారాయణుని నామము, తెలిసిగాని,తెలియకగాని ఉచ్ఛరించినట్లయితే వారి సకల పాపములు పోయి ముక్తిని పొందగలరు . దానిని తెలిపే యితిహాసముని వివరిస్తాను . అంటూ ఆ కథని జనక మహారాజుకి ఈ విధంగా చెప్పసాగారు వశిష్ఠమహర్షి .

అజామీళుని కథ
పూర్వకాలములో కన్యాకుబ్జమనే నగరములో నాల్గువేదములు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. సకల సద్గుణరాశి అయిన హేమవతి ఆయన భార్య . ఆ దంపతులు అన్యోన్యమైన ప్రేమకలిగి అపూర్వ దంపతులని పేరు పొందారు . వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు .

వారాబాబుని అతి గారాబముగా పెంచుతూ , ‘అజామీళుడని’ నామకరణము చేశారు .ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమవుతూ, అతిగారాబము వలన పెద్దలను పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ, దుష్టసావాసములు పట్టి , విద్యాభ్యాసము విడిచి , బ్రాహ్మణధర్మములు పాటించక తిరుగుతుండేవాడు .

ఈ విధముగా నుండగా, కొంతకాలమునకు యవ్వనము ఉదయించగా , మరింత చెలరేగి కామాంధుడై, మంచి చెడ్డలు మరచి, యజ్ఞోపవీతము త్రెంచి, మద్యం సేవిస్తూ , ఒక ఎరుకలజాతికి చెందిన స్త్రీని వలచి, నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుతూ , యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యింటనే గడుపుతూ తింటూ ఉండేవాడు .

అతి గారాబము ఏవిధంగా పరిణమించినదో విన్నావా రాజా! తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నా, దానిని ప్రదర్శించకుండా , చిన్ననాటినుంచీ అదుపు ఆజ్ఞలలో ఉంచకపోతే, యీ విధంగానే జరుగుతుంది .ఆ విధంగా , అజామీళుడు కులభ్రష్టుడు కాగా, అతణ్ణి వానిబంధువులు విడిచిపెట్టారు.
దాంతో అజామీళుడు మరింత రెచ్చిపోయి, వేటాడి పక్షులను,జంతువులను చంపుతూ, కిరాతవృత్తి చేపట్టి జీవించసాగాడు . ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కొస్తుండగా, ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోతూ కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆస్త్రీపై బడి కొంతసేపు యేడ్చి, తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనము చేసి ఇంటికి చేరాడు .

🕉వేదాంత సంగ్రహం🕉

09 Nov, 07:36


ఆ స్త్రీని అజామిళుడు చేపట్టే ముందే, ఆమెకి ఒక కుమార్తె ఉంది . కొంత కాలమునకు ఆ బాలికకు యుక్తవయస్సు రాగా, కామాంధకారముచేత కన్నుమిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి, ఆమెతో కూడి కాపురము చేయసాగాడు . వారికి యిద్దరు కొడుకులు కూడా కలిగారు .కానీ ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు . ఆమె మళ్ళీ గర్భము ధరించి ఒక కుమారుని ప్రసవించింది .
వారిద్దరూ ఆ బాలునికి "నారాయణ" అని పేరు పెట్టి పిలుస్తూ , ఒక్కక్షణమైన ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్లినా వెంటాబెట్టుకొని వెళ్ళేవారు. "నారాయణ - నారాయణ" అని ప్రేమతో సాకేవారు . కాని "నారాయణ" యని స్మరించినంత మాత్రాన తమ పాపములు నశించి, మోక్షము పొందవచ్చుననే జ్ఞానం మాత్రము అతనికి తెలియకపోయింది .

ఇలా కొంతకాలము జరిగిన తర్వాత, అజామీళునకు శరీరపటుత్వము తగ్గి, రోగగ్రస్తుడై మంచముపట్టి అవసానకాలంలో ఉన్నాడు .చివరి క్షణాలు ఆసన్నమవడంతో , భయంకరాకారములతో, పాశాది ఆయుధములు ధరించి యమభటులు అతనిముందు ప్రత్యక్షమయ్యారు . వారిని చూచి అజమీళుడు భయపడి, కుమారునిపై ఉన్న వాత్సల్యము వల్ల "నారాయణా, నారాయణా” ని పలవరిస్తూ , ప్రాణాలు విడిచాడు .

అజామీళుని నోట "నారాయణా" అనే శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగారు . అదేవేళకు దివ్యమంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ అయిన శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అక్కడికి వచ్చి "ఓ యమభటులారా! ఇతను మావాడు. మేము ఇతణ్ణి వైకుంఠమునకు తీసుకు పోయేందుకు వచ్చాము " అని చెప్పి, అజామీళుని విమాన మెక్కించి తీసుకుపోయే ప్రయత్నం చేశారు . అప్పుడా యమదూతలు "అయ్యా! మీకు సరైన సమాచారమున్నదా ? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొనిపోయెందుకు మేమిక్కడికి వచ్చాము . కాబట్టి వీనిని మాకు వదలండి “ అని కోరారు . అప్పుడు విష్ణుదూతలు ఇలా సమాధానమిచ్చారు.

ఎనిమిదవ అధ్యాయము, ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !

స్వస్తి !!

🕉వేదాంత సంగ్రహం🕉

09 Nov, 06:28


🌺 మాస్టర్ ఇ.కె గారి తళుకులు 🌺
🌼 మనమే మన సొంతం కానపుడు నేను దానం చేస్తున్నాను అంటే తప్పు.🌼

🕉వేదాంత సంగ్రహం🕉

09 Nov, 05:14


*🌹🌹 గోపాష్టమి - గోపూజ 🌹🌹*

*కార్తిక మాసంలో ఎంతో ప్రశస్తమైనవి రెండు తిధులు. ఒకటి శుక్ల పక్షంలో వచ్చే అష్టమి, రెండోది కృష్ణ పక్షంలో వచ్చే ద్వాదశి. అష్టమి నాడు జరిగే పండుగను గోపాష్టమి అంటారు. ద్వాదశినాడు జరిగే పండుగను గోవత్స పూజ అంటారు. ఈ రెండు రోజులు గోవుకు పూజ తప్ప ఇక ఏ పూజ లేదు*

*నందుడు శ్రీకృష్ణ బలరాములను గోపాలకులుగా అనుమతించి గోవుల కాచేందుకు పంపిన రోజుగా ఈ తిథి జరుపుకుంటారు*.

*ఈరోజు ప్రయత్న పూర్వకంగా గోశాలకు వెళ్ళి "గోసేవ" చేయాలి. వీలు చేసుకుని గోపూజ చేయటం, గోవులకు గ్రాసం పెట్టడం చేయాలి*.

*కార్తిక మాసంలో అష్టమి తిథి గోసంబంధ తిథి. గోసేవ చేసి తరిద్దాం*

*🌹🌹 గోమాతా విజయతాం 🌹🌹*

🕉వేదాంత సంగ్రహం🕉

09 Nov, 04:33


https://t.me/Vedantasangraham
మీ బంధు మిత్రులని ఈ గ్రూపులో చేర్చుటకు, ఈ లింక్ use చేయండి.

🕉వేదాంత సంగ్రహం🕉

09 Nov, 04:31


🌹తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాలు🌹
మహా శివుడు.. హిమాలయాల్లోని మంచుకొండల్లో ఉంటాడు.. నమ్మిన భక్తుల నిండు గుండెల్లో ఉంటాడు. మంచుకొండలెక్కి తన దగ్గరికి రాలేని వారికోసం భక్తుల చుట్టుపక్కలే కొలువై ఉంటాడు. తెలంగాణలో శివుడు కొలువై ఉన్న ప్రముఖ శైవక్షేత్రాల సమాహారం.. కార్తీక మాసం సందర్భంగా మీకోసం..
🌹వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా కొలువుదీరాడు. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఈ శైవక్షేత్రం ఉంది. ఇంద్రుడి బ్రహ్మహత్య పాపాన్ని నివారణ చేసిన శైవక్షేత్రంగా వేములవాడకు పురాణాల్లో స్థానం ఉంది.
🌹కొమురవెల్లి:సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమురవెల్లి మల్లన్న శివ భక్తులకు సుపరిచితం. 500 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ శివుడు మల్లన్న రూపంలో పూజలందుకుంటున్నాడని ప్రతీతి. సంక్రాంతి సమయంలో ఇక్కడ జరిగే పట్నాలు చూడడానికి రెండు కళ్లు సరిపోవు. మహా శివరాత్రి నాడు కొమురవెల్లిలో చేసే.. కల్యాణం చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు.
🌹రామప్ప : కాకతీయులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రసిద్ధ శైవక్షేత్రం ఉంది. రామలింగేశ్వరుడి రూపంలో ఇక్కడ శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. అద్భుతమైన శిల్పసంపదకు రామప్ప ఆలయం నిలయం.
🌹కాళేశ్వరం :జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న ఈ శైవక్షేత్రం ఇప్పుడు తెలంగాణ మొత్తానికి సుపరిచితం. ఇక్కడ యముడికి ప్రత్యక్షమైనందున శివుడిని కాళేశ్వరుడు అంటారు. కాళేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత ముక్తేశ్వరుడిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న లింగానికి రెండు రంధ్రాలుంటాయి. ఆ రంధ్రాల్లో నీళ్లు పోస్తే ఒక ధార గోదావరి, మరొకటి ప్రాణహిత సంగమంలో కలుస్తాయని నమ్మకం.
🌹వేయి స్తంభాల గుడి: వరంగల్ జిల్లా, హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ప్రసిద్ధి. 12 వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించాడు. వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉన్నారు.
🌹కీసర :హైదరాబాద్​కు అతి దగ్గరో ఉన్న, ఎక్కువమంది వెళ్లే శైవక్షేత్రం ఇది. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు. పూజ చేసుకోడానికి వారణాసి నుంచి లింగం తీసుకురమ్మని రాముడు ఆంజనేయుడిని పురమాయిస్తాడు. తీరా వారణాసి వెళ్లిన ఆంజనేయుడు.. అక్కడ ఉన్న 101 లింగాలను చూసి.. ఏ లింగం తీసుకెళ్లాలో తెలియక 101 లింగాలను తీసుకెళ్తాడట. అప్పటికీ ఆలస్యం కావడంతో శివుడే ప్రత్యక్షమై రాముడికి లింగం ప్రసాదించాడని స్థలపురాణం చెబుతుంది. తాను తెచ్చిన లింగాలకు పూజ చేయలేదని ఆగ్రహించిన హనుమంతుడు లింగాలను విసిరి పారేశాడట. అందుకే.. కీసరలో ఎక్కడ చూసినా.. లింగాలే కనిపిస్తాయి.
🌹పానగల్ :భౌతిక శాస్త్రవేత్తలకు సవాల్ విసిరిన పురాతన ఛాయా సోమేశ్వరాలయం ఇక్కడే ఉంది. ఛాయా సోమేశ్వరాలయంగా చెప్పుకునే ఈ శైవక్షేత్రంలో శివలింగం మీద నిత్యం నీడ ఉండడం ప్రత్యేకత. ఆ సమీపంలోనే పచ్చల సోమేశ్వరాలయం ఉంది. నవరత్నాల్లో ఒకటైన పచ్చరాయితో చెక్కబడిన లింగం ఇది. కాకతీయ సామంతరాజుల కాలంలో ఈ ఆలయాలు నిర్మించబడ్డాయి. నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పానగల్ ఉంది.
🌹రాచకొండ:రేచర్ల పద్మ నాయకులు పాలించిన రాచకొండ ప్రాంతంలో అనేక శివాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. సింగ భూపాలుడి కాలంలో ప్రతిష్టించిన పది అడుగుల అరుదైన రాతి శిల్పం ఈ మధ్యే గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడింది. 15వ శతాబ్దంలో ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రంగా రాచకొండ చరిత్రకెక్కింది. ఇప్పటికీ అక్కడ ఎన్నో విగ్రహాలు, శిల్ప సంపద చెక్కు చెదరకుండా ఉన్నది.
🌹ఐనవోలు : వరంగల్ జిల్లాలోని ఈ శైవక్షేత్రాన్ని ఆరో విక్రమాదిత్యుడి మంత్రి అయ్యనదేవుడు క్రీ.శ 1076లో కట్టించాడని చరిత్ర చెప్తోంది. 108 స్తంభాలతో నిర్మితమైన ఈ శైవక్షేత్రం చాళుక్య రాజుల నిర్మాణ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు మల్లన్న అవతారంలో భీకరమైన విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ప్రతీ మహా శివరాత్రి పర్వదినాన ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
🌹చెరువుగట్టు : శ్రీరాముడు ప్రతిష్టించిన చిట్టచివరి లింగమే చెరువుగట్టు రామలింగేశ్వరుడిగా చెప్పుకుంటారు. నల్గొండ పట్టణానికి సమీపంలో నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. శివరాత్రి రోజు ఇక్కడ భక్తులు అగ్నిగుండాలు తొక్కడం ప్రత్యేకం.

🕉వేదాంత సంగ్రహం🕉

09 Nov, 02:47


కార్తికంలో విష్ణువు కథలను, స్తోత్రాలలో ఒక్క శ్లోకమైనా సరే భక్తిగా చదివేవారికి వంద గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది. హరికథలను ఏవిధంగానైనా చదివినా, విన్నా వారి వంశమంతా తరిస్తుంది.

🕉వేదాంత సంగ్రహం🕉

09 Nov, 00:59


🐄 గోపాష్టమి‌ - గోష్ఠాష్టమి 🐄

🐂 గోపూజ - ప్రదక్షిణ 🐂

💧 యమునానది స్నానం 💧

🏔️ మధురపురి‌ ప్రదక్షిణ 🏔️

⚜️ దుర్గాష్టమి ⚜️

🏳️ శ్రీ శంకర్ మహారాజ్
జయన్తీ‌ 🏳️

🚩 కంచి జగద్గురు శ్రీ
బ్రహ్మానందఘనైంద్ర సరస్వతి
స్వామి పుణ్యతిథి 🚩

🏳️ శ్రీ బాపూజీ భండారి‌
పుణ్యతిథి‌ 🏳️

🛕 శృంగేరి విద్యాశంకర‌
రథోత్సవం 🛕

🏳️ పూదత్తళ్వార్‌ తిరునక్షత్రం 🏳️

🎊 కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి
కిరణోత్సవం 🎊

🕉వేదాంత సంగ్రహం🕉

08 Nov, 15:11


09.11.2024 – శనివారం

గోష్టాష్టమీ వ్రతం, కార్తవీర్యోతృత్తి

ఈ రోజున గోశాలను అలంకరించి గోవును పూజ చేయడం, గో ప్రదక్షిణలు చేయడం ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించడమే కాక గ్రహశాంతిని చేకూర్చుతుంది. శ్రీ దత్తాత్రేయుని భక్తాగ్రగణ్యుడైన కార్తవీర్యుని జయంతి రోజున శ్రీ దత్తాత్రేయుని పూజించి, కార్తవీర్యుని నామాలను పఠించి ప్రార్థించడం వలన నష్టద్రవ్య ప్రాప్తి మొదలైన లాభాలు పొందవచ్చు.

🕉వేదాంత సంగ్రహం🕉

08 Nov, 13:25


*శ్రీ గురుభ్యోనమః*

*కార్తిక పురాణం 8వ రోజు*

*ప్రతిరోజూ వామనుని తలుచుకొని లేవాలి*

*8వ రోజు కాలభైరవ స్వామిని తలచుకోవాలి. కాలభైరవ అష్టకం చదువుకోవాలి.*

*ఈరోజు ఉసిరికాయలు, ఎండు మిరపకాయలు దానం ఇవ్వాలి.*

*ఈరోజు రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది.*

*ఈరోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం.*

🕉వేదాంత సంగ్రహం🕉

08 Nov, 08:34


*గురుబోధ:*
మారేడుచెట్టు శివుని స్వరూపమే. శివునికీ, బిల్వవృక్షానికీ తేడా లేదు. అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతి భక్తితో స్తుతిస్తారు. ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్యతీర్థాలున్నాయో అవన్నీ మారేడుచెట్టు మూలంలో (వ్రేళ్ళలో) ఉంటాయి. మారేడుచెట్టు మూలంలో లింగం ఒకదానిని కాని లేదా అనేక లింగాలను కాని ఉంచి పూజించినవాడు పరమ పుణ్యాత్ముడౌతాడు. శివుని సన్నిథిని పొందగలుగుతాడు. మారేడుచెట్టు క్రింద స్నానం చేసినవాడు, సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన మహాఫలం పొంది, పవిత్రుడౌతాడు. గంధపుష్పాదులతో మారేడుచెట్టు మొదలును పూజించినవాడు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు. మారేడుచెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడు, తత్త్వజ్ఞానం పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక శివుడిలో ఐక్యం అవుతాడు. అందునా, కార్తికమాసంలోనూ, మాఘమాసంలోనూ, ప్రతి మాసశివరాత్రికీ, మారేడు దగ్గర ఆవునేతిదీపం వెలిగించిన వాడికి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది.

🕉వేదాంత సంగ్రహం🕉

08 Nov, 04:57


*🙏🪔కార్తీకపురాణం 7 వ అధ్యాయం🪔🙏*
*🙏🪔 🪔🙏🪔 \|/ 🪔🙏🪔 🪔🙏*



*🙏7వ అధ్యాయం-శివకేశవార్చన విధులు🙏*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

వశిష్ఠుడిట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీక మహాత్మ్యమును యింకా చెప్పదను సావధాన మనస్కుడవై వినుము. ఈమాసమందు ఎవడు పద్మములచేత పద్మములవంటి నేత్రములు గల హరిని పూజించునో వాని యింటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్యనివాసము చేయును. భక్తితో తులసీదళముతోను, జాజిపువ్వులతోను హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు. మారేడు దళములతో సర్వ వ్యాపకుడయిన హరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించడు. భక్తి ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయముకాగానే చీకట్లు ఎట్లునశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టుక్రింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీకమాసమందు తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు బ్రాహ్మణులతో గూడా వనభోజనము ఆచరించువానియొక్క కోటానుకోట్ల పాపాలు నశించును. బ్రాహ్మణులతో గూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్ామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. భక్తిచే హరియొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును గట్టువాడు పరమపదము పొందును. హరికి అరటి స్తంభములతోగాని, పుష్పములతోగాని, మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. ఒక్కమారయినను హరిముందు దండప్రణామమాచరించువారు పాపవిముక్తులై అశ్వమేధయాగఫలము పొందుదురు. హరిముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరుతో కూడా వైకుంఠమునకు బోవుదురు. స్నానముచేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందును. విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. నల్లనివిగాని, తెల్లనివిగాని అవిశపువ్వులతో హరిని పూజించిన యెడల పదివేల యజ్ఞములు చేసిన ఫలము గలుగును. బృందావనమునందు ఆవుపేడతో అలికి ఐదు రంగులతోను, శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. విష్ణుసన్ధిలో నందాదీపమును అర్పించిన పుణ్యముయొక్క గొప్పతనము జెప్పుట బ్రహ్మకు కూడ శక్యముగాదు. పర్వతిధులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈనందాదీపము నశించిన యెడల వ్రతభ్రష్టుడగును. తిలలతోను, ధాన్యముతోను, అవిశపువ్వులతోను, కలిపిన నందాదీపమును కార్తీకాసమందు హరికి క్సమర్పించవలయును. నందా అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు జేయునది. శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు. విష్ణ్వాలయమంటపమును భక్తితో అలంకరించువారు హరి మందిరమునకు వెళ్ళుదురు. హరిని మల్లెపువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును. కార్తీకమాసమందు తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపవిముక్తుడై విష్ణులోకమును బొందును. హరిసన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యముజేసినయెడల పూర్వజన్మ సంచితమైన పాతకములు గూడ నశించును. ఇతరులకు హరిపూజకొరకు మనోవాక్కాయములచేత సహాయముచేయువాడు స్వర్గమునుబొందును. భక్తితో గంధపుష్ప ధూపదీపాదులచేత హరిని పూజించువాడు వైకుంఠమునుబొందును. ఈమాసమున హరిసన్నిధిలో జపమాచరించనివాడు భూమియందు ఏడు జన్మములందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. సాయంకాలమందు హరిసన్నిధిని పురాణ కాలక్షేపమునుజేయువారు వైకుంఠమును జేరుదురు. సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును.

కార్తీకపురాణం 7వ అధ్యాయం సమాప్తం


*🦜 🦜*

🕉వేదాంత సంగ్రహం🕉

08 Nov, 03:51


*శ్రీ గురుభ్యోనమః*

*కార్తిక పురాణం 7వ రోజు*

*ప్రతిరోజూ వామనుని తలుచుకొని లేవాలి*

*7వ రోజు ఆవునెయ్యి మాడు పై వ్రాసుకొని శివకేశవులని తలుచుకొని తలస్నానం చేస్తే జాతకాదోషాలు తొలగుతాయి.*

*మందకొడితనం తగ్గి బుద్ధి ప్రచోదనం అవుతుంది. ఆరోగ్యం వర్ధిల్లుతుంది.*

*ఈరోజు లేదా ఈ మాసం అంతా చేతికి కొంత వరిపిండిని వ్రాసుకొని చెట్టు చుట్టూ 108 కానీ, 27 కానీ , 9 కానీ, కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేయడం ఉత్తమం. అలా ప్రదక్షిణలు చేస్తూ చేతులు రుద్దుకుంటూ ఉంటే ఆ పిండి రాలినట్లు మన పాపాలు రాలిపోతాయి.*

*సప్తమి నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ భూప్రదక్షిణ తో సమానం*

*జమ్మి చెట్టుకు ప్రదక్షిణ నవగ్రహాల లోకానికి వెళ్లే వారి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం*

*రుద్రాక్ష వృక్షం చుట్టూ చేసే ప్రదక్షిణ కైలాసం వెళ్లి శివుని చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తాయి.*

*ఈరోజు ఈశ్వరునికి గంధం స్వయంగా అరగదీసి అర్పిస్తే నక్షత్రలోకం లో చేరి నక్షత్రం గా మారతారు. అగస్త్యుడు అలాగే నక్షత్రం గా మారాడు.*

*పటిక బెల్లం నీటిలో కలిపి సూర్యోదయం లేదా సూర్యాస్త సమయం సందర్భంలో ఈశ్వరునికి అభిషేకం చేసి తీర్థం స్వీకరిస్తే మనస్సు కి శాంతి లభిస్తుంది.*

*పూజ్యులకు ఆకాశ దీపం కూడా దానం ఇవ్వవచ్చును.ఇది ఇత్తడి, పంచాలోహాలు లేదా మట్టి దీపం అయినా దానం ఇవ్వవచ్చును. ఇలా చేస్తే అపమృత్యు దోషం తొలగిస్తుంది.*

*ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలి. నక్తం ఉండటం మంచిది. ఈరోజు ఉసిరి , తోటకూర, గోంగూర, పాలకూర వంటి శాకములు అలాగే కంద వంటి దుంపలు దానం చేయడం మంచిది.*

*సప్తమి నాడు వంకాయ దానం ఇవ్వడం నిషేధం.*

🕉వేదాంత సంగ్రహం🕉

08 Nov, 01:47


☀️ శాక సప్తమి ☀️

🌤️ సావిత్ర‌ కల్పాది‌ 🌤️

🚩 యాజ్ఞవల్య్క జయన్తీ 🚩

🪷 లక్ష్మిప్రద‌ వ్రతం 🪷

🏳️ సహస్రార్జున‌ జయన్తీ ( ఉ.భా) 🏳️

🚩 శ్రీ చంద్రశేఖరానంద‌
పుణ్యతిథి‌ 🚩

🌟 శ్రవణోపవాసము‌ 🌟

కోటి సోమవార వ్రత‌ం

🏳️సంత్ శ్రీ జలరామ్ జయన్తీ 🏳️

🎊 శ్రీ విద్యారణ్య స్వామి శృంగేరి
పీఠాధిపత్య దినోత్సవం 🎊

🏳️ పొయిగైయాళ్వర్‌
తిరునక్షత్రం 🏳️

🌞 సూర్య చాతుర్మాస్య
వ్రతారంభం - సూర్య ఆరాధన 🌞
( మాఘ శుద్ధ సప్తమి పర్యంతం)

🎉 ఐపాసి‌ తిరువోణం‌ 🎉

🛕 మైసూర్ శ్రీ వేంకటరమణ
రథోత్సవం 🛕

🎊 తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య
తిరు కల్యాణోత్సవం 🎊

🕉వేదాంత సంగ్రహం🕉

07 Nov, 13:41


దాత్రీఛాయాం సమాశ్రిత్య కార్తికేన్నం భునక్తియః!
అన్నం సంసర్గజం పాపమావర్షం తస్య నశ్యతి!!

కార్తికమాసంలో దాత్రీ వృక్ష ఛాయలో భోజనం చేసేవానికి సంవత్సరమంతా అన్న సంసర్గజమైన పాపం నశిస్తుంది. అందుకే కార్తికంలో ఏకాదశినాడు ఉపవసించి, ద్వాదశినాడు తులసీధాత్రీ సహితమైన వనంలో పారణ చేసినందున, దీనితోపాటు సద్ర్బాహ్మణుని సత్కరించి మంచి భోజనంతో అతనిని తృప్తిపరచిన, కార్తిక దామోదరుని అనుగ్రహం పొందిన వాడవుతాడు.

🕉వేదాంత సంగ్రహం🕉

07 Nov, 07:34


*గురుబోధ:*
శివపురాణంలోని ఒక శ్లోకంకాని, లేదా సగం శ్లోకంకాని, భక్తితో చదివినవాడు ఆ క్షణమే పాపవిముక్తుడౌతాడు. నిత్యం ఎంతో కొంత చొప్పున ఈ శివపురాణం వినేవాడు జీవన్ముక్తుడనబడతాడు. చదువురానివాడు ఈ గ్రంథాన్ని రోజూ భక్తితో పూజించినా చాలు, అశ్వమేథయాగఫలం పొందుతాడు. కోరిన కోరికలు తీర్చే ఉత్తమగ్రంథం ఇది. శివపురాణానికి భక్తితో నమస్కరించినవానికి సర్వదేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది. శివపురాణం నిత్యం పఠించేవాడికి ఇంద్రాదులను కూడా ఆజ్ఞాపించే దివ్యశక్తి లభిస్తుంది. శివపురాణం నిత్యం పఠించేవాడు చేసే ప్రతిపుణ్యం కోటిరెట్లు ఫలితం ఇస్తుంది. శివపురాణంలోని రుద్రసంహిత, శ్రద్ధగా చదివితే బ్రహ్మహత్యాపాపం కూడా నశిస్తుంది.

🕉వేదాంత సంగ్రహం🕉

07 Nov, 04:01


*🙏🪔కార్తీకపురాణం 6 వ అధ్యాయం🪔🙏*
*🙏🪔 🪔🙏🪔 \|/ 🪔🙏🪔 🪔🙏*


*🙏6వ అధ్యాయం - దీపదాన మహాత్మ్యం🙏*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

🙏ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ శ్రీ మహావిష్ణువును, పరమేశ్వరుని, పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టివానికి అశ్వమేథయాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గాని, గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.

🪔సర్వజ్ఞాన ప్రదందివ్యం సర్వసంపత్సుఖవహం|
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ||🪔

🙏అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా, "అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు, సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!" యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ బోభోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*

🙏పూర్వ కాలమున ద్రవిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.

🙏ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచు౦డెడిది.

🙏అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి "అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"వని వుపదేశమిచ్చెను.

🕉వేదాంత సంగ్రహం🕉

07 Nov, 04:01


🙏ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాసవ్రతములో అంత మహత్మ్యమున్నది.

కార్తీక పురాణం ఆరవ అధ్యాయము సమాప్తము.

🦜 🦜

🕉వేదాంత సంగ్రహం🕉

07 Nov, 00:17


🎋 స్కంద షష్ఠి 🎋

⚜️ శూర‌ సంహార
ఉత్సవం ⚜️

☀️ సూర్యషష్ఠి ☀️

🌞 ఛత్ పూజ 🌞

💫 దగ్ధయోగము 💫

🌾 వహ్ని‌ షష్ఠి 🌾

🔥 అగ్ని - సుబ్రహ్మణ్య పూజ 🔥

🌹 గండ షష్ఠి 🌹

🎉 కుమారవాయిలార్
శ్రీ కార్తికేయ కళ్యాణోత్సవం 🎉

🎍 మహేంద్రకృఛ్ఛవ్రతము‌ 🎍

🥛 త్రిరాత్ర క్షీరోపవాసారంభం‌ 🥛

🚩 శ్రీ వేదేశతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

🏳️ మౌని మహారాజ్ పుణ్యతిథి‌ 🏳️

🚩 సఖుబాయి‌ పుణ్యతిథి‌ 🚩

🕯️ తిరుమురుగ‌ కృపానంద‌
వారియర్‌ స్మృతి దినం 🕯️

🕉వేదాంత సంగ్రహం🕉

06 Nov, 14:09


కార్తిక గురువారాలలో గురువులను ఆరాధించడం శ్రేష్ఠం. శ్రీదక్షిణామూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ, సరస్వతీ దేవతలను గురు స్వరూపాలుగా తెలిసి ఆరాధించాలి. తేనే, సువర్ణం, నేయి ఈరోజున దానం చేస్తే భోగాలు వృద్ధి చెందుతాయి.

🕉వేదాంత సంగ్రహం🕉

06 Nov, 12:23


*శ్రీ గురుభ్యోనమః*

*కార్తిక పురాణం 6వ రోజు*

*ప్రతిరోజూ వామనుని తలుచుకొని లేవాలి*

*షష్ఠీ లేక దేవసేనా స్తోత్రం ఈ రోజు తప్పక చదవాలి.*
*కొద్దిగా వరిపిండిని ముద్దగా చేసి తమలపాకు, ఉసిరి లేదా మారేడు ఆకుపై ఉంచి బంగారం లేదా వెండి లేదా మట్టి ప్రమిదలో ముందుగా ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించాలి. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ దీప దానం చేయాలి.*

*ఈరోజు తప్పక శివలింగానికి అభిషేకం చేయాలి. ప్రతి ఇంట్లో శివలింగం ఉండి తీరాలి. రోజూ కాస్త విభూతి తదితర గంధ చందనములు కలిపి అభిషేకములు చేసుకోవచ్చును. నైవేద్యంగా మారేడు పండు, వెలక్కాయ , దానిమ్మ పళ్ళు పెట్టాలి.*

*దీపదానం వైశిష్ట్యాన్ని తెలిపే గొప్ప కథ,6వ రోజు వినాల్సిన కథ.*

🕉వేదాంత సంగ్రహం🕉

06 Nov, 11:10


https://t.me/Vedantasangraham
మీ బంధు మిత్రులని ఈ గ్రూపులో చేర్చుటకు, ఈ లింక్ use చేయండి.

🕉వేదాంత సంగ్రహం🕉

06 Nov, 10:02


🌺🌺🌺(నాగ)దేవతల గురించి.....🌺🌺🌺

పవిత్రమైన కార్తికమాస శుక్ల పక్ష చవితికి 'నాగుల చవితి' పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు.

నాగదేవతలంటే ఎవరు అనేది తెలుసుకోవాలి. ఈశ్వరుడు ఒక్కడే. కానీ దేవతలు అనేక రూపాలతో ఉంటారు. సిద్ధ, చారణ, గంధర్వ, యక్ష, నాగ మొదలైనవన్నీ దేవతాజాతి విశేషాలు. మానవ భూమిక కంటే ఉత్కృష్టమైన దేవతా గణాలు చాలా ఉన్నాయి. అందునా మానవులకు మొట్టమొదటగా విజ్ఞానాన్ని అందించిన జాతి నాగజాతి అనేది ప్రాచీనంలో కనబడుతున్న ఒకానొక విజ్ఞానం. ఈ రహస్యం నేటికీ కొంతమంది యోగులు తమ అనుభవంతో తెలియజేశారు.

నరులకు, నాగులకు ఏదో దగ్గర అనుబంధం ఉంది. నాగులు దేవతాకోటికి చెందినవారు. అనేక రకాల దేవతలని ఆరాధించాలి గానీ, సర్వ దేవతలూ ఒకరే అన్న భావం కూడా కలిగి ఉండాలి. అయితే ఇన్ని రకాల దేవతలని ఆరాధించడం అంటే బహుదేవతా ఆరాధన లేదా చిల్లర దేవుళ్ళ ఆరాధన అనే కువిమర్శ తగదు. ఎందుకంటే దేవతలనేవారు మన భావానికి చెందినవారు కారు.... దేవతలు అనేవారు ఉంటారు. ఆ దేవతల అనుగ్రహం పొందడానికి మనం ఆరాధన చేయాలి.

అలాగే 'నాగ దేవతలు' అనే దాని గురించి చాలా విస్తారమైన అంశములు పురాణ వాఙ్మయంలోనే కాకుండా వేద వాఙ్మయంలో, ఆగమాలలో, ఇతిహాసాదుల్లో కూడా గోచరిస్తున్నాయి. యోగ శాస్త్రాలలో కూడా కనబడుతున్నాయి. నేటికీ నాగజాతులు ఇచ్చా రూపాలతో సంచరిస్తూ ఉంటారు అనే విషయాన్ని ఇటీవలి కాలంలో కొంతమంది యోగులు అనుభంతో రచించిన గ్రంథాలు కూడా కనబడుతున్నాయి.

నాగ అంటే మనం సాధారణంగా చూసే సర్పములు కావు. దేవతా మహిమ కలిగిన దివ్య సర్పములు. అలాంటి సర్పాలు నేటికీ భారతదేశంలో దుర్గమ అరణ్య ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. అవి మనకు కనబడక పోవచ్చు కానీ, ఉంటాయి. అటువంటి నాగదేవతలను ఉద్దేశించి పుట్టలో పాలు పోయడం ఉన్నది. కొందరు, "పుట్టలో పాలు పోస్తే పాములు తాగుతాయా” అని అంటుంటారు. ఆపాటి జ్ఞానం మన పూర్వీకులకు లేదా?! ఇందులో గ్రహించవలసింది - పుట్ట కేవలం ఒక ఆలంబన మాత్రమే. అక్కడ మనం నాగదేవతలను ఉద్దేశించి పొసే క్షీరములు దివియందు, భువియందు కూడా అదృశ్యరూపాలతో ఉండే నాగదేవతలు చూసి సంతోషిస్తారు. దేవతలకు నైవేద్య రూపంలో సమర్పిస్తే ఆ భావాన్ని అనుగ్రహంతో వారు చూస్తారు. ఆ అనుగ్రహ దృష్టి పడగానే అది ప్రసాదంగా మారుతుంది. ఇది పద్ధతి.

అందుకు సర్ప దేవతల్ని ఉద్దేశించి క్షీరం పోయాలి. అంతేగానీ, మనం పోస్తూ ఉంటే పుట్టలో పాము నోరు తెరుచుకుని తాగుతుంది అనే భావం సమంజసం కాదు. అందుకు పుట్టలో పాలు పోయడం అనేది వచ్చింది. అయితే కొన్ని చోట్ల ప్రత్యక్ష సర్వములు కనబడడం ఉంటుంది. ఆ ప్రత్యక్ష సర్పములలో దేవతకోటికి చెందిన సర్పాలు కనబడడమే అరుదు. కనబడితే భాగ్యమే. వాటిని దేవతారూపంతో భావించిన వారిని సర్పదేవతలు అనుగ్రహిస్తారు కూడా. “నమో ఆస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీ మను యే దివి యే అంతరిక్షే తేభ్య స్సర్పేభ్యో నమః” అనే వేద మంత్రముంది.

అంతేకాక కేతువు రాహువు మొదలైన కొన్ని గ్రహాలకు సర్పములను ప్రధానంగా చెప్తారు. నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రానికి అధిపతిగా ఆదిశేషువైన సర్పదేవతనే చెప్పారు. 'ఏ దివి ఏ అంతరిక్షే' అన్నారు. అంటే.... భూమియందు మాత్రమే కాకుండా దివియందు కూడా సర్పములు ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం ఇంకా కొంతకాలానికి ఎదిగినట్లైతే ఈ భావాలను అంగీకరిస్తుంది. కానీ వేదవిజ్ఞానశాస్త్రం పురాణాది రూపాలతో మనకు ఇస్తున్నది.

సర్పజాతుల్లో దేవతా సర్పముల గురించి మహాభారతంలో ఆదిపర్వంలో కొన్ని వందల పేర్లున్నాయి. అవన్నీ దేవతాజాతికి సంబంధించిన సర్పములు. జనమేజయుని సర్పయాగ విశేషం ఉంది.

అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ, ధార్తరాష్ట్ర, ధనంజయ, శంఖపాల.... ఇలా చెప్పబడుతూ సర్పదేవతల పేర్లు చాలా వర్ణించారు. అంతేకాదు, భీముడు నాగలోకంలో సర్పదేవతల చేత సన్మానితుడైనట్టు వర్ణించారు. ఇవి కేవలం అభూత కల్పనలు కావు; అవి ఉన్నాయి. ప్రతి దివ్యత్వమూ అందరికీ అనుభూతిలోకి, అనుభవంలోకి రాదు. అందుకే మహాత్ముల అనుభవంలోకి వచ్చిన దివ్యత్వాన్ని మనం విశ్వసించి ఆరాధించినట్లైతే అనుగ్రహాన్ని పొందగలం.

కార్తికమాసంలో మనం ఆరాధించే పరమేశ్వరుడు కూడా దివ్యసర్పభూషితుడే. కార్తికం కృత్తికా నక్షత్రంతో ఉన్న పౌర్ణమి కలది. అంటే కార్తికేయుడైన సుబ్రహ్మణ్యునికి ప్రధానం. ఆ సుబ్రహ్మణ్యుని కూడా మనం సర్పరూపంలోనే ఆరాధిస్తాం. యోగపరంగా, అంతరిక్ష విజ్ఞానపరంగా, దేవతాపరంగా కూడా సర్పదేవతలకు విశేష ప్రాధాన్యం ఉంది.

[సేకరణ - పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనం నుండి]

🕉వేదాంత సంగ్రహం🕉

06 Nov, 04:38


https://t.me/Vedantasangraham
మీ బంధు మిత్రులని ఈ గ్రూపులో చేర్చుటకు, ఈ లింక్ use చేయండి.

🕉వేదాంత సంగ్రహం🕉

06 Nov, 04:34


*గురుబోధ:*
పరమపవిత్ర కార్తికమాసంలో ప్రతిరోజూ దీపదానం చేయడం, సంకల్ప సహిత స్నానము చేయడం, ఎర్రని పూలతో స్వామికి అలంకరణలు చేయడం ద్వారా దారిద్ర్యం తొలగుతుంది, ఉద్యోగం లభిస్తుంది.

🕉వేదాంత సంగ్రహం🕉

06 Nov, 03:03


🙏అటుల కిరాతకుడు కార్తికమహత్మ్యమును శ్రద్దగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకుపోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణమంతయు వినుచుండిన యెలుక కూడా తనవెనుకటి బ్రాహ్మణ రూపము నొంది"మునివర్యా! ధన్యోస్మి తమ దయ వల్ల నేనుకూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడనైతి"నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనకా! ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తికపురాణమును చదివి, యితరులకు వినిపించవలెను.

కార్తీక పురాణం ఐదవ అధ్యయము సమాప్తం.


*🦜 🦜*

🕉వేదాంత సంగ్రహం🕉

06 Nov, 03:03


*🙏🪔కార్తీకపురాణం 5 వ అధ్యాయం🪔🙏*
*🙏🪔 🪔🙏🪔 \|/ 🪔🙏🪔 🪔🙏*


*🙏5 వ అధ్యాయం-వనభోజన మహిమ🙏*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

🙏ఓ జనక మహారాజా! కార్తికమాసములో స్నానదాన పూజానంతరమున విష్ణ్వాలయమునందుగాని శివాలయముననందుగాని, శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసినవారి సర్వ పాపములును నివృత్తియగును. ఈ కార్తిక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠించినవారికీ విష్ణులోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు.

🙏కార్తికమాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి వున్న ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరిచెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనంపెట్టి దక్షణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును. వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును. ఈ విధముగాచేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను - యని వశిష్టులవారు చెప్పిరి. అది విని జనకరాజు "మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల కారణమేమి" యని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పనారంభించిరి.

*🪔కిరాత మూషికములు మోక్షము నొందుట🪔*

🙏రాజా! కావేరీతీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాబముగా పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి "బిడ్డా! నీ దురాచారములకు అంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్లకలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన,నీవు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయేకాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటులచేయు"మని భోదించెను.

🙏అంతట కుమారుడు "తండ్రీ! స్నానము చేయుట వంటివి, మురికి పోవుటకు మాత్రమేకానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కాదా?" అని వ్యతిరేకర్ధములతో పెడసరంగా సమాదానమిచ్చెను. కుమారుని సమాధానము విని, తండ్రి "ఓరీ నీచుడా! కార్తికమాస ఫలము నంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొఱ్ఱయందు యెలుకరూపములో బ్రతికెదవుగాక" అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి "తండ్రీ! క్షమింపుము. అజ్ఞానాంధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాపవిమోచన మెప్పుడు ఏవిదముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపు"మని ప్రాధేయపడెను.

🙏అంతట తండ్రి "బిడ్డా! నా శాపమును అనుభవించుచు మూషికము వై పడియుండగా నీవెప్పుడు కార్తికమహత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొందుదువు" అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొఱ్ఱలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను. ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్లువారు అక్కడనున్న యా పెద్దవటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్లుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తికమాసములో నొకరోజున మహర్షియను విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరినదిలో స్నానార్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికము వున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించుచుండిరి.

🙏ఈలోగా చెట్టుతొఱ్ఱలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, "వీరు బాటసారులై వుందురు. వీరి వద్దనున్న ధనమపహరించవచ్చు" ననెడు దుర్భుద్దితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి "మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది? గాన, వివరింపుడు" అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు "ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్దామై యీ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తిక పురాణమును పఠించుచున్నాము. నీవును యిచట కూర్చుండి సావధానుడవై యాలకింపుము" అని చెప్పిరి.

🕉వేదాంత సంగ్రహం🕉

06 Nov, 01:38


కార్తికంలో స్నానం ప్రారంభించేముందు నారాయణుని ధ్యానిస్తూ

ధ్యాత్వాహం త్వాం చ దేవేశ జలేస్మిన్ స్నాతు ముద్యతః తవ ప్రసాదాత్పాపం మే దామోదర వినశ్యతు!!

కార్తికేహం కరిష్యామి ప్రాతఃస్నానం జనార్ధన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మయా సహ"

అని వేడుకొనిన కార్తీకస్నానము ఫలవంతమగును.

🕉వేదాంత సంగ్రహం🕉

05 Nov, 23:21


దిశ శూల: ఉత్తరం

🎋 పాండవ పంచమి 🎋

🌟 విశాఖ కార్తె 🌟

👺 శూర‌ సంహారం 👺

🌹 సౌభాగ్య పంచమి 🌹

🪷 లాభ‌ పంచమి 🪷

🪄 పంచమి తీర్థం 🪄

🎋 జ్ఞాన పంచమి 🎋

🚩 తులసిమయి పుణ్యతిథి 🚩

🌼 కడ పంచమి 🌼

🐍 నాగపంచమి 🐍

🚩 శ్రీ నాగజీ‌ మహారాజ్
జయన్తి 🚩

🏳️ పోతరాజు రామకవి‌
పుణ్యతిథి‌ 🏳️

🕉వేదాంత సంగ్రహం🕉

05 Nov, 14:42


*దీపదానం చేసేటప్పుడు అది మూడు వత్తులు వేసి వెలిగించాలి.*

*కంద, పెండలము వంటి దుంపలు(బంగాళ దుంపలు కాదు) పంచమి రోజు దానం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది.*

*ఆంబోతుని దానం చేసినా, 40 రోజులు ఆవుకు పూజ చేసినా సంతానం కలుగుతుంది.*

*పంచమిరోజు ఒక్కరు లేదా ముగ్గురు లేదా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమందికి శక్తి మేర స్వయంపాకం దానం చేస్తే విశేష ఫలితం కలుగుతుంది.*

*నక్తం అంటే రాత్రి 7:30 తర్వాత ఉపవాసం విరమించవచ్చు.*

*పంచమిరోజు తల్లిదండ్రులకు నమస్కరిస్తే మణిద్వీపంలో ఉన్న అమ్మకు నమస్కరించినట్లే. తల్లికి నమస్కరిస్తే ఉదర సంబంధ వ్యాధులు తొలగుతాయి.*

*అజామిలోపాఖ్యానం పూర్తిగా ఈరోజు కూడా వినాలి.*

🕉వేదాంత సంగ్రహం🕉

05 Nov, 09:08


*🙏🪔కార్తీకపురాణం 4 వ అధ్యాయం🪔🙏*
*🙏🪔 🪔🙏🪔 \|/ 🪔🙏🪔 🪔🙏*


*🙏4 వ అధ్యాయం-దీపారాధన మహిమ 🙏*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

కార్తీక మాసంలో చేసే మంచి పనుల్లో దీపారాధన వొకటి. విష్ణాలయంలో కాని శివాలయంలో కాని సూర్యాస్తమయ సమయమందు సంధ్య వేళ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి పొందెదరు .ఆవునేతితో లేదా కొబ్బరి నూనెతో అవిశ నూనెతో విప్పనూనెతో ఏది దొరకనపుడు ఆముదంతో దీపారాధన చేయవచ్చును .దీపారాధన విశిష్టత తెలియచేసే ఈనాటి నాలగవ అధ్యాయం

*🪔శత్రుజిత్ కధ🪔*
******
పూర్వం పాంచాలదేసాన్ని పాలించు రాజుకు సంతతిలేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుకు చెంది గోదావరి తీరంలో నిష్టగా తపం ఆచరించు నపుడు పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి మహారాజ మీరెందుకు తపమాచారించుచున్నారు మీ కోర్కె ఏమి అని అడుగగా పుత్రసంతానం లేక క్రుంగి ఈ తపం ఆచరిస్తున్నాను అని చెప్పగా ముని వోయి కార్తీక మాసమున విష్ణుసన్నిధిన దీపారాధన చేసిన నీ కోరిక నెరవేరును అని చెప్పెను వెంటనే పాంచాలరాజు తన రాజధానికి వెళ్లి పుత్రప్రాప్తికి కార్తీకమాసం నెలరోజులు దీపారాధన చేసి నియమనిస్టలతో దానధర్మాలు చేసి వ్రతాలు చేయడంవలన ఆ పుణ్యఫలంతో వొకనాడు వొక పుత్రుడను పొందెను అతనికి శత్రుజి అని పేరుపెట్టి కార్తీక మాస పవిత్రత గ్రహించినవాడ్యే ప్రతి సమ్వత్చరమ్ కార్తీకమాసంలో వ్రతాలు దీపారాధనలు చెయ్యాలని శాశనం చేసెను .రాకుమారుడు సకల శాస్త్రాలు చదివి విద్యలన్నీ నేర్చుకొని పలు చెడు సావాసాలు కూడా అలవరచుకొని కంటికి ఇంపుగా వున్నస్త్రీలను చెరపట్టి ఎదిరించినవారిని దండించి కామవాంచ తీర్చుకోనుచు వుండగా తల్లితండ్రులు లేకలేక కలిగిన బిడ్డకాబట్టి ఇలాంటి ఘాతుకాలు చూసి చూడనట్లు వినీవిననట్లు వుండిరి. ఇలాంటి సందర్భంలో రాజకుమారుడు వొక అధ్బుతమైన అందంతో వున్న వొక బ్రాహ్మణుడి బార్యను చూసి ఆమెకు తన కోర్కె తెలియచేసేను. ఆమెకూడా అతని సౌందర్యానికి ముగ్ధ అయి శీలం సిగ్గులజ్జ వదిలి అతని చేయి పట్టుకొని శయన మందిరానికి వెళ్లి బోగములు అనుభవించెను. ఇట్లా వొకరి ప్రేమలో వొకరు పరవశలై ప్రతిదినం అర్ధరాత్రివేళ రహస్యంగా కలుస్తూ వుండగా విషయం ఆమె బర్తకు తెలిసెను. రాజకుమారుని చంపాలని కడ్గం తో నిరీక్షించెను. కార్తీకశుద్ధ పౌర్ణమినాడు ఇద్దరు విష్ణాలయంలో సుఖించు చుండగా చీకటిగా వున్నది కాంతి వుంటే బాగుండు అని రాజకుమారుడు అనగా ఆమె తన చీర చెంగును చించి వత్తిగా చేసి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించి రతిక్రీడలు సలుపుతూ బాహ్యప్రపంచం తెలియని వార్యే వుండగా అదే అదునుగా ఆమె బర్త వొక్క వేటుతో బార్యను రాజకుమారుని వదించెను. తానుకూడా పొడుచుకొని చనిపోయెను. జరిగిన విషయం అశ్లీలం అయిన ఆ కార్తీక శుద్ధ పౌర్ణమి అగుటవలన విష్ణు దూతలు ప్రేమికులను కొనిపోవగ యమదూతలు బ్రహ్మనునికోరకు రాగా బ్రాహ్మణుడు ఇదేమి విచిత్రం కామాంధకారంతో కన్నుమిన్నుకానని అలాంటి నీచులకు పుణ్యలోక ప్రాప్తినా అనగా... యమకింకరులు వో బ్రాహ్మణుడా ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి దినమున తెలిసో తెలియకో విష్ణాలయంలో దీపం వెలిగించడంవలన పాపములన్నియు నసించినవి అనగా... బ్రాహ్మణుడు అలా జరగనివ్వను ముగ్గురము వొకే ప్రదేశంలో మరణించాము కాబట్టి ముగ్గురుకు పుణ్యప్రాప్తి కలగాలని కోరగా దీపారాధన ఫలాన్ని అతనికి ఇప్పించి ముగ్గురిని విష్ణు సానిధ్యానికి చేర్చిరి. ఈ కధలో చేసిన దుస్కర్మకు అనుకోనివిదంగా పుణ్యప్రాప్తి కలిగినా సత్కర్మలతో సదాచారాలతో శరీరాన్ని అపవిత్రం చేసుకోకుండా దీపారాధన చేసిన ఆత్మే కాదు తనువు పునీతమౌతుంది .కార్తీక మాసంలో నక్షత్ర మాలలో దీపమున్చినవారు జన్మ రాహిత్యం పొందెదరు
కార్తీక పురాణం నాలగవ అధ్యాయం సమాప్తం


*🦜 🦜*

🕉వేదాంత సంగ్రహం🕉

05 Nov, 07:01


శ్రీ దత్త చరిత్ర.pdf

🕉వేదాంత సంగ్రహం🕉

05 Nov, 04:49


పుట్టలో పాలు పోసేసి ఈ విధంగా చెప్పుకోవాలి. పుట్టకీ వెళ్లే అలవాటు లేని వారు ఇంట్లో నే వాళ్ళ ఇంటి ఆచారాన్ని అనుసరించి చేసుకోవాలి.

నన్నేలు నాగన్న నా కులము నేలు. నా ఇంటి నేలు. నను కన్న వారి నేలు నా ఆప్తుల నేలు. పడగ తొక్కితే పగవా డనుకోకు. నడుము తొక్కితే నా వాడనుకో. తోక తొక్కితే తొలగి వెళ్ళిపో. ఈ నూకలను పుచ్చుకో పిల్లమూకలను ఇయ్యి అని అడగాలి..

🕉వేదాంత సంగ్రహం🕉

05 Nov, 03:50


గురువాక్యము
తల్లికి బిడ్డలోను, శిష్యునకు గురువులోను, గురువునకు శిష్యునిలోను అనుభవమునకు వచ్చునది తృప్తియేగాని ప్రయోజనము గాదు.
మాసర్ ఇ.కె

🕉వేదాంత సంగ్రహం🕉

05 Nov, 01:08


🌹 భౌమచతుర్థి 🌹

🐍 నాగుల చవితి 🐍

🏔️ పుట్ట‌ చతుర్థి 🏔️

🎋 వినాయక చతుర్థి 🎋
( అంగారక యోగం)

🌾 దూర్వ‌ గణపతి వ్రతం 🌾

🏳️శ్రీ కడవరగోనె నాయనార్
తిరునక్షత్రం 🏳️

⛰️ వల్మీక‌ పూజ ⛰️

🚩 ప్రహ్లాద్ మహారాజ్ కాలే
పుణ్యతిథి‌ 🚩

🎉 తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి
పెద్ద శేషవాహన‌ సేవోత్సవం‌ 🎉

🎊 కమారవాయలూర్‌ శ్రీ
సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవం 🎊

🏳️ శ్రీ చెఱువు సత్యనారాయణ
పుణ్యతిథి‌ 🏳️

🕯️ దాశరథి కృష్ణమాచార్య
స్మృతిదినం 🕯️

🔯

🕉వేదాంత సంగ్రహం🕉

05 Nov, 00:53


*గురుబోధ:*
సర్పదోషాలతో ఇబ్బంది పడేవారు, సంతాన సమస్యలతో బాధపడేవారు, తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ రోజు నాగచతుర్థిని భక్తిశ్రద్ధలతో ఆచరించి నాగ అష్టోత్తర శతనామావళితో పూజ చేసి, నాగ ప్రతిమలను అభిషేకం చేస్తే సర్పబాధలు వాళ్ళకి ఉండవు. సుబ్రహ్మణ్య ఆరాధన లేదా మానసాదేవి ఆరాధన వలన కూడా సర్ప దోషాలు, రాహు, కేతు గ్రహదోషాలు తొలగుతాయి. సుబ్రహ్మణ్య అష్టకం లేదా మానసాదేవి దివ్యచరిత్ర, స్తోత్రం, పూజ, జపం కూడా విశేష ఫలితం ఇస్తుంది. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోవాలంటే నాగదోష పరిహార స్తోత్రం పఠించాలి లేదా శ్రవణం చేయాలి.
నాగదేవతా మూర్తులు లేదా ఏ ఇతర విగ్రహమూర్తులకు అయినా పాలతో అభిషేకం చేసిన తర్వాత, తప్పక నీటితో శుభ్రంగా అభిషేకం చేయాలి.

🕉వేదాంత సంగ్రహం🕉

04 Nov, 13:48


05.11.2024 – మంగళవారం

నాగుల చవితి, భౌమచతుర్థి

ఈ రోజున సూర్యోదయానికి ముందుగా ఆకాశంలో తూర్పుదిక్కులో ఆదిశేషుని నక్షత్ర రూపం దర్శనం ఇస్తుంది. వారి వంశాచారాన్ననుసరించి నాగేంద్రుని ఉద్దేశించి పుట్టలో పాలుపోసి, చలిమిడి, వడపప్పు, నువ్వులతో చేసిన తీపి పదార్థాలు మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. దీనివలన ప్రీతుడైన నాగేంద్రుడు ఆ కుటుంబాలకు అనారోగ్యాలు, అరిష్టాలు కలుగకుండా రక్షిస్తాడు. నాగుల చవితినాడు రైతులు మొదలైన వారు పనిముట్లను ఉపయోగించరాదు. ఇళ్ళల్లో కూరగాయల్ని కోసేందుకు సైతం కత్తిపీటలు వంటివి ఉపయోగించకూడదు. మంగళవారం - చవితి కలిగినది మహా అలభ్యయోగంగా చెప్పబడుతోంది. ఈ రోజున చేసిన ఏ పుణ్యకార్యమైనా అక్షయఫలతాలను కలుగజేస్తుంది.

🕉వేదాంత సంగ్రహం🕉

04 Nov, 04:54


*శ్రీ గురుభ్యోనమః*

*కార్తిక పురాణం 4వ రోజు*

*శ్రీ మహాగణాధిపతయే నమః*
*శ్రీ గురుభ్యో నమః*
*శ్రీ మహాసరస్వత్యై నమః*

*ధ్వజస్తంభానికి ఆకాశదీపం పెట్టడం వెనుక ఉన్న రహస్యం.*

*ఒక్క ఆకాశదీపానికి నూనె ఇవ్వటం అంటే కోటి నదుల్లో స్నానం చేయడం వంటిది.*

*ఒక్క ధ్వజస్తంభం ప్రతిష్ఠకు సాయం చేస్తే, ఆ పుణ్యం లక్ష్మీనారాయణులను రథం ఎక్కించి, పాయసంతో అభిషేకం చేసి, ఒక సద్గురువుకి ఇచ్చినంత విశేష పుణ్యం. భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసిన పుణ్యం.*

*ఆవునెయ్యి పోస్తే గోలోకంలో సురభిని కృష్ణుడికి దానం చేసినంత పుణ్యం.*

*ఈ కార్తికమాసం అంతా నక్తం ఉండటం ఎంతో మంచిది.*

*కాస్తంత ఆవుపేడ ఒంటికి రాసుకొని రెండు పూటలా స్నానం చేయాలి.*

*వీలుంటే కదంబం లేదా మల్లెలు లేదా మందారం, గులాబీలు ఇవ్వవచ్చును.*

*కుదిరినవారు ప్రతిరోజూ స్వయంపాకం ఇవ్వాలి. ముఖ్యంగా కందిపప్పు, గోంగూర వంటివి ఈ 4వ రోజు ఇవ్వవచ్చును.*

*ఈ రోజు అజామిళోపాఖ్యానం కథ వినాలి.*

*బలం గురోః ప్రవర్ధతాం*

https://youtu.be/4CVdK_arO4E

🕉వేదాంత సంగ్రహం🕉

04 Nov, 03:23


*🙏🪔కార్తీకపురాణం 3 వ అధ్యాయం🪔🙏*
*🙏🪔 🪔🙏🪔 \|/ 🪔🙏🪔 🪔🙏*


*🙏3వ అధ్యాయం-కార్తీక స్నాన మహిమ🙏*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

జనకమహారాజా! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము కలది. అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక, కార్తీక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునయినను స్నాన, దాన, జపతపాదులు చేయకపోవుటవలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము.
బ్రహ్మ రాక్షసులకి ముక్తి కలుగుట
ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడూ అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఓ మహా వటవృక్షంపై భయంకరమైన ముఖముతోను, దీర్ఘ కేశములతోనూ, బలిష్టములైన కోరలతోను, నల్లని బానపొట్టల తోనూ, చూచు వారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి, వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి.
తీర్థ యాత్రకై బయలుదేరి, అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములు జూచి, గజగజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచూ 'ప్రభో! ఆర్తత్రాణ పరాయణ! అనాధ రక్షక! ఆపదలోనున్న గజేంద్రుని రక్షించిన విధము గానే యీ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి!' అని వేడుకొనెను.
ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి 'మహానుభావా! మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము కలిగింది. మహానుభావ! మమ్ము రక్షింపుడూ అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, 'ఓయీ! మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడూ అని పలుకగా, వారు 'విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ దర్శనభాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలుగదూ అని అభయమిచ్చినవి.
అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను.
నాది ద్రవిడదేశము. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వముగల వాడినైయుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద, దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యా, పుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరుచుచూ, లుబ్ధుడనై లోకకంటకునిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను.
వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్ద నున్న ధనమును, వస్తువులను తీసుకొని యింటి నుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపమొచ్చి 'ఓరీ నీచుడా! అన్యాక్రంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డాలు తెలియక, తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి, తిట్టీ వస్తుసామగ్రిని దోచుకుంటివి గాన, నీవు రాక్షసుడవై నర భక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువు గాకా అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా! కాన నా అపరాధమును క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులకాతడు దయతలచి 'ఓయీ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము కలదు. నీవందు నివసించుచూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువు గాకా అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షసరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్ను, నా కుటుంబము వారను రక్షింపు డని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.
ఇక రెండవ రాక్షసుడు, 'ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేనూ నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి, వారికి తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా అనునటుల చేసి, వారి ఎదుటనే నా భార్యబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడిని. నేను ఎట్టి దాన, ధర్మములను చేసి యెరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలే ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగినది అని చెప్పెను.

🕉వేదాంత సంగ్రహం🕉

04 Nov, 03:23


మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. 'మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణ్వాలయంలో అర్చకునిగా వుంటిని. స్నానమైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడి వాడిని. భగవంతునికి ధూప, దీప, నైవేద్యములు అర్పించక, భక్తులు కొని దెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచూ మద్య, మాంసములను సేవించుచూ, పాపకార్యాలు చేసినందున, నా మరణాంతరమున ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించెను.
ఓ జనక మహారాజా! తపోనిష్ఠుడగు ఆ విప్రుడు రాక్షసుల దీనాలాపములాలకించి, 'ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపము కలిగెను. నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతునూ అని వారినోదార్చి తనతో గొని పోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని, తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి, స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా, వారివారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి.
కార్తీక మాసమున గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తినొంది, వారికి సకలైశ్వర్యములను ప్రసాదింతురు. అందువలన, ప్రయత్నించి అయినా సరే కార్తీకస్నానాలనాచరించాలి.
*మూడవ రోజు పారాయణము సమాప్తము.*


*🦜 🦜*

🕉వేదాంత సంగ్రహం🕉

04 Nov, 02:48


జై సనాతన ధర్మం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

🕉వేదాంత సంగ్రహం🕉

29 Oct, 13:49


🌸 *శ్రీమద్భాగవతము* 🌸 


🌷 *స్వప్నము* 🌷

🌹ఇట్లు వివరించిన మైత్రేయునకు విదురుడు శిరస్సు వంచి, నమస్కరించి, మనస్సున శ్రీహరిని ధ్యానము చేసెను.

(బ్రహ్మవిద్యను ఉపదేశించిన గురువును పరమాత్మయొక్క స్వరూపముగా తెలిసికొని నమస్కరించి, ధ్యానించుట బ్రహ్మవిద్యా సంప్రదాయము, అట్టి గురుధ్యానము లేనిచో బ్రహ్మజ్ఞానము వలన ప్రయోజనము కలుగదు, అనగా నేర్చినది అంతయు శాస్త్రముగనే అర్థమగును గాని ఆనందానుభవము కలుగదు.).........  *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము.

🕉వేదాంత సంగ్రహం🕉

29 Oct, 03:42


గురు ద్వాదశి: శ్రీపాద వల్లభులు
కృష్ణా నదిలో అంతర్ధానం అయిన రోజు.
గురుదేవ దత్త దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా

🕉వేదాంత సంగ్రహం🕉

29 Oct, 02:03


భౌమ ప్రదోషః (ప్రదోష పూజా) నీరాజనవిధిః
త్రిపుష్కరయోగః (సూర్యోయాది ప 10:31 వరకు)
ధన త్రయోదశి
(శ్రాద్ధతిథిః - త్రయోదశీ)

🕉వేదాంత సంగ్రహం🕉

28 Oct, 04:59


🌸 *శ్రీమద్భాగవతము* 🌸 


🌷 *స్వప్నము* 🌷

🌹ఇట్లు భగవంతుని పాదపద్మములను కథలరూపమున, ఇతరుల సద్గుణముల రూపమున స్మరించుటయే భక్తి సాధనము. ఈ స్మరణయందు నిలబడుటయే భక్తియోగము. దానిని పొందువారు బ్రహ్మాదులకు అందరాని స్థితియందు నిలబడుదురు. ఆ స్థితి చిక్కుట అనేక పుణ్యములు చేసినవారికి లభించును‌‌.

(మోక్షము లభించుటకు సత్కర్మాచరణమే సాధనముగాని, భగవంతుని గూర్చి తెలిసికొనుట, తర్కించుట, శాస్రజ్ఞానము చాలవని ఇందు తెలుపబడినది) ..........  *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము.

🕉వేదాంత సంగ్రహం🕉

28 Oct, 01:02


*ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి, ద్వాదశీపారణ మంగళవారం (29) ఉదయం చేయాలి.*

*గురుబోధ:*
ఆలయాలను శుభ్రం చేస్తే రాజయోగం పడుతుంది. శారీరిక మానసిక రోగాలు కూడా తొలగుతాయి.

🕉వేదాంత సంగ్రహం🕉

27 Oct, 09:09


*సాధుత్వమనగా మంచితనము.దాని నభ్యసించుట, తపస్సు చేయుట, సత్యము పలుకుట యనునవి యుత్తమ సాధనములు. వాని నభ్యసించినవారు తరింతురు గాని, వాని సభ్యసించుటకు అవి నచ్చవలెను. ఈ నచ్చుటనే ఉత్తమలోక ప్రకృతియందురు. భగవద్గీతలో నిది దైవసంపత్తి యనబడును. ఇట్టి స్వభావముతో పుట్టుట యనగా మొదటగా దేవుని యనుగ్రహము  పొందుట.*         🪶 *మాస్టర్ ఇ.కె.*

🕉వేదాంత సంగ్రహం🕉

26 Oct, 04:12


🌸 *శ్రీమద్భాగవతము* 🌸 


🌷 *స్వప్నము* 🌷

🌹 జీవునకు అవిద్య సోకుటవలన కర్మబంధము మొదలగునవి కలుగుచున్నవి గాని, సర్వజీవుల యందు అంతర్యామి అయిన ఈశ్వరునకు కలుగవు.

(జీవుని స్థితిలో కలుగును గాని అంతర్యామి స్థితిలో కలుగవు. జీవుని స్థితి దేవునికి క్రీడ. క్రీడలో కర్మబంధములు కలుగుట దేవుని లీలయే గాని దేవునిపై నిబంధము కాదు.)........  *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-241.

🕉వేదాంత సంగ్రహం🕉

25 Oct, 07:37


వేదము ఎంత నిగూఢమైనదో, కృష్ణావతారము అంతే లోతులు కలది.కారణము వేదపురుషుడే కృష్ణునిగా అవతరించాడు గనుక.ఈ సమన్వయమును దర్శించుటయే గాక గ్రంథరూపములోనికి అవతరింపజేసి పాఠకులకు ఆ అనుభూతిని పంచిపెట్టుట ఆ పరమపురుషుని పరమాద్భుత లీలావిభూతులలో నొకటి.ఇట్టి లీలకు వేదికయైన ఆ గ్రంథరాజమే "పురాణపురుషుడు".మాస్టరు ఇ.కె.గారి ద్వారా వెలువడిన శ్రీకృష్ణావతార తత్త్వ వివరణ గ్రంథములలో మూడవది, కథాక్రమమును అనుసరించి మొదటిది"పురాణపురుషుడు". చదువరుల జన్మాంతర సంస్కారమును బట్టి, పరిణామమును బట్టి ఈ గ్రంథము అవగతమగుననుట సత్యము. అనగా ఎంత ఎదిగితే అంతగా ఈ గ్రంథ లోతులు అనుభూతమవుతాయి. కృష్ణుని గూర్చి ఇలా ఎవరు చెప్పగలరు? ఆ కృష్ణుడే మరల దిగి వచ్చి తన కథ తానే చెబుతున్నాడని పాఠకులకు అనుభూతమగుట తథ్యము.ఈ గ్రంథము చదువుతున్నంత సేపు మనముండక తాదాత్మ్యసిద్ధిని అప్రయత్నంగా పొందుతాము.                పురాణములలో మూలమూలల దాగివున్న ఆ యా పాత్రల నైజములను ఈ గ్రంథము మనకు కరతలామలకము చేస్తుంది. భరతజాతి చైతన్యస్వరూపిణి యగు జగన్మాతకు,కృష్ణునకు గల అభేదము ఈ గ్రంథమున కీర్తించిన విధము నిరుపమానము. భరతభూమికి మూడు దిక్కుల నుండి సముద్రములో అలలు లేచినప్పుడెల్ల దేవకి గర్భమున తెరలు తెరలుగ నొప్పులు కలిగినవట. భరతభూమి యందలి పుణ్యనదుల జలప్రవాహమంతయు దేవకీదేవి గర్భస్థ శిశువు దేహనాళములలోని రక్తప్రసరణమట. మబ్బులు క్రమ్మి,వెన్నెల మాటుపడినపుడు దేవకి గర్భము భారముగను, మబ్బులు విచ్చి,వెన్నెల కనుపించినపుడు ఆమె గర్భము తేలికగను అనిపించెనట.ఒకమారు జీవుల చర్యలతో భూమి బరువెక్కుటయు,మరల ధర్మము ప్రసరించుటలో భూమి తేలికపడుటయు సహజలక్షణమట. ఏమి ఈ వేదకవిసమయములు!ఈ గ్రంథములో వర్ణించిన కృష్ణుని అవతరణమునకు ముందున్న భరతభూమి పరిస్థితులు, కృష్ణావతార ఆవశ్యకతకు దారితీసిన పరిస్థితులు నేటి వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టడం అనూహ్యము.ఈ గ్రంథ హృదయమంతా నాందీభూతముగా మొదటి అధ్యాయంలో బీజరూపంలో సూచించిన విధానము అత్యద్భుతము.ఆయుర్వేదము, జ్యోతిర్వేదము, అథర్వణవేదము, మంత్రశాస్త్రము, వామాచార ప్రక్రియల వివరణము ఒకవైపు; వీరభద్రులు, పోలేరమ్మలు, పోతురాజులు మున్నగువారి సంప్రదాయ చరిత్రలు మరొకవైపు ఈ గ్రంథమున హృద్యముగ వర్ణింపబడినవి. పరావాక్కుగా పరాశరుడు, పశ్యంతీవాక్కుగా సత్యవతి, మధ్యమావాక్కుగా వ్యాసుడు దర్శనమిచ్చి ఆ అనుభూతి అంతా వైఖరీవాక్కుగా ఋషుల నుండి వ్యక్తమై వేదసంహిత భాగములుగా దిగి వచ్చుట,ఈ మొత్తము వేదసంహిత కృష్ణుని అవతారలీలాఘట్టములను సూచించుట ,దేవకి అష్టమగర్భమున జన్మించిన శిశువు దేశకాలాత్మకుడైన వేదమూర్తిగా సమన్వయింపబడుట ఈ గ్రంథమున వైభవోపేతముగా సంకీర్తనము చేయబడినది. కృష్ణుడు అవతరించుటకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నవి కదా,మరి కృష్ణుడు మరల ఇప్పుడు అవతరిస్తాడా అంటే,ఈ గ్రంథరూపంలో అవతరించి ఎప్పటికప్పుడు మనలను కర్తవ్యోన్ముఖులను చేస్తున్నాడు అనేది సహృదయులైన పాఠకుల అనుభవము. తెలుగుజాతి చేసుకున్న పుణ్యమేమో గాని ఆ కృష్ణుడే కృష్ణమాచార్యుడై ఈ గ్రంథము ద్వారా తన దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తూ ధర్మోత్తరజీవితమునకు దారిచూపుట మన మహద్భాగ్యము. శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న భాగవత సప్తాహములలో భాగంగా పెదముత్తీవిలోని శ్రీకృష్ణాశ్రమములో నిర్వహింపబడిన భాగవత సప్తాహములో ఈ పురాణపురుషుడు గ్రంథము యెుక్క వివరణాత్మక అధ్యయనము ప్రారంభించబడినది.

🕉వేదాంత సంగ్రహం🕉

25 Oct, 05:58


https://chat.whatsapp.com/GYNyClZwfCXFWYvCF97v0C

🕉వేదాంత సంగ్రహం🕉

25 Oct, 05:41


🌺 MASTER EK TALUKULU 🌺
🌼 There are no many Lords; but there is only one Lord in whom there are millions and millions of minds, senses and bodies.🌼

🕉వేదాంత సంగ్రహం🕉

25 Oct, 02:35


https://chat.whatsapp.com/5Rq1aArU4Cp0BH2he71VgZ

🕉వేదాంత సంగ్రహం🕉

24 Oct, 03:16


🌸 *శ్రీమద్భాగవతము* 🌸 


🌷 *స్వప్నము*🌷

🌹మైతేయుడు విదురునితో ఇంకనూ ఇట్లనెను….. అట్టి సుఖ దుఃఖముల అనుభవము దైవమునకు కలుగదు ఎట్లంటివేని వినుము…. పూర్ణచంద్ర మండలము చెరువులో నీటియందు ప్రతిబింబించును. నీరు కదలుచున్నప్పుడు ప్రతిబింబము వణుకుట, ముక్కలు ముక్కలుగా విరిగిపోవుట జరుగును. అపుడు గగనమ‌ందలి చంద్రుడు వణుకుట విరిగి పోవుట జరుగుట లేదు ‌గదా!

అట్లే భగవంతుడు సర్వజీవుల శరీరధర్మముల రూపమున ప్రతిబింబించుచు, కష్టసుఖములు వ్యక్తములు అగుచుండుట సహజము. అట్టి మార్పలు అంతర్యామికి కలుగువు........  *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-239,240.

🕉వేదాంత సంగ్రహం🕉

22 Oct, 13:37


🌸 *శ్రీమద్భాగవతము*🌸 


🌷 *స్వప్నము*🌷

🌹జీవుడు నిద్రపోయినపుడు స్వప్నములు కలుగును. అందుతాను సమస్త సుఖములు అనుభవించును‌‌. లేదా ఆత్మహత్య, ఇతరులు తన శిరస్సును ఖండించి, హత్య చేయుట మున్నగు సన్నివేశములు గూడ అనుభవింపచ్చును. మెలకువ వచ్చుసరికి తన నిజస్వరూపము తనకు జ్ఞప్తికి వచ్చును. అపుడు గూడ స్వప్నము నందు జీవుని సుఖ దుఃఖములు నిజముగా బంధించుచున్నవి గదా!

ఎవరైనా చంపుచున్నట్లు కల వచ్చినప్పుడు నిజముగా భయపడును గదా! భగవంతునికి ఇట్టి అనుభవము కూడ అంటునా? అని నీ మనస్సున సందేహము కలుగవచ్చును. వివరించెదను వినుము.......  *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 3-237, 238.

🕉వేదాంత సంగ్రహం🕉

22 Oct, 04:04


ప్రపంచంలో ఎక్కడలేని అద్భుతం ఈ ఊరికి మాత్రమే సొంతం.. కానీ సరైన ప్రచారం లేదు....!!

🌿గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం సత్తెనపల్లి పట్టణం కి అతి సమీపంలో 5 km దూరంలో వున్న లక్కరాజు గార్లపాడు గ్రామంలో ఉన్న శ్రీ పట్టాభిరామ ఆలయం దేశంలో ఎక్కడలేని ప్రత్యేక్యమైన గుర్తింపు వున్నది..

🌸ఏక శీల మీద రాముడు,సీతాదేవి,లక్ష్మణుడు, భరతుడు,శత్రజ్ఞుడు,ఆంజనేయుడు ఒకే రాతి మీద అందరూ కొలువై వున్నారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి విగ్రహం లేదు .దాదాపు ఈ గుడికి 2000 సంవత్సరాల పైగా చరిత్ర వున్నట్లు అంచనా.

🌿ఈ గుడి స్వయానా శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో పునర్నిర్మాణం జరిగిందని తెనాలి రామకృష్ణుడు గుడిలో ఒక రాయి మీద చెక్కిన అక్షరాలలో వుంది... జై శ్రీరామ్...

🕉వేదాంత సంగ్రహం🕉

21 Oct, 06:02


*క్రతువులు, ఉగ్ర తపస్సులు చేయువాడు తన్ను మిగిలిన వారికన్న వేరుగా భావింపవచ్చును. దానములుచేయువాడు తన దగ్గర దానము పట్టిన వారిని తనకన్న క్రింద నిలుచుండబెట్టవచ్చును. మరియు వారు తన వలన మేలుపొందిరని జ్ఞప్తియుంచుకొనవచ్చును. తాననుకొనినట్లు వారు ప్రవర్తింపనిచో క్రోధము, దుఃఖము పొందుట న్యాయమనిపించవచ్చును. అన్ని వ్రతములు మిగులకుండ చేసినవాడు తన పాపమంతయు నశించినదని నమ్మవచ్చును. ఇట్లీ సత్కర్మల వలన కలిగిన దుర్భావములు కర్తకు తెలియకుండ రాక్షసులై ఆక్రమింతురు. వారితో పోరాడుచు, ఆ జీవులు సంసారము చేయవలసియుండును. అట్టి పోరాటములలో భగవంతుడు వారికి తోడ్పడడు. మనస్సునకు గోచరించుట గూడ చేయడు. కోప తాపాదులు కలిగినపుడు భగవంతుడు జ్ఞప్తికి వచ్చుట ఎట్లు? ఆ సమయములలో అతడు చల్లగా తప్పించుకొనును. ఇట్లు చేయుట ఎందులకు? రాక్షస సంహారమునకు భగవంతు డేర్పరచిన మార్గమొకటి వేరుగా నున్నది గదా! దాని నవలంబించినచో నతడు గోచరించి తోడ్పడును.*

*ఆ మార్గమిట్లున్నది! తన ప్రవర్తనము, తన భావములు, ఇతరుల ప్రవర్తనము, వారిని గూర్చిన తన యభిప్రాయములు, భగవంతుని యందు సమర్పణ చేయవలెను. తాను ధర్మమను కొనుచున్నది గూడ తన యభిప్రాయమే గనుక దానిని గూడ సమర్పణము చేయవలెను. “సర్వధర్మములను సన్యసించి, నన్ను శరణుపొందుము. నేను సర్వపాపముల నుండి నిన్ను విమోచనము చేసెదను. ఇక శోకమక్కరలేదు” అని భగవద్గీతలో చరమ శ్లోకముగా నుపదేశించిన కర్తవ్యమిదియే. ఈ సమర్పణ చేసిన వారికి గోచరించినట్లు భగవంతుడితరులకు గోచరింపడు. కారణమేమి? వారట్లు సమర్పించి నపుడే వారిలోని రాక్షసులు భగవంతుని యందు శత్రుత్వము వహింతురు. అప్పుడు కాని భగవంతుడు రాక్షస సంహారుడు కాలేడు. రాముడరణ్యమున చరించుచున్నను, ఋషులను బాధించుచున్న రాక్షసులను సంహరించుటకు కావలసిన శత్రుత్వమేర్పడలేదు. ఋషులందరు రామునకు శరణాగతి చేయుటవలన రాక్షసులు రామునికి శత్రువులైరి. అప్పుడు కాని ఋషుల కభయము పల్కుటకు రామునకు సందర్భము కలుగలేదు. అట్లే ప్రతి జీవి విషయమునను.*

*ధర్మమును గూర్చి ఎవని యభిప్రాయము వానికుండును. అది యున్నంతవరకు అతడు దానితో తంటాలు పడవలసినదే గాని, దైవము కరుణించునని తెలియదు. ఈ సత్యమునే క్రోడీకరించుచు అదే దైవము ఏసుక్రీస్తు ద్వారమున పల్కినపుడు *Judge not lest ye be judged" అనెను. నీకున్న యభిప్రాయమునుబట్టి నీపై నభిప్రాయము లేర్పడునని దీని సారాంశము.*                               🪶 *మాస్టర్ ఇ.కె.*

🕉వేదాంత సంగ్రహం🕉

20 Oct, 06:34


పంచాంగ గణన పద్ధతుల గురించి

🕉వేదాంత సంగ్రహం🕉

19 Oct, 02:32


🌸 శ్రీమద్భాగవతము 🌸


🌷నిర్గుణుడగు  భగవంతుడు సృష్టిలో సగుణుడై ఉండుట ఎట్లు ?🌷

ఆ మాయతోనే సమస్తము సృష్టించుచు మాయము చేయుచుండును. దేశము, కాలము అను భేదములను పుట్టించుచుండును. ఇతరులను సృష్టించును. వారిని జ్ఞానులుగా చేయును. తాను ఒక్కడే అయి ఉండియు సమస్త జీవుల రూపమున శరీరములు ధరించి, వసించును. అట్లనచో జీవులకు కష్టములు, దౌర్భాగ్యము అను లక్షణములు దేని వలన కలిగెను? ఈ సంశయము వలన నా మనస్సు అజ్ఞానము చెందినది. దానిని సరి చేయుము............ మాస్టర్ ఇ.కె.

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము.

🕉వేదాంత సంగ్రహం🕉

18 Oct, 10:45


*జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు :*

*ప్ర : మన సంస్కృతిని రక్షించుకోవడానికి మన వేద, పురాణ విషయాలు తెలుసుకుంటే సరి కదా!చరిత్ర గురించి చర్చించడం, తెలుసుకోవడం ఎందుకు?*

*జ :* మనకి చరిత్రపట్ల ఉన్న ఈ ఉదాసీన, నిర్లక్ష్య వైఖరి వల్లనే మన సంస్కృతిపట్ల ఇప్పటి తరంలో అలక్ష్యభావం ఏర్పడుతుంది. మన చరిత్రను- మన దేశ సంస్కృతిని తక్కువ దృష్టితో చూసేవాళ్ళు వ్రాసిపెడితే అదే మనం చదివి నమ్ముతున్నాం. ఇప్పటికీ మన విద్యావిధానం, ఆలోచన విధానం విదేశీయమే. కనుక అసలు చరిత్రను ఎందరు ఘోషించి చెప్తున్నా బధిరశంఖారావమే అవుతోంది. ఇటువంటి స్థితిలో- మనం మన అసలు చరిత్రను పరిశోధించి, నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది. చరిత్ర అధ్యయనం - లేకపోతే మన పరంపరలోని అసలు విషయాలు స్పష్టం కావు. మన సంస్కృతి పరిరక్షణలో ఎన్ని ఆటుపోట్లు, ఉత్థానపతనాలు మనం చవి చూశామో మనకు తెలిసిననాడే సంస్కృతి యొక్క సమగ్ర స్వరూపం అర్థమౌతుంది. ఒక హేతుబద్ధత సాధ్యమౌతుంది. కాబట్టి చరిత్ర అధ్యయనం,చర్చించడం, తెలుసుకోవడం అత్యవసరమే.

*('ఋషిపీఠం' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరణ)*

2,180

subscribers

1,188

photos

41

videos