సినీ ఫక్కీలో పోలీసులు ఛేజింగ్
ఏఎస్ఐని ఢీకొట్టి మరీ పరారీ
సూర్యాపేటలో
పోలీసుల చాకచక్య వ్యూహం
రోడ్డుకు అడ్డంగా లారీలు నిలిపివేత
ఎట్టకేలకు దొరికిన దొంగ
హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో 108 అంబులెన్స్ చోరీ చేసి పారిపోతున్న ఓ దొంగను పోలీసులు వెంటాడారు. పట్టుకున్నారు. ఈ చేజింగ్లో ఓ ఏఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కొన ఊపిరిలో కొట్టిమిట్ట అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దీంతో అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అతివేగంతో విజయవాడ వైపు పరారయ్యాడు. ఈ క్రమంలో చిట్యాల వద్ద పట్టుకునేందుకు ప్రయత్నించగా ఏఎస్ జాన్ రెడ్డి వ్యక్తిని ఢీకొట్టాడు. ఆంబులెన్స్ ఆపకుండా పారిపోయాడు. అనంతరం కేతేపల్లి మండలం కోర్ల పహాడ్ టోల్‌గేట్ వద్ద గేటును ఢీకొట్టి వేగంగా దూసుకెళ్లాడు. సూర్యాపేట పోలీసులు అలెర్ట్ అయ్యారు. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుపై లారీలు అడ్డంగా పెట్టించారు. చివరికి దొంగను పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో పలు చోరీ కేసులు ఉన్నట్టు గుర్తించారు. కాగా, జాన్‌రెడ్డి తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.