సైబర్ నేరగాళ్లు పండుగ సమయాన్ని తమ మోసాలకు కొత్త ఎత్తుగడగా ఎంచుకున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ‘పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ అని ఉచిత రీచార్జ్ అంటూ మెసేజ్లు పంపుతారు. వాటిని నమ్మకండి. ఆశపడి క్లిక్ చేయొద్దు. లింక్ మరో 10 మందికి షేర్ చేయకండి. అది రీచార్జ్ కాదు.. మాల్వేర్. అత్యాశకు వెళ్లి సైబర్ మోసాలకు గురికావొద్దు, అని Xలో పోలీసులు ప్రకటన చేశారు.