Telugu inspirational stories quotes & jokes @telugu_quotes_stories_jokes Channel on Telegram

Telugu inspirational stories quotes & jokes

@telugu_quotes_stories_jokes


Telugu moral & inspirational stories, quotes, jokes & facts

Telugu inspirational stories quotes & jokes (Telugu)

తెలుగు మోరల్ & ఇన్స్పిరేషనల్ స్టోరీస్, కోట్స్, జోక్స్ & ఫాక్ట్స్ ఇవి కలిగే అద్భుతమైన సర్వర్కులను కలిగి ఉండటం గారం, వినండనకు కొత్త మార్పులు మరియు చివరి సాహాయానికి కొనసాగటం గారం చిత్రించాలి. మన టెలిగు కోట్స్, కహానీలు మరియు జోక్స్ చదవడానికి మరియు ఆనందించడానికి మరియు అందుబాటులో ఉండటం గారం మన క్యానల్లో అమర్చబడియున్నది. ఇక్కడ మనం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విటర్ మరియు ఫైల్స్ను వివరించడానికి కాక మనదినజాల చానల్ వినండనకు తగినవి. మనం దేశంలోని ప్రతి కొనసాగే ప్రజలను ఆనందించడానికి మరియు ప్రేరణగా నడిస్తున్నదన్నారంగా మనదినజాల చానల్ లో మాజీ పండితుల తలలో కలిగిన కథలు, ఆక్రమణాలు మరియు విజయాలను జీవంతం చేస్తున్నారు. మనం వివాదాస్పద వార్తలు, వింత జోక్స్ మరియు మనం ఎన్నికల గమనాలను ఆధారపడి పోలితికల్ జోక్స్ మరియు విశ్వాసార్థమైన చరిత్ర విచారాలు కలిగి ఉండటం గారం మన చానల్లో కలిగి ఉండటం గారం మన చానల్ మరియు మన సహచరులకు ఉపయోగపడినది. మూలమైన సాహాయానికి మరియు మరియు మనం ఇక్కడ కలిగి ఉండటం గారం మరియు ఉదాహరణలో ఉపయోగపడి తెలుగు మూలమైన కథలు, చిన్న జోక్స్ మరియు అనుభవాలను చూపిస్తున్నాం. మన100% నిజమైన వివరాలకు శ్రేయను అభినందం చేయడానికి మనదినజాల చానల్ నీకు ఉపయోగపడి మనం మరియు మన చానల్ చూస్తున్నాం.

Telugu inspirational stories quotes & jokes

07 Nov, 23:49


ఎందుకు జీవిస్తున్నావన్న ప్రశ్న కాదు, ఎలా జీవిస్తున్నావనే ప్రశ్న వేసుకోవాలి.

👉నిన్ను నువ్వు ప్రేమించగలిగితే శుత్రువులే ఉండరు.

🌿ద్వేషం పెంచుకుంటే నిన్ను మించిన రోగి ఉండడు' ఇన్నాడు ఫ్రాంక్లిన్ నిజమైన స్నేహానికి, ప్రేమకు షరతులుండవు.

స్నేహం, ప్రేమ ఇవ్వడమే నేర్చుతాయి. ఆశించడం వాటికి తెలియదు.

👉విజయానికి తొలిమెట్టు ప్రేమ, కీర్తికి తొలిమెట్టు విజయం.🍁

Telugu inspirational stories quotes & jokes

07 Nov, 23:48


"జ్ఞాని"

🌿ఎత్తయిన పర్వతాన్ని ఎక్కాలంటే కాస్త వంగి నడవాలి.

ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలంటే. కొంత అణుకువ, విదేయత ఇవసరం.

👉మాట్లాడటం కన్నా వినడం ఎక్కువ అలవాటు చేసుకోవాలి.

జ్ఞాని సంయమనం పాటిస్తాడు.

కష్టసుఖాలను సమంగా భావిస్తారు.

మాషణ భూషణలను ఒకే విధంగా స్వీకరిస్తాడు.

ఇతరుల తప్పును మనం మన్నిస్తే మన తప్పును పరమాత్మ మన్నిస్తాడు.

మనకు తెలియని జ్ఞానం అందించే ప్రతి మనిషి గురుమే.🍁

Telugu inspirational stories quotes & jokes

02 Nov, 19:40


'ఈ భూమి మీదకి నువ్వు ప్రమాదవశాత్తు రాలేదు. పది మందితో కలిసి రాలేదు. విడివిడి భాగాలన్నీ ఒక చోటుకు చేర్చి తయారుచేసిన అసెంబుల్డ్ ప్రోడక్టగా రాలేదు.

మాస్టర్ క్రాఫ్ట్స్ మాన్ దేవుని ద్వారా ప్రేమ పూరిత వాతావరణం నుంచి ఓ కానుకలా ఈ భూమ్మీదకి వచ్చావు' అన్నారు. అమెరికన్ రచయిత మ్యాక్స్ లుకాడో.

మరి అలాంటి అపురూపమైన వరంగా లభించిన జీవితాన్ని మనం ఎలా వాడుకుంటున్నామన్నది ఎప్పుడైనా ఆలోచించారా?

ఎన్నెన్నో అపోహలూ అనుమానాలూ అసంతృప్తులూ వేధిస్తుండగా జీవితాన్ని బండి లాగినట్లు బలవంతంగా లాగడమే తప్ప ఉత్సాహంగా తోలడం ఉండదు... ఎందుకని ప్రశ్నించుకున్నారా?

లోపం ఎక్కడో లేదు. మనలోనే ఉంటుంది. దాన్ని గుర్తించ కుండా బయటి కారణాలను వెతుక్కుంటాం.

ఎవరో వచ్చి మనని ఉద్ధరించరని తెలుసుకోవాలి. ఎన్నో తీయని కలలు కంటాం కదా, వాటిని నిజం చేసుకునే అవకాశం మనచేతిలోనే ఉందని మనకి మనం చెప్పుకోవాలి.

👉అదెప్పుడు సాధ్యమవుతుందీ అంటే- మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు. నూటికి తొంబైముంది వెనకడుగు వేసేది, ఏమీ సాదించకుండా మిగిలిపోయేది, ఆ నమ్మకం లోపించడం వల్లనే.

👉ఎందరో విజేతల్ని చూస్తుంటాం.. వాళ్ల గెలుపు కథల్ని వింటుంటాం. ఆ స్థానంలో నేనెందుకు ఉండకూడదు, నాకేం తక్కువ అని ప్రశ్నించుకోవాలి. ఏదైనా సాధించగల శక్తి మనలోనూ ఉందని గుర్తించాలి.

🌿దానికి ఆత్మ విశ్వాసం, ఆత్మస్థైర్యం, స్వీయహామీ... ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ అది మనలో నిద్రాణమై ఉన్న ప్రతిభను, సహజసిద్ధంగా ఉన్న ఆసక్తులను మనకు తెలియజేసి ముందడుగు వేయిస్తుంది.🍁

Telugu inspirational stories quotes & jokes

26 Oct, 04:47


ఆరోగ్యంగా, మంచి ఫిట్నెస్ ఉండేవారిని ఇతరులు ఎక్కువగా గౌరవిస్తారు.

మీరు అంగీక రించినా.. అంగీకరించకపోయినా ఇది వాస్తవం.

మీలోని కష్టపడేతత్వం, ఆత్మగౌరవం, క్రమశిక్షణ వంటి లక్షణాలకు.. ఫిట్ గా ఉన్న మీ శరీరం అద్దం పడుతుంది.

👉 దాన్ని డబ్బుతోనో, హోదాతోనో కొనుక్కోలేరు. ఇష్టంతో కష్టపడుతూ సాధించుకోవాల్సిందే.🍁

Telugu inspirational stories quotes & jokes

26 Oct, 04:45


మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారన్నది చాలా చాలాముఖ్యం.

🌿ఐదుగురు కోటీశ్వరులను ఎక్కువసేపు కలుస్తూ ఉంటే.. మీరు ఆరో కోటీశ్వరుడిగా ఎదుగుతారు.

🌿ఐదుగురు ధైర్యవంతులతో అధిక సమయం ఉంటే.. ఆరో ధైర్యవంతుడిగా మారుతారు.

🌿ఐదుగురు తెలివైనవారితో ఉంటే.. ఆరో వివేకిగా పరిణతి చెందుతారు.

👉ఒకవేళ ఐదుగురు మూర్ఖులతో ఎక్కువ సేపు గడుపుతున్నట్లయితే.. మీరు ఆరో మూర్ఖుడిగా తయారవుతారు.🍁

Telugu inspirational stories quotes & jokes

26 Oct, 04:43


నిన్నటికన్నా ఈరోజు నన్ను నేను ఎంత మెరుగుపర్చుకోగలనని ప్రతిఒక్కరూ పొద్దున లేవగానే ప్రశ్నించుకోవాలి.

రోజంతా మీరు సానుకూల దృక్పథంతో ఉండటంతోపాటు మీ లక్ష్యాలు, విలువలకు అనుగుణంగా పనిచేయడానికి అవసరమైన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇది అందిస్తుంది.

స్వీయపురోగతి కోసం మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే కాలక్రమంలో అర్థవంతమైన మార్పును తీసుకొస్తాయి.🍁

Telugu inspirational stories quotes & jokes

22 Oct, 11:06


ఒక మగవాడు జీవితాంతం ఏమి చేసినా రుణం తీర్చుకోలేనిది మాత్రం ఇద్దరికి.

ఒకటి తనని నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లికి,
రెండు తన ప్రతిరూపమైన బిడ్డలని నవమాసాలు మోసి, కని, పెంచి, ఇచ్చే భార్యకి.
ఇద్దరు చేసింది ఓకే పని,
ఇద్దరు పడింది ఓకే కష్టం,
ఇద్దరు చూపించేది ఓకే ప్రేమ.

ఒకరు తను కళ్ళు తెరవగానే మొదటిగా చూసినవారు.
మరొకరు కళ్ళు మూసేటప్పుడు చివరిగా చూడాలి అనుకునేవారు.
ఎవరు ఎక్కువ కాదు,ఎవరు తక్కువ కాదు.

కాకపోతే

తల్లి అనే బంధం ఎవరెస్ట్ శిఖరం లాంటిది,
ప్రతి భార్య చేరుకోవాలి అనుకునే గమ్యం కూడా అదే ......
అయితే భార్య ప్రయాణం కొత్తలో భర్త యొక్క తల్లి స్థానం అందనంత ఎత్తులో ఉన్నట్టు ఉంటుంది.

కానీ

ఒకసారి భార్య కూడా తల్లి అయ్యి ఆ శిఖరం అధిరోహించాక అప్పుడు
తల్లి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది,
ముందు తల్లికి కొడుకు అయ్యాకే,
తనకి భర్త కాగలిగాడు అనే నిజం భార్యకి అర్థమవుతుంది....

ఒక మగవాడి జీవితంలో తల్లి భార్య ఇద్దరు ముఖ్యమే.ఇద్దరిలో ఎవరు వారిది వారిలో ఏ స్థానం తగ్గిన మగవాడి జీవితం తలకిందులు అవ్వుతుంది. 🍁

Telugu inspirational stories quotes & jokes

18 Oct, 16:50


కారు ఆగిపోయింది .
అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి .
దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది .
స్టెఫినీ ఉందికానీ తనకు వెయ్యడంరాదు.
రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు .
సమయం చూస్తే ...
సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి .
మనసులో ఆందోళన. ఒక్కతే ఉంది. తోడు ఎవరూ లేరు.
చీకటి పడితే ఎలా?

దగ్గరలో ఇళ్ళు లేవు. సెల్ పనిచెయ్యడం లేదు( సిగ్నల్స్ లేవు ).
ఎవరూ కారునూ, పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు.
అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది. ఎలారా దేవుడా అనుకుంటూ ...
భయపడడం మొదలయ్యింది. చలి కూడా పెరుగుతోంది.

అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది.
ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటంతో ...
ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను?
ఎందుకు వస్తున్నాడు? ఏమి చేస్తాడు?
ఆందోళన !

అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు?
టైర్ లో గాలి లేదని చూశాడు. ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు.
"భయపడకండి. నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను.
బాగా చలిగా ఉంది కదా! మీరు కారులో కూర్చోండి.
నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు.
ఆమె భయపడుతూనే ఉంది.

"నా పేరు బ్రియాన్.
ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను" అన్నాడు.
అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని ...
కారు కిందకి దూరి జాకీ బిగించాడు.
తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో ...
జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు.
ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు.

"మీరు కాదనకండి. మీరు ఈ సహాయం చెయ్యక పోతే ...
నా పరిస్థితిని తలుచుకుంటే ... నాకు భయం వేస్తోంది" అంది.
"నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు.
మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ... ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే ...
నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి" అని వెళ్లి పోయాడు.
V
మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ...
ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది.
అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది.
తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది.
ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి.

అదొక చిన్న హోటల్.
కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది.
ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది.
డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది.
బరువుగా నడుస్తోంది.
అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవడం,
సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని ... చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది.
ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు.

ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది.
చిరునవ్వుతో “ఏమి కావాలండి?” అని అడిగింది.
అంత శ్రమ పడుతూ కూడా ...
చెరిగిపోని చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో? అని,
ఆశ్చర్య పడుతోంది, తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది.
భోజనం చేసి ఆమెకు ... 1000 రూపాయల నోటు ఇచ్చింది.
ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..
ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద ...
నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి.

ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు.
అందులో ఇలా ఉంది ...
“చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది.
నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే ...
నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది.
నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ ...
నేను నీకు సహాయపడుతున్నాను.
నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు." అని రాసి ఉంది..

హోటల్ మూసేశాక ఇంటికి వచ్చింది.
అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది.
గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది.
అతడి పక్కన మంచం మీదకు చేరుతూ ...
“మనం దిగులుపడుతున్నాం కదా ... డెలివరీకి డబ్బులెలాగా అని.
ఇక ఆ బెంగ తీరిపోయిందిలే, బ్రియాన్!
భగవంతుడే మనకు సహాయం చేశాడు.
ఆయనకి కృతజ్ఞతలు” అంది ప్రశాంతంగా.

మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.
మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది.🍁
.🙏🙏🙏