꧁🌺 తెలుగు జాబిలీ 🌺꧂ @telugujabili Channel on Telegram

🌺 తెలుగు జాబిలీ 🌺

@telugujabili


APPSC, TSPSC , పుస్తకాలు,నవలలు,కథలు,పాటలు,
మ్యాగజైన్స్,వార్తా పత్రికలు,విద్యా,ఉద్యోగం,ఆరోగ్యం,ఆయుర్వేదం,
ఆంగ్ల అనువాదములు & ప్రేరణాత్మకమైన
అప్డేట్స్ ను తెలుగు ప్రజలకు చేర్చడమే ఉద్దేశ్యము

https://t.me/TELUGUJABILI

తెలుగు జాబిలీ (Telugu)

తెలుగు జాబిలీ టెలిగ్రామ్ ఛానల్ ఒక ప్రముఖ తెలుగు సామాజిక సేవా ఛానల్ ఉంది. ఈ ఛానల్ ద్వారా APPSC, TSPSC, పుస్తకాలు, నవలలు, కథలు, పాటలు, మ్యాగజైన్స్, వార్తా పత్రికలు, విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, ఆయుర్వేదం, ఆంగ్ల అనువాదములు & ప్రేరణాత్మకమైన అప్డేట్స్ తెలుగు ప్రజలకు చేర్చడమే ఉద్దేశ్యము. ఇది వాటిని అందించే తెలుగు సామాజిక పరిశ్రమలో పాల్గొనడంలో సహాయపడబడుతుంది. మీరు ఈ ఛానల్ లో చేరడం ద్వారా ముందుకు భవిష్యత్తున సమాచారం పొందవచ్చు. తెలుగు జాబిలీ ఛానల్ను జాగ్రత్తగా అనుసరించండి మరియు వాటి లో ఉచిత అప్డేట్స్ పొందండి.

🌺 తెలుగు జాబిలీ 🌺

19 Nov, 01:36


🙏🏻శుభ మంగళవారం శుభోదయం🙏🏻

🌺 తెలుగు జాబిలీ 🌺

19 Nov, 01:13


*భాష లో వెనుకబడిన విద్యార్థులకు నేర్పించవలిసిన సామార్ధ్యలూ*


*Tarl కార్యక్రమం*
*తెలుగు*

*Tarl తెలుగు కార్యక్రమాలు నిర్వహించవల్సిన క్రమం*





*అక్షర మాల* 👇
https://youtu.be/UFwPCL6imo0

*రెండక్షర పదాలు* 👇
https://youtu.be/FR8NspQw-jU
*మూడక్షర పదాలు*👇
https://youtu.be/6tGceo3wHqQ

*#నాల్గక్షర పదాలు*

https://youtu.be/aJEbLUz5-S8

*సున్న పదాలు*

https://youtu.be/aG_h6g4cABk?si=QCQfdWh9XeSS-RVK

*Tarl programme for classes 3,4 &5*


*తెలుగు*

*సరళ వాక్యాలు*
https://youtu.be/Pc1tRwrFY-I

*గుణింతాలు*
*దీర్ఘo పదాలు*
https://youtu.be/Bk9_cdS_Ro0

*గుడి పదాలు*

https://youtu.be/yB5doKRyx6Q

*(గుడి దీర్ఘo)*
https://youtu.be/3qIX8isYeLk
*కొమ్ము పదాలు*

https://youtu.be/Hc4EJl6Gxg0?si=toiwRwH9il4pam4P
*కొమ్ము దిర్ఘo*

https://youtu.be/8m5efeWwSTM?si=SiyCM6Fj379dG0Lf

*_వట్రసుడి_*

https://youtu.be/SQk6BM6R4pU?si=9oGZ1EFY0LSdTrxR

*ఎత్వం*

https://youtu.be/gASZYRxy9f4?si=g_oDjWGjqDfrFSca

*ఏత్వం*
https://youtu.be/TB0WH217EDM?si=xvX7uyn-OK2C0xEi

*ఐత్వం*
https://youtu.be/HGTRrKcUI1w?si=AB15eb6UBnkxBLYj

*ఒత్వం*

https://youtu.be/r8j0O88cu4A?si=sC5D_G36KkDF35-O

*ఓత్వం*

https://youtu.be/EeiJTBMTNdU?si=MxvW4S5-MQp9qsNN

*ఔత్వం*

https://youtu.be/sExkol_hjeM?si=erIPT91VCJjViQzb



✨️✨️✨️✨️✨️✨️✨️✨️✨️✨️

🌺 తెలుగు జాబిలీ 🌺

19 Nov, 00:09


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 575, 576 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 575, 576 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 2 🌻*

*భక్తుల హృదయమందు జనించు మధువును భ్రమరము వలె శ్రీమాత గ్రోలును గనుక ఆమెను భ్రమరాంబిక అని కీర్తింతురు. ఏయే పుష్పముల యందు మధువు యేర్పడు చున్నదో పర్యవేక్షించుచూ తేనెటీగ మధువు స్రవించు పుష్పములపై వ్రాలి ఆ మధువును గ్రోలును. అట్లే శ్రీమాత కూడ భక్తుల హృదయములందు జనించు భక్తిరసమును గ్రోలును. అట్టి మాధ్వీపానమందు అనురక్తి కలిగియున్నది శ్రీదేవి. మానవ హృదయములు కఠినములై కల్మషములతో కూడి యున్నప్పుడు వానిని పుష్పములతో పోల్చలేము. తమ కల్మషములను హరించి, కఠినత్వమును దమించి కారుణ్య హృదయులుగ తీర్చిదిద్దమని శ్రీమాతను ప్రార్థింప వలయును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 575, 576 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 575, 576. 'madhvipanalasa, matta' - 2 🌻*

*The Mother Divine, who relishes this devotion like a bee relishes nectar from flowers, is also glorified as Bhramarambika. Just as a bee identifies flowers that exude nectar, hovers over them, and savors the nectar, the Mother Divine too seeks the essence of devotion that blossoms in the hearts of her devotees. Her love for this divine nectar of devotion reflects her deep attachment to madhveepana (the act of drinking the nectar of devotion). However, human hearts that are hardened and filled with impurities cannot be compared to such blossoming flowers. Therefore, one must pray to the Mother Divine to cleanse their impurities, soften their hearts, and transform them into compassionate beings.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

19 Nov, 00:08


*🌹. కార్తిక పురాణం - 18 🌹*
*🌻. 18వ అధ్యాయము - సత్కర్మానుష్టాన ఫల ప్రభావము - చాతుర్మాస్య వ్రతము విశిష్టత 🌻*
*ప్రసాద్ భరద్వాజ*

"ఓ మునిచంద్రా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా, తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూణ్యఫలప్రదాయియగు యీ కార్తీకమాసమెక్కడ! పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ? యివి యన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో, దాని ఫలమెట్టిదో విశదీకరింపు"డని ప్రార్ధించెను.

"ఓ ధనలోభా! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధమైనట్టివి కాన, వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతివాడో, యెటువంటి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా నీ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము చేయవలెను. అటుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు". అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.

"ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత దానిని నాచరించవలెను? ఇదివరకెవ్వరయిన నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తర౦గా విశదికరింపు"డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.

Continues in Page 2

🌺 తెలుగు జాబిలీ 🌺

19 Nov, 00:08


*🌹సంకటహరచతుర్థి - అంగారక చతుర్థి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*నారద మహర్షి చేసిన శ్రీ సంకట నాశన గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తోలగిపోతాయి.*

*ఓం గం గణపతయే నమః*

*🍀 శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం 🍀*

*నారద ఉవాచ*
*ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |*
*భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 |*
*
*ప్రధమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం |*
*తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 |*
**
*లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |*
*సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 |*
**
*నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |*
*ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 |*
**

*ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |*
*న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 |*
**
*విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం |*
*పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 |*
**
*జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |*
*సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 |*
*
*అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |*
*తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |*

*ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం*
*ఓం శాంతిః శాంతిః శాంతిః*

*సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి!*

*ఈ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు.*

*ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.*

*🌻 అంగారక చతుర్థి 🌻*

*ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి.*

*"ఓం గం గణపతయే నమః"*

*పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.*

*సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.*

*సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.*
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

19 Nov, 00:08


Cont..Frm Page 1
🌹🌹. కార్తిక పురాణం - 18

"ఓయీ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు, ఈ వ్రతమునకు, చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన, ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".

తొల్లి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింపబడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రు౦డును, చతుర్బాహు౦డును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీ మన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. "నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరు ధించవారికి విధించబడిన ధర్మముల నాచరించుచున్నారా? ప్రపంచమున నే అరిష్టములు లేక యున్నవి కదా?" అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి "ఓ దేవా! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరి కొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు"మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.

ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యెగతాళి చేయుచుండిరి. కొందరు "యీ ముసలి వానితో మనకేమి పని"యని ఊరకు౦డిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి "వీరినెట్లు తరింపజేతునా?"యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి, లక్ష్మి దేవితోడను, భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.

ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!
విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |
లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!
వందేవిష్ణుం!భవభయహారం! సర్వలోకైకనాథం ||

శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం
దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం |
శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

18 Nov, 23:43


🕉️

పంచాంగము 🌓 19.11.2024

🪔 శ్రీ కేశవాయనమః‌ 🪔

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక

పక్షం: కృష్ణ - బహుళ

తిథి: చవితి రా.09:09 వరకు
తదుపరి పంచమి

వారం: మంగళవారం - భౌమవాసరే

నక్షత్రం: ఆర్ద్ర రా.07:13 వరకు
తదుపరి పునర్వసు

యోగం: సాద్య ప‌.02:35 వరకు
తదుపరి శుభ

కరణం: బవ ఉ‌.09:44 వరకు
తదుపరి బాలవ రా.09:09 వరకు
తదుపరి కౌలువ

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉ‌.08:39 - 09:23
మరియు రా.10:42 - 11:34 వరకు

రాహు కాలం: ప‌.02:50 - 04:15

గుళిక కాలం: ప‌.12:01 - 01:26

యమ గండం: ఉ‌.09:12 - 10:37

అభిజిత్: 11:39 - 12:23

సూర్యోదయం: 06:23

సూర్యాస్తమయం: 05:39

చంద్రోదయం: రా.09:02

చంద్రాస్తమయం: ఉ‌.09:50

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: మిథునం

దిశ శూల: ఉత్తరం

🌹 భౌమ చతుర్థి 🌹

🌟 అనూరాధ కార్తె 🌟

🎋 సంకష్టహర చతుర్థి 🎋

🚩 శ్రీ విద్యానిధితీర్థ‌
పుణ్యతిథి‌ 🚩

🏳️ శ్రీ దేవశంకర్‌బాపా‌
పుణ్యతిథి‌ 🏳️

🚩 శ్రీ పురుషోత్తమ్‌ మహారాజ్
జయన్తీ‌ 🚩

🇮🇳 పండిత్ మదన్ మోహన్
మాలవ్య పుణ్యతిథి 🇮🇳

🎊 స్వామిమలై‌ శ్రీ సుబ్రహ్మణ్య
స్వామి కార్తిగై‌ ఉత్సవారంభం 🎊

🕯️ శ్రీ రాంభోట్ల లక్ష్మీనారాయణ
శాస్త్రి స్మృతి దినం 🕯️

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

18 Nov, 05:45


https://youtu.be/3-3UY6R0ZFk

🌺 తెలుగు జాబిలీ 🌺

18 Nov, 04:19


https://youtu.be/mttPPUMZqVk?si=E2GdsUa_RmLfIOEd

Class-4||ఈ మాసపు పాట

🌺 తెలుగు జాబిలీ 🌺

18 Nov, 03:32


https://youtu.be/QXNEeIdfoi4

🌺 తెలుగు జాబిలీ 🌺

18 Nov, 00:26


*🌹 శ్రీ చిదంబర అష్టకం 🌹*

*1) బ్రహ్మ ముఖామర వందిత లింగం! జన్మ జరా మరణాంతక లింగం|*
*కర్మ నివారణ కౌశల లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*2) కల్పక మూల ప్రతిష్ఠిత లింగం!దర్పక నాశ యుధిష్ఠిర లింగం|*
*కుప్రకృతి ప్రకరాంతక లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*3) స్కంద గణేశ్వర కల్పిత లింగం!కిన్నర చారణ గాయక లింగం|*
*పన్నగ భూషణ పావన లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*4) సాంబ సదాశివ శంకర లింగం! కామ్య వరప్రద కోమల లింగం|*
*సామ్య విహీన సుమానస లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*5) కలిమల కానన పావక లింగం! సలిల తరంగ విభూషణ లింగం|*
*పలిత పతంగ ప్రదీపక లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*6)అష్టతను ప్రతిభా సుర లింగం! విష్టపనాథ వికస్వర లింగం|*
*శిష్టజనావన శీలిత లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*7) అంతక మర్దన బంధుర లింగం! కృంతిత కామకలేబర లింగం|*
*జంతు హృది స్థిత జీవక లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*8) పుష్టధియస్సు చిదంబర లింగం! దృష్టమిదం మనసాను పఠంతి|*
*అష్టకమే తదవాఙ్మన సీయం! అష్టతనుం ప్రతి యాంతి నరాస్తే||*

*ఇతి శ్రీచిదంబరాష్టకం సంపూర్ణము.*
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

18 Nov, 00:07


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 575, 576 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 575, 576 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 1 🌻*

*మధుపానము గ్రోలి మత్తెక్కినట్లు గోచరించు శ్రీమాత అని అర్థము. మధు వనగా మధ్యము కాదు మధువు మేలుజాతి పుష్పములందేర్పడు అత్యంత మధురమైన రసము. ఆ రసమును గ్రోలి మత్తుగా నున్న కన్నులతో తన్మయత్వమున నుండునది శ్రీమాత. మధువు గ్రోలుట బాలకృష్ణుడు వెన్న దొంగిలించుట వంటిది. భక్తులు భగవదారాధనమున కరగి తన్మయులై యుండగా వారి హృదయ పద్మముల నుండి భక్తిరస ముద్భవించును. అట్టి భక్తిని మధురభక్తి అందురు. అట్టి భక్తియందు కలుగు రసము మధురసము. దానిని భగవంతుడు స్వీకరించి నపుడు భక్తులకు మహదానందము కలుగును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 575, 576 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 575, 576. 'madhvipanalasa, matta' - 1 🌻*

*This phrase translates to "The divine mother who appears as if intoxicated by consuming honey." Here, the term "madhu" (honey) does not refer to ordinary liquor but rather to the exceptionally sweet nectar formed from the essence of superior flowers. The Mother Divine is depicted as experiencing a blissful intoxication, symbolizing divine absorption. The act of savoring honey here is akin to Lord Krishna stealing butter. Devotees, when deeply immersed in their worship and adoration, become one with their devotion. From their heart-lotuses arises a nectar called bhakti rasa (the essence of devotion). This pure and sweet devotion is known as madhura bhakti (sweet devotion). When this essence is offered to the Divine, it brings immense joy to the devotee.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

18 Nov, 00:07


*🌹. కార్తిక పురాణం - 17 🌹*
*🌻. 17వ అధ్యాయము - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము 🌻*
*ప్రసాద్ భరద్వాజ*

ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించు చున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణముగు చున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు చున్నాను.  'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించు చున్నది - అని అంగీరసుడు చెప్పగా

"ఓ మునీఒద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక,  యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ'  యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే  'అహం' అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి  వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యనబడను. "నేను" అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియే గాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ "నేను", "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్రపోతిని, సుఖింగావుంది' అనుకోనునదియే ఆత్మ.  

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును,  ప్రకాశింప జేయు నటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే  'పరమాత్మ' యని గ్రహింపుము.  'తత్వమసి'  మొదలైన వాక్యము లందలి  'త్వం' అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం 'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షీణి౦చుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము,  ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించబడి యున్నదో అదియే "ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.

జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మ ఫలమను భవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై  గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

18 Nov, 00:02


🕉️

పంచాంగము 🌓 18.11.2024

🔅 శ్రీ కేశవాయనమః🔅

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక

పక్షం: కృష్ణ - బహుళ

తిథి: తదియ రా.10:19 వరకు
తదుపరి చవితి

వారం: సోమవారం - ఇందువాసరే

నక్షత్రం: మృగశిర రా.07:41 వరకు
తదుపరి ఆర్ద్ర

యోగం: సిధ్ధ సా.05:11 వరకు
తదుపరి సాద్య

కరణం: వణిజ ఉ‌.10:58 వరకు
తదుపరి భధ్ర రా.10:19 వరకు
తదుపరి బవ

వర్జ్యం: రా.03:55 - 05:29 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.12:24 - 01:09
మరియు ప‌.02:39 - 03:24

రాహు కాలం: ఉ‌.07:47 - 09:12

గుళిక కాలం: ప‌.01:26 - 02:50

యమ గండం: ఉ‌.10:36 - 12:01

అభిజిత్: 11:39 - 12:23

సూర్యోదయం: 06:22

సూర్యాస్తమయం: 05:39

చంద్రోదయం: రా.08:00

చంద్రాస్తమయం: ఉ‌.08:49

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: మిథునం

దిశ శూల: తూర్పు

🎋 సౌభాగ్యసుందరి‌ వ్రతం 🎋

🚩 శ్రీ కనకదాసర‌ జయన్తీ 🚩

🪷 భద్రావ్రతమ్‌ 🪷

📿‌తులసిమాలా‌ దానము‌ 📿

🚩 శ్రీ సత్యప్రమోదతీర్థ‌
పాదుకా సమారాధన‌ 🚩

🏳️ శ్రీ నానాజీ మహారాజ్
పుణ్యతిథి 🏳️

🚩 కాఞ్చీ జగద్గురు శ్రీ కృపాశఙ్కరేన్ద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩

🎊 తిరునెల్వేలి శ్రీనెల్లియపర్
కొలుదర్బార్ ఉత్సవం 🎊

🇮🇳 వల్లియప్పన్ ఉలగనాథన్
చిదంబరం పిళ్లై స్మృతి దినం 🇮🇳

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

17 Nov, 16:26


🙏🏻శుభ కార్తిక సోమవారం శుభోదయం🙏🏻

🌺 తెలుగు జాబిలీ 🌺

15 Nov, 13:27


*No Bag Day for classess1&2*

*నో స్కూల్ బ్యాగ్ డే*
🥳🥳🥳
*No-School బ్యాగ్ రోజు (16-11-24/ మూడవ శనివారం ) కనుక   విద్యార్థులలో భాష నైపుణ్యం, పఠ నైపుణ్యం, సృజనాత్మక నైపుణ్యం, ఆరోగ్యం మరియు మానసిక  వికాసం   పెంపొందించడానికి మరియు విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే ఈ  కింది వీడియోలు చూపించి వారి చేత చేయించండి*

*వీడియోలు చూడదలిచిన వారు ఈ కింది బ్లూ లింక్ నొక్కండి*👇


✨️✨️✨️✨️🙏🏼✨️✨️✨️✨️✨️

*No Bag Day:*
*Plan of Action*
1.Language time (90min)
2.Theatre time (90min)
3.Creative time (90min)
4.Play time (90min)
*మూడవ శనివారం (16-11-2024)  No-Bag Day సoధర్భంగా  చేయవలిసిన  కార్యక్రమం - కృత్యాలు*

===========@===========
*No-Bag day activities @primary 👇*

https://youtu.be/yvoUQh-PMrw

https://youtu.be/9l5r9AFGoFw
*సృజన - సందడి* 👇

https://youtu.be/9l5r9AFGoFw

https://youtu.be/mRwAxKR0R08


*Language  time of No- Bag -Day activities*👇- 90 mints
========================
*Role play* 👇

https://youtu.be/ncPsErn9zFk

https://youtu.be/HlKmrMeB5W4
*Vocabulary building games*

https://youtu.be/-UFOOWl4hi4?si=vAVZtrecgAFQtqO5

https://youtu.be/eVwzOzE5cpQ?si=II0RWSa6_j_Kc3AR

*Phonetics rhyme*

https://youtu.be/aWod3hgWL2g

*Riddles*
*Podupu- kathalu*

https://youtu.be/t9bMH-7LeDg?si=

7JySwIdvVzyk5KBp
https://youtu.be/bB_Hc-Q_iKc?si=J_WIUW7rUx1ACv3Q

https://youtu.be/TGwJtiajGQc?si=wZNVx6NB6TE6fC3N

https://youtu.be/lFMgIOjDVtY

https://youtu.be/7QJ4aJMbVB0

*riddles👆🏽*

*who am.. I? -1* 👇

https://youtu.be/G3dc3paD0wA

*who am.. I? -2* 👇

https://youtu.be/af13Klh_giY

*Classroom phrases*

https://youtu.be/nGghFnzHQsw

*Speaking skills*

https://youtu.be/wDMAPTarc5w

*Theatre time* -90mnts

*నో స్కూల్ బ్యాగ్ డే*
🥳🥳🥳

*.Theatre time (90min)*
===========@===========
*No-Bag day activities @primary 👇*
*కథ - మంజరి  ( నీతి కథలు )* 👇

https://youtu.be/PiAbFaGiK6E?si=m0J9eObsFUVb-YQ0

https://youtu.be/ncPsErn9zFk

*About No - School bag day activities*👆🏽

*Moral story* 👇
https://youtu.be/aSIToToWCuw?si=TrlKBv45UZl5LUKN

https://youtu.be/TbbLg3eg5VI

https://youtu.be/7C1zVpWrYSY
*Health అండ్ Hygiene*

https://youtu.be/6Z83BzztjaA?si=Pzyc_DC8rAmFfGDw

*పరిశుభ్రమైన కాకి* 👇

https://youtu.be/BIgNMvbxsMM

https://youtu.be/2DYhrtwEIYs

https://youtu.be/_d1HAXBTZnc

*బాలల  సంఘాలు*
https://youtu.be/iej-G2uaLco

https://youtu.be/XRQvhrXRXoE


✨️✨️✨️✨️✨️✨️✨️✨️✨️

🌺 తెలుగు జాబిలీ 🌺

15 Nov, 04:20


*ఒక్క సబ్జక్ట్ డీల్ చేస్తున్న ఉపాధ్యాయుల డైరీ వ్రాయు విధానం*

*నమూనా డైరీ*

https://youtu.be/bBT39_8hFJs

*బహుళ తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల డైరీ*

https://youtu.be/q2zr9i383w8

✨️✨️✨️✨️✨️✨️✨️✨️✨️

*ఉన్నత తరగతులు బోదిస్తున్న వారి డైరీ*

https://youtu.be/hUfBaud6olw

*పిల్లల డైరీ*

https://youtu.be/V6ryUYj8aFY

✨️✨️✨️✨️✨️✨️✨️✨️✨️✨️✨️

*ఇటువంటి అకాడమిక్ అంశాలు కోసం జాయిన్ అవ్వండి* 👇



https://chat.whatsapp.com/Dik1ohV227Y5Og6J8Wm7nh

✨️✨️✨️✨️✨️✨️✨️

🌺 తెలుగు జాబిలీ 🌺

15 Nov, 00:03


🕉️

పంచాంగము 🌓 15.11.2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక

పక్షం: శుక్ల - శుద్ధ

తిథి: పూర్ణిమ రా.03:24 వరకు
తదుపరి కార్తిక కృష్ణ పాడ్యమి

వారం: శుక్రవారం - భృగువాసరే

నక్షత్రం: భరణి రా.10:57 వరకు
తదుపరి కృత్తిక

యోగం: వ్యతీపాత ఉ‌.07:10 వరకు
తదుపరి వరియాన రా.03:12 వరకు
తదుపరి పరిఘ

కరణం: భధ్ర సా.04:29 వరకు
తదుపరి బవ రా.03:24 వరకు
తదుపరి బాలవ

వర్జ్యం: ఉ‌.09:24 - 10:54 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.08:36 - 09:22
మరియు ప‌.12:23 - 01:08

రాహు కాలం: ఉ‌.10:35 - 12:00

గుళిక కాలం: ఉ‌.07:45 - 09:11

యమ గండం: ప‌.02:50 - 04:15

అభిజిత్: 11:38 - 12:22

సూర్యోదయం: 06:21

సూర్యాస్తమయం: 05:40

చంద్రోదయం: సా.05:07

చంద్రాస్తమయం: రా.తె.05:29

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: మేషం

దిశ శూల: పశ్చిమం

🌕 కార్తిక - వ్యాస‌ పూర్ణిమ 🌕

🎋 భార్గవరాకా‌ వ్రతం 🎋

🪔 దేవదీపావళి‌ 🪔

🌲 ధాత్రి పూజ 🌲

💧 పూర్ఢిమోపవాసము‌ 💧

🧊 చలిమిడి నైవేద్యం ‌ 🧊

🪔 శృంగేరి లక్షదీపోత్సవము 🪔

🌊 సింధు - సముద్ర స్నానము 🌊

🌸 వ్యాసపూజ 🌸

🍏 అమలక - తిలచూర్ణస్నానం 🍏

🚩 యోగిరాజ దత్త జయన్తీ 🚩

💦 కార్తీక స్నాన సమాప్తి 💦

⚜️ కార్తికేయ దర్శనం ⚜️

🌿 ధాత్రి నారాయణ పూజ 🌿

🎍 కేశబంధన‌ గౌరీ వ్రతము 🎍

🎉 తీర్థపుష్కర్ స్నాన మేళా 🎉

🏳️ గురునానక్ జయంతి 🏳️

🎋 కేదారేశ్వర వ్రతము 🎋

💦 భీష్మపంచక వ్రత సమాప్తి 💦
( భీష్మార్ఘ్యప్రదానము‌ )

ఇంద్ర - దక్ష సావర్ణి‌ మన్వాది‌

💧 గఢ్‌గంగాతీర్థ మేళా 💧

🚩 శ్రీ హేమచంద్రాచార్య
జయన్తీ 🚩

💧 విష్ణు పంచకోపవాసము 💧

📗 మార్కండేయపురాణ
దానము 📗

🚩 యతి చాతుర్మాస్య
సమాప్తి 🚩

🪔 నివియుక్తకాలము‌ 🪔

💧 రథ - గజ - అశ్వ - ధేను -
ఘృత‌ - సాలిగ్రామ దానములు‌ 💧

🔥 లక్షవర్తి‌ వ్రతోధ్యాపన‌ 🔥

🐄 కామ్యవృషషోత్సర్గం‌ 🐄

🎊 తులసీ వివాహోత్సవ‌ సమాప్తి 🎊

🌾 జాగరణ- ప్రతిమావ్రతము 🌾

🌴 లింగ -‌ ప్రబోధ వ్రతము 🌴

🌝 త్రిపురారి పూర్ణిమ 🌝

🎊 త్రిపురోత్సవము 🎊

🌕 సత్యపూర్ణిమా వ్రతము 🌕

🛕 బహిరామ్బువాచి‌ యాత్ర 🛕
( ఉమ్రావతీ)

🚩 శ్రీ నిరంజనానంద‌ సరస్వతీ
స్వామి జయన్తి 🚩

🎋 మహారస్‌ పూర్ణిమ 🎋

🚩 అడ్కూజీ‌ మహారాజ్
పుణ్యతిథి‌ 🚩

⛩️ జ్వాలాతోరణం ⛩️

🛕 రాంటేక్‌ శ్రీ రామచంద్ర యాత్ర 🛕

🍙 ముంబాయి శ్రీ మహాలక్ష్మీ
వార్షిక అన్నకూటోత్సవం‌ 🍙

🛕 శ్రీ మన్మధస్వామి‌ యాత్ర
కపిలధార్‌ - భీడ్‌ 🛕

🎊 హంపి శ్రీ విరూపాక్ష విద్యారణ్య
పీఠాధీశ్వర‌ సీమోల్లంగము‌ 🎊

🏳️ నయన్‌సీర్ నెదుమార
నాయనార్ గురుపూజ 🏳️

🇮🇳 బిరాస్‌ ముణ్డా‌ జయంతి 🇮🇳

🚩 శ్రీ నాథూరామ్ గాడ్సే
స్మృతి దినం 🚩

🇮🇳 ఆచార్య వినాయక్ నరహరి
భావే స్మృతి దినం 🇮🇳

🪔
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః
🪔

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

14 Nov, 23:37


ఈ ప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహమణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసీకోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల, వారికీ, వారివంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నాచరించనివారును వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి చతుర్దశాధ్యాయము - పద్నాలుగవరోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

14 Nov, 23:37


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 574 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 574 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 574. 'ప్రజ్ఞాన ఘనరూపిణీ' - 2 🌻*

*శ్రీమాత ప్రకటింపబడిన జ్ఞానరూపిణి. లవలేశమైననూ అజ్ఞాన ముచే తాక బడనది. లోపల వెలుపల ఒకే విధమగు ప్రజ్ఞతో కూడి యుండునది. ఈ కారణము చేత కూడ ఆమెను 'ప్రజ్ఞాన ఘనరూపిణి' అని కీర్తింతురు. శ్రీమాత ఘనరూపము దాల్చును అనుటలో విశేషార్థ మున్నది. ఘనమునకు ఆరు ముఖము లుండును. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క చతురస్రముగ నేర్పడును. ఒక చతురస్రమున నాలుగు లంబకోణము లుండును. ఆరు చతురస్రములందు ఇరువది నాలుగు లంబకోణము లుండును. మొత్తము ఇరువది నాలుగు (24) లంబకోణములుగ ఘనము వున్నది. ఈ ఇరువది నాలుగు తత్త్వములుగనే సృష్టి ఏర్పడును. ఇట్లు తాను ఘనరూపమై తత్వార్థ వర్ణాత్మికయై సృష్టిగ యేర్పడును. *

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 574 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 574. 'Pragynana Ghanarupini' - 2 🌻*

*Sri Mata is the expressed form of wisdom, untouched by even the slightest trace of ignorance. She is integrated within and without by the same wisdom. For this reason, she is praised as "the Embodiment of Dense Wisdom." The idea of her as a solid form holds specific significance. A solid form (cube) has six faces, each face a square. Each square has four right angles, and thus, in six squares, there are a total of twenty-four right angles. These twenty-four right angles correspond to the twenty-four fundamental principles of creation, implying that she embodies herself in this solid form and manifests as the essential elements of creation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

14 Nov, 23:37


*🌹. కార్తిక పురాణం - 14🌹*
*🌻. 14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీక మాసములో విసర్జింప వలసినవి, కార్తీక మాస శివపూజా కల్పము. 🌻*
*ప్రసాద్ భరద్వాజ*

మరల వశిష్ఠులవారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.

ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.

వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆ రాత్రియంతయు జాగరముండి మరునాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.

🌻. కార్తీకమాసములో విసర్జింపవలసినవి 🌻

ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు చేసిన కల్లుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుఓవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న సివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను.

🌻. కార్తీకమాస శివపూజాకల్పము 🌻

1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి
2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి
3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్న సింహాసనం సమర్పయామి
4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి
5. ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి
6. ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి
7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి
8. ఓం జగనాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి
9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి
10. ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి
11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి
12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి
13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి
14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి
15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి
16. ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
17. ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

🌺 తెలుగు జాబిలీ 🌺

14 Nov, 23:34


*🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం - త్రితయభోక్తా విరేషః - మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని అస్వాదించే వాడు శివుడు. - 1 to 5 షార్ట్‌ వీడియోలు 🌹*
*సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి.*
*ప్రసాద్‌ భరధ్వాజ*


🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం త్రితయభోక్తా విరేషః - 1. మెలకువ, కలలు, గాఢనిద్రా స్థితులు 🌹
ప్రసాద్‌ భరధ్వాజ
https://youtube.com/shorts/VCO3e53EhO8

🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం త్రితయభోక్తా విరేషః - 2. ఏకాగ్రత - అనుభూతి 🌹
ప్రసాద్‌ భరధ్వాజ
https://youtube.com/shorts/6_F2LSq9xpk

🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం త్రితయభోక్తా విరేషః - 3. జ్ఞానోదయం పొందిన యోగి 🌹
ప్రసాద్‌ భరధ్వాజ
https://youtube.com/shorts/LE71VHB1wuU

🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం త్రితయభోక్తా విరేషః - 4. కర్తృత్వ భావన 🌹
ప్రసాద్‌ భరధ్వాజ
https://youtube.com/shorts/2xmgJefOruA

*సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి.*
*ప్రసాద్‌ భరధ్వాజ.*

🌺 తెలుగు జాబిలీ 🌺

14 Nov, 23:34


*🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra: Tritayabhokta Viresha - The One Who Enjoys the Bliss of the Three States is Shiva. 1 to 4 Short Videos 🌹*
*Subscribe to Chaitanya Vijnaanam channel. Like and share.*
*Prasad Bharadwaj*

🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra - Tritayabhokta Viresha. - 1. Awareness, Dreaming, and Deep Sleep States. 🌹
Prasad Bharadwaj
https://youtube.com/shorts/SNefgCrOg1o

🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra - Tritayabhokta Viresha. - 2. Focused Awareness. 🌹
Prasad Bharadwaj
https://youtube.com/shorts/YO1W1WU46vQ

🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra - Tritayabhokta Viresha. - 3. Enlightened Yogi. 🌹
Prasad Bharadwaj
https://youtube.com/shorts/l3zIuBdprRA

🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra - Tritayabhokta Viresha. - 4. The Absence of Doership. 🌹
Prasad Bharadwaj
https://youtube.com/shorts/nCL4cI48E9I

*Subscribe to Chaitanya Vijnaanam channel. Like and share.*
Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹

*🌹 शिव सूत्र, भाग 1 - शंभवोपाय - 11वां सूत्र: तृतयभोक्ता वीरेशः - तीनों चेतनाओं के आनंद को अनुभव करने वाले शिव - 1 से 4 शॉर्ट वीडियो 🌹*
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें ।*
*प्रसाद भरद्वाज*

🌹 शिव सूत्र, भाग 1 - 11वां सूत्र तृतयभोक्ता वीरेशः - 1. जाग्रत, स्वप्न, और गहरी निद्रा अवस्थाएँ 🌹
प्रसाद भरद्वाज
https://youtube.com/shorts/b_ELhIB7mqc

🌹 शिव सूत्र, भाग 1 - 11वां सूत्र तृतयभोक्ता वीरेशः - 2. एकाग्रता - अनुभूति 🌹
प्रसाद भरद्वाज
https://youtube.com/shorts/VZI85kG6q14

🌹 शिव सूत्र, भाग 1 - 11वां सूत्र तृतयभोक्ता वीरेशः - 3. ज्ञानोदय प्राप्त योगी 🌹
प्रसाद भरद्वाज
https://youtube.com/shorts/JvO7Uq3OJHY

🌹 शिव सूत्र, भाग 1 - 11वां सूत्र तृतयभोक्ता वीरेशः - 4. कर्तृत्व भाव 🌹
प्रसाद भरद्वाज
https://youtube.com/shorts/DjBzUbc3vSY

चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें ।
प्रसाद भारद्वाज.
🌹🌹🌹🌹🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

14 Nov, 23:34


*🌹 కార్తీక పౌర్ణమి, దేవదీపావళి, త్రిపుర పౌర్ణమి శుభాకాంక్షలు Kartik Purnima, Dev Deepavali, Tripura Pournami, Good Wishes to All. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 కార్తీక పౌర్ణమి విశిష్ట‌త 🌻*

*పూర్వం వేదాల‌ను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినది కార్తీక పౌర్ణమినాడే. కార్తీక మాసం పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో కూడా దేవతలు దీపావళి పండుగ జరుపుకుంటారు.

కార్తీక పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారంటే.. పురాణాల ప్రకారం కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అనంతరం తారకాసురుడు ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి లను త్రిపురాసురులు అంటారు. వీరు బ్రహ్మ దేవుడుకోసం తపస్సు చేసి ఒక నగరం నిర్మించి ఇవ్వమని వరం కోరారు. అంతరిక్షంలో తిరుగుతూ వేయి సంవత్సరాలకొకసారి కలుసుకుంటూ ఉండేటట్లు.. అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు మూడింటిని ధ్వంసం చేయగలరో వారివల్ల మాత్రమే మరణం కలిగేటట్లు వరం పొందారు. ఈ వరం పొందిన తరువాత త్రిపురాసులు మూడు లోకాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్తీక పున్నమి రోజున శివుడు ఒకే బాణంతో ముగ్గురు రాక్షసులను సంహరించాడు. అందుకే దేవతలు స్వర్గంలో దీపాలు వెలిగించారు. ఈ రోజున దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు. వారికి స్వాగతం పలికేందుకు నేలపై దీపాలు వెలిగిస్తారు. పవిత్ర నదుల తీరాలు దీపాలతో ప్రకాశిస్తాయి. వారణాసిలో దేవతల దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.*

*ఈ పౌర్ణమిని కైశిక పౌర్ణమి, జీటికంటి పున్నమి, కుమార దర్శనం అనే పేర్లతో కూడా పిలుస్తారు. కార్తీక పౌర్ణమి రోజు కొన్నిచోట్ల వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. ఒక కోడెదూడను ఆబోతుగా స్వేచ్చగా కీర్తిశేషులైన పితృదేవతల ప్రీత్యర్థం వదులుతారు.*
*తమిళనాడు తిరువణ్ణామలైలో జ్యోతి స్వరూపుడై వెలిసిన శివుడి అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి వేలమంది భక్తులు తరలివెళతారు.*
*కార్తీక పౌర్ణమిరోజు వెన్నెలలో పాలు కాస్తే ఆ పాలు అమృతతుల్యం అవుతాయని విశ్వాసం. అందుకే పూర్వకాలంలో కార్తీక పౌర్ణిమ వెలుగులో పొయ్యి వెలిగించి పాలను మిరియాలతో పాటు కాచి తాగేవారు.*
*కార్తీక పౌర్ణమి రోజు ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతో పాటు దానికి అతిచేరువలోనే దేవతల గురువైన బృహస్పతి (గురుగ్రహం) కూడా ఈ రోజున సాక్షాత్కరిస్తుందని, ఆ గురుశిష్యులకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.*

*శాస్త్రాల ప్రకారం, కార్తీక మాసంలో గంగానదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం, దీపారాధాన, దీప దానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో చెరువులు, బావులు, కాలువల్లో భానుడి కిరణాల ప్రభావంతో నీటిని మరింత బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది. అంతేకాదు దేవుని పూజకు అవసరమైన పుష్పాలను అందిస్తుంది. అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని ‘హంసోదకం’ అని అంటారు. కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం మాత్రమే కాదు.. దీప దానం, శివలింగ, సాలగ్రామములను దానము చేయుట
, ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది. పురాణాల ప్రకారం, ఈ రోజున క్షీర సాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజునే కేదారేశ్వర, గౌరీ నోములు నోచుకుంటారు. కొందరు టపాసులు కాల్చి వేడుకలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించాలి. ఇలా చేయడం వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడని, తన అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది.*

*కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుంది. అలాగే లలితా సహస్రనామాలను చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం, లలిత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరీ స్తోత్రం, శివ సహస్రనామం, శివ పురాణాల పారాయణం చేసినా కూడా డబ్బుకు కొరత అనేదే ఉండదట. అదే విధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున దీప దానం, ఉసిరి కాయల దానంతో పాటు పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయాలి. అనారోగ్యంతో ఉన్న వారికి పండ్లు, పాలు వంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలొస్తాయి అని అంటారు.*

*పురాణాల ప్రకారం చంద్రుడు తమో గుణాన్ని హరిస్తాడు. అందుకే తనను పరమేశ్వరుడు తన తలపై ధరించాడు. పూర్ణిమ నాడు వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా
రాత్రి చంద్రోదయం తర్వాత పచ్చి పాలను నీటిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. కార్తీక పూర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకుని.. పూజలు పూర్తయిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారు.*
🌹🌹🌹🌹🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

14 Nov, 16:55


🙏🏻శుభ శుక్రవారం శుభోదయం🙏🏻

🌺 తెలుగు జాబిలీ 🌺

14 Nov, 08:31


https://youtu.be/x-rKNF5Fem0

🌺 తెలుగు జాబిలీ 🌺

14 Nov, 04:37


https://youtu.be/fICyBZs_PWc

🌺 తెలుగు జాబిలీ 🌺

14 Nov, 01:17


https://youtube.com/shorts/yqkfhOGcx4Q?feature=shared

*బాలల దినోత్సవ శుభాకాంక్షలు* 🥳🥳❤️


https://youtu.be/eI6CaBTDSm8?si=BdmLANnjWR_xLow4

*బాలల దినోత్సవ - చేయవలసిన కార్యక్రమాలు*

https://youtu.be/IFieoQyhBKU

🥳🥳

🌺 తెలుగు జాబిలీ 🌺

13 Nov, 23:38


*🌹 కార్తిక పురాణం - 13 🌹*
*🌻 13వ అధ్యాయము - కన్యాదాన ఫలము - సువీర చరిత్రము 🌻*
*ప్రసాద్ భరద్వాజ*

ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై అలకి౦పుము.

కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షణ తా౦బూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, అ పాపములన్నియు పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన౦దువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తి శ్రద్దలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్దగా అలకి౦పుము.

🌻 సువీర చరిత్రము 🌻

ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు"డను ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్యకలదు. ఒక సారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందోక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికి శుక్ల పక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతిగారబముతో పెరుగుచుండెను, ఆమె చూచు వారలకు కనులపండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచినకొలదీ, బాలికకు నిండు యౌవనదశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై అ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు "ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు"నని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైననూ లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను.

అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంత మంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖముగా వుండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరుల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.

ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని "ఓయీ! నీవెవ్వడవు? నీ ముఖ వర్చస్సుచూడ రాజవంశమునందు జన్మించిన వానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశ్నించగా, సువీరుడు "మహానుభావా! నేను వంగదేశమును నేలుచుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకముకంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్ఠుడనియినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే యింత వరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా,

🌺 తెలుగు జాబిలీ 🌺

13 Nov, 23:38


కార్తిక పురాణం 13 - 2వ భాగం

"ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించిన వారు 'అసిపత్రవన' మను నరకమనుభవింతురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహా నరకమనుభవించును. కన్యావిక్రయము జేసినా వారికీ యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన యెడల గంగాస్నాన మొనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును" అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి "ఓ మునివర్యా! దేహసుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమంటారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణి౦పగలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యాదానము మాత్రము చేయను" అని నిక్కచిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.

మరి కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.

అంతటా శ్రుతకీర్తి "నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?"నని మనమునందుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి, నమస్కరించి "ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధర్మముర్తివి, బుద్దిశాలివి. ప్రాణకోటినంతను సమంగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు" అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి "శ్రుతకీర్తి! నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి? నీ వంశియుడగు సువీరుడు తన జ్యేష్టపుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు యిటు మూడు తరములవారు అటు మూడు తరములవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమును భావించుటయే గాక, నీచ జన్మలెత్త వలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన, నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కెగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమొనర్చినను కన్యాదాన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము" అని పలికెను.

శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటిరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసికొనెను.

కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీకమాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు. విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము - పదమూడో రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

13 Nov, 23:36


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 574 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 574 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 574. 'ప్రజ్ఞాన ఘనరూపిణీ' - 1 🌻*

*ఘనీభవించిన ప్రజ్ఞానరూపిణి శ్రీమాత అని అర్థము. ఘనము పరిపూర్ణరూపము. గోళము మరియొక పరిపూర్ణ రూపము. శ్రీమాత ఘనరూపిణి అనగా అవతరణము చెంది ఘనమై నిలచిన ప్రజ్ఞ అని అర్థము. చతురస్రము అవతరణమునకు, వృత్తము తిరోగమనమునకు సంకేతములు. దేవతల నారాధించినపుడు వారి నాహ్వానించుటకు, వారి అవతరణకు చతురస్రములగు పీఠముల నేర్పరచ వలెను. ఊర్ధ్వలోకములకు ఆరోహణము చేయువారు వృత్తాకారమును వినియోగింతురు. సృష్టి నేర్పరచు శ్రీమాత ఘనరూపము వహించును. సృష్టి మొదట గోళముగ వ్యక్తమైననూ అటుపైన ఘన రూపము దాల్చును. తిరోధానమందు మరల ఘనము గోళమై, గోళము అవ్యక్తమును చేరును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 574 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 574. 'Pragynana Ghanarupini' - 1 🌻*

*This means Sri Mata (the Divine Mother) is the embodiment of dense, concentrated wisdom. "Ghanam" signifies completeness, wholeness. A sphere is also a symbol of completeness. Thus, Sri Mata as "Ghanarupini" implies that she is wisdom incarnate, solidified in form. In spiritual symbolism, a square often represents descent or manifestation, while a circle represents ascension or return. When invoking deities, they are often invited to manifest in the space of a square platform, while circles represent the realms towards which aspirants ascend. Sri Mata manifests as the structure of creation, which initially appears as a sphere and then takes on a solid form. In dissolution, this solid form returns to a sphere and finally to the unmanifest.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

12 Nov, 00:52


🕉️

పంచాంగము 🌓 12.11.2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక

పక్షం: శుక్ల - శుద్ధ

తిథి: ఏకాదశి ప‌.12:46 వరకు
తదుపరి ద్వాదశి

వారం: మంగళవారం - భౌమవాసరే

నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.03:48 వరకు
తదుపరి రేవతి

యోగం: హర్షణ రా.06:50 వరకు
తదుపరి వజ్ర

కరణం: భధ్ర ప‌.12:46 వరకు
తదుపరి బవ రా.11:35 వరకు
తదుపరి బాలవ

వర్జ్యం: ప‌.02:25 - 03:54 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.08:36 - 09:21
మరియు రా.10:41 - 11:32

రాహు కాలం: ప‌.02:50 - 04:15

గుళిక కాలం: ప‌.12:00 - 01:25

యమ గండం: ఉ‌.09:09 - 10:35

అభిజిత్: 11:38 - 12:22

సూర్యోదయం: 06:19

సూర్యాస్తమయం: 05:40

చంద్రోదయం: ప‌.02:55

చంద్రాస్తమయం: రా.02:25

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: మీనం

దిశ శూల: ఉత్తరం

🎋 భోధనైకాదశి 🎋

🚩 సంత్ నామ్‌దేవ్ జయంతి 🚩

🌲 దేవ ఉత్థాన ఏకాదశి 🌲

🪔 జాగరణము 🪔

🎍 కైశిక‌ - చిలుకు ఏకాదశి 🎍

💧 పుష్కర్‌రాజ్ స్నాన‌ పర్వారంభం 💧

🛕 గురువాయుర్‌ ఏకాదశి 🛕

🚩 శ్రీ వేదనిధితీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

💧 భీష్మపంచక వ్రతము‌ 💧

🍚 పంచగవ్య స్నానము - సేవన 🍚

🔮 కుంభదానము 🔮

⚛️ తులసి పద్మ వ్రతము ⚛️

🌱 ద్విదళవ్రత‌ సమాప్తి 🌱

🛕 పండరీపూర్‌ యాత్ర 🛕

📿 తులసి - ధాత్రి కాష్ఠ‌ మాలాధారణ‌ 📿

🌴 చాతుర్మాస్యనియమ
సమాప్తి 🌴

🪔 శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్య
జయన్తీ 🪔

🪷 గోపద్మవ్రత‌ సమాప్తి 🪷

🎉 పంచపర్వారంభం‌ 🎉

🎊 విష్ణు ప్రభోదనోత్సవం‌ 🎊

🛕 మేల్కోటే‌ శ్రీ చలువనారాయణ‌
స్వామి రథోత్సవం 🛕

🎊 ఉజ్జయిని శ్రీ కాళిదాస్
స్మృతి సమరోహ్‌ ఉత్సవం 🎊

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

12 Nov, 00:28


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 573 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 573 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 573. 'పరానిష్ఠా' - 1 🌻*

*పరము నందే నిష్ఠ గలది శ్రీమాత అని అర్థము. పరమే శివము, సత్యము అని మరల మరల చెప్పవలసి యున్నది. పరమే శ్రీమాత స్వస్థానము. ఆమె పరమును వీడి యుండజాలదు, వుండుట కిచ్చపడదు. శివునితో అవినాభావ సమ్యక్ బంధము కలది. అట్టి శ్రీమాత కేవలము జీవకోట్ల కోసము, వారిపై తనకు గల అపార ప్రేమ కారణముగ నవావరణ సృష్టి గావించును. సృష్టి నిర్మాణము, పాలనము, ఇత్యాదివి గావించుట మహత్తరమగు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా కలాపము. ఇట్టి కలాప మందున్ననూ శివుని వీడక యుండును. శివునితో నుండియే సర్వమునూ నిర్వహించును. ఇది అనుపమానము. అనన్య సాధ్యము. శివుని యందుండి సృష్టిగా వ్యాప్తిచెంది అందు జీవులను ప్రవేశింపజేసి వారి పరిణామ కథను నిర్వర్తించుచూ కాలానుసారము ప్రళయములను గావించుచూ అత్యద్భుతమగు విన్యాసమును శ్రీమాత నేర్పుచు నుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 573 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 573. 'Paranishta' - 1 🌻*

*The meaning of "Shrimata" is that she is firmly established in the Supreme. The Supreme itself is Shiva, the eternal truth, and it must be repeatedly emphasized. The Supreme is the true abode of Shrimata. She cannot be separated from the Supreme, nor can she be apart from it. She has an inseparable, complete bond with Shiva. Out of her immense love for the countless beings, Shrimata manifests the creation of the nine enclosures (Navavarana). The activities of creation, maintenance, and dissolution are grand expressions of her will, knowledge, and action. Even in these activities, she remains inseparable from Shiva, and she conducts everything by being united with him. This is incomparable and beyond the capacity of any other. From within Shiva, she spreads as creation, allowing beings to enter and experience their evolutionary journeys, and, over time, she brings forth dissolutions in an extraordinary display of cosmic orchestration.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

12 Nov, 00:27


🙏🏻ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు🙏🏻

🌺 తెలుగు జాబిలీ 🌺

12 Nov, 00:25


ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతడు బాల్యము నుండి మిత్రుడైయున్న వాి నొకనిని చంపి వానిధనము అపహరించి ఇతరదేశమునకు బోవుచున్నంతలో నీభర్తచేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు బడియున్నాడు. ఈమూడవవాడు కిరాతుడు. వీడు నీభర్తను యీబ్రాహ్మణుని యిద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈనాల్గవవాడు, పులి, కిరాతులు పరస్పర ఘాతములచేత మృతినొందిరి. ఈపులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశినాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలనొందుచున్నారు. ద్వాదశినాడు నేయి వాడవలెను. నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏపుణ్యము చేత వీరు నరకమునుండి ముక్తులగుదురని యడిగెను. ఆమాటవిని దూతలిట్లనిరి. అమ్మా! కార్తీకమాసమందు నీచేత చేయబడిన పుణ్యమందు పురాణశ్రవణఫలమును నీభర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆపురాణశ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాతవ్యాఘ్రములకు సమానముగానిమ్ము. దానివలన వారు ముక్తులగుదురు.

పురాణశ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు బోయి ప్రజలను బిలిచిన పుణ్యమును ఈకృతఘ్నునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానములచేత వారు వారు ముక్తులగుదురు. విష్ణుదాతలమాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణస్త్రీ ఆయా పుణ్యములను వారివారికిచ్చెను. దానిచేత వారు నరకము నుండి విడుదలయై దివ్యమానములనెక్కి ఆస్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తిపదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీకమాసమందు పురాణశ్రవణమును జేయువాడు హరిలోకమందుండును.

ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయములచేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును బొందుదురు.

ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకాదశోధ్యాస్సమాప్తః
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

12 Nov, 00:25


🌹. కార్తీక పురాణం - 11 🌹
🌻 11 వ అధ్యాయము : మంధరుడు - పురాణ మహిమ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము. కార్తీకమాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణవ్రత ఫలము పొందును.

కార్తీకమాసమందు గరికతోను, కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. కార్తీకమాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమునొందును. కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలనుంచువాడును, పురాణమును జెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నియును నశింపజేసుకొని పరమపదమును బొందుదురు.

ఈ విషయమై యొక పూర్వకథగలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములనిచ్చును. బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెద వినుము.

కళింగదేశమందు మంధరుడను నొక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు.

అతనికి మంచిగుణములు గలిగి సుశీలయను పేరుగల భార్యయుండెను. ఆమె పతివ్రతయు, సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలైయుండెను.

ఓరాజా! ఆసుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతనియందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలిజీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని యుండి దారి నడుచువారిని కొట్టి వారి ధనములనపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యమువలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యముకొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గానవచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రిచెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఆ యిద్దరు బ్రాహ్మణులను చంపి ఆధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్దపులి కిరాత మనుష్యగంథమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారములచేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒక చోట మృతినొంది యమలోకమునకు బోయి కాలసూత్ర నరకమందు యాతన బడిరి. యమభటులు వారినందరిని పురుగులతోను, అమేధ్యముతోను కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలకాగుచున్న రక్తమందు బడవైచిరి. జనకమహారాజా! ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును జేయుచు నిరంతరము భర్తను ధ్యానించు చుండెను.

ఓ రాజా! ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామముచేయుచు నాట్యముచేయుచు పులకాంకితశరీరుడై హరినామామృతమును పానముచేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద భాష్పయుతుడై ఆమె యింటికి వచ్చెను. ఆమెయు ఆయతిని జూచి భిక్షమిడి అయ్యా యతిపుంగవా! మీరు మాయింటికి వచ్చుటచేత నేను తరించితిని. మీవంటివారి దర్శనము దుర్లభము. మాయింటివద్ద నా భర్తలేడు. నేనొక్కదాననే పతిధ్యానమును చేయుచున్నదానను. ఆమె యిట్లుచెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునయిన ఆమెతో ఇట్లనియెను. అమ్మాయీ! ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈదిన సాయంకాలము హరిసన్నిధిలో మీయింటిలో పురాణ పఠనము జరుపవలెను, ఆపురాణమునకు దీపముకావలెను. నూనె తెచ్చెదను. గనుక వత్తి నీవు చేసిఇమ్ము. శ్యామయనగా యౌవనవతియని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆచిన్నది విని సంతోషముతో గోమయముతెచ్చి ఆయిల్లు చక్కగా అలికినదై అందు అయిదురంగులతో ముగ్గులను బెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆదూదిచే రెండు వత్తులను జేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆచిన్నది దీపపాత్రను, వత్తిని తాను యిచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆదీపమునందు హరిని బూజించి మనశ్శుద్ధి కొరకై పురాణ పఠన మారంభించెను.

ఆమెయు ప్రతి యింటికి బోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యధేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను. అంతలో శంఖచక్రాంకితులును, చతుర్బాహులును, పద్మాక్షులును, పీతాంబరధారులునునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోను, ముత్యాలతోను, పగడములతోను, రచించిన మాలికలతోను, వస్త్రములతోను, ఆభరణములతోను అలంకరించబడిన విమానమును దీసికొని క్వచ్చి సూర్యుడువలె ప్రకాశించెడి ఆవిమానమందు ఆమెను ఎక్కించి జయజయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకుబోవుచు మధ్యమార్గమందు నరకమును జూచి అచ్చట తనపి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమొంది విష్ణుదూతలతోనిట్లు పలికెను.

ఓ విష్ణుదూతలారా! నిమిషమాత్రము ఉండండి. ఈనరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈవిషయమును నాకు జెప్పుడు. వీడు నీభర్త, వీడు కూలిచేసియు, దొంగతనమును జేసియు పరధనాపహరణము జేసినాడు. వేదోక్తమయిన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరక మందున్నాడు.

🌺 తెలుగు జాబిలీ 🌺

12 Nov, 00:25


🌹 Secrets of the Soul’s Journey - Part 1: 1 to 5 Short Videos 🌹
Prasad Bharadwaj

🌹 Secrets of the Soul’s Journey - Part 1: The True Spiritual Practice is a Journey Towards Eternity - 1. Inner Awareness 🌹
Prasad Bharadwaj
https://youtube.com/shorts/3OByhnctL-c

🌹 Secrets of the Soul’s Journey - Part 1: The True Spiritual Practice is a Journey Towards Eternity - 2. Awareness of Existence is Eternal 🌹
Prasad Bharadwaj
https://youtube.com/shorts/xFCUGeTdGh4

🌹 Secrets of the Soul’s Journey - Part 1: The True Spiritual Practice is a Journey Towards Eternity - 3. Pure Consciousness 🌹
Prasad Bharadwaj
https://youtube.com/shorts/LR48cvbqZ_c

🌹 Secrets of the Soul’s Journey - Part 1: The True Spiritual Practice is a Journey Towards Eternity - 4. Inner Reflection 🌹
Prasad Bharadwaj
https://youtube.com/shorts/cyQG94PQN8I

🌹 Secrets of the Soul’s Journey - Part 1: The True Spiritual Practice is a Journey Towards Eternity - 5. Consciousness of the Soul 🌹
Prasad Bharadwaj
https://youtube.com/shorts/DcZTBuyomRY
🌹🌹🌹🌹🌹

*🌹 आत्मा यात्रा के रहस्य - भाग 1: 1 से 5 लघु वीडियो 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 आत्मा यात्रा के रहस्य भाग 1 - शाश्वत की ओर यात्रा ही सच्ची आत्म-साधना है - 1. आंतरिक जागरूकता 🌹*
*प्रसाद भारद्वाज*
https://youtube.com/shorts/rkZGbXGZUu0

*🌹 आत्मा यात्रा के रहस्य भाग 1 - शाश्वत की ओर यात्रा ही सच्ची आत्म-साधना है - 2. "मैं हूँ" का ज्ञान शाश्वत है 🌹*
*प्रसाद भारद्वाज*
https://youtube.com/shorts/v5IM5aKv_ZM

*🌹 आत्मा यात्रा के रहस्य भाग 1 - शाश्वत की ओर यात्रा ही सच्ची आत्म-साधना है - 3. शुद्ध चेतना 🌹*
*प्रसाद भारद्वाज*
https://youtube.com/shorts/pn74SibU8wE

*🌹 आत्मा यात्रा के रहस्य भाग 1 - शाश्वत की ओर यात्रा ही सच्ची आत्म-साधना है - 4. अंतर्मुखता 🌹*
*प्रसाद भारद्वाज*
https://youtube.com/shorts/BhKbkdUdMtY

*🌹 आत्मा यात्रा के रहस्य भाग 1 - शाश्वत की ओर यात्रा ही सच्ची आत्म-साधना है - 5. आत्मा की चेतना 🌹*
*प्रसाद भारद्वाज*
https://youtube.com/shorts/7CucvV0laZU
🌹🌹🌹🌹🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

11 Nov, 15:37


*Conventions of Writing*

Class-5

https://youtu.be/phir0THS-Mg

*Class-4*

https://youtu.be/ZjutoeOfSPg?si=x4cyGB8FCCbmjqNf

https://youtu.be/WSkiClIfCqM?si=HBwYxT1ruL8R3Jn4

.......... @............ @...........

🌺 తెలుగు జాబిలీ 🌺

11 Nov, 14:00


~~~~
*Dear teachers,*


*The ways to make children write or form sentences on their own*....
*Watch these videos and share it to all in your mandal groups*... 🙏

https://youtu.be/qBzvhDfvEG0 -1

*ప్రాథమికంగా వాక్యాలు తయారు చేయడం*👆👆

https://youtu.be/ADcn6Okjkv4 - 2

*చేయగలిగే /చేయలేని పనులు ఆంగ్లం లో చెప్పడం/రాయడం*👆

https://youtu.be/3MskEuqbmPg -3

*ప్రస్తుత మీరేమి చేస్తున్నారో సంభాషణ లో చెప్పటం /రాయటం*

https://youtu.be/7hq-4ZUmu34


*ఫోన్ లో మర్యాద గా సంభాషించే విధానం*👆
https://youtu.be/K-Y24s8BLdA

నీవు ఏమి యాక్షన్ చేస్తున్నావో చెప్పుకోవడం 👆
https://youtu.be/abadftsIWCk

నీవు పొందబోతున్నవి, నీవు స్వాధీనపర్చుకోబోతున్నవి చెప్పడం 👆


*Hit the like icon , Share it with your friends and colleagues and if u haven't subscribed yet Do subscribe my channel and hit the bell icon to get notified on my latest uploads*...

*Up for now*...;)😊



👍👍👍👍👍👍👍

🌺 తెలుగు జాబిలీ 🌺

11 Nov, 12:56


https://youtu.be/EyI6FSTTkOM

🌺 తెలుగు జాబిలీ 🌺

11 Nov, 08:36


https://youtu.be/dzmaTOHfZhg

🌺 తెలుగు జాబిలీ 🌺

11 Nov, 04:12


https://youtu.be/Ujycky-7MVc

🌺 తెలుగు జాబిలీ 🌺

10 Nov, 22:56


🕉️

పంచాంగము 🌓 11.11.2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక

పక్షం: శుక్ల - శుద్ధ

తిథి: దశమి ప‌.02:57 వరకు
తదుపరి ఏకాదశి

వారం: సోమవారం - ఇందువాసరే

నక్షత్రం: శతభిషం ఉ‌.06:52 వరకు
తదుపరి పూర్వాభద్ర రా.తె.05:28 వరకు
తదుపరి ఉత్తరాభద్ర

యోగం: వ్యాఘత రా.10:17 వరకు
తదుపరి హర్షణ

కరణం: గరజ ప.02:57 వరకు
తదుపరి వణిజ రా.01:51 వరకు
తదుపరి భధ్ర

వర్జ్యం: ప‌.11:54 - 02:24 వరకు

దుర్ముహూర్తం: ప‌.12:22 - 01:08
మరియు ప‌.02:39 - 03:24

రాహు కాలం: ఉ‌.07:44 - 09:09

గుళిక కాలం: ప‌.01:25 - 02:50

యమ గండం: ఉ‌.10:34 - 12:00

అభిజిత్: 11:38 - 12:22

సూర్యోదయం: 06:19

సూర్యాస్తమయం: 05:41

చంద్రోదయం: ప‌.02:15

చంద్రాస్తమయం: రా.01:27

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కుంభం

దిశ శూల: తూర్పు

🎋 రాజ్యవ్యాప్తి‌ దశమి వ్రతం 🎋

🚩 శ్రీ విజయదాసర‌ పుణ్యతిథి‌ 🚩

🌾 సార్వభౌమ వ్రతము 🌾

🍽️ ఏకభుక్తము 🍽️

🚩 శ్రీ యాజ్ఞవల్క్య జయన్తీ 🚩
( మతాంతరం‌ )

🏳️ బాబా లాల్‌దయాళ్‌
పుణ్యతిథి‌ 🏳️

👺 కంసాసుర‌ వధ‌ 👺

🎉 భీష్మపంచక‌ వ్రతారంభం‌ 🎉
( మతాంతరం)

🪔 వెల్లాల సదాశివశాస్త్రి
జయన్తీ 🪔

🚩 శ్రీ సత్యవీరతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

🏳️ శ్రీ అవధూతానంద‌స్వామి‌
మహారాజ్ పుణ్యతిథి‌ 🏳️

☘️ కార్తీక సోమవారం ☘️

🎊‌ తిరుమాలిరుంచోలై శ్రీ
సుందరరాజ పెరుమాళ్
ఉత్సవారంభం‌ 🎊

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

10 Nov, 15:53


🙏🏻శుభ కార్తీక సోమవారం శుభోదయం🙏🏻

🌺 తెలుగు జాబిలీ 🌺

10 Nov, 05:49


_Sunday- Stories_

The Talking Cave

https://youtu.be/PiAbFaGiK6E

[  Achanta Mani: *Moral stories for kids*
=========@==========

Hello... All Here are moral stories for you👇

Sunday Special

- Story time
*Learn English @Sories/Moral stories/Animated /DCR classes 👇*


*#Moralstories*

The Talking Cave
https://youtu.be/PiAbFaGiK6E?si=boKM9ftVpn3aorj0


https://youtu.be/O03onYE5ghc?si=T9xx7BEn8sUSpsyd
The clever Goat👆🏼

https://youtu.be/b-pGKoG0tGM?si=KT1D19iydK5NF9yO

Birbal's Wisdom 👆🏼

https://youtu.be/KzvJLTGK6GY?si=tR_eiu169eWXU58F

The golden Swan👆🏼
https://youtu.be/chIqCA6keA4?si=ewlDvvo60CIKC8pn

The dog and the donkey 👆🏼

https://youtu.be/84HcVetKERE?si=_eo06yRNg8WmPktC

The proud Rose👆🏼

https://youtu.be/9Hu6B4hlKd4?si=yqHyY8c0m3LlXMfx

The blind man with a lamp👆🏼

https://youtu.be/9iXI9yPFYTw

wicked and Kind 👆🏽

https://youtu.be/pmfNke8lBNI

The ant and the grasshopper 👆🏽
https://youtu.be/tAVpvcuv7Do

A glass of milk👆🏽

https://youtu.be/1r0N9VkZjig

A good farmer 👆🏽

https://youtu.be/TbbLg3eg5VI

*The little Golden Fish* 👆🏽

https://youtu.be/w8EqDIiPMJs

*A good message*

https://youtu.be/SGg763c-rXs

*Unity is strength*

https://youtu.be/kwcysCgwLWA

*A good conversation*

https://youtu.be/7C1zVpWrYSY

*The loyal Mangoose*

https://youtu.be/jItZyyfptyk

Value what you have- a deer story
https://youtu.be/b5hOdkft-C4

A donkey in lion's skin


https://youtu.be/7J6UhLPci4A

The curious farmer✨️

https://youtube.com/shorts/R4Uwqa6ykGU?feature=share

🌿The Dog and The OX🌿

https://youtube.com/shorts/CYHKskml54c?feature=share

The crows and the serpent

https://youtu.be/vMGhXf9xpCQ

✨️Strong or Weak✨️

https://youtu.be/eGT7yymQIo0

Cycle of Evil

https://youtu.be/gPAeMHWQCO8

✨️Boy's weakness ✨️

https://youtu.be/eLaU9BRSu5g

✨️The struggles of our life✨️

https://youtu.be/3iMrGJDtkaM

✨️Why do we need a friend/master in our life✨️

https://youtu.be/obLToOfy8Wo

✨️Self-respect and Honesty ✨️

https://youtu.be/y9O5mT3VCnw

✨️Stay strong and keep the faith✨️

https://youtu.be/3yi6TJ4RiIs

✨️Don't desire to walk when you have wings to fly.✨️

https://youtu.be/gIV72yK-Ql8

✨️Team spirit✨️

https://youtu.be/wNThKyj4Jck

✨️Sharanagathi ✨️


I am sharing 'Moral stories' with you..

Get inspired every moment :)

Hope You Loved This Story during these difficult and  hard times

Keep Supporting for more stories of this kind❤️

Like, Share and subscribe.

🌺 తెలుగు జాబిలీ 🌺

09 Nov, 23:32


🕉️

పంచాంగము 🌓 10.11.2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక

పక్షం: శుక్ల - శుద్ధ

తిథి: నవమి సా.05:02 వరకు
తదుపరి దశమి

వారం: ఆదివారం - భానువాసరే

నక్షత్రం: ధనిష్ఠ ఉ‌.08:06 వరకు
తదుపరి శతభిషం

యోగం: ధృవ రా.01:22 వరకు
తదుపరి వ్యాఘత

కరణం: కౌలువ సా.05:02 వరకు
తదుపరి తైతుల రా.తె.04:01 వరకు
తదుపరి గరజ

వర్జ్యం: ప‌.02:56 - 04:27 వరకు

దుర్ముహూర్తం: సా.04:10 - 04:55

రాహు కాలం: సా.04:15 - 05:41

గుళిక కాలం: ప‌.02:50 - 04:16

యమ గండం: ప‌.12:00 - 01:25

అభిజిత్: 11:37 - 12:21

సూర్యోదయం: 06:18

సూర్యాస్తమయం: 05:41

చంద్రోదయం: ప‌.01:35

చంద్రాస్తమయం: రా.12:29

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కుంభం

దిశ శూల: పశ్చిమం

🪷 అక్షయ నవమి 🪷

⚜️ దుర్గా నవమి ⚜️

🌳 ధాత్రి నవమి 🌳

🌴 ఆమలక‌ - అశ్వత్థ పూజ 🌴

💧 ఆజ్మేర్‌ పుష్కర్‌ మేళా 💧

🍈 కూష్మాండ నవమి 🍈

🌤️ కృత - సత్య‌ యుగాది‌ 🌤️

🌊 సముద్ర స్నానం 🌊

🍐 గుమ్మడికాయ దానము 🍐

🏔️ మధుర-బృందావనం
జుగళ్‌ జోడి పరిక్రమ‌ 🏔️

🎋 విష్ణుత్రిరాత్ర‌ వ్రతం 🎋

🔱 జగద్దాత్రి‌ - చండిక‌ పూజ 🔱

🚩 శ్రీ రంగ‌‌ అవధూత జయన్తీ 🚩

🏳️ బెల్లంకొండ రామరాయ
కవీంద్ర పుణ్యతిథి‌ 🏳️

🚩 కంచి జగద్గురు శ్రీ పరిపూర్ణబోధైంద్ర‌
సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩

🏳️ శ్రీ సాయి లీలాషాహాజీ‌
మహారాజ్ పుణ్యతిథి‌ 🏳️

🚩 శ్రీ ప్రజ్ఞాధిరాజతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

🏳️ శ్రీ గోవిందబాబా‌ రోధే‌
పుణ్యతిథి‌ 🏳️

🎊 తంజావూరు రాజరాజ చోళ‌
సదయ‌ ఉత్సవం 🎊

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

09 Nov, 00:37


🕉️

పంచాంగము 🌓 09.11.2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక

పక్షం: శుక్ల - శుద్ధ

తిథి: అష్టమి రా.06:40 వరకు
తదుపరి నవమి

వారం: శనివారం - ముదవాసరే

నక్షత్రం: శ్రవణం ఉ‌.08:57 వరకు
తదుపరి ధనిష్ఠ

యోగం: గండ ఉ‌.06:19 వరకు
తదుపరి వృధ్ధి రా.తె.03:39 వరకు
తదుపరి ధృవ

కరణం: భధ్ర ఉ‌.07:23 వరకు
తదుపరి బవ రా.06:40 వరకు
తదుపరి బాలవ

వర్జ్యం: ప‌.12:49 - 02:21 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.06:18 - 07:44

రాహు కాలం: ఉ‌.09:09 - 10:34

గుళిక కాలం: ఉ‌.06:18 - 07:43

యమ గండం: ప‌.01:25 - 03:50

అభిజిత్: 11:37 - 12:21

సూర్యోదయం: 06:18

సూర్యాస్తమయం: 05:41

చంద్రోదయం: ప‌.12:53

చంద్రాస్తమయం: రా.12:29

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: మకరం

దిశ శూల: తూర్పు

🐄 గోపాష్టమి‌ - గోష్ఠాష్టమి 🐄

🐂 గోపూజ - ప్రదక్షిణ 🐂

💧 యమునానది స్నానం 💧

🏔️ మధురపురి‌ ప్రదక్షిణ 🏔️

⚜️ దుర్గాష్టమి ⚜️

🏳️ శ్రీ శంకర్ మహారాజ్
జయన్తీ‌ 🏳️

🚩 కంచి జగద్గురు శ్రీ
బ్రహ్మానందఘనైంద్ర సరస్వతి
స్వామి పుణ్యతిథి 🚩

🏳️ శ్రీ బాపూజీ భండారి‌
పుణ్యతిథి‌ 🏳️

🛕 శృంగేరి విద్యాశంకర‌
రథోత్సవం 🛕

🏳️ పూదత్తళ్వార్‌ తిరునక్షత్రం 🏳️

🎊 కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి
కిరణోత్సవం 🎊

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

08 Nov, 23:43


🌹. కార్తీక పురాణం - 8 🌹
🌻 8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామీళుని కథ. 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

వశిష్టుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు: 'మహర్షీ! మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలయిన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు' అని సమస్త ధర్మ శాస్త్రాలలోను ఘోషిస్తుండగా, కేవలం కార్తీక వ్రతాచరణా ధర్మలేశము చేతనే సమస్త పాపాలూ హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది యెలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్య మాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యముగాని మహాపర్వతాన్ని కేవలము కొనవ్రేలి గోటితో కూల్చడము సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతూన్న యింటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురిషెడు నీళ్లు జల్లినంత మాత్రాన, అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహములోనో కొట్టుకుని పోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా ? తనకు తానై కొండచరియలలోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాతవేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్ఠా! ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్లు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులూ, పుణ్యాత్ములూ ఎలా అవుతారు ? వీటికి సమాధానమేమిటి ?
జనకుడి ప్రశ్నకు జ్ఞానహసమును చేస్తూ - ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు.

🌻. జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు

వశిష్ఠ ఉవాచ:
మంచి విమర్శే చేశావు మహారాజా! చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలేగాని, స్ధూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదిగాక, వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మసూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను - స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తూంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్ప నల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతియైన 'మహామాయ' కారణంగా సత్వర జస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి.

తర్కము- దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దానధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్ధూలస్వరూపాలు. ఇవి తమోగుణము వలన యేర్పడతాయి. వీటిల్లో - సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాలయోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. 'దేశము' అంటే పుణ్యక్షేత్రం, కాలము అంటే పుణ్యకాలము. యోగ్యత అంటే - పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్లు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలూ తమాసాలు - వీటివలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా! జనకరాజా! అన్నిటికి కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికి మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరంచే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్న పూర్వకముగానైనా ఆచరించాలి. ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా! పర్వతమంత యెత్తు కట్టెలను పేర్చి, వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే -ఆ అగ్నికణము ఆ కట్టెలనెలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లనెలా తొలగిస్తుందో, గుండిగెడు మురికినీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో - అదే విధంగా తెలిసిగాని, తెలియకగాని పుణ్యకాలములో, పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచిరంచే ధర్మము అనంత పాపాలనూ దగ్ధం చేసి, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకుదాహరణగా ఒక కథ చెబుతాను విను.

🌻. అజామిళో పాఖ్యానము 🌻

బహుకాలం పూర్వం కన్యాకుబ్జక్షేత్రవాసీ, సార్ధక నామధేయుడూనైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామీళుడనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు. దాసీ సాంగత్యపరుడు, హింసా ప్రియుడుగా వుండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాడితో సాంగత్యమును పెట్టుకొని, తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయానాదులన్నిటినీ నిర్వర్తిస్తూ, కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడచిపెట్టి, కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదలివేశారు. కులము వాళ్లు వెలివేశారు. అందువలన యిల్లు వదలిపెట్టి పోవలసి వచ్చిన అజామిళుడు ఛండాలపువాడలోని ఒకానొక దాసీ దానితో కాపురము పెట్టి, కుక్కలనూ, మృగాలనూ ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికకే జనాలలో లీనమై, మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు.

Continues in page 2..

🌺 తెలుగు జాబిలీ 🌺

08 Nov, 23:43


Cont.. From Page 1
కార్తీక పురాణం - 8

ఇలా వుండగా, ఒకనాడతని ప్రియురాలైన దాసీది, కల్లు తాగడం కోసం తాడిచెట్టునెక్కి, కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు.

అప్పటికే ఆ దాసీ దానికి యవ్వనవతియైన కూతురు వుంది. మహాపాపాత్ముడూ, మహా కామాంధుడూ అయిన అజామిళుడు, తనకి కూతురు వరుసని కూడా తలచకుండా - ఆ పిల్లనే వరించి, ఆమెతోనే కామోపభాగాలనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు, తన కూతురి యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కాని వాళ్లందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా, కడగాపుట్టి మిగిలిన బిడ్డకు 'నారాయణ' అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిదురిస్తున్నా ఏం చేస్తున్నాసరే - సతతం అతనినే స్మరించుకుంటూ 'నారాయణా - నారాయణా' అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ వుండేవాడు. కాలము గడచి అజామిళుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకుగాను - ఎర్రని గడ్డములు - మీసములు కలిగి, చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు.

వారిని చూస్తూనే గడగడలాడి పోయిన అజామిళుడు, ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక, ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి వున్న కుమారునికోసమై 'నారాయణా, ఓ నారాయణా! తండ్రి నారాయణా'! అని పలుమారులు పిలవసాగాడు.

ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూ లేదు. కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ 'నారాయణ' నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు - 'ఓ యమదూతలారా! అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకొని పోబడదగినవాడేగాని, మీరు తీసుకొని వెళ్లదగిన వాడు కాదు' అని హెచ్చరించారు. వికసిత పద్మాలవలే విశాలమైన నేత్రాలు కలవాళ్లూ, పద్మమాలాంబర వసనులూ అయిన ఆ పవిత్ర విష్ణుపారిషదులను చూసి, విభ్రాంతులైన యమదూతలు 'అయ్యా! మీరెవరు? యక్ష గంధర్వ సిద్ద చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందిన వారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసికొని వెళ్ళనున్న ఈ జీపుని మీరెందుకు తీసికొని వెడుతున్నారు?' అని అడగడంతో, విష్ణుదూతలులిలా చెప్పసాగారు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే
అష్టమ అధ్యాయౌ స్సమాప్తః
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

08 Nov, 23:29


*🌹 Secrets of the Soul's Journey - Part 1 - True spiritual practice is about shifting our focus from external, temporary things to internal, eternal realities. 🌹*
*Prasad Bharadwaj*
https://youtu.be/XlzBldGSJJY

*This text explores the nature of consciousness and the impermanence of external experiences. It emphasizes the importance of inner awareness and understanding that while the external world and its events are temporary, the realization of "I am" is constant and eternal. The text encourages turning inward to recognize the transient nature of the world and to seek the unchanging truth within.*
🌹🌹🌹🌹🌹

*🌹 चैतन्य के बीज - भाग 1 -सच्चा आत्म साधन वही है जो हमारी दृष्टि को बाहरी, अस्थायी चीजों से आंतरिक, शाश्वत चीजों की ओर मोड़ता है।🌹*
*प्रसाद भारद्वाज*
https://youtu.be/YSYFeIMJzBU

*यह पाठ चेतना के स्वभाव और बाहरी अनुभवों की अस्थिरता की चर्चा करता है। इसमें आंतरिक जागरूकता और इस समझ पर जोर दिया गया है कि जबकि बाहरी दुनिया और इसके घटनाएँ अस्थायी हैं, "मैं हूँ" का ज्ञान स्थायी और शाश्वत है। यह पाठ हमें भीतर की ओर मुड़ने और संसार की क्षणिकता को समझकर, अपरिवर्तनीय सत्य की खोज करने के लिए प्रेरित करता है।*
🌹🌹🌹🌹🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

08 Nov, 23:29


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 572 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam  - 572 - 6 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 572. 'పరాశక్తిః' - 6 🌻*

*దేహమందలి శిఖరమే శ్రీచక్ర మేరువు. అచ్చట సహస్రార చక్రము కలదు. అందు శివశక్తులు పరమై యుందురు. అచ్చట నుండి శ్రీమాత మూలాధారము వరకు అవరోహణ క్రమమున నవావర్ణ దేహమును నిర్మించును. అట్లు నిర్మించి మూలాధారమున కుండలినిగ వసించును. ఆరోహణ క్రమమున మొదటి ఐదు ఆవరణములు శక్త్యానుభూతిని, తరువాత నాలుగు ఆవరణలు శివశక్త్యానుభూతిని కలిగించ గలవు. అటుపైన మేరువు నందు జీవుడు ఐక్యము చెందును. పరాశక్తిని చేరుట యనగా తానుండక శివశక్తి స్వరూపముగ మిగులుట. పరాశక్తి ధ్యానము చేయువారు ఈ మార్గము నంతనూ ఎరిగినవారై యుందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 572 - 6 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 572. 'Parashaktih' - 6 🌻*

*In the body, the Meru peak is at the crown, or Sahasrāra Chakra, where Shiva and Shakti unite. From there, Śrī Māta, in descending order, creates the body in nine layers, residing in the base as Kuṇḍalinī. In ascending order, the first five layers offer the experience of Shakti, and the next four provide the experience of Shiva-Shakti. Ultimately, the individual soul merges with the divine in Meru. Attaining Parāśakti means dissolving one's individual identity into the form of Shiva-Shakti. Those who meditate upon Parāśakti have traversed this spiritual path entirely.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

08 Nov, 23:25


*🌹 భగవద్గీత - శ్రీ గీతా ధ్యానం - ధ్యాన శ్లోకాలు తాత్పర్య సహితం మరియు ధ్యాన శ్లోకాలు నేర్చుకోవడానికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
https://youtu.be/psPO6XJbX_M

*ఈ వీడియోలో శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకాలు తాత్పర్య సహితం అందించబడినాయి. ఈ శ్లోకాల ద్వారా భగవద్గీత తాత్పర్యాన్ని మరియు దేవతా ధ్యానాన్ని తెలుసుకోవచ్చు. ప్రశాంతత, భక్తి, మరియు జ్ఞాన మార్గంలో మరింత దృఢంగా ముందుకు సాగడానికి ఈ శ్లోకాలు సహాయపడతాయి. ఈ గీతా ధ్యానం ప్రతి శ్లోకానికి భావమును వివరించి, శ్రోతలలో ఆత్మానందాన్ని పంచుతుంది. వినండి, అభ్యసించండి మరియు శ్లోకాలను మీ జీవితంలో ఆచరించండి. లైక్, సబ్‌స్క్రయిబ్, షేర్ చేయండి మరియు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.*
🌹🌹🌹🌹🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

08 Nov, 23:25


*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 1వ భాగం - దృష్టిని బాహ్య, తాత్కాలిక విషయాల నుండి అంతర్గత, శాశ్వతమైన వాటికి మార్చడమే నిజమైన ఆత్మ సాధన. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
https://youtu.be/oyG4btC2wYY

*ఈ పాఠం చైతన్యం యొక్క స్వభావాన్ని మరియు బాహ్య అనుభవాల తాత్కాలికతను విశ్లేషిస్తుంది. బాహ్య ప్రపంచంలోని విషయాలు తాత్కాలికమని, కాని "నేను ఉన్నాను" అనే నిజం శాశ్వతమని అవగాహన చెందడం ముఖ్యమని ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రపంచం తాత్కాలికమని తెలుసుకుని, శాశ్వతమైన సత్యాన్ని అన్వేషించేందుకు అంతరంగంలోకి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది.*
🌹🌹🌹🌹🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

08 Nov, 21:38


https://t.me/TELUGUJABILI

🌺 తెలుగు జాబిలీ 🌺

08 Nov, 16:31


🙏శుభ శనివారం శుభోదయం శుభోదయం🙏

🌺 తెలుగు జాబిలీ 🌺

08 Nov, 03:50


https://youtu.be/eXoZlvvt_Dw

🌺 తెలుగు జాబిలీ 🌺

07 Nov, 23:54


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 572 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam  - 572 - 5 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 572. 'పరాశక్తిః' - 5 🌻*

*శివ మూలకములగు ధాతువులు సూక్ష్మముగ నుండును. శక్తి మూలకములగు ధాతువులు ముందు వాటికన్న స్థూలమై యుండును. అన్నింటినీ శక్తియే నిర్మాణము చేయును. శివ మూలకములు నాలుగు, శక్తి మూలకములు ఐదుగా నవధాతువులు నిర్మాణమై మానవదేహ మున్నది. అందు వసించునది కూడ శివశక్తులే. ఈ రహస్యము తెలుపుటకే శ్రీచక్ర రాజము ఋషులు అందించినారు. శ్రీ చక్రమందు ఐదు త్రిభుజములు అధో ముఖములు, నాలుగు త్రిభుజములు ఊర్ధ్వ ముఖములు అయి ఒక దానిపై నొకటి పేర్చబడి యుండును. మేరువు నందు శివశక్తులు వసించి యుందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 572 - 5 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 572. 'Parashaktih' - 5 🌻*

*The dhātus associated with Shiva are subtle, while those associated with Shakti are relatively gross. Shakti creates all of these. With four Shiva dhātus and five Shakti dhātus, the nine essential elements constitute the human body, where the essence is also Shiva-Shakti. The Śrī Chakra, gifted by the sages, reveals this secret. In the Śrī Chakra, five downward-pointing triangles and four upward-pointing triangles intersect to form a pattern, with Meru as the abode of Shiva and Shakti.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

07 Nov, 23:54


🌹. కార్తీక పురాణం - 7 🌹
అధ్యాయము 7
🌻 7. శివకేశవార్చనా విధులు. 🌻

'ఓ జనక రాజేంద్రా! కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చనా- దీప విధానాలను చెబుతాను విను.

🌻. పుష్పార్చనా ఫలదాన దీపవిధి - విశేషములు:

ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసనియైన లక్ష్మిదేవి ఆ భక్తుల యిండ్ల స్ధిరావాస మేర్పరచుకుంటుంది. తులసీ దళాలతోగాని, జాజిపువ్వులతోగాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి యీ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లవలె చెదరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు.

బ్రాహ్మణ సమేతులై, ఉసిరిచెట్టు వున్న తోటలో - వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువువలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణ్వాలయములో మామిడాకుల తోరణం కడతారో, వాళ్లు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతోగాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టినవాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్లు అశ్వమేథ పుణ్యవంతులవుతారు. విష్ణువున కెదురుగా జప, హొమ దేవతార్చనలు చేసే వాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి - పుష్పము పరాగమువలె యెగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది.

కార్తీకమాసమందు యే స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి, పంచరంగులతోనూ, శంఖ- పద్మ- స్వస్తికాదిరంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని ఆర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల అదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీకమాసములో శివుని జిల్లేడుపూలతో పూజించినవాడు దీర్ఘయువై, అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణ్వాలయములో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరములో చిరస్దాయిగా వుంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా యెగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ వుంది. స్నాన దానాదులను నాచరింపనివారూ, లోభియై యధాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి, తదుపరి నూరుపుట్టుకలూ శునకయోనిని జన్మిస్తారు.

కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించినవారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా! కార్తీక మాసములో యెవరైతే అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గధిపతులవుతారు. మాల్యములు - తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను, అశక్తులయిన వాళ్లు.

శ్లో || కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ !
మాసస్నానేన యత్సుణ్యం తత్పుణ్యం లభతేనృప !!
శ్లో|| ఆద్యేంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ !
మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః !!

కార్తీకమాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణమనాడు గాని, అమావ్యానాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నాన మాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. 'ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు కార్తీకమాసము నెల రోజులూ ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా! మహీశా! కార్తీకమాసములో యితరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి.

🌹 Continues in page 2..

🌺 తెలుగు జాబిలీ 🌺

29 Oct, 02:16


*AP- October -Syllabus*

🇵 🇴 🇪 🇲 🇸 
*Class-5*

*Paper boats*

https://youtu.be/5-pUdd-NKvE?si=fA5s-XIv7zuTBKUX

https://youtu.be/4S4BRx54VzQ?si=KrieGX0petu8xO9Y
*Class-4*

*Kind words*

https://youtu.be/i2Ez5irkDUc?si=AuLgNbdKIaeyI1gs

Blossoms-4
Rhyme
*Kind words*
https://youtu.be/r8bWg0jIDSY?si=fgsZMkiOkjtu_SdW

*Conversation /Activity -8*


https://youtu.be/RD_Evf_aRIw?si=W0Zicde0m68P6eTD

*Class-3*

*The wheels on the Bus*

https://youtu.be/8OMOY1mULwA?si=u2xyyPiMqPkG8Ysg

*Vehicles -Sounds*

https://youtu.be/IKUSArfWDUc?si=JBUcFtTyM8_kIKPB
*Class-2*

*What am I?*

https://youtu.be/3-EmCZAn9m4?si=kIMDEv_fXXrw67sB

*This is the way*

https://youtu.be/0LLhiC3Wt6w?si=50CKLhJehqg0dI-w


Class-1

*Clap clap clap*

https://youtu.be/3QHNg6dACcs?si=DEEqiTiltFmnHKXb

*Numbers poem*

https://youtu.be/rySCmSl_UOs?si=rr5nG4FY5umPpal5

https://youtu.be/nzAE8UYxAtY?si=W2e4aa_Z8ljx3qaA


🌺 తెలుగు జాబిలీ 🌺

29 Oct, 02:16


: *AP Syllabus*

*Class-3*

*Help me please*
https://youtu.be/UX5m17az_cU?si=UXBFbMiBaalgxwNV

https://youtu.be/5YTIiyhQdos?si=GHMQuWS0nZsYWUWs ..

*Activity -7*

https://youtu.be/8OMOY1mULwA?si=vId5BqIATUxs_h4_

Achanta Mani: AP Syllabus - October 2024

Class-5

Unit-4

https://youtu.be/UyezLVJdre0?si=-Ne2-vgfBX3-jMAK

*Grammar*

https://youtu.be/nOhrr_f4vsU?si=p67--nfwBVOYbxUH

*Conventions of writing*

https://youtu.be/WSkiClIfCqM?si=aEDmN-9Nq6pZ3Hvg

*Conversation* - page no -64

https://youtu.be/_ONAaJonxDA?si=wxhdCkZ-pG4PbR8w



Poem(Paper Boats)

https://youtu.be/5-pUdd-NKvE?si=Ox9O994x29tM-j1a

https://youtu.be/4S4BRx54VzQ?si=cjviLIvAVfNDeGMH

*Riddles*

https://youtu.be/TGwJtiajGQc?si=Y2HOlGHFXNDFjcei

https://youtu.be/lFMgIOjDVtY?si=pn-dLaBzim3guZQ
Achanta Mani: Class-4

Ap syllabus

English

*Swami Vivekananda*

Biographical Sketch

https://youtu.be/RD_Evf_aRIw?si=t0p0XHwPaU6aGWMl

*Conversation*
https://youtu.be/r8bWg0jIDSY?si=kqfTpxiDU66bjTXn

*Kind Hearts*[Poem]😍
https://youtu.be/i2Ez5irkDUc?si=f6wEPliLFBHl7b01

*Prepositions*
In/ On /At
https://youtu.be/p1EM8e90t_g?si=AUVzQ03PJpbyXXnr

🌺 తెలుగు జాబిలీ 🌺

29 Oct, 00:32


🕉️

పంచాంగము 🌓 29.10.2024

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: ఆశ్వీయుజ

పక్షం: కృష్ణ - బహుళ

తిథి: ద్వాదశి ఉ‌.11:06 వరకు
తదుపరి త్రయోదశి

వారం: మంగళవారం - భౌమవాసరే

నక్షత్రం: ఉత్తరఫల్గుణి రా.07:39 వరకు
తదుపరి హస్త

యోగం: ఐంద్ర ఉ‌.07:27 వరకు
తదుపరి వైధృతి

కరణం: తైతుల ఉ‌.11:06 వరకు
తదుపరి గరజ రా.11:59 వరకు
తదుపరి వణిజ

వర్జ్యం: రాతె.04:57 - 06:43

దుర్ముహూర్తం: ఉ‌.08:31 - 09:18
మరియు రా.10:42 - 11:32 వరకు

రాహు కాలం: ప‌.02:52 - 04:19

గుళిక కాలం: ఉ‌.11:59 - 01:26

యమ గండం: ఉ‌.09:06 - 10:33

అభిజిత్: 11:36 - 12:22

సూర్యోదయం: 06:13

సూర్యాస్తమయం: 05:45

చంద్రోదయం: రా.తె.03:32

చంద్రాస్తమయం: ప‌.03:52

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కన్య

దిశ శూల: ఉత్తరం

నక్షత్ర శూల: ఉత్తరం

🪔 గురు - నిర్వాణ ద్వాదశి 🪔
( నరసోబావాడి‌ )

💫 త్రిపుష్కరయోగము 💫

💦 ‌వైధృతి‌ శ్రాద్ధము 💦

🚩 శ్రీపాద శ్రీవల్లభ అవతార
సమాప్తి🚩

🎋 గోవత్స ద్వాదశి 🎋

🦬 వసుబారాస్ 🐃

🐄 నందిని వ్రతం 🐄

🐂 వాసవదత్త‌ కామధేను
పూజ 🐂

🧉 ధన్వంతరి జయంతి 🧉
( దివోదాసర‌ )

🚩 శృంగేరి జగద్గురు శ్రీ భారతీతీర్థ
స్వామి సన్యాసస్వీకర దినోత్సవం 🚩

☘️ భౌమప్రదోషం ☘️

🪔 నీరాజనవిధి 🪔

🚩 శ్రీ సుమతీంధ్రతీర్థ పుణ్యతిథి‌ 🚩

🏳️ స్వామి రామతీర్థ‌ జయన్తీ 🏳️

🪔 యమదీపదానం 🪔

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

28 Oct, 07:08


https://youtu.be/lYyuHObIbGM

Parrot Paper craft

🌺 తెలుగు జాబిలీ 🌺

28 Oct, 00:58


: *AP Syllabus*

*Class-3*

*Help me please*
https://youtu.be/UX5m17az_cU?si=UXBFbMiBaalgxwNV

https://youtu.be/5YTIiyhQdos?si=GHMQuWS0nZsYWUWs ..

*Activity -7*

https://youtu.be/8OMOY1mULwA?si=vId5BqIATUxs_h4_

Achanta Mani: AP Syllabus - October 2024

Class-5

Unit-4

https://youtu.be/UyezLVJdre0?si=-Ne2-vgfBX3-jMAK

*Grammar*

https://youtu.be/nOhrr_f4vsU?si=p67--nfwBVOYbxUH

*Conventions of writing*

https://youtu.be/WSkiClIfCqM?si=aEDmN-9Nq6pZ3Hvg

*Conversation* - page no -64

https://youtu.be/_ONAaJonxDA?si=wxhdCkZ-pG4PbR8w



Poem(Paper Boats)

https://youtu.be/5-pUdd-NKvE?si=Ox9O994x29tM-j1a

https://youtu.be/4S4BRx54VzQ?si=cjviLIvAVfNDeGMH

*Riddles*

https://youtu.be/TGwJtiajGQc?si=Y2HOlGHFXNDFjcei

https://youtu.be/lFMgIOjDVtY?si=pn-dLaBzim3guZQ
Achanta Mani: Class-4

Ap syllabus

English

*Swami Vivekananda*

Biographical Sketch

https://youtu.be/RD_Evf_aRIw?si=t0p0XHwPaU6aGWMl

*Conversation*
https://youtu.be/r8bWg0jIDSY?si=kqfTpxiDU66bjTXn

*Kind Hearts*[Poem]😍
https://youtu.be/i2Ez5irkDUc?si=f6wEPliLFBHl7b01

*Prepositions*
In/ On /At
https://youtu.be/p1EM8e90t_g?si=AUVzQ03PJpbyXXnr

🌺 తెలుగు జాబిలీ 🌺

27 Oct, 23:42


🕉️

పంచాంగము 🌓 28.10.2024

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: ఆశ్వీయుజ

పక్షం: కృష్ణ - బహుళ

తిథి: ఏకాదశి ఉ‌.09:08 వరకు
తదుపరి ద్వాదశి

వారం: సోమవారం - ఇందువాసరే

నక్షత్రం: పూర్వఫల్గుణి సా.05:23 వరకు
తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: బ్రహ్మ ఉ‌.06:26 వరకు
తదుపరి ఐంద్ర

కరణం: బాలవ ఉ‌.09:08 వరకు
తదుపరి కౌలువ రా.10:07 వరకు
తదుపరి తైతుల

వర్జ్యం: రా.01:16 - 03:01 వరకు

దుర్ముహూర్తం: ప‌.12:22 - 01:09
మరియు ప‌.02:41 - 03:28

రాహు కాలం: ఉ‌.07:39 - 09:06

గుళిక కాలం: ప‌.01:26 - 02:53

యమ గండం: ఉ‌.10:33 - 11:59

అభిజిత్: 11:36 - 12:22

సూర్యోదయం: 06:13

సూర్యాస్తమయం: 05:46

చంద్రోదయం: రా.02:46

చంద్రాస్తమయం: ప‌.03:21

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: తూర్పు

🌾 రమైకాదశి‌ 🌾

💫‌ దగ్ధయోగము 💫

🌲 రంభా ఏకాదశి 🌲

🎊 వసు - వాఘ్‌ ద్వాదశి 🎊

🐄 గోవత్సద్వాదశి 🐄
( ప్రదోష వ్యాపిని )

🐂 గోవంశ‌ పూజ 🐂

🪔 గో నీరాజనం 🪔

🚩 శృంగేరి జగద్గురు శ్రీ చంద్రశేఖర
భారతి మహాస్వామి జయన్తీ 🚩

🎉 తెన్కాసి శ్రీ అంబాళ్
విశ్వనాథర్ తిరుకల్యాణం‌ 🎉

⚛️

క్షీరోదార్ణవ సంభూతే
సురాసురనమస్కృతే,
సర్వదేవమయే మాతర్గృ
హాణార్ఘ్యం నమోస్తుతే

సర్వదేవమయే దేవి
సర్వదేవైరలంకృతే,
మాతర్మమాభిలషితం
సఫలం కురు నందిని

నీరాజయేయు ర్దేవాంశ్చ
విప్రాన్ గాశ్చతురంగమాన్,
జ్యేష్ఠాన్ శ్రేష్ఠాన్ జఘన్యాంశ్చ
మాతృముఖ్యాశ్చ యోషితః"

దేవతలకును బ్రాహ్మణులకును
గోవులకును గుఱ్ఱములకును
పెద్దలకును శ్రేష్ఠులకును
స్వల్పులకును తల్లి మొదలగు
స్త్రీలకును నీరాజన
మీయవలయును.
త్రయోదశి‌ యందపమృత్యువు
నశించుటకు యముని నుద్దేశించి
బలిదీప వియవలయును.

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

27 Oct, 20:32


🙏🏻శుభ సోమవారం శుభోదయం🙏🏻

🌺 తెలుగు జాబిలీ 🌺

27 Oct, 13:55


https://youtu.be/DYI4_LlGXUs?si=rVSimQXsdqfAy0HB

చందమామ ఈ మాసపు పాట తెలుగు బాల గేయం poem Telugu ||Achanta mani

🌺 తెలుగు జాబిలీ 🌺

27 Oct, 01:06


🕉️

పంచాంగము 🌓 27.10.2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: ఆశ్వీయుజ

పక్షం: కృష్ణ - బహుళ

తిథి: దశమి ఉ‌.07:55 వరకు
తదుపరి ఏకాదశి

వారం: ఆదివారం - భానువాసరే

నక్షత్రం: మఘ ప‌.03:20 వరకు
తదుపరి పూర్వఫల్గుణి

యోగం: బ్రహ్మ పూర్తి

కరణం: భధ్ర ఉ‌.07:55 వరకు
తదుపరి బవ రా.08:02 వరకు
తదుపరి బాలవ

వర్జ్యం: రా.12:01 - 01:45 వరకు

దుర్ముహూర్తం: సా.04:14 - 05:00

రాహు కాలం: సా.04:20 - 05:46

గుళిక కాలం: ప‌.02:53 - 04:20

యమ గండం: ఉ‌.11:59 - 01:26

అభిజిత్: 11:36 - 12:22

సూర్యోదయం: 06:12

సూర్యాస్తమయం: 05:46

చంద్రోదయం: రా.01:58

చంద్రాస్తమయం: ప‌.02:49

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: పశ్చిమం

🚩 జోలేబాబా‌ పుణ్యతిథి‌ 🚩

🏳️ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
పుణ్యతిథి‌ 🏳️

🚩 బాపురావ్‌ మహారాజ్
ఖత్ఖోడకర్‌ పుణ్యతిథి‌ 🚩

🏳️ ఉదాసి మహారాజ్
పుణ్యతిథి‌ 🏳️

🚩 సిద్ద రామేశ్వర మహారాజ్
పుణ్యతిథి 🚩

🎊 కోవిల్‌పట్టి శ్రీ భువననాథస్వామి
సమేత శ్రీ సేన్పకవల్లి రథోత్సవం 🎊

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 23:48


*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 1 to 5 Shorts 🌹*

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 1🌹*
*प्रसाद भरद्वाज*
https://youtube.com/shorts/6X4gnLfq7Ys

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 2🌹*
*प्रसाद भरद्वाज*
https://youtube.com/shorts/5U5VYHijyEM

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 3🌹*
*प्रसाद भरद्वाज*
https://youtube.com/shorts/oZXYaMEgJXg

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 4 🌹*
*प्रसाद भरद्वाज*
https://youtube.com/shorts/rHYEr525LoM

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 5 🌹*
*प्रसाद भरद्वाज*
https://youtube.com/shorts/W2crIGkLFxI

🌹🌹🌹🌹🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 23:48


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 571 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 571 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*

*🌻 571. 'మహాప్రళయ సాక్షిణీ' - 1 🌻*

*మహాప్రళయమునకు సాక్షిగా నుండునది శ్రీమాత అని అర్థము. మహా ప్రళయమందు శ్రీమాతయే మిగులును. తన నుండి యేర్పడిన సృష్టి తనలోనికే లయ మగును. అపుడు మిగులునది ఆమెయే. త్రిమూర్తులు సహితము తన లోనికి లయ మగుదురు. తాను కాలముతో కలిసి, పరములోనికి ప్రవేశించును. ప్రతి రాత్రి మనము మన చేతన నుండి మనలోనికి లయము చెంది, మరల ఉదయమున మనలో నుండి చేతనగ వ్యక్తమై అటుపైన ఇచ్ఛ, జ్ఞాన, క్రియలలోనికి దిగివత్తుము. ప్రళయమునకు చివర, సృష్టికి ముందు మన చేతన, దైనందినముగ యున్నట్లు సృష్టి ప్రళయము నకు చిట్టచివర, సృష్టి ఆరంభమునకు మొట్టమొదట శ్రీమాతయే యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 571 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*

*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻*

*🌻 571. 'Maha Pralaya Sakshini' - 1 🌻*

*The term "Witness of the Great Dissolution" refers to the Divine Mother, or Śrī Māta. She is the sole witness to the cosmic dissolution, known as "Mahāpralaya." In the event of this dissolution, only Śrī Māta remains. The creation that emanated from her merges back into her; she is what remains when all else dissolves. Even the Trimurtis (the three principal deities—Brahma, Vishnu, and Shiva) return to her essence. She unites with Time and enters the Supreme. Each night, just as our consciousness dissolves within us during sleep, only to reawaken at dawn, similarly, at the end of the cosmic cycle, before the start of a new creation, Śrī Māta alone exists.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 23:45


*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 1 to 5 Shorts 🌹*

*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 1.🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
https://youtube.com/shorts/WJ9EnJ8jBM4

🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 2.🌹
ప్రసాద్‌ భరధ్వాజ
https://youtube.com/shorts/u30oOSNiGTg

*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 3. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
https://youtube.com/shorts/E1s6wWvbb9g

*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 4. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
https://youtube.com/shorts/B1u4VbelXFc

*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 5. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
https://youtube.com/shorts/OyGCLgCKZLU

🌹🌹🌹🌹🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 23:45


*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 1 to 5 Shorts 🌹*

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 1. 🌹*
*Prasad Bhardwaj*
https://youtube.com/shorts/nAFrVjMpuds

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 2. 🌹*
*Prasad Bhardwaj*
https://youtube.com/shorts/stmRH9wkXl4

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 3. 🌹*
*Prasad Bhardwaj*
https://youtube.com/shorts/DZ3z6QP4sZ4

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 4🌹*
*Prasad Bhardwaj*
https://youtube.com/shorts/USeORXO1S50

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 5 🌹*
*Prasad Bharadwaj*
https://youtube.com/shorts/YV1bVzx0XO0

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 16:12


🙏🏻శుభ ఆదివారం శుభోదయం🙏🏻

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 09:50


https://youtube.com/shorts/RBOD45vwXb0?feature=share

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 08:23


https://youtu.be/mIOSpRri8AI?si=PFHFDSNytHQN47Bs

పొడుపు కథలు Class-3తరగతి -3

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 00:59


🙏🏻శుభ శనివారం శుభోదయం🙏🏻

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 00:23


🕉️

పంచాంగము 🌓 26.10.2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: ఆశ్వీయుజ

పక్షం: కృష్ణ - బహుళ

తిథి:‌ నవమి ఉ‌.06:48 వరకు
తదుపరి దశమి

వారం: శనివారం - మందవాసరే

నక్షత్రం: ఆశ్లేష ప‌.01:42 వరకు
తదుపరి మఖ

యోగం: శుక్ల రా.తె.03:58 వరకు
తదుపరి బ్రహ్మ

కరణం: గరజ ఉ‌.06:48 వరకు
తదుపరి వణిజ రా.07:24 వరకు
తదుపరి భధ్ర

వర్జ్యం: రా.02:31 - 04:13 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.06:12 - 07:40

రాహు కాలం: ఉ‌.09:06 - 10:33

గుళిక కాలం: ఉ‌.06:12 - 07:39

యమ గండం: ప‌.01:26 - 02:53

అభిజిత్: 11:36 - 12:22

సూర్యోదయం: 06:12

సూర్యాస్తమయం: 05:47

చంద్రోదయం: రా.01:07

చంద్రాస్తమయం: ప‌.02:14

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కర్కాటకం

దిశ శూల: తూర్పు

🌹‌దుర్గా పూజ 🌹

🏳️ భీమసేన్‌ జయన్తి 🏳️

🚩 శ్రీ బ్రహ్మానంద‌ సరస్వతి
స్వామి పుణ్యతిథి‌ 🚩

🛕 తిరునల్వేలి శ్రీ కాంతిమతి‌
అమ్మన్‌ రథోత్సవం 🛕

🔯

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 00:01


*🌹 निर्वाण दशकम् स्तोत्रम् - केवल शिव का आत्मा ही अस्तित्व में है। मैं वही शिव हूँ। - अर्थ और व्याख्या - श्री आदि शंकराचार्य 🌹*
*प्रसाद भारद्वाज*
https://youtu.be/-ua5IzXPv3E

*निर्वाण दशकम्, श्री आदि शंकराचार्य द्वारा रचित यह कृति अद्वैत वेदांत के सार को दस श्लोकों में सशक्त रूप से प्रस्तुत करती है। यह निर्वाण षट्कम् की भाँति, सभी सांसारिक संबंधों को त्याग कर, ब्रह्म या शिव को एकमात्र अखंड सत्य के रूप में दर्शाती है। यह रचना, द्वंद्व और भेद से परे, शुद्ध और निर्गुण स्वरूप को समझने के लिए आध्यात्मिक साधकों को मार्गदर्शन प्रदान करती है।*
🌹🌹🌹🌹🌹

🌺 తెలుగు జాబిలీ 🌺

26 Oct, 00:01


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 570 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 570 -3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*

*🌻 570. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - 3 🌻*

*శ్రీరాముడు విభీషణునిపై కరుణ చూపెను. సుగ్రీవునితో మైత్రి గావించెను. శూర్పణఖను ఉపేక్షించెను. అట్లే కృష్ణుని జీవితమున కూడ దర్శింపవచ్చును. మహాత్ముల నెరుగుటకు ఈ నాలుగు గుణములు ప్రమాణముగ ఆర్యులు స్వీకరించిరి. ప్రసిద్ధమైన ఈ నాలుగు వాసనలు చిత్తమును శోధించును. భాగవతమున ఈ నాలుగింటిని క్రింది విధముగ నిర్వచించిరి. సఖుల యందు మైత్రి, దుఃఖితులందు కరుణ, పుణ్యులందు ముదిత, పాపులందు ఉపేక్ష.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 570 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*

*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻*

*🌻 570. 'Maitryadi Vasanalabhya' - 3 🌻*

*Sri Rama showed compassion towards Vibhishana (Karuna), befriended Sugriva (Mudita), and was patient with Surpanakha (Upeksha). Likewise, one can observe these qualities in Lord Krishna's life as well. The Aryas (noble ones) accepted these four qualities as the standards for recognizing great souls. These four vasanas are well-known for purifying the mind. In the Bhagavata Purana, these four qualities are defined as follows: Maitri towards friends, Karuna towards the suffering, joy (Mudita) towards the virtuous, and Upeksha towards sinners.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹