🚩 కాలాష్టమి, శబరి జయంతి 🚩
గురువారం గ్రహ బలం పంచాంగం
గురువారం గ్రహాధిపతి గురువు (బృహస్పతి). గురువు యొక్క అధిష్టాన దైవం "శ్రీ ఇంద్రుడు" మరియు "శ్రీ దక్షిణామూర్తి".
గురువు అనుగ్రహం కొరకు గురువారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం బృహస్పతయే నమః ||
2. ఓం ఇంద్రాయ నమః ||
3. ఓం దక్షిణామూర్తయే నమః ||
4. ఓం విష్ణవే నమః ||
5. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ||
శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై వుంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయం సందర్శించండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారాల్లో శివాలయంతో పాటు, శ్రీ మహా విష్ణు, శ్రీ దత్తాత్రేయ, మరియు శ్రీ సాయిబాబా ఆలయాలు కూడా దర్శించండి.
గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికీ దూరంగా వుండండి.
గ్రహ బలం కొరకు, గురువారం పసుపు మరియు బంగారం రంగు దుస్తులు ధరించండి. గురువారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, ధన నష్టం, మానసిక అశాంతి, విద్యా లోపం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతుంది.
అమృత కాలం:
04:26 AM – 06:11 AM
దుర్ముహూర్తం:
10:46 AM – 11:32 AM, 03:19 PM – 04:05 PM
వర్జ్యం:
05:54 PM – 07:40 PM
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
శ్రీ క్రోధి నామ సంవత్సరం, మాఘ మాసం, కృష్ణ పక్షం,
తిథి:
సప్తమి : ఫిబ్రవరి 19 07:32 AM నుండి ఫిబ్రవరి 20 09:58 AM వరకు
అష్టమి : ఫిబ్రవరి 20 09:58 AM నుండి ఫిబ్రవరి 21 11:58 AM వరకు
సప్తమి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు అనుకూలమైన భద్ర తిథి. సప్తమి రవాణా కార్యకలాపాలు, ప్రయాణాలు, వివాహ ప్రయత్నాలు, సంగీతం, నృత్యం, చర్చ, అలంకరణ, ఆభరణాల కొనుగోలు, మరియు శారీరక వ్యాయామం ప్రారంభించడం వంటి పనులకు అనుకూలమైన తిథి.
సప్తమి తిథి, శ్రీ రామ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, మరియు శివాలయాలు సందర్శించడానికి, శ్రీ సూర్య భగవానుడి ఆరాధనకు, ఆదిత్య హృదయ స్తోత్రం మరియు సూర్యుని మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నక్షత్రం:
విశాఖ: ఫిబ్రవరి 19 10:39 AM నుండి ఫిబ్రవరి 20 01:30 PM వరకు
అనురాధ: ఫిబ్రవరి 20 01:30 PM నుండి ఫిబ్రవరి 21 03:53 PM వరకు
విశాఖ నక్షత్రానికి అధిపతి "బృహస్పతి". అధిష్టాన దేవత "ఇంద్రాగ్ని" (ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు). ఇది మిశ్రమ ప్రకృతి స్వభావం గల నక్షత్రం.
విశాఖ నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం బృహస్పతయే నమః ||
2. ఓం ఇంద్రాగ్నిభ్యం నమః ||
విశాఖ నక్షత్రం ఉన్నరోజు - సాధారణ విధులకు, వృత్తిపరమైన బాధ్యతలకు, ఇంటి పనికి మరియు రోజువారీ ప్రాముఖ్యత కలిగిన అన్ని కార్యకలాపాలకు అనుకూలం.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి:
https://t.me/GrahaBalamStotras
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది.
చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
20/02/2025 గురువారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే!
లోకాః సమస్తాః సుఖినో భవంతు ||
శుభం భూయాత్ ||
🙏