తెలుగు పుస్తక ప్రపంచం @nagaveni_telugubooks Channel on Telegram

తెలుగు పుస్తక ప్రపంచం

@nagaveni_telugubooks


విజ్ఞాన భాండాగారం

తెలుగు పుస్తక ప్రపంచం (Telugu)

తెలుగు పుస్తక ప్రపంచం టెలిగ్రామ్ ఛానల్ 'nagaveni_telugubooks' అంతా ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం మరియు టెలుగు పుస్తకాలను ప్రకటించే ఒక స్థానం. ఈ ఛానల్ ద్వారా, టెలుగు భాషలో విభిన్న వర్గాల పుస్తకాలను కనుగొనే అవకాశం లభిస్తుంది. ఈ ఛానల్ మూలమైన పుస్తకాలు, కథలు, కవితలు, నవలలు, అనువాద పుస్తకాలు మరియు విభిన్న జాతీయ సాహిత్యాలు కనుగొనవచ్చు. ఇటువంటి ఒక ఛానల్ ద్వారా, టెలుగు సాహిత్య రసమయంగా మరియు తరలమైన విషయాలను స్పష్టంగా పెంచే అవకాశం కలదు. నగావేణి టెలుగు పుస్తక ప్రపంచం ఛానల్ ద్వారా తెలుగు పుస్తక ప్రేములకు సాహిత్య ప్రపంచాన్ని వెనుకాలిస్తూ, అవకాశం ఉన్నంత మంచి పుస్తకాలను ప్రకటించడం మూలంగా సాహిత్య ప్రేములకు అవకాశం ఉంది.

తెలుగు పుస్తక ప్రపంచం

08 Jan, 08:51


ముక్కోటి వైభవం.,.....!!
.......................................................
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. అలాంటి ముక్కోటి విశేషాలేమిటో చూద్దాం.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.

ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు.

వైకుంఠ ఏకాదశి రోజు.. ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాలు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో.. దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ, ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.

ముక్కోటి రోజున పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈరోజున ఉపవాసం చేసినవారు పాప విముక్తులవుతారట. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేడంతో పాటు పాటించవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. దైవానికి దగ్గరవాలన్నదే ఉపవాసంలోని ఆశయం.

పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ రెండోది. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు. ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశి

తెలుగు పుస్తక ప్రపంచం

06 Jan, 13:34


జి.డి.నాయుడు గారి పూర్తి పేరు #గోపాలస్వామి #దొరస్వామినాయుడు (1893 మార్చి 23 - 1974 జనవరి 4 ) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు, మరియు నిరంతర అన్వేషకుడు. దక్షిణ భారతములో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని కూడా పిలువబడ్డారు. మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈయన భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేశారు.

1893 మార్చి 23వ తేదీన కోయంబత్తూరు దగ్గరలోని కలంగల్ అనే గ్రామములో జన్మించారు. 1920లో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి, పళనిల మధ్య నడిపారు. యునైటెడ్ మోటార్ సర్వీస్ (UMS) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా 1937లో భారతదేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారుచేశారు.

నాయుడు గారు కనుగొన్న, తయారు చేసిన విలక్షణమైన పరికరాలు:

తొలి విద్యుత్ రేజర్
బహు పదునైన బ్లేడు
దూరము సరిచేసే కెమేరా భాగము
పండ్ల రసము తీయు పరికరము
ఎన్నికల యంత్రం
కిరోసిన్ తో నడిచే ఫ్యాను (పంఖా)
ఐదు వాల్వులు గల రేడియో (డెబ్బయి రూపాయలు)
రెండు సీట్ల మోటారు కారు (రెండు వేల రూపాయలు) - 1952

తన కంపెనీ బ్లేడ్ కోసం హిట్లర్ నుండి బహుమతి
స్వంతగా మార్పులు చేర్పులు చేసిన కెమేరాతో నాయుడు గారు అడాల్ఫ్ హిట్లరును, లండనులో జార్జి రాజు అంత్యక్రియలను (1936), గాంధీ, నెహ్రు, సుభాష్ బోస్ మున్నగు నాయకులను ఫొటోలు తీశారు. నాయుడు గారు తయారు చేసిన పరికరాలు, పనిముట్లు, కోయంబత్తూరులోని 'జి.డి. నాయుడు ప్రదర్శనశాల' లో ఉన్నాయి.

1944లో పారిశ్రామిక వ్యాపకాలకు స్వస్తి చెప్పి నాయుడు సంఘసేవకు, బడుగు ప్రజల సేవకు అంకితమయ్యారు. పేద విద్యార్ఠులకు పలు ఉపకారవేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, కళాశాలకు దానధర్మాలు చేశారు. 1945లో కోయంబత్తూరులో తొలి ఇంజనీరింగ్ కళాశాలకు నాంది పలికారు. ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్, ఆర్థర్ హోప్ ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించారు. తదుపరి రెండు సంస్థలనూ ప్రభుత్వ ఆధ్వర్యమునకు ఇచ్చివేశారు. 1967లో "జి. డి. నాయుడు పారిశ్రామిక ప్రదర్శన" ప్రారంభించారు. ఇది ప్రతి సంవత్సరము సందర్శకులను విశేషముగా ఆకర్షిస్తుంది.

తెలుగు పుస్తక ప్రపంచం

06 Jan, 13:14


మనక్కూడా కళ్ళు చెమర్చుతున్నాయి కదా ఇది చదివిన తరువాత. అదీ ఏ భేషజాలు లేని సంస్కారం అంటే. ఇందులో కనిపించిన ప్రతి ఒక్కరిదీ . ఇందులో కనిపించిన ప్రతి ఒక్కరూ హీరోనే . విశ్వనాథను పిలచిన వరంగల్ ప్రజలు, విశ్వనాథ ,రాంభాయమ్మ , కాళోజీ సోదరులు, రాఘవరెడ్డీ,వానమామలై,ఇది రాసిన సదశివా, ఇంకా పరదా చాటున ఉన్న ఇంకెందరో అందరూ హీరోలే. ఇట్లాంటి మాహానుభావులు కావాలి ఇప్పుడు . అయితే నిరాశ పడక్కరలే . అట్లాంటి వారు ఎక్కడో ఎందుకు మనలోపలే ఉంటారు . కాస్త తట్టి లేపాలి .

తెలుగు పుస్తక ప్రపంచం

06 Jan, 13:14


ఇప్పుడు ఉన్న రాష్ట్ర మనోవరణంలో --ఎలాంటి పరిస్థితులోనైనా తెలుగు మనుష్యులుగా మనమంతా సోదర పుష్పాలుగా ఏట్లా వికసించాలో పటం గట్టి చూపుతున్న ఒక సంఘటనను ,దాన్ని మనకు "యాది " చేస్తున్న పొద్దున్నే తలచుకోవాల్సిన మహానుభావుల్లో ఒకరైనా సామల సదాశివ గారిని తలుచుకుంటూ..... ఆయన మాటల్లో ఈ సంఘటన ............

" ఒకసారి విశ్వనాథ సత్యనారయణ గారు వరంగల్లు సందర్శించారు .
విశ్వనాథవారు కాళోజీల ఇంట వున్నప్పుడు తమ గురువుగారి కవిత విశ్వనాథకు వినిపించాలనుకున్నారట కాళోజీ ప్రముఖులు. గార్లపాటి (రాఘవరెడ్డి) వారికి అది ఇష్టమో కాదో. శిష్యుల కోరిక మన్నించారు. విశ్వనాథవారి అభిమానులో, అయినవాళ్లో, కానివాళ్లో వారిగురించి పనిగట్టుకుని ఎన్ని కథలు ప్రచారం చేసే వాళ్లంటే, అవి విన్నవాళ్లకు వారిని చూడాలనిపించేది కాదు. ‘అతనితో మనకెందుకులే’ అనిపించేది.

కాళోజీల యింట (మాటి మాటికి ఇలా అనేకంటే రామాబాయమ్మ గారి యింట అనడం బాగుంటుంది. ఆమె అందరికీ అన్నదాత్రి) విశ్వనాథవారు భోజనంచేసి, తాంబూలచర్వణం చేస్తూ, పరిచిన మంచంలో పడుకున్నారు. కొంచెం ఎడంగా ఉన్న నులక మంచం మీద రాఘవరెడ్డిగారు పద్యాల కాగితాలు పట్టుకుని కూర్చున్నారు. ‘అయ్యా! మాగురువుగారి పద్యాలు చిత్తగించండి’ అని విన్నవించుకున్నారు శిష్యులు. ‘చదవమనండి’ అని గోడవైపు తిరిగి పడుకున్నారు విశ్వనాథవారు.

‘ఈ తెలంగాణా రెడ్డిగారి పద్యాలు నేను వినదగినవా’ అనుకున్నారా? రాఘవరెడ్డిగారు తమ పద్యాలు వినిపిస్తున్నారు. ఎవరు వింటున్నారో ఎవరు వినటంలేదో వారికి అనవసరం. విశ్వనాథవారు ఎటు తిరిగి వింటున్నారనేది కూడా వారికి అనవసరమే. తమ పద్యాల మీద వారికి నమ్మకం. ధారారమ్యమైన భావబంధురమైన పద్యాలు. కొన్ని పద్యాలు విన్నతర్వాత, అటు తిరిగి పడుకున్న విశ్వనాథవారు ఇటు తిరిగి పడుకొని కవిని చూస్తూ పద్యాలు వింటున్నారు. మరికొన్ని పద్యాలు వినగానే మంచంలో కూర్చుండి వింటున్నారు. ఇంకా కొన్ని పద్యాలు విన్న తర్వాత, మంచం దిగి, రెడ్డిగారు కూర్చున్న నులక మంచంకోడును పట్టుకుని, నేలమీదనే కూర్చుండి వింటున్నారు. మరిన్ని పద్యాలు విని లేచి, రెడ్డిగారిని గట్టిగా కౌగిలించుకుని ‘రెడ్డిగారూ! మీరు మహాకవులు! మీ పద్యాలు నన్ను కదిలించాయి!’ అని అభనందించారు విశ్వనాథవారు. వారి కళ్లలో ఆనందాశ్రువులు. అక్కడున్న వారందరి కళ్లలోనూ ఆనందాశ్రువులే.కాళోజీ సోదరులు మాటల్లో చిత్రించిన ఈ దృశ్యం, రెడ్డిగారెంతటి కవులో, విశ్వనాథవారెంతటి సహృదయులో తెలియజేస్తున్నదికదా.

పోతన చరిత్ర రచించి, అభినవ పోతనగా కీర్తింపబడిన వానమామలై వరదాచార్యులవారు నాతో చెప్పిన ఒక ముచ్చట చెప్పి ముగిస్తాను. ఆచార్యులవారి పద్యాలు ఎంత రసరమ్యమైనవో, వారు తమ పద్యాలనెంత కమ్మగా గానం చేసేవారో, చదివిన వాళ్లకు, విన్నవాళ్లకు తెలుసు. కాళోజీల వలెనే వారుకూడా మొదట్లో మడికొండ వాస్తవ్యులు. మొదట్లో వారు మణిమాల అనే చిన్న పద్యకావ్యాన్ని రచించి దాన్ని అచ్చువేయించే మార్గాలు అన్వేషిస్తున్నారట.

అప్పట్లోనే సాహిత్య ప్రియులైన వరంగల్లు పురప్రముఖులు కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారిని ఘనంగా సన్మానించాలని తలపెట్టినారట. ఘనంగా అంటే శాలువా, నూత్న వస్త్రాలు, అయిదువేల రూపాయిల నగదు. ఆ కాలంలో అయిదు వేలంటే పెద్ద మొత్తమే. సన్మానానికి కొన్ని గంటలు ముందు వానమామలవారు విశ్వనాథవారికి మణిమాలలోని కొన్ని పద్యాలు వినిపించినారట. రామాబాయమ్మవారింటనే కావచ్చు. విశ్వనాథవారు శ్రద్ధగా విన్నారట కాని తమ అభిప్రాయం తెలుపలేదట.

మెచ్చుకున్నట్లా? మెచ్చుకోనట్లా? వారు మెచ్చుకోకపోయినా వానమామలవారి పద్యాల వన్నెతగ్గదు. బాగున్నయి అనైననా అనాలెగదా. అదీ అనలేదట. సాయంకాలం సన్మానసభ. వరంగల్లు విద్వాంసులు, పురప్రముఖులు విశ్వనాథవారి సమున్నత సాహితీ వ్యక్తిత్వాన్ని బహుధా ప్రశంసించినారట.

ఇక సన్మాన కార్యక్రమం. వారిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, శాలువా కప్పి, ఐదువేల పర్సును సమర్పించబోతుండగా, “ఆగండి!” అన్నారట విశ్వనాథ. శ్రోతల్లో కూర్చున్న ఆచార్యులవారిని వేదికపైకి ఆహ్వానించి, ‘ఇతడు శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు. ఇతని కవిత విన్నాను. ఇతను పద్యం హృద్యమయింది. రమణీయమైంది. ఇతని మణిమాల కావ్యం ముద్రణకు నోచుకోలేదు. మీ ఊరి కవిని సన్మానించుకోక ముందే, నాకీ సన్మానమెందుకు చేస్తున్నారు? ఈ డబ్బుతో ఇతని కావ్యాన్ని ముద్రింపజేయండి. అది నా సన్మానమే అని సంతోషిస్తాను’ అన్నారట. ‘అయ్యా వారు మావారే. వారి కావ్యాన్ని త్వరలోనే అచ్చువేయించి, మీకొక కాపీ పంపిస్తాము. ఈ డబ్బు మీరు స్వీకరించండి’ అని ఎన్నో విధాల బతిమాలిన తర్వాత విశ్వనాథవారు స్వీకరించినారట. ఈ ముచ్చట నాకు వానమామలవారే చెప్పినారు.ఇట్లాంటివారు విశ్వనాథవారు. " . పై వ్యాసమంతా సదాశివ గారు తన యాది పుస్తకంలో రాసుకున్నది.

తెలుగు పుస్తక ప్రపంచం

06 Jan, 08:46


వయసు పెరిగితే మనకేమీ కొత్తగా కొమ్ములు పొడుచుకుని రావు. చాలా విషయాలను మనం వదిలేయాలి.

”చలం” (గుడిపాటి వెంకటాచలం), గాయని వాణీ జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్లను ఆదర్శంగా పెట్టుకోవాలి.

చలంగారు తానూ, తన స్నేహితుడూ ముచ్చటించుకుంటూ ఉండగా పిల్లలు వాళ్ళ ఇంట్లోని వంటపాత్రలతో ఆడుకుంటూ ధ్వనులు చేస్తుండగా స్నేహితుడా పిల్లలను వారించాడు.

అప్పడు చలం… “మనకు మన ముచ్చట్లు ఎంత ముఖ్యమో, ఆ పిల్లలకు వాళ్ల ఆటా అంతే ముఖ్యం. వయసులో పెద్దవాళ్లమైనంత మాత్రాన వాళ్ల ఆటలను ఆపెయ్యమనడానికి మనకు హక్కెక్కడిదీ?” అన్నారు. ఇలాంటి ఉన్నతాలోచనా పథాన్ని అలవరచుకునే ప్రయత్నంలో కొంత విజయం సాధించాలి.

వాణీ జయరామ్ గారు చిన్న పిల్లలను సైతం “మీరు” అనే సంబోధిస్తారు. ప్రయత్నించినా ఆ తత్త్వం మనకు అబ్బడంలేదు.

ఎస్పీ బాలు గారు శబరిమలకు డోలీలో వెళ్ళిన సందర్భంలో డోలీ మోసినవాళ్ళ కాళ్ళకు మోకరిల్లారు. అది వాళ్ళ వృత్తికావచ్చుగాక. వాళ్ళు ఆ పనిచేసినందుకు డబ్బులిస్తుండ వచ్చు గాక. వాళ్ళే లేకపోతే మనవద్ద డబ్బులుండీ లాభమేమిటి ?

మనమెలాగూ ఎస్పీలాగా పాదాభివందనం చేసేంత గొప్పవాళ్లం కాలేం. కనీసం “థాంక్స్” చెప్పొచ్చు కదా.

కాగా ఒక సందర్భంలో “మన శరీరంలో తగినంత శక్తి ఉండగా ఇతరులకు డబ్బులిచ్చే అయినా బ్యాగులు మోయించొద్దు” అనీ “ఎవరిచేతనైతే నీ లగేజీని మోయిస్తావో వాళ్ళ పదింతల లగేజీని వచ్చే జన్మలో నీవు మోయకతప్పదు” అన్నారు…. శ్రీకంచి కామకోటి పీఠాధిపతి స్వామి గారు. చాలామటుకు దీనికీ కట్టుబడి ఉండే ప్రయత్నము చేయాలి.

మనం చాలా విషయాలను పట్టుకోవటం కష్టం కానీ వదిలేయడంలో బాధ ఏమిటీ.

ఏం వదిలివేయాలో చూద్దాం.

”అమ్మాయీ గ్యాసు కట్టేసావా....
గీజర్ ఆఫ్ చేసావా...
ఏ.సి ఆన్ లో ఉన్నట్లుంది..
పాలు ఫ్రిజ్ లో పెట్టావా....
...లాంటి ఎంక్వయిరీలు వదిలేద్దాం.

”మా కొడుకూ, కోడలూ పట్టించుకోరు" అంటూ తామేదో పర్వతాలను మోస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ పరువు తామే తీసుకుంటున్న తలిదండ్రులున్నారు
వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం..
కష్టనష్టాలు కూడా వాళ్ళవే.

ఎవరితో ఏపనీ చేయించుకోకుండా ప్రతీపనీ మన పనే అనుకుంటే ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమో కదా..

నా అభిప్రాయం ఏమిటంటే… అని అనటం తగ్గించి.. నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే ఔతుంది కదా స్వర్గసీమ.

నాకూ తెలుసు తో పాటు. నాకు మాత్రమే తెలుసు అనే ఆలోచనను తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ నాకంటే ఎక్కువ తెలుసు కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు.

మన పిల్లలకోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి.

పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు. ఆరోగ్యం బాగుంది కదా అని దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బి.పి, షుగర్ కీళ్ళనొప్పులు, నిద్ర పట్టకపోవటం. నీరసం అంత రసవత్తరమైన విషయాలుకావు కదా. బాబోయ్.. ఎందుకు అడిగామా అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు.

కాలం మారింది, మారుతున్నది శరవేగంగా.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటెలా పట్టుకోవాలో మనం చెబితే ఏం ప్రయోజనం.

పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తిగా... పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను.

అనవసరవిషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగావుంటూ మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ...జిహ్వచాపల్యం తగ్గించుకుని.అన్నింటికంటే ముఖ్యమైన విషయం నన్ను ఎవరూ గౌరవించటంలేదు అనే ఆత్మన్యూనతాభావం దరికి చేరకుండా జాగ్రత్తపడాలి...

భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.

ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యతా లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.

హాయిగా పూజలు చేసుకోవచ్చు. భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. పుణ్యమూ, పురుషార్థమూ కూడా సిధ్ధిస్తాయి.

రోజూ అనుకుందాం ఇలా...
I love my self.
I respect my self.
మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలివి. చివరగా… మనం దిగవలసిన స్టేషన్ దగ్గరౌతూనే వుంది. సమయం దగ్గర పడుతూనే ఉంది.

మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణీకులతో తగువులు, మనస్పర్థలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా...

మనం దిగుతుంటే వారి ముఖాల్లో హమ్మయ్య. అనే భావం కనిపించాలో...లేక అయ్యో అప్పుడే వీళ్ల స్టేషన్ వచ్చేసిందా.. అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది.

తెలుగు పుస్తక ప్రపంచం

05 Jan, 10:51


భారతదేశంలోని 12 పవిత్ర నదులు హిందువులందరూ చాలా గౌరవంగా పూజిస్తారు.

1. గంగా నది, హర్ కి పౌరి, హరిద్వార్

2. యమునా నది, మధురలోని విశ్రమ్ ఘాట్

3. అలకనంద నది, బద్రీనాథ్ ధామ్

4. నర్మదా నది, మహేశ్వర్, మధ్యప్రదేశ్

5. గోదావరి నది, పుస్కర్ ఘాట్ రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్

6. కావేరీ నది, పల్లిపాళయం, తమిళనాడు

7. మందాకిని నది, ఉత్తరాఖండ్

8. సరయూ నది, సరయూ ఘాట్, అయోధ్య

9. సరస్వతి నది, భీమ్ పుల్, మన గ్రామం, ఉత్తరాఖండ్

10. శిప్రా నది, రామ్ ఘాట్, ఉజ్జయిని

11. కృష్ణా నది, విజయవాడ

12. సింధు నది, లేహ్ లడఖ్

అన్ని చిత్రాలను అసలైన ఫోటోగ్రాఫర్‌లు అద్భుతంగా తీశారు. వారికే క్రెడిట్
సేకరణ

తెలుగు పుస్తక ప్రపంచం

06 Dec, 02:41


Channel photo updated

తెలుగు పుస్తక ప్రపంచం

05 Dec, 09:12


గుర్తు పెట్టుకోండి.. ఆ మూడు మన జీవితాంతం ఉండవు: పూరి జగన్నాథ్‌
""""""""""""""""""""""""""""

పవర్‌.. మనీ.. సక్సెస్‌ మన జీవితాంతం ఉండవని, అవి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా బతకడం నేర్చుకోవాలని సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) అభిప్రాయపడ్డారు.

పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా 'రీప్లేసబుల్‌' అనే అంశంపై మాట్లాడారు.

''ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. 'నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో' అని చాలా అనుకుంటారు. ఏం నష్టం లేదు. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్‌కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు. ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయినా, మీ టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ పక్కన పెడతారు''

''ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో మీ రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటివరకూ సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు. కానీ, ఇటు మీ స్పీచ్‌ నడుస్తుంటే, మీ యాక్సిస్‌కార్డును ఇంకొకడు డి-యాక్టివేట్‌ చేస్తుంటాడు. మరొకడు మీ అఫీషియల్‌ మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మార్చేస్తాడు. మీకు కాఫీ ఇచ్చే బాయ్‌ అప్పటికే మీ డెస్క్‌ ఖాళీ చేసి, అన్నీ మీ కారులో పెట్టేసుంటాడు. మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మీ పక్కనే బాధగా నిలబడి, మీ స్పీచ్‌ అయిపోగానే ఓ పెగ్‌ వేద్దామని చూస్తుంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే''

''ఆఫీస్‌ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు, సూచనలు తీసుకుంటారని ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. ఏదైనా సలహా కావాలంటే చాట్‌-జీపీటీని అడుగుతాడు. ప్రపంచం ఎంతో వేగంతో పరిగెడుతోంది. కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. మనం అందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? స్టీవ్‌జాబ్స్‌ను అతని సొంత కంపెనీలోనే రెండు సార్లు మార్చారు. జీవితమంతా నిరూపించుకుంటూ బతకలేం. మంచి పొజిషన్‌.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. తర్వాత అందరూ మర్చిపోతారు. 'నేనే లేకపోతే' అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. కానీ, కొత్త కోడలు వస్తుంది. ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది''

''ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. కొత్త సవాళ్లను ఎదుర్కోండి. మిమ్మల్ని వీరు గౌరవించుకోండి. ఇంకా ఆఫీస్‌ను నెత్తిమీద పెట్టుకుని మోయద్దు. హాలీడేకు వెళ్లండి. మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి. పవర్‌.. మనీ.. సక్సెస్‌.. జీవితాంతం ఉండవు. అవి ఉన్నప్పుడు లేనప్పుడూ బతకడం నేర్చుకోవాలి. 'నేనే లేకపోతే..' అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకంలో అమ్మ, ఆమె చేసిన వంట తప్ప, మిగతావాటిని అందరూ మార్చవచ్చు'' అని పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చారు.

తెలుగు పుస్తక ప్రపంచం

05 Dec, 09:02


ఆంధ్రుల ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఆ సంస్థ, 2021 డిశంబరు ఒకటోతేదీకి,డెబ్భై మూడు వత్సరాలు పూర్తిచేసుకుంది ...ఈ ఏడు 76 వసంతాలు పూర్తి అయ్యాయి
ఇన్నేళ్లుగా,అది లలితకళలను,కళాకారులను సజీవంగా నిల్పింది.నిరంతరం సామాజిక చైతన్యాన్ని రగులుస్తూ,ప్రజల నైతిక బాధ్యతలను గుర్తుచేస్తూ,రైతులకు సూచనలిస్తూ,వాతావరణ విశేషాలను తెలియజేస్తూ,విద్యావైజ్ఞానిక అంశాలను వివరిస్తూ,విద్యార్థులకు దిశానిర్దేశంచేస్తూ,గ్రామగ్రామాలకూ ఇంటింటికీ వినోదాన్ని పంచుతూ,వార్తలను చేరవేస్తూ,తెలుగుభాషా సంస్కృతులకు పట్టంకడుతూ ఉదయం ఆరునుండి రాత్రి పదకొండున్నర వరకూ నిర్విరామంగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంది...
ఎందరో మహానుభావుల కలలపంట...ఎందరో ప్రతిభావంతులకు ఆశ్రయమిచ్చిన కల్పతరువు...అంతరించిపోతున్న ఎన్నో కళారూపాలకు బాసటగా నిలచిన కామధేనువు..
అదే తెలుగుప్రజల గుండెచప్పుడు..బెజవాడ ఆకాశవాణి..
ఎన్నో ఆటుపోటుల నెదుర్కొంటూ..కష్టనష్టాల తాకిడిని తట్టుకుంటూ..డెబ్భై వసంతాల మైలురాయిదాటి, విజయోత్సవం చేసుకుంది ...
1948 డిశంబరు 1 వరకూ తెలుగుగడ్డపై ఆకాశవాణి లేదు. 'గాయకసార్వభౌమ' పారుపల్లి రామకృష్ణయ్యగారు, మరికొందరు పెద్దలు కలసి,'తమిళ ప్రాంతంలో మదరాసు మాత్రమే కాక,తిరుచిరాపల్లిలోనూ ఆకాశవాణి కేంద్రం ఉంది.ఇక్కడ, హైదరాబాదులో నవాబు ఏలుబడిలోని నైజామురేడియో తప్ప,తెలుగువారికి ఆకాశవాణి కేంద్రం లేదు.ఆంధ్రుల గళం వినిపించేందుకు తెలుగుగడ్డపై ఒక రేడియో ఉండవలసిన అవసరం ఎంతైనాఉంది' అంటూ..ఈ ప్రాంతంలో ఉన్న వివిధరంగాల ప్రముఖుల పేర్లను ఉటంకిస్తూ,వందలాదిగా సంతకాలు సేకరించి, కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు.
వారి కృషి ఫలించింది.అప్పటి సమాచారశాఖ మంత్రి స్వర్గీయ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో తెలుగునాట నడిబొడ్డున బెజవాడలో రేడియో కేంద్రమొచ్చింది.పారుపల్లివారి గాత్రం,ద్వారంవారి వైలిన్ కార్యక్రమాలతో ప్రసారాలు ప్రారంభమయ్యాయి..
రజని,మంగళంపల్లి,ఓలేటి,పింగళి,బందా,శ్రీరంగం,జలసూత్రం,నండూరి,సంధ్యావందనం,ప్రయాగ,వింజమూరి,తెన్నేటి,నల్లన్చక్రవర్తుల,అన్నవరపు,దండమూడి,ముసునూరి,చివుకుల,మల్లిక్,ఉషశ్రీ,ఇంద్రగంటి,ఆనంద్,కొప్పుల,పేరి,శంకరమంచి,రామం,సుందరంపల్లి,యెల్లా,రేవూరి,మంగళగిరి,మల్లాది,సుమన్,పాండురంగ,అంపోలు,మహాదేవు...ఒకరా,ఇద్దరా..వివిధ రంగాలకు చెందిన ఎందరెందరో నిష్ణాతులు ఆకేంద్రానికి సేవలందించి,తెలుగు(వాణి) వారి కీర్తిపతాకాన్ని వినువీధిలో ఎగురవేశారు.
బెజవాడ సంగీత శిక్షణ,నిలయవిద్వాంసుల వాద్యగోష్ఠి,భక్తిరంజని కార్యక్రమాలు తమిళనాట కూడా బహుళ ప్రసిద్ధాలయ్యాయి.రేడియో నాటకాలు క్రొత్త ఒరవడి సృష్టించాయి.సామాన్య ప్రజానీకంతో మమేకమైపోతూ,'రేడియో వినటం అనేది ఒక నిత్యకృత్యం'గా ఒకనాడు ఉండేది. 'జనరంజని' సినిమాపాటల వేళకు భోజనాలు ముగించి,రేడియో చుట్టూ కుటుంబసభ్యులంతా చేరేవారు.రేడియో అనౌన్సర్లకు సినీనటులవలె అభిమానులు ఉండేవారు.
కాలక్రమేణా వివిధభారతి,ఎఫ్ఫెం రైన్ బోకృష్ణవేణి..ఇలా ఎన్ని శాఖలు వచ్చిచేరినా,విజయవాడ'ఏ' కేంద్రం ప్రత్యేకత దానిదే....
బెజవాడ రేడియోతో నాకు నలభై తొమ్మిది సంవత్సరాల అనుబంధం ఉంది.నాకు పన్నెండేళ్ల వయసులో 'బొమ్మరిల్లు' లో 'బాలల సంగీతసభ' లో పదిహేనురూపాయల కాంట్రాక్టుకు పాడిన రోజునుండి ఈనాడు ఒక సంగీత ప్రయోక్తగా అదే కేంద్రంలో పనిచేయటం దాకా...
నాచిన్నతనంలోని పాత రేడియో స్టేషను జ్ఞాపకాలు మరపురావు.ఆ ప్రాంగణాన్ని (ప్రస్తుత దూరదర్శన్ ఉన్నచోట) సమీపించగానే ఏదో లోకంలోకి అడుగిడినట్లు ఉండేది.పెద్దపెద్ద చెట్లమధ్య,పైకి పెంకుటిల్లులా కనిపించేది...ఇరువైపులా దారిపొడుగునా ద్వారం వరకూ పూల కుండీలు వరుసగా పేర్చగా,వాటిలోని బంతిపూలు పరిమళాలు వెదజల్లేవి...నిలయ కళాకారులందరూ తెల్లటి జుబ్బా,పంచెకట్టి,ఒకరితో మరొకరు చతురోక్తులాడుకుంటూ దర్శనమిచ్చేవారు.నాటకాల రిహార్సల్సూ,దేశభక్తి గీతాల సాధనలూ...ఇవన్నీ విశాలమైన ప్రాంగణంలోని చెట్లక్రిందే..గుంపులుగుంపులుగా కూర్చొని కొనసాగించేవారు.మేడపైకి చెక్కమెట్లు..పైన ఆఫీసుగదులు....
ఇక లోపలికి అడుగిడగానే పెద్దహాలు,మధ్యలో అద్దాలపెట్టెలో కొత్తగా కట్టబోతున్న (ప్రస్తుత)రేడియో స్టేషన్ భవంతి నమూనా...దానిపై అందంగా అమర్చిన పూలగుత్తుల పింగాణీ జాడీ...ఎదురుగా మూడు స్టూడియోలు..ఒకటి సంగీతానికి,రెండవది నాటకాలకు,మూడవది ప్రసంగాలకు...లోపల కార్యక్రమం ప్రసారమౌతున్నదని హెచ్చరిస్తూ తలుపులకు పైన వెలిగే ఎర్రలైట్లు..చేతిలో కాగితాలు పట్టుకొని,హడావుడిగా అటూఇటూ నడిచే అనౌన్సర్లు..ఒకమూల స్పీకరునుండి మంద్రగంభీరంగా వినిపించే ప్రత్యక్ష ప్రసారం..పైకప్పున చిన్న శబ్దంతో అలుపెరుగక తిరిగే పంకాలు...తెల్లటి గోడలకు శబ్దనియంత్రణరంధ్రాలు..గది గోడలకానుకొని రెండువైపులా సోఫాలు..వాటిలో కాలుమీద కాలేసుకొని దర్శనముచ్చే లబ్ధప్రతిష్టులు...

తెలుగు పుస్తక ప్రపంచం

05 Dec, 09:02


ఆనాడు నేననుకునేవాణ్ని..'ఏనాటికైనా ఉద్యోగమంటూ చేస్తే ఇక్కడే చేయాలి'...అని.దేవుడు ఆనాడే 'తథాస్తు' అంటూ దీవించాడేమో..32 ఏళ్ళు అక్కడ పనిచేసి ఎన్నో కార్యక్రమాలను రూపొందించే భాగ్యం నాకు కలిగింది..
బెజవాడ ఆకాశవాణికి విజయోస్తు..దిగ్విజయోస్తు....

-Modumudi Sudhakar

తెలుగు పుస్తక ప్రపంచం

03 Dec, 13:26


గండకి నది చరిత్ర..

గండకీ అనే వేశ్య గర్భంలోనే మహావిష్ణువు పుడతాడు,

సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం అంటూ ఉంటారు. వాటిపై విష్ణువు రూపం ఉటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్కగండకీ నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు. వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం.

గండకీ ఒక వేశ్య

ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి. తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది. గండకీ ఒక వేశ్య.


గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డ వాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది.


భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది
తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించడమే కాదు తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది.


మారువేషంలో బేరం కుదుర్చుకున్నాడు
గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఒక రోజు ముందు మారువేషంలో వెళ్లి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండికి కూడా అతను మంచి వాడిలాగా కనిపించాడు కాబట్టి ఒక రోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు.


సరే అని.. గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసి వేస్తే ఒంటినిండా పుండ్లు కనపడ్డాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధద్రవ్యాలను గండకి ఆయన్ని పూసింది. కొత్త బట్టలు తొడిగించింది.


పక్క మీదకు తీసుకెళ్తుంది
తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమెనే తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజు అంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు.


చితిలోకి దూకుతుంది
తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీసహగమనం చెయ్యడానికి సిద్ధం అవుతుంది. అందరూ అడ్డుకున్న కూడా వినదు. తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుంది.


విష్ణువునే గర్భాన పుట్టాలని కోరుకుంటుంది
అయితే మంటలు ఒక్కసారిగా మల్లె పూల మాదిరిగా మారుతాయి. విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు. గండకీ సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏ వరం కావాలో కోరుకో గండకీ అంటాడు విష్ణు మూర్తి. గండకీ విష్ణువునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది. సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు.


గండకీ మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే సాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది సాలిగ్రామం, గండకీ కథ.


తులసి శాపం వలన సాలగ్రామం గా మారిన విష్ణువు గండకీకి ఇచ్చిన వరం వలన గండకి నదిలోకి సాలగ్రామ రూపంలో చేరతాడు.. ఈ గండకి నది నేపాల్ లో ఉంది. ఖాట్మండు వెళ్లే దారిలో కనిపిస్తుంది. ఈనదిలోనే సాలగ్రామలు దొరికేది. మనం పూజించే చిన్ని చిన్ని సాలగ్రామలు ఇక్కడి నుండి వచ్చినవే..

తెలుగు పుస్తక ప్రపంచం

28 Nov, 04:37


శర్కరా నుంచి షుగర్‌ అనే పేరు ఎలా వచ్చిందో !

3000-4000 సంవత్సరాల క్రితం మన హిందూ పూర్వీకులు చెరకు రసం నుండి బెల్లాన్ని కనుగొన్నారు.

తర్వాత, 1వ శతాబ్దంలో, మన హిందూ పూర్వీకులు మొట్టమొదట సర్కార్య లేదా శక్కర్ తయారీ ప్రక్రియ మరియు సాంకేతికతను కనుగొన్నారు, దీనిని ఆధునిక యుగంలో షుగర్ అని పిలుస్తారు.

"చక్కెర" అనే పదం యొక్క ఉత్పన్నం లాటిన్ సుక్కరం నుండి వచ్చింది, ఇది పెర్షియన్ షకర్ / సంస్కృత పదం షకర నుండి వచ్చింది. సంస్కృత పదం "శర్కరా" అనేది స్ఫటికీకరించబడిన చక్కెరను సూచిస్తుంది మరియు పురాతన సింధు-సరస్వతి లోయ నాగరికత నుండి ఉద్భవించిందని నమ్ముతారు.

స్వతంత్ర ఉత్పత్తిగా చక్కెర మొదట భారతదేశంలో కనుగొనబడింది. ప్రాచీన భారతానికి సంబంధించిన సంస్కృత లిటరేచర్ 1500 మరియు 500 BC మధ్య కాలంలో వ్రాయబడిన డాక్యుమెంటేషన్‌. బెంగాల్ & భారతదేశంలో 'సాంప్రదాయ బ్రౌన్ చెరకు సాగు మరియు చక్కెర తయారీ విధానం" .

వ్యాపార వాణిజ్య విస్తరణ ద్వారా, వివిధ దేశాలలో సక్కర్ తయారు చేసే సాంకేతికత ప్రజాదరణ పొందింది
పార్షియాలో సక్కర్ షాకర్ అయ్యింది.
అరేబియాలో సక్కర్ షుక్కర్‌గా మారింది.
12వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో చేరిన ఈ సక్కర్ సుక్రేగా మారి ఆంగ్లంలో షుగర్‌గా మారింది.

కానీ మన పూర్వీకులు సక్కర్ (బెల్లం)ని బ్రౌన్ కలర్‌లో తయారు చేశారు, కానీ ఆధునికంగా అది రంగును మార్చి చిన్ని అని పిలుస్తారు.

భారతీయ శక్కర్ వాణిజ్యం ద్వారా చైనాకు చేరుకున్నప్పుడు, చైనీస్ చక్రవర్తి దానిని చూసి ఆశ్చర్యపోయాడు మరియు భారతీయ నుండి చైనాకు శక్కర్ తయారు చేసే సాంకేతికతను తీసుకురావడానికి రెండు మిషన్లను పంపాడు.

6 వ శతాబ్దం నాటికి చైనీస్ సన్యాసులు చక్కెర తయారీ ప్రక్రియను భారతదేశం నుండి చైనాకు తీసుకువెళ్లారు. అయితే చైనీయులు ఈ పద్ధతిని మెరుగుపరిచారు మరియు దానిని మరింత మెరుగుపరిచారు, ఇది తెల్ల చక్కెర ఉత్పత్తికి దారితీసింది.

తెల్ల చక్కెరను వాణిజ్యం ద్వారా భారతదేశానికి తిరిగి తీసుకువచ్చినప్పుడు, చైనా అనే పదానికి సంబంధించి దీనిని చిన్ని అని పిలుస్తారు.
ఆ సమయంలో తెల్ల చక్కెర ఒక విలాసవంతమైన వస్తువుగా పరిగణించబడింది, కానీ 18వ శతాబ్దం నాటికి, చక్కెర చాలా చౌకైన ఉత్పత్తిగా మారింది మరియు భారతీయులు తెల్ల చక్కెరను ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభించారు.

By -
Dr. Adarsha Gowda
Chairperson of Entrepreneurship & Consultancy
Head, Dept of Food Science,
Dept of Food Processing,
St Aloysius (Deemed to be University)
Mangaluru, Karnataka, India.

తెలుగు పుస్తక ప్రపంచం

26 Nov, 09:58


To improve your writing, read more.
To improve your thinking, write more.
To improve your storytelling, present more.

To improve your energy, rest more.
To improve your understanding, teach more.
To improve your network, give more.

To improve your happiness, appreciate more.

తెలుగు పుస్తక ప్రపంచం

24 Nov, 14:39


అబ్బో ...... సంస్కృతానికి ఇంత వుందా మాకే తెలియలేదు

😵😨🚩🚩🚩🚩🚩🚩 #సంస్కృతభాష_ప్రపంచాన్నితనవైపు_తిప్పుకుంటోంది

సంస్కృతభాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది.

1.NASA వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే

2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే.

3. ప్రస్తుతానికి సంస్కృతభాషలో 102,78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి.

4.సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు 'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి.

5.NASA వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది.

6.1987 లో Forbes మ్యాగజీన్ computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది.

7. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు.

8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో, నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే.

9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావు.

10. సంస్కృత సంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం.

11.జర్మనీ లోని 14 యూనివర్సిటీ లలో సంస్కృతబోధన జరుగుతోంది.

12. NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట. చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థమూ మారదు. ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే 1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే 2.పాఠశాలాం గచ్ఛామి అహం.3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చెప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది.

13. ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృతభాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు.

14.NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే.

15.సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలలో ఋజువు పరచుకుని ప్రస్తుతం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించారు.

16. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో ( కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా ) Technical Courses లో సంస్కృతబోధన జరుగుతోంది.

తెలుగు పుస్తక ప్రపంచం

24 Nov, 11:59


*🌿🌺🌿 సేకరణ: ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, AP. దివ్యాoగుల నెట్ వర్క్, పులివెందుల, కడపజిల్లా. 🌿🌺🌿*

తెలుగు పుస్తక ప్రపంచం

24 Nov, 11:59


*🌷జన్మతః అంధుడు, గణిత బ్రహ్మగా పేరొందిన "లక్కోజు సంజీవరాయశర్మ" గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు🌷*

*👉కడప జిల్లాకు చెందిన లక్కోజు సంజీవరాయశర్మ గొప్ప గణిత మేధావిగా పేరు గాంచారు. దేశ, విదేశీయుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందినవారు. 1907 నవంబర్‌ 22న జన్మించారు. పుట్టుకతోనే చూపులేదు. అంధుడు పుట్టాడని పెంచడం కష్టమని.. గొంతు పిసికి దిబ్బలో పూడ్చేయాలని మంత్రసాని సలహా ఇచ్చింది. మరికొందరు మహిళలు పురిటి బిడ్డ నోట్లో వడ్ల గింజలు వేశారు. అయినా ఆ పసివాడు చావలేదు సరికదా.. చక్కగా ఆరోగ్యంగా ఎదిగాడు. ప్రపంచం ఈర్ష్యపడే స్థాయికి పేరుగాంచారు.*

*👉ఆ రోజులలో బ్రెయిలీ లిపి లేకపోవడంతో సంజీవరాయ శర్మ చదువుకునేందుకు వీలు కాలేదు. అక్క బడికి వెళ్లి వచ్చాక ఇంటి వద్ద పాఠాలను గట్టిగా చదువుతుంటే విని గుర్తు పెట్టుకునేవాడు. అలా ఆయనకు మామూలు పాఠాలతోపాటు గణితం బాగా వచ్చింది. అందులో అపార జ్ఞానం సాధించారు. అతని బాల్య దశలోనే తండ్రి చనిపోయారు. తల్లే పెంచింది.*

*👉పల్లెల్లో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు తదితర అంశాలను సంజీవరాయశర్మ క్షణాల్లో చెప్పేవారు. రైతులు ఈ సాయానికి గానూ ఆయనకు అంతో.. ఇంతో డబ్బు ఇచ్చేవారు. ఆ వయసులోనే వయొలిన్‌ పట్ల ఆకర్షితుడై వాయించడం నేర్చుకున్నారు. తర్వాత వయొలిన్‌ వాయించడం జీవితంలో ఒక భాగమైంది.*

_*🍁గణితంలో ప్రజ్ఞ🍁*_

*👉సాహిత్యంలో కవులు అవధానాలు చేయడం తెలిసిందే. అంటే 8 మంది వరుసగా ప్రశ్నలు వేస్తుంటే ఆయా అంశాలకు వెంట వెంటనే పద్యాల రూపంలో జవాబు చెప్పాలి. అలాగే గణితంలో కూడా అవధానం ఉంది. లక్కోజు సంజీవరాయ శర్మ గణితంలో అవధానాలు చేయడంలో దిట్టగా మారారు. పుట్టిన తేదీ, సంవత్సరం, ప్రదేశం, సమయం చెప్పగానే ఆయన దానికి సంబంధించిన తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చెప్పేసేవారు. దాంతోపాటు క్లుప్తంగా జాతకాన్ని కూడా తెలిపేవారు.*
*👉అలా ఆయన దేశమంతటా మొత్తం 6 వేల గణిత అవధానాలు చేశారు. వేలాది మంది కూర్చున్న సభలో నిమిషానికి 20, 30 కష్టమైన లెక్కలకు అడిగిన వెంటనే సమాధానాలు చెప్పేవారు. ప్రశ్న అడగ్గానే వయొలిన్‌ను కొద్దిగా పలికించి వెంటనే సమాధానం చెప్పేవారు. ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అని అడిగితే దైవ దత్తంగా వచ్చిందని బదులిచ్చేవారు. ప్రపంచంలోనే గణితం విషయంలో బెంగళూరుకు చెందిన శకుంతలాదేవి కంప్యూటర్‌ను ఓడించిందంటారు. అలాంటి శకుంతలాదేవినే ఓడించిన గొప్ప వ్యక్తి లక్కోజు సంజీవరాయశర్మ. ఎంత పెద్ద లెక్క అడిగినా కూడా క్షణాల్లో బదులిచ్చేవారు.*

_*🍁గౌరవ పురస్కారాలు🍁*_

*👉గణితంలో లక్కోజు గొప్పతనం తెలిసి.. దేశమంతటా ఎందరో గొప్పవాళ్లు ఆయన అవధానాలకు వెళ్లేవారు. మరికొందరు పెద్దలు ప్రత్యేకంగా అవధానం చేయించి విని ఆశ్చర్యపోయేవారు. 1959లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ ఢిల్లీలో లక్కోజుతో గణిత అవధానాన్ని ఏర్పాటు చేయించి, తిలకించారు. ఆ కార్యక్రమానికి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా హాజరయ్యారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 1996లో గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది. తొలిసారిగా 1928లో గణిత అవధానం చేశారు. 1995 వరకు దేశమంతటా 6 వేల ప్రదర్శనలు ఇచ్చారు. 1928 నవంబర్‌ 15న నంద్యాలలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలో ప్రధాన ఆకర్షణగా నిలిచి వందలాది లెక్కలకు బదులిచ్చారు. 19 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అప్పట్లో ఆయన సతీమణి వయసు 9 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. 1994 జనవరి 5న ఆమె శ్రీకాళహస్తిలో ఉండగా మరణించారు. సంజీవరాయశర్మ హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1997 డిసెంబర్‌ 2న కన్నుమూశారు. ప్రపంచం మొత్తాన్ని తన అద్భుతమైన గణిత విద్యతో ఆకట్టుకున్న గొప్ప వ్యక్తి ఇంత వరకు ఈ భూమిపై మరొకరు పుట్టలేదని.. ప్రపంచంలోని గణిత మేధావులంతా ఎంతో ప్రశంసించారు.*

*👉ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న లూయిస్ బ్రెయిల్ ,హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు మంచి శిక్షణ పొందారు. కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే... ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు శర్మ.*

*👉ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ''ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం'' అని శర్మనుద్దేశించి అన్నారు. శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది.'అంక విద్యాసాగర' విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీకాళహస్తీశ్వరస్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు! ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు... ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో.*

తెలుగు పుస్తక ప్రపంచం

23 Nov, 09:05


"బాపు గారి తో నేను"
(ఒక సమీక్ష)

పుస్తకాలు పలురకాలు!

కొన్ని కాలక్షేపానికి చదువుతాం. కొన్ని మన విషయం పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు చదువుతాం. మరికొన్ని రచయిత/త్రి శైలి మనని మొదలుపెడితే ఆపనివ్వకుండా చదివించటం వలన చదువుతాం. చదివినవన్నీ మనసుకు హత్తుకోవాలనీ లేదు, మనకు నచ్చాలనీ లేదు.

కానీ నచ్చిన పుస్తకాలు మటుకు మనకు నేస్తాలవుతాయి. ఎవరో మహానుభావుడు అన్నాడుట! ఓ కొత్త పుస్తకం చదివితే ఓ కొత్త స్నేహితుడు దొరికినట్టు. చదివిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే, పాత స్నేహితుణ్ణి తిరిగి కలిసినట్టు అని. మరి ఒక పుస్తకాన్ని పదేపదే చదివితే అర్థం ఏమిటంటే ఆ పుస్తకం మన ప్రాణ మిత్రుడైనట్టు. అతణ్ణి కలవకుండా మనం ఉండలేనట్లు!

ఇటీవల కాలంలో ఆవిష్కరించబడిన అనేక పుస్తకాలలో నా మనసుకు బాగా హత్తుకుంది "బాపు గారి తో నేను" అనే పుస్తకం. దీని రచయిత శ్రీ బ్నిం గారు. బాపుగారితో తన జీవితంలో మూడొంతుల కాలాన్ని (శ్రీ బాపూగారు మనల్ని విడిచి వెళ్లేవరకూ) స్నేహమయం చేసుకున్న బ్నిం గారు తన అనుభవాలను, అనుభూతులను అక్షరరూపంలోకి అనువదించి మన ముందుంచిన పుస్తక నైవేద్యం.

ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పుస్తకం కేవలం చదివి పక్కకు పడెయ్యలేము. మనసుకు హత్తుకునే ఎన్నో సంఘటనలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఆత్రేయపురంలో పుట్టి, ఒక అపురూపమైన, అపూర్వమైన కళాకారుడు వేసిన బొమ్మలను కేవలం పుస్తకాలలో చూసి ఆయనకు ఏకలవ్య శిష్యుడుగా మారి (ఏకలవ్యుడంటే ఇక్కడ అర్థం ఆయనను మాత్రమే ప్రేమించేవాడని సుమా!) ఆయన పరిచయాన్ని, స్నేహాన్ని, దరిమిలా ప్రేమను కూడా సంపాదించి తన జీవితం ధన్యమయ్యిందని భావించే బి. నరసింహమూర్తి అనే నామధేయంగల బ్నిం గారి జీవితం ఈ పుస్తకం. ఆ మహోన్నత కళాకారుడు శ్రీ బాపుగారని వేరే చెప్పాలా?

బ్నిం గారికి బాపు గారంటే పిచ్చి. బ్నిం గారికి బాపుగారంటే ప్రేమ. వెరసి బ్నిం గారికి బాపుగారంటే పిచ్చిప్రేమ! ఈ పుస్తకం నిండా అదే కనిపిస్తుంది. చదివేవారికి ఆశ్చర్యమనిపిస్తుంది.

విశేషమేమిటంటే బాపూగారికి కూడా బ్నిం గారంటే అంతే ప్రేమ. లేకపోతే ఆయన్ని చేయి పట్టుకుని ఒక తండ్రి తన బిడ్డను నడిపించినట్లు నడిపిస్తారా?
ఆయన పేరును లెటర్ పాడ్ మీద వేసుకోవటానికి అనువుగా రాయటం దగ్గరనించి, తాను వేసిన ప్రతి బొమ్మల సెట్ నొకదానిని ఆయనకు పంపటం వరకు బాపుగారు బ్నిం గారిమీద అభిమానాన్ని ఎన్నో రూపాలలో వ్యక్తపరిచారు. తన అనుంగు శిష్యుడిగా తీసుకుని సినిమా రంగానికి సంబంధించిన ఎన్నో విషయాలను సవివరంగా, విస్తారంగా తెలియజేసారు. అందుకు సంబంధించిన ఎన్నో విశేషాలు, వర్ణ చిత్రాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి.

వృత్తిపరంగానే కాదు వ్యక్తిగా కూడా బ్నిం గారితో బాపు గారి అనుబంధం అద్భుతమైంది. వారిద్దరిమధ్య స్నేహలత ఎంత గాఢంగా పెనవేసుకుందో ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుంది. పువ్వుతో పాటు తావిలాగా బాపూగారితో స్నేహంతో పాటు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారితో స్నేహం కూడా అయాచితంగా లభించింది బ్నిం గారికి. బాపురమణలతో కలిసి గడిపిన రోజుల గురించి ఈ పుస్తకంలో ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు.

అలాగే సందర్భానుసారంగా ఇంకా అనేకమంది మిత్రుల ప్రస్తావన, ప్రశంసలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఇది కేవలం ఒక పుస్తకం కాదు. ముందే చెప్పినట్లు ఒక జ్ఞాపకాల దొంతర. ఆ జ్ఞాపకాలు మన మనసులనూ హత్తుకుంటాయి, వదలనంటాయి. హృదయాలను తడుముతాయి, తడుపుతాయి. అందుకే ఈ పుస్తకాన్ని చదవాలి. మన పుస్తకాల ఖజానాలో దాచుకోవాలి.

చదివిన తరువాత మీరూ అంటారు, "సరస్వతీ, భలే పుస్తకాన్ని చదివించావు!" అని. మరెందుకు ఆలస్యం? తప్పక చదవండి.

చెప్పటం మరిచిపోయాను... ఈ పుస్తకం నిండా బాపుగారి బొమ్మలే! అంటే బాపుగారు గీసిన బొమ్మలన్నమాట! బాపు అభిమానులు అస్సలు మిస్సవకూడదు మరి!

ఈ పుస్తకం కావాలంటే మీరు సంప్రదించాల్సిన నెంబరు:-8341450673

తెలుగు పుస్తక ప్రపంచం

22 Nov, 02:51


జీవిత పాఠం ఎవరు నేర్పుతారు ?



కొన్ని నెలల క్రితం నాగార్జున సాగర్ వెళ్ళాము. ఎండ పేలిపోతున్నది.

రోడ్డు పక్కన ..ఎర్రటి ఎండలో కూర్చుని దానిమ్మ పండ్లు అమ్ముతున్నారు కొందరు మహిళలు.

మనమైతే అంత ఎండలో పది నిముషాలు కూడా ఉండలేము. చెమటలు కారిపోతున్నాయి.

"ఎలా ఇస్తావ్" అడిగాను.

"వందకు అయిదు. ఆరిస్తాను తీసుకోండి.." చెప్పింది.

"అదేమిటి? నువ్వే అయిదు అన్నావు. నువ్వే ఆరంటున్నావు.?" ఆశ్చర్యంగా అడిగేను.

"నేను అనకపోయినా మీరు అడుగుతారు గదండి...చెప్పడమే ఆరు చెబితే మీరు ఏడు అడుగుతారు." అన్నది ముఖంలో ఎలాంటి కవళికలు లేకుండా.

మానవ మనస్తత్వాలు చదవడానికి యూనివర్సిటీకి వెళ్లి సైకాలజీ కోర్సులు చదవక్కరలేదు. మనచుట్టూ ఉన్నవారు ఎన్నో బోధించగలరు. అనుభవం గొప్ప పాఠాలను నేర్పుతుంది.

దాదాపు పదిహేను ఏళ్ళ క్రితమే ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ముఖ పుస్తకం లో వ్రాశాను.రోడ్ల పక్కన అమ్మే కూరలు, పండ్లు కొనేటప్పుడు బేరం చెయ్యటం మానేశాను. . ఇష్టమైతే కొంటాను లేకపోతే లేదు.

పెద్ద పెద్ద మాల్స్ కు వెళ్తే అరటిపళ్ళు కూడా కిలోల లెక్కన అమ్ముతారు. కిలోమీద ఒక్క గ్రాము ఎక్కువ ఉన్నా దానికీ బిల్లు పడుతుంది. దోసకాయలు అరకిలో తీసుకుంటే మీడియం సైజువి మూడు వస్తాయి. నిజానికవి మరో యాభై..వందగ్రాములు ఎక్కువే ఉంటాయి. కానీ వీధుల్లో కూరలు అమ్మేవారు అరకిలోగానే లెక్కిస్తారు. ఏసీ మాల్స్ కు వెళ్తే అరగ్రాము బరువు కూడా కౌంట్ చెయ్యబడుతుంది.

ఒక ఖరీదైన రెస్టారెంట్ కు వెళ్తే కప్పు కాఫీ యాభై రూపాయలు ఉంటుంది. అదనంగా టాక్స్ ఉంటుంది. నోరెత్తకుండా కట్టేస్తాం. రెండు రూపాయలు తగ్గిస్తావా అని అడగం. పైగా గొప్పలకు పోయి తెచ్చినవాడికి టిప్పుగా పదిరూపాయలు ఇస్తాము. మనం టిప్పు ఇవ్వకపోయినా వాడేమీ ఏడవడు. ఇచ్చినంతమాత్రాన మన కాళ్ళమీద పడి దణ్ణం పెట్టడు. అంతా మనం తెచ్చిపెట్టుకున్న హెచ్చులే.


బ్యాంకులకు వేలకోట్లు ఎగగొట్టి విదేశాలకు పారిపోయేవారు, అధికారపార్టీలో దూరిపోయి చట్టం నుంచి తప్పించుకునేవారిలా వీధుల్లో అమ్ముకునే చిరువ్యాపారులు దేశద్రోహులు కారు కదా? మాల్స్, రెస్టారెంట్స్ కు వెళ్లి ఎంత చెబితే అంతకు నోరు మూసుకుని కొనే మనకు వీధుల్లో కూర్చుని, ఎండల్లో తిరుగుతూ చెమటలు కక్కుతూ, అమ్ముకునే కష్టజీవుల దగ్గర నోరు తెరిచే హక్కు ఎక్కడిది? వారికో రూపాయి ఎక్కువ ఇచ్చినా తప్పేముంది? ఆ రూపాయితో మన పిల్లలకు చాకోలెట్ కూడా రాదు.

సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో తెలుసుకోవచ్చు. కథలు కూడా ఇలాంటి పరిశీలన వలనే పురుడు పోసుకుంటాయి. సామాన్యుడు వెంటనే మరచిపోతాడు. రచయిత దాన్ని కథా శిల్పంగా చెక్కి సమాజానికి కథ రూపం లో అందిస్తాడు.

మిత్రుని పోస్ట్ / జీవితకాల అనుమతి తో

తెలుగు పుస్తక ప్రపంచం

19 Nov, 00:17


#400 ఏళ్లుగా వర్షాలు పడని భూమిపై అత్యంత పొడిబారింది! చుక్క నీరు కూడా లేదు!
400 ఏళ్లుగా వర్షాలు పడని అటకామా ఎడారి ప్రకృతి దృశ్యం ప్రత్యేకం. అటాకామా యొక్క ప్రకృతి దృశ్యం సైన్స్ ఫిక్షన్‌లో మాత్రమే కనిపించే దృశ్యాలను గుర్తు చేస్తుంది.కొన్ని ప్రాంతాలు అంగారకుడిలా కనిపిస్తాయి.

ఉత్తర చిలీలో 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న అటకామా ఎడారి భూమిపై అత్యంత విస్మయం కలిగించే ప్రకృతి దృశ్యాలలో ఒకటి. అటకామా ఎడారి ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారిగా పేరుగాంచింది. వందల ఏళ్లుగా ఇక్కడ వర్షాలు కురవలేదు. కొన్ని ప్రాంతాల్లో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా శతాబ్దాలు గడిచాయి.

అటకామా యొక్క ప్రకృతి దృశ్యం నిజంగా ప్రత్యేకమైనది. సాల్ట్ ఫ్లాట్‌లు, గాలితో చెక్కబడిన రాతి నిర్మాణాలు మరియు విశాలమైన ఇసుక దిబ్బల ప్రకృతి దృశ్యం సైన్స్ ఫిక్షన్‌లో మాత్రమే కనిపించే దృశ్యాన్ని గుర్తుకు తెస్తుంది. ఎడారిలోని కొన్ని భాగాలు అంగారకుడి ఉపరితలంలా కనిపిస్తాయి.

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA తన మార్స్ రోవర్ల కోసం ఈ ఎడారిని పరీక్షా స్థలంగా ఉపయోగిస్తుంది. ఈ ఎడారి ప్రాంతంలో చంద్రుని లోయ మరియు గాలి-కోసిపోయిన శిఖరాలు వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి.

1570 నుండి 1971 వరకు, అటాకామా ఎడారిలో వర్షం పడలేదు. 1971లో అటకామా ఎడారిలో వర్షం కురిసింది. ఆ తర్వాత వచ్చిన అటకామా డెసర్ట్ బ్లూమ్ అందరి దృష్టిని ఆకర్షించిన అటాకామా యొక్క పుకర్. అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ఎడారి అంతా రంగురంగుల పూలు వికసించాయి. ఎల్ నినో దృగ్విషయం కారణంగా ఇలాంటి వర్షపాతం సంభవించినప్పుడల్లా, ఎడారి వికసిస్తుంది. ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది పర్యాటకులు అటకామాను సందర్శిస్తారు. చివరగా, ఈ సంవత్సరం జూలైలో, అటాకామా ఎడారి పూర్తిగా వికసించింది.

భూమిపై అత్యంత పొడి ప్రదేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, దాదాపు వర్షపాతం లేకుండా, కొన్ని జీవులు ఈ ఎడారిలో నివసిస్తాయి. ఎక్కువగా 'కమాన్సక' అనే తీరప్రాంత పొగమంచు ఈ జీవులకు మద్దతు ఇస్తుంది. అటకామా ఎడారిని ప్రపంచంలోనే అతి పెద్ద పొగమంచు ఎడారి అని కూడా అంటారు. కమాన్‌సక అని పిలువబడే దట్టమైన తీర పొగమంచు ఎడారి యొక్క అరుదైన జాతులను నిలబెట్టడానికి సహాయపడుతుంది. పసిఫిక్ మహాసముద్రం నుండి వీచే ఈ పొగమంచు ఎడారికి కొంత తేమను అందిస్తుంది. ఇది కఠినమైన మొక్కలు, అరుదైన ఆల్గే మరియు కొన్ని జంతువులకు తగినంత నీటిని అందిస్తుంది.

అటకామా ఎడారిలోని కొన్ని ప్రాంతాలలో సంవత్సరానికి ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది. కానీ శుష్క ఎడారి ప్రకృతి దృశ్యం క్రింద "అటాకామా అక్విఫెర్" అని పిలువబడే విస్తారమైన భూగర్భ జలాల నిల్వ ఉంది. ఇది అండీస్ పర్వతాల నుండి వచ్చే పురాతన అవక్షేపాలు మరియు నీటి మిశ్రమంగా భావిస్తున్నారు.

అటాకామా పొడిగా అనిపించవచ్చు. కానీ, మీరు అటాకామాలో ఎల్ టాటియో గీజర్స్ అని పిలువబడే సహజ అద్భుతాన్ని కూడా చూడవచ్చు. ఇది అటాకామాలో ఎత్తైన వేడి నీటి బుగ్గలతో నిండిన ప్రాంతం. ఈ ప్రాంతంలో తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, మీరు భూమిలోని వేడి నీటి బుగ్గల నుండి ఆవిరి రేగులను చూడవచ్చు.

అటాకామాలోని మరొక అద్భుతమైన ప్రదేశం సలార్ డి అటాకామా, చిలీ యొక్క అతిపెద్ద ఉప్పు ఫ్లాట్. ఇక్కడ విస్తారంగా ఉప్పు ఫ్లాట్లు మరియు ఫ్లెమింగోలను చూడవచ్చు. శాన్ పెడ్రో డి అటకామా అటకామా ఎడారి యొక్క గుండె. ఇది అటాకామెనో గిరిజన సంస్కృతికి నిలయమైన అందమైన నగరం. పురాతన శాసనాలు, పాత కోట శిధిలాలు మరియు శక్తివంతమైన స్థానిక మార్కెట్లు ఇక్కడ చూడవచ్చు.

తెలుగు పుస్తక ప్రపంచం

13 Nov, 00:37


ఎక్కడ ఆపాలి తృప్తి ని ??

మేధస్సు మరియు వినోదాన్ని మిళితం చేసే "కౌన్ బనేగా కరోడ్‌పతి" షోని నేను నిజంగా ఆనందిస్తున్నాను. ఇది నా జ్ఞానాన్ని పెంచుతుంది మరియు నా సమాధానాలు సరైనవి అయినప్పుడల్లా నేను చాలా సంతోషిస్తాను.

ఇటీవలి ఎపిసోడ్‌లో, నీరజ్ సక్సేనా "ఫాస్టెస్ట్ ఫింగర్" రౌండ్‌లో అత్యంత వేగంగా సమాధానమిచ్చి హాట్ సీట్‌లో నిలిచాడు.

అతను అరవకుండా, డ్యాన్స్ చేయకుండా, ఏడవకుండా, చేతులు ఎత్తకుండా, అమితాబ్‌ను కౌగిలించుకోకుండా చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. నీరజ్ ఒక శాస్త్రవేత్త, Ph.D. మరియు కోల్‌కతాలోని ఒక విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్. అతను ఆహ్లాదకరమైన మరియు సరళమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. డా. ఎ.పి.జె.తో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తాడు. అబ్దుల్ కలాం మరియు అతను మొదట తన గురించి మాత్రమే ఆలోచించాడని పేర్కొన్నాడు, కానీ కలాం ప్రభావంతో అతను ఇతరుల గురించి మరియు దేశం గురించి కూడా ఆలోచించడం ప్రారంభించాడు.

నీరజ్ ఆడటం మొదలుపెట్టాడు. అతను ప్రేక్షకుల పోల్‌ను ఒకసారి ఉపయోగించాడు, కానీ అతను "డబుల్ డిప్" లైఫ్‌లైన్‌ని కలిగి ఉన్నందున, అతను దానిని మళ్లీ ఉపయోగించుకునే అవకాశం పొందాడు. అతను అన్ని ప్రశ్నలకు సులభంగా సమాధానం చెప్పాడు మరియు అతని తెలివితేటలు ఆకట్టుకున్నాయి. అతను ₹3,20,000 మరియు సమానమైన బోనస్ మొత్తాన్ని గెలుచుకున్నాడు, ఆపై విరామం లభించింది.

విరామం తర్వాత, అమితాబ్, "ముందుకు వెళ్దాం, డాక్టర్ సాహబ్. ఇదిగో పదకొండో ప్రశ్న..." అని ప్రకటించాడు, అప్పుడే నీరజ్, "సార్, నేను నిష్క్రమించాలనుకుంటున్నాను."

అమితాబ్ ఆశ్చర్యపోయాడు. ఎవరైనా చాలా బాగా ఆడుతున్నారు, ఇంకా మూడు లైఫ్‌లైన్‌లు మిగిలి ఉన్నాయి మరియు కోటి (₹1,00,00,000) గెలుచుకునే మంచి అవకాశం ఉన్నందున నిష్క్రమిస్తున్నారా? "ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు..." అని అడిగాడు.

నీరజ్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, "ఇతర ఆటగాళ్లు వేచి ఉన్నారు, వారు నా కంటే చిన్నవారు. వారికి కూడా అవకాశం రావాలి. నేను ఇప్పటికే చాలా డబ్బు గెలుచుకున్నాను. నాకు 'నాకు ఉన్నది చాలు' అని నేను భావిస్తున్నాను. నాకు అంతకుమించి కోరిక లేదు."

అమితాబ్ దిగ్భ్రాంతి చెందాడు మరియు అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం. అప్పుడు అందరూ లేచి నిలబడి చాలాసేపు చప్పట్లు కొట్టారు.

ఈ రోజు మనం చాలా నేర్చుకున్నాం.. ఇలాంటి వ్యక్తిని చూడటం చాలా అరుదు అని అమితాబ్ అన్నారు.

నిజం చెప్పాలంటే, ఇతరులకు అవకాశం రావడం గురించి ఆలోచించే మరియు తమ వద్ద ఉన్నదానికంటే ఎక్కువ అని భావించే వ్యక్తిని నేను వారి ముందు చూడటం ఇదే మొదటిసారి. అతనికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేసాను.

నేడు ప్రజలు కేవలం డబ్బు వెంటే ఉన్నారు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, దురాశకు అంతం ఉండదు. డబ్బు వెంటాడుతూ కుటుంబాన్ని, నిద్రను, ఆనందాన్ని, ప్రేమను, స్నేహాన్ని కోల్పోతున్నారు.

అలాంటి సమయాల్లో డాక్టర్ నీరజ్ సక్సేనా లాంటి వారు గుర్తుకు వస్తారు. ఈ యుగంలో, సంతృప్తి మరియు నిస్వార్థ వ్యక్తులు దొరకడం కష్టం.

అతను గేమ్ నుండి నిష్క్రమించిన తర్వాత, ఒక అమ్మాయి హాట్ సీట్‌లో కూర్చుని తన కథను పంచుకుంది: "మేము ముగ్గురు కుమార్తెలమైనందున మా నాన్న మమ్మల్ని మా అమ్మతో సహా బయటకు విసిరారు. ఇప్పుడు మేము అనాథాశ్రమంలో నివసిస్తున్నాము..."

నేను అనుకున్నాను, నీరజ్ నిష్క్రమించకపోతే, చివరి రోజు కాబట్టి, మరెవరికీ అవకాశం లభించదు. అతని త్యాగం కారణంగా, ఈ పేద అమ్మాయికి కొంత డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది.

నేటి ప్రపంచంలో, ప్రజలు తమ వారసత్వం నుండి ఒక్క పైసా కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దాని మీద కొట్లాటలు, హత్యలు కూడా చూస్తున్నాం. స్వార్థం ప్రబలుతోంది. కానీ ఈ ఉదాహరణ మినహాయింపు.

ఇతరుల గురించి, దేశం గురించి ఆలోచించే నీరజ్ లాంటి మనుషుల్లో దేవుడు ఉంటాడు. ఈ గొప్ప వ్యక్తిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు అటువంటి విశిష్ట వ్యక్తిత్వం గురించి రాసే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను.

మీ అవసరాలు తీరినప్పుడు, మీరు ఆపి ఇతరులకు అవకాశం ఇవ్వాలి. స్వార్థాన్ని విడనాడి అందరూ సంతోషంగా ఉంటారు. ఇది నేను నేర్చుకున్న పాఠం. నేను ఎల్లప్పుడూ అలాంటి వ్యక్తులను ఆరాధిస్తాను మరియు వారి గురించి నిజాయితీగా రాయడం సమాజం యొక్క అభివృద్ధికి అవసరమని నమ్ముతాను

#సేకరణ

తెలుగు పుస్తక ప్రపంచం

13 Nov, 00:29


ప్రతీదానికి లెక్కలు, కొలతలు, కులగణన చూడని ప్రపంచం ఒకటుంటుంది. ఆ ప్రపంచంలో ఆగిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు కరెక్ట్ టైమ్ చూపించే పని చేసినట్లు చెప్పవలసిన మాటలు, రాసి రికార్డ్ చేయవలసిన మాటలు కూడా ఇవి.

నీటి రంగులు, తైల వర్ణాలు, అక్రిలిక్, ఎగ్ టెంపెరా, పొడి రంగులు, గ్రాఫైట్ పెన్సిళ్లు, చార్కోల్ కణికలు, రంగుపెన్సిళ్ళు, పేస్టళ్ళు .. ఇలా పెద్ద లిస్ట్. ప్రాధమికమైన వీటినీ అనేకానేక ఉపవిభాగాల మీద విడగొట్టి పలుదారుల్లో, బహు మార్గాలలో చిత్రకళ కొత్త శైలుల్లో సాగుతూనే ఉంది . నేనిప్పుడు కేవలం కాగితం పై అచ్చయ్యే బొమ్మ గురించే చెప్పుకుంటాను. ఆసక్తి ఉన్నవాళ్ళు వినవచ్చు.

(సశేషం)

తెలుగు పుస్తక ప్రపంచం

13 Nov, 00:29


మొదట్లో ఆ రకం వాటిని ఫోటో కలర్స్ అనడమే నాకు తెలుసు. కలర్ ఫోటోగ్రఫీ ఇంకా అంతగా అందుబాటులో లేని రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోల పైన సన్నని కుంచెలున్న తూలికలని చేపట్టి చాలా మృదువుగా రంగులు అద్దేవారు మా ఊరి చిత్రకారులు, ఫోటోగ్రాఫర్లు. రంగులు రాయించుకున్న ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఒకరకమైన మెరుపులు చిందేవి. ఆ సొగసు చూస్తే అందవలసినదే కానీ, రాతల్లో చూపడం నాకు రాదు. ఆ ఫోటోలో మీద పూసే ఫోటో కలర్స్ అన్నాను కదా, అప్పట్లో అవి మాంచి ప్లాస్టిక్ బాటిళ్ళ లో వచ్చేవి. భలే చక్కనివి వాటి నిర్మాణం. ఇవి కాదు కానీ దీనికి ముందు ఫ్యూజి కలర్ పేపర్స్ ఉండేవి. వాటితో రంగులు వేసేవారు ఆర్టిస్ట్ లు అని ఇంకో కథ చెప్పాడు ఒక మిత్రుడు. జపాన్ నుండి అనేక రంగు కాగితాలు వచ్చేవిట. మనకు కావాల్సిన కాగితాన్ని చిన్న ముక్క చించి నీళ్ళల్లో వేస్తే, ఆ నీరు ఆ రంగుగా మారిపోయేదిట .

రేఖలు, రంగులు, కాగితాలు, కలాలు, కుంచెలు, ఇంకులు, పాళీలు వీటి గురించిన విషయాల మీద పెద్దగా పట్టించుకుని కానీ, వ్రాసి కానీ , చరిత్రకెక్కించిన దాఖలాలు తెలుగు పేజీలలో పెద్దగా కానరాదు, ఎవరైనా చెప్పినట్లుగా వినరాలేదు కూడా. మనకసలు బొమ్మలు వేయడం ఎలా అనే సబ్జెక్టే లేదు. విదేశీ భాషలలో ఈ విషయం మీద పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు ఉంటాయి. మొదటి విభాగంలోనే చిత్రకళా సామాగ్రీ సరంజామాల మీద కవిత్వం చెప్పినంత అందంగా వాటి గురించి పరిచయం ఉంటుంది. చాలా పద్దతిగా ఉంటుంది. రంగుల్లో నీరు కలుపుకునే నీటి గిన్నె, కుంచెలు కడుక్కునే మగ్గు కుడి వైపు ఉండాలా, లేదా ఎడమ వైపా? బ్రష్ కు అంటిన రంగుని ఎటువంటి గుడ్డ తో తుడవాలి. ఇటువంటి చిన్న సంగతులు కూడా శ్రద్ద పెట్టి వారు మనతో చదివించే పని చేస్తారు. చదివినవాడికి చదివినంత.

నేను మనలో మనిషినే కదా, మీలో ఒకడినే కదా. నాకు మీకు మల్లెనే చదువు లేదు. తెలుసుకున్న ఒక రకమైన జ్ఞానం ఉంది దానివల్ల ఒక పనికి సంబంధించిన తేట కన్నుకు అబ్బింది. రంగులు, కాగితాలు, అచ్చు ముద్రణ... తతిమ్మా సంబంధిత కాస్త తెలివిడి కలిగింది. చిన్నతనాన తెలిసీ తెలీనితనంతో స్కెచ్ పెన్నులనూ, పోస్టర్ కలర్స్ తోనో కాగితం మీద గీసిన బొమ్మ మీద రంగులు పూసే క్రమంలో అనేక అయోమయాలకు లోనవాల్సి వచ్చేది. బొమ్మ మీద రంగు సరిగా అంటేది కాదు. డాగు లేకుండా ఏ బొమ్మ పూర్తయ్యేది కాదు. నికృష్టంగా తప్పా మరే ఇతర మాట లేకుండా బొమ్మ కుదిరేది కాదు. చందమామ , బాలమిత్ర పుస్తకాలలో ఆ గులాబీ, ఆ నీలం, ఆకుపచ్చ రంగులు ఎలా అంత నీటుగా పూయబడినవో తెలియదు. అంతకన్నా ఎక్కువగా కొత్త సంవత్సరం నాడు కొనుక్కునే గ్రీటింగ్ కార్డ్ ల మీద కృష్ణుడి బొమ్మ అంతా చూడచక్కని నీలిరంగులో నిండి ఆయన బుగ్గమీద ఆ సుతారపు గులాబీ ఎలా పూయబడుతుందో అసలు అర్థం కానే కాదు. ప్రింటింగ్ లో కట్ కలర్స్, వాష్ కలర్స్, వెట్ టెక్నిక్, కలర్ స్కీమ్ లు ఉంటాయని ఎలా తెలుస్తుంది? ఎవరిని అడిగితే తెలుస్తుంది? పుస్తకాలలో పాఠాలు తప్పా, మరే ఇతర విషయాల మీద సాహిత్యం ఉంటుందని ఎవరు చెబుతారు?

తెలుగు సాహిత్యంలో భమిడిపాటి రామగోపాలం అని చాలా చక్కని కథకులు ఉండేవారు ఆయన భూ సర్వే విభాగంలో సర్వేయర్ గా పనిచేశారు. ఆయన ఒక కథలో ఇలా చెప్పేవరకు . భూమి కోలతకు ఇన్ని లెక్కలు ఉంటాయని తెలియనే తెలియదు- "ఉదయం పదిన్నరకి వచ్చి ఏదో ఒక లాటు దింపించి, చెకింగ్ చెయ్యాలి. మొత్తం నాలుగువేల సర్వే గొలుసులు, నాలుగువేల క్రాస్ స్టాపులు, నాలుగువేల పది లింకుల గడలు, నలభైవేల మేకులు. గొలుసు అయితే అంతా నేలమీద పరిచి చూడాలి. 66 అడుగుల పొడవుందా లేదా? నూరు లింకులు రెండు ఇత్తడి కడియాలు ఉన్నాయి కదా. ప్రతి పది లింకుల దగ్గిర పది, ఇరవై, ముప్పయి, నలభై అని సూచించే ఇత్తడి బిళ్లలున్నాయా లేవా? ఇవి, ప్రశ్నలు. క్రాస్ స్టాఫ్ అయితే, ఇనుపచువ్వ ఐదడుగుల పొడుగుండాలి. మూడూ బై ఎనిమిది ఇంచీ మందం ఉండాలి. కిందిని మొన సూదిగా కమ్మరంలో అరగతీసి ఉండాలి. మీదిని అంగుళంన్నర చవుకంతో, నాలుగు రంధ్రాలతో, ఒక చేతఇనుం బిళ్ల ఉండాలి. దాని మీద టేకు కర్రతో చేసిన నాలుగు ఇంచీల చౌకం అంగుళంన్నర మందం గల దిమ్మ. దానికి 90 డిగ్రీల చొప్పున అరంగుళం లోతుకి, అంగుళంలో పదహారో వంతు వెడల్పుకి గాడీలు కోసి ఉండాలి. ఇంక పది లింకుల గడలయితే, అది సరిగ్గా పదిలింకుల పొడవుండాలి. రెండు చివర్ల దగ్గరా పొన్నులుండాలి. లింకూ లింకూ మార్కింగు చేసి నలుపూ తెలుపూ రంగులు వేసుండాలి. అన్ని అన్నిటికన్నా ముఖ్యంగా పదిలింకుల కర్రా ఏకాండిగా (మధ్యలో అతుకులు లేకుండా) ఉండాలి.. "

నిజమే కదా ఇన్ని లెక్కలు , ఇంత పద్దతి లేకపోతే భూమి లెక్కలలో ప్రతిసారీ ఎన్ని తలలు పగులుతాయి! అది భూమి కాబట్టి, దేశం కాబట్టి, దేశమంటే మట్టి కాబట్టి, మట్టి అంటే రియల్ ఎస్టేట్ కాబట్టి ఇంత పద్దతిగా ఏర్పాటు చేసి పెట్టారు. పిల్లనగ్రోవికి ఎన్ని కన్నాలు ఉంటాయి? హార్మోనియం మెట్లు ఎన్ని? వీణ తీగల లెక్క ఎంత? నాట్యం చేసే అమ్మాయి కాళ్ళకు ఘల్లుఘల్లుమనే కింకిణులు ఎన్ని ? ఇంద్రధనుస్సులో రంగులు ఎన్ని? శిల్పాన్ని చెక్కే ఉలి పొడవు ఎంత ఉండాలి? సుత్తి తూకం ఎంతలో ఉండాలి?ఎందుకివి ?

తెలుగు పుస్తక ప్రపంచం

05 Nov, 03:37


ఎకరంలో నెలకు రూ.1 లక్ష’పై ఉచిత శిక్షణ

ఎకరం భూమిలో కూరగాయలు, ఆకుకూరల సేంద్రియ సాగు ద్వారా ప్రతి నెలా రూ. లక్ష సంపాదించే పద్ధతులపై క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్గానిక్‌ మాండ్య సంస్థ తెలిపింది. రంగారెడ్డి జిల్లా కేశంపేటలోని శివ ఫాం ల్యాండ్‌ (హైదరాబాద్‌ నుంచి 60 కి.మీ. దూరం)లో నవంబర్‌ 16 (శనివారం)న ఉ. 9.30 నుంచి సా. 3.30 వరకు ప్రత్యేక ఉచిత వర్క్‌షాప్‌ జరగనుంది. వ్యవసాయ విధానాలను మార్చుకొని ప్రాక్టికల్‌ పద్ధతుల ద్వారా ఎకరానికి రూ.1 లక్ష సంపాదించే మార్గాలపై సేంద్రియ రైతుగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, ఆర్గానిక్‌ మాండ్య వ్యవస్థాపకులు మధు చందన్‌ శిక్షణ ఇస్తారు. లాభదాయకమైన సేంద్రియ సేద్య ప్రణాళిక, మార్కెటింగ్‌ పద్ధతులను నేర్చుకోదలచిన వారికి ఇదొక అవకాశం. శిక్షణ, భోజనం ఉచితం. మరింత సమాచారం కోసం స్నేహను 89044 14317 సంప్రదించవచ్చు.

తెలుగు పుస్తక ప్రపంచం

04 Nov, 00:33


‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’
- #శకుంతలాదేవి

గణితమే తన లోకంగా జీవించిన మేధావి శకుంతలాదేవి. గణితంతో మూడేళ్ల వయసులో మొదలైన ఆమె ప్రయాణాన్ని, మరణం మాత్రమే విడదీయగలిగింది.

శకుంతలాదేవి 1929 నవంబర్ 4న బెంగళూరులోని ఒక సనాతన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పూజారిగా ఉండటానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరారు. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితులు కూడా శకుంతలాదేవి ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి.

ఆమె మూడేళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు తండ్రితో పేకాడుతూ ప్రతి ఆటలోనూ గెలిచేది. అంత చిన్నపాప ప్రతీసారీ తనపై గెలవడం తండ్రికి ఆశ్చర్యం కలిగించింది. తన కూతురు మోసం చేస్తుందేమోనని అనుమానం కలిగించింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఆడినా ఆమెదే విజయం. చివరకు.. పేక ముక్కలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం వల్లనే శకుంతల గెలుస్తోందని గుర్తించాడు. ఆమె అద్భుత జ్ఞాపకశక్తిని తమకు జీవికగా ఉపయో గించుకున్నాడు.

ఆమెతో ప్రదర్శనలిప్పిం చాడు. అలా అలా ఆమె ప్రతిభ విశ్వ విద్యాలయాలకు చేరింది. ఆరేళ్ల వయసులో తొలిసారి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆ తర్వాత ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో బాల మేధావిగా ఆమె పేరు మారుమోగింది.

శకుంతలాదేవికి లెక్కలంటే ఏమాత్రం లెక్కలేదు. ఎంత పెద్ద సమస్యనైనా ఆమె చిటికలో పరిష్కరించేవారు.

తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఆమె 1944లో తండ్రి చేయి పట్టుకుని లండన్ చేరుకున్నారు.

అనేక విశ్వవిద్యాలయాల్లో, వివిధ సంస్థల్లో ప్రదర్శనలిచ్చారు. 1950 అక్టోబర్ 5న బీబీసీలో తన గణిత ప్రతిభను ప్రదర్శిం చారు. లెస్లీ మిషెల్ ఇచ్చిన సమస్యను సెకన్లలో పరిష్కరించారు. ఆ సమాధానం తప్పని మిషెల్ అన్నారు. కానీ శకుంతలా దేవి తాను సరైన సమాధానమే చెప్పానని, సరిచూసుకోమని దృఢంగా చెప్పారు. ఆవిడ తిరిగి చూసుకుంటే శకుంతలా దేవి సమాధానమే సరైనదని తేలింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆమెకు ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే బిరుదు దక్కింది.

శకుంతలా దేవి ప్రతిభకు డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన మరింత అద్దం పడుతుంది. అమెరికాలోని ఈ యూనివర్సిటీవారు శకుంతలా దేవిని ఆహ్వానించారు. ఆమె ప్రతిభను పరీక్షించే పనిలో భాగంగా 201 అంకెలున్న సంఖ్యకు 23వ రూట్ చెప్పమన్నారు.

ఆవిడ 50 సెకన్లలో చెప్పేసింది. కానీ అది నిజమో కాదో తెలుసుకోవడానికి అమెరికన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సంస్థలోని యూనివాక్-1101 అడ్వాన్స్‌డ్ కంప్యూటర్‌లో ప్రత్యేక ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చింది.

1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఆమె గిన్నిస్ రికార్డు సృష్టించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బెర్క్‌లీ) సైకాలజీ ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ 1988లో శకుంతలాదేవి ఇంటెలిజెన్స్‌ను అధ్యయనం చేశారు. అనేక క్లిష్ట సమస్యలను జెన్సన్ పేపర్‌పై రాసేకంటే అతి తక్కువ సమయంలో ఆమె పరిష్కరించి అతన్ని ఆశ్చర్యపరిచారు.

1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తోశకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించేశారు.

ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు

76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు.

ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది.

యూనివర్సిటీ ఆఫ్
కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.

గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.

1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.

శకుంతలా దేవి కేవలం గణిత మేధావి మాత్రమే కాదు. మంచి రచయిత కూడా. స్వలింగ సంపర్కంపై భారత దేశంలో తొలి సమగ్ర రచన అయిన ‘ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువాలిటీ (1977)’ శకుంతలా దేవి రాసిందే. దీనితో పాటు గణితం, జ్యోతిషంపై అనేక పుస్తకాలు రాశారు. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు

యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ 1969లో శకుంతలాదేవికి ‘మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చింది. వాషింగ్టన్ డీసీ 1988లో రామానుజన్ మేథమెటికల్ జీనియస్ అవార్డును ప్రదానం చేసింది.

శకుంతలా దేవి 1980లో మెదక్ నుంచి ఇందిరా గాంధీపై పోటీ చేశారు.

1980లో బెంగళూరుకు చేరి పిల్లల కోసం అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

తెలుగు పుస్తక ప్రపంచం

31 Oct, 05:43


రివర్స్ ఆస్మాసిస్ (RO) నీటి ప్రమాదాలు

కొన్ని నెలల పాటు రివర్స్ ఆస్మాసిస్ (RO) నీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడవచ్చని WHO హెచ్చరించింది.

రివర్స్ ఆస్మాసిస్ నీటిని తాగడం వల్ల శరీరానికి ఎక్కువ హాని కలుగుతుందని మరియు పంపు నీటిలో కనిపించే చాలా కలుషితాల కంటే వేగంగా ఉంటుందని శాస్త్రీయంగా నిర్ధారించబడింది.

నీటిని శుద్ధి చేయడానికి రివర్స్ ఆస్మాసిస్ (RO) వ్యవస్థలు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. RO వాటర్ పర్సనల్ వాటర్ ప్యూరిఫైయర్‌లను మార్కెట్ చేసే ఆక్వా కంపెనీలతో పాటు అనేక గృహాలు కూడా ఇష్టపడతాయి. RO సిస్టమ్ ఆఫ్ కోర్స్ నీటి మలినాలను తొలగిస్తుంది. కానీ అవి 92-99% ప్రయోజనకరమైన కాల్షియం మరియు మెగ్నీషియంలను కూడా తొలగిస్తాయి!

RO నీటికి సంబంధించి వందలాది శాస్త్రీయ అధ్యయనాలను విశ్లేషించిన తరువాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ అటువంటి నీరు జంతువు మరియు మానవ జీవిపై ఖచ్చితమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది.

కొన్ని నెలల తర్వాత కూడా దుష్ప్రభావాలు

భయంకరమైన విషయం ఏమిటంటే, కేవలం కొన్ని నెలల పాటు RO నీటిని తీసుకోవడం వల్ల కూడా తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు. రివర్స్ ఆస్మాసిస్ నీటిని ఉపయోగించే చెక్ మరియు స్లోవాక్ జనాభా చాలా వారాలు లేదా నెలల్లో తీవ్రమైన మెగ్నీషియం (మరియు బహుశా కాల్షియం) లోపాన్ని సూచించే వివిధ ఆరోగ్య ఫిర్యాదులను అభివృద్ధి చేసింది. . ఫిర్యాదులలో కార్డియోవాస్కులర్ డిజార్డర్స్, అలసట, బలహీనత లేదా కండరాల తిమ్మిరి ఉన్నాయి.

ఆహార ఖనిజాలు RO నీటిలో ఖనిజాల కొరతను భర్తీ చేయవు

తగినంత మినరల్స్ లేని RO నీరు, వినియోగించినప్పుడు, శరీరం నుండి ఖనిజాలను లీచ్ చేస్తుంది. అంటే ఆహారంలో వినియోగించే మినరల్స్ మరియు విటమిన్లు మూత్రవిసర్జనకు గురవుతున్నాయి. తక్కువ ఖనిజాలు మరియు ఎక్కువ ఖనిజాలు విసర్జించబడటం వలన తీవ్రమైన ప్రతికూల దుష్ప్రభావాలు మరియు పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆహారంలో వినియోగించే మినరల్స్ RO నీటిలో ఖనిజాల కొరతను భర్తీ చేయగలదా అని చూడటానికి చేసిన శాస్త్రీయ అధ్యయనంలో, శాస్త్రవేత్తలు నీటి నుండి ఖనిజాలను తీసుకోవడం తగ్గించడం వారి ఆహారం ద్వారా భర్తీ చేయబడదని నిర్ధారించారు. తక్కువ మినరల్ వాటర్ శరీరం నుండి ఖనిజాల యొక్క పెరిగిన తొలగింపుకు కారణమైంది.

హోమియోస్టాసిస్ మెకానిజమ్స్‌పై ప్రతికూల ప్రభావం

RO నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని నీటిలో కరిగిన ఎలక్ట్రోలైట్‌లు పలుచన అవుతాయి. కంపార్ట్‌మెంట్ల మధ్య సరిపోని శరీర నీటి పునఃపంపిణీ ముఖ్యమైన అవయవాల పనితీరును రాజీ చేస్తుంది. ఈ పరిస్థితి ప్రారంభంలోనే దుష్ప్రభావాలు అలసట, బలహీనత మరియు తలనొప్పి; మరింత తీవ్రమైన లక్షణాలు కండరాల తిమ్మిరి మరియు బలహీనమైన హృదయ స్పందన. RO ఫిల్టర్‌ల ద్వారా ఉత్పత్తి చేయబడిన ముఖ్యమైన మూలకాలు లేని ఆమ్ల వడపోత నీటిని దీర్ఘకాలిక వినియోగం అనారోగ్యకరం.

అనేక వ్యాధులకు ప్రమాద కారకం

హైపర్‌టెన్షన్ మరియు కరోనరీ హార్ట్ డిసీజ్, గ్యాస్ట్రిక్ మరియు డ్యూడెనల్ అల్సర్, క్రానిక్ గ్యాస్ట్రైటిస్, గాయిటర్, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ మరియు కామెర్లు, రక్తహీనత, పగుళ్లు మరియు ఎదుగుదల లోపాలు వంటి నవజాత శిశువులు మరియు శిశువులలో అనేక సమస్యలకు RO నీరు ప్రమాద కారకంగా ఉండవచ్చని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వంట కోసం RO నీటిని ఉపయోగించడం వలన అవసరమైన అన్ని మూలకాల యొక్క గణనీయమైన నష్టాలు సంభవిస్తాయి

వంట కోసం ఉపయోగించినప్పుడు, RO నీరు ఆహారం (కూరగాయలు, మాంసం, తృణధాన్యాలు) నుండి అవసరమైన అన్ని మూలకాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇటువంటి నష్టాలు మెగ్నీషియం మరియు కాల్షియం కోసం 60% వరకు చేరవచ్చు లేదా కొన్ని ఇతర సూక్ష్మ-మూలకాల కోసం (ఉదా., రాగి 66 %, మాంగనీస్ 70 %, కోబాల్ట్ 86 %). దీనికి విరుద్ధంగా, మినరలైజ్డ్ వాటర్ వంట కోసం ఉపయోగించినప్పుడు, ఈ మూలకాల నష్టం చాలా తక్కువగా ఉంటుంది మరియు కొన్ని సందర్భాల్లో, వంట ఫలితంగా ఆహారంలో కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉన్నట్లు నివేదించబడింది.

RO నీటిని రీమినరలైజ్ చేయడానికి ఖనిజాలను జోడించడం సరైనది కాదు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, రివర్స్ ఆస్మాసిస్ నీటిలో ఖనిజాలను తిరిగి చేర్చే పద్ధతిని వాంఛనీయమైనదిగా పరిగణించలేము, ఎందుకంటే నీటిలో దాని ప్రయోజనకరమైన భాగాలన్నీ లేవు. ఇచ్చిన మూలకం యొక్క సరిహద్దు రేఖ లోపం విషయంలో, త్రాగునీటితో మూలకం యొక్క సాపేక్షంగా తక్కువ తీసుకోవడం కూడా సంబంధిత రక్షణ పాత్రను పోషిస్తుంది. RO శుద్ధి చేసిన నీటి నుండి అన్ని ఖనిజాలు మరియు ట్రేస్ ఎలిమెంట్స్‌తో సహజ నీటిని పునఃసృష్టి చేయడం ఆచరణాత్మకంగా అసాధ్యం.

ఇటీవలి సిఫార్సులు

ఇటీవలి అధ్యయనాలు డీమినరలైజ్డ్ నీటిలో లభించే ఖనిజాల కనీస మరియు వాంఛనీయ స్థాయిల గురించి అదనపు సమాచారాన్ని అందించాయి.

మెగ్నీషియం- కనిష్టంగా 10 mg/L మరియు 20-30 mg/L వాంఛనీయమైనది

Ccalcium- కనిష్టంగా 20 mg/L మరియు దాదాపు 50 (40-80) mg/L

మొత్తం నీటి కాఠిన్యం- కాల్షియం మరియు మెగ్నీషియం మొత్తం 2 నుండి 4 mmol/L ఉండాలి

తెలుగు పుస్తక ప్రపంచం

31 Oct, 05:43


ఈ సాంద్రతలలో, కనీస లేదా ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు గమనించబడలేదు.

పైన వివరించిన ప్రతికూల ప్రభావాలతో పాటు RO వ్యవస్థలు వడపోత సమయంలో 70-80 శాతం నీటిని కూడా వృధా చేస్తాయి. ఈ 'తిరస్కరించు' నీటిలో రసాయన కలుషితాలు ఎక్కువగా ఉన్నందున మరియు మరే ఇతర ప్రయోజనాల కోసం ఎటువంటి ఉపయోగం లేనందున లవణీయమైనది.

RO వ్యవస్థలకు ప్రత్యామ్నాయం

ఉడకబెట్టడం

సరిగ్గా మరిగేలా చూసుకోవాలి. రెండు నిమిషాల పాటు నీటిని ఆవిరి చేసి మగ్గనివ్వండి. అయితే, నీటిలో ఉండే రసాయన కాలుష్యం పూర్తిగా ఉడకబెట్టడం ద్వారా తొలగించబడదు. ఇంకా, వేడి మూలం లేకపోవడం లేదా ఇంధనం లేదా విద్యుత్ కొరత కారణంగా ఏ పరిస్థితిలోనైనా ఉడకబెట్టడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు.

క్లోరిన్

ఒక లీటరు నీటిలో నాలుగు చుక్కల ద్రవ బ్లీచ్ పోయాలి; సగం గాలన్‌కు 8 చుక్కలు; మరియు ప్రతి గాలన్ నీటిలో 16 చుక్కలు. నీటిని త్రాగడానికి కనీసం అరగంట పాటు విశ్రాంతి తీసుకోండి. అధిక క్లోరిన్ ఆరోగ్యానికి ప్రమాదకరం మరియు కొంత జాగ్రత్త వహించాలి.

అయోడిన్

ఒక లీటరు శుభ్రమైన నీటిలో 5 చుక్కల అయోడిన్ పోయాలి. నీరు మబ్బుగా ఉంటే కొన్ని అదనపు చుక్కలను జోడించండి. త్రాగడానికి అనువుగా ఉండటానికి ముందు కనీసం అరగంట పాటు విశ్రాంతి తీసుకోండి. నీటి ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే అయోడిన్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అయినప్పటికీ, అయోడిన్ నీటిలో ఉన్న అన్ని 100% వ్యాధికారకాలను చంపదు.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలు డీమినరలైజ్డ్ ఆర్‌ఓ వాటర్ కోసం ఎగబడ్డారు. ప్రజా నీటి సరఫరా వ్యవస్థ నుండి సురక్షితమైన నీటిని సరఫరా చేయడానికి యంత్రాలు. కావున స్థానిక సంస్థలు ప్రజలకు సురక్షితమైన మంచినీటిని సరఫరా చేసేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

వైద్య సోదరుల పాత్ర

ఆర్‌ఓ నీటి వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్యులు చురుకైన పాత్ర పోషించాలి మరియు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లేలా ప్రజలకు సలహా ఇవ్వాలి.

తెలుగు పుస్తక ప్రపంచం

30 Oct, 02:18


మళ్లీ చెబుతున్నా… ప్రపంచమొక మానసిక ప్రయోగశాల..!

కొన్నేళ్లుగా 'చలం ఆత్మ కథ' పుస్తకం బుక్ సెల్ఫ్ నుండి నన్ను చూస్తూనే ఉంది. కొంత కేర్లెస్, కొంత చదివే మూడ్ లేక లెక్క చేయలేదు.
ఒకసారి మొదలు పెట్టగానే, ఒక మిత్రులు నాకు వెంటనే ఆ పుస్తకం కావాలంటే అప్పటికప్పుడు నేను చదివే పుస్తకం వారికి పంపి, వెంటనే ఇంకో కాపీ నాకోసం ఆర్డర్ చేసా. వచ్చేప్పటికి ఒక నాల్రోజులు.

మళ్ళీ చదివే మూడ్ రాలేదు గానీ కొన్ని చదివిన పేజీల భావం మనో ఫలకం పై అద్దుకుంది.

మనసు కాస్త సుస్థీ చేసి.. ఆ పుస్తకాన్ని అందుకున్నా..!
లోతుల్లోకి వెళ్ళేకొలది...
కారణం లేని కన్నీరు, మనసుని ద్రవింపజేసే వారి మానసిక ఔన్నత్యం..!
మొత్తంగా *చలం ఆత్మ కథ*
**

తాను ఆనందించి పరవశించే మనో వస్తువులు.. ఆకాశం, మిణుకుమనే నక్షత్రాలు, వెన్నెల్లో హాయిగా తళ తళమంటూ నవ్వులు విరజిమ్ముతూ మెరిసే గోదారి..
తనువుని నిమిరి సేద దీర్చే చిరుగాలి.. మొత్తంగా వెల్లివిరిసే ప్రకృతి..!

తెలియని అసంతృప్తి..
వెంటాడే కాంక్షాజ్వాలలు..
అంతా శూన్యం.. కానీ ఏదో శక్తి నడుపుతోంది.. అదేవిటో తెలియదు.. ఈశ్వరుడి తరవాత.. ఈశ్వరుడు కానరాకుంటే.. మనిషి అష్ట కష్టాలు పడుతున్నప్పుడు, వేదన అఙిగుండం లో రగిలిపోతున్నప్పుడు అభయమివ్వనపుడు, మనసుకి ఆ స్థాయిలో సంతృప్తినివ్వగలిగింది ఆరాధించగలిగింది 'స్త్రీ'మాత్రమే అని నమ్మిన ప్రేమర్షి..!

ఎన్నో తత్వాలని చూసి, మరెన్నో బహిష్కరణలను ఎదుర్కుని...
ఇవ్వడమే తప్ప తీసుకోవడం ఇష్టపడక, తన అంతరాత్మ కి విరుద్దంగా ఏదీ సమ్మతించని ఆత్మాభిమాని..!

మనసు వేధించే ఎన్నో ప్రశ్నలకి సమాధానపు నిలయంగా 'అరుణాచలం' లో నిలకడి, ఈ ప్రకృతి ప్రేమ, పరవశం ఈశ్వరుడు కరుణించే ప్రేమలో భాగమేనని తన అనుభవాల ద్వారా తెలుసుకున్న జిజ్ఞాసి ..!

నీతులు, సూక్తులు ఆచరరించనివి, ఆచరణ కి సాధ్యం కానివి ఎందరో చెబుతుంటారు. కానీ..
'నాలో ఒక మాలిన్యం ఉంది. ఎన్నో కాంప్లెక్స్ లతో సతమవుతున్న సగటు మనిషినని' తన తప్పు చూసుకోవడం గానీ విచక్షణ గానీ చేసుకోకుండా నీతి బోధలు చేసేవారెందరో..
వినడం అంటే.. ఎదుటి వ్యక్తి చెప్పేది వినడం కాదు.. నీ అంతరాత్మ చెప్పేది వినడం, విన్నది స్వీకరించడం..!!

ఆ అంతరాత్మ చెప్పింది విని, తనని తాను స్వీకరించుకొవడం అన్న సాధన అసాధారణం. ఆ acceptancy ని స్వీకరించుకున్న మహా మనిషి...!!
ఆనందం అంటే.. సంతోషం, బాధ రెండూ కాని నిశ్చల స్థితి..!
ఆ స్థితి లో జీవించిన గొప్ప వ్యక్తి..!

ఎన్నో స్పురణలు, మరెన్నో అక్షరాల వెంట పరుగు తీయించే భావాలు.. భావోద్వేగాలు..
కొన్ని చెబితే వాటి కమ్మదనం సన్నగిల్లుతుంది. సుగంధ పరిమళం ఆఘ్రాణించాల్సిందే... వర్ణిస్తే సరిపోదు..!

నేను చేసిన ఆలస్యం మీరూ చేయకుండా చదవండి. ఎప్పుడో చదివినా మళ్ళీ చదవండి..!!
కొత్తగా ఉంటుంది.

- కవితా చక్ర

తెలుగు పుస్తక ప్రపంచం

27 Oct, 04:55


The packaged drinking water market in India has been growing, and is expected to continue to grow in the coming years:

Market value
The market value of bottled water in India was over 221 billion Indian rupees in 2021, and is expected to reach over 826 billion rupees by 2030.

Growth rate
The mineral water segment in India grew 27% per year from 2018 to 2021,

Market size
The bottled water market size in India is expected to reach $36.21 billion by 2030

మనమెక్కడికెళ్తున్నాం... మనం ఏమైనా చేద్దాం, మార్పు కోసం ప్రయత్నిద్దాం, అనుకునే వాళ్ళు msg చెయ్యండి.

తెలుగు పుస్తక ప్రపంచం

26 Oct, 16:29


Channel photo updated

తెలుగు పుస్తక ప్రపంచం

26 Oct, 13:01


ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి.

మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో, గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.!
గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో) ఈ క్రింది విషయాలను బోధించారు.

01 అగ్ని విద్య (లోహశాస్త్రం)
02 వాయు విద్య (గాలి)
03 జల్ విద్య (నీరు)
04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)
05 పృథ్వి విద్య (పర్యావరణం)
06 సూర్య విద్య (సౌర అధ్యయనం)
07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)
08 మేఘ విద్య (వాతావరణ సూచన)
09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)
10 దిన్ రాత్ విద్య.
12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)
13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)
14 భుగోళ విద్య (భౌగోళిక)
15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)
16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)
17 రత్నాలు మరియు లోహాలు
18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)
19 ప్రకాశ విద్య (శక్తి)
20 సంచార విద్య (కమ్యూనికేషన్)
21 విమాన విద్య (విమానం)
22 జలయన్ విద్య (నీటి నాళాలు)
23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)
24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)
25 యజ్ఞ విద్య

ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం!*

26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)
27 కృషి విద్య (వ్యవసాయం)
28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)
29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)
30 యాన విద్య (మెకానిక్స్)
32 వాహనాల రూపకల్పన
33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)
36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)
37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)
38 తక్కలు
39 రంగ్ విద్యా (డైయింగ్)
40 ఖాట్వాకర్
41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)
42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)
43 ఖానా బనానే కి విద్యా (వంట)
44 వాహన్ విద్యా (డ్రైవింగ్)
45 జలమార్గాల నిర్వహణ
46 సూచికలు (డేటా ఎంట్రీ)
47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)
48 బాగ్వానీ (హార్టికల్చర్)
49 వాన్ విద్యా (అటవీ)
50 సహోగీ ( పారామెడిక్స్).

ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది.

భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?
కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.

మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.

భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ *దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ* పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు.

వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.
మెకాలే ఇలా చెప్పాడు - ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి. అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.

1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ 'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి. గురుకులములు ప్రజలు మరియు రాజు చేత కలిపి నడుపుబడేవి.
*విద్యను ఉచితంగా ఇచ్చారు*.
గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించ బడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!

తెలుగు పుస్తక ప్రపంచం

26 Oct, 13:01


మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి. కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది.

మరియు వారికి *వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు. వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు*". ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము.

*మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం*!

నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు.

*🌹భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి*.
*మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇది🙏*.

తెలుగు పుస్తక ప్రపంచం

25 Oct, 00:35


ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న 4500 ఏళ్ల నాగరికత మెట్లు - ధోలవీర (భచౌ - కచ్, గుజరాత్)

తెలుగు పుస్తక ప్రపంచం

24 Oct, 11:08


అన్నం ఇంటిపేరు వైశ్యులు, కమ్మ, బలిజ కాపు, కుంకపు (కృష్ణ బలిజ) వారిలో నాకు తగిలింది. తమిళ భాషలో సాదం అంటే అన్నం. సాదం అనే ఇంటిపేరు యాదవులలో ఉంది. ఒకప్పుడు తెనాలి సమీపంలో దుగ్గిరాల మండలం చినపాలెం గ్రామంలోని యాదవ కులస్థులలో సాదం వేదాద్రి అనే నాకు తెలిసిన ఒక కమ్యూనిస్టు ఉండేవాడు. బలిజ కాపు కులస్థుడైన బాపట్లకు చెందిన అన్నం సతీష్ ప్రభాకర్ (తెదేపా మాజీ ఎమ్మెల్సీ) ప్రస్తుతం భాజపాలో ఉన్నారు. కమ్మవారిలో అన్నం నాయడు వంశీకులు ప్రస్తుతం అన్నంనేని, అన్నమనేని వారుగా వ్యవహరించబడుతున్నారు.

అన్నాన్ని కూడు అనికూడా అనటం ఉంది. వరికూటి, జొన్నకూటి, దబ్బకూటి ఇండ్లపేర్లు నేను విన్నవే మా తెనాలికి సమీపంలోని పెరవలి పాలెం, పెరవలి, చావలి గ్రామాలలోని బలిజకాపు కులస్థులలో జొన్నకూటి వారున్నారు. దబ్బకూటి వారు యాదవులలో ఉన్నారు.

మా తెనాలి ప్రాంతపు కమ్మవారిలో వట్టికూటి అనే ఇంటిపేరుగలవారు ఉన్నారు. ఈ ఇంటిపేరు ఎలా ఏర్పడిందో చూద్దాం. వట్టి అంటే మట్టి. వట్టి కొండ (మట్టి కొండ), వట్టి కోట( మట్టితో నిర్మించిన కోట), వట్టి గుడిపాడు( మట్టితో కట్టిన గుడి ఉన్న ఊరు) గ్రామనామాలు మనకు తెలుసు. ఒకప్పుడు బియ్యంలో మట్టి గడ్డలు ఎక్కువగా ఉండేవి. ఓ కమ్మ వారి గృహిణి వారి ఇంటికి చుట్టాలొస్తే బియ్యం ఏరి శుభ్రపరచే సమయం కూడా లేక అలాగే వండి వడ్డించిందట. అన్నంలో మట్టి గడ్డలు ఎక్కువగా ఉండటాన ఆమెను విమర్శించిన అతిథులు ఇక నాటినుంచీ ఆ యింటివారిని వట్టికూటి (మట్టి కూటి) వారు అని పిలిచేవారట. అంతకుముందు వారి ఇంటిపేరు రామినేనివారు అనీ, వారి గోత్రం కూడా వల్లుట్ల అనీ విన్నాను. రామినేని వారి నుంచి చీలిపోయిన తరువాత వట్టికూటి వారికి వల్లుట్ల గోత్రంతో పాటు పలు ఇతర గోత్రాలు కూడా ఏర్పడ్డాయని కూడా విన్నాను. మట్టికూటి అనే ఇంటిపేరు కూడా కమ్మవారిలో ఉంది. బహుశా అదే కాలక్రమంలో వట్టికూటిగా రూపాంతరం చెందిఉంటుంది. వడ్ల, కొర్రకూటి అనే ఇంటిపేర్లూ కమ్మవారిలో ఉన్నాయి.

ఒకప్పుడు దేవుళ్ళకు జాతరల సందర్భంగా అన్నం రాసులుగా పోసి నైవేద్యమిచ్చి, ఆ తరువాత ఆ అన్నాన్ని ప్రజలే సామూహిక విందులో భోజనం చేసేవారు. ఆ కారణంగానేనేమో ప్రజాకవి వేమన ఒక పద్యంలో ‘ రాయి దేవుడైన రాసులు మింగడా ? ‘
అంటాడు. నైవేద్యంగా రాసులుపోసిన ఈ అన్నం మీదుగా కూటికుప్పల అనే గ్రామనామం దానిమీదుగా ‘కూటి కుప్పల’ అనే ఇంటిపేరు ఏర్పడింది. విశాఖపట్నంలో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కృషిచేసి పద్మశ్రీ అవార్డు పొందిన వైద్యుడు డా.కూటికుప్పల సూర్యారావు పేరు మనం విన్నదే.

నిమ్మ, దబ్బ వంటి పుల్లటి ఊరగాయ పచ్చళ్ళలో కొందరు పచ్చి మిరపకాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కాబూలీ శనగలు, అల్లం ముక్కలు, జీలకర్ర వంటివి కలుపుతారు. అవన్నీ పచ్చడితో పాటు బాగా ఊరి పుల్లగా తయారై ఎంతో రుచిగా ఉంటాయి. కొందరు ఊరగాయ పచ్చళ్ళలో పెసరపిండి, శనగపిండి వంటివి చేరుస్తారు. అవి పచ్చడితో పాటు ఊరి, పుల్లగా, రుచిగా అవుతాయి. కొందరు అచ్ఛంగా శనగ లేక పెసర పిండిని తగినంత ఉప్పు, కారం, పులుపు చేర్చి ఊరబెడతారు. ఊరిన ఈ పిండి చాలా రుచిగా, నోటికి ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని ‘ఊరు పిండి’ అంటారు. అదే శబ్దం జనవ్యవహారంలో ‘ఊరుబిండి’, ‘ఊరుబండి’, ‘ఊరు మిండి’, ‘ ఉరిమిండి’ గా రూపాంతరం చెందింది. బలిజ కాపులలో, రెడ్లలో ఈ ఇంటిపేరు నాకు తగిలింది.
తెనాలి సమీపంలోని కఠెవరం గ్రామానికి చెందిన కీ.శే. ఊరుబండి ఆచార్యులు (బలిజ కాపు) అనే కమ్యూనిస్టు నేత, అమెరికాలోని డా. ఉరిమిండి నరసింహారెడ్డి ( టెక్సస్ లోని డాలస్ నివాసి) నాకు సుపరిచితులు.

పప్ప అంటే భక్ష్యము, పిండి వంట లేక అప్పచ్చి అని అర్థం. విశాఖ పట్నానికి చెందిన యలమంచిలి శాసనసభ్యునిగా, అనకాపల్లి పార్లమెంటు సభ్యునిగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం అధ్యక్షునిగా సేవలందించిన తెదేపా నేత పప్పల చలపతిరావు
ప్రసిద్ధులు. అరిసెల అనే ఇంటిపేరు కూడా కమ్మవారిలో ఉంది. మారు అంటే మజ్జిగ. అందుకే గ్రామీణులు కూరన్నం తిన్న తరువాత తినే మజ్జిగన్నాన్ని మారన్నం అంటారు. తనకాలపు దళితులు మజ్జిగ అన్నం తినటానికి కూడా నోచుకోలేదని ప్రజాకవి వేమన ‘ మారు లేని కూడు మాలకూడు ‘ అంటాడు ఒక పద్యంలో. మారు, మోరు, మోరం వంటి ఇంటిపేర్లు మజ్జిగ మీదుగా ఏర్పడ్డవే.

సశేషం

-- మీ.. ముత్తేవి రవీంద్రనాథ్

తెలుగు పుస్తక ప్రపంచం

24 Oct, 11:08


#తెలుగువారి_ఇంటిపేర్లలో_భోజనపదార్థాలు - 1

#ఇంటిపేర్లు

ఒకప్పుడు దాదాపుగా దక్షిణ భారత దేశం అంతటా ప్రతివారూ తమ పేరు ( Given Name) కు ముందు తండ్రి లేక తల్లి పేరును తప్పక రాసుకునేవారు. తండ్రి / తల్లి పేరే తప్ప అప్పట్లో ప్రత్యేకంగా ఇంటిపేరు (Surname) అంటూ ఎవరికీ ఉండేది కాదు. ఈ పద్ధతి ఒకప్పుడు తెలుగువారు కూడా పాటించేవారు. ప్రాచీన సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయలును నరసింహ కృష్ణరాయలు అనీ, తెనాలి రామకృష్ణుడిని రామయ రామకృష్ణుడు అనీ అనటం వారి తండ్రులైన నరసింహ నాయకుడు (తుళువ నరసనాయకుడు), గార్లపాటి ( గార్లపాడు గ్రామానికి చెందిన ) రామయ్యల కారణంగానే. అంతకు పూర్వం తెలుగు శాతవాహనులలో తమ తల్లుల పేర్లు తమ పేర్లకు ముందు చేర్చుకున్న గౌతమీ పుత్ర శాతకర్ణి, వాసిష్టీ పుత్ర పులోమావి వంటి వారి గురించి కూడా మనకు తెలుసు. మల్లన అనే పేరుతో ఇద్దరు ఉన్నప్పుడు పృథకత్వం (వేరుగా గుర్తించటం) కోసం వారిలో ఒకరిని మాదయ్యగారి మల్లన అంటూ ఆయన పేరుకు ముందు ఆయన తండ్రిపేరును కూడా చేర్చటం పరిపాటి అయింది. మరింత ప్రత్యేక గుర్తింపు కోసం అవసరమైతే ఒక్కొక్కసారి తల్లి / తండ్రిపేరుతో పాటు ఆ వ్యక్తిది ఏ ఊరో ఆ ఊరు పేరును కూడా చేర్చటం మొదలైంది.అలా తెలుగువారి ఇంటిపేర్లలో ఊళ్ళ పేర్లు ప్రవేశించి క్రమంగా తల్లిదండ్రుల పేర్లు తప్పుకున్నాయి. కానీ ఇలా తండ్రి పేరునే ఇంటిపేరుగా రాసుకోవటం తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో నేటికీ కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కీ.శే. ఎంజీ రామచంద్రన్
( MGR) కి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. నేటి కేరళలోని పాలక్కాడ్ (పాలఘాట్) కు చెందిన నాయర్ కులస్థుడైన గోపాలన్ మీనన్ అనే ఆయన ఎంజీఆర్ తండ్రి. అయితే గోపాలన్ మీనన్ లు పలువురు ఉన్న కారణంగానేనేమో మరుదూర్ నుంచి వచ్చిన ఈ గోపాలన్ మీనన్ ని ఆయన ఊరు పేరు తగిలించి మరుదూర్ గోపాలన్ మీనన్ అన్నారు. ఆయన కుమారుడు రామచంద్రన్ అలా తన తండ్రిపేరు ముందు చేర్చుకుని మరుదూర్ గోపాలన్ మీనన్ రామచంద్రన్ ( M.G. రామచంద్రన్ ) అయ్యారన్నమాట. అలాగే మూలంలో కన్నడిగురాలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిణి, ‘ పురచ్చి తలైవి’ గా పేరొందిన కీ.శే.జయలలిత తన పేరుకు ముందు తండ్రి జయరామన్ పేరును చేర్చుకుని జయరామన్ జయలలిత ( J. జయలలిత) అయ్యారు. ఆమె స్థాపించిన టీవీ ఛానెల్ కి జె. జె. ( జయరామన్ జయలలిత - J. J.) TV అంటూ ఆమె పేరే పెట్టారు. విఖ్యాత కన్నడ నటుడు, ‘కన్నడ కంఠీరవ’ గా పేరొందిన రాజ్ కుమార్ పూర్తి పేరు సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజ్.ఆయన అసలుపేరు ముత్తురాజ్ కాగా తండ్రిపేరు పుట్టస్వామయ్య. ఆయన తండ్రి పుట్టస్వామయ్య తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలోని సింగనల్లూరు నుంచి ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో ఉన్న దొడ్డ గాజనూర్ అనే గ్రామానికి వలస రావటం కారణంగా ఆయన్ని అక్కడ అందరూ సింగనల్లూర్ పుట్టస్వామయ్య అనేవారు. రాజ్ కుమార్ పుట్టింది దొడ్డ గాజనూర్ గ్రామంలోనే. తమిళనాడుకు చెందిన విశ్రాంత టెన్నిస్ క్రీడాకారుడు రామనాథన్ కృష్ణన్ పేరు సుప్రసిద్ధం. ఆయన పేరు కృష్ణన్. తండ్రిపేరు రామనాథన్.

కొన్ని తెలుగు కుటుంబాలలో తండ్రి పేరు లేక వంశ మూల పురుషుడి పేరు ఇంటి పేరుగా ఇప్పటికీ కూడా కొనసాగుతున్న ఉదాహరణలూ ఉన్నాయి. ఒక వీరప్ప నాయకుని కుమారులైన రామినాయకుడు, మాచినాయకుడు తమ తండ్రి పేరు తమ పేర్లకు ముందు చేర్చుకుని మొదట వీరప్పనాయకుని రామినాయకుడు, వీరప్పనాయకుని మాచినాయకుడుగా వ్యవహరించబడ్డారు. నాయకుడు శబ్దం
‘ నాయడు’ అయినట్లే ‘నాయకుని’ అనే శబ్దం కాలక్రమంలో ‘నాయని’ గానూ, అదే ఆ తరువాత ‘నేని’ గానూ రూపాంతరం చెంది, వారు వీరప్ప నేని (వీరపనేని) రామినాయకుడు, వీరపనేని మాచినాయకుడు గానూ వ్యవహరించబడి క్రమంగా ‘వీరపనేని’ శబ్దమే వారి ఇంటిపేరు అయిపోయింది. ఇదే పద్ధతిలో రామినేని, మాచినేని వంటి ఇండ్లపేర్లూ ఏర్పడ్డాయి. రామయ్య నాయకుడిని రామినాయకుడనీ, రామి నాయడనీ పిలిచినట్లే కామయ్య నాయకుడిని కామినాయకుడనీ, కామినాయడనీ వ్యవహరించిన కారణంగా తెలుగువారిలో ‘ కామినేని ‘ అనే ఇంటిపేరు ఏర్పడింది. తెలుగువారిలో కమ్మ, వెలమ, గౌడ కులాల వారిలో కామినేని అనే ఇంటిపేరు నాకు తగిలింది. తెలుగువారు కూడా ఒకప్పుడు తమ పేర్లకు ముందు తమ తండ్రి పేరును లేక వంశ మూలపురుషుడి పేరును ఉంచుకున్నారనడానికీ, అదే క్రమంగా వారి ఇంటిపేరు అయిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రెడ్డప్పగారి రాజగోపాలరెడ్డి, కిచ్చన్నగారి వెంకటరెడ్డి, లచ్చన్నగారి కిషన్ రెడ్డి వంటి పేర్లు కూడా ఇందుకు ఉదాహరణలే.

ఇంటి పేర్లలో భోజన పదార్థాలు
తెలుగువారి ఇంటిపేర్లలో ఊరిపేరు మీదుగా, తండ్రిపేరు లేక మూలపురుషుడి పేరు మీదుగా ఏర్పడినవే కాక పలు భోజన పదార్థాలు, ఇతర భోజన సంబంధమైన వస్తువుల
మీదుగా ఏర్పడ్డవి కూడా ఎన్నో ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

తెలుగు పుస్తక ప్రపంచం

24 Oct, 11:08


బ్రాహ్మణులలో పుల్లెల అనే ఇంటిపేరు ఉంది. పుల్లెలు అంటే విస్తళ్ళు వైదిక బ్రాహ్మణులలో పుల్లెల, పచ్చళ్ళ అనే ఇండ్లపేర్లు ఉన్నాయి. విఖ్యాత సంస్కృత పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు సాహిత్యాభిమానులకు చిరపరిచితులు. నిత్యాగ్నిహోత్రులు ఏ పనీ అగ్నిహోత్రం చేయకుండా మొదలుపెట్టరు. పైపెచ్చు ఆహార పచనానికి అగ్నిహోత్రం తప్పనిసరి. అగ్నిహోత్రం అనేది తెలుగువారిలో వైదిక, వైఖానస బ్రాహ్మణులలో కనిపించే ఇంటిపేరు.

పప్పు అనే ఇంటిపేరు బ్రాహ్మణులలో కనిపిస్తుంది. నేతి అనే ఇంటిపేరు కూడా వైదిక బ్రాహ్మణులలో ఉంది. అయితే నేతి అనే ఇంటిపేరు పప్పన్నంలో వేసి కలుపుకునే నెయ్యిని బట్టి రాలేదని నా అభిప్రాయం.
‘ న్యాయ శాస్త్రము’ అని కూడా పిలువబడే భారతీయ తర్కశాస్త్రం ( Indian Logic) లో సత్య సాధనకు వ్యాప్తి గ్రాహక తర్కం ( Inductive Logic), నిగమన తర్కం ( Deductive Logic) అనే రెండు పద్ధతులున్నాయి. నిగమన తార్కికులు నేతి న్యాయాన్ని అనుసరిస్తారు. నేతి ( న + ఇతి ) అంటే ‘ఇది కాదు’ అని అర్థం. వారు ‘నేతి .నేతి’ అంటూ - అంటే ‘ ఇది కాదు’..‘ఇది కాదు ‘ అంటూ నిగమన తర్క పద్ధతిలో - సత్యమైనది కాని ఒక్కొక్క అంశాన్నీ వర్జిస్తూ, సత్యసాధన దిశగా ముందుకుసాగి అంతిమంగా సత్యాన్నీ, వివేక జ్ఞానాన్నీ సాధిస్తారు. భారతీయ తర్కశాస్త్రంలో దీనిని ‘ నేతి న్యాయం’ అంటారు.వైదిక బ్రాహ్మణులలోని వైయాకరణులకు ‘వ్యాకరణం’ అనే ఇంటిపేరు, మౌహూర్తికులకు ‘ఘడియారం” అనే ఇంటిపేరు ఏర్పడినట్లే నైయాయికుల( Logicians) లోని నిగమన తార్కికులకు వారు ఉపయోగించే ‘నేతి న్యాయం’ కారణంగా నేతి అనే ఇంటిపేరు వచ్చి ఉంటుంది.
నేతి అనే ఇంటిపేరు కమ్మవారిలోనూ ఉంది. వారిలో పాడి పరిశ్రమకు, నేతి అమ్మకానికి పేరొందిన ఒక కుటుంబానికి ముందుగా ఆ ఇంటిపేరు వచ్చి ఉంటుంది. ఆ ఇంటిపేరు మీదుగానే ప్రకాశం జిల్లాలో కందుకూరు సమీపంలో నేతి వారి పాలెం అనే ఒక గ్రామం కూడా ఉంది. ఆ ఊరంతా నేతి ఇంటిపేరుగల వారే. నా రెండవ అక్కయ్య విప్పర్ల శోభారాణి దగ్గర బంధువు నేతి సింగయ్య చౌదరిది ఆ వూరే కావటంతో ఒకసారి ఆ ఊరు వెళ్లాం.

ఉప్పు అనే ఇంటిపేరు కమ్మవారిలో ఉంది. విఖ్యాత సినీ నటుడు కీ.శే. శోభన్ బాబు ఇంటి పేరు ఉప్పు వారే. సినిమాలలో చేరక ముందు ఆయన పేరు ఉప్పు శోభనాచలపతిరావు. వారి స్వగ్రామం విజయవాడ - మైలవరం మార్గంలోని కుంటముక్కల గ్రామ సమీపంలోని చిన నందిగామ. అక్కడికి సమీపంలోని ఆగిరిపల్లి కొండ (శోభనాచలం) మీద కొలువైన శోభనాచలపతి (వ్యాఘ్ర నరసింహస్వామి) పేరే తల్లిదండ్రులు ఆయనకు పెట్టారు. ఉప్పు అనే ఇంటిపేరు బలిజ కాపు వారిలోనూ ఉంది.
నా చిన్నతనంలో మా చినరావూరులోని బలిజ కాపు కుటుంబాలలో ఉప్పు కిష్టయ్య అనే ఆయన ఉండేవారు.

పులుసు అనే ఇంటిపేరు రెడ్లలో ఉంది. గతంలో ముందుగా విజయవాడ శారదా కళాశాల, ఆ తరువాత సయ్యద్ అప్పలస్వామి కళాశాల ప్రిన్సిపల్ గా వ్యవహరించిన తెలుగు భాషాభిమాని కీ.శే.పులుసు గోపిరెడ్డి నాకు తెలుసు. ఇటీవలనే మా చినరావూరు పార్క్ లో ఉదయపు నడకలో సన్నిహితుడైన శ్రీ పులుసు అంజిరెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా మాచెర్ల తాలూకా వెల్దుర్తి సమీపంలోని సిరిగిరిపాడు.

పచ్చి పులుసు అనే ఇంటిపేరు వైశ్యులలో ఎక్కువగా కనిపిస్తుంది. కమ్మ వారిలోనూ ఆ ఇంటిపేరు ఉన్నట్లూ వారిది పమిడిపాళ్ళ ( పగిడిపాల) గోత్రం అయినట్లూ చదివాను.

ఉలవకట్టు (ఉలవ చారు) అనే ఇంటిపేరు కలిగిన బలిజ కాపులు మా తెనాలి తాలూకాలోని కంఠంరాజు కొండూరులో ఉన్నారు. వారి పూర్వులు కృష్ణాజిల్లా నుంచి అక్కడికి వలస వచ్చారట. మా గుంటూరు జిల్లాలో దాదాపు గత నలభై ఏళ్ల నుంచే ఇంతకు పూర్వం లేని అలవాటైన భోజనంలో ఉలవచారు (Brown Soup) వినియోగం మొదలైనట్లు నాకు తెలుసు. ఇక్కడ అది కృష్ణా జిల్లా నుంచి దిగుమతైన ఆహార అలవాటు కావడం కూడా గమనార్హం. ఉలవ చారు అంటే బాగా ఇష్టపడిన, లేక ఉలవ చారు కాయటంలో మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి పేరిట ఈ ‘ఉలవ కట్టు’ అనే ఇంటిపేరు ఏర్పడి ఉంటుంది. కమ్మవారిలో ఉలవల అనే ఇంటిపేరు ఉంది, కందికట్టు అనే ఇంటిపేరూ ఉంది కానీ ఉలవకట్టు అనే ఇంటిపేరు నాకు ఎక్కడా తగలలేదు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని మారుతి మెస్ లో వడ్డించే కందికట్టు, పెసరకట్టు చాలా రుచికరంగా ఉండేవి.( పప్పు ఉడికించిన నీళ్లను వార్చి, ఆ పప్పు నీళ్లతో కాచే చారునే కట్టు అంటారు). కందికట్టు, కందికట్ల ఇంటిపేర్లు బ్రాహ్మణులలో ఉన్నాయి.పెసరకట్టు అనే ఇంటిపేరు కూడా ఉండే ఉంటుందేమో కానీ నాకెక్కడా తటస్థించలేదు.

మన ప్రాచీన కవులు విస్తట్లో వడ్డించే ఆహార పదార్థాలలో ‘గుప్పెడు పంచదారయును’ అంటూ పంచదార (బెల్లం) ను కూడా ప్రస్తావించారు. అన్నంలో కలుపుకునే కూరలు, పచ్చళ్ళు, పులుసులు, చారులు మొదలైన వ్యంజనాలలో పులుపు, కారం, చేదు వంటివి ఎక్కువైనప్పుడు వాటి ప్రభావం తగ్గించటం కోసం గుప్పెడు పంచదార (బెల్లం) కూడా వడ్డించేవారు. ఆ కారణంగా బెల్లం లేక పంచదారను కూడా భోజనపదార్థంగానే భావిస్తారు. బెల్లం, బెల్లపు ఇంటిపేర్లు బలిజ కాపులలో, కమ్మవారిలో ఉన్నాయి.

తెలుగు పుస్తక ప్రపంచం

23 Oct, 13:29


ఎంత చులకన చేశారు
బుడ్డి దీపం అని నవ్వుకున్నారు
బోడి పుస్తకాలని వెక్కిరించారు

అవి ఎప్పటికి చెడగొట్టలేదని
నిన్నెప్పుడు మోసం చేయలేదని
నువ్వెప్పుడైనా నన్ను వెతుక్కుంటూ
వస్తావని అవి నమ్మకంగా ఉన్నాయి

విజ్ఞానం మనకు తోడు
అవ్వాలి కాని
వ్యసనం అవ్వకూడదని
అర్థం అయ్యేసరికి
జీవితం ఎంతో నాశనం
అయిపోయుంటుంది

ముఖప్పుస్తకం ఒక
మంచి వేదికే
నువ్వు వాడే రీతిని బట్టి

మందు పొగ ఎప్పటికైనా
నీ ఆరోగ్యానికి హానే
అని మెదడు హెచ్చరిస్తున్నా
వినను అనే మొండితనం

ఇవన్నీ ముఖ్యం అనుకున్న నీకు
నీ జీవితపు తోడుతో
నిజాయితీగా ఉండలేక
దారి తప్పే ప్రమాదం
అయినా నాదే సరైన మార్గం
అనే మూర్కత్వం

పుస్తకాన్ని నువ్వు రోజంతా
చదివినా నువ్వు దారి తప్పవు
ఎప్పటికి ఆ వెలుగు నిన్ను
సరైన మార్గం లోనే పయనించేలా
మారుస్తుంది

విజ్ఞానంతో ఏదైతే గొప్ప అనుకున్నావో
పొగ మందు గౌరవం అనుకున్నావో
అక్కడే నీ జీవితం అంధకారం
వైపు అడుగులు వేస్తుందని అర్థం

తెలుగు పుస్తక ప్రపంచం

23 Oct, 02:19


ఈ క్రిందివిషయం వాట్స్ ఆప్ నుండి ... బాగున్నదని పోస్ట్ చేస్తున్నాను ..). 👇🏻
ఎప్పుడో వంద సంవత్సరాలకు పైన కిందటి విషయం.

వ్యవహారం కోర్టు కెక్కింది.
విచారణా జరిగింది విశాఖపట్నం జిల్లా కోర్టులో.
.............................
ఇంతలో జడ్జీ వచ్చాడు. జడ్జి యూరోపియన్. వారందరూ లేచినుంచున్నారు.
జడ్జీ గద్దెయెక్కాడు. బిలబిల్లాడుతూ వారూ కూర్చున్నారు.

కూచున్నారు; గాని మళ్ళీ లేచినుంచున్నారు వెంటనే.
పిడపర్తి పెద్ద దక్షిణామూర్తి శాస్త్రిగారు హాల్లో ప్రవేశించారు,

మరి చూడగా, బ్రహ్మవర్చస్సు మూర్తీభవించిన ట్టున్నారు వారు.
అది చూసి చకితుడైనాడు; కాని '' యేం లేచారూ?" అనడిగాడు వకీళ్ళను జడ్జి.
''అరుగో, వారు దయచేశారు. దైవజ్ఙులు వారు. దైవం తరువాత మాకంతటివారున్నూ. అలాంటివారికి ప్రత్యుత్థానం చెయ్యడం అనివార్యం మాకు'' అని బదులుచెప్పారు వకీళ్ళు, తమ నాయకుని పరంగా.''అలాగా?" అన్నాడు జడ్జి, జిజ్ఙాసతో.
యూరోపియను అతడు.

తా నిది అర్థంచేసుకోలేడు; గాని మనస్సు గుబగుబలాడిపోయింది, తానూ లేచేశా డనుకోకుండా..
''వారి విశిష్టత యేమిటీ?" అనిన్నీ అడిగాడు, లేస్తూనే.

''సర్వజ్ఙులు వారు. ధర్మనిరతులు.. జ్యోతిశ్శాస్త్రం వారికి కరతలామలకం. వారు పంచాంగం చేస్తారు, దృక్సిద్ధంగా వుంటుం దది. జాతకాలు రాస్తారు, వొక్కక్షరమున్నూ బీరుపోదు. ప్రశ్నలున్నూ చెబుతారు, వారిమాట జరిగితీరుతుం'' దన్నారు వకీళ్ళు.
జడ్జి బుద్ధి చమత్కృతం అయింది, దీంతో.

''ఒక్క ప్రశ్న అడగవచ్చునా?" అనడిగా డతను.

''అడగ'' మన్నారు వకీళ్ళు, శాస్త్రిగారి యింగితం కనిపెట్టి.

'' నేను కోర్టుకి బయలుదేరేటప్పడు మా ఆవు ఈనడానికి సిద్ధంగా వుంది. అది పెయ్యను పెట్టిందా, కోడెను పెట్టిందా? ఇది చెప్పమనండి.''

వారి సంస్కృతి అలాంటిది.
ప్రత్యక్షమే వారికి ప్రమాణం, మరి.
''యదృశ్యం తన్నశ్యం'' అంటే నమ్మరు వారు.

''కాగితం మీద రాసియిస్తాను. పైకి చెప్ప'' నన్నారు శాస్త్రిగారు.

లగ్నం కట్టుకుని ఆలోచించి రాసి యిచ్చారు.
అది టేబులుమీద పెట్టుకుని నౌకర్నింటికి పంపాడు దొర.

శాస్త్రిగారి ముఖం మిక్కిలి గంభీరంగా భాసిస్తోంది; కాని మనం యేమయిపోతామో?" అంటూ ఆందోళనపడసాగారు, వకీళ్లు.

అటు నౌకరు వచ్చాడింతలో, ఇటు దొర కాగితం తీశాడు చురుగ్గా.
బెంచిక్లార్కు అనువదించాడు.''సెబాస్, సరిపోయింది'' అన్నాడు దొర.

అన్నాడు కాని, వొక సందేహం పుట్టుకు వచ్చిం దతనికి - "మన మిటు నౌకర్ని పంపినట్లే, వకీళ్ళున్నూ తమ నౌకర్ని పంపివుండగూడదూ నా యింటికి?" అని.

సిద్ధాంతాలు ఎంత మంచివయినా అవి ప్రత్యక్షప్రమాణంతో రుజువయితే గాని ముందుకు వెళ్ళరు వారు. వారి భౌతిక విజయాల కిదే కారణం.
చూసిచూసి ''యింకొక టడగవచ్చునా?" అనడిగా డతను.
వకీళ్ళకి నిశ్చింత.
''వో, అడగవచ్చు'' నన్నారు వారు.

''ఈ హాలుకి నాలుగు ద్వారాలున్నాయి. కోర్టుపని ముగించుకుని బయటికి వెళ్ళేటప్పుడు నేనే ద్వారంనుంచి వెడతానూ? ఇది రాయమనం'' డన్నాడు దొర.
శాస్త్రిగారు రాసి వకీళ్ళ కిచ్చారు.

ఒక కవరులో వుంచి అతికించి అది దొర కందించారు వకీళ్ళు, ధీమాగా.
దొర జేబులో పెట్టుకున్నా డది. వ్యవహారం ప్రారంభం అయింది. అయిదింటికి పూర్తి అయింది. అందరూ లేచారు.

వెనక ద్వారాన తన ఛాంబర్సులోకి వెళ్ళిపోవలసిన దొర అందరి మధ్యకీ వచ్చాడు,
హాల్లోకి.విషమసమస్య ప్రారంభ మయినట్టయింది, దాంతో.
నీరవు లయిపోయారు వకీళ్ళు; కాని దొర మాత్రం సావధానుడయినాడు, చురుగ్గా చూస్తూ.

. ... .... .... ..
కాగా - "ఏగుమ్మాన వెడతాడో?" అనుకుంటూ ఆత్రంగా వున్నారు వకీళ్ళందరూ;
కాని వుడతలాగ వొక కిటికీలోనుంచి బయటకు దూకేశాడు దొర ''రండి'' అని వకీళ్ళను పిలుస్తూ. అందరూ తెల్లపోయారు.

దొర కవరు తీశాడు, కవరులోనుంచి కాగితమూ తీశాడు, అన్యమనస్కంగా
ఆ కాగితం అతని చేతిలో వుండగానే ఆంగ్లంలోకి అనువాదం చేసి చదివేశాడు బెంచిక్లార్కు.
''వొక కృత్రిమద్వారంలోనుంచి బయటి కురుకుతావు'' అని.
తుళ్ళిపడ్డాడు దొర.ఎగిరి పడ్డారు వకీళ్ళు.

(శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి స్వీయచరిత్ర నుండి కొన్ని భాగాలు)

తెలుగు పుస్తక ప్రపంచం

21 Oct, 09:25


#గుంటూరు_శేషేంద్రశర్మ గారు 🙏

"నేనింతా ఓ పిడికెడు మట్టే కావచ్చు - కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది!" అంటూ నినదించిన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు..

గుంటూరు శేషేంద్రశర్మ (20 అక్టోబర్, 1927 - 30 మే, 2007) తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త, వక్త. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు. వచన కవిత్వం, పద్యరచన - రెండింటిలో సమాన ప్రతిభావంతుడు. ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి. "నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.

ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ.......... - ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)

* *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు. నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్యరచన - రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొక శైలీ నిర్మాత.

జీవిత విశేషాలు
శేషేంద్ర శర్మ నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, నాగరాజపాడులో జన్మించారు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాక, మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ పొందారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మునిసిపల్‌ కమిషనరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయన భౌతిక కాయానికి మే 31న అంబర్‌పేట శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం వందనం సమర్పించారు. శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించారు. శేషేంద్రకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రచనలు
1951 - "సోహ్రాబ్ - రుస్తుమ్" అనే పారశీక రచన తెలుగు అనువాదం (ఆంగ్ల రచననుండి)
1968-72 - శేషజ్యోత్స్న - కవిత, వచన రచనల సంకలనం
1974 - మండే సూర్యుడు
1974 - రక్తరేఖ
1975 - నా దేశం - నా ప్రజలు
1976 - నీరై పారిపోయింది
1977 - గొరిల్లా
నరుడు - నక్షత్రాలు
షోడశి - రామాయణ రహస్యములు
స్వర్ణ హంస
ఆధునిక మహాభారతం
జనవంశం
కాలరేఖ
కవిసేన మేనిఫెస్టో
మబ్బుల్లో దర్బార్...
1968 - సాహిత్య కౌముది
ఋతు ఘోష
ప్రేమ లేఖలు

అవార్డులు
1993 - సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం
శేషేంద్ర రచించిన కాలరేఖకు 1994 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం
1994 - తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం,
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు

సినిమా పాట
శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాలముగ్గులో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశారు. ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన సినిమాల కోసం రాసిన ఒకే ఒక్క పాట.

ప్రముఖుల ప్రశంసలు
"శేషేన్
నీ పోయెమ్సు చూసేన్
పసందు చేసేన్
నీది పద్యమా లేక ఫ్రెంచి మద్యమా"
అంటూ ఆయనను కవితాత్మకంగా పొగిడి మురిసిపోయారు "శ్రీశ్రీ".

శేషేంద్ర శర్మ గారి పాండిత్యము ఎంతలోతైనదో చెబుతూ, "వీరికి సాటి వచ్చే మహామేధావులు భారతదేశం మొత్తం మీద ఒకరిద్దరకు మించి ఉండకపోవచ్చునేమో" అని "షోడశి"కి సమీక్ష రాస్తూ ప్రశంసించారు విశ్వనాథవారు.

తెలుగు పుస్తక ప్రపంచం

15 Oct, 07:38


గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు

కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.

గాయత్రీ మంత్రము అంటే…
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…



ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్



ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్నా 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు

7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు

10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

11. మన వెన్ను బాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.
12.మనకు గల సమయం 24 గంటలు.. ఒక్కొక్క గంటకు ఒకొక్క అక్షరం మనలలను కాపాడుతూ వుంటుంటుంది ఆ గాయత్రి మాత
“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.


యిరువది నాలుగు దేవతా మూర్తులు
క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి
1 తత్ విఘ్నేశ్వరుడు 13 ధీ భూదేవి
2 న నరసింహస్వామి 14 మ సూర్య భగవానుడు
3 వి మహావిష్ణువు 15 హి శ్రీరాముడు
4 తుః శివుడు 16 ధి సీతాదేవి
5 వ శ్రీకృష్ణుడు 17 యో చంద్రుడు
6 రే రాధాదేవి 18 యో యముడు
7 ణ్యం శ్రీ మహాలక్ష్మి 19 నః బ్రహ్మ
8 భ అగ్ని దేవుడు 20 ప్ర వరుణుదు
9 ర్గోః ఇంద్రుడు 21 చో శ్రీమన్నారాయణుడు
10 దే సరస్వతీ దేవి 22 ద హయగ్రీవుడు
11 వ దుర్గాదేవి 23 య హంసదేవత
12 స్య ఆంజనేయస్వామి 24 త్ తులసీమాత
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి,దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.

!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!

తెలుగు పుస్తక ప్రపంచం

10 Oct, 11:37


కానీ, 2000లో బ్రిటీష్ టెట్లీ గ్రూప్‌ను కొనుగోలు చేసి, ఆయన అందర్ని ఆశ్చర్యపరిచారు. నేడు టాటా గ్లోబల్ బెవరేజస్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టీ కంపెనీ. ఆ తర్వాత యూరప్‌కు చెందిన రెండో అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ ‘కోరస్’ను కొనుగోలు చేశారు.

ఈ డీల్‌పై విమర్శకులు పలు ప్రశ్నలు సంధించినప్పటికీ, తన సామర్థ్యాన్ని టాటా గ్రూప్ రుజువు చేసి చూపించింది.

2009లో దిల్లీ ఆటో ఎక్స్‌పో సందర్భంగా లక్ష రూపాయలకే టాటా ‘నానో’ కారును ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

నానోకు ముందు 1998లో టాటా మోటార్స్ ‘ఇండికా’ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. భారత్‌లో డిజైన్ చేసిన తొలి కారు ఇదే.

ఈ కారు తొలుత విఫలమైంది. దీంతో, ఫోర్డ్ మోటార్ కంపెనీకి దీన్ని అమ్మాలని రతన్ టాటా నిర్ణయించారు. డెట్రాయిట్ వెళ్లినప్పుడు బిల్ ఫోర్డ్‌ను కలిశారు. అయితే, ఈ వ్యాపారం గురించి సరైన అవగాహన లేనప్పుడు ఎందుకు ఈ రంగంలోకి వచ్చారంటూ ఆయన్ను ప్రశ్నించారు.

ఒకవేళ తాము ‘ఇండికా’ను కొంటే, భారత కంపెనీకి చాలా పెద్ద మంచి పనిచేస్తున్నట్లు మాట్లాడారు. రతన్ టాటా బృందానికి ఆయన ప్రవర్తన, మాటలు కోపం తెప్పించాయి. సంభాషణను పూర్తి చేయకుండానే అక్కడి నుంచి బయటికి వచ్చేశారు.

ఆ తర్వాత, 2008లో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఫోర్డ్ కంపెనీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫోర్డ్ తన వ్యాపారాలను బ్రిటీష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌కు అమ్మింది.

తమ లగ్జరీ కారు కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా ఫోర్డ్‌కు ఒక భారతీయ కంపెనీ గొప్ప ఉపకారం చేస్తున్నట్లు బిల్ ఫోర్డ్ అన్నట్లు కుమీ కపూర్ రాశారు. రతన్ టాటా ఈ రెండు ప్రముఖ బ్రాండ్లను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.

జాగ్వార్ కొన్నప్పుడు విమర్శలు
రతన్ టాటా నేతృత్వంలో జరిగిన ఈ కొనుగోళ్లపై కొందరు వ్యాపార విశ్లేషకులు పలు ప్రశ్నలు లేవనెత్తారు.

రతన్ టాటా ఖరీదైన విదేశీ కొనుగోళ్లు ఆయనకు ఖరీదైన డీల్స్‌గా మారాయని వాళ్లు అన్నారు.

టాటా స్టీల్ యూరప్ వైట్ ఎలిఫెంట్‌గా మారి, గ్రూప్‌ను తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టింది.

రతన్ టాటా విదేశీ కొనుగోళ్లు పూర్తిగా అహంకారం, బ్యాడ్ టైమింగ్‌లో తీసుకున్నవని టీఎన్ నీనన్ అన్నారు.

‘గత రెండు దశాబ్దాలలో భారత వ్యాపారాల్లో అతిపెద్ద అవకాశం టెలికం. కానీ, రతన్ టాటా ఆ అవకాశాన్ని వదులుకున్నారు’’ అని ఈ వ్యాపార విశ్లేషకులు అన్నారు.

‘‘రతన్ టాటా తప్పు మీద తప్పు చేస్తున్నారు. జాగ్వార్‌ను కొనడం ఆయన గ్రూప్‌కు ఆర్థిక భారమే. కానీ, టీసీఎస్ ఎల్లప్పుడూ టాటా గ్రూప్‌ను అగ్రస్థానంలో నిల్చోబెడుతుంది’’ అని ప్రముఖ జర్నలిస్ట్ సుచేతా దలాల్ చెప్పారు.

2015లో టాటా గ్రూప్ నికర లాభంలో 60 శాతానికి పైగా ఈ కంపెనీ నుంచే వచ్చాయి. 2016లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టీసీఎస్ అతిపెద్ద కంపెనీగా ఉంది.

నీరా రాడియా, తనిష్క్, సైరస్ మిస్త్రీల వివాదం
లాబీయిస్ట్ నీరా రాడియాతో జరిగిన టెలిఫోన్ సంభాషణలు లీకవ్వడంతో 2010లో రతన్ టాటా పెద్ద వివాదంలో కూరుకున్నారు.

ఆ తర్వాత 2020 అక్టోబర్‌లో, టాటా గ్రూప్ జ్యూవెల్లరీ బ్రాండ్ తనిష్క్ వ్యాపార ప్రకటన కూడా రతన్ టాటాకు పెద్ద తలనొప్పి అయింది. ఆ వ్యాపార ప్రకటనను తనిష్క్ వెనక్కి తీసుకుంది. జేఆర్డీ టాటా బతికి ఉంటే, ఇలాంటి ఒత్తిడి వచ్చేది కాదని చాలామంది భావించారు.

కనీసం గంట కూడా సమయం ఇవ్వకుండా 2016 అక్టోబర్ 24న టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించినప్పుడు కూడా రతన్ టాటాపై విమర్శలు వచ్చాయి.

టాటా అంటే విశ్వసనీయమైన బ్రాండ్‌
అయితే, ఇన్ని ఉన్నప్పటికీ, రతన్ టాటా ఎప్పుడూ భారత్‌లోని అత్యంత విశ్వసనీయ పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా ఉంటారు.

భారత్‌లో కోవిడ్ మహమ్మారి వ్యాపించినపుడు రతన్ టాటా అప్పటికప్పుడు టాటా ట్రస్టుల నుంచి రూ.500 కోట్లు, టాటా కంపెనీల నుంచి రూ.1,000 కోట్లు విరాళంగా ఇచ్చారు.

ఆ సమయంలో కరోనా రోగులకు వైద్యం చేయడానికి ప్రాణాలకు తెగించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉండడం కోసం తమ లగ్జరీ హోటళ్లను ఉపయోగించుకోవచ్చని మొట్టమొదట చెప్పిన వ్యక్తి రతన్ టాటానే.

ఇప్పటికీ భారత ట్రక్ డ్రైవర్లు తమ వాహనాల వెనుక భాగంలో ‘ఓకే టాటా’ అని రాసుకుంటూ ఉంటారు. అంటే నేను నడిపే ఈ ట్రక్కు టాటాది, ఇది విశ్వసనీయమైనది అని చెప్పడానికే.

టాటా వేసిన ఒక భారీ గ్లోబల్ ఫుట్‌ప్రింట్ కూడా ఉంది. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్లను తయారు చేసేది ఈ కంపెనీనే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటి.

ఇవన్నీ రతన్ టాటా పాత్రను శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

తెలుగు పుస్తక ప్రపంచం

10 Oct, 11:37


కుమీ కపూర్‌కు రతన్ టాటా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. “ఆ రోజుల్లో విదేశాల్లో చదవడానికి రిజర్వ్ బ్యాంక్ చాలా తక్కువ విదేశీ కరెన్సీ ఉపయోగించడానికి అనుమతించేది. మా నాన్నకు చట్టాలను ఉల్లంఘించడం నచ్చదు. అందుకే ఆయన నా కోసం బ్లాక్‌లో డాలర్లు కొనేవారు కాదు. దీంతో తరచూ నెల ముగిసేలోపే నా దగ్గర డబ్బులు అయిపోయేవి. దాంతో నా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవాడిని. చాలాసార్లు కాస్త అదనపు డబ్బు సంపాదించడానికి పాత్రలు కూడా కడిగాను” అని చెప్పారు.

రతన్‌కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

ఆయనకు 18 ఏళ్లు వచ్చిన సమయంలో ఆయన తండ్రి సిమోన్ దూనోయర్‌ అనే ఒక స్విస్ మహిళను పెళ్లాడారు.

మరోవైపు, ఆయన తల్లి విడాకులు తీసుకున్న తర్వాత సర్ జంషెడ్జీ జీజీభాయ్‌ను వివాహం చేసుకున్నారు. దీంతో రతన్‌ను ఆయన నానమ్మ లేడీ నవాజ్‌బాయి టాటా పెంచారు.

రతన్ అమెరికాలో ఏడేళ్లు ఉన్నారు. అక్కడ కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఆయన ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. లాస్ ఏంజలస్‌లో ఆయనకు ఒక మంచి ఉద్యోగం, అద్భుతమైన ఇల్లు ఉండేవి. కానీ తన నానమ్మ కోరడంతో ఆయన భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.

ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమెరికన్ అమ్మాయిని ప్రేమించారు. ‘‘ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆమె నాతో పాటే భారత్‌కు వస్తారని అనుకున్నాను. కానీ, అప్పుడు భారత్, చైనా మధ్య యుద్ధం (1962) జరుగుతోంది. దాంతో, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు’’ అని హ్యూమన్స్ ఆఫ్ బాంబే‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా చెప్పారు.

రతన్ టాటా జీవితాంతం అవివాహితుడిగా ఉండిపోయారు.

సాధారణ కార్మికుడిలా బ్లూ ఓవరాల్ ధరించి కెరియర్ ప్రారంభం
1962లో రతన్ టాటా జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ సంస్థలో పనిచేయడం ప్రారంభించారు.

‘‘రతన్ జెంషెడ్‌పూర్‌లో ఆరేళ్లు ఉన్నారు. మొదట్లో ఆయన ఒక షాప్‌ఫ్లోర్ కార్మికుడిలా బ్లూ ఓవరాల్ ధరించి అప్రెంటిస్‌షిప్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేశారు’’ అని గిరీష్ కుమార్ తన పుస్తకంలో రాశారు.

ఆ తర్వాత ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే నానావతికి స్పెషల్ అసిస్టెంట్ అయ్యారు. ఆయన చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అన్న విషయం ముంబయి వరకూ చేరింది. దీంతో జేఆర్డీ టాటా ఆయన్ను ముంబయికి పిలిపించారు.

ఆ తర్వాత రతన్ ఆస్ట్రేలియాలో ఏడాది పాటు పనిచేశారు. రతన్ టాటాకు సెంట్రల్ మిల్, నెల్కో లాంటి నష్టాల్లో ఉన్న కంపెనీలను గాడినపెట్టే బాధ్యతలను అప్పగించారు జేఆర్డీ.

రతన్ టాటా నేతృత్వంలో మూడేళ్లలోనే నెల్కో దశ మారిపోయింది. అది లాభాలు ఆర్జించడం మొదలుపెట్టింది. 1981లో రతన్‌ను టాటా ఇండస్ట్రీస్‌కు చీఫ్‌గా చేశారు జేఆర్డీ.

సాదాసీదా జీవనశైలి
ఆ సమయంలోని బిజినెస్ జర్నలిస్ట్‌లు, రతన్ టాటా స్నేహితులు ఆయన చాలా స్నేహపూర్వకమైన వ్యక్తిగా గుర్తు చేసుకుంటారు.

ఎవరితోనైనా గౌరవ మర్యాదలతో నడుచుకుంటారని, ఎలాంటి గాబరా ప్రదర్శించని ఆసక్తికరమైన వ్యక్తి అని చెబుతుంటారు. ఎవరైనా తనను కలవాలనుకుంటే, స్వయంగా ఆయనే ఫోన్ ఎత్తే వారని చెప్పారు.

‘‘చాలామంది భారత బిలియనీర్స్‌తో పోలిస్తే రతన్ టాటా జీవనశైలి అత్యంత సాధారణంగా ఉంటుంది’’ అని రచయిత కుమీ కపూర్ చెప్పారు.

ఆయనకు సెక్రటరీలు ఎక్కువగా లేకపోవడాన్ని చూసి తాను చాలా ఆశ్చర్యానికి గురైనట్లు తన వ్యాపార సలహాదారుల్లో ఒకరు అన్నట్లు తెలిపారు.

‘‘నేనొకసారి ఆయన ఇంటి బెల్ నొక్కినప్పుడు, ఒక చిన్న అబ్బాయి వచ్చి తలుపు తెరిచారు. యూనిఫామ్ వేసుకున్న సర్వెంట్లు ఎవరూ నాకు ఆ ఇంట్లో కనిపించలేదు. సముద్రానికి ఎదురుగా కొలాబాలో ఉండే ఆయన ఇల్లు టాటా కళాభిరుచిని ప్రతిబింబిస్తుంది. కుంబ్లా హిల్స్‌లోని యెంటిలియాలో ఉన్న ముకేశ్ అంబానీ 27 అంతస్తుల భవనానికి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అని రచయిత చెప్పారు.

జేఆర్డీ టాటా వారసుడిగా..
జేఆర్డీ టాటాకు 75 ఏళ్లు వచ్చినప్పుడు, ఆయన వారసుడు ఎవరు? అని విపరీతంగా చర్చ జరిగింది.

‘‘నాని పల్ఖివాలా, రుసీ మోదీ, షారుఖ్ సబ్వాలా, హెచ్‌ఎన్ సేథ్నాలలో ఒకరు ఆయన వారసులు అవుతారని అనుకున్నారు. రతన్ టాటా కూడా పాల్కివాలా, రుసీ మోదీలు ఇద్దరూ ప్రధాన అభ్యర్థులుగా భావించారు’’ అని టాటా బయోగ్రాఫర్ కేఎం లాలా రాశారు.

86 ఏళ్ల వయసులో 1991లో జేఆర్డీ టాటా చైర్మన్ పదవి నుంచి దిగిపోయినప్పుడు, కంపెనీ వారసత్వ బాధ్యతలు రతన్ టాటాకు అప్పజెప్పారు.

టాటా స్నేహితుడు నుస్లీ వాడియా, ఆయన అసిస్టెంట్ షారుఖ్ సబ్వాలాలు రతన్ టాటా పేరును సమర్థించారు.

1991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు, దర్బారి సేత్, రుసీ మోదీ, అజిత్ కేర్కర్‌లను ఎలా బలహీనపర్చాలన్నది ఆయన ముందున్న సవాలు.

ప్రధాన కార్యాలయం నుంచి ఎలాంటి జోక్యం లేకుండా ఇప్పటికీ ఈ ముగ్గురూ టాటా కంపెనీల్లో పనిచేస్తున్నారు.

టెట్లీ, కోరస్, జాగ్వార్ కొనుగోళ్లు
రతన్ టాటా వ్యాపారాలను అర్థం చేసుకునే విధానంపై తొలుత చాలామంది పలు ప్రశ్నలు సంధించారు.

తెలుగు పుస్తక ప్రపంచం

10 Oct, 11:37


#రతన్_టాటా: ఆడంబరాలకు దూరంగా, సాధారణ జీవితాన్ని కోరుకున్న వ్యక్తి
రచన - రెహాన్ ఫజల్ , బీబీసీ ప్రతినిధి

1992లో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులతో ఒక అద్భుతమైన సర్వే చేశారు.

దిల్లీ నుంచి ముంబయికి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన ఒక ప్రయాణికుడి గురించి చెప్పండి అన్నారు. అప్పుడు అత్యధిక ఓట్లు రతన్ టాటాకు లభించాయి.

కారణమేంటో తెలుసుకోడానికి ప్రయత్నించినప్పుడు, వీఐపీల్లో ఆయన ఒక్కరు మాత్రమే ఒంటరిగా ప్రయాణించేవారని తెలిసింది. అంటే తన బ్యాగ్ తీసుకెళ్లడానికి, ఫైళ్లు పట్టుకోవడానికి రతన్ టాటాకు అసిస్టెంట్లు ఎవరూ ఉండేవారు కాదు.

విమానంలో ఆయన నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటుండేవారు. ఆ సమయంలో తక్కువ చక్కెర వేసిన ఒక బ్లాక్ కాఫీ తాగడం ఆయనకు అలవాటు.

తాను అడిగినట్టుగా కాఫీ ఇవ్వలేదని ఆయన ఎప్పుడూ ఫ్లయిట్ అటెండెంట్లపై కోప్పడలేదు.

రతన్ టాటా సాదాసీదా జీవితంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

“టాటా సన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు, ఆయన జేఆర్డీ టాటా గదిలో కూర్చోలేదు. ఆయన కూర్చోవడానికి సాధారణంగా ఉండే ఒక చిన్న గదిని నిర్మించారు. ఆయన ఎవరైనా జూనియర్లతో మాట్లాడుతున్నప్పుడు, ఆ సమయంలో సీనియర్ అధికారి వస్తే, ఆయన కాసేపు ఆగిరండి అని ఆ సీనియర్‌ అధికారికి చెప్పేవారు. ఆయన దగ్గర రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలు ఉండేవి. వాటి పేర్లు టీటో, ట్యాంగో. అవంటే ఆయనకు చాలా ఇష్టం” అని టాటా గ్రూప్ మీద గిరీష్ కుబేర్ రాసిన పుస్తకం “ది టాటాస్: హౌ ఏ ఫ్యామిలీ బిల్ట్ ఏ బిజినెస్ అండ్ ఏ నేషన్”లో వివరించారు.

ఆ కుక్కలతోపాటూ రతన్ టాటా తరచూ బాంబే హౌస్ (టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం) లాబీలో తిరుగుతూ కనిపించేవారు. ఆ సమయంలో ముందే అపాయింట్‌మెంట్ తీసుకుంటే తప్ప ఎవరినైనా ఆయన్ను కలవడానికి అక్కడికి అనుమతించేవారు కాదు.

కుక్క ఆరోగ్యం బాలేనప్పుడు..
ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత సుహైల్ సేథ్ ఒక ఘటన గురించి వివరించారు.

2018 ఫిబ్రవరి 6న బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ బకింగ్హమ్ ప్యాలెస్‌లో రతన్ టాటాకు ‘రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును ఇవ్వాల్సి ఉంది.

కానీ, వేడుకకు కొన్ని గంటల ముందు తాను అక్కడికి రాలేనని, ఎందుకంటే తన కుక్క టీటోకు హఠాత్తుగా జబ్బు చేసిందని ఆ కార్యక్రమ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు రతన్ టాటా. ప్రిన్స్ చార్లెస్‌కు ఆ విషయం చెప్పగానే ఆయన ‘‘దట్స్ ఎ మ్యాన్. దట్ ఈజ్ ద మ్యాన్ రతన్ ఈజ్’’ అన్నారు.

ఆడంబరాలకు దూరం, ఏకాంతం అంటే ఇష్టం..
జేఆర్డీ టాటా లాగే రతన్ టాటా సమయపాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన సరిగ్గా సాయంత్రం ఆరున్నర గంటలకు తన ఆఫీసు నుంచి వెళ్లిపోయేవారు.

ఆఫీసుకు సంబంధించిన పని కోసం ఎవరైనా తనను ఇంట్లో కలవాలనుకుంటే ఆయన చిరాకు పడేవారు. ఇంట్లో ఏకాంతంగా ఫైళ్లు, ఇతర పత్రాలు చదువుతుండేవారు.

ఆయన ముంబయిలో ఉన్నప్పుడు వారాంతాల్లో అలీబాగ్‌లోని తన ఫాంహౌస్‌లో గడిపేవారు. ఆ సమయంలో ఆయనతో కుక్కలు తప్ప ఇంకెవరూ ఉండేవారు కాదు. ఆయనకు ప్రయాణాలు చేయడం, ప్రసంగాలు చేయడం లాంటివి పెద్దగా నచ్చేవి కాదు. ఆడంబరాలంటే ఆయనకు చిరాకు.

చిన్నప్పుడు కుటుంబం రోల్స్ రాయిస్ కారులో ఆయన్ను స్కూలు దగ్గర దింపే సమయంలో ఆయనకు అసౌకర్యంగా అనిపించేది.

ఆయనకున్న ‘మొండి’ స్వభావం తన కుటుంబంలోనే ఉందని, జేఆర్డీ, ఆయన తండ్రి నావల్ టాటాల నుంచి అది రతన్‌కు వారసత్వంగా వచ్చిందని రతన్ టాటాను దగ్గరగా చూసినవారు చెబుతుంటారు.

“మీరు ఆయన తలకు తుపాకీ గురిపెట్టినా, నన్ను కాల్చండి కానీ, నేను దారిలోంచి పక్కకు వెళ్లను అంటారాయన. రతన్ టాటా అలాంటివారు” అని సుహైల్ సేథ్ చెప్పారు.

తన పాత స్నేహితుడి గురించి బాంబే డైయింగ్ చీఫ్ నుస్లీ వాడియా మాట్లాడుతూ.. “రతన్ చాలా సంక్లిష్టమైన వ్యక్తి. ఎవరైనా ఎప్పుడైనా ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటారని నాకు అనిపించడం లేదు. మాకు సాన్నిహిత్యం ఉన్నప్పటికీ నాకు, రతన్‌కు మధ్య వ్యక్తిగత సంబంధాలు లేవు. ఆయన పూర్తిగా ఒంటరి వ్యక్తి” అన్నారు.

‘‘రతన్ తన గోప్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ఆయన స్వయంగా నా దగ్గర అంగీకరించారు. ‘నేను బహుశా కలుపుగోలుగా ఉండే వ్యక్తిని కాకపోవచ్చు. అలా అని సమాజంలో కలవనివాడిని కూడా కాదు’ అని ఆయన చెప్పేవారు” అని కుమీ కపూర్ తన పుస్తకం “యాన్ ఇంటిమేట్ హిస్టరీ ఆఫ్ పార్శీస్‌”లో రాశారు.

రతన్ టాటాను పెంచిన నానమ్మ
రతన్ టాటా యువకుడుగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్న ఆయన స్నేహితులు టాటా గ్రూప్‌లో తన ప్రారంభ రోజుల్లో రతన్‌ తన సర్‌నేమ్ ఒక భారంలా అనుకునేవారని చెబుతారు.

అమెరికాలో చదువుకుంటున్న సమయంలో క్లాస్‌మేట్స్‌కు తన కుటుంబ నేపథ్యం గురించి ఏమీ తెలియదు కాబట్టి, ఆయన ఏ చింతా లేకుండా ఉండేవారు.

తెలుగు పుస్తక ప్రపంచం

07 Oct, 09:03


#ప్రదీప్‌_మెహ్రా ఇతని గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. కానీ ఈ ప్రదీప్ మెహ్రా నుండి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

స్కూల్‌కు ఏసి బస్‌.
అడిగిన వెంటనే షూస్‌.
కోరిన సీట్‌ రాకపోయినా డొనేషన్‌ సీట్‌.
ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమండేషన్‌.

పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి?*
కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి ?
కష్టాలను ఎదుర్కొనడమూ, ప్రతికూలతను జయించడమూ జీవితమే" అని ఎప్పుడు తెలుసుకోవాలి.
పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా?

నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్‌ మెహ్రా నుంచి.. మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?
ముందు ప్రదీప్‌ మెహ్రా గురించి తెలుసుకొని మళ్లీ మన పిల్లల దగ్గరకు వద్దాం.

మొన్నటి శనివారం రోజు.
అర్ధరాత్రి.. ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా. సినిమా దర్శకుడు వినోద్‌ కాప్రి తన కారులో వెళుతుంటే ఒక యువకుడు బ్యాక్‌ప్యాక్‌తో పరిగెడుతూ వెళుతున్నాడు.* *అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు. ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు. వినోద్‌ కాప్రికి ఆశ్చర్యం వేసింది... ఈ టైమ్‌లో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని. కారులో అతణ్ణే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్‌ చేశాడు.

👉 *'ఎందుకు పరిగెడుతున్నావ్‌?'*
*🏃‍♂️'వ్యాయామం కోసం'*
🌹 *'ఈ టైమ్‌లోనే ఎందుకు?'*
🏃‍♂️ *'నేను మెక్‌డోనాల్డ్స్‌లో పని చేస్తాను. వ్యాయామానికి టైం ఉండదు. అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్‌కు చేరుకుంటాను'*
🌹 *'నీ రూమ్‌ ఎంతదూరం?'*
🏃‍♂️ *'10 కిలోమీటర్లు ఉంటుంది'*
🌹 *'అంత దూరమా? కారెక్కు. దింపుతాను'*
🏃‍♂️ *'వద్దు. నా ప్రాక్టీసు పోతుంది'*
🌹 *ఇంతకీ ఎందుకు వ్యాయామం?'*
🕴️ *'ఆర్మీలో చేరడానికి'*

ఆ సమాధానంతో వినోద్‌ కాప్రి ఎంతో ఇంప్రెస్‌ అయ్యాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్‌ మెహ్రా. వయసు 19. ఊరు ఉత్తరాఖండ్‌ అల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊరిలో జబ్బు పడి ఆస్పత్రిలో ఉంది. తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్‌కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్‌ 16లో ఉండే మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ డ్యూటీ. మళ్లీ వంట పని. వీటి వల్ల వ్యాయామానికి టైమ్‌ ఉండదు. అందువల్ల ప్రతిరోజూ డ్యూటీ అయ్యాక (రాత్రి 10.40కి) బ్యాక్‌ప్యాక్‌ తగిలించుకుని బరోలా వరకు పరుగు మొదలెడతాడు. 'కనీసం కలిసి భోం చేద్దాం రా' అని వినోద్‌ కాప్రి అడిగితే ప్రదీప్‌ మెహ్రా చెప్పిన జవాబు 'వద్దు. రూమ్‌లో అన్నయ్య ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్లి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది. వాడికి నైట్‌ డ్యూటీ' అన్నాడు.

వినోద్‌ కాప్రి ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే గంటల వ్యవధి లో 40 లక్షల మంది చూశారు. ప్రదీప్‌ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రైటర్‌ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్‌ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్‌ ఇప్పిస్తానన్నాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్‌ పంపించాడు. ఆనంద్‌ మహీంద్ర అయితే 'ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిస్తారు' అని ట్వీట్‌ చేశాడు. 'ఈ కాలపు పిల్లలు ఇతణ్ణి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అన్నారు ఎందరో. నిజం. తప్పక నేర్చుకోవాల్సింది ఉంది.

👉 ప్రదీప్‌ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

🎁 1. లక్ష్యం కలిగి ఉండటం: ప్రదీప్‌ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు. కాని అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.

🎁 2. చిత్తశుద్ధి: లక్ష్యం కలిగి ఉండటమే కాదు. దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్‌ తన రొటీన్‌ను ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్లీ రాత్రి రూమ్‌కు వెళ్లి వంట, మధ్యలో డ్యూటీ... ఇవన్నీ చేస్తూ పరుగు. రోజూ రాత్రిళ్లు అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్‌ ఇస్తామని అడుగుతారు. ఈ ఒక్కరోజు బండెక్కుదాం అని అనుకోకుండా పరుగెడుతున్నాడు. దర్శకుడు వినోద్‌ కాప్రి అడిగినా అతడు కారు ఎక్కలేదు.

🎁 3. కుటుంబం ముఖ్యం: ప్రదీప్‌కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్లి వంట చేయాలని ఉంది. ఆర్మిలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దృష్టి ముఖ్యం.

🎁 4. ఆకర్షణలకు లొంగకపోవడం: గత 24 గంటల్లో ప్రదీప్‌ స్టార్‌ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. మీడియా వెంటపడుతోంది. ప్రదీప్‌ వయసున్న కుర్రాళ్లు తబ్బిబ్బయ్యి ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు. కాని 'నన్ను డిస్ట్రబ్‌ చేయకండి. పని చేసుకోనివ్వండి' అన్నాడు ప్రదీప్‌.

తెలుగు పుస్తక ప్రపంచం

07 Oct, 09:03


🎁 5. కష్టేఫలీ: 'మిడ్‌నైట్‌ రన్నర్‌'గా కొత్త హోదా పొందాక 'నువ్వు ఇచ్చే సందేశం' అని అడిగితే 'కష్టపడాలి. కష్టపడితే లోకం తల వొంచుతుంది' అని జవాబు చెప్పాడు.

👉 పిల్లలను పూర్తి కంఫర్ట్‌ జోన్‌లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడటంలో తప్పు లేదు. కాని సవాళ్లను ఎదుర్కొని, ఎదురుదెబ్బలకు తట్టుకుని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్‌ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు.

తెలుగు పుస్తక ప్రపంచం

07 Oct, 08:24


పెద్ద నీతితో కూడిన ఈ చిన్నపుస్తకాన్ని టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.
ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.
టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.
‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న.
‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు.
అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.
‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం’
‘ఎందుకంటే...
అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.
‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి’
డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి.
ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ "Die empty” అనే పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు.
ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట.
‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి’
నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే:
‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.
‘మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.
‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.
‘మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.
‘ప్రేమను పంచండి, మీలోనే దాచుకుని వృధా చేయకండి’
వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలోఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం!
‘అప్పుడు హాయిగా ...ప్రశాంతంగా....
👏“Let us Die Empty"
☝️👇

తెలుగు పుస్తక ప్రపంచం

06 Oct, 13:38


అమెరికా వెళ్లి అక్కడి మిచిగాన్ యూని వర్సిటి లో ‘’రేడియో యాక్టివ్ ఐసోటోపులు ‘’మీద రిసెర్చ్ చేశారు .ఆయన రాసిన ‘’హై వాక్యూం ‘’అనే శాస్త్ర గ్రంధం మేధావులైన ఎంతో మంది శాస్త్ర వేత్తలను ఆకర్షించింది...!
దాదాపు పాతికేళ్ళు విదేశాలలోనే చదువు ,వేదాంత ప్రవచనాలు ,యోగా ఉపన్యాసాలు ,తీవ్ర పరిశోధన ల తో గడిపిన స్వామి జ్ఞానానంద* 1947 మాతృదేశామైన భారత దేశం వచ్చేశారు..!
డిల్లీ లోని నేషనల్ ఫిజిక్స్ లాబరేటరీ లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా తమ అమూల్య మైన సేవలందించారు. ఏడేళ్ళ తర్వాత స్వామీజీకి భీమ వరం వద్ద ఒక ఆక్సిడెంట్ జరిగింది .విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్ లో చేరారు .ప్రమాదం తప్పి ,ఆరోగ్యం కుదురుకొన్నది...!
ఆంద్ర విశ్వ విద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో సౌకర్యాలు ,పరిశోధనా విభాగం ఆ శాఖా ను తీర్చి దిద్దే బాధ్యతను ఆ నాటి వైస్ చాన్సలర్ స్వామి జ్ఞానానంద కు పూర్తీ బాధ్యలతో అప్పగించారు .వారు తమ శక్తి యుక్తులను ధార పోసి 1954 లో చేరి తీర్చి దిద్దారు. న్యూక్లియర్ ఫిజిక్స్ కు గొప్ప భవిష్యత్తు స్వామీజీ వల్లనే మన రాష్ట్రం లో కలిగింది .1-7-1956 లో విశ్వ విద్యాలయం లో న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖ‘’ను స్వామి ఆధ్వర్యం లో ఏర్పడింది. ఎంతో మందిని ప్రోత్సహించి ,ప్రేరణ కల్గించి న్యూక్లియర్ ఫిజిక్స్ భవిష్యత్తును చాటి చెప్పి, అందులో విద్య నేర్వటానికి విద్యార్ధులను సంసిద్ధులను చేశారు...!
ఆంద్ర దేశం లో న్యూక్లియర్ ఫిజిక్స్ కు పునాదులు వేసి, వ్యాప్తి చేసింది స్వామి జ్ఞానానంద ప్రొఫెసర్ గా.., న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో చేరి, హెడ్ ప్రొఫెసర్ గా1965 న పదవీ విరమణ చేశారు. రాష్ట్ర మంతటా పర్య టించి, వారు వేద వేదాంగ ,యోగా శాస్త్ర రహస్యాలను శ్రోతలకు అందించి యోగశాస్త్ర వేద విజ్ఞాన శాస్త్రాల మధ్య ఉన్న సమన్వయాన్ని విశదీక రించే వారు. ఇవి ఒక దానికొకటి వైరుధ్యం ఉన్నవి కావని ,పరస్పర సంబంధం కలవని రుజువు చేశారు. ఆంద్ర విశ్వ విద్యాలయం లో వారి సేవలను గుర్తించి స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ రిసెర్చ్‘’ను ఏర్పాటు చేసి ఘనం గా నివాళులర్పించారు...!
స్వామి జ్ఞానానంద మతాన్ని సైన్స్ ను ‘’సింతెసిస్‘’ చేయాలని భావించారు .ఆయన మహా మానవతావాదిగా నిరూపించుకొన్నారు...!!!

( శ్రీభూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు...)
సేకరణ...

తెలుగు పుస్తక ప్రపంచం

06 Oct, 13:38


చరిత్ర పుస్తకాలలో చోటు దక్కని.,. భారతీయ న్యూక్లియర్ ఫిజిక్స్ పితామహుడు.. 😯

#న్యూక్లియర్_ఫిజిక్స్_స్వామి_జ్ఞానానంద.. (5.12.1896 - 21.09.1969)
సైన్స్ కు మతానికి పొత్తు కుదరదని చాలా మంది భావన. కాని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ , జగదీశ్ చంద్ర బోస్ , స్వామి జ్ఞానానంద వంటి వారు ఆ రెంటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చక్కగా వివరిస్తూ రెండు ఒక దానికొకటి అవసరమని, అప్పుడే మానవ జాతి పురోగతి అని విస్పష్టంగా చెప్పి ,ఆచరించి మార్గ దర్శనం చేశారు...!

న్యూక్లియర్ ఫిజిక్స్ లో స్పెక్త్రోస్కోపి మీద విశేష పరిశోధన చేసి దేశవిదేశాల్లో దాన్ని బోధించి హిమాలయాలలో తపస్సు చేసి యోగాభ్యాసం చేసి వేద ప్రాశస్త్యాన్ని నేల నాలుగు చెరగులా ఉపన్యాసాలతో వ్యాప్తి చేసిన మహానుభావుడే మన స్వామీ జ్ఞానానంద...!

#స్వామి_జ్ఞానానంద పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర గొరగనమూడిలో 1896 డిసెంబర్ అయిదున జన్మించారు. వీరి అసలు పేరు భూపతి రాజు లక్ష్మీ నరసింహ రాజు తండ్రి గారు రామరాజు గారు మహా వేద విజ్ఞాన ఖని. వేదాలకు ఉపనిషత్తులకు శాస్త్రాలకు సంబంధించిన వందలాది అపూర్వ గ్రంధాలును, ఆయన చదివి గొప్ప గ్రంధాలయాన్ని నిర్మించుకొన్నారు...!
సంపన్నమైన భూస్వామ్య కుటుంబం వీరిది.ఆ వేద భాండా గారాన్ని కుమారుడు లక్ష్మీ నరసింహ రాజు అద్భుతం గా సద్వినియోగ పరచుకొని వేద వేదాంగాలలో ఉత్తమాభినివేశాన్ని సంపాదించుకొన్నారు. ఆ గ్రంధాలకు సార్ధకత చేకూర్చారు...!
నర్సాపురం లోని టేలర్ హై స్కూల్ లో విద్యాభ్యా సంచేశారు.ఇరవైవ ఏట వివాహం జరిగింది... బుద్ధుని ప్రభావం వారి పైన ఉన్నది అందుకని నేపాల్ లోని లుంబిని కి వెళ్లి కొంతకాలం గడి పారు...!
తర్వాత పదేళ్లు దేశ సంచారం లో,పెద్దల దర్శనలతో జీవితాన్ని చదువు కున్నారు. హిమాలయా చేరి అక్కడ యోగాభ్యాసం చేస్తూ మరో పదేళ్లు సార్ధక జీవనం సాగించారు. వేదాధ్యయనం వారిని విడువ లేదు.దాని పై ఉన్న మక్కువ తో అన్ని వేదోపనిషత్తుల సారాన్ని జీర్నిన్చుకొన్నారు. మానసిక వికాసం కలిగింది.ఒక అపూర్వ తెజస్సేదో వారిలో విరాజిల్లింది...!
క్రమం గా వీరి దృష్టి భౌతిక శాస్త్రం వైపుకు మళ్ళింది. దేని మీద దృష్టి పడినా దాన్ని ఆసాంతం కరతలా మలకం చేసుకోకుండా ఉండలేదు అందుకని జర్మని చేరుకొన్నారు. అక్కడి డ్రెస్ డ్రెయిన్లో గణితం, ఫిజిక్సు చదివారు.ఫిజిక్స్ అంటే వీరాభిమానం కలిగింది. అంతే అప్పుడే విస్తరిస్తున్న ’హై టెన్షన్ ఎక్స్ రే ఫిజిక్స్ ‘’లో రిసెర్చి ప్రారంభించారు...!
ప్రేగ్ లోని చార్లెస్ యూని వర్సిటి లో వీరు రిసెర్చ్ కొన సాగించారు.వీరి ఆధ్యాత్మిక గురువు వీరిలోని వేద విజ్ఞానికి అబ్బుర పడి ,శిష్యుని వల్ల వేద విజ్ఞానం ప్రపంచమంతా విస్తరిల్లాలని ఆ కాంక్షించి రాజు గారికి ‘’స్వామి జ్ఞానానంద‘’* అనే ఆశ్రమ నామాన్ని ఒసంగి ఆశీర్వ దించారు.అప్పటి నుండి స్వామి కాషాయామ్బర దారిగా జీవించారు...!
1927 లో మళ్ళీ జర్మనీ దేశం వెళ్లారు స్వామి జ్ఞానానంద. అక్కడ హిందూ మతం మీద వేద విజ్ఞానం మీద పుంఖాను పుంఖం గా ఉపన్యాసాలిచ్చి చైతన్య వంతుల్ని చేశారు.ఆ ఉపన్యాసం ఒక గంగా ప్రవాహమే.ఎన్నో తెలియ రాని విషయాలను విజ్ఞానంతో ముడి వేసి అలవోకగా అందిస్తూ శ్రోతల మనసులను రంజింప జేసే వారు. అదొక తపస్సు గా, యోగం గా, వారు భావించి ఉత్తేజితులను చేశారు...!
ఆ ఉపన్యాస పరంపర ఒక అత్యద్భుత మైన గ్రంధంగా వెలువడింది. డ్రిస్దేయిన్ వర్సిటి ప్రొఫెసర్ స్వామి ఉపన్యాసాలకు పులకించి పోయాడు.అవి మానవాళికి కర దీపికలన్నాడాయన...!
#జ్ఞానానందకు అయిన్ స్టీన్ గారి సాపేక్ష సిద్ధాంతం పైన ద్రుష్టిపడింది.పడింది అంటే దాన్ని ఆపోసన పట్టినట్లే 1929 లో దానిమీద రెండేళ్లు అధ్యయనం చేస్తూ అండర్ గ్రాడ్యు యేషన్ పూర్తీ చేశారు.
ఆయన సాధించిన యోగా విధానం మీద 150 కి పైగా ప్రసంగాలు చేసి యువతను యోగా మార్గం వైపుకు ఆకర్షితు లయేట్లు చేశారు.యోగ, విజ్ఞాన శాస్త్రాలు సన్నిహిత సంబంధం కలవని ఆయన చెప్పే వారు.యోగాలో బేసిక్స్ నేర్చుకొంటే మనసు, మెదడు, శరీరాలపై పూర్తీ స్వాధీనం కలుగు తుందని సోదాహరణం గా ఉపన్య సహించే వారు స్వామీజీ ఉపన్యాస సారాన్నంతా‘’పూర్ణ సూత్రాలు ‘అనే ఉద్గ్రంధంగా వెలువడి యోగా మార్గానికి కర దీపిక గా నిలిచింది...!
ఇది వారి మహోత్రుష్టరచన గా ప్రశంశలు అందుకొన్నది. తర్వాత ఆయన ప్రొఫెసర్ డోల్షేక్ గారితో కలిసి జర్మని ,ఫ్రాన్స్ ,జెకోస్లోవేకియా లలో పర్య టించారు...!
స్వామి జ్ఞానానంద అభిమాన విషయమైన x ray spectography లో రిసెర్చ్ చేసి 1936 లో D,Scసాధించారు .ఇంగ్లాండ్ ,లివర్ పూల్ వర్సిటీ లలో జాన్ చాడ్విక్ అనే మహా శాస్త్ర వేత్త వద్ద రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో పని చేశారు .న్యూక్లియర్ ఫిజిక్స్ లో ‘’spectography of beeta rays radiation ‘’లో అద్భుత పరిశోధన చేసిPh.D పొందారు...!

తెలుగు పుస్తక ప్రపంచం

01 Oct, 02:01


తల్లి పేరుతో కట్టిన జలాశయం

నిజాం హయాంలో వనపర్తి సంస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన *సరళాసాగర్ ఆసియాలోనే సైఫన్ సిస్టంతో నిర్మించిన రెండవ ప్రాజెక్టు ఇది*. *దీనిని 1960లో నిర్మించారు.

వనపర్తి సంస్థానాదీశుల కాలంలో వనపర్తి జిల్లాలోని మదనాపురం మండల కేం ద్రానికి కూతవేట దూరంలో ఉన్న శంకరమ్మ పేట గ్రామ శివారులోనిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టునకు ఒక ప్రత్యేకత ఉంది. 1947, జులై 10వ తేదీన వనపర్తి సంస్థానాదీశులైన రామేశ్వర్‌రావు తన తల్లి సరళాదేవి పేరుమీద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నట్లు చరిత్ర చెబుతున్నది. ప్రాజెక్టు నిర్మాణా నికి సంబంధించి ఇంజినీర్ పీఎస్ రామకృష్ణ ఆటో మెటిక్ సిస్టం (సైఫన్) గురించి రామేశ్వ ర్‌రావుకు వివరించారు. ఈ పద్ధతిలో ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని వెంటనే పనులు ప్రారంభిం చాలని ఇంజనీర్‌కు సూచించారు, ప్రాజెక్టు కింద 10 గ్రామాలకు గాను 4,182 ఎకరాల ఆయకట్టుకు నీరు పారేలా డిజైన్ చేయాలని ఇంజినీర్‌కు సూచించారు.

రామేశ్వర్‌రావు ఆదేశాల మేరకు రూ.35లక్షల వ్య యంతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. 1947 లో ప్రారంభిం చిన ప్రాజెక్టు 1959లో పూర్తి చేశారు.4,448 మీటర్ల పొడవైన కట్టను ఏర్పాటు చేశారు. 1078.07 మీటర్లు, 3537 అడుగుల మట్టితో, 158.49 మీటర్లు, 520 అడుగులు రాతితో ప్రాజెక్టును నిర్మించారు. ఒక్కో సైఫన్ పొడవు 199.17 మీటర్లు, 391 అడుగులతో మొత్తం 21 ఆటోమెటిక్ సైఫన్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 4 ప్రైమరీ సైఫ న్లు, 17 సైఫన్ హుడ్స్‌తో ఏర్పాటు చేశారు. కట్ట గరిష్ట ఎత్తు 45అడుగులు, 2 చ.మైళ్ల విస్తీర్ణలో నీళ్లు నిల్వ ఉంటాయి.

ఈ ప్రాజెక్టు కింద 4,182 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుకు ప్రధానంగా ఉన్న కుడి కాలువ ద్వారా 388.32 ఎకరాలకు 8కిలోమీటర్ల మేర నీరు చేరుతుం ది. ఎడమ కాల్వ ద్వారా 3,796.20 ఎక రాలకు 20 కిలోమీటర్ల మేర నీరు చేరుతుంది. సామ ర్థ్యానికి మించి ప్రాజెక్టులోకి నీరు చేరితే ఆటోమెటిక్ సైఫన్ల ద్వారా నీరు విడుదల వుతుంది. దీని ద్వారా విడుదలైన నీరు ప్రాజెక్టు కింద ఉన్న శంకర మ్మపేట, దంతనూ రు, మదనాపురం, నెల్విడి, నర్సింగాపురం, తిర్మలాయపల్లి, రామన్‌పాడ్, అజ్జకొల్లు, చర్లపల్లి, వడ్డెవాట గ్రామాలలోని వ్యవసాయ భూములకు చేరుతుంది.

*ఆటోమెటిక్ సైఫన్ సిస్టంతో రూపుదిద్దుకున్న సరళాసాగర్ ప్రా జెక్టు ఆసియా ఖండంలోనే మొట్ట మొదటిది, ప్రపంచంలో రెండోది ప్రాజెక్టుగా పేరుగాంచింది.*

*ఆటోమేటిక్ సైఫన్లు....*
ఆటోమేటిక్ సైఫన్ల టెక్నాలజీని ఉపయోగించిన ప్రాజెక్టులలో ఇది ఆసియాలోనే మొదటిది. నీటిసామర్థ్యం గరిష్టస్థాయికి చేరినప్పుడు వాటంతట అవే సైఫన్లు తెరుచుకోవడం దీని ప్రత్యేకత. సైఫన్లు తెరవడానికి, మూయడానికి ఆపరేటర్లు అవసరం లేదు.

🛑🛑🛑🛑🚨🚨🚨🚨🚨.🛑🛑🛑🛑
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళ సాగర్ ప్రాజెక్ట్ సైఫాన్ సిస్టం ద్వారా గేట్లు తెరుచుకోవడంతో ఆదువారం ఉదయం నీటి విడుదల ప్రారంభమయ్యాయి. దీంతో కొత్తకోట, ఆత్మకూరు గ్రామాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి

#రాయలసీమ_నీటి_అధ్యయన_వేదిక

తెలుగు పుస్తక ప్రపంచం

28 Sep, 04:37


"1911 ...పంజాబ్ ఫ్రావీన్సీ లోని లయాపూర్ జిల్లా లోని ఖాత్కర్ కళన్ గ్రామం...తన స్నేహితుడు వేస్తున్న కొత్తతోటను చూసేందుకు తన మూడు సంవత్సరాల చిన్న పిల్లాడిని భుజాలపై ఎత్తుకొని తోటకు వెళ్ళాడు ఒక తండ్రి. తోటలో పిల్లాడిని దింపి స్నేహితుడితో ముచ్చటిస్తున్నాడు. కొంత సమయం తర్వాత పిల్లాడు ఏమి చేస్తున్నాడో అని చూడగా..ఆ పిల్లాడు చిన్న చిన్న గడ్డిపరకలు నాటుతున్నాడు..అది చూసి ముచ్చటపడిన తండ్రి ఆ పిల్లాడి దగ్గరకు వెళ్ళి "ఏమిరా నాన్నా...ఏమి నాటుతున్నావు అనగా...నాన్నా..చిన్న తుపాకుల మొక్కలు నాటుతున్నా..అవి పెరిగి పెద్దపెద్ద తుపాకులు కాస్తాయి..వాటితో ఆంగ్లేయులను
చంపేసి మనకు స్వాతంత్ర్యం తీసుకువస్తా నాన్నా...అని తలెత్తకుండా జవాబిచ్చాడు ఆ పిల్లాడు. అంతే పిల్లాడి తండ్రి ఒక్కసారిగా ఉలికిపడి...తేరుకుని ఆప్యాయంగా తన బిడ్డను ఎత్తుకొని ప్రేమగా గుండెలకు హత్తుకొన్నాడు...అక్కడే ఉన్న తండ్రి స్నేహితుడు ఆపకుండా ఐదు నిమిషాలు చప్పట్లు కొట్టాడు.
కేవలం మూడు సంవత్సరాలకే తుపాకి పట్టాలని తలంచిన ఆ పిల్లాడే...భారత విప్లవోద్యమ నాయకుడు #షంషీద్ #భగత్#సింగ్

1907 సెప్టంబర్ 28 జన్మించాడు భగత్ సింగ్. అప్పటికే అతని కుటుంబసభ్యులు స్వతంత్రపోరాటంలో వున్నారు. ఈ పిల్లాడు పుట్టగానే జైల్ లో ఉన్న వారినందరినీ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది పిల్లాడు పుట్టిన వేళావిశేషంగా భావించి ఆ బిడ్డకు" భగత్ " అని పేరు పెట్టారు.. భగత్ చిన్నప్పటి నుండే దేశపరిస్థితులు గమనిస్తూ పెరిగాడు..
భగత్ ను 12వ యేట తండ్రి ఆంగ్లేయుల పాఠశాలలో కాకుండా ఆర్యసమాజ్ నడిపే "ఆంగ్లో వైదిక్ "పాఠశాలలో చేర్చాడు. ఖల్సా పాఠశాలలకు కూడా పంపలేదు.

అదే సమయంలో జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది.13 యేళ్ళ భగత్ ఆ దుర్ఘటన విని కోపంతో ఊగిపోయాడు. జలియన్ వాలాబాగ్ కు వెళ్ళి ప్రతీకారం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ రక్తంతో తడిసిన ఆ మట్టిని తిలకంగా తిద్దుకున్నాడు.

గాంధీజీ యుగం ప్రారంభమైంది.భగత్, గాంధీ ప్రసంగాలకు ఆకర్షితులైనాడు. గాంధీజీ స్వాతంత్రం తీసుకుస్తాడని నమ్మాడు. సహాయ నిరాకరణఉద్యమంలో 13యేండ్లకే పాల్గొన్నాడు. స్కూల్ లో విదేశ వస్తువులను తగలబెట్టాడు. ఉదృతిగా జరుగుతున్న సహాయనిరాకరణద్యమం చౌరీచౌరా దగ్గర హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమం ఆపి ప్రభుత్వానికి లొంగిపోయాడు..ఇది భగత్ కు నచ్చలేదు..గాంధీ అహింస నినాదం నచ్చలేదు. బోల్షివీక్ విప్లవం సక్సెస్ కావడంతో యూరప్ ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేయసాగాడు. లెనిన్ మార్క్ ఎంగిల్స్ రచించిన పుస్తకాలు చదవసాగాడు..క్రమంగా సామ్యవాదం వైపు మళ్ళాడు.లాహోర్ లోని నేషనల్ కాలేజ్ లో చేరాడు.

భగత్ మంచి గాయకుడు.. కవిత్వం బాగా చెప్పేవాడు. 1923లో హిందీసాహిత్యసమ్మళన్ లో అద్భుతంగా కవితలు చెప్పడంతో దాని అధ్యక్షడు భీమ్ సేన్ తో పరిచయం అయింది. అతను భగత్ లోని కాంక్షను గమనించి రాంప్రసాద్ బిస్మల్ ,అష్ఫకుల్లాఖాన్ లతో నడపబడుతున్న హిందూస్తానీ రిపబ్లిక్ అసోషియేషన్ లో చేరమన్నాడు. 16 యేండ్ల కుర్రాడు ...మీసకట్టు కూడా ఏర్పడలేదు..తమ ముందు నిలబడి ఉద్యమంలో చేరతానంటే ఏమిచెప్పాలో బిస్మల్ కు అర్థం కాలేదు....కానీ అష్ఫకుల్లాఖాన్ కు మాత్రం భగత్ లోని స్వాతంత్రకాంక్ష తీవ్రంగా ఉన్నట్లు కనిపించింది. భగత్ కు సభ్యత్వం ఇచ్చాడు. అక్కడ బిస్మల్ కవితలు భగత్ ను చాలా ఉత్తేజపరిచాయి. 1925 లో కకోరి రైల్ దోపిడీ జరిగింది. 1927లో బిస్మల్, అష్ఫకుల్లాఖాన్, రోహన్ సింగ్ లతో పాటు భగత్ బాబాయ్ ని కూడా ఉరితీశారు.

బిస్మల్, అష్ఫకుల్లా ఖాన్ చనిపోవడంతో హిందూస్తానీ రిపబ్లిక్ అసోషియన్ ను "హిందూస్తాన్ రిపబ్లిక్ సోషలిష్టు అసోషియేషన్ "గా మార్చారు..
దీనికి చంద్రశేఖర్ అజాద్ , భగత్ సింగ్ , సుఖదేవ్ థాపర్ ,శివరాం, రాజ్ గురు, జై గోపాల్ ముఖ్యసభ్యులు. భారత్ లో తొలి సోషలిష్ట్ సంస్థ ఇదే... ఇదే కాకుండా నౌ జవాన్ సభ , కీర్తి కిసాన్ పార్టీలను స్థాపించి యువకులను విప్లవం వైపు విపరీతంగా ఆకర్షించేలా చేసాడు..
అయితే సైమన్ కమీషన్ కు వ్యతిరేఖంగా నిరసనలు చేస్తున్న లాలాలజపతిరాయ్ గారిని క్రూరంగా కొట్టడంతో ఆయన మరణించారు. దీనికి భగత్ ప్రత్యక్ష సాక్షి. ఆ సంఘటనకు కారణమైన స్కాట్ ను చంపాలని పథకం వేయగా పొరబాటున సాండర్స్ అనే పోలీసును కాల్చిచంపాడు భగత్.
భగత్ ను, సుఖదేవ్ ను చనన్ సింగ్ అనే పోలీసు పట్టుకోగా వీరిని వెంటాడుతూ వస్తున్న చంద్రశేఖర్ అజాద్ చనన్ సింగ్ కాల్చి భగత్ ను,సుఖదేవ్ ను కాపాడి తీసుకెళ్ళిపోయాడు. భగత్ ను కొన్ని రోజులు అజ్ఞాతంలో వుండమనగా...భగత్ సిక్కుల మతవిశ్వాసాలకీ విరుద్దంగా తలవెంట్రుకలు కత్తిరించుకోని మారువేషంలో కరాచీకి వెళ్ళిపోతాడు.
ఇంతలో లార్డ్ కర్జన్ 1905 లో వేసిన విషవిత్తనం మొలకెత్తి విషవృక్షమై హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలకు దారి తీసింది.దీనితో కలత చెందిన భగత్ నాకు మతంలేదు. అది స్వార్థపూరితమైనది..నేను నాస్థికుడినంటూ ప్రకటించాడు.

తెలుగు పుస్తక ప్రపంచం

28 Sep, 04:37


ఎటువంటి విచారణలేకుండా విఫ్లవవాదులను అరెస్ట్ చేయవచ్చనే చట్టం లాహోర్ శాసనసభలో ప్రవేశపెడుతున్నారని, దానికి నిరసనగా సభలో బాంబువేసి తర్వాత లొంగిపోయి కోర్టులో ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా తన వాదనలు వినిపిస్తానన్న భగత్ మాటలను విప్లవసభ్యులందరూ సమర్థించగా చంద్రశేఖర్ అజాద్ మాత్రం తీవ్రంగా వ్యతిరేఖిస్తూ...ఆంగ్లేయులు అంత విశాలహృదయులు కాదనీ ఆ ఆలోచన విరమించుకోమనీ చెప్పి..తాత్కాలికంగా ఆపుతాడు. అయితే చంద్రశేఖర్ అజాద్ లేని సమయం చూసి డమ్మీ బాంబును లాహోర్ శాసనసభలో వేసి లొంగిపోయాడు భగత్. ఆంగ్లేయుల విచారణలో సాండర్స్ చంపిన విషయం కూడా ఒప్పుకోవడంతో భగత్ ,రాజ్ గురు,సుఖదేవ్ లకు ఉరిశిక్ష పడింది.

25 ఏళ్ళ వయసులోనే ఉరిశిక్ష పడుతుందని తెలిసినా భగత్ చేసిన సాహసం అసామాన్యం. ఇప్పటి యువత, రాజకీయ నాయకులు భగత్ సింగ్ ని కచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు భగత్ సింగ్ జన్మదినం సందర్భంగా ఆయనకు ఘనమైన జోహార్లు అర్పిస్తున్నాము 🙏🙏🙏

రవీంద్ర గారు

తెలుగు పుస్తక ప్రపంచం

27 Sep, 12:19


మేడమ్, మా అబ్బాయి వయసు 15 సంవత్సరాలు. టెన్త్‌లో ఉన్నాడు. బాగా కోపం, ఉద్రేకం ఎక్కువ. ఎప్పుడూ గదిలోనే ఉంటాడు. సెల్ ఫోన్‌తో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. ఈ మద్య కొధ్ధిగా ఎక్కువగా పడుకోవడం, మత్తుగా ఉన్నట్లు ఉండడం గమనిస్తున్నాను. మా అబ్బాయి ఏదో ప్రేమ వ్యవహారంలో ఉన్నాడని వాడి ఫ్రెండ్ చెబుతున్నారు. అలాగే తరచూ కాలేజీ దగ్గరి బడ్డీకొట్టులో ఏవో చాక్లెట్స్ కొంటున్నాడని చెప్పారు. మా వాడు ఎంత అడిగినా చెప్పడు. అబ్బాయికి కౌన్సెలింగ్ ఇప్పించాలి అనుకుంటున్నాము. ఏమైపోతాడో అని భయంగా ఉంది.
.....
ఇవి తరచూ పెళ్లి కాబోయే.. అయిపోయిన దంపతుల్లో, టీనేజీ పిల్లల తల్లిదండ్రుల్లో.. టీనేజి పిల్లల్లో కూడా వచ్చే సందేహాలు భయాలు. ఈ ప్రశ్నలకి సరి అయిన విధంగా శాస్రీయ పద్ధతిలో .. ఒక సైన్స్‌లా విశ్లేషించి సమాధానాలు ఇవ్వక పోతే వీరు అరకొర జ్ఞానం ఉన్న నకిలీ వైద్యుల దగ్గరికి వెళ్ళి మోసపోతూ ఉంటారు. లేదా విరివిగా సెల్ ఫోన్‌లో దొరికే ఫోర్న్ సైట్స్ చూస్తూ అందులో చూపించే నాన్ మెడికల్ అంశాలనే నమ్ముతూ.. అందులోని వికృతమైన అసహజ లైంగిక ధోరణులకు అలవాటు పడతారు. ఇది వారి భావి జీవితాలను సర్వ నాశనం చేస్తుంది. జీవితాంతం నరకం అనుభవించడమే కాదు... వాళ్ళ జీవన సహచరులను కూడా కష్ట పెడతారు.

• సెక్స్‌ను బూతు, పాపంగా చూస్తేనే..!

ఇదంతా సెక్స్‌ని ఒక సైన్స్‌గా.. ఒక మెడికల్ సిస్టమ్ & సెక్సువల్ హెల్త్‌‌లో ఒక భాగంగా చూడకపోవడం వల్ల జరుగుతుంది. సెక్స్‌ని ఇతర అవయవాల సహజమైన శరీర ధర్మాల వలె కాకుండా అంటే కన్ను, ముక్కు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ వలె కాకుండా మన జీవితంతో.. శరీరంతో, వివాహంతో సంబంధం లేని ఒక మార్మికమైన అంశంగా.. ఒక రహస్యంగా చూడాల్సిన.. ఉంచాల్సిన అంశంగా, ఒక బూతుగా, పాపంగా చూపించడం వలన దీని చుట్టూ ఇంత భయం, అయోమయం అలుముకుని చివరికి స్త్రీలలో జడత్వం, సెక్స్ జీవితం అంటే భయం, తద్వారా సెకండరీ వంద్యత్వం, పురుషులలో అంగస్తంభన లోపం, శీఘ్ర స్ఖలన సమస్యలు, సెక్స్ కోరికలు తక్కువగా ఉండడం, అసహజ సెక్స్ ధోరణులు లాంటి లైంగిక, మనోలైంగిక, మనోశారీరిక, మానసిక సమస్యలకు దారి తీస్తుంది.

• లైంగిక అపోహల నుంచి ఆత్మహత్యల దాకా..!

స్రీలలో పునరుత్పత్తి అవయవాలు గర్భాశయం,అండాశయం, యోని నాళం.. రుతుక్రమం అలాగే పురుషులలో అంగం, బీర్జాలు, ప్రొస్టేట్ గ్రంధి, వీర్యకణాలు ఇవన్నీ శరీరంలో ఇతర వ్యవస్థలలాగే సహజమైనవిగా, సాధారణమైనవిగా చూడాలన్న జ్ఞానం ఇవ్వడంలేదు. శాస్రీయ లైంగిక అవగాహనా లోపం దంపతుల మధ్య దూరాల్ని పెంచి విడాకుల వరకు, అక్రమ సంబంధాల వరకు దారితీస్తాయి. అపోహలు, అనుమానాలు, భయాలు తీరని టీనేజి యువతలో కూడా ఆందోళన.. డిప్రెషన్, భయం లాంటి మానసిక సమస్యలకు, కొన్నిసార్లు ఆత్మహత్యలకు దారితీస్తుంది. టీనేజి యువకులకి ఎక్కువగా వారి శరీరంలో వచ్చే మార్పులు .. హార్మోన్లు కలిగించే సంచయనాలు, ప్రత్యుత్పత్తి అవయవాల స్పందనలు, పరిమాణం, వీర్యస్కలన సంబంధిత అనుమానాలు, అపోహలు వేధిస్తుంటాయి.

• స్త్రీలు అంటే దేహాలు కాదు..

విద్యాలయాల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌లో ఇవన్నీ చెప్పరు. మానవ లైంగికత చుట్టూ ఉండాల్సిన విలువల గురించి, స్రీల లైంగిక, పునరుత్పత్తి హక్కుల గురించి, స్రీలను దేహాలుగా కాదు విలువలున్న వ్యక్తులుగా గుర్తించాలని, స్రీలు... పురుషుల లైంగిక అవసరాలు తీర్చే వస్తువులు కాదని.. ఇంటి పనులు స్రీ పురుషులు ఇద్దరు కలిసి చేసుకోవాలని .. స్రీల విద్య, వృత్తికి సంబంధించిన స్వేచ్ఛని అడ్డుకోరాదని; పురుషులు, యువకులు ఈ విషయంలో సెన్సిటైజ్ అవడం గురించి కూడా చెప్పరు. సెక్సువల్ అనాటమి అంటే స్రీ పురుషుల ప్రత్యుత్పత్తి అవయవాల నిర్మాణం, లైంగిక వ్యాధులు, అవిరాకుండా రక్షణ పద్ధతులు మాత్రమే చెప్తారు.

• లైంగిక విద్య, కౌన్సెలింగ్ లేకనే.....

ఈ మధ్య.. టీనేజిలో ఉండే విద్యార్థి, విద్యార్థినులు లైంగిక ఆకర్షణలో ఏర్పడిన సంబంధాలని ఎలా మానేజీ చేయాలో సీబీఎస్ఈ సిలబస్‌లో చేర్చారు. ముందే అశాస్త్రీయ, తప్పుడు అవగాహన, సమాచారాలతో తప్పు దారి పడుతున్న యువత ఇంకెన్ని ప్రమాదాల్లో పడబోతున్నారో కదా. ఇలా కాకుండా ఉండాలంటే ఒక మంచి ప్లాట్ ఫామ్ మీద సెక్సువల్ హెల్త్ కౌన్సెలింగ్, ఎడ్యుకేషన్ చాలా అవసరం.
......
ఈ విషయంలో ఈ పెళ్ళికి ముందు & తరువాతి సెక్సువల్‌ సమస్యల పరిష్కార వేదికలో చర్చలు, ప్రశ్నలు, సమాధానాలు. సెక్సువల్ హెల్త్ ఆర్టికల్స్, మారేజీ కౌన్సెలింగ్, ఫామిలీ కౌన్సెలింగ్, కపుల్ థెరపీ ఉంటాయి. సమస్యలున్న ప్రతి ఒక్కరూ తమ సందేహాలను ఈ కింద ఇచ్చే డాక్టర్ గారి ఈ-మెయిల్‌కి మెయిల్ చేయవచ్చు.
.......
డాక్టర్ భారతి,
సెక్సువల్ హెల్త్ & ఫ్యామిలీ కౌన్సిలర్
మారిటల్, సైకో థెరపిస్ట్
ప్రీ & పోస్ట్ మేరేజ్ & సెక్సువల్‌ కౌన్సెలింగ్

తెలుగు పుస్తక ప్రపంచం

27 Sep, 12:19


మొబైల్ -79892 27504
Email id: [email protected]
.......
Dr. Bharathi MS
SexualHealthCounsellor, Marital and psychotherapist
Family counsellor
Gvs Research Centre for Sexual & Mental Health
Mobile -798927504
Timings -11 am to 2 pm 5 pm -8 pm
Email id: [email protected]

🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

4,946

subscribers

708

photos

151

videos