Shravan Mathematics @smdmaths Channel on Telegram

Shravan Mathematics

@smdmaths


🌟 *Learn Maths with Joy* 🌟
📌 నా ఛానల్ లోని *50 Maths 🌟 *Learn Maths with Joy* 🌟
📌 నా ఛానల* వీడియోస్ పూర్తిగా చూస్తే,
ఆ తరువాత ఏ Maths టాపిక్ ఐనా *సొంతంగా నేర్చుకోగలరు.*
*పూర్తి వివరాలు*
*ఈ కింది Website లో చూడండి*
*https://ismartmaths.com/*

Shravan Mathematics (Telugu)

శ్రావణ్ గణితం ఛానల్ లోని గణిత అవగాహనను ఉత్సవంగా నేర్పించండి. ఈ ఛానల్ లో మీరు 50 గణిత వీడియోలను పూర్తిగా చూస్తే, తరువాత ఏ గణిత విషయంలోనా సందర్భం అయితే, సొంతంగా నేర్చుకోవచ్చు. మీరు పూర్తి వివరాలను కావలసినవీ చూడడానికి ఈ వెబ్సైట్ను సందర్శించండి: https://ismartmaths.com/

Shravan Mathematics

10 Sep, 02:49


🔺 Trigonometry Full Chapter 🟡
https://www.youtube.com/playlist?list=PLDFo06glumTv_DdWRGzsYQmaBmZD6w2n9
📌For more videos: www.ismartmaths.com
🙏 share this with all your friends 🙏

Shravan Mathematics

17 Aug, 14:18


సోషల్ మీడియా సూత్రాలు { మీడియా కు కూడా వర్తిస్తాయి }
1 . మైరావణుఁడు :
నీకు నచ్చని కార్యక్రమాన్ని తిట్టు కొంటూ చూస్తే , ఆ పోస్ట్ పై తిడుతూ కామెంట్ చేస్తే "ఎంత చెత్తగా ఉందొ" అంటూ లింక్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తే.. అది .. వారికే లాభం . వివాదమే సోషల్ మీడియా కు ఆక్సిజన్
2 . బురద గుంట
వ్యక్తిగత వ్యవహారాల విషయం లో సోషల్ మీడియా ఎక్కితే పరిష్కారం దొరుకుతుంది అనుకోవడం బురద గుంట లోకి దూకి ఒంటిని శుభ్రం చేసుకోవాలి అనుకోవడమే !
3 . గొర్రెలు
సోషల్ మీడియా విషయంలో జనాలు స్థూలంగా రెండు రకాలు . తెలివిగా వివాదం సృష్టించి దాన్ని వ్యాపారానికి వాడుకొనేవారు . వివాదం నిజమనుకొని వాదులాడుకొనే గొర్రెలు.
4 పైడ్ రాతలు / కూతలు '
రాజకీయనాయకులు మహా తెలివైన వారు . యూట్యూబ్ చానెల్స్ , కంటెంట్ రైటర్స్ , జ్యోతిష్యులు , ఇన్ఫ్లుయెన్సుర్స్ { ప్రభావితం చేసేవారు } మీమ్స్ . రీల్స్ అన్ని రకాలుగా వాడుకొంటున్నారు . ఒక్కో సారి జనాలు తెలివి మీరడం వల్ల రాజకీయ నాయకుల ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి . దీని వల్ల కొన్ని వేలమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది . ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇవాళ్టి పరిస్థితుల్లో రాజకీయ పార్టీ ల ప్రాపకం లేకుండా మీడియా యూట్యూబ్ చానెల్స్ నడవడం కష్టం .
5 . అన్నీ వక్రీకరణలే
మీడియా లో ఎనభై శాతం సోషల్ మీడియా లో తొంబై శాతం పైడ్ రాతలు .. కూతలు . అసలు వార్త జనాలకు చేరకముందే వక్రీకరించిన వార్తలతో బ్రెయిన్ వాష్ చేసి తమకు అనుకూలంగా వాడుకొంటున్నారు.
6 . విదేశీ గురువు
ఈ విషయం లో రాజకీయ నాయకులకన్నా బిజినెస్ హౌసెస్ ముఖ్యంగా విదేశీ కంపెనీ లు ముందుంటాయి . తమ బిజినెస్ పెంచుకోవడానికి ముందుగా క్రమ పద్ధతిలో సాంప్రదాయక బిజినెస్ ను దెబ్బ తీస్తారు . రోడ్డు పై పానీ పూరి తింటే హాం ఫట్ అని భయపెట్టే విశ్లేషణలు రాసిన వారు ప్యాకెట్ ల దొరికే విషం లాంటి జంక్ ఫుడ్ గురించి ఎందుకు రాయరో ఆలోచించారా ?{ పనీ పూరి వల్ల సమస్యలొస్తున్న మాట వాస్తవం . వారు చేతికి గ్లోవ్స్ వేసుకోవాలి అని నియమమం పెడితే పోలే.}
7 . విష ప్రచారం
సెర్వికల్ కాన్సర్ వల్ల ఇంత మంది చచ్చిపోతున్నారు అంటూ భయపెట్టే రాతలు హోరెత్తించారు . .
అదే కాన్సర్ పురుషుడికి కూడా వస్తుంది .. cervix లేనప్పుడు పురుషుడికి ఎందుకు వస్తుంది? . వాక్ సీన్ కేవలం స్త్రీలకు ఎందుకు ? వైరస్ వల్ల వచ్చే దానికి కాన్సర్ అని ఎందుకు పేరు పెట్టారు ? అమ్మాయిలకు అదీ టీన్ ఏజ్ పిల్లలకు ఎందుకు వెయ్యాలి ? వయసుకు వాక్ సీన్ కు లింక్ ఏంటి ? దాన్ని వేసుకొన్న అమ్మాయిల కు ఏమేమి సైడ్ రియాక్షన్స్ వస్తున్నాయి . ఎవడో దారిలో పొయ్యే దానయ్య నేను గ్యారంటీ అంటాడు కానీ .. మా వాక్ సీన్ వేస్తె ఎలాంటి దుష్ప్రభావం ఉండదు అంటూ కంపెనీ ఎందుకు గ్యారంటీ ఇవ్వదు ..అడగొద్దు . అడిగినా చెప్పరు. ష్ ష్ గప్ చుప్ .
సమాచారం తో చంపేస్తారు జాగ్రత్త !
6 మీడియా లో సోషల్ మీడియా లో వస్తున్నదానిలో నిజానిజాలు తెలుసుకోవాలంటే క్రిటికల్ థింకింగ్ ఎంతో అవసరం .
7 . ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి మీడియా సోషల్ మీడియా పై గంట వెచ్చించవచ్చు . అంతకంటే మించి సమయం గడుపుతుంటే నష్టపోతున్నట్టే . ఇదొక ఊబి .. కిందకు పోవడమే కానీ బయటపడడం ఉండదు .
బుర్ర మీడియా కు సోషల్ మీడియా కు తాకట్టు పెట్టిన కోట్లాది గొర్రెలకు నిజమయిన స్వతంత్రం రావాలి. స్వాతంత్ర దిన శుభాకాంక్షలు
శుభోదయం !
Facebook post by
Amarnath Vasireddy

Shravan Mathematics

01 Aug, 13:23


🔹 *Failure స్టూడెంట్ Success పాఠం... | Townhall Discussion with Dr. Jayaprakash Narayan* 🔹
ఈ వీడియో ప్రతీ ఒక్కరు తప్పకుండా పూర్తిగా చూడండి.
https://youtu.be/4INJHNA8fv8?si=VTIt75jV1dkfu552

Shravan Mathematics

22 Mar, 11:49


*20 LCM tricks*
https://youtu.be/MBuA5rr0F_U
🧑‍🏫 *Learn Daily 1 Maths skills*
Join
🤩 *Channel:* https://whatsapp.com/channel/0029Va5L0kp2ZjCj3f0XCl0x
🤩 *WhatsApp community*. https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N
🙏 *Share this with everyone* 🙏

Shravan Mathematics

15 Feb, 05:42


పిల్లలని ఎలా పెంచాలి ??
కంటే సరి పోతుందా ?
పిల్లలని పెంచడం తెలియొద్దా ?
పిల్లలు ఎక్కడ పెరిగి పెద్దవారవుతారు ?
ఇదేంటి పిచ్చి ప్రశ్న .
వారి వారి కుటుంబాల్లో కదా ? అనుకొంటున్నారా ?
నిజమే .
మన దేశంలో ఆ మాటకొస్తే నిన్న మొన్నటి దాక ప్రపంచం లోని అన్ని సమాజాల్లో బాలబాలికల సామాజీకరణ / సంస్కృతీ స్వీకరణ కుటుంబ వ్యవస్థ ద్వారానే జరిగేది .
ఇప్పుడేమో అమెరికా లాంటి దేశాల్లో సృష్టికి ప్రతి సృష్టి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి .
కుటుంబ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా వచ్చినదే ఫోస్టర్ కేర్ .
ఫోస్టర్ కేర్ అంటే పెంపుడు సంరక్షణ .
ఇందులో కూడా తల్లితండ్రులు వుంటారు . కానీ వారు పిల్లల జైవిక తల్లితండ్రులు కారు . ఇలా పరిభాషక పదాలతో చెబితే మీలో చాల మందికి అర్థం కాకపోవచ్చు . లేదా ఆసక్తి కరంగా లేకపోవచ్చు .
రకరకాల కారణాలతో పిల్లలు తల్లితండ్రులనుంచి విడి పోవచ్చు .
ఒకటి- తల్లితండ్రుల ఆకస్మిక మరణం .
రెండు- తల్లితండ్రి పిల్లల్ని పెంచడానికి ఆసక్తి చూపించక పోవడం .
మూడు- పిల్లలే తల్లితండ్రికి దూరంగా ఉండాలనుకోవడం .
నాలుగు - ప్రభుత్వం పిల్లలని తల్లితండ్రికి దూరంగా సంరక్షకుని చేతిలో ఉంచాలనుకోవడం.
ఇలాంటి పిల్లల్ని సంరక్షకుని చేతిలో ఉంచుతారు .
ఎవరైనా ప్రభుత్వ అనుమతితో సంరక్షకుడిగా మారొచ్చు .
ఒక విధంగా చెప్పాలంటే ఇదొక హాస్టల్ లాంటిది .
హాస్టల్ అంటే పెద్ద మొత్తం లో పిల్లలుండవచ్చు .
ఫోస్టర్ కేర్ యూనిట్ లో మాత్రం ఎనిమిది మంది పిల్లలకు మించరాదు .
ఈ ఫోస్టర్ కేర్ నడిపే వారు పిల్లలని దత్తత తీసుకొన్న బాపతు అనుకునేరు { అలాంటి వారు కూడా వుంటారు ... పిల్లలని పెంచడాన్ని ఇష్టపడి చేసేవారు కూడా వుంటారు } .. వీరిలో సింహ భాగం డబ్బు కు ఆశపడి ఈ పని చేస్తారు . అంటే ఇదొక వృత్తి .
ప్రభుత్వాలు గ్రాంట్స్ / స్టైఫండ్ ఇస్తాయి . ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశం లో స్వచ్చంద సంస్థల మాదిరి . పేరుకు సంఘ సేవ . అసలు విషయం అందరికీ తెలిసిందే .
ఏదైతే ఏముంది ?
కుటుంబాల్లో పెరిగితే నేమి ? పెంపుడు తల్లితండ్రుల వద్ద పెరిగితే నేమి ? కుటుంబం వివాహం అంటూ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ యుగం లో ఛాందస భావాలు పట్టుకొని వేలాడితే ఎలా ? ఇది సమాజపు ప్రజాస్వామీకరణ అని వాదించే మేధావులకు ఒక షాకింగ్ వార్త .
ఫోస్టర్ కేర్ లో పెరిగి పెద్దయిన యువతీ యువకుల సామజిక తేలితేటలు , మేధో శక్తి కుటుంబాల్లో పెరిగిన అంటే సొంత తల్లితండ్రి వద్ద పెరిగిన పిల్లల తో పోలిస్తే బాగా తక్కువని ఇటీవలి ఒక అధ్యయనం తేల్చింది . { అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురితమయింది } ఇంతే కాదు ఫోస్టర్ కుటుంబాల్లో పెరిగి పెద్దయిన వారిలో దాదాపుగా పది శాతం ఆటిజం తో బాధ పడుతున్నారు . ఇది మామూలు పిల్లల నిష్పత్తి తో పోలిస్తే చాలా ఎక్కువ
రెండేళ్ల వయసులోనే పిల్లలకు వంద బిలియన్ న్యూరాన్ కణాలు ఉత్పత్తి అవుతాయి . అవి ఒక దానితో ఒకటి లింక్ అయ్యి న్యూరల్ నెట్వర్క్ ఏర్పడుతుంది .
ఈ న్యూరల్ నెట్వర్క్ ఎంత బాగా దృఢం అయితే బిడ్డ అంత మేధావి అవుతాడు .
ఈ న్యూరల్ నెట్ వర్క్ దృడపడాలంటే ఆరు నెల వయసు నుంచి పది పదిహేను ఏళ్ళ దాక పిల్లలతో మాట్లాడాలి . మాట్లాడించాలి . వారిని వాస్తవిక ప్రపంచంలోకి { గాలి నీరు ఆకాశం పక్షులు జంతువులు మొదలయినవి } తీసుకొని రావాలి. వర్చువల్మ్ వరల్డ్ కు వీలైనంత దూరంగా ఉంచాలి . వారి న్యూరో మాస్క్యూలర్ అభివృద్ధి కోసం ఆటలు ఆడుకోనివ్వాలి { వయసు బట్టి బొమ్మలు ఇసుక మట్టి బంక మట్టి మొదలయిన వాటితో } కళ్ళు చేతుల మధ్య అనుసంధానం పెరిగేలా వారి వేళ్ళు నేర్పు ను సాధించేలా వారికి ఆక్టివిటీస్ ఇవ్వాలి .గోధుమ పిండి పిసకడం , నెల పై పడిన కాగితాలను చేతి వేళ్ళతో తీసి చెత్తబుట్ట లో వేయడం ఇంకా వారి వయసు బట్టి రకరకాల ఇంటి వంట పనులు .
పిల్లల సంరక్షణకు ఏది బెస్ట్ ?
క్లుప్తంగా చెప్పాలి అంటే ..
ఉమ్మడి - బెస్ట్
పిల్లల పెరుగుదలకు ఉమ్మడి కుటుంబాలు ఉత్తమం { మొబైల్ తో కాలం గడిపే బామ్మ చీటికీ మాటికి కోప్పడే తాత.. లేదా పిల్లల్ని అతి గారాబం చేసే అవ్వాతాతలు వుండే ఉమ్మడి కుటుంబాలు కాదు . పిల్లల్ని ఆడిస్తూ పాడిస్తూ వారితో మాటలాడుతూ వారిని మాటలాడనిస్తూ తమ అనుభవం తో వారికి మంచి చెడు చెప్పే ఉమ్మడి కుటుంబాలు }.
న్యూక్లీర్ .. జస్ట్ ఓకే
కేంద్రక కుటుంబాలు మధ్యమం. తల్లితండ్రి, పిల్లలతో సమయం గడిపితే ..
సెల్ కుటుంబాలు - వరస్ట్ !
కేంద్రక కుటుంబాల్లో తల్లి తండ్రి ఉద్యోగాలు చేస్తూ.. ఉద్యోగం చేయడం సమస్య కాదు . అవసరం కూడా . కానీ పిల్లలతో గడపడానికి సమయం లేదు అని భావించి వారి చేతికి సెల్ ఫోన్ ట్యాబు లిచ్చే ఆధునిక తల్లితండ్రులు ..
ఫోస్టర్ కుటుంబాలు - ఘోరం .
ఇది సైన్స్ . అభిప్రాయం కాదు .
{ అయిదేళ్ల క్రితం వరంగల్ కు వెళ్ళినపుడు ఒక అనాధ శరణాలయాన్ని సందర్శించాను . మా ఇల్లు అని పేరు పెట్టి ఆ పిల్లలకు వీలైనంత మేర కుటుంబ వాతావరణాన్ని కల్పిస్తున్నారు . ఈ పోస్ట్ లో పేర్కొన్న విషయాలకు అలాంటి సంస్థలు మినహాయింపు }
FB post by
Amarnath Vasireddy

Shravan Mathematics

08 Feb, 02:07


ప్లాస్టిక్ టిఫిన్ / లంచ్ బాక్స్ లు వద్దు .

చాలా మంది తల్లులు, తమ పిల్లలకు స్నాక్క్ష్ / లంచ్ ని ప్లాస్టిక్ బాక్స్ లో ఉంచి స్కూల్ కు పంపుతున్నారు .

ఇది చాలా ప్రమాదకరం .

1 . చాలా రకాల ప్లాస్టిక్స్ లలో బిస్ఫెనోల్ అని రసాయనం ఉంటుంది . ఇది వేడి పదార్థకు కరిగి తిండిలో కలిసి పోతుంది . దీని వల్ల హార్మోన్ల సమస్యలు వస్తాయి . చాలా మంది అమ్మాయిల్లో పీసీఓడీ , థైరాయిడ్ లాంటి సమస్యలకు ప్లాస్టిక్ లంచ్ బాక్స్ లు ఒక కారణం . పదేళ్ల వయస్సుకే రజస్వల కావడానికి ఇది ఒక కారణం . అంతే కాకుండా పెద్ద వారిలో ఇది ప్రత్యుత్పత్తి సమస్యలకు దారి తీస్తుంది . ఈ రసాయనం కాన్సర్ కారకం.

2 . చాల రకాల ప్లాస్టిక్స్ లలో వుండే మరో రసాయనం ఫ్తాలటేస్ . ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలన్సు ను కలుగ చేస్తుంది .

౩. ప్లాస్టిక్ నెమ్మదిగా డీగ్రేడె అయ్యి మైక్రో ప్లాస్టిక్స్ ను విడుదల చేస్తాయి . అది ఆహారం లో కలిసి ఒంట్లో వాపును ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను కలుగచేస్తాయి .

ఇవి కాకుండా ఇంకా రకరకాలయిన రసాయనాలు ప్లాస్టిక్స్ లో ఉంటాయి .

ఆహార పదార్థాలను నిలువ చేయడానికి , ప్యాక్ చేయడానికి ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాలు వాడొద్దు .

పిల్లలకు స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ బాక్స్ లోనే ఆహారం ప్యాక్ చెయ్యండి .

మీకు తెలిసిన వారందరితో ఈ సమాచారాన్ని పంచుకోండి .

FB post by
Amarnath Vasireddy

Shravan Mathematics

10 Dec, 05:24


👩‍🎓 *Study Tips for Parents* 👪
https://youtube.com/playlist?list=PLDFo06glumTu5SBKtXTDny8IpVB2BbU23&si=Nos2YEdaPRJ5i3OI
ప్రతి ఒక్క పేరెంట్ తప్పకుండ చూడవలసిన వీడియోస్.
🙏 *Share this with everyone* 🙏

Shravan Mathematics

10 Nov, 15:59


14 Divisibility Rules Part 1
https://youtu.be/XVB4MyXufw0
🧑‍🏫 Learn Daily 1 Maths skills
Join
🤩 WhatsApp community: https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N
🤩 Channel: https://whatsapp.com/channel/0029Va5L0kp2ZjCj3f0XCl0x
🙏 Share this with everyone 🙏

Shravan Mathematics

28 Oct, 02:28


👩🏻‍🎓 *How To Study Effectively & Become a Topper | Practical Method* 🤩
https://youtu.be/E3guyxCS6Rk?si=xEBVKWo4VHr2MHYJ
*తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చుడండి.*

Shravan Mathematics

24 Oct, 04:46


🧑‍🏫 *ఏదైనా నేర్చుకోబోయే ముందు ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు*
https://youtu.be/b8fXU14Ku8M
🧑‍🏫 *Learn Daily 1 Maths skills*
Join
🤩 *WhatsApp community:* https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N
🤩 *Channel:* https://whatsapp.com/channel/0029Va5L0kp2ZjCj3f0XCl0x
🙏 *Share this with everyone* 🙏

Shravan Mathematics

16 Oct, 15:17


4. Vocabulary of Mathematics
https://youtu.be/__p3DpJKtrc?si=wda9B-p5Iy3_uiYz
🧑‍🏫 Learn Daily 1 Maths skills
Join
🤩 WhatsApp community: https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N
🤩 Channel: https://whatsapp.com/channel/0029Va5L0kp2ZjCj3f0XCl0x
🙏 Share this with everyone 🙏

Shravan Mathematics

07 Oct, 12:29


Misconception of Maths( Division )
https://youtube.com/shorts/ckK4H4dkf5c?si=5O9wbUvoD0zkmrZ7
🧑‍🏫 Learn Daily 1 Maths skills
Join
🤩 WhatsApp community: https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N
🤩 Channel: https://whatsapp.com/channel/0029Va5L0kp2ZjCj3f0XCl0x
🙏 Share this with everyone 🙏

Shravan Mathematics

01 Oct, 01:28


యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో ఇలాంటి ప్రశ్నలు పోస్ట్ చేస్తున్నాను.
ఈ లింక్ ఓపెన్ చేసి ప్రశ్నలకు ఆన్సర్ చేయండి.
https://www.youtube.com/channel/UCccjFFvrfzNrvehUIiJhomQ/community