తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు @pusthakam123 Telegramチャンネル

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు
7,520 人の購読者
1,375 枚の写真
24 本の動画
最終更新日 01.03.2025 08:17

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు: విశేషాలు మరియు అవగాహన

తెలుగు భాషలో రాసిన ఆధ్యాత్మిక పుస్తకాలు అనేవి మనిషి ఆత్మకు శాంతి మరియు సుఖాన్ని అందించగల ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటాయి. ఈ పుస్తకాలు మన మనస్సును ప్రశాంతంగా ఉంచడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడం మరియు వ్యక్తి జీవితాన్ని మార్పు చేయడం కోసం మద్దతునిస్తాయి. తెలుగు సాహిత్యంలో అనేక ప్రముఖ రచయితలు వుంటారు, వారు తమ రచనల ద్వారా ఆధ్యాత్మికతను మరింత ప్రభావవంతంగా అర్థం చేసుకోవలనుకుంటారు. ఈ పుస్తకాలలో ఉన్నాయి కవితలు, కథలు, ఉపన్యాసాలు మరియు ఇతర ఆధ్యాత్మిక రచనలు, ఇవి వినియోగదారులకు ఆధ్యాత్మిక బోధనలను అందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈ పుస్తకాలు కూడా భారతీయ తత్వం, ధ్యానం, మరియు అనేక ఆధ్యాత్మిక పద్ధతులపై అవగాహనా కల్పిస్తాయి.

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలలో ప్రధాన విషయాలు ఏమిటి?

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు సాధారణంగా ఆధ్యాత్మికత, ధ్యానం, మరియు జీవన తత్త్వాలను ఆధారంగా చేసుకుని ఉంటాయి. ఈ పుస్తకాలలో యోగ, ధ్యాన విధానాలు, మరియు ఆధ్యాత్మిక గురువులు ఇచ్చిన బోధనల గురించి వివరంగా లభిస్తాయి.

ఈ పుస్తకాలలోని రచనలు సాధారణంగా వ్యక్తి అంతర్యామిని పరిశీలించేలా ఉంటుంది, మరియు మానసిక శాంతి, సుఖం, మరియు దైవ సంబంధం సాధించడానికి మార్గం చూపిస్తాయి.

ఉత్తమ తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు ఏమిటి?

తెలుగు భాషలో అనేక ప్రముఖ ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి. 'అనుభవం', 'తత్వం', మరియు 'రామాయణం' వంటి క్లాసిక్ పుస్తకాలు ఇది యొక్క కొన్ని ఉదాహరణలు.

ఇవి కాకుండా, వేదాలను ఆధారంగా చేసుకుని కవితలు మరియు గేయాలు కూడా ప్రసిద్ధి పొందాయి. మునుపటి కాలంలో రాసిన రచనలతోపాటు ఆధునిక రచయితలు కూడా ఈ నేపధ్యంలో పుస్తకాలు రాస్తున్నారు.

ఈ పుస్తకాలు చదవడం ఎలా మన జీవితంలో మార్పు చేస్తుంది?

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా మన ఆలోచనా విధానానికి, సంబంధాలకు, మరియు వ్యక్తిగత అభివృద్ధికి మంచి దోహదం జరుగుతుంది. ఈ పుస్తకాలు మనకు ఆసక్తిని, అందరికీ సంబంధాన్ని నూతనంగా చూసే దృష్టిని ఇవ్వగలవు.

ఇవి మన జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, మన అంతరాత్మతో సంబంధం పెంచుకోవడానికి సహాయపడతాయి.

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను ఎక్కడ కొనుగోలు చేయాలి?

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను అనేక ఆన్‌లైన్ పుస్తక దుకాణాలు మరియు స్థానిక పుస్తకస్థలాల నుండి కొనుగోలు చేయవచ్చు. Amazon, Flipkart వంటి ప్రముఖ వెబ్‌ సైట్లలో వీటి విభాగాలు లభిస్తున్నాయి.

స్థానిక బుక్షాప్‌లలోని ప్రత్యేక విభాగాలు మరియు ముద్రణ సంస్థల ద్వారా కూడా ఈ పుస్తకాలను సులభంగా పొందవచ్చు.

ఈ పుస్తకాలు ఏ సందర్భాలలో చదవాలి?

ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు సాధారణంగా మానసిక శాంతి మరియు ధ్యానం అవసరమైన సమయంలో చదవబడతాయి. ఉదయం లేదా రాత్రి ధ్యానం చేసే సమయంలో ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇవి పండుగ సమయంలో, ప్రత్యేక సందర్భాలలో లేదా మనసు ఆందోళనతో ఉన్నప్పుడు కూడా చదవడం ద్వారా మరింత శాంతిని పొందవచ్చు.

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు テレグラムチャンネル

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు టెలిగ్రామ్ ఛానల్ ఒక అద్భుతమైన సాహిత్య ప్రపంచం అనుభవించడానికి అవకాశం అందిస్తుంది. ఈ ఛానల్ దీనిలో తెలుగు వారికి సాహిత్య, ధర్మ, ఆధ్యాత్మికత, మార్క్సిజం, యోగ, మంత్ర శాస్త్రం, ఆందోళన విజ్ఞానం, సంత శ్రేష్ఠులు, ఉపనిషత్తులు మరియు ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు ఉంటాయి. ఇక్కడ ప్రకటించబడుతున్న పుస్తకాలు ప్రపంచాన్ని అలంకరిస్తాయి, మన మనసును ప్రశాంతము చేస్తాయి మరియు విశ్వానికి గదులు ఓచుకోవడంలో సహాయపడుతుంది. కావున తెలుగు ఆధ్యాత్మిక ప్రేమికులకు ఈ ఛానల్ అద్వితీయ అవకాశాన్ని అందిస్తుంది. తప్పక చూడండి మరియు ఈ ఆధ్యాత్మిక పుస్తకాల గురించి మీ అభ్యాసాలను మంచిగా చేసుకోండి.

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు の最新投稿

Post image

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


147. మా కస్య అద్భుత క్రతూ! యక్షం భుజేమ తనూభిః
మా శేషసా మా తనసా

ఓ అద్భుతకర్మపరులారా! మేము మా తనువులతో యక్షమును
అనుభవించకుందుము గాక, వారసత్వముగా లభించిన ధనమునూ, సంతానము
ఆర్జించిన సొమ్మును భోగించకుందుము గాక (ఋగ్వేదం)

స్వశక్తితో సంపాదించినదే అనుభవానికి యోగ్యం అని పై వేదవాక్య హృదయం.

పిత్రార్జితం మధ్యమమే. అలా వచ్చిన వాటిని సత్కార్యాలకు వినియోగించవచ్చు.

తల్లిదండ్రుల బాగోగులు చూడడం పుత్రులకు స్వధర్మం. దానిని వారు మీరరాదు.కానీ సంతానపు సొమ్ముపై మాత్రమే ఆధారపడడమూ ఆదర్శం కాదు. తమ స్వార్జితాన్నే సరియైన విధంగా ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ దానితో జీవించడమే సమంజసం.

అయితే పైతరాల నుండి, తరువాత వారి నుండి తమంత తాముగా వచ్చిన ఆదాయాన్ని ధార్మిక సత్కర్మలకు వెచ్చించడం శ్రేష్ఠం.

అదే విధంగా 'యక్ష'మును అనుభవించరాదు. అని శాస్త్రం. 'యక్ష' శబ్దానికి 'పూజార్హమైన ద్రవ్యం' అని అర్థం. దానికి చాలా అన్వయించవచ్చు.

దైవ ద్రవ్యాలు, లేదా - పూజ్యుల (మహాత్ముల, గురువుల) ద్రవ్యములు లేదా -గౌరవనీయంగా లభించిన కానుకలు, దానాలు... ఇన్ని అర్థాలు 'యక్షము' అనే పదానికి ఉన్నాయి. వీటితో జీవించడం,అనుభవించడము తగదని భావం.

మొత్తంగా శ్రమతో సాధించిన స్వార్జిత విత్తం అనుభవించడమే శ్రేష్ఠం - అని
తాత్పర్యం.

స్వశక్తినీ, శ్రమనీ - దాని వలన లభించిన సక్రమార్జనని మాత్రమే అనుభవించాలి-అని శాసించిన వేదమాత ఎంత అద్భుత జీవనశైలిని ఆదర్శంగా బోధించిందో
అవగతం చేసుకోవాలి.

'ఉత్తమం స్వార్జితం విత్తం' - అని సుభాషితకారుడూ ఈ నీతినే బోధించాడు.

పిత్రార్జితాన్ని 'మధ్యమం' అన్నారు.

స్త్రీ శ్రమించి సంపాదించిన దానిని అనుభవించడం 'అధమం'గా పేర్కొన్నారు.అంటే స్త్రీ శ్రమని దోచుకోరాదు అనే భావన కూడా ఇందులో ఉంది. స్త్రీమూర్తికి
మన సమాజమిచ్చిన గౌరవమది.

శుద్ధమైన స్వార్జితం వల్ల ఆరోగ్యం, చిత్తం కూడా బలంగా, శుద్ధంగా సత్కర్మలకు యోగ్యంగా ఉంటాయి.

కేవలం లోకకల్యాణానికై తమ ప్రకాశాన్ని వినియోగిస్తున్న సూర్య చంద్రాదులను ఇందులో సంబోధించారు.

'అద్భుతక్రతూ' - 'ఆశ్చర్యకరమైన గొప్పపనులు చేసేవారు' - వేద ప్రకారంగా దేవతలు, ప్రత్యక్ష రూపులైన సూర్యచంద్రులు. వారు తమదైన శక్తితో, విశ్వహితానికై
ప్రవర్తిస్తున్నట్లుగా, స్వశక్తితో సమాజహితానికి పాటు పడేలా అనుగ్రహించమని వారి రూపంగా ఉన్న పరమేశ్వరుని ప్రార్థిస్తున్న మంత్రమిది.

28 Feb, 23:46
383
Post image

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

146. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్

విష్ణువు ఈ విశ్వమంతటినీ మూడు అడుగులతో ఆక్రమించాడు (ఋగ్వేదం)

మూడు స్థానాలలో విష్ణువు తన పదాన్ని ఉంచాడనే ఈ మంత్రార్థంలో ఎన్నో భావాలు ద్యోతకమౌతున్నాయి.

వేదవేదాంతాది శాస్త్రాలతోనే ఆ భావాలని సమన్వయించి తెలుసుకోవాలి.

మూడు లోకాలలో, మూడు కాలాల్లో వ్యాపించినది ఈశ్వరచైతన్యమే - అనే
గ్రహింపు ఈ మంత్రం అందిస్తున్నది. 'త్రీణి పదా విచక్రమే' అని ఋగ్వేదంలో మహామంత్రం చెబుతున్నది. 'త్రిపాదూర్ధ్వముదైత్పురుషః' అని కూడా పురుషసూక్త
వచనం.

ఈ విశ్వంలో - పిండాండ, బ్రహ్మాండాలలో మూడు తత్త్వాలే ఉన్నాయి.సత్త్వరజస్తమోగుణాలనే మూడుగుణాలు, సృష్టిస్థితిలయలనే మూడు కృత్యాలు, ఊర్థ్వ
మధ్య అధోలోకాలనే మూడులోకాలు (లేదా స్వర్గ మర్త్య పాతాళాలు) ఇది
బహిర్జగద్విషయం.

ఇడ, పింగళ, సుషుమ్న - అనే నాడులు, బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు, జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలు...ఇవి ప్రధానంగా పిండాండ (మనలోని విషయం.

ఈ మూడింటా వీటి చలనాలకి హేతువులై, వీటి ద్వారా ప్రపంచాన్ని నిర్వహించేవాడు ఈశ్వరుడు. మూడింటా ఉన్నది ఈతడే అని గ్రహించడమే 'తెలివి'. ఆ తెలివితో
ఆయన యందు మాత్రమే దృష్టిని ఉంచడమే 'ధ్యానం'.

మూడింటితో ఉన్న విశ్వమందు ఆక్రమించిన 'వ్యాపకత్వ లక్షణమే 'త్రివిక్రమత్వం'.ఈ వ్యాపకమే జగతికి చైతన్యం. అదే సౌందర్యం.

ఈ తత్త్వాన్నే 'త్రిపురసుందరి' అన్నారు.

అయితే విడివిడిగా కనబడుతున్న ఈ మూడింటిలో వీటితో కూడిన జగతిలో
వ్యాపించిన పరబ్రహ్మ స్వరూపం ఏకం. ఆ పరతత్త్వం శుద్ధంగా ఈ మూడింటికీ అతీతంగా ఉన్నది. ఏ పరిణామమూ లేని పరిపూర్ణస్థితి ఈ త్రిగుణాతీత తత్త్వంలో
ఉంది. దీనిని సాధించడమే కైవల్యం.

మూడింటినీ అధిగమించిన తత్త్వాన్నే 'త్రిపురాసురసంహారమూర్తి'గా సంభావించాలి.
-
ఇలా · త్రివిక్రమ, త్రిపురసుందరి, త్రిపురాసుర సంహారం... అనే భావాల
నడుమ ఒక సమన్వయం ఉందని స్పష్టమౌతుంది.

మూడు అవస్థలలో సాక్షిగా ఉన్న తత్త్వం తురీయావస్థ (సమాధి)లోనే
తెలియబడుతోంది.

జ్ఞాత (తెలుసుకొనేవాడు), జ్ఞానం (తెలివి), జ్ఞేయము (తెలియబడే వస్తువు) -మూడు (త్రిపుటి) ఏకమయ్యే స్థితి త్రిపురాసుర సంహారం. ఆ కైవల్యస్థితిలో ఉన్న
అఖండ జ్ఞానానంద రూపమే త్రిపురసుందరి.

ఆ పరచైతన్యమే మూడింటియందు అంతర్లీనమైన త్రివిక్రముడు. ఇది అత్యంత సూక్ష్మం కనుక 'వామనరూపం'.

యోగపరంగా చూస్తే సాధకునకు మూడు చక్రాల స్థానాలు ప్రధానం. వీటిని సాధించడమే 'త్రేధా నిదధే పదమ్' అనే భావంగా అన్వయించవచ్చు.

యోగసాధకుడు హృదయం వద్దనున్న అనాహతం నుండి ప్రాణాయామా దులను;ఆజ్ఞాచక్రం నుండి ధ్యానాదులను; సమాధిని సహస్రారాన సాగించడమే (జీవుని)
తన ఉన్నత భూమికారోహణ ప్రక్రియలు. ఈ సంకేతాన్నే త్రివిక్రమ కథ ద్వారా భాగవతం బోధించింది.

28 Feb, 01:12
895
Post image

☘️🍁 వేదాలు 🍁☘️

నాలుగు వేదాలకి ఆర్య సమాజ్ వారి వేద భాష్యం మొత్తం 42 పుస్తకాలు ఉంటాయి.

అలానే దాశరధి రంగాచార్య భాష్యం.

☘️🍁 ఉపనిషద్స్ 🍁☘️

రామకృష్ణ మఠం వారి ఉపనిషద్స్ , ఉపనిషదర్శనం లో 4 బుక్స్ ఇందులో 12 ఉపనిషడ్స్ ఉంటాయి, ఉపనిషద్ ఉద్యానవనం ఇందులో 108 ఉపనిషడ్స్ ఉంటాయి.

☘️🍁 పురాణాలు 🍁☘️

అగ్ని పురాణం, నారద పురాణం, బ్రహ్మ పురాణం, పద్మ పురాణం లో మొదటి రెండు ఖండం లు, శివ పురాణం, దేవి భాగవతం, గరుడ పురాణం, వాయు పురాణం పూర్తి వచనం తో వున్నాయి.

శ్లోకాలతో సహా ఐతే వ్యాస భాగవతం, కూర్మ మహా పురాణం, శ్రీ శివ మహా పురాణం, దేవి భాగవతం, శ్రీ బ్రహ్మాండ పురాణం, శ్రీ మత్స్య, శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం, శ్రీ విష్ణు మహా పురాణం, వాయు పురాణం లో మొదటి భాగం ఇవి అప్లోడ్ చేయబడ్డాయి.

అలానే గంగాధర్ గారి భగవద్గీత ఆడియో కూడ వుంది ఇది మ్యూజిక్ లో ఉంటుంది.

☘️స్తోత్రాలు, మంత్రాలు, ఉపాసన ☘️

దేవి, దేవతల ఉపాసన బుక్స్ వున్నాయి, స్తోత్రాలు వున్నాయి.

☘️ ఆరోగ్యం, కథలు ☘️

ఆరోగ్యం కి సంభందించిన బుక్స్,చందమామ కథలు పంచతంత్ర కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, ఇంక చాల రకాల కథల పుస్తకాలు, బాలల రామాయణం, మహాభారతం పుస్తకాలు.

అలానే 1-10 th క్లాస్ తెలుగు పుస్తకాలు పాతవి

ఇవి అన్ని వున్నాయి, కొత్తగా వచ్చినవాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీకు కావాల్సిన బుక్ ముందు సెర్చ్ చెయ్యండి, లేకుంటే అడగండి, ఉంటే నేను లేదా గ్రూప్ లో ఎవరో ఒకరు సెండ్ చేస్తారు. ధన్యవాదములు.

27 Feb, 13:10
944
Post image

తెలియని వాళ్ళు వుంటారు అని ఓల్డ్ మెస్సేజ్ మల్లి ఫార్వర్డ్ చేశాను.

తెలియని వాళ్ళు ఉంటే సేవ్ చేసుకోండి

27 Feb, 10:48
895