తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు @pusthakam123 Channel on Telegram

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు
7,481 Subscribers
1,371 Photos
24 Videos
Last Updated 19.02.2025 14:06

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు: విశేషాలు మరియు అవగాహన

తెలుగు భాషలో రాసిన ఆధ్యాత్మిక పుస్తకాలు అనేవి మనిషి ఆత్మకు శాంతి మరియు సుఖాన్ని అందించగల ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటాయి. ఈ పుస్తకాలు మన మనస్సును ప్రశాంతంగా ఉంచడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడం మరియు వ్యక్తి జీవితాన్ని మార్పు చేయడం కోసం మద్దతునిస్తాయి. తెలుగు సాహిత్యంలో అనేక ప్రముఖ రచయితలు వుంటారు, వారు తమ రచనల ద్వారా ఆధ్యాత్మికతను మరింత ప్రభావవంతంగా అర్థం చేసుకోవలనుకుంటారు. ఈ పుస్తకాలలో ఉన్నాయి కవితలు, కథలు, ఉపన్యాసాలు మరియు ఇతర ఆధ్యాత్మిక రచనలు, ఇవి వినియోగదారులకు ఆధ్యాత్మిక బోధనలను అందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈ పుస్తకాలు కూడా భారతీయ తత్వం, ధ్యానం, మరియు అనేక ఆధ్యాత్మిక పద్ధతులపై అవగాహనా కల్పిస్తాయి.

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలలో ప్రధాన విషయాలు ఏమిటి?

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు సాధారణంగా ఆధ్యాత్మికత, ధ్యానం, మరియు జీవన తత్త్వాలను ఆధారంగా చేసుకుని ఉంటాయి. ఈ పుస్తకాలలో యోగ, ధ్యాన విధానాలు, మరియు ఆధ్యాత్మిక గురువులు ఇచ్చిన బోధనల గురించి వివరంగా లభిస్తాయి.

ఈ పుస్తకాలలోని రచనలు సాధారణంగా వ్యక్తి అంతర్యామిని పరిశీలించేలా ఉంటుంది, మరియు మానసిక శాంతి, సుఖం, మరియు దైవ సంబంధం సాధించడానికి మార్గం చూపిస్తాయి.

ఉత్తమ తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు ఏమిటి?

తెలుగు భాషలో అనేక ప్రముఖ ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి. 'అనుభవం', 'తత్వం', మరియు 'రామాయణం' వంటి క్లాసిక్ పుస్తకాలు ఇది యొక్క కొన్ని ఉదాహరణలు.

ఇవి కాకుండా, వేదాలను ఆధారంగా చేసుకుని కవితలు మరియు గేయాలు కూడా ప్రసిద్ధి పొందాయి. మునుపటి కాలంలో రాసిన రచనలతోపాటు ఆధునిక రచయితలు కూడా ఈ నేపధ్యంలో పుస్తకాలు రాస్తున్నారు.

ఈ పుస్తకాలు చదవడం ఎలా మన జీవితంలో మార్పు చేస్తుంది?

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా మన ఆలోచనా విధానానికి, సంబంధాలకు, మరియు వ్యక్తిగత అభివృద్ధికి మంచి దోహదం జరుగుతుంది. ఈ పుస్తకాలు మనకు ఆసక్తిని, అందరికీ సంబంధాన్ని నూతనంగా చూసే దృష్టిని ఇవ్వగలవు.

ఇవి మన జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, మన అంతరాత్మతో సంబంధం పెంచుకోవడానికి సహాయపడతాయి.

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను ఎక్కడ కొనుగోలు చేయాలి?

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను అనేక ఆన్‌లైన్ పుస్తక దుకాణాలు మరియు స్థానిక పుస్తకస్థలాల నుండి కొనుగోలు చేయవచ్చు. Amazon, Flipkart వంటి ప్రముఖ వెబ్‌ సైట్లలో వీటి విభాగాలు లభిస్తున్నాయి.

స్థానిక బుక్షాప్‌లలోని ప్రత్యేక విభాగాలు మరియు ముద్రణ సంస్థల ద్వారా కూడా ఈ పుస్తకాలను సులభంగా పొందవచ్చు.

ఈ పుస్తకాలు ఏ సందర్భాలలో చదవాలి?

ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు సాధారణంగా మానసిక శాంతి మరియు ధ్యానం అవసరమైన సమయంలో చదవబడతాయి. ఉదయం లేదా రాత్రి ధ్యానం చేసే సమయంలో ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇవి పండుగ సమయంలో, ప్రత్యేక సందర్భాలలో లేదా మనసు ఆందోళనతో ఉన్నప్పుడు కూడా చదవడం ద్వారా మరింత శాంతిని పొందవచ్చు.

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు Telegram Channel

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు టెలిగ్రామ్ ఛానల్ ఒక అద్భుతమైన సాహిత్య ప్రపంచం అనుభవించడానికి అవకాశం అందిస్తుంది. ఈ ఛానల్ దీనిలో తెలుగు వారికి సాహిత్య, ధర్మ, ఆధ్యాత్మికత, మార్క్సిజం, యోగ, మంత్ర శాస్త్రం, ఆందోళన విజ్ఞానం, సంత శ్రేష్ఠులు, ఉపనిషత్తులు మరియు ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు ఉంటాయి. ఇక్కడ ప్రకటించబడుతున్న పుస్తకాలు ప్రపంచాన్ని అలంకరిస్తాయి, మన మనసును ప్రశాంతము చేస్తాయి మరియు విశ్వానికి గదులు ఓచుకోవడంలో సహాయపడుతుంది. కావున తెలుగు ఆధ్యాత్మిక ప్రేమికులకు ఈ ఛానల్ అద్వితీయ అవకాశాన్ని అందిస్తుంది. తప్పక చూడండి మరియు ఈ ఆధ్యాత్మిక పుస్తకాల గురించి మీ అభ్యాసాలను మంచిగా చేసుకోండి.

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు Latest Posts

Post image

https://youtube.com/shorts/Kdae-CkJ4B8?si=zODqpgR3iuYEudVt

19 Feb, 11:43
259
Post image

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

137. మా ఆపో మా ఓషధీహిగ్ం సీః... పృథివీం మా హిగ్ంసీః

జలములను, ఓషధులను, భూమిని హింసించవద్దు

ప్రకృతి వలననే సర్వజీవులు ఉనికిని పొంది ఉన్నాయి.

జీవనాధారమైన ప్రకృతిని - విచక్షణారహితంగా హింసించడం, విజ్ఞానం పెరిగిందనుకుంటున్న నేటి ఆధునిక కాలంలోనే అధికమౌతోంది. సుఖలాలసతో ప్రకృతి క్షేమాన్నీ, మానవ భవితవ్యాన్ని కూడా విస్మరిస్తున్నాం, ఈ అలక్ష్యధోరణి
మన దేశంలో మరీ మితిమీరుతోంది.

ఎన్నో గొప్ప క్షేత్రాలు, అరణ్యాలు, పర్వతాలు, నదులు, జలాశయాలు... ఇవన్నీ ఇప్పుడు మానవుడి దౌష్ట్యానికి గురై బాధింపబడుతున్నాయి. నిజానికి పర్యావరణం పట్ల దూరదృష్టి, భద్రతా దృక్పథం మొదటిగా చాటిన వేదసంస్కృతి మనది. ప్రకృతిలో పరమాత్మను దర్శించి ఆరాధించే ధార్మిక విధానాలను బోధించిన పరంపర మనకుంది. కానీ వాటిని విస్మరించి ప్రకృతిరూప ఈశ్వరునిపట్ల ద్రోహాన్ని చేస్తున్నాం.

హియాలయాలను మొదలుకొని గంగా యమునా గోదావరీ కావేరీ నదులతో
పాటు ఎన్నో వృక్షసంపదలకు ఆలవాలాలైన అరణ్యాలను కలుషితం చేసి, వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాం. 'పుణ్యం వస్తుంది' అనే ఆశతో తీర్థక్షేత్రాలను సేవించే
వారందరూ, పుణ్యస్వరూపాలైన ఆ ధామాలను పవిత్రంగా, శుభ్రంగా చూడలేక పోతున్నారు.

గంగాది తీర్థస్థలాల్లో గుంపులుగా చేరడం, ప్లాస్టిక్ పాత్రలలో నానా 'ఫాస్టుఫుడ్”లు ఆరగించి, ఎక్కడ పడితే అక్కడ ఆ పాత్రలను పారవేయడం జరుగుతోంది.

అందునా - దుర్గమమైన పర్వతాలకు, క్షేత్రాలకు ప్రయాణ సౌకర్యాలు పెరగడం, వాటిని ధనలబ్ధికోసం వాడుకొనే యాత్రా నిర్వాహకులు వృద్ధి చెందడం జరిగాక ఒక
వినోదయాత్రగా బయలుదేరుతున్న బాధ్యతారహితుల సంఖ్య కూడా పెరిగింది.

మనకి పర్యావరణ శాఖ, నదులను రక్షించే ప్రభుత్వ రంగసంస్థలు బాగానే ఉన్నాయి. కానీ పర్యావరణ పరిరక్షణ కాగితాల్లో, ప్రకటన పత్రాలలో తప్ప క్రియారూపంగా కనిపించడం లేదు.
విదేశాల నుండి ఆసక్తిగా వచ్చే పర్యాటకుల దృష్టిలో దేశం
పరువు పోతుందని కూడా అనిపించడం లేదు.

పేరుకు మాత్రం వివిధ పథకాలను, శాఖలను ఏర్పరచే ప్రభుత్వాధినేతలు, వాటి ద్వారా కూడా అవినీతి మార్గంలో వ్యక్తిగత ఆదాయాలను పెంచుకుంటున్నారే తప్ప
• ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. పుణ్యం కోసం ప్రాకులాడే భారతీయులు కూడా ధర్మశాస్త్రాలు చెప్పే నియమాలను ఉల్లంఘించి, పాపాలను
మూటగట్టుకుంటున్నారు.

ఈ దేశంలో అతిపెద్ద సమస్యలు రెండు
1. నేతల అవినీతి 2. పర్యావరణ
కాలుష్యం, అపరిశుభ్రత. వీటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి.

ఇప్పటికే ఎన్నో ఓషధులను పోగొట్టుకున్నాం. కొన్ని నదులు అంతరించి పోతున్నాయి.
అరణ్యాలు ధ్వంసమౌతున్నాయి. తరువాతి తరాలకు భూమి ఎలా మిగులుతుంది?ఎటువంటి విషమపరిణామాలలో భవిష్యత్తరాలు బ్రతకవలసి వస్తుంది.. భక్తులు,
పుణ్యంపై ఆశ కలవారు ఎందరో ఉన్న దేశంలో వారికి వివేకం కలిగించాల్సిన
బాధ్యత ధార్మిక గురువులకు చాలా ఉంది.

శక్తి కలిగి, రోగాలను నాశనం చేసే ఓషధుల వృక్షాలు ఉన్న భూమి మనకి కావాలి

దున్నిన వెంటనే విత్తనాలు మొలకెత్తే పారవంతమైన భూమి కావాలి.

మేధావులు, శ్రమజీవులు, రక్షకులు, వాణిజ్యవేత్తలు నివసించే భూమి
కావాలి... అంటూ అథర్వణవేదం - భూమి ఎలా ఉండాలో వివరించింది.

ప్రవాహరూప జలాలు, బావులు, చెరువులు... మొదలైన జలాశయాల
ద్వారా జలదేవత మమ్మల్ని రక్షించాలి - అని ఋగ్వేదం బోధించింది.

నీరే ఔషధం అని వేదం మరోచోట ప్రవచించింది.

“ఆపో భవన్తు పీతయే” - తాగడానికి పనికివచ్చే శుద్ధజలాలు భూమిపై
ఉండాలని వేద ధర్మం బోధిస్తోంది. ఇప్పుడు అలాంటివి ఎక్కడ లభిస్తున్నాయి?

ప్రకృతి సంపద ఎలా ఉండాలో, ఎలా కాపాడాలో యుగాల నాడే బోధించిన
వేదభూమిలో, ప్రకృతిని పరిరక్షించుకోవడం కోసం ప్రతి భారతీయుడు ఉద్యమించాలి.
అటువంటి సద్బుద్ధిని భారతీయులకు ప్రసాదించమని భగవంతుని ప్రార్థిద్దాం.

19 Feb, 01:23
605
Post image

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

136. భక్తిం మయి పరాం కృత్వా

భక్తిని నా పరం చేయి(భగవద్గీత)

భగవంతుని ప్రేమస్వరూపంగా మన సంస్కృతి అభివర్ణించింది. 'ప్రేమరూపా ప్రియంకరీ' అని లలితా నామాలు. ప్రేమయే దైవస్వరూపం. సృష్టిలో జరిగే ప్రతిచర్యా ప్రియమైనదే. తత్కాలంగా అప్రియంగా కనబడినప్పటికీ దాని పరిణామం
ప్రియమే. ఈ దృష్టితో జీవితాన్నీ, ప్రపంచాన్నీ గ్రహించినట్లయితే అంతా ఆనందమే, ప్రశాంతతే.

ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు కనుక, ఆయనని ప్రేమతోనే గ్రహించగలం.
కాంతిస్వరూపుడైన సూర్యుని... కాంతి సహాయంతోనే తెలుసుకున్నట్లుగా, ప్రేమయే భగవంతుని సాక్షాత్కరింపజేస్తుంది. భగవంతుడు జగతిపై కురిపించే ప్రేమకు 'కరుణ’
అని పేరు. మనం దైవంపై చూపించే ప్రేమకు 'భక్తి' అని పేరు. ప్రేమతోనే
ప్రేమస్వరూపుని గ్రహించాలి.

అందుకే భక్తిశాస్త్రాన్ని రచించిన నారదమహర్షి 'సాత్వస్మిన్ పరమ ప్రేమరూపా అమృత స్వరూపాచ' అని నిర్వచించాడు. సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడైన పరమేశ్వరునిపై సంపూర్ణమైన ప్రేమనే 'భక్తి' అని స్పష్టపరచాడు. అది ఆనందస్వరూపమని తీర్మానించాడు. భక్తి వలన ఆనందం కాదు. భక్తియే ఆనందం.

కామనాభక్తికి, ఈ ప్రేమభక్తికీ హస్తిమశకాంతరం ఉంది. కామం అడుగుతుంది.భక్తి అర్పిస్తుంది. ప్రేమ రసస్వరూపం. ఆ ప్రేమలో భక్తునికి భగవంతుడు తప్ప పట్టదు. వీచేగాలి భగవంతుని స్పర్శ. సూర్యచంద్రకాంతులు భగవంతుని
చూపులు. అంతా ఈశ్వరమయం.

ఈ భక్తిలో మునిగిన వారి నుండి కూడా ప్రేమయే ప్రసరిస్తుంది. ప్రేమకు
వ్యతిరేకమైన ద్వేషాలు, అసూయలు, హింసలు వగైరా అసురభావాలు ఇసుమంత కూడా కానరావు. కోరికలు కోసం దేబిరించే ఆశ్రయానికి ఈ భక్తిలో స్థానం లేదు.తన కోరిక కోసం భగవంతుని నమ్ముకున్నవారు - ముందుగా 'కోరికకి భక్తులు' అని తెలుసుకోవాలి.

‘భవతాత్ భక్తిః అహైతుకీ త్వయి' అంటారు చైతన్యమహాప్రభువు. ఏ నెపమూ లేని భక్తి లభించితే దానికంటే వేరే ముక్తి అంటూ లేదు. ధర్మార్థ కామమోక్షాల కంటే ఇది
శ్రేష్ఠమని, భక్తిని 'పంచమ పురుషార్థం'గా అభివర్ణించారు మధుసూదన సరస్వతి.

విశ్వంలో, మనలో నిరంతరం ప్రసరించే చైతన్యమంతా పరమాత్ముని కరుణయే.అంటే ప్రేమయే. ఆ ప్రేమ నిరంతరం విశ్వమంతా ప్రత్యణువునా ప్రసరిస్తోంది.

భగవచ్చింతన, కీర్తన, స్మరణ - ఇవన్నీ భక్తునికి ప్రేమలో భాగాలే. ఈ ప్రేమలో
కరిగి పుట్టిన మధురభక్తిలోనే - నాడు గోపికలు తరించారు. ఈ ప్రేమ చైతన్యాన్నే అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, మీరాబాయి, సూరదాస్, చైతన్యమహాప్రభువు మొదలైన వారంతా అమృతవాహినిగా ప్రవహింపజేశారు. ఈ ప్రేమభక్తినే 'అనన్యభక్తి,పరాభక్తి, ఏకభక్తి' అని భాగవతం, భగవద్గీత ప్రతిపాదించాయి.

'అణ్ బే శివమ్' - ప్రేమయే శివం
అని తమిళనాట శివభక్తుల నినాదం.ప్రేమయే శివస్వరూపం.

'పరమ ప్రేమ' అనే మాటను నారదుడు ప్రయోగించాడు. 'అత్యంత ఉత్కృష్టమైన'
(దానికి మించినది మరొకటి లేదు) అని అర్థం. ఉత్కృష్టమైన దానిని ఉత్కృష్టంగా ప్రేమించడమే భక్తి. పరమాత్మయే ఉత్కృష్టుడు. ఆయనని అనన్యంగా ప్రేమించడమే
ఉత్కృష్టత.

భగవంతుడు అందరివాడు. 'తనవాడు' అని గుర్తించిన ప్రేమి ధన్యుడు. ప్రేమమార్గం
రసయోగం. ఆ రససిద్ధులకు వందనాలు.

18 Feb, 01:41
990
Post image

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

135. ఉత్ అస్థామ్ అమృతాన్ అను

అమృతులను అనుసరించి ఉన్నతుడనౌదును గాక (యజుర్వేదం)

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలనేది ప్రతి జీవుని తపన. అందుకే పై మంత్రంలో తాము ఉన్నతులవ్వాలనే ఆకాంక్షతో పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఋషులు.

నాశనం లేనివారు అమృతులు. సద్గుణాల చేత, సత్కార్యాల చేత సత్కీర్తిని సాధించినవారు. వారిని అనుసరించితేనే మనం ఉన్నతస్థితిని చేరగలం.

"దుశ్చరిత్ర నుండి నేను బైట పడాలి" అని ఈ మంత్ర పూర్వ భాగంలోని
భావం. అంటే - సచ్చరిత్ర అలవడాలి అన్నా, చెడు నడత నుండి వెలువడాలన్నా ఆదర్శ పురుషుల్ని అనుసరించాలి... అనే ఆంతర్యాన్ని బోధిస్తున్నది వేదమాత.

అలాంటి అమృతచరిత్రలను అందించడానికే వాల్మీకి, వ్యాసాదులు ఇతిహాస పురాణాలను అందించారు. కాళిదాసాదులు సత్కావ్యాలను రచించారు.

( మన సంస్కృతిలో శాస్త్రాలు అసంఖ్యాకాలు. అదే విధంగా ఆచరించి నెగ్గిన మహాత్ములూ అసంఖ్యాకులే. ఈ సనాతనధర్మం ఇంకా నిలబడిందీ అంటే పుస్తకాలో, సంస్థలో, ప్రచారాలో కారణాలు కావు. ధర్మానికి నిలువెత్తు నిదర్శనాలైన మహాపురుషులే నిజమైన ఆధారాలు.)

ఉత్తమమైన 'చరిత్ర' (నడత) కలిగినవారే అమరులు. వారు భౌతికంగా లేకున్నా,వారి గుణగణాలు మనకు స్ఫూర్తినిచ్చి మన నడవడికను తీర్చిదిద్దుతాయి.

“మహాత్మా యేన గతః సపంథా" - అని మహాభారతం. మహాత్ములు ఏ దారిన
వెళ్ళారో, దానినే అనుసరించు... ఇదే పెద్ద ధర్మం. కర్తవ్యాకర్తవ్య విచారణలో శాస్త్రాలను అనుసరించడం ఉత్తమం.

'తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే' - అని పలికిన శ్రీకృష్ణుడు 'యద్యదాచరతి శ్రేష్ఠఃతత్త దేవేతరోజనాః' శ్రేష్ఠుడు దేనిని ఆచరిస్తాడో ఇతరులు దానిని అనుసరిస్తారు.. అని కూడా వివరించాడు.

శాస్త్రాలు గొప్పవే, కానీ అవి అనేకాలు. ఏది దేనికి అనుసంధించాలో, దేనిని
ఎలా అర్థం చేసుకోవాలో తేల్చుకోవడం కష్టం. పరస్పర విరుద్ధాలుగా కనిపించే
వాటిని ఎలా సమన్వయ పరచుకోవాలో అర్థం కాదు.

అందుకే 'శిష్టాచారం' అనేది ధర్మంలో ప్రధానమయింది. 'శిష్టులు' అనగా “కపటం లేకుండా, సత్ప్రవర్తన కలిగిన శుద్ధ మనస్కులు” అనేది ప్రధాన నిర్వచనం. వారే అమృతులు.

అసలు వారి ద్వారానే ధర్మం యొక్క 'ఆచరణీయత' తేటపడుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఎటువంటి ధోరణిలో వారు ధర్మాన్ని కాపాడుకున్నారో,చరిత్రను నిలబెట్టుకున్నారో అధ్యయనం చేయాలి అన్వయించుకోవాలి
అనుసరించాలి.
-
మన సంస్కృతిలో శాస్త్రాలు అసంఖ్యాకాలు. అదే విధంగా ఆచరించి నెగ్గిన మహాత్ములూ అసంఖ్యాకులే. ఈ సనాతనధర్మం ఇంకా నిలబడిందీ అంటే పుస్తకాలో,
సంస్థలో, ప్రచారాలో కారణాలు కావు. ధర్మానికి నిలువెత్తు నిదర్శనాలైన మహాపురుషులే నిజమైన ఆధారాలు.

ఎలాంటి కాలాల్లో లైనాఎప్పటికప్పుడు మణిదీపాల్లాంటి మహాత్ములు ఈ భరతభూమిపై ఆవిర్భవిస్తున్నారు.
అవతారపురుషులు, కారణజన్ములు, సిద్ధులు, యోగులు, మహర్షులు... ఇలాంటి అమృతస్వరూపులు మన సంస్కృతి పరంపరలో ఎందరో.

వారే మనలను 'ఉత్’'సాహ పరచి, 'ఉత్'కృష్ట స్థితికి తీసుకువెళ్ళి ఉత్తమ గతిని కలిగిస్తారు.

17 Feb, 03:02
1,180