*For Scroll*
తేదీ: 18-11-2024,
శాసనమండలి, అమరావతి.
*శాసనమండలిలో శాంతిభద్రతల అంశంపై ఎమ్మెల్సీలు వరూధు కళ్యాణి, కల్పలతారెడ్డి, యేసురత్నం ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానం*
*2014 టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే గత ఐదేళ్లలో జరిగిన నేరాలు, ఘోరాలు ఎక్కువ*
*2014-19 కాలంలో 83, 202 కేసులు నమోదు*
*2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో 1,00508 నేరాలు నమోదు*
*28.8 శాతం వైసీపీ ప్రభుత్వంలో క్రైమ్ రేట్ ఎక్కువ*
*2019 నుంచి జనవరి నుంచి అక్టోబర్ వరకు నమోదైన నేరాల నమోదు పరిశీలిస్తే*
*2019లో 17,746*
*2020లో 17,089*
*2021లో 17,752*
*2022లో 25,503*
*2023లో 22,418*
*2024లో 14,650*
*గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందనడానికి గణాంకాలే నిదర్శనం*
*ఐదు నెలల పాలనలో మహిళలు, చిన్నారుల రక్షణే ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం కీలక సంస్కరణలు*
*మహిళలకోసం హెల్ప్ డెస్క్ లు, దిశ పోలీస్ స్టేషన్లను మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లుగా మార్పు*
*శాంతిభద్రతలను కాపాడే లక్ష్యంతో మహిళా సిబ్బంది ద్వారా అవసరమైన సాయం, అవగాహన కార్యక్రమాల నిర్వహణ*
*పోలీస్ బృందాల బలోపేతం, షీ టీమ్ లు, బ్లూకోర్ట్స్, రక్షక టీమ్ లు, గస్తీవాహనాలను అప్రమత్తంగా ఉంచడం*
*పోలీస్, ఐసీడబ్ల్యూ, బాలల సంక్షేమం, రైల్వే, బీఎస్ఎఫ్, న్యాయ శాఖల సమన్వయంతో పోస్కో, మిస్సింగ్ కేసుల నివారణపట్ల ప్రత్యేక దృష్టి*
*సైబర్ క్రైమ్ బృందాలను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాం*
*రాష్ట్రానికి మూడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లే ఉండగా..జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు దిశగా అడుగులు*
*నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం సీసీ కెమెరాల పునరుద్ధరణ, ఏర్పాటుకు వేగంగా అడుగులు*
*ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ పరికరాలను పునరుద్ధరణకు చర్యలు*
*నేరాల నియంత్రణలో భాగంగా చట్టాలపై అవగాహన, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో బాధితులకు సత్వర న్యాయానికి కృషి*
*బాలికల రక్షణకోసం 1098 హెల్ప్ లైన్ ఏర్పాటు, ఆపరేషన్ ముస్కాన్, స్వేచ్ఛ, విముక్తి వంటి అవగాహన కార్యక్రమాలకు పెద్దపీట*
*ఇప్పటివరకూ 12,115 మందికి నోటీసులు ఇచ్చాం*
*2023 ఏడాదిలో జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజుకు 59 నేరాలు సగటున, మొత్తం కేసులు 8,855 నమోదు అయ్యాయి*
*2024లో జూన్ నుంచి అక్టోబర్ మధ్య 7,234 కేసులు నమోదు, గతేడాదితో పోలిస్తే 18శాతం క్రైమ్ తగ్గుదల*
*చిన్నారులు, ఆడబిడ్డలపై అత్యాచారాలను రాజకీయం చేయడం తగదు*
*అఘాయిత్యాలు జరిగినపుడు తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసుల నిర్ధారణ లేకుండా లైంగిక దాడి అని విపక్షాలు మాట్లాడడం సబబు కాదు*
*గత ఐదు నెలల పరిపాలనలో అఘాయిత్యం జరిగిన రోజే అరెస్ట్ లు, 2 రోజుల్లోగా రిమాండ్ కు పంపడం జరిగింది*
*ముచ్చుమర్రి కేసులో అదృశ్యాన్ని గుర్తించకపోవడంపైన వ్రాతపూర్వక సమాధానం ఇవ్వడానికి సిద్ధం*
*గత ప్రభుత్వంలో సీఎం ఇంటికి సమీపంలో గ్యాంగ్ రేప్ జరిగితే స్పందించలేదు*
*విజయవాడ నగరం నడిబొడ్డున దళిత వికలాంగురాలిని మూడు రోజులు అత్యాచారం చేశారని న్యాయపోరాటానికి వెళ్తున్న చంద్రబాబుపై కేసులు పెట్టలేదా?*
*గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను చెట్లు నరికించడానికి, పరదాలు కట్టడానికి, టీడీపీ నేతల కదలికలపై నిఘా పెట్టడానికే దుర్వినియోగం*
*దిశ చట్టం అనేది రాష్ట్రంలో లేదు, చట్టబద్ధత లేదు, ఏమీ లేకుండానే రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేశారు*
*నాటి సీఎం జగన్ దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన నాడే ఓ మైనర్ దళిత బాలికపై అత్యాచారం చేసి ఆ పోలీస్ స్టేషన్ ఎదుటే పడేసి వెళ్లారు. దిశ న్యాయం చేసిందా?*
*టీడీపీ హయాంలో తీర్చిదిద్దిన ఫోర్త్ లయన్ (నాలుగవ సింహం) యాప్ నే దిశ యాప్ గా గత ప్రభుత్వం మార్పు*
*దిశ యాప్, స్టేషన్ల వల్ల నేరాలు తగ్గాయని చెప్తున్న సభ్యులప ఎప్పుడు లేనన్ని దారుణాలెందుకు గత ప్రభుత్వంలో జరిగాయి?*
*టీడీపీ ప్రభుత్వంలోని మహిళా పోలీస్ స్టేషన్లే గత ప్రభుత్వ దిశ స్టేషన్లు కాదా?*
*న్యాయం చేసే 'నిర్భయ' చట్టం ఉన్నా లేని దిశ చట్టమంటూ కేసులు పరిష్కారం కాక బాధితులకు కష్టాలు*
*కేసుల ఛేదనలో కీలకమైన అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ని కూడా ఏర్పాటు చేయలేని గత ప్రభుత్వ దుస్థితిని ఘన చరిత్రగా చెబుతున్నారా?*
*కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చి రూ.200 కోట్లు నిధులిచ్చినా రాజధాని కక్షతోనే అడుగు ముందుకు పడకుండా చేయలేదా?*
*దిశ చట్టమెక్కడ? ద్విచక్రవాహనాలెక్కడ? వాహనాలెక్కడో చెప్పండి?*
*గత 5 నెలల నుంచి జరిగిన నేరాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం మూలాలు గంజాయి,డ్రగ్స్ వల్లే*
*డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపేలా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం*
*మహిళల భద్రత విషయంలో రాజీపడం, నేరస్తులకు శిక్ష అమలులో కుల,మత,రాగద్వేషాలుండవ్*
*వైఎస్ జగన్ గారి తల్లి, చెల్లికి జరిగిన అన్యాయం పట్ల కూడా అండగా ఉంటాం*
*సభలో వాస్తవాలు, నాటి వారి ప్రభుత్వంలో అరాచకాలు చెబితే సహించలేక పారిపోతున్నారు*
-----------------