ఈ నెల 19వ తేదీ (గురువారం) నుండి మెగా ఎగ్జామ్ సిరీస్ 4.0 ప్రారంభం కాబోతున్న విషయం మీకు తెలిసినదే. ఈ ఎగ్జామ్ సిరీస్ లో భాగంగా మీకు ఇవ్వబడిన సిలబస్ కాపీలోని ప్రతి టెస్ట్ సిలబస్ నుండి 2 ఎగ్జామ్స్ ప్రతి గురువారం మరియు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ విధానంలో నిర్వహించబడును.అనగా ఒకే టెస్ట్ సిలబస్ నుండి గురువారం ఒక ఎగ్జామ్ (200 మార్కులకు) మరియు శనివారం ఒక ఎగ్జామ్ (200 మార్కులకు) నిర్వహించబడును. ఇలా 15 టెస్ట్ ల సిలబస్ నుండి 30 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. ప్రతి ఆదివారం మొత్తం సిలబస్ ఆధారంగా ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడును. ప్రతి ఎగ్జామ్ లోను మీకు తెలియని కొత్త ప్రశ్నలు 5 నుండి 10 వరకు ఉండును. వీటిని మీ పాఠ్య పుస్తకం లేదా మెటీరియల్ లో రాసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
ఆఫ్ లైన్ విధానంలో శ్రీకంఠం సర్కిల్ నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ నందు ఎగ్జామ్స్ నిర్వహించబడును.
మరిన్ని వివరాలకు సంప్రదించండి: సాయిగంగ కోచింగ్ సెంటర్, అనంతపురం.
8341394930
9581767267