గురువు ప్రవచనాంశ థార @sri_chaganti_pravachanamulu Channel on Telegram

గురువు ప్రవచనాంశ థార

@sri_chaganti_pravachanamulu


**బ్రహ్మాశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు తెలుగు లిపిలో మరియు ఆడియోలు మాత్రమే 🙏... ప్రతి రోజు 1 లేదా 2 ఆడియో క్లిప్స్ పంపించబడును.🙏🕉 ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో అందరూ తరించగలరు. 🕉**

గురువు ప్రవచనాంశ థార (Telugu)

గురువు ప్రవచనాంశ థార చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్యాత్మిక ప్రవచనలను తెలుగు లిపిలో మరియు ఆడియోలు మాత్రమే అందిస్తుంది. ప్రతి రోజు 1 లేదా 2 ఆడియో క్లిప్స్ పంపించబడును. ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో అందరూ తరించగలరు. ఇది చాలా ఉపకారకరమైన చానల్ మరియు అందరికీ ఆధ్యాత్మిక ప్రత్యక్షతను ప్రస్తుతం చేస్తోంది.

గురువు ప్రవచనాంశ థార

31 Dec, 09:53


ప్రైవేటు విద్యాసంస్థల ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో కాకినాడలో నిన్న (28-12-2024) పదవ తరగతి విద్యార్థుల కొరకు నిర్వహింపబడిన అవగాహనా సదస్సులో పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు పాల్గొని, పదవ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు నైతిక విలువలను పెంపొందించుకునే విధంగా వారు అనేక విషయములను తెలియజేశారు. జీవితంలో లక్ష్యములను ఏర్పాటు చేసుకొనుట, వాటిని సాధించుట కొరకు ప్రయత్నించుట, ఆ సాధనలో ఒడిదురుకులు ఎదురైతే వాటిని ఎట్లా ఎదుర్కొని, అధిగమించి తమ లక్ష్యం వైపు పురోగమించాలి అనే విషయంపై పూజ గురువుగారు పిల్లలు అందరికీ మార్గనిర్దేశం చేశారు. అనేకమంది మహాపురుషుల జీవితములలోని విషయములను ఉటంకిస్తూ సాగిన పూజ్య గురువుగారి ప్రసంగమును పిల్లలందరూ అత్యంత ఏకాగ్రతతో విన్నారు.

కొన్ని వేలమంది విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ఒకానొక సమయంలో పిల్లలకు చోటు సరిపోని పరిస్థితి ఏర్పడితే వారిని వేదికపై తన చుట్టూ కూర్చోబెట్టుకుని పూజ్య గురువుగారు ప్రసంగించారు. కొందరు విద్యార్థులకు గురువుగారు మెటీరియల్ కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజ్య గురువుగారు చేసిన ప్రసంగము పట్ల విద్యార్థులు మరియు అధ్యాపకులు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్యార్థులు అందరికీ ఎంతగానో ఉపయోగపడే పూజ్య గురువుగారి ఈ ప్రసంగము అతి త్వరలో "శ్రీ చాగంటి వాణి" యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమగును

గురువు ప్రవచనాంశ థార

31 Dec, 09:51


శ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధనోత్సవము సందర్భముగా రేపు (27/12/2024) భక్తులందరూ పఠించుకొనుటకు వీలుగా అందించబడుతున్నది...

శ్రీ జగద్గురు కాంచీ కామకోటి పీఠాధీశ్వర శ్రీమచ్చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ భగవత్పాదాష్టోత్తర శతనామావళిః

1. శ్రీ చన్ద్రశేఖరేంద్రాస్మదాచార్యాయ నమో నమః
2. శ్రీ చంద్రమౌళి పాదాబ్జ మధుపాయ నమో నమః
3. ఆచార్య పాదాధిష్ఠానాభిషిక్తాయ నమో నమః
4. సర్వజ్ఞాచార్య భగవత్స్వరూపాయ నమో నమః
5. అష్టాంగయోగ నిష్ఠాది గరిష్ఠాయ నమో నమః
6. సనకాది మహాయోగి సదృశాయ నమో నమః
7. మహాదేవేంద్ర హస్తాబ్జ సంజాతాయ నమో నమః
8. మహాయోగీంద్ర సంవేద్య మహత్త్వాయ నమో నమః
9. కామకోటి మహాపీఠాధీశ్వరాయ నమో నమః
10. కలిదోష నివృత్తేక కారణాయ నమో నమః
11. శ్రీ శంకర పదాంభోజ చిన్తనాయ నమో నమః
12. భారతీ కృత జిహ్వాగ్ర నర్తనాయ నమో నమః
13. కరుణారస కల్లోల కటాక్షాయ నమో నమః
14. కాన్తి నిర్జిత సూర్యేందు కమ్రాభాయ నమో నమః
15. అమన్దానందకృన్మంద గమనాయ నమో నమః
16. అద్వైతానందభరిత చిద్రూపాయ నమో నమః
17. కటీతటలసచ్చారు కాషాయాయ నమో నమః
18. కటాక్షమాత్ర మోక్షేఛ్ఛా జనకాయ నమో నమః
19. బాహుదండ లసద్దండ భాసురాయ నమో నమః
20. ఫాలభాగ లస్త్భూతి భూషితాయ నమో నమః
21. దరహాస స్ఫుర ద్దివ్య ముఖాబ్జాయ నమో నమః
22. సుధామధుర సౌహార్ద భాషణాయ నమో నమః
23. తపనీయ తిరస్కారి శరీరాయ నమో నమః
24. తపః ప్రభా విరాజత్త్వక్తాదృశాయ నమో నమః
25. సంగీతానంద సందోహ సర్వస్వాయ నమో నమః
26. సంసారాంబుధి నిర్మగ్న తారకాయ నమో నమః
27. మస్తకోల్లాసి రుద్రాక్ష మకుటాయ నమో నమః
28. సాక్షాత్పర శివామోఘ దర్శనాయ నమో నమః
29. చక్షుర్గత మహాతేజోత్యుజ్వలాయ నమో నమః
30. సాక్షాత్కృత జగన్మాతృ స్వరూపాయ నమో నమః
31. క్వచిత్బాల జనాత్యన్త సులభాయ నమో నమః
32. క్వచిన్మహాజనాత్యంత దుష్ప్రాపాయ నమో నమః
33. గోబ్రాహ్మణ హితాసక్త మానసాయ నమో నమః
34. గురుమండల సంభావ్య విదేహాయ నమో నమః
35. భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః
36. భావ్యాది భావ్య దివ్య శ్రీపదాబ్జాయ నమో నమః
37. వ్యక్తావ్యక్త తరానేక చిత్కళాయ నమో నమః
38. రక్త శుక్ల ప్రభామిశ్ర పాదుకాయ నమో నమః
39. భక్త మానస రాజీవ భవనాయ నమో నమః
40. భక్త లోచన రాజీవ భాస్కరాయ నమో నమః
41. భక్త కామలతా కల్ప పాదపాయ నమో నమః
42. భక్తి ముక్తి ప్రదానేక శక్తిదాయ నమో నమః
43. శరణాగత దీనార్త రక్షకాయ నమో నమః
44. శమాది షట్క సంపత్ప్రదాయకాయ నమో నమః
45. సర్వదా సర్వధా లోక సౌఖ్యదాయ నమో నమః
46. సదా నవనవాకాంక్ష్య దర్శనాయ నమో నమః
47. సర్వ హృత్పద్మ సంచార నిపుణాయ నమో నమః
48. సర్వేంగిత పరిజ్ఞాన సమర్థాయ నమో నమః
49. స్వప్న దర్శన భక్తేష్ట సిధ్ధిదాయ నమో నమః
50. సర్వ వస్తు విభావ్యాత్మ సద్రూపాయ నమో నమః
51. దీన భక్తావనైకాంత దీక్షితాయ నమో నమః
52. జ్ఞానయోగ బలైశ్వర్య మానితాయ నమో నమః
53. భావ మాధుర్య కలిత భావాఢ్యాయ నమో నమః
54. సర్వభూత గణామేయ సౌహార్దాయ నమో నమః
55. మూకీభూతానేక లోక వాక్ప్రదాయ నమో నమః
56. శీతలీకృత హృత్తాప సంసేవ్యాయ నమో నమః
57. భోగ మోక్ష ప్రదానేక యోగజ్ఞాయ నమో నమః
58. శ్రీఘ్ర సిధ్ధి కరానేక శిక్షణాయ నమో నమః
59. అమానిత్వాది ముఖ్యార్ధ సిధ్ధిదాయ నమో నమః
60. అఖండైక రసానంద ప్రబోధాయ నమో నమః
61. నిత్యానిత్య వివేక ప్రదాయకాయ నమో నమః
62. ప్రత్యగేకరసాఖండ చిత్సుఖాయ నమో నమః
63. ఇహాముత్రార్ధ వైరాగ్య సిధ్ధిదాయ నమో నమః
64. మహామోహ నివృత్యర్థ మంత్రదాయ నమో నమః
65. క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రత్యేక దృష్టిదాయ నమో నమః
66. క్షయవృధ్ధి విహీనాత్మ సౌఖ్యదాయ నమో నమః
67. తూలాజ్ఞాన విహీనాత్మ తృప్తిదాయ నమో నమః
68. మూలాజ్ఞానా బాధితాత్మ ముక్తిదాయ నమో నమః
69. భ్రాంతి మేఘోచ్చాటన ప్రభంజనాయ నమో నమః
70. శాంతి వృష్టి ప్రదామోఘ జలదాయ నమో నమః
71. ఏక కాలకృతానేక దర్శనాయ నమో నమః
72. ఏకాంత భక్తి సంవేద్య స్వభావాయ నమో నమః
73. శ్రీచక్ర రథ నిర్మాణ సుప్రధాయ నమో నమః
74. శ్రీ కళ్యాణతరామేయ సుశ్లోకాయ నమో నమః
75. ఆశ్రితాశ్రయణీయత్వ ప్రాపకాయ నమో నమః
76. అఖిలాండేశ్వరీ కర్ణ భూషాదాత్రే నమో నమః
77. సశిష్యగణ యాత్రా విధాయకాయ నమో నమః
78. సాధుసంఘ నుతామేయ చరణాయ నమో నమః
79. అభిన్నాత్మైక్య విజ్ఞాన బోధకాయ నమో నమః
80. భిన్న భిన్న మతైశ్చాభి పూజితాయ నమో నమః
81. తత్తద్విపాక సద్బోధ దాయకాయ నమో నమః
82. తత్తద్భాషా ప్రకటిత స్వబోధాయ నమో నమః
83. సర్వత్ర సాధితానేక సత్కార్యాయ నమో నమః
84. చిత్ర చిత్ర ప్రభావాతి ప్రసిధ్ధాయ నమో నమః
85. లోకానుగ్రహ కృత్కర్మ నిష్ఠితాయ నమో నమః
86. లోకోధ్ధరణ కృద్భూరి నియమాయ నమో నమః
87. సర్వ వేదాంత సిధ్ధాంత సమ్మతాయ నమో నమః
88. కర్మ బ్రహ్మాత్మ యోగాది మర్మజ్ఞాయ నమో నమః
89. వర్ణాశ్రమ సదాచార రక్షకాయ నమో నమః
90. ధర్మార్ధ కామ మోక్ష ప్రదాయకాయ నమో నమః

గురువు ప్రవచనాంశ థార

31 Dec, 09:51


91. పద వాక్య ప్రమాణాది పారీణాయ నమో నమః
92. పాదమూల నతానేక పండితాయ నమో నమః
93. వేదసారార్థ సద్గోష్ఠీ లోలుపాయ నమో నమః
94. వేదశాస్త్ర పురాణాది విచారాయ నమో నమః
95. వేద వేదాంగ తత్వ ప్రబోధకాయ నమో నమః
96. వేదమార్గ ప్రమాణత్వఖ్యాపకాయ నమో నమః
97. నిర్ణిద్ర తేజోవిజిత నిద్రాద్యాయ నమో నమః
98. నిరంతర మహానంద సంపూర్ణాయ నమో నమః
99. స్వభావ మధురోదార గాంభీర్యాయ నమో నమః
100. సహజానంద సంపూర్ణ సాగరాయ నమో నమః
101. నాదబిందు కళాతీత వైభవాయ నమో నమః
102. వాది భేద విహీనాత్మ బోధనాయ నమో నమః
103. ద్వాదశాంత మహాపీఠ నిషణ్ణాయ నమో నమః
104. దేశకాలా పరిఛ్ఛిన్న దృగ్రూపాయ నమో నమః
105. నిర్మాన శాంతి మహిత నైశ్చల్యాయ నమో నమః
106. నిర్లక్ష్య లక్ష్య సంలక్ష్య నిర్లేపాయ నమో నమః
107. శ్రీ షోడశాంత కమల సుస్థితాయ నమో నమః
108. శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వత్యై నమో నమః

గురువు ప్రవచనాంశ థార

31 Dec, 09:51


శ్రీ క్రోధి నామ సంవత్సర "శ్రీ చాగంటి పురస్కారము"

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు దంపతులు వారి తల్లిదండ్రులైన శ్రీ చాగంటి సుందర శివ రావు గారు, శ్రీమతి సుశీలమ్మ గార్ల పేరు మీద గత ఆరు సంవత్సరములుగా ధర్మాచరణ మరియు ధర్మ పరిరక్షణకు ఎంతగానో పాటుపడుతున్న గొప్ప వ్యక్తులను "శ్రీ చాగంటి పురస్కారము"తో సత్కరిస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రముఖ ఆడిటర్, సేవాతత్పరులు అయిన శ్రీ ఆదిత్య శర్మ గారికి ఈ పురస్కారమును, "ధర్మానుష్ఠాన వరిష్ఠ" బిరుదును ఇచ్చి, శ్రీ శర్మ గారి దంపతులను ఘనంగా సత్కరించారు. ఆదిత్య శర్మ గారు గుప్తముగా, ఏ గుర్తింపును కోరుకోకుండా చేస్తున్న సమాజ సేవ, దేశ భక్తి కార్యక్రమములు, విద్యార్థుల కొరకు చేస్తున్న కార్యక్రమములు ఎంతో ఆదర్శప్రాయమైనవి అని, సనాతన ధర్మమునకు సేవ అత్యంత ప్రధానమైన అంశం కనుక, వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ధర్మమునకు అత్యంత ప్రధానమైనవి అని శ్రీ శర్మ గారు ఈ పురస్కారమునకు పరిపూర్ణముగా అర్హులని శ్రీ చాగంటి వారు తెలియజేసారు.

కాకినాడలోని శ్రీమతి ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో 25-12-2024న జరిగిన ఈ పురస్కార ప్రదానోత్సవ సభలో అనేక మంది పుర ప్రముఖులు, శ్రీ చాగంటి సత్సంగ సభ్యులు పాల్గొన్నారు.

గురువు ప్రవచనాంశ థార

11 Oct, 14:55


గజ వాహన సేవా వైభోగం

గురువు ప్రవచనాంశ థార

11 Oct, 14:55


మహర్నవమి ప్రత్యేక అభిషేకం