తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటలు @lordbalaji Channel on Telegram

తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటలు

@lordbalaji


తెలుగు భక్తి పాటలు మరియు స్తోత్రాలు ఆడియో, వీడియో, డాక్యుమెంట్

తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటలు (Telugu)

స్వాగతం మీరు భక్తికి ప్రాముఖ్యత ఇచ్చే వారిలోకి! తెలుగు భక్తి పాటలతో మీకు విశ్వాస ఉందా? ఈ ఆడియో, వీడియో, డాక్యుమెంట్ కనిపించే చానల్ ద్వారా మీరు ఆప్యత్వం అందించబడింది. @lordbalaji చానల్ ద్వారా తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటల ఆడియో, వీడియో, డాక్యుమెంట్ అనేక విభిన్న రూపాల్లో అందిస్తున్నారు. పురుషుడుగా, స్త్రీలకు భగవంతుని స్తుతించడం వంటి స్తోత్రాలు మరియు భక్తి పాటలు ఈ చానల్ ద్వారా అందిస్తున్నాయి. మీరు భక్తిపూరితంగా ఉండటం కావలసిన సమయంలో ఈ చానల్ నుండి మొబైల్ యokiస్తారు.

తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటలు

21 Nov, 05:01


079b కన్యాదానం సమయాన్ని బట్టి పెళ్లి ముహూర్తం చేయాలి....mp3

తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటలు

15 Nov, 02:13


కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!

వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో, కుంకుమో, అక్షతలో వేయాలి. అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి. ఆరోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. కీటాశ్చ - పురుగులు; మశకాశ్చ - దోమలు, ఈగలు మొదలైనవి, అంతే కాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి. నీటిలో ఉన్న పురుగులు, భూమిమ ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక! వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక! అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుణ్ణి చేరుగాక! అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు. ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం. దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి?

తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటలు

14 Nov, 13:41


https://t.me/lordbalaji

తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటలు

13 Nov, 13:09


కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?

ప్రతివాళ్ళూ ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యధార్దంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇంటి బ్రహ్మగారు వుంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది. ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళమిచ్చి. ఆయన రోజూ దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్నిచోట్లా దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్నిచోట్లా దీపాలు వెలుగుతూ వుండాలి 365 రోజులు! అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి కార్తీక పౌర్ణమి.
అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూంటారు. పదిరోజులొ, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడు తప్పు చేసిన రోజులెన్నెన్ని వున్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.
దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి .మా ఆవిడ వెలిగిస్తుంది .నేను టీవి చుస్తాను అని అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం వుందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమానీ ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిధిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే వుండదుఇక. మొత్తం జనంతో నిండిపోతుంటారుంకొండ చుట్టూ. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రమణులంతటివారు కూడా అసుర సంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలోంపడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవాడు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు.అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి , ఆ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి.
అందుకే కార్తీకపౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మనకొరకే కాకుండా, మనం చేసే దుష్క్ర్తులను పొగొట్టి మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమస్త జీవులనుద్ధరించటానికి పెట్టిన దీపం. కాబట్టి ఆశ్వయుజమాసం చివర వచ్చిన తిధినాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీకపౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనమిచ్చారు.

తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటలు

12 Nov, 01:10


చాతుర్మాస్య is a period of 4 months starting from శయన ఏకాదశి in ఆషాఢ మాస and ending on క్షీరాబ్ది ద్వాదశి in కార్తీక మాస. శయన ఏకాదశి marks the beginning of చాతుర్మాస్య or the four month period of యోగనిద్ర or Yogic meditation for Lord విష్ణు every year. It is believed that this four month period is ideal for ధ్యాన or meditation and sages and monks around Bhārat go to forests and caves to meditate during this four month period. They stay in caves for this four month period, perform ఉపవాస or take one meal a day, bath in holy rivers and perform తపస్ or penance during this period.

This period occurs in the seasons of వర్షఋతు (rainy season), శరదృతు (autumn) and హేమంతఋతు (winter), which is prone to the incidence of diseases because fo rains and cold. Since దక్షిణయన is also not favorable from సత్త్వగుణ point of view, చాతుర్మాస్య allows one to be careful and observe ధ్యానం or meditation and fast regularly. From a scientific point of view, fasting regularly is proved to be good for health, as it gives rest to all organs, overhauls the system and eliminates toxins from the body.