Latest Posts from GSWS LATEST NEWS (@gswslatest) on Telegram

GSWS LATEST NEWS Telegram Posts

GSWS LATEST NEWS
గ్రామ - వార్డ్ సచివాలయం , ప్రభుత్వ కార్యక్రమాల కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లో జాయిన్ కాగలరు.
7,550 Subscribers
2,294 Photos
430 Videos
Last Updated 01.03.2025 16:43

The latest content shared by GSWS LATEST NEWS on Telegram


APRS
APRJC
APRDC
ప్రవేశ ప్రకటన

Official రికార్డ్ లను ఎంత కాలం భద్రపర్చాలి???

Leather Artisans Survey అనేది తోలు కళాకారులకి సంబంధించినది.

అందులో తొలు కళాకారులు అనగా క్రింద ఇవ్వబడిన కేటగిరి వారికి సర్వే చేయవలసి వుంటుంది

Butchers: కసాయి, మాంసం మరియు పౌల్ట్రీ ముక్కలను తయారు చేయడంలో నిపుణుడు, జంతువులను వధించే వారు, దుకాణంలో లేదా సూపర్ మార్కెట్‌లోని మాంసం విభాగంలో పనిచేస్తాడు.

Flayers : చర్మం వలిచే వారు

Cobblers: చెప్పులు కుట్టేవారు

.Dappu Artisans:: డప్పు వాయిద్యాలు తయారు చేసేవాళ్ళు

Businessmen: తోలు ,లెదర్ సంబంధించి వ్యాపారం చేసే వారు.

NOTE:: పెన్షన్ తీసుకునే లబ్దిదారులలొ ఎవరైనా పైన ఉన్న కేటగిరిలలో వున్నట్లయితే వారివి కూడా సర్వే నందు నమోదు చేయవలెను.


http://t.me/GSWSLATEST

https://youtu.be/e2lt69b8PwI?si=67Lv4nenFJOW88Ma

ఏపి బడ్జెట్ కేటాయింపులు

మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్‌ ఫండ్‌ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..

▪️పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు
▪️వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు
▪️పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు
▪️జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు
▪️మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు
▪️విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు
▪️వ్యవసాయానికి రూ.11,636 కోట్లు
▪️సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు
▪️ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు
▪️రవాణా శాఖకు రూ.8,785 కోట్లు
▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులకు రూ.3,377 కోట్లు
▪️పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు,
▪️స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు
▪️ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రాయితీలు రూ.300 కోట్లు
▪️ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు
▪️మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు
▪️తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు
▪️అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు
▪️దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
▪️రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
▪️బాల సంజీవని పథకం కోసం రూ.1,163 కోట్లు
▪️పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ.605 కోట్లు
▪️చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు
▪️RTGSకు రూ.101 కోట్లు
▪️ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు
▪️అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు
▪️పోలవరం కోసం రూ.6,705 కోట్లు
▪️జల్‌జీవన్‌ విషన్‌కు రూ.2,800 కోట్లు
▪️వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
▪️పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
▪️బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
▪️ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
▪️ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
▪️అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు
▪️మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసం రూ.4,332 కోట్లు
▪️వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
▪️పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
▪️ఆర్‌ అండ్‌ బీకి రూ.8,785 కోట్లు
▪️యువజన, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
▪️తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
▪️నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
▪️డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
▪️రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రూ.500 కోట్లు
▪️ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు
▪️ITI, IITల కోసం రూ.210 కోట్లు
▪️దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజనకు రూ.745 కోట్లు
▪️రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ.10కోట్లు
▪️ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు
▪️ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు
▪️మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
▪️ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.

రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడిందన్నారు. అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని చెప్పారు. సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.

http://t.me/GSWSLATEST

Good afternoon to All

All pension transactions status "success".

Please ensure 100% cash withdrawal and update in mobile app.

http://t.me/GSWSLATEST

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 28

సంఘటనలు


1719: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు.

1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.


జననాలు


1922: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (మ.1988)

1928: తుమ్మల వేణుగోపాలరావు, ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు [,మ .2011]

1948: పువ్వుల రాజేశ్వరి, రంగస్థల నటి.

1951: కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు.

1953: పాల్ క్రుగ్మాన్, అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త, రచయిత

1956: రాజేంద్ర ప్రసాద్ (నటుడు), తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు

1969: ఉప్పలపు శ్రీనివాస్, ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు. (మ.2014)

1973: సునీల్, తెలుగు సినిమా నటుడు.

1979: అలీ లార్టర్, అమెరికన్ నటి, ఫ్యాషన్ మోడల్


మరణాలు


1963: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884)

2014: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)

2018: జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి. (జ.1935)

Leather Artisan Survey - Important Note

Dear All

GSWS Employee Mobile App - Leather Artisan Survey కు సంబందించి, కొంతమంది WEAs/WWDS నేరుగా "SUBMIT" option click చేస్తున్నారు.

i) మీ సచివాలయ పరిధిలో వున్న Leather Artisans అందరికి సర్వే పూర్తి చేసిన తరువాత

ii) మీ సచివాలయ పరిధిలో Leather Artisans లేనిచో,

అటువంటి సందర్బంలో మాత్రమే "SUBMIT" option పైన click చెయ్యాలి. గమనించగలరు.

APPSC Group 2 Mains Key Objections Last Day Extended a day until 28th Feb 2025.