నేడు పంజాబ్ కేసరి లలా లజపతి 160 వ జయంతి సందర్భంగా
లాల లజపతి రాయ్ జీవితం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలు రాయి
ప్రార్థన విజ్ఞప్తి అనే కాంగ్రెస్ నినాదాలు ద్వారా దేశానికి స్వాతంత్రం రాదు అని కాంగ్రెస్ పార్టీని నాడు పిటిషన్ కాంగ్రెస్ గా మాత్రమే దానిని పేర్కొని స్వాతంత్ర్య కాంక్ష నాలో సజీవంగా ఉన్నంతవరకు నేను వృద్ధుడిని కాబోను. ఈ స్వాతంత్ర్య కాంక్షను ఏ ఆయుధమూ నరికివేయలేదు, ఏ అగ్నీ దహించివేయలేదు, ఏ నీరూ దానిని ముంచివేయలేదు, ఏ ప్రచండ మారుతమూ దాన్ని విసిరివేయలేదు అంటూ తెల్ల దొరల పాలనపైనా స్వదేశీ ఆయుధం అనే తిరుగుబాటు జెండా ఎగురవేసిన ధీరోదాత్తుడు.
ఆనాటి ప్రజలను ఎందరినో ఆయన భావాలు, త్యాగాలు ప్రభావితం చేశాయి. లాలాజీ పిలుపుతో లక్షలాది మంది భారతీయులు స్వాతంత్య్ర ఉద్యమంలోకి దిగి, ఆ మహా యజ్ఞంలో భాగస్వామ్యం అయినారు.
1928లో యునైటెడ్ కింగ్‌డమ్ భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను నివేదించడానికి సర్ జాన్ సైమన్ నేతృత్వంలో సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.కమిషన్‌ను భారతీయ రాజకీయపార్టీలుబహిష్కరించాయి.ఎందుకంటే ఇందులో భారతీయ సభ్యులుఎవరూ లేరనిదేశ వ్యాప్తంగా నిరసనలువెల్లువెత్తాయి.
సైమన్ కమిషన్ 30 అక్టోబర్ 1928నలాహోర్‌నుసందర్శించినప్పుడుదానికి నిరసనగా లజపత్ రాయ్ పెద్దమార్చ్‌కు నాయకత్వం వహించి "సైమన్ గోబ్యాక్" అనే నినాదాన్ని ఇచ్చారు. నిరసనకారులునల్లజెండాలు చేతబూని నినాదాలు చేశారు.లాహోర్ లోనిపోలీసుసూపరింటెండెంట్, జేమ్స్ ఏ. స్కాట్, నిరసనకారులపై లాఠీఛార్జ్ చేయమని పోలీసులను ఆదేశించాడు, రాయ్‌పై వ్యక్తిగతంగా దాడి చేశాడు.తీవ్రంగా గాయపడినారు ఆ దెబ్బల నుంచి కోలుకోలేక పరమపదించారు
పరాయి పాలనకు బందీఅయిపోయిన మన జాతి ఆత్మను మనం రక్షించుకుని తీరాలిఅందుకు మనం శ్రమించాలిఅంటూ భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ.. కించపరిచేదిగా ఉన్న పాశ్చాత్య విద్యా విధానాన్ని ఈయన తీవ్రంగా నిరసించారు
ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి, వారిని జాతీయోద్యమంవైపు మరల్చి భారత ప్రజలలో స్వతంత్ర ఆకాంక్షను రగిల్చిన ఆయన భారత చరిత్ర లో ధృవతార గా ఘనత చెందారు
For more updates join
http://t.me/GSWSLATEST