1. నేను అపరిమితమైన సమృద్ధి స్థితిలో ఎల్లప్పుడూ జీవిస్తున్నాను. దైవానుగ్రహంతో సులభంగా సంపదను మరియు ఆదాయాన్ని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తున్నాను.
2. నేను ప్రస్తుతం నా అంతర్గత ఆనందాన్ని మరియు ప్రశాంతతని జీవిస్తున్నాను. ఎందుకంటే డబ్బుతో సహా బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా నిజమైన ఆనందం మరియు సంతృప్తి అనేవి నాలోనే సదా ఉన్నాయి కనుక.
3. అధిక సంపద లేదా తాత్కాలిక లోటు అనేవి నా మనశ్శాంతిని కదిలించలేవు. లోపల నుండి ప్రసరించే దివ్యజ్ఞానం నన్ను ఎప్పుడూ సమతుల్యంగా ఉంచుతున్నది. సదా ఈ జ్ఞానం నా జీవితంలో ప్రవహిస్తూ, మరింత స్థిరమైన ప్రశాంతత మరియు సమతుల్యతను నాకు అందిస్తుంది.
4. సమృద్ధిలోనూ, లోటులోనూ - ప్రతీ పరిస్థితిలోనూ దివ్య ప్రేమ శక్తి నా హృదయాన్ని నింపుతూ, అది నాలో ప్రవహిస్తూ - ప్రశాంతత, స్పష్టత మరియు జ్ఞానాన్ని అందిస్తున్నది.
5. నేను ఎంత దివ్యంగా డబ్బు ఇతరులకు అప్పుగా ఇస్తున్నానో, అంతే దివ్యంగా ఇతరుల నుంచి తిరిగి పొందుతున్నాను. నేను డబ్బును ఎంత దివ్యంగా ఖర్చు పెడుతున్నానో అంతే దివ్యంగా డబ్బు నా వద్దకు వస్తున్నది.
6. నా కలల ఇల్లు నా వాస్తవంగా మారిపోయింది. ఈ ఇంటిలో విలాసవంతమైన సౌకర్యాలు మరియు సౌందర్యం నా చుట్టూ ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు, నేను ఈ ఇల్లును ఆనందంగా అనుభవిస్తున్నాను, మరియు భవిష్యత్తులో నేను మరిన్ని ఇలాంటి అద్భుతమైన అనుభవాలను సృష్టించగలను.
7. నేను నా కలల కారును నడుపుతున్నాను. నేను మరింత విలాసవంతమైన వాహనాలను మరియు కావలసిన అన్ని సౌకర్యాలను సులభంగా ఆకర్షించగలను.
8. ప్రతి సంవత్సరం నేను మూడు విలాసవంతమైన world toursని ఎంజాయ్ చేస్తున్నాను. కొత్త ప్రదేశాల యొక్క సంస్కృతులను, ఆహారాలను, సాహసాలను విశ్రాంతిని ఎప్పటికప్పుడు అనుభవిస్తున్నాను.
9. నా జీవితంలో ప్రతీ క్షణాన్ని ఒక విలాసవంతమైన ప్రయాణంగా అనుభవిస్తున్నాను. ఎప్పటినుంచో అనంత కాలం వరకు అనుభవిస్తూనే ఉన్నాను. ప్రతీ క్షణంలోని దివ్య-సమృద్ధిని తనివితీరా అనుభవిస్తున్నాను.
10. డబ్బు నా వైపు సదా సులభంగా ప్రవహిస్తూనే ఉన్నది. అలాగే ఇకపై మరింత సులభంగా ప్రవహించబోతున్నది. ఆనందం, జ్ఞానం, స్పష్టత, సమృద్ధితో కూడిన జీవితాన్ని సృష్టించడానికి నేను దానిని తెలివిగా ఉపయోగిస్తున్నాను.
11. డబ్బు మరియు విజయం ఎల్లప్పుడూ నా వైపు సులభంగా ఆకర్షితమై, నా అత్యుత్తమమైన లక్ష్యాలు సునాయాసంగా నెరవేరుతున్నాయి. ఇప్పుడు నేను ఈ విజయాలను ఆనందంగా అనుభవిస్తున్నాను.
12. నా ఆర్ధిక సమృద్ధి ప్రయాణంలోని ప్రతి దశలో నేను స్థిరంగా, సమతుల్యంగా, ప్రశాంతంగా ఉన్నాను, మరియు ఎప్పటికీ ఉండబోతున్నాను. విశ్వం నాకు ఎల్లప్పుడూ సహకరిస్తున్నది.
13. కలల జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా కలల కారు, విలాసవంతమైన ప్రయాణాలు నా సమృద్ధి జీవితంలో ఒక భాగమయ్యాయి. ప్రస్తుతం, ఈ సమృద్ధిని ఆనందంగా అనుభవిస్తున్నాను.
14. నన్ను ప్రేమగా చుట్టుముడుతూ హత్తుకున్న నా సమృద్ధిశక్తికి అపారమైన కృతజ్ఞతను వ్యక్తం చేశాను. నేను కోరుకున్న ప్రతీది ఎల్లప్పుడూ నా చేరువలో ఉన్నది.
15. సమృద్ధి మరియు సంపదల యొక్క దివ్యశక్తి నా లోపల ఎల్లప్పుడూ ప్రకాశించడం వలన, సులభమైన డబ్బు మరియు సమతుల్యత యొక్క ఆనందమయ జీవితాన్ని నేను జీవిస్తున్నాను.
16. ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నేను ఆనందాన్ని మరియు ప్రశాంతతను అనుభవించాను. నేను నా అంతర్గత సమృద్ధి మరియు దివ్య స్వరూపానికి లోతుగా అనుసంధానమై ఉన్నాను.
17. అపరిమితమైన ఆదాయం, నా కలల ఇల్లు, నా కలల కారు మరియు విలాసవంతమైన సెలవులతో, నేను నా కలల జీవితాన్ని గడిపాను గడుపుతున్నాను, మరియు భవిష్యత్తులో అద్భుతమైన అనుభవాలను నేను సృష్టిస్తాను.
* ఈ జ్ఞాన సూత్రాలను చదువుతున్నప్పుడు మీకు కలిగే మంచి-చెడు-తటస్థ లక్షణాలలో, మనోభావాలలో, ఆలోచనలలో, అనుభూతులలో - మీరు ప్రశాంతంగా స్థిరంగా మౌనంగా అచలంగా ఉండటం వలన, అవి సులభంగా దివ్య శక్తిగా పరివర్తన చెందుతూ, మిమ్మల్ని సచ్చిదానంద స్వరూపంతో ఐక్యం చేస్తూ, విదేహ ముక్తికి సహకరిస్తాయి. *
* రోజూ ఈ మాటల్ని లేదా ఈ జ్ఞాన సూత్రాలను, పొద్దున లేచిన వెంటనే అలాగే రాత్రి పడుకునే ముందు అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు అనుభూతిపూర్వకంగా విశ్వాసంతో అనుకుంటూ ఉంటే, మీకు దైవానుగ్రహం తోడై, మీ కోరికలు సులభంగా నెరవేరుతాయి.**