Telugu inspirational stories quotes & jokes

@telugu_quotes_stories_jokes


Telugu moral & inspirational stories, quotes, jokes & facts

Telugu inspirational stories quotes & jokes

22 Oct, 11:06


ఒక మగవాడు జీవితాంతం ఏమి చేసినా రుణం తీర్చుకోలేనిది మాత్రం ఇద్దరికి.

ఒకటి తనని నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లికి,
రెండు తన ప్రతిరూపమైన బిడ్డలని నవమాసాలు మోసి, కని, పెంచి, ఇచ్చే భార్యకి.
ఇద్దరు చేసింది ఓకే పని,
ఇద్దరు పడింది ఓకే కష్టం,
ఇద్దరు చూపించేది ఓకే ప్రేమ.

ఒకరు తను కళ్ళు తెరవగానే మొదటిగా చూసినవారు.
మరొకరు కళ్ళు మూసేటప్పుడు చివరిగా చూడాలి అనుకునేవారు.
ఎవరు ఎక్కువ కాదు,ఎవరు తక్కువ కాదు.

కాకపోతే

తల్లి అనే బంధం ఎవరెస్ట్ శిఖరం లాంటిది,
ప్రతి భార్య చేరుకోవాలి అనుకునే గమ్యం కూడా అదే ......
అయితే భార్య ప్రయాణం కొత్తలో భర్త యొక్క తల్లి స్థానం అందనంత ఎత్తులో ఉన్నట్టు ఉంటుంది.

కానీ

ఒకసారి భార్య కూడా తల్లి అయ్యి ఆ శిఖరం అధిరోహించాక అప్పుడు
తల్లి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది,
ముందు తల్లికి కొడుకు అయ్యాకే,
తనకి భర్త కాగలిగాడు అనే నిజం భార్యకి అర్థమవుతుంది....

ఒక మగవాడి జీవితంలో తల్లి భార్య ఇద్దరు ముఖ్యమే.ఇద్దరిలో ఎవరు వారిది వారిలో ఏ స్థానం తగ్గిన మగవాడి జీవితం తలకిందులు అవ్వుతుంది. 🍁

Telugu inspirational stories quotes & jokes

18 Oct, 16:50


కారు ఆగిపోయింది .
అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి .
దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది .
స్టెఫినీ ఉందికానీ తనకు వెయ్యడంరాదు.
రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు .
సమయం చూస్తే ...
సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి .
మనసులో ఆందోళన. ఒక్కతే ఉంది. తోడు ఎవరూ లేరు.
చీకటి పడితే ఎలా?

దగ్గరలో ఇళ్ళు లేవు. సెల్ పనిచెయ్యడం లేదు( సిగ్నల్స్ లేవు ).
ఎవరూ కారునూ, పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు.
అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది. ఎలారా దేవుడా అనుకుంటూ ...
భయపడడం మొదలయ్యింది. చలి కూడా పెరుగుతోంది.

అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది.
ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటంతో ...
ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను?
ఎందుకు వస్తున్నాడు? ఏమి చేస్తాడు?
ఆందోళన !

అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు?
టైర్ లో గాలి లేదని చూశాడు. ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు.
"భయపడకండి. నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను.
బాగా చలిగా ఉంది కదా! మీరు కారులో కూర్చోండి.
నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు.
ఆమె భయపడుతూనే ఉంది.

"నా పేరు బ్రియాన్.
ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను" అన్నాడు.
అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని ...
కారు కిందకి దూరి జాకీ బిగించాడు.
తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో ...
జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు.
ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు.

"మీరు కాదనకండి. మీరు ఈ సహాయం చెయ్యక పోతే ...
నా పరిస్థితిని తలుచుకుంటే ... నాకు భయం వేస్తోంది" అంది.
"నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు.
మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ... ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే ...
నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి" అని వెళ్లి పోయాడు.
V
మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ...
ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది.
అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది.
తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది.
ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి.

అదొక చిన్న హోటల్.
కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది.
ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది.
డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది.
బరువుగా నడుస్తోంది.
అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవడం,
సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని ... చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది.
ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు.

ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది.
చిరునవ్వుతో “ఏమి కావాలండి?” అని అడిగింది.
అంత శ్రమ పడుతూ కూడా ...
చెరిగిపోని చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో? అని,
ఆశ్చర్య పడుతోంది, తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది.
భోజనం చేసి ఆమెకు ... 1000 రూపాయల నోటు ఇచ్చింది.
ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..
ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద ...
నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి.

ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు.
అందులో ఇలా ఉంది ...
“చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది.
నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే ...
నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది.
నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ ...
నేను నీకు సహాయపడుతున్నాను.
నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు." అని రాసి ఉంది..

హోటల్ మూసేశాక ఇంటికి వచ్చింది.
అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది.
గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది.
అతడి పక్కన మంచం మీదకు చేరుతూ ...
“మనం దిగులుపడుతున్నాం కదా ... డెలివరీకి డబ్బులెలాగా అని.
ఇక ఆ బెంగ తీరిపోయిందిలే, బ్రియాన్!
భగవంతుడే మనకు సహాయం చేశాడు.
ఆయనకి కృతజ్ఞతలు” అంది ప్రశాంతంగా.

మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.
మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది.🍁
.🙏🙏🙏

Telugu inspirational stories quotes & jokes

18 Oct, 16:28


ఫ్రెండ్స్ జీవితం..#సంతోషంగా ముందుకి సాగాలంటే..!!
ఏమి చేయాలి.... అంటే!
మనం...
కొన్నింటిని "మర్చిపోవాలి"...!!
కొన్నింటిని "#మార్చుకోవాలి "..!!

కొందరిని వద్దు"అనుకోవాలి "..!!
కొందరిని #మన "అనుకోవాలి "

బాధలను మనం "తట్టుకోవాలి "...!!
ఎవర్నీ బాధ పెట్టకుండా "ఉండాలి "..!!
అప్పుడే #లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది.!!💛❤️🍁

Telugu inspirational stories quotes & jokes

18 Oct, 15:12


బతుకు చావటానికి కాదు. బతకడానికి, బతికించడానికి' అని సూటిగా చెప్పారో రచయిత ఈ మాటలకి ఎంతో అర్థం, అంతరార్థం పరమార్థం ఉన్నాయి.

జీవితాన్ని ఆసాంతం, సహజమైన మరణం వచ్చేవరకు జీవించాలి. అలా జీవించడంలోనే మనిషి వివేకం, విజ్ఙతలుంటాయి.

బతుకును అర్ధాంతరంగా ముగించకూడదు. సుఖాలను ఎలా అనుభవించామో, దుఃఖాలనూ అలాగే తట్టుకోవాలి. స్థితప్రజ్ఞత అంటే ఇదే.

🌿జీవితం చీకటి వెలుగుల సమ్మిళితం ఒకదాని నొకటి అనుసరిస్తుంటాయి. ఏదీ శాశ్వతం కాదు. ఇది ప్రకృతి ధర్మం. జీవితంలోని ఆనంద విషాదాలకు ఇదే వర్తిస్తుంది.

చాలామంది ఆనందంలో పట్టపగ్గాలు లేకుండా పొంగిపోతూ ఒళ్లు మరచిపో తుంటారు. కానీ విషాదాన్ని మాత్రం తట్టుకోలేక, తల్లడిల్లిపోతుంటారు. మనసు కుదురు కోల్పోతుంది. భరించలేక చావటానికి సిద్ధమవుతారు. బతుకును జర్దాంతరంగా ముగిం చాలనుకునేవారు పిరికివాళ్లు.

👉ఈ దుఃఖం, బాధ అనే అంధకారం తొలగి, ఆనందపు ఉదయరేఖలు తమ జీవితంలో ప్రసాదిస్తాయనే సంగతే మరచిపోతారు. ఈ శక్తలన్నీ ఆ క్షణంలో నశిస్తాయి. యుక్తాయుక్త విచక్షణ పోతుంది మనసు పెలుసు అవుతుంది. జీవితాన్ని అంతం చేసుకోవాలనిపిస్తుంది.

👉'మనిషి ఓ అద్భుతసృష్టి ఈ జీవకోటిలో శ్రేష్టడు, శక్తిపరుడు, యుక్తిపరుడు' అంటాడు షేక్స్పియర్. అంతే కాదు. ఈ సృష్టిలో అద్భుత మైన ఆలోచనాశక్తి కలిగి ఆ మేధను నిరంతరు పదును పెట్టుకునేవాడు మనిషి ఒక్కడే..

గుర్తుపెట్టుకో.. నీ విలువ తెలుసుకో..🍁

Telugu inspirational stories quotes & jokes

16 Oct, 17:07


🌿జీవితం అంటే ఏమిటి?

జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మూడు ప్రదేశాలు ఉన్నాయి:

- ఆసుపత్రి
- జైలు
- శ్మశానవాటిక

🌿ఆరోగ్యం కంటే మెరుగైనది ఏదీ లేదని ఆసుపత్రిలో మీరు అర్థం చేసుకుంటారు.
🌿స్వేచ్ఛ ఎంత విలువైనదో జైల్లో చూస్తారు.
🌿మరియు శ్మశానవాటికలో జీవితం ఏమీ లేదని మీరు గ్రహిస్తారు.

👉నేడు మనం నడిచే భూమి రేపు మనది కాదు.

*ఇక నుండి మర్యాదగా ప్రవర్తిద్దాం.🍁

Telugu inspirational stories quotes & jokes

15 Oct, 12:55


ఓ చిన్న పిల్లాడు ఆ రోజు తన తల్లితో పాటు వెళ్ళాడు.

పంట పనిలో మునిగిపోయిన తల్లిని చూస్తూ ఉండగా కొన్ని అందమైన సీతాకోకలు అతడిని ఆకర్షించాయి.

వాటిని పట్టుకునే ప్రయత్నంలో ఆ పిల్లవాడు వాటి వెనుకే చాలా దూరం వెళ్ళిపోయాడు. అవన్నీ మాయమయ్యాక కాని అర్థం కాలేదు తన తల్లి నుండి చాలా దూరం వచ్చాను అని.

గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఎవరైనా కాపాడండి. నన్ను మా అమ్మ దగ్గర చేర్చండి అని. అటుగా ఒక వ్యక్తి వస్తుండగా ఈ పిల్లవాడి అరుపులు విని నేను నిన్ను మీ అమ్మ దగ్గర చేరుస్తాను, మీ అమ్మ ఎలా ఉంటారు అని అడిగాడు.

అందరి కంటే మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అని అన్నాడు ఆ పిల్లవాడు.

ఎదురుగా ఒక అందమైన స్త్రి ఎదురవగానే ఈమేనా అని అడిగాడు అతను.

కాదు మా అమ్మ ఇంకా అందంగా ఉంటుంది అన్నాడు.

సరే అని ఇంకాస్త దూరం వెళ్ళగా మరో ఇద్దరు ఎదురయ్యారు వాళ్ళు చాలా అందంగా ఉన్నారు.

కచ్చితంగా వీళ్ళలో ఒకళ్ళు ఈ పిల్లాడి తల్లి అయ్యుంటుంది అని అదిగో మీ అమ్మ అని చూపేట్టాడు అతను.

వీళ్ళు కూడా కాదని అన్నాడు. వారి వెనుక ఒక ఆమె ఏడుస్తూ వస్తుంది.ఆమెను చూసి అమ్మా అంటూ పరిగెత్తాడు ఆ పిల్లాడు.

ఇతడికేమో ఆశ్చర్యం, ఆమె చూడడానికి నల్లగా ,పళ్ళు ఎత్తుగా ఒక కన్ను వాచినట్టు, మాటలు రాక మూగసైగలతో కనిపించింది.

ఆ పిల్లాడిని చూసి ఈవిడా నువ్వు చెప్పిన అందగత్తే అని ఎగతాళిగా అడిగాడు ఆ వ్యక్తి.

అవును మా అమ్మ అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది , ఆకలి అని అడగక ముందే నాకు అన్నం తినిపిస్తుంది. ఈమెకంటే ఇంకెవరు అందగత్తే అని అడిగాడు.

రంగు రూపే అందం అనుకునే అతడికి

ఒక్కసారిగా దేహసౌందర్యానికంటే మించిన అందం మనసు అని తెలియజేసిన ఆ పిల్లాడిని చూసి సిగ్గుతో తలదించుకున్నాడు.

పిల్లలకెప్పుడు అమ్మే అందగత్తే,
నాన్నే హీరో..🍁

Telugu inspirational stories quotes & jokes

14 Oct, 00:59


🍁దేవుడి కంటే గొప్ప!🍁

పూర్వం ఒక రాజు ప్రజలను కన్న పుబిడ్డల్లా ఆదరిస్తూ వారి మన్ననలు అందుకుంటున్నాడు. అయితే.. పండితులను పిలిచి 'నేను ఎవరికీ ఏ ఇబ్బందీ కలగకుండా చూస్తుంటున్నాను. నా పాలనలో ప్రజలు సుఖసౌఖ్యాలతో ఉన్నారు కనుక నేను భగవంతుడితో సమానం కదా!' అనేవాడు.

రాజు వల్ల లబ్ది పొందేవారు, ఆయనతో విరోధం ఇష్టంలేని వారు.. 'అవును, మీరు దేవుడే అంటూ పొగిడే వారు. కానుకలు అందుకునేవారు. అలా ప్రశంసించడం ఇష్టం లేనివారు మౌనంగా - ఉండిపోయేవారు. అంతేతప్ప నిజం చెప్పడానికి ఎవరూ సాహసించలేదు.
ఎవరెన్ని రకాలుగా చెప్పినా రాజుకి సంతృప్తి కలగలేదు. వారి మాటల్లో నిజాయితీ కనిపించలేదు.

ఇలాంటి సమయంలో ఒక సాధువు రాజదర్శనానికి వచ్చాడు. అతడి కళ్లలో కాంతి చూశాక తనకు సరైన జవాబు చెప్పగలడు అనిపించింది. అతిథి మర్యాదల అనంతరం 'మహాత్మా నేను దేవుడితో సమానమా, కాదా? నిర్మొహమాటంగా చెప్పండి' అనడిగాడు.

సాధువు తడుముకోకుండా 'రాజా! ' నువ్వు భగవంతుడితో సమానం కానేకాదు' అన్నాడు. అది విని విస్తుపోయాడు రాజు.

అంతలోనే సాధువు గొంతు సవరించుకుని 'అంత కంటే ఎక్కువే అన్నాడు. ఆ మాటతో ఉప్పొంగిపోయాడు రాజు. కానీ ఇందులో ఏదో మెలిక ఉందనిపించి 'ఎలా?' అనడిగాడు.

సాధువు నవ్వి- 'నువ్వు ఆగ్రహిస్తే రాజ్య బహిష్కరణ చేయగలవు. దేవుడలా చేయలేడు! ఈ రాజ్యమొక్కటే కాదు, లోకమంతా తనదే అయినా బహిష్కరించడు మరి' అంటూ బదులిచ్చాడు.

ఆ మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించిన రాజు ఇన్నాళ్లూ అహంకారంతో సృష్టికర్తను తక్కువగా అంచనా వేసినందుకు సిగ్గుపడి సాధువుకు నమస్కరించాడు.🍁

Telugu inspirational stories quotes & jokes

10 Oct, 11:36


డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి.

ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు.

ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు. కారణం ఆ నాల్గవ వ్యక్తి #రతన_టాటా.

'' సార్ , మీరు ? '' '' అవును , మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? '' అన్నారు రతన్ టాటా.

[ Respect to Time is Respect to Life ]

TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది ! 🍁

Telugu inspirational stories quotes & jokes

10 Oct, 05:55


కోపం వస్తుందా!

"కారణం లేకుండా ఎవరికీ కోపం రాదు. అయితే ఎప్పుడో గాని కోపానికి సరైన కారణం ఉండదు" అన్నాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, 'సరైన కారణం అనేదే కీలకం. కాబట్టి కోపం ముంచుకొచ్చినప్పుకల్లా ఒక్కక్షణం ఆగి, మన కోపానికి తగిన కారణం ఉందో లేదో చూసుకుంటే చాలు.

అది కేవలం ఉద్వేగానికి చెందిందా, ధర్మానికి చెందిందా అనేది మనకే తెలిసిపోతుంది. దాన్నిబట్టి ఆగ్రహించాలో. - నిగ్రహించాలో తేల్చుకోవచ్చు.

కోపం, దుఃఖలు, భయం, వంటి అరంటిని ప్రాథమిక భావోద్వేగాలుగా చెబుతుంది మనస్తత్వ శాస్త్రం. వాటికి తక్షణమే స్పందించేది మెదడులోని 'లింబిక్ లోబ్'. అప్పుడు 'ఎడ్రినలిన్'' అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది మనిషిని అసంకల్పిత చర్యలకు ప్రేరేపిస్తుంది.

ఆ మధ్య ఒక బాలిక తన తల్లిపైకి దూసుకొచ్చిన ఆటోను అమాంతం ఎత్తేసి అమ్మను రక్షించుకొన్ని సంఘటనను సామాజిక మాధ్యమాల్లో చూశాం. అంటే భయమనే భావోద్వేగాన్ని అంతర్గత శక్తిగా ఆవిష్కరించిందామె. నేనెత్తగలనా అన్న ఆలోచనే లేకుండా అంత బరువునూ ఎత్తిపడేసింది. అలా. మనిషిలో కోపాన్నీ ఆయుధంగా, శక్తిగా మార్చుకోవడం సాధ్యమే అంటారు మనస్తత్య నిపుణులు.

అలా కోపాన్ని నిగ్రహించుకోవడంగాని. ఒక ఆయుధంగా మార్చుకోవడం గాని ఎప్పుడు సాధ్యమవుతున్దంటే భావోద్వేగ సంయమనాన్ని (ఎమోషనల్ బ్యారెన్సింగ్) సాధన చేసిన ప్పుడు దానికి మనిషిలోని వివేకం ఆధారం.

నిగ్రహానికి పునాది భావోద్వేగ వివేకం(ఎమోషనల్ ఇంటెలిజెన్స్). కోపాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించడం కోసం పనిగట్టుకొని దాన్ని పిలవడమే ఫ్రాంక్లిన్ చెప్పిన 'సరైన కారణం.. భయంలో, దుఖంలో, కోపంలో మునిగిపోయినప్పుడు మనిషి దేహంలో వణుకు రావడానికి కారణమయ్యేది ఈ ఎడ్రినలినే, ధర్మాగ్రహం విషయంలో శక్తిగా మారుతుందని అర్ధం.

🌿కోపం దానినంతట తానే వచ్చినప్పుడు, అదే మనిషిని శాసిస్తుంది. ప్రతీకారానికి ప్రేరేపిస్తుంది. కానీ, కోపాన్ని మనం పిలిచినప్పుడు. అదే ఎడ్రినలిన్ మన చేతిలో ఆయుదం అవుతుంది. కోపం రావడమా, తెచ్చుకోవడమా ఏది మేలంటారు?.🍁