Tirumala Tirupati Devasthanams @tirumalatirupatidevasthanams Channel on Telegram

Tirumala Tirupati Devasthanams

@tirumalatirupatidevasthanams


Ttd darshanam updates, ttd darshan timings, Latest Tirumala Tirupati Devasthanams News and Updates, Special Reports, Videos & Photos of Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanams (English)

Welcome to the official Telegram channel of Tirumala Tirupati Devasthanams! Are you a devotee of Lord Venkateswara and looking for the latest updates, news, and information about the Tirumala Tirupati temple in India? Look no further! This channel is dedicated to providing you with all the essential details about the temple, including upcoming events, rituals, festivals, and much more. Stay connected with us to receive daily updates and live darshan of the deity from the comfort of your home. Join us on this spiritual journey and immerse yourself in the divine aura of Lord Venkateswara. Don't miss out on the opportunity to be a part of this sacred community. Subscribe to our channel now and experience the blessings of Tirumala Tirupati Devasthanams!

Tirumala Tirupati Devasthanams

13 Jan, 07:27


🎻🌹🙏 శ్రీవారి ఆలయం ముందు 🔥 భోగి సంబరాలు..

శ్రీవారి భక్తులందరికీ భోగి శుభకాంక్షలు 🌞🙏🌹🎻

Tirumala Tirupati Devasthanams

13 Jan, 07:26


తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్స్ ప్రస్తుతం 14వ తేదీకి సంబంధించి టికెట్స్ ఇస్తున్నారు.. ఈ టికెట్స్ మరొక గంటలో అయిపోతాయి.. అవి పూర్తి కాగానే 15వ తేదీకి సంబంధించి టికెట్స్ ఇస్తారు.
శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో ఈ టికెట్స్ ఇస్తున్నారు. టికెట్స్ లేకుండా దర్శనానికి అనుమతి లేదు.. శ్రీవారి మెట్టు, అలిపిరి మెట్ల మధ్యలో టికెట్స్ ఇవ్వడం లేదు.. cro ఆఫీస్ దగ్గరనే రూమ్ తీసుకోవాలి.

Tirumala Tirupati Devasthanams

12 Jan, 12:15


ఓం నమో వేంకటేశాయ
ప్రస్తుతం తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద చాలా ఖాళీగా ఉంది ఆఫ్లైన్లో రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి చాలా తొందరగా రూమ్స్ అలాట్ అవుతున్నాయండి.

అంటే రూమ్ రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ మొత్తం కూడా 30 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది కావున ప్రస్తుతం ఎవరైతే తిరుమల కొండపై ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.

ఓం నమో వేంకటేశాయ

Tirumala Tirupati Devasthanams

11 Jan, 16:44


Tirumala Latest Update
(Must Share The info)

తిరుమల

టీటీడీ భక్తులకు యథావిధిగా వైకుంఠద్వార దర్శనాలు

13 నుంచి 19 వరకు టోకెన్లు ప్రతిరోజూ ఇవ్వాలని నిర్ణయం

🛑మరికొన్ని గంటల్లో 13వ తేదీకి సంబంధించిన సర్వదర్శన టోకెన్లు జారీ చేయబోతున్న టీటీడీ


తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, టోకెన్లు జారీ,రద్దీ అనుగుణంగా అదనంగా
రామచంద్ర పుష్కరిణిలో టోకెన్ల జారీకి ఏర్పాట్లు...

Tirumala Tirupati Devasthanams

29 Dec, 12:31


- జనవరి 09: చిన్న శాత్తుమొర.
- జనవరి 10: వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం.
- జనవరి 11: వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం.
- జనవరి 15: ప్రణయ కలహోత్సవం మరియు గోదా పరిణయం.
- జనవరి 17: తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- జనవరి 18: శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం.
- జనవరి 19: పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.
- జనవరి 20: శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- జనవరి 23: అధ్యాయనోత్సవాలు సమాప్తం.
- జనవరి 24: తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు.
- జనవరి 25: సర్వ ఏకాశశి జనవరి 26: గణతంత్ర దినోత్సవం.
- జనవరి 27: మాస శివరాత్రి.
- జనవరి 29: శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు.ఈ

Tirumala Tirupati Devasthanams

26 Dec, 16:09


♦️ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష సమావేశం

2025 జనవరి 10 నుండి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు

- వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ.

- పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి.

- కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతి.

- ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

- చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.

- గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.

- వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు.

- భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు.

- ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకుని అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ గా ఉంచుకునేందుకు చర్యలు.

- పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశం.

- ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు.

- చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు.

- విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు.

- భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగు నీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ.

- వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు. పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు.

- తిరుమలలో శోభాయమానంగా విద్యుద్దీపాలు, పుష్పాల అలంకరణపై ప్రత్యేక దృష్టి.

- మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్&గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala Tirupati Devasthanams

26 Dec, 03:06


♦️ తిరుపతి, తిరుమలలో జనవరి 9 న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ : టిటిడి ఈవో

– జనవరి 10, 11, 12 తేదీలకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు
– ⁠ఈ టోకెన్లు జనవరి 9 వ తేదీన ఉదయం 5 గంటలకు జారీ.
– మూడు రోజుల తర్వాత ఏరోజుకారోజు ముందు రోజు జారీ
– టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు

•⁠ ⁠తిరుప‌తిలోని 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంట‌ర్ల‌ను త‌నిఖీ చేసిన టిటిడి ఈవో, అదనపు ఈవో

తిరుపతి, 2024 డిసెంబర్ 25: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జనవరి 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో శ్రీ శ్యామలరావు వెల్లడించారు.

జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.

తిరుప‌తిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో తిరుమల స్థానికుల కొరకు కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.

కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భ‌క్తుల‌కు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివ‌రించారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి.

తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, టిటిడి జేఈవో శ్రీమతి గౌతమి, జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీ శ్రీధర్ లతో కలిసి ఈవో తనిఖీ చేశారు.

ఈవో వెంట సీఈ శ్రీ స‌త్య‌నారాయ‌ణ, ఎస్.ఈ శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, శ్రీ మనోహర్, ట్రాన్స్ ఫోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, తదితర టిటిడి అధికారులు, పోలీసు, రెవిన్యూ అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala Tirupati Devasthanams

26 Dec, 03:04


🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*


*తిరుమల సమాచారం*

*26-డిసెంబర్-2024*
*గురువారం*


🕉️ *తిరుమలలో పెరిగిన భక్తుల రద్ది*


🕉️ నిన్న *25-12-2024* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,301* మంది...


🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *26,242* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *4.14* కోట్లు ...


🕉️ ఉచిత సర్వ దర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు...

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *20* గంటల సమయం...

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి *9* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు....


🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి *4* గంటల సమయం...


🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *4* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

Tirumala Tirupati Devasthanams

26 Dec, 02:58


వైకుంఠ ఏకాదశి టికెట్స్
మొదటి మూడు రోజులుకు అంటే 10, 11,12 వ తారీఖు లకు   జనవరి 08 అర్ధరాత్రి 12 గంటల నుండి టికెట్స్ ఆయిపోయేంత వరకు 09 కౌంటర్లులలో  జారిచేస్తారు.

మిగిలిన రోజులకు అనగా 13 నుండి 19 వరకు.. తిరుపతి లో విష్ణు నివాస, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే టికెట్స్ ఇస్తారు

Tirumala Tirupati Devasthanams

26 Dec, 02:58


⚠️ వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు ఇచ్చే ప్రదేశాలు


🔅 జీవకోన జడ్పీ హైస్కూల్
🔅 Mr పల్లి z p హైస్కూల్
🔅రామచంద్ర పుష్కరిణి
🔅రామానాయుడు హైస్కూల్
🔅తిరుపతిలో ఇందిరా మైదానం
🔅 తిరుపతిలో శ్రీనివాసం
🔅 రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం
🔅 అలిపిరి భూదేవి కాంప్లెక్స్

తిరుమలలో

🔅 బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్


👉 ఆ పది రోజులు శ్రీవారి మెట్టు మార్గంలో ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వరు....

👉 భక్తులు ఈ విషయం గమనించి పైన పేర్కొన్న ప్రదేశాలలో మాత్రమే వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు పొందండి.

Tirumala Tirupati Devasthanams

24 Dec, 02:18


వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేయడమైనది.

డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.

డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు.

ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్ లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడమైనది.
----------------------------------------
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Tirumala Tirupati Devasthanams

17 Dec, 22:27


Tirumala Tirupati Devasthanams pinned «♦️వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ సమీక్ష 23న వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల 24న ఎస్ఈడీ టికెట్లు విడుదల వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం…»

Tirumala Tirupati Devasthanams

17 Dec, 13:00


♦️వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ సమీక్ష

23న వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల

24న ఎస్ఈడీ టికెట్లు విడుదల

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు

- 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల.

- 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల‌‌.

- జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్ డి టోకెన్లు కేటాయింపు.

- తిరుపతిలో ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు.

- టోకెన్ జారీ కేంద్రాలు వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈకి ఆదేశం.

- టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు. కానీ దర్శన క్యూ లైన్లలోకి అనుమతించరు.

- వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం.

- వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు.

- వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వర్ణ రథం.

- వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుండి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.

- గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.

- వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన.

- ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం.

- టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ.

- లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో3.50 లక్షల లడ్డూలు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు.

Tirumala Tirupati Devasthanams

16 Dec, 16:44


♦️ *శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల మార్చి నెల కోటా విడుదల*

♦️ తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబ‌రు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

♦️ మార్చి నెల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబ‌రు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

♦️వర్చువల్ సేవలు మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

♦️డిసెంబరు 23న‌ మార్చి నెల అంగప్రదక్షిణం టోకెన్లు…. ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

♦️శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్ లైన్ కోటాను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

♦️వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

♦️మార్చి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

♦️తిరుమల, తిరుపతిల‌లో మార్చి నెల గదుల కోటాను డిసెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

Tirumala Tirupati Devasthanams

16 Dec, 06:04


•⁠ ⁠భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు.

•⁠ ⁠గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.

•⁠ ⁠భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.

•⁠ ⁠మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు.

•⁠ ⁠3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala Tirupati Devasthanams

16 Dec, 06:03


జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు

అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు

టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి

తిరుమల, 2024 డిసెంబరు 14: శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.

భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు

•⁠ ⁠దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.

•⁠ ⁠చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.

•⁠ ⁠ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు.

Tirumala Tirupati Devasthanams

14 Dec, 09:46


OM NAMO VENKATESAYA🙏
👉Total pilgrims who had darshan on 13.12.2024: 63,722
👉Tonsures: 22,225
👉Hundi kanukalu : 3.77 Cr
👉Waiting compartments… 7
👉Approx. Darsan Time for Sarvadarshanam (without SSD Tokens)… 09 Hrs

Tirumala Tirupati Devasthanams

09 Dec, 04:09


⚠️ తిరుపతిలో ఉదయం 2 గంటల నుంచి ఉచిత దర్శనం టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు

🔔 శ్రీనివాసం - తిరుపతి

🔔 విష్ణు నివాసం - తిరుపతి


అలిపిరి భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఉదయం 3 గంటల నుండి ఇస్తారు

శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఉదయం 5 నుండి ఆ నడకదారిలో ఇస్తారు

Tirumala Tirupati Devasthanams

03 Dec, 02:11


🎻🌹🙏 తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సందర్బంగా ..🌞🙏🌹🎻

శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనం పై దర్శనం...🌞🙏🌹
🎻

Tirumala Tirupati Devasthanams

01 Dec, 05:05


♦️ *స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం : టిటిడి*

*డిసెంబర్ 1న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియం లో , తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ* ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

Tirumala Tirupati Devasthanams

25 Nov, 04:57


Tirumala Tirupati Devasthanams pinned «♦️ తిరుమల ఫిబ్రవరి నెల టికెట్స్ విడుదల తేదీలు 👉 వర్చువల్ సేవలు, సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 👉 అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.…»

Tirumala Tirupati Devasthanams

25 Nov, 04:57


Tirumala Tirupati Devasthanams pinned «♦️ వైకుంఠ ఏకాదశి మరియు వైకుంట ద్వార దర్శనం 2025* 👉🏻 2025లో వైకుంట ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి నాడు జనవరి 10 నుండి ప్రారంభమవుతుంది మరియు మొత్తం 10 రోజుల పాటు జనవరి 19 వరకు ఇవ్వబడుతుంది. ♦️ అన్ని రోజువారీ ఆర్జిత సేవలు, 1వ ద్వారం లక్కీ డిప్ సేవలు, అంగప్రదక్షిణ…»

Tirumala Tirupati Devasthanams

25 Nov, 04:57


తిరుమల సమాచారం...

2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు...

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం...

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,737 మంది భక్తులు...

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్లు...

Tirumala Tirupati Devasthanams

22 Nov, 22:44


♦️ వైకుంఠ ఏకాదశి మరియు వైకుంట ద్వార దర్శనం 2025*
👉🏻 2025లో వైకుంట ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి నాడు జనవరి 10 నుండి ప్రారంభమవుతుంది మరియు మొత్తం 10 రోజుల పాటు జనవరి 19 వరకు ఇవ్వబడుతుంది.

♦️ అన్ని రోజువారీ ఆర్జిత సేవలు, 1వ ద్వారం లక్కీ డిప్ సేవలు, అంగప్రదక్షిణ, 1 ఏళ్లలోపు శిశు దర్శనం, సీనియర్ సిటిజన్లు, శారీరక వికలాంగుల దర్శనం, VIP ప్రోటోకాల్ దర్శనాలు, VIP సిఫార్సు లేఖ దర్శనాలు, వర్చువల్ సేవా దర్శన్‌లు, NRI, రక్షణ దర్శకులు, సిబ్బంది-అల్లరు. ఈ సమయంలో దర్శనాలు మరియు టికెట్ లేని సర్వదర్శనం రద్దు చేయబడతాయి. అవి మళ్లీ జనవరి 20, 2025 నుండి పునఃప్రారంభించబడతాయి.

♦️ ఉచిత SSD, 300SED, 10300 శ్రీవాణి ట్రస్ట్ నాన్-బ్రేక్ దర్శనం మాత్రమే అనుమతించబడుతుంది. శ్రీవాణి టికెట్ హోల్డర్లు కూడా జయ విజయ వరకు మాత్రమే అనుమతించబడతారు, అంటే 300 మంది అదే దర్శనం వరకు, వారి లైన్ చాలా తక్కువ రద్దీగా ఉంటుంది.

♦️ గత సంవత్సరం 300SED టిక్కెట్లు 16 నవంబర్ 2023న వైకుంఠ ఏకాదశికి 23 డిసెంబర్ 2023 నుండి జారీ చేయబడ్డాయి.

♦️ కావున వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు సంబందించి అధికారిక ప్రకటన వచ్చినంత వరకు వేచి వుండగలరు 🫱🏻‍🫲🏻

🙏🏻 .. ఓం నమో వేంకటేశాయ .. 🙏🏻

Tirumala Tirupati Devasthanams

22 Nov, 03:55


తిరుమల సమాచారం...

19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు...

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం...

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,803 మంది భక్తులు...

తలనీలాలు సమర్పించిన 21,930 మంది భక్తులు...

హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు...

Tirumala Tirupati Devasthanams

21 Nov, 22:09


♦️రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంపు
తిరుమల, 2024 నవంబరు 21: రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 100 నుండి 200 కు పెంచింది.

ఈ మేరకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు.

అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుండి 800 కు తగ్గించడం జరిగింది. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు.

కాగా ఈ విధానం రేపటి నుండి అమలులోకి రానుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది.

Tirumala Tirupati Devasthanams

21 Nov, 05:44


Tirumala Tirupati Devasthanams pinned «♦️ తిరుమల ఫిబ్రవరి నెల టికెట్స్ విడుదల తేదీలు 👉 వర్చువల్ సేవలు, సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 👉 అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.…»

Tirumala Tirupati Devasthanams

21 Nov, 05:43


♦️ తిరుమల ఫిబ్రవరి నెల టికెట్స్ విడుదల తేదీలు

👉 వర్చువల్ సేవలు, సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

👉 అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

👉 శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల ఆన్ లైన్ కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తారు.

👉 వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

👉 ఫిబ్రవరి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

👉 తిరుమల, తిరుపతిల‌లో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

👉 నవంబర్ 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

Tirumala Tirupati Devasthanams

20 Nov, 06:48


300/-) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం.

•⁠ ⁠తిరుమ‌ల‌లో గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద విశాఖ శ్రీ శార‌ద పీఠానికి చెందిన మ‌ఠం నిర్మాణంలో అవ‌క‌త‌వ‌క‌లు, ఆక్ర‌మ‌ణలు జ‌రిగిన‌ట్లు టిటిడి అధికారుల క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భ‌వ‌నం లీజును ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యం.

•⁠ ⁠బ్ర‌హ్మోత్స‌వాలలో విశేష సేవ‌లు అందించిన ఉద్యోగుల‌కు గ‌త సంవ‌త్స‌రం ఇచ్చిన బ్ర‌హ్మోత్స‌వ బ‌హుమానాన్ని 10 శాతం పెంచాల‌ని నిర్ణ‌యం. త‌ద్వారా రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు రూ.15,400/-, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు రూ.7,535/- బ్ర‌హ్మోత్స‌వ బ‌హుమానం.

•⁠ ⁠శ్రీ‌వారి ఆల‌యంలో లీకేజీల నివార‌ణ‌కు, అన్న ప్ర‌సాద కేంద్రం ఆధునీక‌ర‌ణ‌కు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ. ఈ ప‌నులు ఉచితంగా చేయ‌నున్న టీవీఎస్ సంస్థ‌.

Tirumala Tirupati Devasthanams

20 Nov, 06:48


TIRUMALA, 18 NOVEMBER 2024: The TTD board in its maiden meeting under the Chairmanship of Sri B R Naidu has taken some important decisions on Monday.

After the completion of the board meeting at Annamaiah Bhavan in Tirumala, the TTD board Chief along with the EO Sri J Syamala Rao briefed the decisions to the media. Some excerpts:

Reducing the darshan time of Sri Venkateswara Swamy from 20-30hours to 2-3hrs using Artificial Intelligence and advanced technology by taking the Experts’ advice

Merging of SRIVANI Trust into TTD Account and verifying the possibilities to change its name while continuing the Scheme

The board has given a nod to dispense with the Tourism Corporations Darshan quota of various states after a thorough examination of the complaints regarding irregularities in the issue of SED tickets under this category

The piled-up debris in the Dumping Yard at Tirumala to be cleared within 3-4 months

Srinivasa Setu Fly Over to be renamed as Garuda Varadhi

Board to request the State Government to hand over the 20acre land given to Tourism at Alipiri to TTD near Devlok Project

Writing a letter to the State Government for taking an appropriate decision about the non-Hindus working in Tirumala

Providing Darshan to Tirupati locals on the first Tuesday of every month

No political statements in Tirumala and action will be taken legally if needed against such persons as well on those who propagate them

Keeping in view the safety of TTD deposits, a decision will be taken in the next board meeting to deposit them in the Nationalized banks by withdrawing the already deposited ones from Private banks

Using the enhanced quality of ghee in the preparation of Srivari Laddu

Introducing one more tasty recipe in the every day menu at Annaprasadam Complex in Tirumala for the devotees

As the Visakha Sarada Peetham has violated the rules of TTD, following the Experts Committees’ report the lease of the Mutt will be cancelled

The repairs of leakages in the age-old Potu-temple kitchen in the Srivari temple along with the modernization of Vengamamba Annaprasadam Complex will be taken up by the TVS company

The TTD board approved the 10% hike in Bahumanam of employees who rendered special services during the annual Brahmotsavam of Tirumala Srivari Temple held from October 4th to 13th this year.. Regular employees @15,400 and for Outsouricing employees @ 7,535.

Other board members, TTD manadrins were also present.


తిరుమ‌ల‌, 2024 న‌వంబ‌రు 18: టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చైర్మ‌న్ శ్రీ బి.ఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో తొలి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ముఖ్య నిర్ణ‌యాలను చైర్మ‌న్ మీడియాకు వివ‌రించారు.

•⁠ ⁠ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణ‌యం.

– టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం.

•⁠ ⁠తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను మూడు లేదా నాలుగు నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణ‌యం.

•⁠ ⁠తిరుప‌తిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయం.

•⁠ ⁠అలిపిరిలో టూరిజం కార్పోరేష‌న్ ద్వారా దేవలోక్ కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం.

•⁠ ⁠తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం.

•⁠ ⁠తిరుపతి స్థానికులకు ప్ర‌తి నెలా మొద‌టి మంగ‌ళ‌వారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం.

•⁠ ⁠శ్రీ‌వాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశం.

– ప్ర‌యివేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కు తీసుకుని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చిస్తాం.

– నిత్య అన్న ప్రసాద భవనం మెనూలో అద‌నంగా మ‌రొక‌ ప‌దార్థాన్ని చేర్చేందుకు నిర్ణ‌యం.

•⁠ ⁠వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పోరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.

Tirumala Tirupati Devasthanams

17 Nov, 12:06


♦️ ఫిబ్రవరి-2025కి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్‌ల ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్‌లు 18.11.2024 10:00 AM నుండి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్‌లు 18.11.2024 10:00 AM నుండి 20.11.2024 10:00 AM వరకు తెరిచి ఉంటాయి.

♦️ ఫిబ్రవరి-2025కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను బుకింగ్ కోసం 21.11.2024 10:00 AM కి అందుబాటులో ఉంటాయి.

Tirumala Tirupati Devasthanams

16 Nov, 18:07


⚠️

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో
రేపు తిరుమలలో కార్తీక వన భోజనం
వేదిక మార్పు

👉 తిరుమలలో కార్తీక వన భోజన కార్యక్రమాన్ని రేపు (17.11.24)శ్రీ‌వారి ఆల‌యం స‌మీపంలోని వైభ‌వోత్స‌వ‌ మండపంలో టీటీడీ నిర్వహించనుంది.

👉 భారీ వర్ష హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఈ ఏడాది వైభ‌వోత్స‌వ‌ మండపంలో నిర్వ‌హించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది.

👉 ఉదయం శ్రీ‌వారు ఉభయనాంచారులతో క‌లిసి వైభ‌వోత్స‌వ మండపానికి వేంచేపు చేస్తారు.
ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు.

👉 ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
అనంత‌రం స్వామివారు ఆల‌యానికి వేంచేపు చేస్తారు.

👉 ఈ ఉత్సవం కారణంగా రేపు శ్రీవారి అలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

భక్తులు ఈ విషయం గమనించగలరు

Tirumala Tirupati Devasthanams

16 Nov, 09:46


తిరుమలలో కార్తీక మాస పౌర్ణమి గరుడ సేవ🙏🚩

*తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ జరిగింది.*🙏🚩

*సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు*🙏🚩

Tirumala Tirupati Devasthanams

13 Nov, 07:11


తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ....

23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు...

టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం...

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,448 మంది భక్తులు...

తలనీలాలు సమర్పించిన 21374 మంది భక్తులు...

హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు...

Tirumala Tirupati Devasthanams

12 Nov, 11:29


LOCKERS IN TIRUMALA

♦️ Dear pilgrims if you not get accommodation in tirumala you can stay on lockers ( Yathri sadhan ) based on availability

👉 accommodation counters available in daily 04 am - 12pm at CRO office

♦️ ప్రియమైన యాత్రికులారా, మీకు తిరుమలలో వసతి లభించకుంటే మీరు లభ్యత ఆధారంగా లాకర్లలో (యాత్రి సాధన) ఉండగలరు.

👉 CRO కార్యాలయంలో రోజువారీ ఉదయం 04 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వసతి కౌంటర్లు అందుబాటులో ఉంటాయి.

Tirumala Tirupati Devasthanams

01 Nov, 06:23


Tirumala Tirupati Devasthanams pinned «♦️ _తిరుపతి వసతి_ తిరుపతి రైల్వే స్టేషన్‌కి ఎదురుగా విష్ణునివాసం యాత్రికుల సముదాయం 👉 50% గదులు ఆఫ్‌లైన్‌లో జారీ చేయబడతాయి (ఉదయం 6 - రాత్రి 11 గంటల వరకు) 👉 ఉచిత లాకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి 👉 ఉచిత లంచ్ & డిన్నర్ అందుబాటులో 👉 ఇక్కడ నుండి అలిపిరి & తిరుమలకు…»

Tirumala Tirupati Devasthanams

28 Oct, 08:54


♦️ _తిరుపతి వసతి_
తిరుపతి రైల్వే స్టేషన్‌కి ఎదురుగా విష్ణునివాసం యాత్రికుల సముదాయం

👉 50% గదులు ఆఫ్‌లైన్‌లో జారీ చేయబడతాయి (ఉదయం 6 - రాత్రి 11 గంటల వరకు)
👉 ఉచిత లాకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి
👉 ఉచిత లంచ్ & డిన్నర్ అందుబాటులో
👉 ఇక్కడ నుండి అలిపిరి & తిరుమలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి
👉 బస్టాండ్ & గోవిందరాజ స్వామి దేవాలయం నడవగలిగే దూరంలో

♦️ _Tirupati Accommodation_
Vishnunivasam Pilgrim Complex right opposite to Tirupati Railway Station

👉 50% of rooms are issued offline (6am - 11pm)
👉 Free lockers are also available
👉 Free lunch & dinner available
👉 Buses to Alipiri & Tirumala are available from here
👉 Busstand & Govindaraja Swamy Temple at walkable distance.

Tirumala Tirupati Devasthanams

28 Oct, 08:54


31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ఈనెల 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 30వ తేది బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది‌.
----------------------------------------
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala Tirupati Devasthanams

24 Oct, 03:20


తిరుమల సమాచారం...

నేడు జనవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల...

ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ...

Tirumala Tirupati Devasthanams

23 Oct, 06:11


తిరుమల సమాచారం...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...

కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం...

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,359 మంది భక్తులు...

తలనీలాలు సమర్పించిన 20,711 మంది భక్తులు...

హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు...

Tirumala Tirupati Devasthanams

17 Oct, 03:50


Tirumala Tirupati Devasthanams pinned «🙏తిరుమల శ్రీవారి జనవరి నెల ఆన్లైన్ టికెట్ల కోట విడుదల🙏 తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం…»

Tirumala Tirupati Devasthanams

17 Oct, 03:50


🙏తిరుమల శ్రీవారి జనవరి నెల ఆన్లైన్ టికెట్ల కోట విడుదల🙏

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు అక్టోబరు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

22న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అక్టోబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

జనవరి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

అక్టోబరు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

జనవరి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

Tirumala Tirupati Devasthanams

14 Oct, 03:48


♦️ Children under 1 year will get this darshan
♦️Aadhaar card or birth certificate is mandatory for the child
♦️Parents and siblings are allowed &
Must have Aadhaar card
♦️Relatives are not allowed
♦️Supadam entrance between 12 noon - 6 pm
Report at
♦️You can get only one darshan in a month
♦️Darshan takes about 2 hours to complete
♦️Supadam entrance is next to Tirumala Nambi Sannidhi on Dakshina Mada Street
♦️Darshan tickets or advance booking is not required, just
take a walk
♦️And darshan is available daily (except on special occasions in the temple)

Tirumala Tirupati Devasthanams

11 Oct, 08:22


భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు_

Tirumala Tirupati Devasthanams

08 Oct, 04:36


వైభవంగా శ్రీవారి కల్పవృక్ష వాహనం

రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

Tirumala Tirupati Devasthanams

06 Oct, 01:03


👆 MALAYAPPA AS SARASWATI RIDES HAMSA VAHANA

Tirumala Tirupati Devasthanams

06 Oct, 01:03


♦️ శ్రీ‌వారి కైంక‌ర్యంలో త‌రించిన సుగంధద్రవ్యాలు, ఎండుఫ‌లాలు
– _స్న‌ప‌నంలో ఆక‌ర్ష‌ణీయంగా శ్రీవల్లి పుత్తూరు చిలకలతో చేసిన మాల‌లు, కిరీటాలు_