దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టించాయి. నాలుగేళ్లలోనే అత్యుత్తమైన వీక్లీ ముగింపుతో అదరగొట్టాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంటు పెరగడమే ఇందుకు కారణం. రూపాయి బలోపేతమూ ఇందుకు దోహదం చేసింది. బెంచ్‌మార్క్ సూచీల్లో ఫాలింగ్ ట్రెండ్‌లైన్ రెసిస్టెన్సీ బ్రేకవ్వడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. మీడియా, పీఎస్ఈ, చమురు, ఎనర్జీ, హెల్త్‌కేర్ షేర్లలో పెట్టబడులు పెట్టారు. మొత్తంగా సెన్సెక్స్ 557, నిఫ్టీ 159 పాయింట్ల మేర లాభపడ్డాయి. నిఫ్టీ 23,350 వద్ద స్థిరపడింది. ఈ స్థాయిలో కన్సాలిడేషన్ జరిగి రెసిస్టెన్సీ బ్రేక్ చేస్తే సూచీ మరింత పెరగడం ఖాయమే.
క్రితం సెషన్లో 76,348 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం 76,155 వద్ద మొదలైంది. 76,095 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 77,041 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 557 పాయింట్ల లాభంతో 76,905 వద్ద ముగిసింది. 23,168 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,132 వద్ద కనిష్ఠ, 23,402 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. మొత్తంగా 159 పాయింట్లు ఎగిసి 23,350 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు 530 పాయింట్లు పుంజుకొని 50,593 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ50లో 38 కంపెనీలు లాభపడగా 12 నష్టపోయాయి. మీడియా, పీఎస్ఈ, చమురు, సీపీఎస్ఈ, ఎనర్జీ, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, ఇన్ఫ్రా, కమోడిటీస్, ఫైనాన్స్, బ్యాంకు, రియాల్టి, ఆటో షేర్లు అదరగొట్టాయి. మెటల్, వినియోగ షేర్లు ఎరుపెక్కాయి. ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్. ట్రెంట్, ఇన్ఫీ, విప్రో, హిందాల్కో , టాటా స్టీల్ అత్యధికంగా నష్టపోయాయి.
ఎన్ఎస్ఈలో నేడు మార్కెట్ బ్రెడ్త్ బయ్యర్లకు అనుకూలంగా మారింది. 2988 స్టా్క్స్ ట్రేడవ్వగా 2120 లాభపడ్డాయి. 804 నష్టపోయాయి. 33 షేర్లు 52వారాల గరిష్ఠాన్ని అందుకోగా 49 షేర్లు 52వారాల కనిష్ఠాన్ని చేరాయి. అప్పర్ సర్క్యూటును 192, లోయర్ సర్క్యూటును 53 షేర్లు అందుకున్నాయి.
నాలుగేళ్ల తర్వాత మార్కెట్లు బెస్ట్ వీక్లీ రికార్డు సృష్టించాయి. నిఫ్టీ ఈ వారంలో 4% మేర పెరిగింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2020 ఏప్రిల్ తర్వాత 8% ఎగిసింది. 2020 జూన్ తర్వాత స్మాల్‌క్యాప్ ఇండెక్స్ తొలిసారిగా 9% పుంజుకుంది. ఈ వారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.22లక్షల కోట్ల మేర పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 39 పైసలు బలపడి 85.97 వద్ద స్థిరపడింది. టాటా స్టీల్ టార్గెట్ ధరను రూ.145 నుంచి రూ.168కి పెంచుతూ యెస్ రీసెర్చ్ న్యూట్రల్ రేటింగ్ కొనసాగించింది. క్రీమ్‌లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ నుంచి గోద్రేజ్ ఆగ్రోవెట్ 47.38% వాటా తీసుకోనుంది. డిఫెన్స్ మినిస్ట్రీకి రూ.200-300 కోట్ల విలువైన ఆర్టిలరీ షెల్స్ సరఫరా చేసేందుకు సునీతా టూల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.15000 కోట్ల మెగా ఐపీవో కోసం టాటా క్యాపిటల్ పది ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను ఫైనలైజ్ చేసింది. హిందాల్కో ఇండస్ట్రీస్ రూ.45000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలను సిద్ధం చేసింది. రూ.54000 కోట్ల విలువైన ప్రదిపాదనలకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలపడంతో BEL, భారత్ డైనమిక్స్ షేర్లు ఎగిశాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709