దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లో దుమ్మురేపాయి. గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో ఫ్లాటుగా మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు యూఎస్ ఫెడ్ సమావేశం వివరాలు రావడం, తైవాన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో లాభాల బాట పట్టాయి. డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ అయినప్పటికీ బుల్లిష్ మూమెంటమ్ కొనసాగడం, ఇన్వెస్టర్లు బయ్ ఆన్ డిప్స్ మెథడ్ కొనసాగించడంతో రోజువారీ గరిష్ఠాలకు చేరాయి. నిఫ్టీ 258, సెన్సెక్స్ 899 పాయింట్ల మేర లాభపడ్డాయి. నిఫ్టీ కీలకమైన రెసిస్టెన్సీ 23,000 స్థాయిని బ్రేక్ చేయడమే కాకుండా ఆ పైస్థాయిలోనే క్లోజవ్వడం మరింత సానుకూలతను పెంచింది.
క్రితం సెషన్లో 75,449 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 75,917 వద్ద మొదలైంది. 75,684 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 76,456 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 899 పాయింట్ల లాభంతో 76,348 వద్ద ముగిసింది. 23,036 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,973 వద్ద కనిష్ఠ, 23,216 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. మొత్తంగా 258 పాయింట్లు పెరిగి 23,165 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు 291 పాయింట్లు ఎగిసి 49,993 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ50లో 44 కంపెనీలు లాభపడగా 4 నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, ఐచర్ మోటార్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా టాప్ గెయినర్స్. ఇండస్‌ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎక్కువ నష్టపోయాయి. నేడు ఆటో, చమురు, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, హెల్త్‌కేర్, మెటల్, ఐటీ, రియాల్టి, పీఎస్ఈ, ఫార్మా షేర్లు అదరగొట్టాయి. పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, కమోడిటీస్, ఎనర్జీ, తయారీ షేర్లు ఫర్వాలేదనిపించాయి.
ఎన్ఎస్‌ఈలో నేడు మార్కెట్ బ్రెడ్త్ బయ్యర్లకు అనుకూలంగా మారింది. 2978 స్టాక్స్ ట్రేడవ్వగా 1755 లాభపడ్డాయి. 1147 నష్టపోయాయి. 35 షేర్లు 52వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి. 58 షేర్లు 52వారాల కనిష్ఠాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూటును 184, లోయర్ సర్క్యూటును 55 స్టాక్స్ చేరాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి 86.36 వద్ద స్థిరపడింది. ప్రదీప్ ఫాస్పేట్స్ కంపెనీ అమ్మోనియా, యూరియా ప్లాంట్లలో ప్రొడక్షన్ ఆరంభించింది. రూ.1375 టార్గెట్ ధరతో వోల్టాస్‌కు సీఎల్ఎస్ఏ హోల్డ్ రేటింగ్ ఇచ్చింది. రూ.5700 టార్గెట్ ధరతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు జెఫ్రీస్ బయ్ రేటింగ్ కొనసాగించింది. టాటా స్టీల్‌లో 21 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇండియా విక్స్ 4% మేర తగ్గి 12.71కి చేరుకుంది. రూ.700 టార్గెట్ ధరతో డీఎల్ఎఫ్‌కు నొమురా న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది. డైమండ్ పవర్ ఇన్ఫ్రాకు రూ.175 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. బోయింగ్, ఎయిర్‌బస్‌కు ఎయిర్ ఇండియా వందల కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చినట్టు తెలిసింది. ఎన్టీపీసీలో 22 లక్షల షేర్లు చేతులు మారాయి. ఐటీసీలో 10 లక్షల షేర్లు చేతులు మారాయి. తైవాన్ వడ్డీరేట్లను 2% వద్ద యథాతథంగా ఉంచింది. రూ.150 కోట్ల సమీకరణకు ధనలక్ష్మీ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.1580 టార్గెట్ ధరతో మహానగర్ గ్యాస్‌కు యాక్సిస్ క్యాపిటల్ బయ్ రేటింగ్ ఇచ్చింది.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709