Jsr Zoomin

@jsrzoomin


ముందుగా telegram వరకు వచ్చి మన ఛానల్ లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు💙😊
ఈ ఛానల్లో మీతో తిరుమల సమాచారంతో పాటు, ఆన్లైన్లో ఉన్న మంచి ఆఫర్స్ పంచుకుంటాను..💙
గ్రూప్ చాటింగ్ కోసం
👇👇
https://t.me/joinchat/R20W2YGsC6bTTlxe

Jsr Zoomin

26 Sep, 09:46


👆 *అసలు ఈ తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటో తెలుసా?*

*బ్రిటిష్ హయాం నుంచే అన్య మతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫారం పై సంతకాలు చేసే సంప్రదాయం ఉంది.తిరుమల వేంకటేశ్వరస్వామిపై తమకు నమ్మకం, గౌరవం ఉందని,దర్శనానికి అనుమతించాలని అందులో సంతకం చేయాలి.ఇదే తిరుమల డిక్లరేషన్ అంటే.1933 ముందు వరకు మహంతులు దీన్ని పర్యవేక్షించారు.*

Jsr Zoomin

25 Sep, 19:48


Declaration form

Jsr Zoomin

24 Sep, 03:24


*శ్రీవారికి సమర్పించే నైవేద్యం వివరాలు*

తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి...

వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా ?

ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా ?

ఇవి మాత్రమే కాదు... ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం!

స్వామి వారికి సకల విధమైన నైవేద్యం గురించి ఎంతమందికి తెలుసు.

🙏సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు.

అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది.

ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు.

ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక...

శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు.

*నేవైద్యం పెట్టేది ఇలా...*

ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు.

గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు.

స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు.

విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు.

కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ *అన్నసూక్తం* నిర్వర్తిస్తారు.

చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే.

ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు.

నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు.

రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు.

ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య *బాలభోగం* సమర్పిస్తారు.

పది, పదకొండు గంటల మధ్య *రాజభోగం*, రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య *శయనభోగం* సమర్పిస్తారు.

తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు.

నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు.

ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.

*ఉదయం బాలభోగం*

మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి

*మధ్యాహ్నం రాజభోగం*

శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం

*రాత్రి శయనభోగం*

మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం (వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)

*అల్పాహారాలు*

లడ్డు, వడ, అప్పం, దోసె.. స్వామి మెనూ ఇదీ...

ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన *చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు* సమర్పిస్తారు.

తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత *నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం* నైవేద్యంగా పెడుతారు.

ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది.

అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది.

సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి... స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు.

అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు!

అర్ధరాత్రి *తిరువీశం* పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు.

ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది.
ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు

Jsr Zoomin

21 Sep, 13:39


please watch complete video and come to conclusions on this

Jsr Zoomin

21 Sep, 13:38


https://www.youtube.com/watch?v=88laX2_f1To

Jsr Zoomin

14 Sep, 19:22


Opens @ 2am

Jsr Zoomin

14 Sep, 19:22


Heavy rush @ vishnu nivasam

Jsr Zoomin

14 Sep, 19:18


Heavy rush at Vishnu Nivasam

Jsr Zoomin

29 Aug, 06:24


Tirumala Fire Accident Reality Vs Media అస్సలు నిజాలు మాట్లాడుకుందాం
https://youtu.be/HF-O6EpDQFI

Jsr Zoomin

26 Aug, 04:20


2024 Brahmotsavam Updates || Complete Information in Single Video ||
https://youtu.be/pUhESRbQjis

Jsr Zoomin

25 Aug, 14:50


https://www.youtube.com/watch?v=pUhESRbQjis

Jsr Zoomin

05 Aug, 05:35


https://youtu.be/8Nek8gaCfQU

Jsr Zoomin

25 Jun, 04:31


Please do watch this video completely and share it with your friends and family who are planning to visit Tirupati/Tirumala