Dernières publications de ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు (@biblefactseveryday) sur Telegram

Publications du canal ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు

ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు
Biblefactseveryday
1,174 abonnés
47 photos
5 vidéos
Dernière mise à jour 01.03.2025 05:03

Le dernier contenu partagé par ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు sur Telegram


Fop రేర్ డిసిజ్ అవేర్నెస్ కోసం ప్రతి నెలా మీ సహకారం అందించడానికి ఇష్టపడిన వారు ఎవరైనా సరే ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.

మనం ఇచ్చే ప్రతి రూపాయి చాలా విలువైనది.



https://t.me/+TVo7KJ2W-kdhNjBl

అందరికీ వందనములు.

fibrodysplasia ossificans progressiva అనే రేర్ డిసిజ్.

చాలా అరుదుగా మాత్రమే వచ్చే వ్యాధి.

10 కొట్లా మందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి..

ఈ వ్యాధి గురించి చాలా మంది డాక్టర్స్ కి కూడా అవగాహన లేకపోవడం వల్ల ఇది క్యాన్సర్ అని చెబుతుంటారు. 

ఇలాంటి పరిస్థితుల్లో అరుదుగా ఉండేది కొంతమంది డాక్టర్స్ మాత్రమే..

ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని వారికి చూపించి తగిన విధంగా వైద్య సహాయం అందించడానికి మీ వంతు సహకారం అందించాల్సిందిగా కోరుచున్నాను.

మీరు ఇచ్చే సహాయం ఈ విధంగా ఖర్చు  చేస్తారు. 

వైద్య సంప్రదింపులు,
గృహ సందర్శనలు,
మొబిలిటీ ఎయిడ్స్,
గృహ సౌకర్యాలు,
గృహ సవరణలు.  

ప్రతి నెలా మీ మీ వంతు సహకారం అందించగలరు.
100. 200. లేదా. మీ మనస్సుకు నచ్చినట్లు సహకారం అందించండి. 

ప్రతి నెల సహకరించే వారి కొరకు ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం.

మీరు మీ సహకారం అందించడానికి నెంబర్. 8985622041

ఒకప్పుడు ఆరాధన. ఇప్పుడు కనుమరుగై పోతున్నాయి

కొన్ని సంఖ్యా వివరములు: పరిశుద్ధ గ్రంథములో మొదటి గ్రంధము ; ఆధ్యాయములు 50 ; వచనములు – 1,533 - చరిత్రాత్మిక వచనములు 1,385; ప్రశ్నలు 148 ; ప్రవచనములు 146; నెరవేరిన ప్రవచనములు 123; నెరవేరని ప్రవచనములు 23 ; ఆజ్ఞలు -106 ; వాగ్దానములు 71 : దేవుని యొద్ద నుండి పాముఖ్యమైన అంశములు 95 ; హెచ్చరికలు 326.

మరిన్ని విషయములు:

దేవుడు ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో చెప్పే పుస్తకం బైబిల్. ఇది ఆరు రోజులలో ప్రపంచ సృష్టితో ప్రారంభమవుతుంది, మరియు ఏడవ రోజు, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు.

దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తులైన ఆడమ్ మరియు ఈవ్ కథను ఈ పుస్తకం చెబుతుంది. వారు ఈడెన్ గార్డెన్‌లో నివసించారు మరియు మంచి మరియు చెడుల జ్ఞానం యొక్క చెట్టు నుండి తినకూడదని చెప్పబడింది. అయినప్పటికీ, వారు పాముచే శోదించబడ్డారు మరియు చెట్టు నుండి తిన్నారు, ఫలితంగా వారు తోట నుండి బహిష్కరించబడ్డారు.

ఈ పుస్తకం ఆడమ్ మరియు ఈవ్‌ల మొదటి కుమారులైన కైన్ మరియు అబెల్ చరిత్ర చెబుతుంది. కయీను అసూయతో అబెల్‌ను చంపాడు మరియు దేవునిచే శిక్షించబడ్డాడు. ఈ పుస్తకంలో నోహ్ మరియు గొప్ప వరద కథ కూడా ఉంది, దీనిలో దేవుడు మానవత్వం యొక్క దుర్మార్గాన్ని చూస్తాడు మరియు ప్రపంచాన్ని వరదతో నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు, కానీ నోహ్ మరియు అతని కుటుంబాన్ని అన్ని రకాల జంతువులతో పాటు రక్షించాడు.

ఈ పుస్తకం అబ్రహాంతో సహా అనేక మంది వ్యక్తుల కథను చెబుతుంది, అతను తన ఇంటిని విడిచిపెట్టి, అనేక దేశాలకు తండ్రి కావడానికి దేవుడు పిలిచాడు. దేవుడు అబ్రాహాముతో మరియు అతని వారసులతో ఒక ప్రత్యేక ఒడంబడిక చేసాడు, వారికి కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు. ఈ పుస్తకం అబ్రహం కుమారుడు ఐజాక్ మరియు ఐజాక్ కుమారుడు జాకబ్ యొక్క కథను కూడా చెబుతుంది, తరువాత ఇజ్రాయెల్ అని పేరు మార్చబడింది. జాకబ్ కొడుకు జోసెఫ్ కథతో పుస్తకం ముగుస్తుంది, అతను తన సోదరులచే బానిసగా విక్రయించబడ్డాడు, కానీ తరువాత ఈజిప్టులో శక్తివంతమైన నాయకుడిగా మారాడు.

ది బుక్ ఆఫ్ జెనెసిస్ అనేది ప్రపంచం మరియు మానవుల ప్రారంభం గురించి కథల సమాహారం. దేవుడు ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు, మొదటి మానవులు మరియు వారు తమ జీవితాలను ఎలా జీవించడం ప్రారంభించారు అనే విషయం ఇది చెబుతుంది. బుక్ ఆఫ్ జెనెసిస్‌లో జరిగిన కొన్ని విషయాలు మొదటి హత్య, గొప్ప జలప్రళయం మరియు అబ్రాహాము వారసులకు భూమి వాగ్దానం. ఈ పుస్తకం బైబిల్‌లోని విభిన్న అంశాలతో వ్యవహరించే ఇతర కథలకు పునాది వేస్తుంది.

క్రింది తేదీలు సుమారుగా ఉన్నాయి.

క్రీ.పూ. 2000 – అబ్రాహాము జననము
క్రీ.పూ. 1925 – అబ్రాహాము కనానులో ప్రవేశము
క్రీ.పూ. 1900 – ఇస్సాకు జననము
క్రీ.పూ. 1840 – ఏశావు, యాకోబు జననము
క్రీ.పూ. 1764 – యాకోబు హారానుకు పారిపోవుట
క్రీ.పూ. 1750 – యోసేపు జననము
క్రీ.పూ. 1733 – యోసేపు బానిసగా అమ్మబడుట
క్రీ.పూ. 1720 – యోసేపు ఐగుప్తులో అధికారమునకు వచ్చుట
క్రీ.పూ. 1640 – యోసేపు మరణము
గ్రంధ నిర్మాణము:
I. మనిషి యొక్క ప్రారంభ చరిత్ర 1:1 నుండి 11:32

A. సృష్టి వృత్తాంతం 1:1 నుండి 2:25

1. స్వర్గాన్ని, భూమిని మరియు భూమిపై జీవాన్ని సృష్టించడం 1:1 నుండి 2:3

2. మనిషి సృష్టి 2:4–25

B. మనిషి పతనం 3:1–24

C. ప్రళయానికి ముందు ప్రపంచం 4:1 నుండి 5:32

D. నోవహు, జలప్రళయము 6:1 నుండి 9:29

E. దేశాల పట్టిక 10:1–32

F. భాషల గందరగోళం 11:1–9

G. అబ్రాము (అబ్రాహాము) వంశావళి 11:10–32

II. ఎంచుకున్న పితృస్వామ్యులు 12:1 నుండి 50:26

A. అబ్రాము (అబ్రాహాము) 12:1 నుండి 23:20

1. అబ్రాహాము పిలుపు 12:1 నుండి 13:18

2. రాజుల యుద్ధం 14:1–24

3. అబ్రాహాముతో దేవుని ఒడంబడిక 15:1 నుండి 21:34

4. అబ్రాహాము పరీక్ష 22:1–24

5. శారా మరణం 23:1–20

B. ఇస్సాకు 24:1 నుండి 26:35

1. మెసొపొటేమియా నుండి ఇస్సాకు వధువు 24:1–67

2. అబ్రాహాము మరణం 25:1–11

3. ఇష్మాయేలు, ఏశావు మరియు యాకోబు 25:12–34

4. ఇస్సాకుతో తన ఒడంబడికను దేవుడు ధృవీకరించడం 26:1–35

C. యాకోబు 27:1 నుండి 35:29

1. యాకోబు తన తండ్రిని మోసం చేయడం 27:1 నుండి 46

2. హారానుకు యాకోబు పారిపోవటం 28:1–10

3. యాకోబుతో దేవుడు తన ఒడంబడికను ధృవీకరించడం 28:11–22

4. హారానులో యాకోబు వివాహం 29:1 నుండి 30:43

5. కనానుకు యాకోబు తిరిగి రావడం 31:1 నుండి 35:29

D. ఏశావు 36:1–43

E. యోసేపు 37:1 నుండి 50:26

1. యోసేపును బానిసత్వానికి విక్రయించడం 37:1 నుండి 40:23

2. యోసేపు గొప్పతనం 41:1–57

3. యోసేపు తన సోదరులతో వ్యవహరించిన తీరు 42:1 నుండి 45:28

4. యాకోబు ఈజిప్టుకు వెళ్లడం 46:1 నుండి 48:22

5. యాకోబు ఆశీర్వాదం మరియు ఖననం 49:1 నుండి 50:21

6. యోసేపు చివరి రోజులు 50:22–2

ఆదికాండము



పురాతన ప్రతులైన ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందురు. (2 దినవృత్తాంతములు 34:30). క్రీ.పూ 3వ శతాబ్దములోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాతనిబంధన గ్రంథమును తర్జుమా చేసిన సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితియోపదేశకాండము అని ఐదు వివిధమైన పేర్లతో పిలిచిరి.

ఉద్దేశ్యము : ప్రపంచముల నిర్మాణమును గురించిన ముఖ్యాంశములను వ్రాయుటను దేవుని ఆరాధించుటకు ఒక ప్రత్యేక జనాంగమును ఎర్పరచుకొనుట దీని ముఖ్య ఉద్దేశ్యము.

రచయిత : ఈ ఐదు కాండముల (పుస్తకముల) ముఖ్య రచయితగా యూదావంశపువారును, యేసును అపోస్తలుల ద్వారా అంగీకరించబడిన వ్యక్తి మోషే, ప్రవక్తయైన మోషేకు దేవునికి మధ్య నలువది రాత్రింబవళ్ళు జరిగిన సంభాషణలో తన చర్యను గూర్చి తాను చేయబోయెడి విధానమును గూర్చిన వివరణ: నిర్గమకాండము 24:18, నిర్గమకాండము 34:28 వచనములలో చదువగలము. ఆ సంభాషణ ఫలితమే ఈ ఐదు కాండము (పుస్తకము) లని అనుకొనుట యుక్తమైయున్నది. మార్కు 12:26, యోహాను 1:17; యోహాను 5:46; యోహాను 7:19, యోహాను 7:23; అపో. కార్యములు 7:37- 38; అపో. కార్యములు 13:39; అపో. కార్యములు 15:1; అపో. కార్యములు 15:21; అపో. కార్యములు 28:23.

ఆదికాండము అని పేరు : ఆది అనగా ప్రారంభము అని అర్ధమిచ్చును. భాషాంతరమున పరేషిత్ అనే హెబ్రీ బాషాపదముతో పాతనిబంధన ప్రారంభమయినది. ఈ పుస్తకమునకు ఆదికాండము అను పేరు పెట్టుటకు గల కారణము ఈ పుస్తకములోని ప్రారంభపదమే దీనికి మూలకారణం. ఆది అనే సంస్కృత మాటకు సృష్టి , ప్రారంభము, పుట్టుట అను అనేక విధములైన పర్యాయపదములు కలవు.

రచించిన కాలము : క్రీ.పూ 1480 – 1410

గత చరిత్ర : మధ్య తూర్పుదేశము అనగా ప్రస్తుతమందు పిలువ బడుచున్న మిడిల్ ఈస్ట్.

ముఖ్య వచన భాగములు : ఆదికాండము 1:27; ఆదికాండము 12:2-3

గ్రంథ పరిశోధన : ఆదికాండములో సమస్త సృష్టి యొక్క చరిత్రయైన ఆకాశము, భూమి, వాటి నిర్మాణమును గురించిన వివరణ మరియు రాత్రింబవళ్ళు, సస్యమృగములు పక్షిజలచరములు, మానవుడు, భాషలు క్రమ శిక్షణ, సంబంధ బాంధవ్యములు వంటివి ఏ విధముగా ఏర్పరచబడినవి అను వాటిని గురించి పరిపూర్ణ అవగాహననిచ్చుచున్నది. పాపము యొక్క ప్రారంభ చరిత్ర దానికి దేవుడు చేసిన ప్రాయశ్చిత్తము ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశ్యమగును. భూగోళ శాస్త్రములోని మూడు ముఖ్యమైన విభన్న దేశ సంబంధములను ఈ ఆదికాండము తెరకెక్కించుచున్నది. యూప్రటీసు, టైగ్రీసు నదీతీరములు మొదటి భాగమునకు, కనాను దేశ ప్రాంతము రెండవ భాగమునకు, ఐగుప్తు మూడవ భాగమునకు విశిదీక రింపబడియున్నవి. మొదటి అధ్యాయము మొదలుకొని 11వ అధ్యాయము వరకునున్న మొదటి

భాగములో అన్నింటి ప్రారంభమును గురించి మొదటి మానవుని నిర్మాణమును గురించి, వారి వంశావళిని గూర్చిన చరిత్ర యిమిడియున్నది. మరియు 12వ అధ్యాయము మొదలుకొని 38వ అధ్యాయము వరకుగల రెండవ భాగములో ఆనాటి మానవుల వంశావళుల చరిత్రలో అబ్రాహాము అను ప్రత్యేకమైన మనిషిని దేవుడు పిలిచి ఏర్పరచి, ఆ అబ్రాహాము కుటుంబము ద్వారా యాకోబు సంతతివారిని మాత్రము తన సొంత జనాంగముగా ఎన్నుకొనుట దేవుని సంకల్పమైయున్నది. 39వ అధ్యాయము మొదలుకొని చివరి అధ్యాయము వరకునున్న మూడవభాగములో యాకోబు సంతతివారు యోసేపు ద్వారా ఐగుప్తుకు వలస వెళ్ళడం అక్కడ వారు బహుజనాంగముగా ఏర్పడి విస్తరించడము ఇందులో వ్రాయబడియున్నది. ఈ మూడు భాగములు కలిపి సంగ్రహించి కాలపరిమితి గలవై ఈ విధముగా సంగ్రహీకరింపబడియున్నది.

మొదటి భాగము : (1 - 11 వరకైన అధ్యాయములు) సృష్టి క్రీ. పూ 4000 లేదా దానికన్నా ముందుగా ఆది 1 1:1 ప్రారంభము నుండి తెరహు మరణము వరకు గల సంవత్సరములు 2090 ఆది 11 32:1 వరకు దాదాపు రెండువేల సంవత్సరాలకాల చరిత్ర

రెండవ భాగము : (12 - 38 వరకు గల అధ్యాయములు) అబ్రాహాము తన యింటి నుండి బయలుదేరు కాలము మొదలు కొని యోసేపు ఐగుప్తు దేశము వచ్చి చేరువరకు గల చరిత్ర కాలఘట్టము క్రీ.పూ 2090 నుండి 1897 వరకు దాదాపు 193 సంవత్సరములు.

మూడవ భాగము : (39- 50 వరకు గల అధ్యాయములు) యో సేపు ఐగుప్తు దేశములో ఉన్నప్పటి జీవితకాల చరిత్ర క్రీ.పూ 1897 నుండి 1805 వరకు దాదాపు 93 సంవత్సరములు.

ప్రాముఖ్యులు : ఆదాము, హవ్వ, హేబేలు, హనోకు, నోవహు , అబ్రాహము, శారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు.

గ్రంథ విభజన :
1. ప్రపంచము, భూమి, మానవుడు, వాటి నిర్మాణము. ఆది 1:1 నుండి 2:25 వరకు,
2.మానవుని పతనము దాని ప్రతిఫలము. ఆది 3:1 నుండి 5:32 వరకు.
3.న్యాయతీర్పు నుండి నోవహు కుటుంబము రక్షింపబడుట, ఆది 6:1 నుండి 9:29 వరకు.
4.మానవుల వంశావళులు వృద్దీ చెందుట మరియు విభజింపబడుట ఆది 10:1 నుండి 1:32 వరకు.
5.అబ్రాహాము జీవితము. ఆది 12:1 నుండి 25:18 వరకు.
6.ఇస్సాకు యొక్క కుటుంబము. ఆది 25:1 నుండి 27:45 వరకు.
7.యాకోబు గోత్రకర్తలు. ఆది 28:1 నుండి 38:30 వరకు.
8.యోసేపు జీవిత చరిత్ర. ఆది 39:1 నుండి 50:26 వరకు.

వేదాలు సాక్ష్యమిస్తున్న దేవుడు....!

మన దేశంలో వేదాలలో ఉపనిషత్తులలోను చెప్పబడిన విషయాలు బైబిలునందు యేసు క్రీస్తులో నెరవేరుట గురించి తెలుసుకుందాము!

1.మానవులంతా పాపములో జన్మించి, పాపము చేస్తున్నారు. వారిని దేవుడే రక్షించాలి. అనే విషయము గురించి తెలుసుకుందాము!
శ్లోకం:
మానుస్మృతి 2 అ॥ : పాపోహం, పాపకర్మాహం, పాపాత్మ పాపసంభవ: త్రాహిమా కృపయాదేవ శరణాగత వత్సల, అన్యధా శరణం నాస్తి త్వమేచా శరణమమ.
భావం:
తెలుగు అనువాదం:
నేను (మానవుడు) పాపిని, పాపపు క్రియలు చేయుచున్నాను. పాపపు ఆత్మ గలవాడను, పాపమందు జన్మించితిని, నీ శరణు జొచ్చిన వారిని రక్షించిన వాడా, పాపినైన నా యెడల కృప చూపించు దేవా నాకితర శరణులేదు, నీవే నా శరణు.

బైబిలు: నేను (మానవుడు) పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. (కీర్తన 51:5) ఏ బేధమును లేదు, మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. (రోమా 3:23) పాపపు క్రియలు, పాపపు ఆత్మ కలిగియున్న మానవులను అనగా పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చెనను మాట నమ్మతగినది. (1తిమోతి 11:15) యేసు క్రీస్తు కృప చేతనే రక్షింపబడుదురు. (ఎఫేసీ 3:5) యేసు అనగా రక్షకుడు అని అర్థము.

2.మానవుల పాపము తీసివేయుటకు బలియాగము జరగాలి. అనగా రక్తము చిందించబడాలి అనే విషయము గురించి తెలుసుకొందాము!

శతపద బ్రాహ్మణము: ప్రజాపతిర్వజ్ఞ అంటే ప్రజాపతి యజ్ఞము గావించబడాలి. అని అర్థము. ప్రజాపతి అనగా రాజు ప్రజలందరి కోసము ప్రజాపతి ప్రాణాన్ని బలిగా అర్పించాలి.

బైబిలు:
యేసు ప్రభువు సిలువ మరణము పొందక మునుపు నేను రాజునే అని చెప్పెను. (యోహాను 18:37)
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చెను.

శతపద బ్రాహ్మణము: తన్యప్రజాప్రతేరర్థమేవమర్త్య మాసిదర్థ మమృతం

తెలుగు అనువాదం:
ఆ ప్రజాపతి సగము దైవత్వము, సగము మానవత్వము కలిసియుండవలెను

బైబిలు: యేసు ప్రభువు పుట్టుకను గూర్చి దేవదూతలు కన్యక అయిన మరియతో ఈ విధంగా చెప్పెను. ‘‘పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.’’ (లూకా 1:34, 35)

సామవేద శతపద బ్రాహ్మణము:
సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యం తద్రక్తం పరమాత్మేన పున్యదాన బలియాగం.

తెలుగు అనువాదం:సమస్త పాపములు పరిహరించుటకు రక్తం అవసరం ఆ రక్తం పరమాత్ముడు తనను తానే పుణ్యానికి బలిగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము (మత్తయి 26:28). ఎవడును నా ప్రాణమును తీసికొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని యేసు ప్రభువు చెప్పెను. (యోహాను 10:17) యేసుక్రీస్తు యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమించబడెను. ఆ తరువాత ‘‘తీర్పు’’ జరుగును అలాగుననే యేసు క్రీస్తు కూడా పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడెను. (హెబ్రీ 9:2628)

3.ఉపనిషత్తులలో మానవుడు దేవునిని ఏ విధంగా ప్రార్థిన్నాడు?

బృహదారణ్య ఉపనిషత్తు (6):అసతోమా సద్గమయా అనగా అసత్యములో నుండి సత్యములోనికి నడిపించు మానవులంతా సత్యాన్ని గ్రహించక అసత్యములో జీవిస్తున్నారు.

బైబిలు: నేను సత్యవంతుడను, సత్య స్వరూపిని, నేనే మార్గమును అని యేసు ప్రభువు చెప్పెను. (యోహాను 7:28, 14:6, 16)

బృహదారణ్య ఉపనిషత్తు (7):తమసోమ జ్యోతిర్గమయ అనగా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు. మానవులంతా వెలుగును గ్రహించక చీకటిలో జీవిస్తున్నారు.
బైబిలు:
నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడిరచువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని యేసు ప్రభువు చెప్పెను (యోహాను 8:12)

బృహదారణ్య ఉపనిషత్తు (8):మృత్యోర్మా అమృతాంగమయ అనగా మరణం నుండి జీవము లోనికి నడిపించు, మానవులంతా ఏదో ఒక రోజు మరణించవలసినదే ఆ మరణము దాటి జీవములోనికి వెళ్ళాలి అంటే యుగయుగాలు దేవునితో జీవించుట (స్వర్గం, మోక్షం).

బైబిలు:నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవముగలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు అని యేసు ప్రభువు చెప్పెను (యోహాను 5:24) ‘‘అమృతం అనగా మృతముగానిది అంటే జీవము’’ ఈ లోకములో యేసు ప్రభువే మరణాన్ని జయించి మూడవ దినమున తిరిగిలేచి నేటికి సజీవుడిగానే ఉన్న దేవుడు. ఆయనయందు విశ్వాసము (నమ్మిక) వుంచుట ద్వారా జీవములోనికి ప్రవేశిస్తాము.

4.మానవుడు తనంతట తాను మోక్షమును సంపాదిస్తాడా?

తైతిరోపనిషత్తు: మానవులెన్ని జప, తప, యజ్ఞయాగ, ధాన ధర్మములు ఆచరించినను మోక్షము తానంతట తాను సంపాదించుకొనుట దుర్లభము. అంటే మానవులు తమ క్రియల ద్వారా స్వర్గాన్ని (పరలోక రాజాన్ని, మోక్షాన్ని) పొందలేరు.

బైబిలు:` నేనే మార్గమును సత్యమును, జీవమును, నా ద్వారనే తప్ప యెవ్వడును తండ్రి యొద్దకు రాడు. అనగా పరలోకాన్ని పొందలేడు అని యేసు ప్రభువు చెప్పెను (యోహాను 14:6).

1 వ సాక్ష్యం ఋగ్వేదము బృహధారన్యక ఉపనిషత్ 1వ స్వర్గ.4 వ మండలం.1 వ శ్లోకం మచ్చలేని మేక కావలెను,
లేవియఖండము1:10,11 నిర్దోషమైన మగ దానిని వధించవలెను, నిర్గమఖండము 12:6 నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవలెను, దేవుని గోర్రేపిల్ల అయిన యేసు పాపం లేని దైవ మానవుడు .................................

2 వ సాక్ష్యం యజుర్వేదం శతపద 3వ భ్రాహ్మనం,7.3.1 దాని తలకు బలుసు కంపను చుట్టవలెను.
ఆదిఖండము 3:18 ముండ్ల కిరీటం అల్లి యేసు తలపై పెట్టిరి మత్తయి 27:29…………………

3 వ సాక్ష్యం ఋగ్వేదము 10:7,5 బృహధారన్యకోపనిశాథ్ 3.9:28,
యజుర్వేదం దానిని వుప స్తంబమునకు కట్టవలెను,
కీర్తన118:27 బలి పశువును త్రాళ్ళతో బలిపిటపు కొమ్ములకు కట్టుడి, యేసును సిలువమ్రానుకు కట్టిరి మత్తయి27:35………………..

4 వ సాక్ష్యం ఋగ్వేదము దాని నాలుగు కళ్ళలోనూ రక్తం కారునట్లు కొట్టవలెను,
కీర్తనలు22:16 వారు నా చేతులను కళ్ళను పొడిచియున్నారు, అయన (యేసు)చేతులను కాళ్ళనుసిలువకుమేకులతో కొట్టిరి మత్తయి 27:35………………

5 వ సాక్ష్యం ఋగ్వేదము ఐతరేయ భ్రాహ్మనం మేకకు కప్పిన పచ్చడములు, ఋత్వికులు నాలుగురు పంచుకోవలెను,
నావస్త్రములు పంచుకొని యున్నారు , అంగి కోసము చిట్లు వేసియున్నారు కీర్తనలు 22:18, సైనికులు చిట్లు వేసి యేసు అంగిని నలుగురు పంచుకున్నారు యోహాను 19:23................

6 వ సాక్ష్యం ఋగ్వేదము ఐతరేయ బ్రాహ్మణము 2:6 దానిలో ఒక్కటియు విరువబడకుడదు, దానిలో ఒక్క ఎముక అయినను విరువబడకుడదు నిర్గమఖండము 12:46, సంఖ్యా ఖండము 9:12,
ఆయనకాళ్ళు విరగోట్టబడలేదు,అతని ఎముకలలో ఒక్కటియు విరువబడలేదు యోహాను 19:33-36......................

7 వ సాక్ష్యం మేకకు సోమ రసం పట్టవలెను యజుర్వేదం 31,
నాకు దప్పి అయినప్పుడు చిరాక త్రాగించిరి కీర్తనలు 69:21, బోళము కలిపినా ద్రాక్షరసము యేసుకు త్రాగించిరి మార్కు 15:23…………………..

శతపద బ్రాహ్మణము 7.1.2,1:11 బృహధారన్యకోపనిశాథ్ 3.9.28.4.5 దానిని వధించిన పిమ్మట ప్రాణ ప్రతిష్ట చేయవలెను………………
నీవు నా పఆత్మను పాతలములో విడిచి పెట్టావు, నీ పరిశుద్ధున్ని కుళ్ళు పట్టనియవు కీర్తనలు 16:10.......................

ఋగ్వేదము శతపద బ్రాహ్మణము 5:1, 1-1-2; భగవత్గీత 4:31 దాని మాంసమును భుజింపవలెను ఆ మాంసము తినవలెను
నిర్గమ ఖండము12:8 , యేసు ఒక రొట్టె పట్టుకొని , దానిని ఆశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు అయన గిన్నె ,పట్టుకొని కృతజ్ఞతస్తుతులు చెల్లించి వారికిచ్చి , దీనిని మీరందరూ త్రాగుడి. ఇది నా రక్తము ,అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకులకోరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.

ప్రియమైన సహోదరుడా! సహోదరీ!
వేదాలలోను, ఉపనిషత్తులలోను చెప్పిన విషయాలను పరిశీలిస్తే ఈ ప్రపంచంలో బైబిలు నందు ‘‘యేసు క్రీస్తు’’లో మాత్రమే అవి నెరవేరినట్లు తెలుస్తుంది. కాబట్టి సత్యాన్ని గ్రహించి నేడే యేసు క్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించినట్లైతే నరకం (అగ్ని గుండం) నుండి రక్షింపబడుదువు.
ఇది మతం కాదు రక్షణ మార్గము. బలవంతంలేదు. నిర్ణయము మీదే. సకల జనుల సాక్షార్థమై సర్వలోక మంతటను ఈ రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. (మత్తయి 24:14).
ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక! ఆమెన్.
ఇంకా అధికంగా తెలుసుకోవాలనుకొంటే బైబిలు చదవండి.
సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును (యోహాను సువార్త 8:32 )
ఆమేన్....
ఈ వేదములు సాక్ష్యమిచ్చుచున్న దేవుడు యేసు మాత్రమే....

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మన జీవితాలలో దేవుని చిత్తము సంపూర్ణంగా ఈ 2025 జరుగును గాక.

ఆయనకు మహీమ కరమైన జీవితం మనలో కనపడునట్లు అనుదినం మనల్ని మనం మలచుకొందాం

*క్రిస్మస్‌నాడు యేసయ్య కన్నీటి లేఖ*

*నా పుట్టిన రోజు జరుపుకోవడానికి మీరంతా సిద్ధపడుతున్నారని నాకు తెలుసు. ఈ సందర్భంగా ప్రపంచమంతా క్రొత్త బట్టలు కొనుక్కోవడం, గ్రీటింగ్ కార్డులు పంచుకోవడం, క్రిస్మస్ నాటికలు, క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ వేడుకలు ఎక్కడ చూసినా ఈ నెలలో క్రిస్మస్, క్రిస్మస్ అనే మాట మారుమ్రోగిపోతూ ఉంటుంది. రెండువేల సంవత్సరాల క్రితం నేను పుట్టిన రోజుల్లో గొల్లలు, జ్ఞానులు, ఎక్కడెక్కడ నుండో నా సన్నిధికి వచ్చి నా జన్మనుబట్టి తరించిపోయి నన్ను ఆరాధించి, పూజించి, కానుకలు ఇచ్చిపోయిరి. ఆ తరువాత వచ్చిన తరం వారి నుండి నేటితరం వరకు అనేకులు అసలు ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారో తెలియనటువంటి స్థితిలోనికి చేరిపోయారు. స్నేహితులను, బంధువులను పిలుచుకోవడం ఆటలు, పాటలు, బహుమానములు పంచుకోవడం, క్రిస్మస్ అని చెప్పి ఘనంగా కేకులు కట్ చేసుకోవడం, క్రిస్మసై్ అంటే ఇంతే! అనే స్థితికి చేరిపోయారు.*

*పోయిన సంవత్సరం ఒకచోట నా పుట్టిన రోజు గొప్ప పండుగగా జరుగుచూ ఉన్నది. భోజనపు బల్లంతా రకరకాల వంటకాలతో నిండిపోయి వుంది. కేకులు, పేస్ట్రీలు, పండ్లు, పండ్ల రసాలు, ఐస్‌క్రీమ్‌లు ఒకటేమిటి నోరూరించే రకరకాల ఐటమ్స్ చక్కగా టేబుల్‌పై పెట్టబడి ఉన్నవి. ఆ ప్రాంతమంతా రంగురంగుల లైట్లతో అద్భుతమైన అలంకరణతో నిండి వుంది. ఆ సంబరమునకు కారణం తెలుసా? నా పుట్టిన రోజు. కానీ, దు:ఖకరమైన విషయమేమంటే నా పుట్టిన రోజు పండుగ అందర్ని పిలిచారుగాని నన్ను మాత్రం పిలువలేదు. పిలుకపోయినా వారి సంతోషంలో పాలు పంచుకొందాం అని లోపలికి వెళ్ళబోతే నా ముఖం మీదే తలుపు వేసేశారు. నా పుట్టినరోజు కదా, నాతోనేకదా వారు పుట్టినరోజు జరుపుకోవాల్సింది కానీ నాకు వారిమధ్య వారి సంతోషంలో కనీసం చోటుకూడా దొరకలేదు. చాలా బాధ అనిపించింది. ఇది నాకు క్రొత్తేమి కాదు.*

*ఇలా ఎన్ని సంవత్సరాల నుండో నన్నుబయటకు వెలివేసి నాపేరు చెప్పుకొని నా పురట్టినరోజు జరుపుకుంటున్నారో! నా పిల్లలే కదా పోనీలే అని నెమ్మదిగా శబ్ధం చేయకుండా తులపుతీసి లోపలికి వెళ్ళి ఒక ప్రక్క నిలబడ్డాను. వారు ఎంతో సంతోషంగా తినేవాళ్ళు తింటూ, నవ్వేవాళ్ళు నవ్వుతూ బహు సందడి సందడిగా తిరుగుచున్నారు. మధ్య రాత్రి 12 గంటలయ్యేసరికి అందరూ ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని షేక్ హ్యాండ్‌లు ఇస్తున్నారు. ఒకరినొకరు కౌగిలించుకొంటున్నారు. అంతేకాకుండా ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. కనీసం వారిలో ఒక్కరైనా నా దగ్గరకు వచ్చి నన్ను హత్తుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి నా బర్త్‌డేకి కానుక ఇస్తారేమోనని ఎంతో ఎదురుచూశాను. కానీ ఏ ఒక్కరూ నా మొఖం కూడా చూళ్ళేదు. ఒక్కసారి ఆలోచించండి! మీ బర్త్‌డేను జరుపుకుంటూ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, మీకు కేక్ పెట్టకుండా వచ్చినవాళ్ళే అంతా తినేస్తే మీకు ఎలా వుంటుంది. కానీ నా ప్రతి పుట్టినరోజు నాడు నాకీ అవమానం అలవాటైపోయింది. ఆ రోజు కూడా అదే జరిగింది. వారికి కావలసింది క్రిస్మస్, క్రీస్తు కాదు. వారికి కావలసింది క్రొత్త బట్టలు, కేకులు, బహుమానాలు, నేను కానేకాదు అని కన్నీళ్ళతో అక్కడ నుండి బయటకు వచ్చేశాను.*

*ఇది ప్రతి సంవత్సరం క్రిస్మస్ నాడు నాకు జరుగుతున్న ఘోరమైన సన్మానం. ఇది చదువుతున్న నువ్వైనా కనీసం ఈ క్రిస్మస్ నాడైనా నన్ను నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి రానిస్తావా? నీకో విషయం చెప్పాలి, అదేమనగా: నేను కూడా ఓ గొప్ప పండుగను, వివాహ మహోత్సవమును జరుపుకోబోతున్నాను. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ జరగని, ఇకమీదట ఎన్నడూ జరుగనటువంటి గొప్ప పండగ. ప్రస్తుతానికి ఆ పండగకు అన్ని ఏర్పాట్లు జరుగుచున్నవి. ఇన్ని సంవత్సరాలు నా పుట్టిన రోజున నన్ను నీ ఇంటిలోనికి రానివ్వకపోయినప్పటికీ ప్రేమతో నా ఇంటిలో జరిగే ఈ గొప్ప గొఱ్ఱెపిల్ల వివాహ మహోత్సవమునకు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నువ్వు తప్పక వస్తావని ఆశిస్తున్నాను. నువ్వు రావాలనుకుంటే ఈరోజు నీకోసం స్థలం సిద్ధంచేసి బంగారు అక్షరాలతో నీ పేరు వ్రాసి పెడతాను. అక్క స్థలం సిద్ధం చేసుకొన్నవారు మాత్రమే అందులో పాలుపొందగలరు. మరి నువ్వు అక్కడకు రావాలంటే, అక్కడ చోటు సంపాదించాలంటే ఇక్కడ ఈ భూమ్మీద నీ హృదయంలో నాకు చోటివ్వాలి. అంతకన్నా నిన్ను నేనేమి కోరుకోను. నీకు పరలోకంలో జరిగే మహోత్సవములో చోటిస్తాను. నీ చిన్న హృదయంలో ఈ రోజు నాకు చోటిస్తావా? ఇకనుండైనా క్రిస్మస్‌లో నన్ను మనసారా ఆరాధిస్తావా?* ‘‘గొఱ్ఱెపిల్ల వివాహమునకు పిలువబడినవారు ధన్యులు’’. (ప్రకటన 19:9).
-ఇట్లు
- యేసయ్య
______

♻️ *దేవుని సృష్టి ఆరు రోజుల్లోనే పూర్తి కాలేదు!* ♻️

ఆకాశమును, భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తానూ చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన పనియంతటి నుండి యేడవ దినమున విశ్రమించెను''. ఆది 2: 2-3

పై వాక్యాన్ని చదివిన పలువురు క్రైస్తవులు సృష్టి అంతా ఆరు రోజుల్లోనే పూర్తి అయ్యిందని భావిస్తున్నారు. బైబిలు చరిత్ర ప్రకారము ఆది పురుషుడైన ఆదాము నుంచి ఇప్పటి వరకు సుమారు 7,000 సంవత్సరాలు మాత్రమే. బైబిలు లేఖనాల ప్రకారము భూమిని, మనిషిని ఆరు రోజుల సృష్టి క్రమంలోనే దేవుడు సృష్టించెను కాబట్టి భూమి వయస్సు కూడా సుమారు 7,000 సంవత్సరములు మాత్రమే.
అయితే శాస్త్రవేత్తలు మాత్రం భూమి పుట్టి ఇప్పటికి సుమారు 450 కోట్ల సంవత్సరాలు అని, మానవ జాతి పుట్టి సుమారు లక్ష సంవత్సరాలని చెబుతున్నారు. కార్బన్ డేటింగ్ మొదలైన పలు విధాలైన శాస్త్రీయ పరిశోధనల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఈ సృష్టిని ఆరు రోజుల్లోనే దేవుడు పూర్తి చేయలేదు. బైబిలు లేఖనాల్లో దాగున్న నిగూఢతను గ్రహించగలిగితే సత్యం బోధపడుతుంది.

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను! ఆది 1: 1

'ఆది' అనే ఒక్క పదముతోనే ఈ సృష్టి చాలా పురాతనమైనదని చెప్పబడినది. ఈ 'ఆది' అనేది ఎప్పుడని కచ్చితముగా చెప్పటానికి నరుడికి జ్ఞానము చాలనప్పటికీ అది శాస్త్రవేత్తల పరిశోధనలకు అనువుగానే ఉందని బైబిలు లేఖనాలు ద్వారానే నిరూపించవచ్చును.

👉 *అది ఎలాగో చూద్దాం!*

భూమి తన చుట్టు తాను ఒకసారి పూర్తిగా తిరిగితే ఒక రోజు, భూమి చుట్టూ చంద్రుడు ఒక్కసారి పూర్తిగా తిరిగితే నెల రోజులు, సూర్యుని చుట్టు భూమి ఒక్కసారి పూర్తిగా తిరిగితే ఒక సంవత్సర కాల ప్రమాణముగా భావిస్తున్నాము. ఇదే విషయాన్ని లేఖనము కూడా చెబుతుంది చూడండి...

"దేవుడు- పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను." ఆది 1: 14-16

పై వాక్యమును బట్టి సృష్టి కల్పనలో నాలుగవ దినము వరకు సూర్య చంద్రులు సృజింపబడలేదని తెలుస్తుంది. అయితే మొదటి రోజే వెలుగు, చీకటి ఉన్నాయని, అస్తమయము, చీకటి కలిగిందని, దాని ఆధారంగానే ఒక దినము అయ్యిందని లేఖనాలు సూచిస్తున్నాయి. అందుకు ఈ కింది లేఖనాలను పరిశీలించండి...

"దేవుడు - వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడుకు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును, ఉదయమును కలుగగా ఒక దినమాయెను" ఆది 1: 3-5

పై వాక్యములో పేర్కొన్న దిన ప్రమాణము కచ్చితముగా 24 గంటలు ఉండే మానవ ప్రమాణము కాదనే విషయం స్పష్టమవుతుంది. మరి ఈ ప్రమాణం ఎవరిదంటే కచ్చితముగా అది దేవునికి సంబందించినదే.

👉 *దేవునికి ఒక దిన కాల ప్రమాణము ఎంత?*

దేవుడు సృజించిన ఈ విశ్వములో జీవి ఉనికి ఉన్న ఈ సౌర కుటుంబములో భూమిపైన ఒక దిన ప్రమాణము 24 గంటలుగా ఉండగా ఇదే బుధ గ్రహముపైన 59 రోజులు, శుక్ర గ్రహముపైన 243 రోజులుగా ఉంది. అంటే, మనకు 59 రోజులు అయితే బుధగ్రహంపైన ఒక రోజుతో సమానము. అలాగే మనకు 243 రోజులైతే శుక్ర గ్రహంపైన ఒక రోజుతో సమానము. మరి ఈ విశ్వాన్ని సృజించిన దేవుని కాల ప్రమాణము కచ్చితంగా మానవుని దిన ప్రమాణము కన్నా ఎంతో శ్రేష్ఠమైనదిగా ఉండాలి. ఇదే విషయాన్ని లేఖనాలు వెల్లడిస్తున్నాయి.

"నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి. రాత్రి యందలి యొక జాము వలె నున్నవి." కీర్తనలు 90: 4

దేవుని దృష్టికి వేయి సంవత్సరములు ఒక రోజుగా మరియు ఒక జాము (౩ గంటలు) వలె ఉన్నాయని చెప్పటం ద్వారానే మానవుడి వేలాది సంవత్సరాలు దేవుడికి ఒక్క రోజుతో సమానమని అర్థమవుతుంది. అంటే, సృష్టి జరిగిన ఒక రోజు ప్రమాణము మానవుడికి వేలాది సంవత్సరాలతో సమానమని గ్రహించవచ్చు.